Postponed
-
క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
-
యథావిధిగా గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ ఆర్బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్–2 పేపర్–3, పేపర్–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై కమిషన్‌కు నవంబర్ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీ క్ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.గ్రూప్–2 హాల్‌టికెట్లు విడుదల గ్రూప్–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
-
పోస్టుల భర్తీపై కూటమి గేమ్
-
AP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం(నవంబర్ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన -
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. రెండు, మూడు రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 బుధవారం(నేడు) నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, అధికారులు వాయిదా వేస్తునట్లు వెల్లడించారు.గత వైఎస్సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు కలిపి.. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. -
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
గేమ్ చేంజ్
గేమ్ డేట్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం.అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది. ‘విశ్వంభర’ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ‘గేమ్ చేంజర్’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. -
నెల ఆలస్యంగా కంగువ
‘కంగువ’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. సూర్య హీరోగా నటించిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రాన్ని నవంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు గురువారం మేకర్స్ ప్రకటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు. ‘‘పీరియాడిక్ యాక్షన్ జానర్లో ఇప్పటివరకూ రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘కంగువ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కంగువ’ సినిమాను తొలుత ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్‌గా ఓ నెల ఆలస్యంగా నవంబరు 14కి వాయిదా వేశారు. -
మరోసారి వాయిదా
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
కంగువ వాయిదా?
‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్‌గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
దీపావళికి లక్కీ భాస్కర్
అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నాడు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయాలనుకున్నారు.కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైమ్ పడుతుందని, అందుకే వాయిదా వేసి, దీపావళికి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్‌తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు. -
2018 నుంచి 16 పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కొంది. అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్‌లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన మరిన్ని పరీక్షలు.. CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),UGC-NET (మే 2021)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020).. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020, GNOU PhDకామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021 జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్)- 2021, GNOU PhD ఎంట్రన్స్ పరీక్షగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024, CSIR-NET, 2024 -
గ్రూప్–2 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచేందుకు, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌లు నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు గ్రూప్–2 పరీక్షల వాయిదాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. చర్చల సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్లను సానుకూలంగా సానుకూలంగా ఆలకించిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు. 3 నెలల్లో 54 వేల ఉద్యోగాలకు మోక్షం: భట్టి గ్రూప్–2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని భట్టి చెప్పారు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అన్నారు. మరిన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ కేలండర్‌ను ప్రకటించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని వెల్లడించారు.ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఇప్పటికే స్థిరపడేవన్నారు. ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ, ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొందరు వారి స్వలాభం కోసం నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్ విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని భట్టి చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని, దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని చెప్పారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వం: ఎంపీలు గ్రూప్–2 పరీక్షల పోస్టులను పెంచుతూ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తెలిపారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంతో సమావేశం తర్వాత మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సమయం ఇవ్వాలి: గ్రూప్–2 అభ్యర్థులు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్–2 అభ్యర్థులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించారంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ పోస్టులను వీలైనంత వరకూ పెంచాలని, అలాగే పరీక్షలకు వీలైనంత సమయాన్ని ఇవ్వాలని విద్యార్థులు సుఖేష్ (సిద్దిపేట జిల్లా), నవీన్ (హుస్నాబాద్), మహేష్ (ఖమ్మం) కోరారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు కూడా చాలామంది గ్రూప్ పరీక్షలు రాస్తున్నారని, అందువల్ల కనీసం మూడు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ పరీక్షల కోసం రూ.5 భోజనం చేస్తూ సిద్ధమవుతున్నామని, ప్రభుత్వం నిరుద్యోగులపై కరుణ చూపించాలని కోరారు. -
తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నాం అధికారికంగా ప్రకటించింది.ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది.మరోవైపు ఉద్యోగాభ్యర్థులతో సెక్రటేరియెట్‌లో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతుండగానే.. వాయిదా ప్రకటన వెలువడడం గమనార్హం. గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం అనే అంశం పై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు.డిసెంబర్ నెలలో గ్రూప్ 2 పెట్టాలని అడిగాం ప్రభుత్వం ఒకే అన్నది.మా డిమాండ్ల పై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు.:::గ్రూప్ -2 అభ్యర్థులు గ్రూప్ 2, 3 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది.త్వరలో మళ్ళీ పరీక్షల నిర్వహణ పై తేదీలు ప్రకటిస్తుంది.విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఇది కాదు..ఇది ప్రజా ప్రభుత్వం.:::ఎంపీ మల్లు రవి DSC పోస్టుల పై విద్యార్థులు పలు విజ్ఞప్తులు చేశారు.DSC ప్రాంతేతర అంశాల త్వరలో చర్చలు జరుపుతం అని సిఎం అన్నారు.8ఏళ్లుగా BRS విద్యార్థులకు అన్యాయం చేసింది. :::ఎంపీ బలరాం నాయక్ గత విద్యార్థులను కనీసం పట్టించుకోలేదుఇది ప్రజా ప్రభుత్వం అందుకే విద్యార్థులతో మాట్లాడింది.నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిరుద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.ఇది విద్యార్థి ప్రభుత్వం.:::ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ -
రెడీ... సెట్... గో
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ సెట్ గో అంటున్నారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) వంటి బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా సేమ్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది.షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయ్యుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం.. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ, పోస్ట్‌ప్రోడక్షన్ పనులు పూర్తి చేసి, డిసెంబరు 6నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని భోగట్టా. -
టెట్ వాయిదా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ లో చూడొచ్చని తెలిపింది. మారిన టెట్ షెడ్యూల్ ఇదీ.. ⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024⇒ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024⇒ ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ: 19/09/2024 నుంచి..⇒ హాల్‌టికెట్ల డౌన్లోడ్: 22/09/2024 నుంచి పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి⇒ ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు⇒ ఫైనల్ ‘కీ’ విడుదల: 27/10/2024 ⇒టెట్ ఫలితాల వెల్లడి: 02/11/2024 -
Uttarakhand: చార్ధామ్ యాత్ర నిలిపివేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలతోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఉత్తరాఖండ్‌కు రెడ్అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం పుష్కర్‌సింగ్ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
-
నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా
ఢిల్లీ: నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. తిరిగి కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. NEET UG counselling deferred until further notice: Official sources pic.twitter.com/VVMvpGwDDH— ANI (@ANI) July 6, 2024నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు మాత్రం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పిటిషన్లను అన్నింటిని ఒక్కటిగా జూలై 8న(ఎల్లుండి) విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీయే నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజి కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తన అఫిడవిట్లో వెల్లడించింది. -
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్ష వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది.