responsibility
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కల్పనా సోరెన్‌కు కీలక బాధ్యతలు?
ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్డీఏ తన ప్రణాళికను జూలై నుంచి అమలుచేయనుంది. ఇండియా అలయన్స్ కూడా తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమెకు జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన అనంతరం కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేఎంఎం ర్యాలీల్లో కల్పన చురుగ్గా పాల్గొన్నారు. గాండే ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హేమంత్ సోరెన్ అరెస్టు దరిమిలా కల్పన తన భర్తను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.త్వరలోనే హేమంత్ సోరెన్ నిర్దోషిగా విడుదలవుతారని, ఇండియా అలయన్స్ నుంచి ముఖ్యమంత్రి అవుతారని కల్పన చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుండి బయటకు రానిపక్షంలో పార్టీ కల్పనా సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
బీజేపీ ప్రచార నిర్వహణకు 300 కాల్ సెంటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార నిర్వహణకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రచార అంశాలను రూపొందించడం, ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యాలుగా 300 కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. దేశాన్ని 10 జోన్లుగా విభజించించి, ప్రతి 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కాల్ సెంటర్‌ను నిర్వహించనుంది. ఇవి ఓటర్లకు నిత్యం ఫోన్ చేసి మేనిఫెస్టోను వివరిస్తాయని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. పది జోన్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌ల నియామకాలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జోన్ ఇన్చార్జ్గా గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ థాకర్‌ను నియమించింది. మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ జోన్‌కు బిహార్ బీజేపీ నేత దేవేశ్ కుమార్, ఉత్తరప్రదే శ్–ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ గా ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షు డు రాజీవ్ బబ్బర్‌ను నియమించారు. ఈ నేతలు కేంద్ర కార్యాలయంలోని ఐదుగురు ముఖ్యనేతలు, రాష్ట్రాల పరిధిలో కాల్‌సెంటర్ల ఇన్‌చార్జ్‌లను కలుపుకొని ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. -
ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
ఒడిశా రైలు దుర్ఘటన పట్ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. ‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్2న జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं। हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा। पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है। — Gautam Adani (@gautam_adani) June 4, 2023 -
కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే పూర్తి బాధ్యత నాదే: ఖర్గే
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కన్నడనాట కాంగ్రెస్ ఓడిపోతే అందుకు పూర్తి నైతిక బాధ్యత తనదే అన్నారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఖర్గే ఉన్నారు. అయితే కర్ణాటకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామన్నారు. ఈసారి హంగ్ వచ్చే పరిస్థితి ఉండదన్నారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కృత నిశ్ఛయంతో ఉందని, తీరక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. 'నేను రోజు నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నా. ఒక్కోసారి 100కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అకింతభావంతో ఉన్నాం. అందుకే ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తున్నాం.' అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. పలు సర్వేలు ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే తెలిపాయి. మరి ఓటర్ల నాడి ఎలా ఉందో వారం రోజుల తర్వాత తేలిపోనుంది. చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ.. -
బాధ్యత తీసుకోవడమూ ఆదర్శమే!
గుజరాత్‌లోని మోర్బీ వద్ద జరిగిన తీగల వంతెన ప్రమాదం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. పదుల మంది ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే ప్రజల్ని సరాసరి మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నెపం ఇంకెవరి మీదకో నెట్టేసి నాయకులు చేతులు దులిపేసుకుంటారా? ఒకప్పుడు లాల్‌బహదూర్ శాస్త్రి లాంటివారు రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా వారి దోషం లేకపోయినా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని నెలకొల్పారు. అలాంటి స్పందనను గుజరాత్ నాయకుల నుంచి మనం ఇప్పుడు చూడగలమా? ‘‘గుజరాత్‌లోని ‘మోర్బీ’ వద్ద 143 ఏళ్ల నాడు నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రసిద్ధ టూరిస్టు కేంద్రంగా ఉన్న ఆ పట్టణం గుండా ప్రవహించే మచ్ఛు నదిలో అకస్మాత్తుగా కూలిపోయిన ఫలితంగా వందలాదిమంది సందర్శకులు పిల్లాజెల్లాతో ఘోరమైన విషాదానికి గురయ్యారు. పైగా ఇటీవలనే మరమ్మత్తులు పూర్తయి పునఃప్రారం భమైన వంతెన కాస్తా కూలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వంతెనల నిర్మాణంలో సరైన అనుభవం, నైపుణ్యం లేని ఒక ప్రయివేట్ కంపెనీకి వంతెన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఒకే సమయంలో 150 మందికి మించి భరించగల బ్రిడ్జి కాదని మాత్రం నివేదికలు తెల్పుతున్నాయి. వివిధ స్థాయుల్లో ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే సరాసరి ప్రజల్ని మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు తెల్పుతున్నాయి. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి, బాధ్యత ఎవరిదో తేల్చాలి. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (1 నవంబర్ 2022) ప్రజలు విషాద ఘటనల బారిన పడినప్పుడు పాలకులు కనీస నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఉందని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని సీనియర్ సభ్యు నిగా లాల్ బహదూర్ శాస్త్రి నెలకొల్పిన ‘సువర్ణ ప్రమాణాల్ని’ మరో సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 1956 ఆగస్టు. మహబూబ్‌నగర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘట నలో 112 మంది చనిపోయారు. లాల్ బహదూర్ ఆ ఘటనకు కలత చెంది, తన పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను నెహ్రూకు పంపారు. ‘వద్దు, వద్దు’ అని నెహ్రూ నివారించడంవల్ల, లాల్‌బహదూర్ తాత్కా లికంగా ఆగారే గానీ అరియలూర్ (తమిళనాడు)లో అదే సంవత్సరం మరో రైలు ప్రమాదం జరిగి 144 మంది మరణించారు. ఈ రెండు వరుస విషాదకర ఘటనలతో లాల్‌బహదూర్ ఆవేదన నిలుపుకోలేక వెంటనే నెహ్రూకు రాజీనామా లేఖ సమర్పిస్తూ... ‘ఇక నన్ను ఒత్తిడి చేయవద్దు, వెంటనే ఆమోదించవలసింది’ అని కోరారు. ఆ విషయమై నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ లాల్ బహదూర్ నిర్ణయం పట్ల అత్యంత గౌరవాన్ని వ్యక్తం చేశారు. ‘‘విశాల మైన మనస్సుతో ఆలోచిస్తే, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం ఆదర్శంగా నిలబడటం రాజ్యాంగ విలువల దృష్ట్యా గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏది ఏమైనా సరే మనం పట్టించుకోకుండా తలొంచుకుని పోదామనే ధోరణి సరై నది కాదు’’ అని నెహ్రూ చెబుతూ రాజ్యాంగ మర్యాదను పాటిం చడం ధర్మమని ప్రకటించాల్సి వచ్చింది. అయితే నెహ్రూ ప్రకటనను పత్రికలు తప్పుబట్టాయి. 30 మంది పార్లమెంట్ సభ్యులు కూడా లాల్‌బహదూర్ రాజీనామాను అంగీకరించ‘వద్దు్ద’ అని నెహ్రూకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రి వ్యక్తిగతంగా రైలు ప్రమాదాలకు కారకుడు కారు గనుక రాజీనామాను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా లాల్ బహదూర్ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి – రాజకీయాలు ఆపైన’ (పాలిటిక్స్ అండ్ బియాండ్) అన్న గ్రంథంలో ప్రసిద్ధ వ్యాఖ్యాత సందీప్ శాస్త్రి ఈ విషయం గురించి చెబుతూ – ‘‘లాల్‌బహదూర్ నెలకొల్పిన ఉత్తమ సంప్రదాయం దేశ చరిత్రలో, నాయకుల చరిత్రలో ఒక ఉన్నత ప్రమా ణాన్ని నెలకొల్పింది. ఇతరులు ఆ ప్రమాణాన్ని పాటించక పోవచ్చు. కానీ, రాజకీయ ప్రమాణాలకు, వైశిష్ట్యానికి లాల్‌బహదూర్ నెల కొల్పిన ఆదర్శాలు ఉన్నతమైనవి’’ అన్నారు. రెండు రైలు ప్రమాద దుర్ఘటనల తర్వాత ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్ప టికీ లాల్‌బహదూర్ శాస్త్రి ఆదర్శం, నెలకొల్పిన నైతిక విలువల వైశి ష్ట్యాన్ని గురించి అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ ‘మోర్బీ’ బ్రిడ్జి కంటే ముందే, సుమారు 150 ఏళ్లనాడు గోదావరి నదిపై ఆనకట్ట తలపెట్టారు సర్ ఆర్థర్ కాటన్. కాలం ముగియకముందే జాగ్రత్తలు తీసుకుంటే వంతెన ఆయుష్షును పెంచు కోవచ్చునని చెప్పిన మహనీయుడు కూడా ఆయన. కరువు కాటకాల వాతబడి కోట్లాదిమంది గోదావరి జిల్లాల ప్రజలు అల్లల్లాడిపోతున్న సమయంలో ఆనకట్ట నిర్మాణం కోసం తన బ్రిటన్ సామ్రాజ్య పాల కులపైనే ఒత్తిడి తెచ్చిన ధీశాలి కాటన్. ‘మన (బ్రిటన్) డబ్బంతా తీసుకుపోయి అక్కడ పోస్తే, మనకేం లాభం?’ అని బ్రిటిష్ పాలకులు కాటన్‌కు పాఠం చెప్పబోతే, వారి బుర్రల్ని తెలివిగా ‘చిత్రిక పట్టి’ గోదావరి జిల్లాలను కరువు కాటకాల నుంచి రక్షించారు కాటన్. ‘నీకు ఆదాయం రావాలన్నా ముందుగా ప్రజలు బతికి బట్టకట్టాలి కదా. తద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మన బ్రిటన్‌కే వస్తుంది కదా’ అని పాఠం చెప్పారు. అలా ఉభయతారకంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు కాటన్. అందుకే ఈ రోజుకీ గోదావరి జిల్లాల ప్రజలు చిన్నాపెద్దా ఏ శుభముహూర్తాలు తమ ఇళ్లలో జరిగినా ‘కాటనాయ నమః’ అని కీర్తించుకుంటూ ఉంటారు. నదుల మధ్య అనుసంధానం నెలకొల్పి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నాడు మగ్గుతున్న ఆంధ్ర ప్రాంతాలలో జలవనరుల అవసరం తీర్చడానికి శ్రద్ధతో స్కీములు వేసిన మహనీయుడు కాటన్. ఆంధ్ర రాజకీయ, సామాజిక, వివిధ నిర్మాణ రంగాలలో ఉద్దండులైన ముక్త్యాల రాజా, ఇంజనీర్ కె.ఎల్. రావు, మోటూరు సత్యనారాయణ, ఆచార్య రంగా ఇత్యాది ప్రభృతులు కాటన్ కృషిని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. నెహ్రూ ఆశీస్సులతో బహూళార్ధ సాధక నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి నిర్మాణాన్ని సుసాధ్యం చేసు కోగలిగారు. అంతేగాదు, కాటన్ మహాశయుడు దక్షిణాది రాష్ట్రాల సౌభాగ్య గరిమకు చేదోడువాదోడు కావడమేగాక, ఉత్తరాది సరిహద్దు లలో తిష్ఠ వేసిన బ్రహ్మపుత్రతో వియ్యమందుకుని, ఆంధ్ర మున్నగు దక్షిణ భారత రాష్ట్రాలకు జల విద్యుత్ సౌభాగ్యాన్ని అందించాలని కూడా పథకాలు వేశాడు. అసలు బ్రహ్మపుత్ర ఆధారంగా మధ్య భారతం దన్నుగా యావద్భారతం నలుమూలలకూ ఆరుగాలమూ జల, విద్యుత్ సంపద పంపిణీ అయ్యేందుకూ బృహత్ పథకం రచిం చాడు. ఆ స్ఫూర్తితోనే మన కె.ఎల్. రావు, శొంఠి రామ్మూర్తి ప్రభృతులు మరికొన్ని పథకాలు రూపొందిస్తూ వచ్చారని మరవరాదు. కానీ, ఎందుకని ఈ మహనీయుల కృషిని మరింత ముందుకు తీసుకుపోవడంలో దేశీయ పాలకులు విఫలమవుతున్నారు? ఎందుకు వారిలా శ్రద్ధ చూపడం లేదు? రాజ్యాంగం గుర్తించిన ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని నాశనం చేస్తూ ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’... ఒకడే నాయకుడు, ఒకటే పార్టీ అని మాత్రం యాగీ చేస్తున్నారు. ప్రణాళికా వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వ రంగాన్ని చాపచుట్టి, కార్పొరేట్ గుజరాత్ రాజ్యం యావద్భారతాన్ని చుట్టబెడుతోంది. ‘భారత ప్రజలమైన మేము మాకుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని అంకిత మిచ్చుకుంటున్న మౌలిక పత్రం ఇది’ అని రాజ్యాంగం ముందు మాటలోనే స్పష్టం చేసినా – పాలకుల చేతుల్లో దాని ముఖ వర్చస్సు అంతా చెదిరిపోయింది. కనుకనే నేటి దుర్బుద్ధులూ, పెడబుద్ధులూ! రోజుకో తీరు చొప్పున చెదిరిపోతున్న మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి. ఇది నిలవాంటే, పౌర బాధ్యతల అధ్యాయపు కనీస విలువను కాపాడు కోవడానికైనా ఉద్యమించవలసిన అవసరం ఉంది. 2024 వచ్చేలోగానే పౌర సమాజం తన గాఢ నిద్రను వదిలించుకోగలగాలి! అవును మరి – ‘‘ఏది పలికినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం ఏది ముట్టినా కాంచనమైతే ఏది శ్రమశక్తికి మూల్యం?’’ – సినారె ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో అత్యున్నత న్యాయస్థానంకీలక వ్యాఖ్యలు చేసింది. చెక్కు బాధ్యత ఇచ్చిన వారిదే అని తెలిపింది. మీరు కాకుండా వేరే ఎవరైనా వివరాలను పూరించినా, చెక్కుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెక్ బౌన్స్ కేసును విచారించిన జస్టిస్ డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పినట్టు లైవ్‌లా నివేదికను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి, సంబంధిత వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా చెక్ ఓనర్‌పై ఉంటుంది. అయితే చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి చెక్కుపై వివరాలు నమోదు చేయలేదని తేల్చిన చేతివ్రాత నిపుణుడి నివేదికను అగౌరవపర్చ లేమని కోర్టు తెలిపింది. కానీ చెక్కులోని వివరాలను డ్రాయర్ ఫిల్ చేశారా, లేదా ఎవరు చేశారనేది సంబంధం లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు చెల్లింపుదారునికి సంతకం చేసిన ఖాళీ చెక్కు ఇచ్చినట్లు అంగీకరించాడు. కానీ వివరాలు నమోదు చేయలేదని వాదించాడు. అలాగే దీన్ని నిర్ధారించడానికి చేతివ్రాత నిపుణుడి సలహా తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి కూడా తీసుకున్నాడు. చేతివ్రాత నిపుణుల నివేదికను జోడించాడు. అయితే దీనిపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. అలాగే వివరాలు ఎవరు నమోదుచేశారు, అప్పుగా ఇచ్చారా, మరోలా ఇచ్చారా అనేవిషయాన్ని నిర్ధారించడంలో చేతిరాత నిపుణుడి రిపోర్టు పాత్ర ఉండదని తెలిపింది. చెక్కుపై సంతకం చేసి, చెల్లింపుదారునికి ఇచ్చే చెక్ రుణం చెల్లించడం లేదా లయబిలిటీ నిమిత్తం ఇచ్చినట్టు రుజువు చేయబడితే తప్ప బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ఐదు రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్ఐ చట్టం కింద కేసుల సంఖ్య గణనీయంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఒక్కో కోర్టు ఏర్పాటు చేయాలన్న అమికస్ క్యూరీ సిఫార్సును అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్ఐ) కింద, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల దృష్ట్యా, ఈ కోర్టులు ఏర్పాటు చేస్తామని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రకటించిన సంగతి విదితమే. -
స్వేచ్ఛ.. ఆనంద హేతువు
స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన. ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు. నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా! మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని, దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవించటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది. మన భావప్రకటనా శక్తి కూడ మన స్వేచ్ఛను తెలియచేప్పేదే. విద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలోనే కాక ఇతర రంగాలలోనూ వచ్చే మార్పులకు మనం స్పందించి, దాన్ని వ్యక్తపరచటమూ మన స్వేచ్ఛను తెలియపరుస్తుంది. మన అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా తెలియపరచటంతో పాటు ఉచితమైన, ఆమోదయోగ్యమైన, మర్యాదకరమైన భాషను వాడాలి. సిద్ధాంతాలమీద, భావనల మీద మన ఉద్దేశాన్ని ఎంత నిర్కర్షగా మనం చెప్పదలచుకుంటే అంతగా చెప్పచ్చు. ఇక్కడ సమతౌల్యం, సంయమనం అవసరం. ఈ భావప్రకటనా స్వేచ్ఛ చక్కని ఆలోచనల, భావనల మార్పిడికి / బదిలీకి సహాయపడి మనలను వ్యవస్థను మెరుగు పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. విద్యలో స్వేచ్ఛ అత్యంతావశ్యకం. గురువులు చక్కని వాతావరణాన్ని సృష్టించాలి. ఆ ఉత్సాహభరితమైన, ఉల్లాసభరితమైన స్థితి విద్యార్థులను నిర్భయులను చేసి వారి సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచి నివృత్తి చేసుకునేటట్టు చేస్తుంది. ఇరువురి మధ్య విద్యాసంబంధమైన చనువుతో పాటు ఒక ఆత్మీయతను ఏర్పరుస్తుంది. గురుశిష్యులను దగ్గరకు చేరుస్తుంది. వారి బంధాన్ని దృఢం చేస్తుంది. గురువులు చెప్పే విద్యను వెంటనే అంగీకరించక పరీక్షించే గుణాన్నిస్తుంది. శోధించే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛా వాతావరణం ఉభయులకూ ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు, ఇద్దరినీ అప్రమత్తులను చేస్తుంది. స్వేచ్ఛ ద్విముఖి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు అనంత ప్రయోజనకారి. ఇది మనకు నిర్భయాన్నిస్తుంది. ధైర్య, స్థైర్యాలనిస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది మన ఊహాప్రపంచపు పరిధులను విస్తరింప చేస్తుంది. మన మేధను పదను పరుస్తుంది. మన సృజనకు నిత్య నూతనత్వాన్ని ఇస్తూ వికసింప చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఏ నిర్బంధానికి, సంకుచితత్వానికి, స్వార్థానికి లొంగక ప్రజలు నిర్భయంగా, ఆనందంగా సంచరించే స్వర్గధామమని అన్నారు విశ్వకవి రవీంద్రులు. స్వేచ్ఛ సహజంగా వీచే వాయువు లాంటిది. కాని అనేక కారణాలవల్ల ఆ స్వేచ్ఛావాయువును పీల్చు కోలేకపోతున్నాం. ముఖ్యంగా పిల్లలు. వీరి స్వేచ్ఛకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం, దేశపరిపాలనా రీతి కారణం. కొన్ని యుద్ధ ఉన్మాద దేశాలలోని భయానక వాతావరణం కూడ పిల్లల స్వేచ్ఛను హరించి వేస్తుంది. ఆహారం కాదు ఆహ్లాదం, ఆనందం లేనిచోట స్వేచ్ఛ లేనట్టే. అందుకే ‘స్వేచ్ఛ కోరే మనసు ఉంటే పొందలేనిది ఏముంది’ ‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. కాని ప్రతి చోట బందీనే’ అంటారు రూసో. ఎలా..? ఏమిటీ సంకెలలు? బంధాలు,అనుబంధాల పై మితిమీరిన మమేకత, ప్రేమ, మమకారం, ఆకర్షణ. నేను, నాది , ఆస్తి పాస్తులు , చరాచరాస్తులు, చావు పుట్టుకల సహజత్వాన్ని అంగీకరించని తత్వం అనే అనేకానేక శృంఖలాలు. వీటినుండి బయటపడే నిజమైన స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ. స్వాతంత్య్రం. అద్భుతమైన ఈ దశకు మనస్సు చేరుకునేందుకే ఆధ్యాత్మిక సాధన, ఆ సాధనాపరుల తపన, లక్ష్యం. మనస్సు ఈ అరిషడ్వార్గాలనుండి విముక్తి పొందటమే ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛ. అపుడంతా, అన్నిటా ఆనందమే. స్వేచ్ఛ పరమావధి బహ్మానందమే. మనస్సు ఒక స్వేచ్ఛా విహంగం. ఈ మాయామోహిత జగత్ప్రవాహంలో దాని రెక్కలు తడిసి ముద్దవుతుంటాయి. పక్షి తన పదునైన ముక్కుతో చిక్కుతీసుకుంటూ రెక్కలార్చుకుంటుంది. అలాగే మనిషి తన మనోవిహంగపు రెక్కలను భవబంధాల సంకెళ్ల నుంచి విడుదల చేసే యత్నానికే స్వేచ్ఛ అనే మరో పేరు. అపుడు మనోవిహంగపు సంచరించగల ఆవరణం అనంతం. బలమైన దేశాలు బలహీనమైన దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రజలను బానిసత్వవు ఊబిలోకి తోసేసేసిన వైనాలెన్నెన్నో. స్వేచ్ఛ అనే ప్రాణవాయువు అందక వారు ఎలా జీవచ్ఛవాలుగా మారారో చరిత్ర చెపుతుంది. అందుకే శ్రీ శ్రీ.. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నాడు. స్వేచ్ఛ ప్రాణుల ఊపిరి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
నదుల పరిరక్షణ సమిష్టి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: నదులను పరిరక్షించుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనానికి శక్తిమంతమైన జాతీయ ప్రచార ఆవశ్యకతకు పిలుపునిచ్చారు. ఎనిమిది రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు ‘ఫరెవర్ గువాహటి’సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) విడుదల చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుదలతో నదులు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయన్నారు. ఆధునికీకరణ అన్వేషణలో అత్యాశతో మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అనంతరం ఫేస్బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి... బ్రహ్మపుత్ర నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు. బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తున్న బ్రహ్మపుత్ర ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో భాగమని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం, అస్సాం రాష్ట్ర కేన్సర్ ఇన్స్టిట్యూట్లో పీఈటీ–ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించారు.అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్ కేన్సర్ కేర్ మోడల్‌ను అభినందించారు. -
చమురు ఓడల రక్షణ మీ బాధ్యతే
వాషింగ్టన్: గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే చమురు ఓడల రక్షణ బాధ్యత ఆయా దేశాలే చూసుకోవాలని, ప్రమాదకరమైన ఆ ప్రాంతంపై తమకు అంతగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్ సోమవారం ట్వీట్‌చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటం, ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహించకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటున్న ఇరాన్ బెదిరింపులపై ఆయన.. ‘మా వద్ద చాలినన్ని చమురు నిల్వలున్నాయి. ఆ ప్రాంతంతో మాకు అవసరం లేదు. అక్కడ మేం రక్షణ బాధ్యతలు చేపట్టడం లేదు. గల్ఫ్‌లో ప్రయాణించే చమురు నౌకల భద్రత బాధ్యత సంబంధిత దేశాలదే’ అని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే ఉత్తర్వుపై ట్రంప్ సోమవారం సంతకం చేశారు. దీని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారుల ఆర్థిక లావాదేవీలను అమెరికా నిరోధించనుంది. మోదీ, పుతిన్‌లతో భేటీ కానున్న జిన్‌పింగ్ బీజింగ్: జి–20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జి–20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చించనున్నారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. -
కుడి ఎడమైతే
ఆ భవంతి పేరు ‘లక్ష్మీనిలయం’. అందులో డెబ్బయ్యేళ్ల పురుషోత్తమరావు, అరవై అయిదేళ్ల లక్ష్మీదేవి, ఆరేళ్ల మనవరాలు ‘గుడ్డీ’ ఉంటారు. మూడేళ్ళ క్రితం కొడుకు, కోడలూ కారు యాక్సిడెంటులో పోవడంతో, మనవరాలి బాధ్యత వారిపైన పడింది. పాపను చూసుకోవడానికి సులోచనను ఆయాగా పెట్టుకున్నారు. సులోచన తమ్ముడు శ్రీహరి ఆమధ్యే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అక్కతోనే ఉంటున్నాడు. ఆ రోజు‘లక్ష్మీనిలయం’లో భయంకర నిశ్శబ్దం అలముకుంది. కారణం– కోటిరూపాయల విలువచేసే వజ్రాలహారం మాయమయింది!క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లావణ్యకు వజ్రాలహారం చోరీ గురించి ఫిర్యాదు అందగానే తన సిబ్బందితో లక్ష్మీ నిలయానికి వెళ్ళింది.భవనమంతా తిరిగి క్లూస్ కోసం వెదికింది. సులోచన ఉంటున్న ఔట్ హౌస్నీ, పరిసరాలనూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంటి బయట పాసేజ్లో సగం కాల్చి పడేసిన సిగరెట్ కనిపించింది. చేతి రుమాలుతో దాన్ని తీసి జేబులో వేసుకుందామె. సులోచన సుమారు ఏడాదిగా పనిచేస్తోందనీ, నమ్మకస్తురాలనీ చెప్పింది లక్ష్మీదేవి. శ్రీహరి గురించి కూడా మంచిగానే చెప్పింది. పురుషోత్తమరావు భార్య అభిప్రాయాన్ని బలపరచాడు. ఒంట్లో బావుండకపోవడంతో ఆదివారం రాత్రి తాను నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నట్టు చెప్పింది లక్ష్మీదేవి. తనకు స్మోకింగ్ అలవాటు లేదనీ, ఆదివారం రోజున ఇంటికి విజిటర్స్ ఎవరూ రాలేదనీ చెప్పాడు అతను. శనివారం రోజున లక్ష్మీదేవి వజ్రాలహారాన్ని మెళ్ళో వేసుకుని పార్టీకి వెళ్ళడం తాను చూశానంది సులోచన. వాళ్ళు పార్టీ నుంచి తిరిగిరావడం కానీ, హారాన్ని బీరువాలో పెట్టడం కానీ తనకు తెలియదంది. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరనీ, ఆదివారం తన గదికి ఎవరూ రాలేదనీ చెప్పిందామె. శ్రీహరి ఇంటరాగేషన్‌లో కొత్త విషయాలేవీ తెలియలేదు. ‘తాను అసలు ఆ వజ్రాలహారాన్నే చూళ్ళేదని చెప్పాడతను. అతను స్మోక్ చేస్తాడని తెలుసుకుని, పాసేజ్లో దొరికిన సిగరెట్ పీకను చూపించింది. అది తనది కాదనీ, తాను ‘చార్మినార్’ బ్రాండే వాడతానని చెప్పాడు. ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఆ ఐదుగురితోపాటు కారు డ్రైవర్ నూకరాజు, మెయిన్ గేట్ దగ్గర మూడు షిఫ్టుల్లో పనిచేసే ముగ్గురు వాచ్మెన్ కూడా ఉన్నారు. నూకరాజుకు పాతికేళ్ళుంటాయి. ఆర్నెల్ల క్రితమే చేరాడు. ‘వెల్–డిసిప్లిన్డ్’ అంటూ కితాబు ఇచ్చాడు పురుషోత్తమరావు. నూకరాజు ఆదివారం నుంచి మూడురోజులు సెలవు తీసుకున్నాడు. కనుక అనుమానితుల జాబితా నుంచి అతన్ని తొలగించింది. సెకండ్ షిఫ్ట్ వాచ్ మేన్ పరమేశానికి యాభయ్యేళ్ళుంటాయి. ఎక్స్–సర్వీస్ మేన్. తన షిఫ్ట్‌లో ఎవరూ ఇంటికి రాలేదని చెప్పాడు. థర్డ్ షిఫ్ట్ వాచ్ మేన్ కొండలరావుకు నలభయ్ ఐదేళ్ళుంటాయి. ‘‘నిన్న సాయంత్రం నుంచి నా భార్యకు జ్వరం. అందువల్ల రాత్రి డ్యూటీ ఎక్కిన అరగంటకు ఇంటికి వచ్చేశాను మేడమ్! ఆ సమయంలోఎదురింటి వాచ్‌మేన్ ఏడుకొండలిని చూసుకోమని చెప్పాను. పదకొండు గంటలకు తిరిగి వెళ్ళాను’’ చెప్పాడు. ఏడుకొండలు మంచివాడేననీ, తమ మధ్య అప్పుడప్పుడు అలాంటి అడ్జెస్ట్మెంట్స్ మామూలేననీచెప్పాడు. అనంతరం ఏడుకొండల్ని ప్రశ్నించిన ఇన్స్పెక్టర్కి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురుషోత్తమరావు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కారులో బైటకువెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి సులోచన ఆటోలో ఎక్కడికో వెళ్ళింది. పురుషోత్తమరావు రాకముందే, వెళ్ళిన ఆటోలోనే తిరిగి వచ్చేసింది. పురుషోత్తమరావు తిరిగి వచ్చిన కొన్ని నిముషాలకు శ్రీహరి బైటకు వెళ్ళాడు. ఎప్పుడు తిరిగొచ్చాడో తెలియదు. అలవాటు ప్రకారం సులోచన వెళ్ళొచ్చిన ఆటో నంబర్ని చూసిన ఏడుకొండలు,లావణ్య అడగడంతో గుర్తుచేసుకుని చెప్పాడు. ఆ ఆటోని పట్టుకుని, ఆదివారం రాత్రి సులోచన ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్న లావణ్య ఆశ్చర్యానికి మేరలేకపోయింది. మర్నాడు మధ్యాహ్నం ఇన్స్పెక్టర్ ‘లక్ష్మీనిలయానికి’ వెళ్ళేసరికి పురుషోత్తమరావు ఇంటివద్ద లేడు. లక్ష్మీదేవి కునుకు తీస్తోంది. గుడ్డీ తన గదిలో ఆడుకుంటోంది. ‘‘గుడ్ ఆఫ్టర్ నూన్, ఆంటీ!’’ అంటూ ఎదురొచ్చిన గుడ్డీని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది లావణ్య. పాప గదిలో కూర్చున్నారిద్దరూ. పాప తన స్కూల్ కబుర్లూ, ఫ్రెండ్స్ గురించీ గలగలా మాట్లాడేస్తూంటే, మురిపెంగా చూసింది లావణ్య. ఆల్బమ్ ఒకటి తెచ్చి చూపిస్తూ, ‘‘ఈ ఫొటోలన్నీ నేనే తీశాను, ఆంటీ!’’ అంది పాప. పెర్ఫెక్ట్ గా వచ్చిన ఆ ఫోటోలను చూసి, ఆరేళ్ళ ఆ చిన్నారి ట్యాలెంట్ కి ఆశ్చర్యపోయిందామె. పాప తన కెమెరా తెచ్చి చూపించింది. ఫారిన్–మేడ్ హై–డెఫినిషన్ మినీ కెమేరా అది. ఫోటోలో డేటు, టైమూ కూడా పడతాయి. లావణ్య చూపులు ఆల్బమ్‌లోని లక్ష్మీదేవి ఫొటో మీద పడ్డాయి. గదిలో బీరువా దగ్గర నిలుచుని ఉందావిడ. వజ్రాలహారం దాచిన బీరువా అది. ఫొటో మీద ఆ ఆదివారపు తేదీ, రాత్రి తొమ్మిదింపావు సమయమూ ప్రింట్ అయ్యాయి. ఆవిడ పైపెదవి మీద ఎడమభాగంలో స్పష్టంగా కనిపిస్తూన్న పుట్టుమచ్చ ఫొటోగ్రఫీలో గుడ్డీకి ఉన్న నైపుణ్యతను చాటుతోంది. ‘‘నాన్నమ్మకు ఫొటో తీయించుకోవడం ఇష్టం ఉండదు. ఆ రాత్రి తాను బీరువాను తెరుస్తూండగా, ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించిన తన రూపాన్ని తనకు తెలియకుండా క్లిక్ చేసేశాను’’ అంది గుడ్డీ నవ్వుతూ. ‘‘గుడ్ వర్క్!’’ అని మెచ్చుకుంది లావణ్య. ‘‘ఫొటో బావుంది. నేను తీసుకోనా?’’ అనడిగింది. ‘‘నా దగ్గర ఇంకో కాపీ ఉంది’’ అంటూ, దాన్ని తీసిచ్చింది గుడ్డీ.తనకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో ప్రైజులు వచ్చాయంటూ, ఆ ప్రైజులను, తాను వేసిన వేషాల ఫొటోలనూ ఉత్సాహంగా చూపించింది గుడ్డీ. తనను సులోచన ఆంటీ తయారు చేసేదని చెప్పింది. లక్ష్మీదేవి నిద్రలేవడంతో హాల్లోకి వెళ్ళింది లావణ్య. ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూంటే, పురుషోత్తమరావు కూడా వచ్చాడు. ‘‘హారం ఆచూకీ ఏమైనా తెలిసిందా?’’ అనడిగాడు.లేదనీ, కొన్ని క్లారిఫికేషన్స్ కోసం వచ్చాననీ చెప్పింది లావణ్య. ఇద్దరూ స్టడీరూమ్‌లో కూర్చున్నారు. ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు తీసుకున్న విషయం ప్రస్తావించింది ఆమె. తానే భార్యకు పిల్స్ ఇచ్చినట్టూ, ఆమె వాటిని మింగి మంచినీళ్ళు తాగి పడుకున్నట్టూ చెప్పాడు అతను. ‘‘ఆదివారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళారు మీరు?’’ హఠాత్తుగా ప్రశ్నించిందామె. ‘పురుషోత్తమరావు తమ్ముడి కుటుంబం ఆ ఊళ్ళోనే ఉంటోంది. ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ కుటుంబాన్ని భార్యకు తెలియకుండా ఆదుకుంటున్నాడు అతను. ఆరోజు రాత్రి మరదలికి మెడికల్ ఎమెర్జెన్సీరావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి, తమ్ముడు అతనికి ఫోన్ చేశాడు. పురుషోత్తమరావు వెళ్ళి కొంత డబ్బు ఇచ్చివచ్చాడు.’‘‘తమ్ముడి కుటుంబానికి సాయం చేయడం నా భార్యకు ఇష్టముండదు. అందుకే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాను’’ అన్నాడు పురుషోత్తమరావు. తరువాత లక్ష్మీదేవిని పిలిచింది లావణ్య. ‘‘మీకు నిద్రలో లేచి తిరిగే అలవాటుందా?’’ అనడిగింది. లేదన్నదావిడ.‘‘ఆదివారం రాత్రి నిద్రమాత్రలు వేసుకుని పడుకుని, మర్నాడు తెల్లవారేంత వరకు లేవలేదన్నారు మీరు. కానీ, అదే రాత్రి తొమ్మిదింపావుకు హారం దాచిన బీరువాను ఎలా తెరిచారు?’’ ఆవిడ ముఖ కవళికలను గమనిస్తూ అడిగింది లావణ్య. ‘‘మీరు బీరువా తెరుస్తూండగా తీయబడ్డ ఫొటో నా వద్ద ఉంది’’. ఆశ్చర్యంగా చూసిందావిడ. ‘‘నా కొడుకు, కోడలూ పోయాక నేను ఫొటో దిగడం మానేశాను. ఎందుకంటే, మేమెంతో ముచ్చటపడి ఫ్యామిలీ అంతా స్టూడియోకి వెళ్ళి ఫొటో తీయించుకున్న మూడోరోజునే ఆ ప్రమాదం జరిగింది’’ బాధగా అందావిడ. ‘‘కనుక నా ఫొటో మీ దగ్గర ఉందంటే నేను నమ్మను’’. గుడ్డీ తీసిన ఫొటోని ఆవిడకు చూపించలేదు లావణ్య.అక్కడి నుంచి ఔట్ హౌస్ కి వెళ్ళింది. సులోచన ఇంట్లోనే ఉంది. శ్రీహరి బయటకు వెళ్ళాడంది. ‘‘అమ్మగారి హారం ఆచూకీ ఏదైనా తెలిసిందా మేడమ్?’’ అనడిగింది.‘‘ఇంకా లేదు. ప్రతి నేరస్తడూ ఏదో ఒక పొరపాటు చేయక మానడు. అది చిన్నదైనా సరే. ఆ పొరపాటు కోసమే గాలిస్తున్నాను’’ అంది లావణ్య. ‘‘అన్నట్టు, పురుషోత్తమరావుగారి డ్రైవర్ ఎలాంటివాడు?’’. మంచివాడేననీ, తన పనేదో తనదేకానీ, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడనీ చెప్పింది సులోచన. లావణ్య శ్రీహరి కోసం వెయిట్ చేయలేదు. అతని గురించి ఆల్రెడీ విచారించింది. దుబాయ్‌లో ఓ గొడౌన్లో పని చేసేవాడతను. యజమాని సక్రమంగా జీతం చెల్లించకుండా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూండడంతో, ఇండియాకి తిరిగి వచ్చేశాడు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆదివారం రాత్రి పక్కవీధిలో చివరగా ఉన్న ఇంటికి వెళ్ళాడతను. ఆ ఇంట్లోని సర్వెంట్ మెయిడ్ తో అతనికి అక్రమ సంబంధం ఉంది. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకుంటూంటారు ఇద్దరూ.శంకరం ఆదివారం రోజున తాను లక్ష్మీనిలయానికి వెళ్ళినట్టూ, అందరూ పడుకోవడంతో కాసేపుండి తిరిగి వెళ్ళిపోయినట్టూ చెప్పాడు. సిగరెట్ కాలుస్తూ హాల్లోనే కూర్చున్నాడనీ, హారం సంగతీ తనకు తెలియదనీ చెప్పాడు. వెళ్ళిపోతూ కాలుస్తూన్న సిగరెట్‌ని ఆర్పేసి కిటికీలోంచి బయటకు విసిరేసినట్టు చెప్పి, ఇన్స్పెక్టర్ చూపించిన సిగరెట్ పీక తనదేనని ఒప్పుకున్నాడు. లావణ్యకు పాత సినిమా పాటలంటే ఇష్టం. ఇంట్లో రికార్డర్లో వస్తూన్న దేవదాసు సినిమాలోని పాటలు వింటూ, కేసు పేపర్స్ ని స్టడీ చేస్తోంది. ‘జగమే మాయా’ పాట అయిపోగానే, ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ మొదలయింది. తన్మయత్వంతో ఆలకిస్తూన్న లావణ్య, ఉన్నట్టుండి ఉలికిపడింది. హఠాత్తుగా గుడ్డీ చెప్పిన విషయం ఒకటి స్ఫురణకు వచ్చింది. ‘ఎస్! ఈ కేసులో నేను ఎదురు చూస్తూన్న బ్రేక్ త్రూ ఇదే!’ అనుకుంటూ చటుక్కున లేచి కూర్చుంది.తిన్నగా గుడ్డీ గదిలోకి వెళుతూన్న ఇన్స్పెక్టర్ని చూసి విస్తుపోయారు పురుషోత్తమరావు, లక్ష్మీదేవిలు. ‘‘గుడ్డీ! ఆ రోజు నువ్వు తీసిన నాన్నమ్మ ఫొటో మిర్రర్ ఇమేజ్ అన్నావు కదూ?’’ అనడిగింది లావణ్య. ఔనంది ఆ పిల్ల. లక్ష్మీదేవిని బీరువా వద్ద గుడ్డీ చెప్పిన విధంగా నిలుచోమంది లావణ్య. తాను గుడ్డీ గదిలో నిలుచుని చూసింది. నిలువుటద్దంలో ఆవిడ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. హుషారుగా గుడ్డీ బుగ్గమీద ముద్దాడింది. రాత్రి తొమ్మిది గంటలకు మల్కాజ్‌గిరిలోని ఓ ఇంట్లోంచి బయటకు వచ్చారు ఓ యువతి, ఓ యువకుడు. పైటచెంగు ముఖానికి కప్పుకుందామె. అతని తలమీద ఫెల్ట్ హ్యాట్ ఉంది. చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉంది. ఓ పాత అంబాసడర్ కారులో కూర్చున్నారు. అతను డ్తైవ్ చేస్తూంటే, ఆమె అతని పక్కను కూర్చుంది. కారు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోగానే దిగి స్టేషన్లోకి వెళ్ళారు వాళ్ళు. క్లోక్ రూమ్‌కి వెళ్ళి రశీదు ఇచ్చి, చిన్న బ్రీఫ్ కేసు తీసుకున్నారు. అనంతరం కదలడానికి సిద్ధంగా ఉన్న నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయారు. వెనుక నుంచి ఎవరో చేయి పట్టుకుని లాగుతున్నట్టనిపించి వెనక్కు తలతిప్పిన ఆ యువకుడు, మఫ్టీలో ఉన్న ఇన్స్పెక్టర్ లావణ్యను చూసి ఖంగుతిన్నాడు. అతను పారిపోబోతూంటే, చేతిని చాకులా బిగించి అతని మెడపైన కొట్టింది లావణ్య. గిలగిలలాడుతూ నేల కరచాడు. ఆమె, అతని చేతిలోని బ్రీఫ్ కేసును లాక్కుని, ప్లెయిన్ క్లోత్స్ లో ఉన్న తన మనుషులకు సైగచేయడంతో, అతనికి అరదండాలు తగిలించడమే కాక, ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పెట్టె తెరచి చూసిన లావణ్య కళ్లు మెరిసాయి. ‘లక్ష్మీనిలయం’లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఇన్స్పెక్టర్ లావణ్య. వజ్రాలహారంతోపాటు నేరస్తులనూ హాజరుపరచింది. ‘‘దురాశ బహుచెడ్డది. సులోచన నిజాయితీపరురాలే అయినా, డ్రైవర్ నూకరాజు ప్రోద్బలంతో చోరీకి పూనుకుంది. గతరాత్రి ఇద్దరూ వజ్రాలహారంతో ఉడాయించబోతూంటే రెడ్ హ్యాండెడ్ గా çపట్టుకున్నాం’’ చెప్పింది లావణ్య. ‘‘అసలు మీ అనుమానం సులోచనపైకి ఎలా వచ్చింది?’’ ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తమరావు. ‘‘ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయింది. కానీ, అదే రాత్రి తొమ్మిదింపావుకు ఆవిడ హారాన్ని దాచిన బీరువాను తెరుస్తూండగా అద్దంలో చూసి ఫొటో తీసింది గుడ్డీ. ఒడ్డూ పొడవూ ఇంచుమించు లక్ష్మీదేవిలాగే ఉంటుంది సులోచన. ఎవరికీ అనుమానం రాకుండా ఆవిడలా వేషం వేసుకుంది. పెదవి మీది పుట్టుమచ్చను దిద్దుకోవడం కూడా మరచిపోలేదు. బీరువా తాళపుచెవులు లక్ష్మీదేవి తలగడ కింద ఉంటాయన్న సంగతి ఆమె ఎరుగును. తాళం చెవులను సంగ్రహించి బీరువా తెరచి హారాన్ని దొంగిలించింది. తరువాత వేషం మార్చుకుని దాన్ని తీసుకువెళ్ళి నూకరాజుకు ఇచ్చి వచ్చింది. అతని వలపులో చిక్కుకున్న సులోచన అయిష్టంగానే అతని పథకాన్ని అమలుపరచింది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు ఓ సినీకవి. కానీ అది ఘోరమైన పొరపాటని ఈ కేసు నిరూపించింది గుడ్డీ తీసిన ఫొటో నా పరిశోధనలో అత్యంత కీలకమైన క్లూ అయింది. నేరం చేసే సమయంలో ఆ వ్యక్తి యొక్క మానసికస్థితి నార్మల్‌గా ఉండదు. అందువల్ల ఏదో ఒక పొరపాటు చేయక మానడు. సులోచన విషయంలోనూ అదే జరిగింది’’ చెప్పింది లావణ్య. ‘‘పుట్టుమచ్చను ఎడమ వైపుకు బదులు కుడివైపు పెట్టుకుంది. అందుకే అద్దంలో అది ఎడమవైపు కనిపించింది. అదే ఆమెను పట్టిచ్చింది. అండ్ ద క్రెడిట్ గోస్ టు ద లిటిల్ గుడ్డీ!’’.హాల్లో చప్పట్లు మార్మోగుతుంటే సులోచన ఖిన్నవదనంతో తల వంచుకుంది. -
గుండెల్లో గుడారం
సాయంత్రమైతే గిర్రున తిరిగే సర్కస్ లైటు ఫోకస్ ఊరిమీద పడుతుంది.పిల్లలూ పెద్దలూ సంబరంగా బయలుదేరి వెళతారు.పులులూ సింహాలు హంసల్లా అటు నుంచి ఇటుకు ఇటు నుంచి అటుకు ఎగిరే మనుషులు జోకర్లు...సర్కస్ గుడారం ఇచ్చే ఆనందం ఎంతో.కాని ఆ గుడారాన్నే జీవితం చేసుకున్న వాళ్ల మధ్య ఎన్నో అనుబంధాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. నవ్వులూ ఏడుపులూ ఉంటాయి.వాటిని మొదటిసారి చూపించి ప్రేక్షకుల గుండెల్లో గుడారం వేసిన సీరియల్ ‘సర్కస్’. ఊయలలూగుతున్న రంగు రంగుల చిలుకలు.. సైకిల్ తొక్కుతూ గిరి గిరా తిరగేసే భారీ ఏనుగు.. రింగ్ మాస్టర్ చెప్పినట్టు ఆడే పులులు.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సన్నని తీగలమీద జెండాలు పట్టుకొని మరీ అవలీలగా తిరిగే అమ్మాయిలు.. ఒక వైపు నుంచి మరో వైపుకు గాల్లోనే ఫల్టీలు కొట్టే అబ్బాయిలు..ఇవన్నీ చూస్తున్న పిల్లలు నవ్వులతో కేరింతలు కొట్టారు. పెద్దలు ఊపిరి బిగబట్టి చూశారు. ఇది సినిమా కాదు.. సర్కస్. ఈ పేరు వింటూనే మీ చెవుల్లో ఓ పాట ‘సర్కస్ హై భాయ్ సర్కస్ హై.. ఏ దునియా ఏక్ సర్కస్ హై.. రంగ్ బిరంగీ సర్కస్ హై.. ’ అంటూ రింగులుగా తిరుగుతుండాలి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా కాకుండా జనాలకు ఎంటర్టైన్మెంట్కు సర్కస్ పెద్ద వేదికగా ఉండేది. కొన్ని సర్కస్ కంపెనీలు చిన్నా పెద్ద టౌన్లకు కూడా వెళ్లి నెలా రెండు నెలలు వినోదాన్ని పంచి తిరిగి మరో చోటుకు వెళ్లేవి. అలాంటి రోజుల్లో ప్రతి ఇంటికి సర్కస్‌ను మోసుకొచ్చింది దూరదర్శన్. 1989లో పంతొమ్మిది వారాల పాటు సర్కస్ ఫీట్లతో ఇంటిల్లిపాదినీ తన ప్రపంచంలోకి లాక్కొచ్చింది. ప్రపంచంలో ఉన్నదంతా సర్కస్‌లో ఉందని చూపింది. ఎందుకంటే సర్కస్ అనేదే ఓ ప్రపంచం కాబట్టి. అక్కడ రాగద్వేషాలున్నాయి, గుండెదాటని కష్టాలున్నాయి, ఎగిసిపడే కెరటాలున్నాయి. మంచి ఉంది. చెడు ఉంది. దీని కోసం రచయిత దర్శకులు అజీజ్ మిర్జా, కుందన్ షాహ్‌లు కలిసి ఒక సర్కస్ ట్రూప్నే తయారుచేశారు. దీంట్లో షారూఖ్ ఖాన్, రేణుకా సహానే, అశుతోష్ గోవరికర్ వంటి ముఖ్యులు నటించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రసారమైన ఈ సీరియల్‌ని పిల్లలు సర్కస్‌కి వెళ్లినంతగా ఎంజాయ్చేశారు. కళాకారుల నిలయం సర్కస్ అనేది కొంతమంది కలిసి పనులు చేసుకుంటూ, తమకు వచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉండే ఒక కంపెనీ మాత్రమే కాదు. కొంతమంది చుట్టూత కలిసి ఉండే జీవితం. అది అపోలో సర్కస్. దాని యజమాని బాబూజీ. సర్కస్ కంపెనీలో ఉన్నవారందరినీ తన బిడ్డల్లానే చూసుకునేంత ఉదాత్తుడు. పై చదువుల కోసం కొడుకు శేఖరన్ని వేరే చోట ఉంచి చదివిస్తుంటాడు. సర్కస్‌లోని కష్టనష్టాలేవీ కొడుకుకు తెలియవు. రోజు రోజుకూ సర్కస్‌ను నడపడం భారంగా అనిపిస్తుంటుంది బాబూజీకి. అయినా, దాంట్లోనే పుట్టి పెరిగిన బాబూజీ సర్కస్ని కాపాడుకోవడమే ధ్యేయంగా జీవిస్తుంటాడు. ఒకసారి జంతువులను అమ్మే సింగ్ బాబూజీని కలిసి, తన దగ్గర ఉన్న ఎలుగును కొనుగోలు చేయమని అడుగుతాడు. కానీ, బాబూజీ తనకున్న ఆర్థిక కష్టాల గురించి చెప్పి వద్దంటాడు. చదువు పూర్తయి తన కొడుకు శేఖరన్ సర్కస్‌కి వస్తున్నాడని అందరికీ చెబుతాడు బాబూజీ. శేఖరన్ చిన్ననాటి నేస్తం మరియతో పాటు అంతా సంతోషిస్తారు. శేఖరన్ వచ్చాక సర్కస్‌లో అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ముందు వద్దనుకున్న ఎలుగును శేఖరన్ కోసం కొనడానికి సిద్ధమవుతాడు బాబూజీ. అయితే, శేఖరన్ సర్కస్ తనకు వద్దని, సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెడుతుంటాడు. కొడుకు మాట కాదనలేక బాబూజీ మౌనంగా బాధపడుతుంటాడు. సర్కస్ పనులు వదిలేసి తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తిరిగి స్నేహితుల వద్దకు వెళ్లిపోతాడు శేఖరన్. కొడుకు మీద ఆశ వదులుకున్న బాబూజీ సర్కస్‌లో క్లిష్టమైన ఫీట్ చేయడానికి సాహసిస్తాడు. ఆ సమయంలో గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరుతాడు. విషయం తెలిసి శేఖరన్ తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి బాగు కోసం సర్కస్ ఎప్పటిమాదిరిగానే నడుస్తుందని, తానే దగ్గరుండి చూసుకుంటానని మాట ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. శేఖరన్ ఆధ్వర్యంలో సర్కస్‌కి కొత్త రూపు వస్తుంది. ప్రమాదాల ప్రయత్నం తాగుబోతైన జొనాథన్‌ని బాబూజీ సర్కస్ నుంచి బయటకు వెళ్లగొట్టకుండా, తాగడానికి డబ్బులు కూడా ఇవ్వడం కంపెనీలో చాలా మందికి అర్థం కాదు. అతని వల్ల కంపెనీకి ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు భావిస్తారు. అయితే, జొనాథన్ అపోలో సర్కస్‌కు విశ్వసనీయుడని తెలుసుకుంటారు. జొనాథన్ యువకుడిగా ఉన్నప్పుడు అపోలో సర్కస్‌లో ట్రపీజ్ ఆర్టిస్ట్. ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోతాడు. దీంతో తప్పనిసరిగా అతను తన కళ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కూతురు మరియను తనలా ట్రపీజ్ ఆర్టిస్ట్ కావాలని, సర్కస్ ఫీట్లు చేయాలని బలవంతం చేస్తాడు. సర్కస్‌లోని వారంతా జొనాథన్ తపనను అర్ధం చేసుకొని, సర్దిచెబుతారు. కూతురుని క్షమించమని అడుగుతాడు జొనాథన్. తండ్రి తపించే కళను తనూ నేర్చుకోవాలని రోజూ ఫీట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది మరియ. కానీ, తన వల్ల కాకపోవడంతో బాధపడుతుంది. మాజీ ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ మాటలతో స్ఫూర్తి పొందిన మరియ మళ్లీ ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంతో మరియ విజయవంతం అవడంతో జొనాథన్ సంతోషంతో పొంగిపోతాడు. సర్కస్‌లోని వారంతా అభినందిస్తారు. ప్రియమైన సర్కస్ సర్కస్ కంపెనీయే తమ ఇల్లుగా భావించే అందరి మధ్య ఒక విడదీయ లేని ప్రేమ ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లల ఆలనపాలనా చూడడటం, పిల్లలు పెద్దవాళ్లతో కలిసిపోవడం.. కుటుంబాన్ని తలపిస్తుంది. అయితే, సర్కస్ సీరియల్ అనగానే షారూఖ్, రేణుకా సహానే ప్రేమే మన కళ్ల ముందు కదులుతుంది. అయితే, అంతకు ముందే షామిలీ– ఆదిత్య ప్రేమ కళ్లకు కడుతుంది. సర్కస్‌లోనే వయోలిన్ ఆర్టిస్ట్ ఆదిత్య, ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ ప్రేమించుకుంటారు. అయితే, షామిలీని రింగ్ మాస్టర్ సుబృద్ ప్రేమిస్తాడు. ఆదిత్య మీద తప్పుడు నేరం మోపి జైలు శిక్ష పడేలా చేస్తాడు సుబృద్. ఆ తర్వాత షామిలీని పెళ్లి చేసుకుంటాడు. పదేళ్ల తర్వాత ఆదిత్య జైలు నుంచి తిరిగి వస్తాడు. విషయం తెలిసిన షామిలీ చాలా బాధపడుతుంది. షామిలీ తిరస్కారం సుబృద్ని బాధిస్తుంది. ప్రదర్శన మధ్యలో సుబృద్ పులి పంజా బారిన పడతాడు. పెళ్లి తర్వాత ట్రపీజ్ ఆర్ట్‌కు దూరమైన షామిలీ పదేళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేసి తన ఫీట్లతో తిరిగి పాత వైభవాన్ని పొందుతుంది. శారీరక వైకల్యంతో బాధపడే కళందర్ తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమయ్యాడో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాడు. దూరమైన తల్లిదండ్రులు ఒకరోజు కళందర్ని సర్కస్‌లో కలుసుకుంటారు. కళందర్ తమ కొడుకు జగదీష్ అని, చిన్నప్పుడే తమ నుంచి దూరమైన బిడ్డ అని, తమతో పాటు రమ్మంటారు. ఈ సర్కసే తన ఇల్లు అని, ఇదే తన ప్రపంచం అని చెప్పి కంటతడిపెట్టిస్తాడు కళందర్. అపోలో సర్కస్‌లో జరుపుకునే పండగలు, జంగూమంగూ చేసే కామెడీ సర్కస్ అంతా సందడిని నింపుతుంది. మనస్ఫూర్తిగా బాధ్యత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన∙బాబూజీ సర్కస్‌లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. సంబరంగా జరుగుతున్న సర్కస్ ప్రదర్శన మధ్యలోనే బాబూజీ ప్రాణాలు వదలుతాడు. సర్కస్‌ను నడపడం తన వల్ల కాదంటాడు శేఖరన్. అంతా బాధలో మునిగిపోతారు. అర్థరాత్రి నిద్రపట్టక కూర్చున్న శేఖరన్‌కి తన తండ్రి ఆ సర్కస్‌లోనే కనిపిస్తుంటాడు. శేఖరన్ వద్దకు వచ్చిన మరియ తెల్లవారేసరికి సర్కస్‌ను వదిలిపెట్టి నీదైన ప్రపంచంలోకి వెళ్లిపొమ్మంటుంది. శేఖరన్ని తీసుకెళ్లడానికి అతని స్నేహితుడు వస్తాడు. బయటి వరకు వచ్చిన శేఖరన్‌కి తండ్రి ఫొటో లోపలే మర్చిపోయానని గుర్తొచ్చి తిరిగి సర్కస్‌లోకి వెళతాడు. అక్కడ తండ్రి తనను విడిచి వెళ్లద్దని అదృశ్యంగా చెప్పే మాటలు శేఖరన్లో మార్పు తీసుకువస్తాయి. శేఖరన్ మనస్ఫూర్తిగా సర్కస్ బాధ్యతలు స్వీకరించడంతో సీరియల్ ముగుస్తుంది. ఒక యువకుడు ఇబ్బందుల్లో ఉన్న తండ్రి సర్కస్‌ను తను తీసుకొని ఎలా మేనేజ్ చేశాడన్నదే ఈ కథ. సర్కస్ కంపెనీతో తండ్రికి ఉండే బంధం, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొడుకుతో పాటు కంపెనీలో ఉన్నవారిందరూ పడే తపన మన కళ్ల ముందు కదలాడుతుంది. – ఎన్.ఆర్ బాలీవుడ్ బాద్షా, సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ముప్పై ఏళ్ల క్రితం అప్పుడప్పుడే నటనలో నిలదొక్కుకోవడానికి శ్రమిస్తున్న రోజులు. షారూఖ్‌కి ఫస్ట్ బ్రేక్ ఫౌజీ సీరియల్‌తో టీవీ అవకాశం ఇచ్చినా ఇప్పటికి షారూఖ్ ఇండస్ట్రీలో ఫస్ట్ డేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్కస్ సీరియల్ ప్రస్తావనే వస్తుంది. దూరదర్శన్ షారూఖ్ నటనకి సర్కస్‌తో ఓ పెద్ద వేదికనిచ్చింది. -
వింతైన భోజనంబు
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటుంది భారతీయత. ఆహారాన్ని గౌరవించాలంటుంది పాశ్చాత్య నాగరకత. ‘ఆకలి..’ అన్న వాళ్లకు అన్నం పెట్టిన డొక్కా సీతమ్మను చదువుకున్నాం. అన్నం వడ్డించి ‘చుక్కలు చూపించే’ చైన్ హోటళ్లనూ చూస్తున్నాం. ఇవేవీ కాదు.. మంచి భోజనం చేస్తే, ఆ జ్ఞాపకం మధురంగా ఎప్పటికీ నిలిచి ఉండాలంటున్నారు సుష్మ తోట. ‘ఆర్ట్ పీస్‌ని అల్మరాలో దాచుకుంటారు. విలువైన ఆభరణాన్ని బీరువాలో దాచుకుంటారు. మంచి భోజనం చేసిన అనుభూతిని మనసులో భద్రంగా దాచుకుంటారు’అన్నారామె. ‘తోట’లో పూచిన పువ్వు తెలంగాణలో ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. ఆయన కోడలే సుష్మ. విభిన్నంగా, వైవిధ్యంగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్న అమ్మాయి. అదే సమయంలో సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని నమ్మే అమ్మాయి కూడా. పుట్టపర్తి సత్యసాయి స్కూల్లో చదివిన పదేళ్ల చదువే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్తారు సుష్మ. పెళ్లయి అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక చిత్రకారుడిగా మామగారు సమాజాన్ని చూసే దృష్టికోణం తనను చాలా ప్రభావితం చేసిందని, తన ఆలోచనలను విస్తరింప చేసిందని చెప్తూ.. ‘‘వాటన్నింటి కలబోతే.. ఇప్పుడు సమాజంలో ధైర్యంగా నిలబడిన సుష్మ’’ అని తన గురించి తను చెప్పారామె. ఆహారం.. నా సబ్జెక్ట్ ‘‘నాకు సైన్స్ ఇష్టం. డాక్టర్ కావాలనుకున్నాను. స్కూల్‌డేస్ నుంచి కూడా మ్యాథ్స్‌లో టాపర్‌ని. దాంతో ఇంజనీరింగ్‌లో చేరమన్నారు అమ్మానాన్న. వాళ్ల సలహాకు నా కోరికను కలగలిపి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ చేశాను. సైంటిస్ట్ అయ్యే అవకాశం వచ్చింది. అమ్మానాన్న నన్ను మిస్ అవుతారని యు.ఎస్. వెళ్లలేదు. పీజీలో సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌లో నా థీసీస్ టాపిక్ ‘ఆహార్’. ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు అది మనుషుల స్నేహ సంబంధాలను పెంచుతుంది. అదే ఆహారం కొరతలో ఉన్నప్పుడు మనుషులలో స్వార్థ భావన కలుగుతుంది. మనుషుల మధ్య స్నేహాన్ని పెంచడానికి, అంతరాలను తుంచడానికి ఆహారాన్ని మించిన మాధ్యమం మరోటి ఉండదని నా ఉద్దేశం. నేను ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి కారణం అదే. అంతరాలు తొలగిపోతాయి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి సహపంక్తి భోజనాలు మనకు తెలిసినవే. కులాలు, మతాలతో వేరయి ఉన్న సమాజంలో ఆ గిరిగీతలను చాపకూడుతో చెరిపి వేశారు. ఉద్యమం ఊపందు కోవడానికి వంటావార్పుతో నాయకులు, అనుచ రులు మమేకం కావడాన్నీ చూశాం. ఇవి కాకుండా.. వీటికి అతీతంగా సమాజంలో కొత్త అంతరాల పొరలు ఏర్పడుతున్నాయి. అధికారులు– ఉద్యోగుల మధ్య కనిపించని లేయర్లు రాజ్యమేలుతుంటాయి. ఆ లేయర్లను తొలగించడానికి కుకింగ్ ఈవెంట్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక కంపెనీ సీఈవో, ఉద్యోగులు అంతా కలిసి వండుతారు, భోజనం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో సీఈవోలు వంట తెలిసిన ఉద్యోగికి సహాయంగా పనిచేస్తారు. మొత్తం ప్రోగ్రామ్ని మా కలినరీ లాంజ్ ప్రొఫెషనల్ షెఫ్‌లు పర్యవేక్షిస్తుం టారు. అవసరమైన సలహాలతో పాటు సహాయం చేస్తారు కూడా. కలివిడితనాన్ని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ బాగా పని చేస్తోంది కూడా. భోజనం... కనిపించని అంతస్థుల పొరలను సునాయా సంగా ఛేదిస్తుంది. ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎంటర్ౖ టెన్మెంట్ని జోడించాను. ఈ కాన్సెప్ట్‌ని విస్తృతం చేయడం ద్వారా సోషల్ జస్టిస్‌కి బాటలు వేయ గలననే నమ్మకం కూడా ఉంది. వండే చేతులకు గౌరవం అది ఇల్లయినా, హోటల్ అయినా సరే.. వండే వాళ్లె ప్పుడూ తెర వెనుకనే ఉండిపోతుంటారు. నేను ఫుడ్ ఎంటర్ ప్రెన్యూర్‌గా మారేటప్పుడు నా ప్రాజెక్ట్ హోమ్షెఫ్లకు వేదిక కావాలని అనుకున్నాను. మన సంస్కృతిలో తల్లిని అత్యుత్తమంగా గౌరవిస్తారు, అమ్మ చేతి వంట గురించి బయట గొప్పగా చెప్పుకుంటారు. కానీ రుచిగా తిన్నప్పుడు అమ్మకు ‘బాగా చేశావమ్మా’ అని ఒక్కమాట కూడా చెప్పరు. భార్య వంటయితే సరేసరి. బాగా లేకపోతే వంక పెట్టడంలో కనబరిచే జోరు... బాగా వండినప్పుడు ప్రశంసించడానికి రాదు. గృహిణికి గుర్తింపు రావాలి. అందరికీ అన్నీ బాగా చేయడం కుదరకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో కనీసం ఒక్కటైనా అద్భుతంగా వండగలి గిన నైపుణ్యం తప్పకుండా ఉంటుంది. ఆ ఒక్క వంటనే చేయవచ్చు. మేము అరేంజ చేసిన ఈవెంట్లో కస్టమర్‌కి వడ్డించేటప్పుడు ఈ వంటను ఫలానా వాళ్లు వండారని డిస్ప్లే చేస్తాం. అలాగే ప్రతి వంటకీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఆ కథ కూడా డిస్ప్లేలో ఉంటుంది. గృహిణులు వాళ్లింట్లో వండి పంపిస్తారు. మాతో ఇప్పటివరకు యాభైకి పైగా హోమ్షెఫ్లున్నారు. ఇక హోటల్ షెఫ్‌లు, నేషనల్, కాంటినెంటల్ షెఫ్‌లు అంతా కలిసి మూడు వందల మంది అనుసంధానమై ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా 75 థీమ్ లను రూపొందించాం. వంట చేయడం, వడ్డించడం, భోజనాన్ని ఆస్వాదించడం అన్నీ గొప్ప ఆర్ట్లే. కస్టమర్ కోరుకున్న మెనూలో అవథీ క్విజిన్ కోసం లక్నో బిరియానీ చేయాలంటే దినుసులను లక్నో నుంచి తెప్పించాలి. అలాగే మెనూలో తెలంగాణ వంట ఒకటి, రాయలసీమ రుచి, ఆంధ్ర పచ్చడి... ఇలా ఏది కోరితే అలా వడ్డించడానికి వీలుగా కస్టమైజ్డ్ మెనూ ప్లాన్ చేశాం’’ అని సుష్మ తాను వ్యాపారాన్ని డిజైన్ చేసిన విధానాన్ని చెప్పారు. రండి... నేర్పిస్తాం ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్లు ‘రండి... వండి వడ్డిస్తాం’ అని ఆహ్వానించాలి కానీ సుష్మ మాత్రం ‘రండి నేర్పిస్తాం’ అని ఆహ్వానిస్తు న్నారు. ‘హండీ టాక్స్’ పేరుతో ప్రతి నెలా నాలుగో శనివారం ఔత్సాహిక ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఈ రంగం ఎంత విస్తారమైనదో వివరిస్తున్నారు. పరిశ్రమ స్థాపించడానికి మార్గ దర్శనం చేస్తున్నారు. ‘‘బిరియానీ హండీనే మా సదస్సుకు ప్రధాన వేదిక. అందుకే దీనికి హండీ టాక్స్ అని పేరు పెట్టాం. ఇప్పటికి నెలకు ముప్పై మంది చొప్పున తొమ్మిది నెలల్లో 270 మందికి గైడెన్స్ ఇచ్చాం. హోమ్షెఫ్లుగా మాతో అనుసం ధానమైన గృహిణులు కొంతమంది ఇప్పుడు సొంతంగా బేకరీ వంటి వాళ్లకు ఇష్టమైన ఫుడ్ ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. నా కాన్సెప్ట్‌లో పిల్లలకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చాను. ఎందుకంటే పిల్లలకు వంటగదితో పరిచయం చేస్తే వాళ్లకు భోజనం మీద గౌరవం పెరుగుతుంది. వండడంలో శ్రమ తెలుస్తుంది కాబట్టి వృథాగా పారేయడానికి ఇష్టపడరు. పోషకాహారం మీద శ్రద్ధ పెరుగుతుంది, జంక్ తినడం మానేస్తారు. వాటితోపాటు పిల్లలు చేసిన మంచి వంటలతో ఒక బుక్ తెస్తున్నాం. అది ఎంత విస్తృతంగా ఉంటుందంటే... ఇందులో ఫేమస్ ఇటాలియన్ షెఫ్ నుంచి ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రధాన వంటకాల తయారీ, మన తెలుగిళ్లలో నోరూరించే వంటలతోపాటు మన పిల్లలు చేసిన మంచి వంట కూడా ఉంటుంది’’ అని ఆకలి తీర్చే పరిశ్రమ విస్తృతిని వివరించారామె. ఇలా మొదలైంది..! సుష్మ రెండేళ్ల కిందట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇరవై మంది ఫెండ్స్‌తో ఫిల్మ్‌నగర్‌లోని ‘కలినరీ లాంజ్’కి వచ్చారు. ఆ రావడమే ఆమెను ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.‘‘వైవిధ్యంగా చేయాలనుకున్న అనేక థీమ్స్‌కి ఫుడ్ ఇండస్ట్రీని మించినది మరోటి లేదనిపించింది. ప్రతి పనిలో వైవిధ్యతను కోరుకుంటూ కొత్త థీమ్‌లు రూపొందించడంలో నా మీద మా మామ ప్రభావం చాలా ఎక్కువ.. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కోసం రూపొందించే థీమ్స్‌లో ఆయన పాటించిన సంస్కృతి మూలాలను నేను ఆహారంలో ఆచరిస్తున్నాను. ఈ థీమ్స్ అన్నీ లోకల్ టాలెంట్‌ను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయని కలినరీ లాంజ్ ఫౌండర్ గోపితో కబుర్ల మధ్య చెప్పాను. ఈ ఆలోచనలన్నీ మరెక్కడో కాదు ఇందులోనే ప్రవేశపెట్టమని నాకు గొప్ప ఆఫరిచ్చారు. నా థీమ్స్‌ని విజయవంతంగా నాటగలి గాను. ఒక ఐడియాని సక్సెస్‌ఫుల్‌గా ప్లాంట్ చేసిన తర్వాత, ఆ ఐడియాని విస్తరింపచేయడమే ఎంటర్ ప్రెన్యూర్ లక్ష్యం. నా ముందున్న లక్ష్యమూ అదే. ట్వంటీ ట్వంటీకంతా ఐదు నగరాలకు విస్తరించాలనేది నా డ్రీమ్. నా కల నెరవేర్చు కుంటాననే నమ్మకం కూడా ఉంది’’ అంటున్నప్పుడు సుష్మ కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. వ్యాపార రంగంలో మహిళలు రాణిం చడం మొదలైంది. ఇంటిని చూసుకుంటూ వేళకు రుచిగా, ఆరోగ్యకరంగా వండిపెట్టే భార్యను ‘ఏముంది వండడమే కదా’ అని చులకన చేసే మగవాళ్లకు ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఓ పెద్ద కనువిప్పు. చక్కటి భోజనం వడ్డించిన భార్య, భర్త చెయ్యి కడుక్కుని వచ్చే లోపు టేబుల్ మీద బిల్లు పెట్టిందంటే... ఆ భర్త జేబు.. సగం నెలకే చిల్లు పడుతుందేమో! వాకా మంజులారెడ్డి పిల్లల కోసం... ఇస్తూనే ఉంటాను నేను పుట్టింది హైదరా బాద్లోనే. బీటెక్ జెఎన్టీయూలో చేశాను. ఆ తర్వాత రెండేళ్లు బెంగుళూరులో ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేశాను. ఇది కాదు.. మరేదో చేయాలనిపించింది. ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కొచ్చాను. నచికేత ఎన్జీవోతో ఆరేడేళ్లు జీతం తీసుకో కుండా పని చేశాను. పిల్లలకు పాఠాలు చెప్పాను. ఆ పిల్లల కోసం ఫండ్ రైజింగ్‌కి వెళ్లినప్పుడు కొన్నిసార్లు గిల్టీగా ఫీలయ్యాను. ‘ఇతరుల బాగు కోసం కొంత ఆర్థిక సహాయం చేయండి’ అని ఒకరిని అడిగే అర్హత నాకు లేదనిపించింది. నా వంతుగా కూడా స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసినప్పుడే మరొకరిని అడిగే యోగ్యత వస్తుందని పించింది. నేను చేసే సహాయం నా సంపాదనే అయి ఉండాలి తప్ప మా అమ్మానాన్నల డబ్బుతో కాదు కదా. అందుకే మళ్లీ ఉద్యోగంలో చేరాను. పెళ్లి తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా మారాను. నా బిజినెస్ బాగుంది. ఆదాయంలో ముప్పై శాతం డొనేట్ చేయగలుగుతున్నాను. ఏ పిల్లల్ని చూసినా నా పిల్లలే అనిపిస్తుంది. అందుకే ‘నచికేత’లో ఆశ్రయం పొందుతున్న పిల్లల కోసం డబ్బివ్వడం సంతోషాన్నిస్తోంది. నా కిడ్స్ ప్లానింగ్ సక్సెస్ అయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆశ్రమంలోని పిల్లలకు ఇవ్వడం మానను. ఇప్పుడు ఫుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా నేను నమ్మే సర్వ్ ఆల్లో భాగమే. ఆహారం అరమరికలను తొలగిస్తుంది, అనుబంధాలను బలపరుస్తుంది, ఆత్మీయతలను పెంచుతుంది, పరస్పర గౌరవాలను పటిష్టం చేస్తుంది. అలాగే నేను వైవిధ్యంగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్ నాకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తోంది. సుష్మ తోట, ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్, ఫ్యాషన్ డిజైనర్ -
పాదుకల శ్లోకం పుట్టుపూర్వోత్తరాలు
భారతంలో ధర్మరాజుని గురించి వ్యాసుడు వర్ణిస్తూ ధర్మమనే చెట్టులాంటివాడు ధర్మరాజు అనీ నకుల సహదేవులు పుష్పఫలాలు వంటి వారనీ– మాను భీమసేనుడనీ– అర్జునుడు చెట్టు నిలబడటానికి కారణమైన శక్తి అనీ మూలం శ్రీ కృష్ణుడనీ చెప్పాడు. ఇదే తీరుగా దుర్యోధనుడ్ని గురించి చెప్తూ రోషమయ మహావృక్షం దుర్యోధనుడని తెలియజేశాడు వివరించి.బోధి అనే పేరున్న వృక్షం కింద కూర్చుని తపశ్శక్తిని పొందిన కారణంగానే తాను తపశ్శక్తిమంతుడ్ని కాగలిగానని బుద్ధుడు కూడా ప్రకటించాడు.ఇలా చెట్లకీ తపస్సులకీ తాపసులకీ అనుబంధం గోచరిస్తుంది. అందుకే సాయి బహుశ ఈ వృక్షాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. ఆ చెట్టు నీడని తాను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి, రుణవిముక్తి కోసంమరికొన్ని వృక్షాలని పెంచవలసిన బాధ్యత తనకుందని గ్రహించి ‘వెండీతోట’ని స్వయంగా పెంచి పెద్ద చేయాలనుకునే ఆలోచనకి వచ్చి దాన్ని అమలు చేసుంటాడు. ఎండిన చెట్ల కొమ్మలనీ కాండాలనీ సమిధలుగా చేస్తూ ఇంతటి పవిత్ర నిస్వార్థ భావంతో మనకి ఎంతో ఆశ్రయాన్నిచ్చిన చెట్లకి సద్గతులు కలగాలనే భావంతో (జీవులే వృక్షాలనేది సాయి భావన) వాటి సమిధలని అగ్నిహోత్రంలో (ధుని)వేస్తూ ఆయా దేవతల్ని తృప్తి పరచవలసిందే నన్నాడు సాయి పరోక్షంగా. ఆ పవిత్రతని కాపాడేందుకే.... అంతటి పవిత్రమైనదీ నిస్వార్థంగా తనని ఆశ్రయించిన అందరికీ సేవచేసినదీ అయిన వృక్షానికి ఉన్న పవిత్రతని మరింత చేసేందుకూ, జనులందరికీ ఉపకారబుద్ధితో పాటూ చెట్టుకున్న గొప్పదనాన్ని తెలియజేసేందుకూ నిర్ణయించుకున్న సాయి ఆ చెట్టు మొదట్లోనే సాయి పాదుకలని ఉంచాలని భావించాడు మనసులో. ఆ పాదుకలు తనవి మాత్రమే కావాలని ఏనాడూ సాయి భావించలేదు.ఎక్కడైనా భగవంతుడు అనగానే వెంటనే పాదాలని కదా ముందుగా పూజిస్తాం. అంతటి శక్తిమంతుడైన భగవంతుని పాదాలని ఎవరి మటుకు వాళ్లు తల మీద పెట్టుకోలేరు కదా! ఆ కారణంగా అందరికీ భగవంతుని చరణాల సేవా సౌభాగ్యం కలగాలనీ, కలిగించాలనీ భావించిన సాయి భగవత్పాదుకలని ఆ పవిత్ర వేపచెట్టు మొదట్లో ఉండేలా చేయాలని సంకల్పించాడు.దేవాలయాల్లో కూడా శఠగోపం అని ఒకటుంటుంది. కిరీటం ఆకారంలో, దాన్ని మన శిరసు మీద పెడతారు. హిరణ్య గర్భాది సురాసురాణాం కిరీటమాణిక్య విరాజమండితం (ఉదాహరణకి శివాలయమైతే)శివస్య తత్పాదసరోజ యుగ్మం త్వదీయ మూర్ధాన మలంకరోతు’ అని చదువుతూ ఆ శఠగోపాన్ని భక్తుల శిరసు మీద ఉంచుతారు. ఆ శఠగోపం మీద ఏ దేవాలయపు శఠగోపమైతే ఆ దేవుని పాదుకలు (ధరించిన పాదరక్షలు) కనిపిస్తూ ఉంటాయి. ఆ శఠగోపం మన తలమీద పెట్టగానే ఆ దైవపాదుకలకి మన తలతో నమస్కారాలని చేసిన పుణ్యం మనకొస్తుందని దానర్థమన్నమాట. పాదుకలని ప్రతిష్ఠించిన తీరూ– అక్కడ చదవాల్సిన శ్లోకాన్నీ అర్థాన్నీ గురించి తెలుసుకుందాం! ఎవరైనా ‘సాయి’ అనగానే వెంటనే గుర్తొచ్చే శ్లోకం ‘సదా నింబవృక్షస్య... సాయినాథమ్’ అనే శ్లోకమే. ఒక బిడ్డ పుట్టిందనగానే అందరికీ చెప్పలేని ఆనందం కలుగుతుందనేది యథార్థమే గానీ, ఆ బిడ్డ పుట్టుకకి వెనుక తల్లి గర్భంలో కలిగిన అలజడిని దాదాపుగా ఎవరూ పట్టించుకోరు. అందుకే కాళిదాస మహాకవి అన్నాడు–మామిడి పండుని తినేవాడెవడూ దానిపువ్వు పుట్టడం గురించి ఆలోచించడని. మామిడి చెట్టుకి ఆనందం ఎప్పుడు కలుగుతుందట? మొదటిసారిగా తాను పువ్వుని వేసినప్పుడట. దాన్నే ‘పుష్పవతి’ కావడమంది శాస్త్రం.అలాగే ఈ పైననుకున్న శ్లోకం ఎలా పుట్టిందో దాని అర్థం వివరంగా ఏమిటో తెలుసుకుందాం! శ్లోకానికి నాంది ఇదీ! షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట అనే ఓ గ్రామం ఉంది. అక్కడ ఓ మహాతపశ్శక్తి సంపన్నులు ఉండేవారు. ఆయన్ని అందరూ ‘మహారాజ్’ అని పిలుస్తూ ఉండేవారు. దాంతో ఆయన ‘అక్కల్‌కోటకర్ మహారాజ్’గా వ్యవహారంలోకి వచ్చేశారు. వీరికి మహాభక్తుడు కృష్ణజీ(భాయి కృష్ణజీ అవీ బాగేకర్). ఆయనెప్పుడూ ఈ మహారాజ్ గారి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉండేవారు. ఓసారి మాత్రం కృష్ణజీకి అక్కల్కోట గ్రామానికి స్వయంగా వెళ్లాలనీ, అక్కడ ఉన్న మహారాజ్ గారి పాదుకల్ని దర్శించి స్వయంగా పూజించుకోవాలనీ ఓ ఆలోచన వచ్చింది. ఇక బయల్దేరి రేపు వెళ్దామనుకుంటూ ఉండగా ఆయనకి ఓ కలొచ్చింది. ‘కృష్ణజీ! ప్రస్తుతం నా నివాసస్థలం అక్కల్కోట కాదు షిర్డీ. అక్కడికి పోయి నా మీద ఉన్న నీ భక్తినంతా అక్కడ ఉంచి నీ పూజని అక్కడ చేసుకో!’ అని స్వయంగా అక్కల్‌కోటకర్ మహారాజుగారే చెప్పినట్లుగా తోచింది కలలో. వెంటనే కృష్ణజీ తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కల్కోటకి బదులుగా షిర్డీకి వెళ్లాడు. ఎందుకో అక్కడకి వెళ్లాక సాయిని దర్శించాక, అక్కడ వాతావరణం మరింత హృద్యంగా అనిపించాక వెంటనే వెళ్లిపోదామనిపించలేదు. దాంతో ‘రేపు వెడదాం – మాపు పోదాం’ అనుకుంటూ ఆయన ఆర్నెల్లపాటు అక్కడే సాయిని సేవించుకుంటూ ఉండిపోయారు.దాంతో ఆయనకి సాయితో మరింత అనుబంధం పెరిగిపోయింది. ఇలా షిర్డీలో వీరున్న కాలంలో బొంబాయి నుంచి డాక్టరూ(రామారావు కోరారే) ఆయనతో పాటు ఆయన కాంపౌండర్ కూడా వచ్చారు. దీంతో డాక్టరూ, కాంపౌండర్ వీరే కాక సగుణ్ –దీక్షిత్ అనే వారు కూడా బాగా సన్నిహితులయ్యారు ఈ ఆరునెలల కాలంలో. ప్రతినిత్యం ఇలా సాయి గురించిన భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాటల మధ్యలో– సాయి ప్రతినిత్యం ఏ వేపచెట్టు కింద కూర్చుని నిరంతర విరాగమూర్తిగా తపస్సు చేసుకుంటూ ఎండ, వాన, చలి అనే వాటిని లెక్క చేయకుండా ఉండి మొత్తానికి సిద్ధిని సాధించి సిద్ధుడయ్యాడో ఆ విశేషం అందరికీ ముందునాటికి అర్థమయ్యేలా తెలియజేయాలి’ అనే ఆలోచన ఒక్కరికి కాదు ఏకగ్రీవంగా వచ్చింది. ఆలోచన రావడమేమిటి? దాన్ని అమలు చేయాలనే నిర్ణయబుద్ధి కలిగిన డాక్టరుగారు షిర్డీలోనే పాదుకల నమూనాని రాయించారు. ‘మన బుద్ధికి తోచినట్లూ– అంతేకాక అక్కల్‌కోటకర్ మహారాజుగారి పాదుకలని చూసి వాటి పద్ధతిలో నమూనాని రాసినట్లూ ఉన్నాయి ఈ పాదుకలు. ఏ అతి ముఖ్యమైన శాశ్వతమైన పనిని చేయదలచినా అది లోపభూయిష్టంగాని, దుర్విమర్శకి లోనయ్యే తీరుగా గానిఉండకూడదు సరికదా– ఒకసారంటూ వాటికి ప్రతిష్ఠ జరిగిన పక్షంలో వాటిని మార్చడం కూడా సరికాదు. భక్తులందరికీ కూడా అదో తీరు భావన ఈ పాదుకల విషయంలో కలగచ్చు కూడా.