pragya Singh
-
ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు. ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. (చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..) -
‘డ్యాన్స్ చేయొచ్చు.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రగ్యా ఠాకూర్ ఇంటి దగ్గర వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. డ్యాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది కానీ ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోలేరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ వివరాలు.. తాజాగా రెండు మూడు రోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక నియమం కింద ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలోనే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రాష్ట్ర పాలన అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారి సంతోష్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘పాలసీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. ఈ నియమం ప్రకారం ప్రగ్యా ఠాకూర్ నివాసానికి వెళ్లి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశాం. అంతేకానీ మేం నియమాలను ఉల్లంఘించలేదు’’ అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ‘‘మన భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కొద్ది రోజుల క్రితమే బాస్కెట్ బాల్ ఆడారు.. ఆమె నివాసంలో జరిగిన ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. కానీ వ్యాక్సిన్ మాత్రం ఇంటి దగ్గరే వేయించుకున్నారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు ప్రతి బీజేపీ నేత ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు.. ప్రగ్యా ఠాకూర్ తప్ప. డ్యాన్స్ వేయాడానికి ఓపిక ఉంటుంది.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’’ అంటూ కాంగ్రెస్ నేత నరేంద్ర సులజా తీవ్ర విమర్శలు చేశారు. ప్రగ్యా ఠాకూర్‌పై నెటిజనులు కూడా ప ఎద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. -
ప్రగ్యా ఠాకూర్ డాన్స్ వీడియో వైరల్.. ఏదేమైనా..
MP Pragya Dance: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు సంబంధించిన డాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోపాల్‌లోని తన నివాసంలో బుధవారం ఇద్దరు యువతుల పెళ్లిళ్లు జరిపించిన ప్రగ్యా ఠాకూర్.. అప్పగింతల సమయంలో డీజే పెట్టించారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు తాను సైతం పాటలకు కాలు కదిపారు. వారితో సరాదాగా స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందించారు. ఇక ఈ వీడియోపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సోదరి ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడటం చూసినపుడు.. ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు... ఇదిగో ఇలా డాన్స్ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి.. మాలేగావ్ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. కానీ, ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’’ అని సోషల్ మీడియా వేదికగా భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌పై సలూజ విమర్శలు గుప్పించారు. కాగా, కొద్దిరోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్.. బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా నిందితురాలు అన్న విషయం విదితమే. అనారోగ్య కారణాలు చూపి కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, తన అభ్యర్థనను మన్నించాలని విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించింది. వాళ్లు నర్మద మిశ్రా కూతుళ్లు.. పేదరికంలో మగ్గిపోతూ... కూతుళ్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న కార్మికుడు నర్మద మిశ్రా బాధ్యతలు తాను తీసుకున్నట్లు ప్రగ్యా వెల్లడించారు. ‘‘ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితురాలిగా.. ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నా ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. వారికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి’’ అని ఆమె పేర్కొన్నారు. -
బాస్కెట్ బాల్ ఆడి ఆశ్చర్యపరిచిన ప్రగ్యా సింగ్ ఠాకూర్
