Patnam narendar Reddy
-
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడీ
-
లగచర్ల ఘటన.. పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ విధించడంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. లగచర్ల దాడి కేసులో నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.వివరాల ప్రకారం..లగచర్ల దాడి కేసులో విచారణ చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం, నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్నారు. అక్కడే రెండు రోజుల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అయితే, న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి.. చర్లపల్లి జైలులో ఉన్నారు. -
పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
హైకోర్టు ఝలక్.. పట్నం నరేందర్ రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటన తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ కోరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇక, లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో పట్నం బెయిల్‌పై మెరిట్ ఆధారంగా వికారాబాద్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. -
లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి ఊరట
-
చర్లపల్లి జైలుకు కేటీఆర్.. పట్నం నరేందర్‌రెడ్డితో ములాఖత్
సాక్షి, హైదరాబాద్: లగచర్ల కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన కేటీఆర్ పట్నం నరేందర్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యాడరని వ్యాఖ్యానించారు.పట్నం మాతో ఒకే విషయాన్ని ప్రస్తావించారు. నా గురించి వదిలేయండి.. చేయని తప్పుకు జైల్లో ఉన్న 30 మంది రైతులను విడిపించాలని కోరారు, గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారని.. రైతులకు అండగా నిలవాలని కోరారు.’’ అని కేటీఆర్ చెప్పారు.సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారు. కొడంగల్ నుంచి కొండరెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్నవారు గద్దెకి కూర్చున్నారు. భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అరాచకాలు చేస్తోంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత ఊరు, నా సొంత నియోజకవర్గం అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉండరు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. -
పట్నం నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు
సాక్షి,హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను క్వాష్ చేయాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి దిగారని అన్నారు. అందుకు తగిన ఆధారాల్ని వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు.అయితే, నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన తరుఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. ఈ మేరకు ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
పట్నం కేసులో తీర్పు రిజర్వ్.. కొనసాగుతున్న సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. లగచర్ల ఘటనలో రిమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం.. ప్రస్తుతం చర్లపలి జైలులో ఉన్నారు.లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో పట్నం నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నరేందర్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. పట్నం న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ..పట్నం నరేందర్‌ది అక్రమ అరెస్ట్..ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసోడింగ్స్ ఫాలో కాలేదు..ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు..11వతేదీన ఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేడు.సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.11వ తేదీన కేవలం ఒకే ఒకసారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులు ఉల్లఘించారు.సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదుఅరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారు.అదుపులోకి తీసుకున్న పోలీసులు కన్ఫెషన్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారుపోలీసులకు నచ్చింది రాసుకునీ అదే కన్ఫెషన్ రిపోర్ట్ అని కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారుపబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ..లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు కుట్ర చేశారు.కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారు.అన్నింటికీ ప్రధాన సూత్రదారి పట్నం నరేందర్ రెడ్డి.హైకోర్టు ప్రశ్న.. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించిన హైకోర్టు..తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని పీపీ చెప్పుకొచ్చారు.ఎవరు అనుచరులు అతని హోదా? ఏంటని కోర్టు ప్రశ్న.పీపీ వాదనలు..సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుఘటన జరిగిన రోజు సురేష్, నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారు.అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని ప్రశ్నించిన హైకోర్టు..కేటీఆర్ పార్కులో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారన్న హైకోర్టు..పార్కులో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపిన పీపీ..సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదన్న హైకోర్టు.ఈ కేసులో కుట్ర కోణం ఉంది చాలా విషయాలు బయటకు వచ్చాయి అన్న పీపీ.ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును కోర్టు వాయిదా వేసింది. రిజర్వ్ చేసింది. -
పట్నం నరేందర్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: లగచర్ల అధికారుల దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది.తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే.. తన రిమాండ్‌ను కొట్టి వేయాలని నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరికాసేపట్లో విచారణ జరపనుంది.మరోవైపు నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణనువికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్‌రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ రిజెక్ట్ చేసిన హైకోర్టు రిజిస్ట్రీ
-
పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు(శుక్రవారం) కోర్టుకు సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. నేరస్తులతో కలిపి ఉంచారని పిటిషన్ వేశారు. స్పెషల్ బ్యారక్‌లో పట్నం నరేందర్‌ను ఉంచాలని న్యాయవాది కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ రిజక్ట్ చేసింది.లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్‌లోని పోలీస్ ఆఫీస్‌కు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. రిమాండ్రిపోర్టులో ఆయనను ఏ1గా చేర్చారు.కన్ఫెషన్ స్టేట్మెంట్లో తానే సురేష్‌తో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పుకోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేష్‌ను మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు వరకు సురేష్ పేరు ఏ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా, కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
పట్నం కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
-
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నాపై కేసు రాజకీయ ప్రేరేపితం: పట్నం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ ప్రేరేపణతో తనపై కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలు లేకుండా తనపై నమోదు చేసిన కేసును, వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘బొమ్రాస్పేట్ స్టేషన్లో నమోదైన కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కనీసం కారణాలను వెల్లడించలేదు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులు తూతూ మంత్రంగా దాఖలు చేసిన రిమాండ్ డైరీని ట్రయల్ కోర్టు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దాడి చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, దురుద్దేశంతో, రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులో విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలి..’అని నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ఈనెల 18న విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కట్టుకథ అల్లారు కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు. ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ అనంతగిరి: లగచర్ల ఘటనలో అరెస్టు అయిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరుగుతుందని న్యాయవాది శుభప్రద్ పటేల్ తెలిపారు. -
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్‌రెడ్డి
-
కేటీఆర్ పేరు చెప్పలేదు.. చర్లపల్లి జైలు నుంచి పట్నం లేఖ
సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్? -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు
-
‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులపై దాడిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని, ఇందులో ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో, ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అరెస్టు ప్రచారం.. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు pic.twitter.com/FYP4USvaop— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024Video Credits: Telugu Scribeమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తీక్‌రెడ్డి తదితర నేతలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని.. బలవంతంగా భూసేకరణ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని పలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. -
కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
నరేందర్‌రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
పట్నం అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్.. మరో ఉద్యమం తప్పదంటూ..
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది.ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు.పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారుప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది.ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం.పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు…— KTR (@KTRBRS) November 13, 2024 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?…— Harish Rao Thanneeru (@BRSHarish) November 13, 2024 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ..‘కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా?’ అని ప్రశ్నించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం…— Sabitha Reddy (@BrsSabithaIndra) November 13, 2024 -
కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Updates..👉కొడంగల్ దాడుల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్లో ఉంచారు. అక్కడి నుంచే ఆయనను నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటీసీ సెంటర్‌కే వైద్యులను పిలిపించి అక్కడే నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.👉మరోవైపు.. నరేందర్ రెడ్డి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులను సబిత పరామర్శించారు. 👉తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం.👉తెలంగాణలోని వికారాబాద్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అధికారులపై దాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న బీఆర్ఎస్ నేత సురేష్‌తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాల్ డేటా ఆధారంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే, నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా, సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి బీఆర్ఎస్కు చెందిన నేతలు కూడా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 👉వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు.. కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.👉ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.Government Takes Serious Note of Attack on Vikarabad Collector; Investigation Orderedవికారాబాద్ అడిషనల్ కలెక్టర్, KADA ఛైర్మన్ మరియు ఇతర అధికారులపైన దాడిలో ప్రత్యేక్షంగా గాని పరోక్ష్యంగా గాని పాల్గొన్న వారిని ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.-- శ్రీ వి.సత్యనారాయణ,IPS. pic.twitter.com/XfjZqUonAa— Congress for Telangana (@Congress4TS) November 12, 2024