pending bills
-
బిల్లులు ఇస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్‌లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచులు దశలవారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే పోలీసులు ప్రధాన గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజావాణికి వచ్చే వారిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి పంపించారు.మాజీ సర్పంచ్‌లు దఫదఫాలుగా బృందాలుగా ఏర్పడి ప్రధాన గేట్ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పీటీసీ సెంటర్‌కు తరలించారు. తాజా మాజీ సర్పంచ్‌లు పంజాల జగన్మోహన్గౌడ్, శ్రీధర్, సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఏడాదిగా మంజూరు చేయకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిల్లుల మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గతంలో సర్పంచ్‌లు చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనప్పటికీ రూ.750 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించేశామని ప్రభు త్వం పేర్కొనడం అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. పెండింగ్ బిల్లులు చెల్లించామని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి తగదని సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు ఇవ్వలేదు. జనరల్ నిధులపైనా ఫ్రీజింగ్ ఇంకా ఎత్తివేయలేదు. ఇప్పటికీ గత సర్పంచుల చెక్కులు ట్రెజరీలోనే ఉన్నాయి’అని వారు పేర్కొన్నారు. ఆందోళనకు దిగుతాం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. సర్పంచ్‌లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. డిసెంబర్ 1వ తేదీ వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తెలంగాణ మొత్తం 12,769 సర్పంచ్ల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలను కూడగట్టుకొని ఆందోళనకు దిగుతామని స్పష్టం చేసింది. -
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
మాజీ సర్పంచ్ల చలో హైదరాబాద్ భగ్నం
బంజారాహిల్స్/ రసూల్‌పురా (హైదరాబాద్): గ్రామ పంచాయతీల్లో చేసిన వివిధ పనులకు సంబంధించి తమకు రావాల్సి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చేరుకుని, పోరుబాటకు సిద్ధమైన మాజీ సర్పంచులు, సంఘం నేతలను బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చలో పోరుబాట పేరుతో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి వినతిపత్రాన్ని అందజేస్తామని వారు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సమయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా.. ప్రభుత్వం వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళతామనడం సరికాదని పేర్కొన్నారు. 2019 నుంచి హరిత హారం, మిషన్ భగీరథ, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు అప్పటి సర్పంచులు అప్పులు చేశారని.. పెండింగ్‌లో ఉన్న ఆ బిల్లు లు ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మాజీ సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాపోయారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కార్యదర్శి రాపాక నాగయ్య, నవీన్‌గౌడ్, సుభా‹Ùగౌడ్, గణేశ్ ముదిరాజ్, రాజేందర్, మల్లేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా హరీశ్‌రావు నిరసన పోలీసులు మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడికి చేరుకుని మాజీ సర్పంచులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు హరీశ్‌రావు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో వారు పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచి్చన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ దొంగలనో, టెర్రరిస్టులనో అరెస్టు చేసినట్టుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వారు అప్పులు చేసి, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని.. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.సర్పంచ్ల బకాయిలకు మాదీ గ్యారంటీ» పొలిటికల్ ట్రాప్‌లో పడకండి: పొన్నం» సర్పంచుల ఆత్మహత్యలకుకారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే సాక్షి, హైదరాబాద్: సర్పంచులు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని, వారి బకాయిలను చెల్లించే గ్యారంటీ తాము తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.సర్పంచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపిక పట్టాలని, మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు దఫాలవారీగా చెల్లిస్తామని అన్నారు. సర్పంచులకు నిధుల బకాయిలు బీఆర్ఎస్ చేసిన పాపమేనని, వారి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిది తెలంగాణ డీఎన్ఏ కాదు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ డీఎన్ఏ లేదని, ఆ డీఎన్ఏ ఉంటే తెలంగాణ కోసం ఆయన ఏదైనా చేసేవారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని ఆ పార్టీ నేతలకు పొన్నం సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. -
‘ఎన్నికల’ పెండింగ్ బిల్లులకు రూ.286.36 కోట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
Supreme Court: బిల్లులు ఎందుకు ఆపేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీతో గంటన్నర పాటు సాగిన సీఎం జగన్ భేటీ
-
మూడేళ్లు ఏం చేసినట్లు?
న్యూఢిల్లీ: ఆమోదముద్ర కోసం తన వద్దకు వచ్చిన బిల్లులకు మూడేళ్లుగా ఇంకా ఏ నిర్ణయమూ వెల్లడించని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎంకే సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ‘ పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీచేసేదాకా తమిళనాడు గవర్నర్ మేలుకోలేదు. 2020 జనవరి నుంచి తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. మూడేళ్లు ఆయన ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నవంబర్ 10న మేం ఆదేశాలిచ్చాకే అది చూసి ఆర్ఎన్ రవి పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐదే ఉన్నాయి కోర్టు వ్యాఖ్యానాలపై గవర్నర్ తరఫున హాజరైన అటార్నీ జనరల్(ఏజీ) ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘ ఈ బిల్లుల్లో ఎన్నో సంక్షిష్టమైన అంశాలున్నాయి. అయినా ఇవి పాత బిల్లులు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించకముందు నాటివి. బిల్లుల ఆమోదం ఆలస్యాన్ని ఈ గవర్నర్‌కు ఆపాదించొద్దు. ప్రస్తుతం గవర్నర్ వద్ద కేవలం ఐదు బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 10 బిల్లులను శనివారమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ఆమోదించింది’ అని వాదించారు. కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని కేరళ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘గవర్నర్ రాష్ట్రానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారు. ఆరిఫ్ వద్ద 7–21 నెలలుగా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ వాదించారు. -
Tamil Nadu: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కార్ వర్సెస్ గరర్నర్ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో ఆర్ఎన్ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు అన్న డీఎంకే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌పై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ బాధ్యత అని తెలిపారు. అయనకు ఏవైనా సందేహాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో గవర్నర్ కొన్ని బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రాష్ట్రం వెంటనే స్పందించించి వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. గవర్నర్ కోరిన వివరణను ప్రభుత్వం ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదని ప్రస్తవించారు. గవర్నర్ వద్ద 12 బిల్లులు పెండింగులో ఉన్నామని, ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను నిలిపివేయడం తమిళనాడు ప్రజలను అవమానించడం, రాష్ట్ర అసెంబ్లీని అవమానించారని దుయ్యబట్టారు. చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. అలా కాకుండా రాష్ట్ర పథకాలను ఎలా నిలిపివేయాలనే దాని గురించే గవర్నర్ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలకు చెందినవి ఉన్నాయి. . ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వైఖరి రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, తమిళనాడులో బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల జాప్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన వారం రోజుల్లోనే గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ను నియమించడంలో గవర్నర్‌కు ఉన్న అధికార పరిధిని తగ్గించడం ఒకటి అయితే గత అన్న డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను విచారించేందుకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు కూడా ఉన్నాయి. గవర్నర్ చర్యపై శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్లు స్పీకర్ ఎం అప్పావు తెలిపారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్ధేశపూర్వకంగా బిల్లల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పాలనను అణగదొక్కడమేనని డీఎంకే ప్రభుత్వం విమర్శిస్తోంది. కాగా అంతకముందు కూడా గవర్నర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును సైతం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. చదవండి: 'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ -
గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది. ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది. -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య మళ్లీ పెండింగ్ బిల్లుల లొల్లి...!
-
బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. రెండోసారి పంపినా నిరీక్షణ గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్ఎస్లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. నెలల తరబడి పరిశీలనలోనే..! పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. రెండోసారి ఆమోదించి పంపినవి.. తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022 తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023 తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022 తొలిసారిగా ఆమోదించి పంపినవి.. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023 తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023 ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఇటీవల పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం జగన్ తెలపడంతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి.మస్తాన్‌ఖాన్, ట్రెజరర్ ఎం.సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కే.రామునాయుడు, బి.స్వర్ణలత, పి.శేషయ్య, సీహెచ్.హజరత్తయ్య, డి.సురేష్, ఆర్.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, పి.ఓంకార్, కే.నాగిని, టి.మాణిక్యాలరావు ఉన్నారు. చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా -
మరో 3 బిల్లుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలతో రాజ్‌భవన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్లుల వ్యవహారంలో మరికొంత కదలిక వచ్చింది. మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 7 బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించినట్టు ఈ నెల 10న సుప్రీంకోర్టుకు రాజ్‌భవన్ నివేదించింది. తాజాగా మిగిలిన 3 బిల్లులపై సైతం గవర్నర్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించారని సోమవారం వెల్లడించింది. రాజ్‌భవన్ వర్గాల ప్రకారం.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ ఏన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తిరస్కరించారు. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022తో పాటు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతూ తిప్పి పంపారు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023 పై వివరణలు కోరుతూ గతంలోనే తిప్పి పంపడంతో.. ఈ విధంగా ప్రభుత్వానికి తిప్పి పంపిన బిల్లుల సంఖ్య మూడుకు పెరిగింది. కేవలం 3 బిల్లులకే ఆమోదం .. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లు–2022, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023కు గవర్నర్ తమిళిసై ఈ నెల 9న ఆమోదం తెలిపారు. కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022లను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించారు. ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022 న్యాయశాఖ నుంచి చేరలేదని రాజ్‌భవన్ అధికారులు పేర్కొంటున్నారు. -