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సాధారణంగా ఎక్కడ కు వెళ్లినా వీల్ చైర్లో కూర్చుని ఉంటారు. గురువారం భోపాల్‌లోని సాకేత్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఠాకూర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడకి దగ్గరలో కొంతమంది ఆటగాళ్ళు బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లను చూసి ఆమె అక్కడికి వెళ్లి వాళ్లతో ఆడాలని నిశ్చయించుకుంది. దీంతో బాస్కెట్ బాల్ తీసుకుని కొంతసేపు డ్రిబ్లింగ్ చేసి విజయవంతంగా నెట్లోకి విసిరారు. ప్రగ్యా సింగ్ బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పంచుకుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా మాట్లాడుతూ.. ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను వీల్‌చైర్‌లోనే నేను ఇప్పటివరకు చూశాను, కానీ ఈ రోజు స్టేడియంలో బాస్కెట్‌బాల్ ఆడుతూ చూడటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై ప్రగ్యా సింగ్ సోదరి స్పందిస్తూ ఆమె శారీరక విద్య (సిపిఇడి), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బిపిఇడి) లో సర్టిఫికేట్ కోర్సు చేశారని..జైలుకు వెళ్లేముందు ఆమె ఆరోగ్యంగా చక్కగా ఉందని, అక్కడ ఆమెను హింసించారని ఆమె ఆవేదన చెందింది. ప్రగ్యా సింగ్ ఠాకూర్ 2008 మాలెగావ్ పేలుడు కేసులో నిందితరాలు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జనవరి లో ఆమెకు ఎన్ఐఏ కోర్టు కేసు నుంచి మినహాయింపు ఇచ్చింది. -
బీజేపీ ఎంపీకి మరోసారి తీవ్ర అస్వస్థత : ఎయిర్‌లిఫ్ట్
సాక్షి,భోపాల్: బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాలయం అధికారులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ప్రజ్ఞా ఠాకూర్ కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. -
రాహుల్‌పై ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు. అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు. -
సొమ్మసిల్లి పడిపోయిన ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్
భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దివంగత రాజకీయ వేత్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రఙ్ఞా సింగ్ పాల్గొన్నారు. కొంతసేపటికే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా కంటి సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో తన కంటిచూపు పోయిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. (సఫూరాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ) ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సహా పలువురు బీజేపీ నేతలు శ్యామా ప్రసాద్‌కు నివాళులు అర్పించారు. భారతదేశపు ముద్దుబిడ్డ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ముఖర్జీ రచనలను ప్రస్తావిస్తూ అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, దేశ సమగ్రత కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించుకున్న గొప్ప వ్యక్తి అంటూ అమిత్‌షా ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి ) -
కాంగ్రెస్‌పై ప్రఙ్ఞా సింగ్ సంచలన ఆరోపణలు
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో తన కంటిచూపు పోయిందని అన్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. (చదవండి: మోదీ సర్కార్‌పై కమల్ ఫైర్) ‘కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. అవి అప్పుడప్పుడు తిరగబెడతాయి. కంటి రెటీనా నుంచి మెదడు వరకు వాపు చీము రావడంతో చూపు పోయింది. నా కుడి కన్ను అస్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎడమ కన్నుతో ఏదీ చూడలేను’అని అన్నారు. ఇక భోపాల్‌లో ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ కనిపించడం లేదన్న పోస్టర్ల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ.. ఢిల్లీ వెళ్లిన తాను లాక్డౌన్ కారణంగా భోపాల్ రాలేకపోయానని అన్నారు. కాగా, ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీసీ శర్మ తోసిపుచ్చారు. కాంగ్రెస్ మహిళలపట్ల గౌరవంగా ఉంటుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ ఆమెను ఎలా హింసించగలదని ప్రశ్నించారు. ఆమె ఆరోపణలు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు ఠాకూర్ భోపాల్‌లోనే ఉన్నారని చెప్పారు. (కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం) -
సీటు కోసం ప్రజ్ఞాఠాకూర్ పేచీ
న్యూఢిల్లీ: తనకు సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. ఈ కారణంగా ఢిల్లీ–భోపాల్ విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ప్రజ్ఞా భోపాల్‌కు ప్రయాణించేందుకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె వీల్ చైర్లో రావడంతో విమానం ముందువరసలోని 1–ఏ సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. వెనుక సీటుకు మారాలని కోరగా ఆమె తిరస్కరించారు. వాదోపవాదాల అనంతరం ఆమె వెనుక సీటుకు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయంపై ఎంపీ ప్రజ్ఞా భోపాల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాల కారణంగానే ఆమెకు వెనుక సీటు కేటాయించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. -
‘ఛపక్’.. ధైర్య ప్రదాతలు
‘యాసిడ్ పడింది మా ముఖం మీద మాత్రమే, మా మనో ధైర్యం అలాగే ఉంది’.. యాసిడ్ బాధితులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవితం ‘ఛపక్’ పేరుతో సినిమాగా వస్తోంది. చిన్నతనంలో భయంకరమైన యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ పెద్దయిన తర్వాత ప్రభుత్వం యాసిడ్ అమ్మకాల మీద నియంత్రణ విధించే వరకు పోరాటాన్ని కొనసాగించారు. ఆ పాత్రనే ఛపక్లో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. సినిమా జనవరి 10న విడుదల అవుతోంది. ఇప్పటికే ట్రెయిలర్ రిలీజ్ అయ్యి ప్రశంసలను అందుకుంటోంది. లక్ష్మిలా.. భస్మం నుంచి ఫీనిక్స్‌లా లేచిన ధీరలెందరో. వాళ్లు నేటి సమాజంలో పోరాడుతూ ఉన్నారు, సమాజంతో పోరాడుతూ ఉన్నారు. వారిలో ముగ్గురు... ప్రగ్యాసింగ్, దౌలత్ బీ ఖాన్, అన్మోల్ రోడ్రిగ్స్. ఈ ముగ్గురి గురించి క్లుప్తంగా. పెళ్లొద్దన్నందుకు ప్రగ్యా సింగ్ ప్రగ్యా సింగ్ 2006లో వారణాసి నుంచి ఢిల్లీ వస్తోంది. అప్పటికి ఆమెకు 23 ఏళ్లు, పెళ్లయి పన్నెండు రోజులైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, ఆమె రైల్లో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమె ముఖం మీద యాసిడ్ చిమ్మింది. దాడి చేసిన వ్యక్తి గతంలో ఆమెను పెళ్లాడాలని అడిగి ఆమె నిరాకరించడంతో కోపం పెట్టుకున్నవాడు. అతడి ప్రకోపానికి గురయింది ప్రగ్యాసింగ్. ప్రాణాపాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె మామూలు కావడానికి పదిహేనుకు పైగా సర్జరీలయ్యాయి. ఇప్పుడామె.. భర్త, స్నేహితుల సహకారంతో ‘అతిజీవన్ ఫౌండేషన్’ అనే ఎన్జీవోను స్థాపించి, యాసిడ్ బాధితులకు ధైర్యాన్నిస్తోంది. ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. వాళ్లు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇద్దరు బిడ్డలతో సంతోషంగా జీవిస్తున్న తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకోవలసిందిగా ఆమె బాధితుల్లో స్ఫూర్తిని పెంచుతోంది. గృహ హింస దౌలత్ దౌలత్ బీ ఖాన్‌ది ముంబయి. ఇరవై ఆరేళ్ల వయసులో తన పెద్దక్క, బావల నుంచే గృహహింసలో భాగంగా యాసిడ్ దాడికి గురైందామె! ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ 2016లో ‘సాహాస్ ఫౌండేషన్’ స్థాపించి యాసిడ్ దాడికి గురైన బాధితులకు భరోసాగా నిలుస్తోంది. వైద్య సహాయంతోపాటు వారికి న్యాయపరమైన సహాయం కూడా అందిస్తోంది. బాధితులు సౌకర్యంగా పని చేసుకోగలిగిన ఉద్యోగాలను గాలిస్తూ వారిని ఆ ఉద్యోగాల్లో చేరుస్తోంది దౌలత్. పాపాయిగా ఉన్నప్పుడే! అన్మోల్ అన్మోల్ పరిస్థితి మరీ ఘోరం. రెండు నెలల పాపాయిగా ఉన్నప్పుడు యాసిడ్ దాడికి గురైంది. ఆడపిల్ల పుట్టిందని భార్యాబిడ్డలను హతమార్చాలనుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డకు పాలిస్తున్న భార్య మీద, పాలు తాగుతున్న బిడ్డ మీద యాసిడ్ కుమ్మరించాడు. అన్మోల్ తల్లి ప్రాణాలు కోల్పోయింది, అన్మోల్ బతకడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమె బాల్యమంతా హాస్పిటల్ బెడ్, ఆపరేషన్ థియేటర్లలో గడిచిపోయింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అనాథ శరణాలయం ఆమె అడ్రస్ అయింది. బాల్యంలో తోటి పిల్లల ప్రశ్నార్థకపు చూపులను తట్టుకుని గట్టి పడిపోయిందామె. అదే ధైర్యంతో స్కూలు, కాలేజ్ చదువు పూర్తి చేసి ఫ్యాషన్‌రంగాన్ని కెరీర్‌గా మలుచుకుంది. ఇప్పుడామె సక్సెస్ఫుల్ మోడల్. తాను మోడలింగ్ చేస్తూ, మరో పక్క ఇరవై మంది యాసిడ్ సర్వైవర్స్‌కి సహాయం చేసింది. వారికి బతుకు మీద ధైర్యాన్ని కల్పించడం, బతుకుకు ఒక మార్గాన్ని చూపించడం అన్మోల్ చేస్తున్న సహాయం. నిజమే... యాసిడ్ పడింది వాళ్ల ముఖం మీద మాత్రమే. వాళ్ల మనోధైర్యం మీద కాదు. – మంజీర -
సిబ్బంది దురుసు ప్రవర్తన; ప్రగ్యా ఫిర్యాదు
భోపాల్ : బీజేపీ నేత, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్‌జెట్ విమానంలో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని సంస్ధ డైరక్టర్‌కు ఆదివారం భోపాల్ విమానాశ్రయంలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్నస్పైస్జెట్ విమానం ఎక్కారు. అయితే విమాన సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తాను బుక్ చేసుకున్న సీటుని తనకు కేటాయించలేదని విమానాశ్రయ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తనకు సీటు ఇవ్వలేదన్న కోపంతో విమానం ల్యాండిండ్ అవుతున్న సమయంలో నిరసనకు దిగినట్లు మాకు సమాచారం అందింది. దీంతో డైరక్టర్ అనిల్ విక్రమ్ రంగంలోకి దిగి ప్రగ్యాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.'ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించాం. దీనిపై సిబ్బందిని వివరణ అడిగి చర్యలు తీసుకుంటామని ' అనిల్ విక్రమ్ తెలిపారు. 'ప్రగ్యా ఠాకూర్ వీల్‌చైర్‌తోనే విమానాన్ని ఎక్కారు. భద్రతా కారణాల రిత్యా వీల్‌చైర్‌ను అనుమతించబోమని తెలిపాం. అందుకే ఆమెకు కేటాయించిన సీటులో ఆమెను కూర్చోవడానికి నిరాకరించాం. దీంతో ఆమె విమానంలోనే నిరసనకు దిగారని' అని సిబ్బంది వాపోయారు. అయితే ఈ కేసును సోమవారం పరిశీలించనున్నట్లు అనిల్ విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు.(చదవండి :‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’) -
సారీ.. రెండోసారి!