సుప్రీంకోర్టులో ముగింపుకొచ్చిన తెలంగాణ సర్కార్, గవర్నర్ పంచాయితీ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు లేనందున కేసు పరిష్కారం అయినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది. కేసును ముగిస్తూ.. బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1) ప్రకారం సాధ్యమైనంత త్వరగా అనే అంశం ప్రాధాన్యతను గవర్నర్లు గుర్తించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తమవద్ద ఏ బిల్లులు పెండింగ్‌లో లేవని గవర్నర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం, క్లారిఫికేషన్ కోరినట్లు పేర్కొన్నారు. కాగా కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ తన వద్దనే పెండింగులో పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక వారంలో, గుజరాత్లో ఒక నెలలో బిల్లులన్నీ క్లియర్ అవుతున్నాయన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. గవర్నర్లు కూడా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని సూచించారు. గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివరణ కోసం గవర్నర్ బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది. అయినా ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏదీ పెండింగులో లేదని తెలిపింది. అయితే రాజ్యంగంలోని 200(1)వ అధికరణను గవర్నర్లు దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. చదవండి: ఎవడెన్ని ట్రిక్‌లు చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు -
పెండింగ్ బిల్లుల వ్యవహారం.. షాకిచ్చిన గవర్నర్ తమిళిసై
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పిటిషన్‌పై విచారణ జరుగనుంది. కాగా, బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, సొలిసిటర్ జనరల్.. గవర్నర్ తమిళిసై వద్ద బిల్లుల పొజిషన్‌ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్.. తాజాగా తన వద్ద ఉన్న మరికొన్ని బిల్లుల్లో ఒకదాన్ని తిరస్కరించగా.. మిగతావాటిపై ప్రభుత్వ వివరణ కోరారు. ప్రభుత్వం ఆమోదించి తన వద్దకు పంపిన డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును ఆమె తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వాటిలో పురపాలక నిబంధనల చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. మొత్తం 10 బిల్లులలో మూడింటిని మాత్రమే ఆమె ఆమోదించారు. -
బిల్లులపై విచారణ 24కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించారని, రెండు బిల్లులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. మరో రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ వెనక్కి తిప్పి పంపారని, ఇంకో మూడు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అందుబాటులో లేని కారణంగా.. విచారణ వాయిదా వేయాలని జూనియర్ న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వర్చువల్‌గా హాజరుకావడంతో వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. గవర్నర్ నుంచి తనకు అందిన వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నట్టు తుషార్ మెహతా తెలిపారు. ‘శాసనసభ గతేడాది సెపె్టంబరులో పాస్ చేసిన కొన్ని బిల్లులు ఉన్నాయి కదా.. వాటిపై తుది నిర్ణయం ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి అందిందా?’అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా.. ఈ అంశాలపై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని తుషార్ మెహతా వివరించారు. ఈ క్రమంలో ధర్మాసనం.. సొలిసిటర్ జనరల్ అందజేసిన వివరాలను రికార్డుల్లోకి తీసుకుంటున్నామని పేర్కొంటూ, తెలంగాణ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సొలిసిటర్ జనరల్ కోర్టుకు ఇచ్చిన వివరాలివీ.. ‘‘మూడు బిల్లులు.. తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు– 2023, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023లను గవర్నర్ ఆమోదించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు–2022, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022.. ఈ రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు–2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (వయసు నియంత్రణ, పదవీ విరమణ) సవరణ బిల్లు–2022 గవర్నర్ క్రియాశీల పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు–2023కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియా (టర్మినేషన్, రెగ్యులేషన్ ఆఫ్ లీజు) సవరణ బిల్లు–2022కు న్యాయ విభాగం నుంచి వివరణపై స్పందన రాలేదు’’అని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
TS: పెండింగ్ బిల్లుల అంశం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్ తరఫు న్యాయవాది తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఆజామాబాద్ మిల్లు బిల్లు, మెడికల్ బిల్లులపై వివరణ కోరారని గవర్నర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధిలేకనే కోర్టును ఆశ్రయించినట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, వాదనల అనంతరం.. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. -
Telangana: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు. కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచడంపై కీలక ప్రకటన -
తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. చదవండి: బండి సంజయ్ ఫోన్ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది? -
తెలంగాణ గవర్నర్ వ్యవహారం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో ఉంచారు. అయితే.. వాటిని ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ తరుణంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ముద్ర పడాల్సి ఉంటుంది. అలా జరిగితేనే.. వాటి అమలుకు వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే పది బిల్లులను పంపితే.. తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడం లాంటివేం చేయకుండా ఆమె పెండింగ్ ఉంచారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్లో గవర్నర్‌తో పాటు గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది టీ సర్కార్. అయితే.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే.. ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతూ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో.. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కలుగుజేసుకుని తెలంగాణ గవర్నర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తానంటూ ధర్మాసనాన్ని కోరారు. అయినప్పటికీ సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మార్చి 27వ తేదీ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. -
గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం పిటీషన్.. సుప్రీం కోర్టు స్పందన ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహా అంశాన్ని విచారణకు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సెక్రటరీ, కేంద్రానికి నోటీసులు జారీచేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వబోమని, ప్రస్తుతం కేంద్రానికి మాత్రమే జారీచేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సాధారణంగా గవర్నర్‌కు నోటీసులు జారీచేయమని తెలిపారు. గవర్నర్‌కు కాకుండా సెక్రటరీకి జారీచేయాలని దవే మరోసారి కోరారు. తెలంగాణ గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో ఉంచారని దాఖలైన ఈ పిటిషన్లో నోటీసులు జారీ చేయొచ్చా అని సీజేఐ ప్రశ్నించగా, అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని మెహతా స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌కు నోటీసులు జారీ చేయడంలేదని జస్టిస్ పీఎస్ నరసింహా పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉన్నందున పిటిషన్ కాపీని తనకు సర్వ్ చేయాలని మెహతా ధర్మాసనాన్ని కోరారు. అనంతరం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.