న్యూఢిల్లీ: నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ శుక్రవారం రెండుసార్లు లోక్‌సభకు క్షమాపణ చెప్పారు. తాను గాడ్సేను దేశభక్తుడని అనలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె మొదటి సారి క్షమాపణలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అలా చెప్పే బదులు చెప్పకపోతే నయమన్నట్టుగా ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ‘నా వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నందుకు చాలా విచారిస్తున్నాను. అందుకు క్షమాపణ చెబుతున్నా. అయితే సభలో నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తప్పుగా అర్థం చేసుకున్నారు’అని ఆమె అన్నారు. తనని ఉగ్రవాది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ని ఆమె తప్పు పట్టారు. కోర్టు తనని దోషిగా నిర్ధారించకుండా ఉగ్రవాది అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళలు, సా«ధ్విలను అవమానపరచడమేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. మరోవైపు బీజేపీ రాహుల్‌కి హక్కులు నోటీసు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా చాంబర్లో అన్ని పార్టీల లోక్‌సభ పక్ష నాయకులు హాజరై మరోసారి ప్రజ్ఞా క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. దీంతో ముందుగా తయారు చేసిన క్షమాపణ ప్రకటనను ఆమె చదివి వినిపించారు. ‘నవంబర్ 27న ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ కోరుకుంటున్నా’అని అన్నారు. అయితే తాను గాడ్సేని దేశభక్తుడని అనలేదని మళ్లీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, జాతికి ఆయన చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు. దీంతో సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ ప్రజ్ఞా సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు. రైతు కుటుంబాలకు సాయం లేదు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు చెందిన కుటుంబాలకు సాయం అందించే నిబంధనలేవీ ప్రస్తుత చట్టాల్లో లేవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా ఈ విషయం తెలిపారు. అయితే, రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు రుణాల మంజూరు వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యుల కొరత లేదు ► ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దేశంలో వైద్యుల కొరత, నర్సుల కొరత లేదని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలకు వెళ్ళే వైద్యులను బలవంతంగా అడ్డుకోవడం కుదరదన్నారు. క్రమంగా రైల్వే విద్యుదీకరణ పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో అన్ని రైల్వేలైన్లను క్రమేణా విద్యుదీకరిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు చెప్పారు. ప్రైవేటు బిల్లులు బుధవారం? ప్రైవేటు బిల్లులను శుక్రవారం బదులు బుధవారం సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్‌ను కోరారు. జాతీయ స్థాయి అంశాలు ఉంటే తప్ప ప్రైవేటు బిల్లుల చర్చ కోసం సమయాన్ని తగ్గించకూడదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీలంతా తమ నియోజకవర్గాలకు వెళ్లే హడావిడిలో ఉంటారు గనుక చర్చ పూర్తి స్థాయిలో జరగదని వారు చెప్పారు. -
‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’
సాక్షి, న్యూఢిల్లీ : నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆమె దిగివచ్చారు. తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని శుక్రవారం పార్లమెంట్లో కోరారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకున్నా ఉగ్రవాది అన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశ భక్తుడని కొనియాడారని గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి బీజేపీ తప్పించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ పార్టీ ఎంపీల సమావేశాలకు అనుమతించరాదని నిర్ణయించింది. -
ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంట్‌లోనే కీర్తించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై క్రమశిక్షణ పేరిట పాలక బీజేపీ పక్షం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఆమె గాడ్సేను కీర్తించడం ఆశ్చర్యమూ కాదు, ఇదే మొదటి సారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘గాడ్సే నిజమైన దేశ భక్తుడు’ అంటూ అభివర్ణించారు. అప్పుడే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిన బీజేపీ అధిష్టానం, ‘ఆమె అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ఆ అభిప్రాయాలతో మేం ఏకీభవించడం లేదు’ అని స్పష్టం చేసింది. ‘ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెను నేనెన్నడూ క్షమించలేను’ అని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు అసలు అర్థం ఏమిటి? తాజాగా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన మరునాడు గురువారం నాడు, క్రమ శిక్షణా చర్యల కింద ఆమెను రక్షణ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగిస్తున్నామని, ఆమెను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నుంచి బహిష్కరిస్తున్నామని బీజేపీ వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం హాస్యాస్పదం! దొంగకు తాళం చెవిచ్చి, దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామని చెప్పడం లాంటిదే ఇది. అసలు ఆమెను పార్లమెంట్లోకే ఎందుకు అనుమతించారు? నరేంద్ర మోదీ నాటి వ్యాఖ్యలకు అసలు అర్థం ఇది కాదా? విజయం సాధించి వచ్చారు కనుక పార్లమెంట్‌లోకి అనుమతించారని సర్దుకోవచ్చు! మరి పార్లమెంటరీ ప్యానెల్లోకి ఎందుకు తీసుకున్నారు? ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికీ ఓ టెర్రరిజం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరనే విషయం తెలిసిందే. 2008, మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన మోటార్ సైకిల్ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఆ మోటారు సైకిల్ ఆమె పేరుతో రిజిస్టరై ఉండంతోపాటు మరికొన్ని ఆధారాలు దొరకడంతో బాంబు పేలుడు కుట్రదారుల్లో ఒకరిగా ఆమెపై కేసు నమోదు చేశారు. నాటి నుంచి నేటికీ ఆ కేసు నత్తడక నడుస్తూనే ఉంది. అది వేరే సంగతి. కానీ ఠాకూర్ ఇదే నేపథ్యంలో గాడ్సేను టెర్రరిస్టుగా చూడరాదని, ఆయన నిజమైన దేశభక్తుడని వ్యాఖ్యానించారు. అంటే, ఆమె తనను తాను నిజమైన దేశభక్తురాలిగా అంతర్లీనంగా అభివర్ణించుకుంటున్నారేమో! ఆమె వ్యాఖ్యను పలువురు బీజేపీ ఎంపీలు ఆన్లైన్లో సమర్థించడం చూస్తుంటే ఆ పార్టీలోని ద్వంద్వ ప్రమాణాలు కూడా బయటపడుతున్నాయి. -
ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడంటూ సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రశంసలు గుప్పించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞా వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో బీజేపీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి తప్పించడమే కాకుండా.. ఈ పార్లమెంట్ సమావేశాల వరకూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొనకుండా బహిష్కరించింది. మరోవైపు ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రజ్ఞా వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ఖండించగా.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. ప్రజ్ఞాసింగ్ క్షమాపణ చెప్పేవరకు పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదని డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ వాళ్లు ఆమెకు టికెట్ ఇచ్చారు. ఎంపీని చేసి పార్లమెంటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి బహిష్కరించడం వల్ల ఏం లాభం? తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేవరకు ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు. ఈ విషయమై సెన్సార్ మోషన్‌కు మేం డిమాండ్ చేస్తున్నాం’ అని శశి థరూర్ అన్నారు. నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడిన ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని, ఇది దేశ పార్లమెంట్ చరిత్రలోనే విచారకరమైన దినమని రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను ఖండించారు. -
ప్రజ్ఞా సింగ్‌పై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశ భక్తుడని పార్లమెంట్లో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి బీజేపీ తొలగించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు పాలక పార్టీని టార్గెట్ చేయడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి ఆమెను తప్పించడంతో పాటు ఈ పార్లమెంట్ సమావేశాల వరకూ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆమెను అనమతించమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. పార్లమెంట్లో మంగళవారం ఆమె చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు, సిద్ధాంతాలను బీజేపీ ఎన్నడూ బలపరచదని చెప్పారు. మరోవైపు నాథూరాం గాడ్సేను దేశభక్తుడనే ఆలోచనకు స్వస్తిపలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ ఫైర్ మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడిన ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారు...ఇది దేశ పార్లమెంట్ చరిత్రలోనే విచారకరమైన దినమని రాహుల్ ట్వీట్ చేశారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. -
దేశానికే అవమానం!
న్యూఢిల్లీ: రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్లో వివాదాస్పద భోపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను సభ్యురాలిగా చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద కేసులో నిందితురాలు, మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆరాధకురాలైన ప్రగ్యాసింగ్‌ను డిఫెన్స్ పార్లమెంటురీ ప్యానెల్లో చేర్చడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు దేశాన్ని అవమానించిందని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో మొత్తం 21మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో మహారాష్ట్ర మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఈ చర్యను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో విమర్శలు గుప్పించింది. ‘డిఫెన్స్ పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యురాలిగా ప్రగ్యాసింగ్‌ను బీజేపీ సర్కార్ నామినేట్ చేయడం దేశ భద్రతా బలగాలను, దేశ పౌరులను అమమానించడమే’ అని ట్వీట్ చేసింది. సచ్ఛీలత, నిజాయితీ గల నేతలను నియమించడానికి బదులు ఇలాంటి వారిని నియమించడం విడ్డూరమని ఎద్దేవా చేసింది. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులను నియమించడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని, బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, డిఫెన్స్ ప్యానెల్లో సచ్ఛీలురను నియమించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని, ఐనా కావాలనే బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. -
‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్’ కేసు ఏమవుతుంది !?
సాక్షి, న్యూఢిల్లీ : 2008 నాటి మాలేగావ్ బాంబు పేలుడు కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ: అత్యున్నత యాంటి టెర్రరిస్టు దర్యాప్తు సంస్థ) ఆగస్టు రెండవ తేదీన ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఓ దరఖాస్తు దాఖలు చేసుకొంది. ఇక్కడ కేసును గోప్యంగా విచారించడం అంటే కేసుతో సంబంధం ఉన్న నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, అవసరమైన కోర్టు సిబ్బంది మినహా మిగతా ప్రజలు ఎవరూ కోర్టు హాలులో ఉండరాదు. ముఖ్యంగా మీడియాను అనుమతించరాదు. ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008, రంజాన్ మాసం ఆఖరి రోజైన సెప్టెంబర్ 29వ తేదీన ఓ మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడం వల్ల ఆరుగురు మరణించడం, వంద మంది దాకా గాయపడడం తెల్సిందే. బాంబు అమర్చిన మోటార్‌సైకిల్ ప్రస్తుతం బీజేపీ లోక్‌సభ సభ్యురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, ముస్లిం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆమె, మరికొంత మంది హిందూత్వ వాదులు కుట్ర పన్ని ఈ ‘హిందూ టెర్రరిజం’కు పాల్పడ్డారని నాడు ఆరోపణలు, వార్తలు వచ్చాయి. దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించే లక్ష్యంతో ప్రజ్ఞాసింగ్ మరికొంత మంది తీవ్ర హిందూత్వవాదులు ‘అభినవ్ భారత్’ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. మత సామరస్యం, జాతీయ భద్రత, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎన్ఐఏ తన దరఖాస్తులో పేర్కొంది. ఇది కేవలం సాకు మాత్రమేనని, ఇందులో ఏదో మర్మం ఉందని సులభంగానే గ్రహించవచ్చు. అది ఎప్పుడూ నిందితలు పక్షం వహిస్తూ రావడమే అందుకు రుజువు. ఈ కేసులో ఠాకూర్, ఇతర నిందితుల పట్ల మెతక వైఖరి అవలంబించాల్సిందిగా ఎన్ఐఏ తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణీ సేలియన్ బహిరంగంగా ఆరోపించడం తెల్సిందే. ఠాకూర్, ఇతర నిందితులపై చార్జిషీటు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి మినహాయించాలని కోరుతూ 2016లో ఎన్ఐఏ ఓ అనుబంధ నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తు జరిపి మీరు తేల్చింది చివరకు ఇదా, కేసు విచారణ కొనసాగాల్సిందేనంటూ ఆ నివేదికను పరిగణలోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2011లో ఈ కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించిన విషయం తెల్సిందే. అప్పటి వరకు మహారాష్ట్ర యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ ఈ కేసు విచారణను కొనసాగించింది. ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఇన్ కెమేరా (గోప్యంగా)’లో కేసు విచారణ జరగాలంటూ ఎన్ఐఏ దరఖాస్తు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే నిందిల పట్ల మెతక వైఖరి అవలంబిస్తే అది బయటకు తెలుస్తుందని, సరైన ఆధారాలు చూపకపోతే సంస్థ వైఫల్యం ప్రజలకు, ముఖ్యంగా మీడియాకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఎన్ఐఏ సంస్థ ఈ దరఖాస్తు చేసినట్లు మీడియా అనుమానిస్తోంది. అందుకనే కొంత మంది జర్నలిస్టులు కలిసి ఎన్ఐఏ దరఖాస్తును సవాల్ చేస్తూ ఆగస్టు ఐదవ తేదీన ఓ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాను అనుమతించక పోవడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని కూడా వాదించింది. దీనిపై కోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ‘కేసులో న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు బయటకు కనిపించాలి’ అంటూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో సహజ న్యాయ సూత్రాన్ని ప్రకటించింది. ఆ రకంగానైనా కేసులో బహిరంగ విచారణే కొనసాగించాలి. మరి ప్రజ్ఞాసింగ్ కేసులో ఏమవుతుందో చూడాలి!! -
చిక్కుల్లో ప్రజ్ఞా ఠాకూర్
భోపాల్: భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై 12ఏళ్ల క్రితం నమోదైన హత్యకేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ప్రజ్ఞాసింగ్ విజయం సాధించనున్నారని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్‌జోషి హత్యకేసులో ప్రజ్ఞాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిప్పటికీ ఈ కేసును పునర్విచారించేందుకు న్యాయసలహా తీసుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ మంగళవారం వెల్లడించారు. 2007 డిసెంబర్ 29న దేవస్ జిల్లాలో సునీల్‌జోషి హత్యకు గురయ్యారు. సరైన సాక్ష్యాధారాలులేని కారణంగా 2017లో ప్రజ్ఞాసింగ్, మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సునీల్ జోషి హత్యకేసు పునర్విచారణకు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని శర్మ తెలిపారు. -
‘గాంధీపై వ్యాఖ్యలు సరైనవి కావు’
పట్నా: భోపాల్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌పై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడంటూ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను నితీశ్ కుమార్ ఖండించారు. గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ వ్యాఖ్యలు ఖండించతగ్గవి. ఇటువంటి తీరును మేము సమర్థించం. గాంధీ జాతిపిత. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో, లేక చర్యలు తీసుకుంటారన్నది ఆపార్టీకి సంబంధిచిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ కూడా ఉపేక్షించకూడదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజ్ఞా ఇటీవల మాట్లాడుతూ... ‘గాంధీని హత్య చేసిన గాడ్సే ఓ దేశభక్తుడు.. ఆయనను కొందరు ఉగ్రవాది అని అంటున్నారు. అటువంటి వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతున్న విషయం తెలిసిందే. -
ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్, బిజినెస్ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చేరారు. గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని వ్యాఖ్యానించడం విశేషం. गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए। — Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019 -
‘భోపాల్’లో భూపాలుడు ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో తెలుసుకోవడమే ప్రశ్న, ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు బాబూలాల్ గౌర్ (88)ను భోపాల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకొని ప్రశ్నించింది. ‘దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు. పైగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ రాజకీయాలకు కొత్త. వీరిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పడం కష్టం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారు, క్యాడర్ లేరు. బీజేపీకి క్యాడర్ ఉంది. ఆరెస్సెస్ కార్యకర్తలు కూడా వచ్చి బూత్ స్థాయిలో పనిచేస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఇరువురి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజ్ఞాసింగ్ అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. లేకపోయినట్లయితే ఆమె విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి’ అని బాబూలాల్ గౌర్ చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌కు వ్యతిరేకంగా, ఎన్కౌంటర్లో మరణించిన ఐపీఎస్ అధికారికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటలపాటు నిషేధం విధించడం, దాంతో ఆమె ప్రస్తుతం గుళ్లూ గోపురాలు తిరుగుతున్న విషయం తెల్సిందే. ప్రజ్ఞాసింగ్ తరఫున ఇతర రాష్ట్రాలకు చెందిన ఠాకూర్లు కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, వారితోపాటు ఆరెస్సెస్, బజరంగ్ దళ్, దుర్గా వాహిణి, ఏబీవీపీ కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తున్నారని గౌర్‌ను కలుసుకోవడానికి వచ్చిన ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచార సమన్వయ కర్త జస్వంత్ సింగ్ హడా అత్యుత్సాహంగా చెప్పారు. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం కూడా భోపాల్ ఎన్నికల ప్రచారంపై దృష్టిని కేందీకరించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారని ఆయన తెలిపారు. 1989 నుంచి బీజేపీ వరుసగా గెలుచుకుంటూ రావడంతో భోపాల్ సీటు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగ మారింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాల కారణంగా బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ ప్రధాన్ విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుశీల్ చంద్ర వర్మ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమి లేదు. ఇక నరేంద్ర మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీసీ శర్మపై బీజేపీ అభ్యర్థి అలోక్ సంజార్ ఏకంగా 3,70,000 మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఈసారి భోపాల్‌పైగానీ, మధ్యప్రదేశ్‌లోగానీ నరేంద్ర మోదీ హవా కనిపించడం లేదని, ప్రజ్ఞాసింగ్ గెలిస్తే స్థానిక బలిమితోనే గెలవాలని బాబూలాల్ గౌర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఐదు వారాలు తాత్సారం చేయడమే బీజేపీకి ఈసారి భోపాల్‌లో ఎంత బలం ఉందో అర్థం అవుతుంది. దిగ్విజయ్‌ను ఎలాగైన ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో బీజేపీ, ప్రజ్ఞాసింగ్ పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్ ఇచ్చింది. -
ఈసీ వేటుతో సాధ్వి టెంపుల్ టూర్
సాక్షి, భోపాల్ : బీజేపీ భోపాల్ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రచారంపై ఈసీ 72 గంటల నిషేధాన్ని విధించడంతో ఆమె గురువారం ఆలయ సందర్శనలకు సమయం వెచ్చించారు. ఆమె ఉదయం తన రివేరా టౌన్ నివాసంలో ప్రజలను కలుసుకున్న అనంతరం భోపాల్‌లోని కర్ఫ్యూ వలి మాతా మందిర్‌ను సందర్శించారు. కాగా, బాబ్రీ మసీదు విధ్వంసంలో తన పాత్రతో పాటు ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కింద పరిగణించిన ఈసీ ఆమెపై 72 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హేమంత్ కర్కరేపై ప్రకటనకు సాధ్వి క్షమాపణలు కోరినా ఈసీ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇక సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ మూడో నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదిని ఓ సన్యాసి అంతమొందిచాల్సిన అవసరం ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భోపాల్‌లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ బరిలో దింపినప్పటి నుంచి ఆమె వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. -
ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ షాక్
భోపాల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ముంబై టెర్రర్ దాడి సందర్భంగా అసువులు బాసిన మాజీ ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపైనా, బాబ్రీ మసీదు కూల్చివేతపై ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను 72 గంటల (మూడు రోజులలు) పాటు ప్రచారంనుంచి నిషేధించింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో తనను హేమంత కర్కరే తీవ్రంగా వేధించారని, ఆ సందర్భంగా తాను శపించిన కారణంగా చనిపోయారంటూ వివాదాన్ని సృష్టించారు. అలాగే ముస్లింలమనోభావాలను దెబ్బతీసిన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీమసీదు కూల్చిన బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాగా భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నిలిపిన సంగతి తెలిసిందే. ఆరవ దశ ఎన్నికల్లో భాగంగా మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. -
ప్రజ్ఞాసింగ్‌కు టిక్కెట్ ఇవ్వడంలో మతలబు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడం తదితర అభియోగాలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. భారత రాజకీయ నేతలపై ఇలాంటి అభియోగాలతో కేసులు దాఖలవడం కొత్తేమి కాదు. కానీ ప్రజ్ఞాసింగ్‌పై దాఖలైన కేసు చాలా భిన్నమైనది. అది టెర్రరిజం కేసు. అంతటి తీవ్రమైన కేసు ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ కేసులో ఆమె అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారు? సరే, ప్రస్తుతానికి అది వేరే విషయం. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన మోటార్‌సైకిల్ బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుడు కుట్రదారుల్లో ప్రజ్ఞాసింగ్ ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతర వ్యవస్థీకత నేరాలకు, టెర్రరిజమ్ నేరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. డబ్బుకోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసమో వ్యవస్థీకత నేరాలు జరుగుతాయి. టెర్రరిజమ్ బుర్రను తొలిచే ఓ సిద్ధాంతం నుంచి పుట్టుకువస్తుంది. టెర్రరిస్టులు తాము ద్వేషించే శక్తుల అంతానికి హింసకు దిగుతారు. మెజారిటీలను అణచివేసేందుకు మైనారిటీలు టెర్రరిజాన్ని ప్రయోగిస్తారని భారత లాంటి దేశాల్లో ఒక అపోహ ఉంది. వాస్తవానికి మైనారిటీలను మెజారిటీలు అణచివేసినప్పుడు అసహనం, అశక్తతతో మైనారిటీల నుంచి తిరుగుబాట్లతోపాటు వాటి వికతరూపమైన టెర్రరిజమ్ పుట్టుకొస్తుందని ప్రపంచ మేధావులు ఇప్పటికే తేల్చి చెప్పారు. టెర్రరిజమ్ ఏ రూపంలో ఉన్నా, ఆ శక్తులు ఏమైనా తీవ్రంగా అణచివేయాల్సిందే, సమూలంగా నిర్మూలించాల్సిందేనంటూ పలు అంతర్జాతీయ తీర్మానాలు అమల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఓ టెర్రరిస్టు కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ప్రజ్ఞాసింగ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడంలో ఔచిత్యం ఉందా? ఇస్లాం టెర్రరిజమ్ నేరమయితే, దానికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హిందూ టెర్రరిజమ్ నేరం కాదా? మైనారిటీలు చేస్తేనే తప్పు, మెజారిటీ వర్గీయులు చేస్తే తప్పుకాదనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందేమోగానీ సెక్కులరిజమ్ అనిపించుకోదు. భారత రాజ్యాంగంలోని సెక్యులరిజమ్ భావాలకు ఇది విరుద్ధం కాదా ? భిన్న మతాలు, భిన్న సంస్కతుల సమ్మిలిత బహుల సమాజం భారత దేశం. దీనికి భిన్నంగా మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడం వల్ల సమాజంలో సంక్షోభాలు తలెత్తి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని ‘ది డార్క్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ’ పుస్తకంలో ప్రముఖ రాజకీయ, సామాజిక శాస్త్రవేత్త మైఖేల్ మాన్ హెచ్చరించారు. దుష్ట శక్తి అనేది నాగరికతకు సంబంధం లేకుండా రాదని, నాగరికత నుంచే అది పుడుతుందని, దుష్ట శక్తికి రాజకీయ ఆసరా లభించినట్లయితే అది నాగరికత అంతానికి కారణం అవుతుందని కూడా మైఖేల్ మాన్ హెచ్చరించారు. ప్రజ్ఞాసింగ్‌పై కేవలం ఆరోపణలే కాదు, ఆమె బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు రెండు నెలల కాలంలోనే అప్పటి పోలీసు దర్యాప్తు అధికారి హేమంత్ ఖర్కరే కనుగొన్నారు. పేలుడు పదార్థాలు అమర్చిన బంగారు రంగు ‘ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్’ యజమానిని గుర్తించడం ద్వారా ఆయన మాలేగావ్ కేసు కూపీ లాగారు. అప్పటికి సైన్యంలో పనిచేస్తున్న లెఫ్ట్‌నెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌తోపాటు రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్‌తోపాటు పలువురు సాధువులు, మహంతుల హస్తం ఉన్నట్లు కనుగొని వారిపై ఆయన కేసులు పెట్టారు. దురదష్టవశాత్తు రెండు నెలల అనంతరం ఓ టెర్రరిస్టు కాల్పుల్లో ఆయన మరణించారు. తాను పెట్టిన శాపం పర్యవసానంగానే ఖర్కరే చచ్చాడని ప్రజ్ఞాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.