అందుకని పాదుకలూ– నమూనా... మొదలైన విషయాల్లో గట్టి అనుభవం, అంతేకాక తపశ్శక్తీ పుష్కలంగా ఉన్న ఉపాసనీ మహారాజ్ గారు ఉండే ఖండోబా అనే పేరున్న ఆలయానికెళ్లారు. ఆయన ఆ పాదుకల నమూనాని చూస్తూనే ఎంతో సంతోషపడి – ఎన్నాళ్లకి ఈ మంచిపని జరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఆ పాదుకల నమూనాలో కొన్ని మార్పుల్ని చేస్తూ– పద్మం, శంఖం,చక్రం అనే వాటిని కూడా చేర్పించారు. ఈ వేపచెట్టుకున్న గొప్పదనాన్ని కూడా లోకానికంతటికీ తెలియజేయదలిచి ఓ శ్లోకాన్ని రాసి– దాన్ని ఓ ఫలకం మీద చెక్కించి ప్రతిష్ఠించడం బాగుంటుంది అని సూచించారు కూడా. పెద్దరికం పెద్దలెప్పుడూ కూడా ‘ఇలా చేయవలసిందే – చేసి తీరాలి’ అని ఆజ్ఞాపించరు. ఒకవేళ అవతలి వ్యక్తులు తమభావాన్ని అర్థం చేసుకోలేక తాము సూచించిన విధంగా చేయని పక్షంలో మనసు నొచ్చుకోవలసి వస్తుందనుకుంటూ కేవలం సూచన ప్రతిపాదన వంటి వాటినే చేస్తారు. దీన్నే ‘పెద్దరికం నిలుపుకోవడం’ అంటారు.పెద్దలు అలా చేసిన సూచనని తప్పక పాటించదలిచి ఆ సూచననే సలహానే ప్రతిపాదననే ఓ ఆజ్ఞగా భావించి చేయడమనేదాన్ని ‘భక్తి – శ్రద్ధ’ అంటారు. ఇలా తాము చెప్పిందాన్ని చెప్పినట్లుగా అవతలివారు పాటిస్తున్నారని అనిపిస్తే పెద్దలు – మరింత జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి రెండుమార్లు తర్కించుకుని మాత్రమే సూచన, సలహా, ప్రతిపాదనని చేస్తారు తప్ప యథాలాపంగా ఏమేమో చెప్పెయ్యరు. ఇలాంటి చరిత్రలని వింటూ ఉంటే ఎదుటివారికి ఎలా సలహా సూచన ప్రతిపాదన అనే వాటిని మనం చేయాలో అర్థమవుతుంది. ‘నా ఈ సలహాని, సూచనని పాటించని పక్షంలో... భోజనం చేయననీ, ఇంటికి రానేరాననీ, ముఖం చూడననీ’ ఈ తీరుగా పలకడం ఎంతటి పిల్లతనానికీ, పిల్లచేష్టలకీ ఉదాహరణమో... అర్థం చేసుకోగలుగుతారు ఆ తీరు లక్షణమున్నవాళ్లు. పైగా ఈ సూచన చేసిన ఆయన ‘ఉపాసని–మహారాజ్’ ఉపాసనని చేసి చేసి, ఉపాసన కారణంగా ‘ఉపాసని’ గానూ అందరి పట్లా ప్రేమా వాత్సల్యాలని చూపే కారణంగా మహారాజ్గానూ పేరు పొంది ‘ఉపాసనీ మహారాజ్’ అయ్యారు. అలాంటి వాళ్లకి రాబోయే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా చెప్పకపోవడం అనేది వారి గొప్పదనం – పెద్దరికం కూడా. అందుకే దేవతలు అలాంటి వారికి మాత్రమే భవిష్యత్ దర్శన శక్తినిస్తారు. దాన్ని సద్వినియోగ పరుచుకుంటే నిచ్చెన మెట్ల మీదుగా సాగిపోయేటట్లు ఎదిగిపోతారు. అలాంటి ప్రవర్తన లేని పక్షంలో వైకుంఠపాళి (పరమపదసోపాన పటం) ఆటలో పామునోట్లో పడి ఒక్కసారిగా కిందికి పడిపోయినట్లు అథఃపతనానికి వచ్చేస్తారు. సరే! శ్లోకం– అర్థం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్త్రావిణం తిక్తమప్యప్రియం తమ్ తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథమ్ ఈ శ్లోకాన్ని కొన్ని సాయి దేవాలయాల్లో తప్పుగా వేయించడం జరిగిన కారణంగానూ, అది అధికసంఖ్యలో భక్తుల నోళ్లలోకి వెళ్లిపోతోందనే ఉద్దేశంతోనూ స్పష్టంగానూ వివరంగానూ దీని అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది. ముఖ్యంగా ‘మూలధివాసాత్’కి బదులుగా ‘మూలాదివాసాత్’ అనీ, ‘కల్పవృక్షాధికమే’ అన్నదానికి బదులుగా ‘కల్పవృక్షాదిక’ అనీ దోషాలు దొర్లి కనిపిస్తున్నాయి. ఆ దోషాల్లేకుండా ఉండేందుకూ ఏది దోషమో ఏ తీరుగా చదివితే దోషం లేకుండా చదువుకుంటున్న తృప్తి ఉంటుందో– ఆ తీరులో అర్థమయ్యేలా వివరించుకుందాం శ్లోకాన్ని. శ్లోకానికి ముందుగా తెలుసుకోవలసినది పదాల విరుపుని. దీన్నే పద విభాగం అంటారు. సదా– నింబవృక్షస్య– మూలాధివాసాత్ సుధాస్రావిణమ్– తిక్తమ్– అపి– అప్రియమ్– తమ్ తరుమ్– కల్పవృక్షాధికం– సాధయంతమ్ నమామి– ఈశ్వరమ్– సద్గురుమ్– సాయినాథమ్ అనేది పదవిభాగం. పదవిభాగం లాగానే ప్రతి పదానికీ అర్థాన్ని కూడా తెలుసుకుంటే పొరపాటున కూడా ఈ శ్లోకమే కాదు ఏ శ్లోకాన్ని కూడా తప్పుగా ఉచ్చరించనే ఉచ్చరించలేం. అలా తప్పుగా ఉచ్చరించినందువల్ల కలిగే దుష్పరిణామం కూడా మనకి తెలిసే అవకాశముంటుంది. ప్రతిపద అర్థం సదా– పగలు, సాయంతరం, రాత్రి, ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, చలికాలమనే భేదాన్ని లెక్కించకుండా ఎప్పుడూ కూడా నింబ వృక్షస్య– ఆ తోవపక్కనే ఉన్న వేపచెట్టు యొక్క మూల+అధివాసాత్– మొదట్లోనే స్థిరంగా కూచుని ఉండే కారణంగా తిక్తమ్ – పుట్టుకతో తనకి కలిగిన చేదు తనంతోనే ఉన్నదీ అ–ప్రియమ్–ఎవరికీ కూడా ఏ మాత్రపు ఇష్టమూ కానిదీ అయిన తమ్ తరుమ్ – సామాన్యమైన జాతికి చెందిన ఆ వేప చెట్టుని (మంచిగంథం వంటిది కానిదైన)సుధా స్రావిణమ్ – నిరంతరం తేనెని ప్రవహించే తీరు కలిగిన దానిగానూ నిరాశా నిస్పృహలతో జీవితాన్ని చాలిద్దామనుకునేవారికి అమృతాన్ని ప్రవహించే తీరు లక్షణం కలిగినదవుతూ జీవించాలనే ఆలోచనని కలిగించే దానిగానూకల్పవృక్ష+అధికమ్ – అంతేకాక, ఏ కోరికని అడిగితే ఆ కోరికని అడిగినవాని అర్హతని బట్టి తీర్చే లక్షణమున్న దేవలోకవృక్షమైన కల్పవృక్షం కంటే గొప్పదనం కలదానివిగానూసాధయంతమ్ – ఏ రోజు కారోజు దాని గొప్పదనం జనులకి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నవాడూసత్+గురుమ్ – సజ్జనులకి మార్గదర్శనాన్ని చేస్తూ ఉండే ఓ గురువైనవాడూ, ఏ విధమైన లోటూ లోపమూ లేకుండా పరిపూర్ణమైన గురు లక్షణాలు కలిగిన వాడూసాయి నాథమ్ – దీనులకి రక్షకుడవుతూ ‘సాయి’ అనే పేరుగలిగి అందరికీ దిక్కైన వాడూఈశ్వరమ్ – సర్వశక్తులూ సర్వసిద్ధులూ తనలో కలిగి అందరి కష్టాలనీ నష్టాలనీ తొలగించగల సమర్థుడూ అయిన వానికి నమామి – ఎల్లవేళలా సర్వకాలాల్లో నమస్కరిస్తూనే ఉంటాను.భావం – ఈ శ్లోకంలో సాయి గొప్పదనం మొత్తం చిత్రీకరింపబడి కనిపిస్తుంది తరిచి చూస్తే.అదో సామాన్యమైన వేరు చెట్టు. ఆ చెట్టుకి ఆకులు కూడా సన్నగా చిన్నగానే ఉండే కారణంగా ఎక్కువనీడ నియ్యలేదు. పోనీ! దాని పుష్పాలు గాని, ఫలాలు గాని ఆహారంగా పనిచేస్తాయా? అంటే అందుకూ దానికి సమర్థత లేదు. పోనీ! ఏ నిద్రగన్నేరో మర్రీ మొదలైన వృక్షాల్లాగా పక్షులకి గూళ్లనీ, ఎలుకలూ మొదలైన వాటికి కన్నాలనీ,కోతులూ మొదలైన వాటికి ఆధారంగా కొమ్మల్నీ... ఈయగలదా? అంటే అలా ఈయగలిగిన శక్తీలేనిది– ఏ జీవజంతువులకీ ఆశ్రయాన్ని ఇచ్చి ఉన్నదీ కాదు. అలాంటి వేపచెట్టు అది. పైగా తన దగ్గరికి ఎవరినీ రానిచ్చుకోలేని రెండు అవగుణాలు – ఒకటి చేదుతనం, రెండవది ఎవరికీ ఈ చెట్టు అనగానే పట్టనితనం అనేవి కలిగి ఉండే జాతికి చెందిన వృక్షం.అలాంటి వృక్షాన్నే ఆశ్రయించాడు సాయి అనేది విశేషం. మల్లె, సంపెంగ, చందనం మొదలైన తీగల్నీ, చెట్లనీ ఎందరో ఇష్టపడతారు. అది కాదు విశేషం. ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. – సశేషం ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. -
కూతుర్ని కనాలి
పెళ్లయి వెళ్లిపోతే కూతురు పరాయి ఇంటి పిల్లే అని తల్లితండ్రుల ఆలోచన. కూతురుంటే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే చాలని అనుకుంటారు. అదే కొడుకు పుడితే వంశ వృద్ధి అని, పున్నామనరకం దాటిస్తాడనీ నమ్మకం. అయితే, కూతురే కొడుకై పున్నామ నరకం దాటించడానికి ముందుకు వస్తే..! నల్లగొండకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరది. ఆ ఊళ్లో ఓ మధ్యతరగతి ఇల్లు. అలివేలమ్మ, నర్సయ్య దంపతులకు యాదగిరి, పుష్ప (పేర్లు మార్చాం) ఇద్దరు పిల్లలు. వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. కొడుకు ప్రయోజకుడవ్వాలని భర్తతో పోరి మరీ హాస్టల్లో పెట్టి చదివించింది అలివేలమ్మ. చదివింది చాల్లే అని పదోతరగతిలోనే కూతురుకో సంబంధం చూసి బాధ్యత తీర్చుకున్నారు. పుష్ప అత్తింటికి వెళ్లిపోయింది. కొడుకు చదువు పూర్తయ్యి, పట్టణంలోనే ఉద్యోగంలో చేరాడు. కొడుక్కి పెళ్లి చేశారు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారికిద్దరు పిల్లలు. అనారోగ్యంతో నర్సయ్య కన్నుమూశాడు. ‘ఈ ఊళ్లో ఒంటరిగా ఎందుకు, నా వద్దకు వచ్చేయ్’ అన్నాడు కొడుకు తల్లిని. ‘ఒంటరిగా తను మాత్రం చేసేదేముంది, అలాగే’ అంది. కొడుకు ఇంటికి వచ్చింది. కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో ఊపిరాడడం లేదామెకు. పిల్లలు పొద్దున్నే స్కూళ్లకు, కొడుకు, కోడలు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. చీకటిపడేంతవరకు టీవీతోనే తన కాలక్షేపం. ఊళ్లో పొలం, ఇల్లు అమ్మకానికి పెట్టాడు యాదగిరి. అలివేలమ్మ ఏడ్చింది. ‘నే ఊరెళ్లి పోతా’ అంది. ‘నువ్వొక్కదానివి అక్కడుంటే చూసిన వాళ్లంతా కొడుకు చచ్చాడా అనుకోరా!’ గయ్యిమన్నాడు యాదగిరి. గమ్మునుంది అలివేలమ్మ. ‘ఇల్లు, పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి కొంత చెల్లెలికి వ్వు. భర్త చనిపోయి పిల్లలతో కష్టపడుతోందిరా’ అంది. ‘పెళ్లి చేసి పంపాక ఇంకా తనకు వాటా ఇవ్వడమేంటి?’ వాదించాడు యాదగిరి. ‘నాకేమీ వద్దు అమ్మ పేరున కొంత డబ్బు బ్యాంకులో వేయ్’ అంది పుష్ప. ‘నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు’ అన్నాడు యాదగిరి చెల్లెలిని. గొడవలెందుకని ఊరుకుంది అలివేలమ్మ. ఊరి మీద బెంగనో, జీవితమ్మీదే బెంగనో అలివేలమ్మ ఆరోగ్యం చెడింది. అప్పటికే రెండుసార్లు ఆసుపత్రిలో చేరింది. ‘సంపాదనంతా మందులకే సరిపోతుంది’ కోడలి సణుగులు అలివేలమ్మ చెవినపడుతున్నాయి. చూడ్డానికి వచ్చిన కూతురికి తన కష్టం చెప్పుకుంది అలివేలమ్మ. ‘అమ్మను కొన్నాళ్లు నే తీసుకెళతా!’ అంది పుష్ప. కదిలిస్తే డబ్బులు అడుగుతుందేమోనని మాట్లాడకుండా వెళ్లిపోయాడు యాదగిరి. తల్లిని తన ఇంటికి తీసుకెళ్లింది పుష్ప. ‘అన్నకు ఫోన్ చేయ్, వచ్చి తీసుకెళతాడు, నీకెందుకే బరువు?’ పదేళ్లుగా అలివేలమ్మ ఆ మాటను కూతురితో చెబుతూనే ఉంది. కూతురు ‘అలాగేనమ్మా!’ అంటూనే ఉంది. యాదగిరి మాత్రం ‘తనే తీసుకెళ్లింది, తననే తీసుకొచ్చి దింపమను’ అన్నాడు తల్లి గురించి ప్రస్తావన తెచ్చిన బంధువులతో. వృద్ధాప్యం, అనారోగ్యంతో అలివేలమ్మ మంచం పట్టింది. ‘పుష్పా నీకు అన్యాయం చేశామే. చదువుకుంటానని నువ్వు మొండికేసినా అంతకన్నా ఎక్కువ చదివినవాడిని తెవాలని భయపడి, పెళ్లి చేసి పంపించాం. ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు ఉన్న ఊరికి కూడా దూరం చేశాడు. నన్ను క్షమిస్తావా’ అంది కళ్లనీళ్లు పెట్టుకుంటూ. తల్లిని ఓదార్చింది పుష్ప. కొడుకు చివరి రోజుల్లోనైనా తనను తీసుకెళతాడని చూసింది అలివేలమ్మ. కానీ, ఆ ఆశ తీరకుండా ఓ రోజు తెల్లవారుజామున కన్నుమూసింది. విషయం తెలిసిన యాదగిరి వచ్చాడు తల్లి శవాన్ని తీసుకెళతా అని. అన్న దగ్గరగా వేళ్లిన పుష్ప ‘ఈ పుణ్యకార్యం నేనే చేస్తా నువ్వెళ్లి రా!’ అంది స్థిరంగా. తలదించుకుని తిరుగు ముఖం పట్టాడు యాదగిరి. – నిర్మలారెడ్డి -
ఆమెకు ఎవరు సమాధానం చెబుతారు?
బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన దగ్గర గుమాస్తా పైకం తీసుకుని రసీదు అతని ముఖం మీద పారేశాడు. అంతవరకూ గుమాస్తా రైటే. కాని బయట వర్షం, వచ్చినాయన వృద్ధాప్యం ఎరిగి ఆ రసీదును మడతపెట్టి ఆ ముసలాయన సంచీలో పెట్టాడనుకోండి. అది బాధ్యత కాదు. పది కాలాల పాటు మిగిలే మాన వత్వం. మన దేశంలో బాధ్యత ముసుగులో డబ్బు చేసుకునే కింది తరగతి ఉద్యోగుల హవా సాగుతోంది. మొహం మీద పారేసే రసీదుకీ, మడత పెట్టిన రసీదుకీ ఓ జీవితకాలం ‘సంస్కారం’ ప్రమేయం ఉంది. 41 సంవత్సరాల క్రితం 37 ఏళ్ల గంగా దేవి ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో తన ఆస్తి విషయంలో కోర్టుకి వెళ్లింది. మేజిస్ట్రేటు తీర్పు సుముఖంగా తెచ్చుకుంది. ఇందుకు కోర్టు ఖర్చు 312 రూపా యలు కట్టింది. గుమాస్తా డబ్బు కట్టించుకుని రసీదు ఇవ్వడం మరిచిపోయాడు. కోర్టు కాగితాల ప్రకారం డబ్బు చెల్లించని ఆమె ఆస్తి కేసుల్లో పడింది. ఎన్నాళ్లు? 41 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ‘డబ్బు కట్టాను బాబోయ్!’ అంటూ కోర్టుల వెంట తిరిగింది. 11 మంది న్యాయమూర్తులు ఆమె నిజాయితీని శంకిస్తూ ఆమె వినతిని తోసిపుచ్చారు. ఇప్పుడావిడకి 81 ఏళ్లు. ఈ మధ్య లవ్లీ జైస్వాల్ అనే ఓ జడ్జీగారు ఆమె మాటకి విలువనిచ్చి కాగితాలు వెదికించారు. ఆమె డబ్బు కట్టిన రుజువులు దొరికాయి. ఇప్పుడా గుమాస్తా ఏమయ్యాడు? 41 ఏళ్ల ఆమె గుంజాటనకి ఎవరు సమాధానం చెబుతారు? ఓ గుమాస్తా అలసత్వానికి మూల్యం 41 సంవత్సరాల నరకయాతన. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన రేడియోకి సంబంధించి ఒకటుంది. 1931 ప్రాంతంలో అంటే నేను పుట్టక ముందు ఒకాయన ఏటుకూరి బలరామమూర్తిగారి ప్రెస్సులో పనిచేసేవాడు. ఆయన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు ఉమామహేశ్వర రావుగారు. రేడియోలో ఆఫీసరు ఆచంట జానకీరాం గారు ఓ రోజు బలరామయ్యగారి దగ్గరకు వెళ్లినప్పుడు ‘‘చక్కగా తెలుగు రాసే మనిషిని చూసిపెట్ట వయ్యా’’ అని అడిగారట. తన దగ్గర ఉన్న ఉమామహేశ్వరరావుగారిని చూపించారు. అయితే ఆయన్ని పంపిస్తే తన పని? అందుకని ఒక పూట తన దగ్గర , మరోపూట రేడియోలో పనిచేసే ఒప్పందాన్ని ఇద్దరూ కుదుర్చుకున్నారు. ఆ విధంగా ఉమామహేశ్వరరావుగారు రేడియోలో చేరిన దరిమిలా అనౌన్సరయ్యారు. అనౌన్సరన్న మాటేగాని మద్రాసు రేడియో చరిత్రలో ఆయన తలలో నాలిక అయ్యారు. (ఆ రోజుల్లో తమిళ కార్యక్రమాలు లేవు) నేను పుట్టి, పెరిగి, రేడియోలో ఉద్యోగాన్ని సంపాదించుకుని మద్రాసు రేడియోకి, ఆయనకి ఆఫీసరుగా వచ్చాను. అప్పటికే ఉమామహేశ్వరరావుగారికి కళ్లు మసకలు కమ్మి చూపుపోయింది. ‘చేతిలో డబ్బుల్లేక కళ్లు పోగొట్టుకున్నాను మారుతీ రావుగారూ’ అనే వారాయన. అప్పటికి ఆయన రిటైరయ్యే రోజు వచ్చింది. ఆ రోజు ఆయన బేల అయిపోయారు. దాదాపు 40 ఏళ్ల రేడియో జీవితం ముగియబోతోంది. పిచ్చివాడిలాగ ఆఫీసంతా తిరిగారు. ఆ రోజు ఆఫీసుకి వస్తూ బజారులో పంచెల చాపు కొన్నాను. నాలుగున్నరకి కాంటీన్లో ఆయనతో టీ తాగాను. ఎన్ని జ్ఞాపకాలు? ఎందరు ప్రముఖులతో ఎన్ని గొప్ప కార్యక్రమాలకు పౌరోహిత్యం? కదిపితే భోరుమనేట్టు ఉన్నారు. ఐదు గంటలకి నా స్కూటరు ఎక్కించుకుని దివాన్ బహదూర్ రామయ్యంగార్ రోడ్డు (పూనమల్లి)లోని ఆయనింటికి తీసుకొచ్చాను. అక్కడ బట్టలు చేతికిచ్చాను. అక్కడ ఆయన దుఃఖం కట్టుతెగింది. ‘నన్ను మారుతీరావుగారు ఇంటికి తెచ్చి బట్టలు పెట్టారే’ అంటూ భార్యతో భోరుమన్నారు. ‘‘ఇవాళ దాకా మీరు అనౌన్సరు. రేపట్నించి కాజువల్ ఆర్టిస్టు. మీరు ఆఫీసుకు రావాలి. కాంట్రాక్టు ఇస్తున్నాను. ఇటీజెనార్డర్’’ అని స్కూటరెక్కాను. అలా ఎన్నాళ్లు? మరో 40 ఏళ్లు జీవించి నూరేళ్ల జీవిగా నిష్క్రమించారు. నా జీవితంలో పచ్చని జ్ఞాపకాలలో ఇదొకటి. తర్వాత మిత్రులు మల్లాది సచ్చిదానందమూర్తిగారితో చెప్పి వారికి సత్కారం ఏర్పాటు చేశాను. మూర్తిగారు వదాన్యులు. అప్పటి నుంచి ఆయన పోయేదాకా నెలకి వెయ్యి రూపాయలు పంపారు. ఓ గుమాస్తా గంగాదేవికి రసీదు ఇవ్వడం మరిచిపోయిన కారణంగా ఆమె 41 సంవత్సరాలు, 11 కోర్టులు పట్టుకు తిరగడం భయంకరమైన నేరం. ఉద్యోగి బాధ్యతకు కప్పదాటు. ఉద్యోగాన్ని తు.చ. తప్పకుండా చేస్తే ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ అని బతకొచ్చు. ఓ చిన్న Gesture ఏ రూలు బుక్కులో ఉండదు. కాని మనిషిని ఎత్తున నిలుపుతుంది. ఆస్తి రసీదు బాధ్యత. దాని మడత మాన వత్వం. - గొల్లపూడి మారుతీరావు -
పాలకులు ఎలా ఉండాలి?
హజ్రత్ ఉమర్ గొప్పనాయకుడు. బాధ్యతాయుతమైన పాలకుడు. అన్నిటికీ మించి దైవభక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆయన స్వయంగా పర్యటించేవారు. అందులో భాగంగానే ఒకసారి మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. కొన్ని ప్రాంతాలు పర్యటించిన తరువాత ఒక పూరిగుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు నివాసం ఉంటోంది. మారువేషంలో ఉన్న హజ్రత్ ఉమర్ (ర)ఆమె దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు విచారించారు. మీ పాలకుడు ఉమర్ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు.దానికామె, ‘‘ఆ..ఏమి ఉమరో ఏమిటో నాయనా! దేవుడు ఆయనకు మేలుచేయడు.’ అన్నది.‘‘అయ్యయ్యో.. ఏంటి పెద్దమ్మా.. అంతమాట అనేశావు..అసలేం జరిగింది?’’ అని ఆరాతీశారు.‘‘ఏమీలేదు నాయనా.. నేనింత ముసలిదాన్నికదా...నన్నెప్పుడైనా పట్టించుకున్నాడా..?’’అని నిష్టురమాడింది.‘‘అమ్మా..! రాజు అంటే చాలా పనులుంటాయి కదమ్మా..! నువ్వెప్పుడైనా నీసమస్యను రాజుగారి దృష్టికి తీసుకెళ్ళావా?’ అన్నారు ఉమర్ .‘‘అదేంటి బాబూ అలా అంటావు? పాలకుడన్నవాడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టసుఖాలేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న బాధ్యత ఉండదా? పాలకుడంటే సేవకుడు కదా..? నేను వెళ్ళి దేహీ అని అడుక్కోవాలా? ప్రజల బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం పాలకుడి బాధ్యత కాదా?’అని ప్రశ్నించింది.వృద్ధురాలి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న హజ్రత్ ఉమర్ కు దుఖంపొంగుకొచ్చింది. ‘ఈ వృద్ధురాలికున్నంత తెలివి కూడా నీకు లేదా ఉమర్! రేపు దైవానికి ఏం సమాధానం చెబుతావు?’ అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు ఉమర్ తరువాత ఆయన, ‘‘అయితే.. నీ విషయంలో ఉమర్ వల్ల జరిగిన నిర్లక్ష్యానికి ఎంతమూల్యం చెల్లించమంటావో చెప్పు. నేను ఆ మూల్యాన్ని నీకు చెల్లించి ఉమర్‌ను కాపాడాలనుకుంటున్నాను’’ అన్నారు.‘‘బాబూ.. ఈ ముసలిదాన్ని ఎందుకు ఆటపట్టిస్తావు? ఉమర్ నిర్లక్ష్యానికి నువ్వు మూల్యం చెల్లిస్తావా?.’అంటూ నవ్వింది వృద్ధురాలు. ‘‘లేదమ్మా.. నేను నిజమే చెబుతున్నాను’’ నమ్మబలికారు ఉమర్.‘‘సరే, అయితే.. ఇరవై ఐదు వరహాలు ఇవ్వు..’ అన్నది వృద్ధురాలు..అంతలో హజ్రత్ అలీ(ర), హజ్రత్ ఇబ్నెమస్ ఊద్ (ర)అటుగా వచ్చారు. వారు హజ్రత్ ఉమర్ గారిని చూస్తూనే, సలామాలేకుం ఉమర్ ఖలీఫా’’ ఈ మాట వింటూనే వృద్ధురాలికి ముచ్చెమటలు పట్టాయి. ఆమె ఆందోళనను గమనించిన హజ్రత్ ఉమర్ ‘‘అమ్మా.. ఆందోళన చెందకు.అల్లాహ్ కరుణించుగాక.. నువ్వు సత్యం మాట్లాడావు’’ అంటూ ఆప్యాయంగా అనునయించారు. ఒక సామ్రాజ్యానికి పాలకుడైనటువంటి హజ్రత్ ఉమర్(ర)ఎంత నిబద్దతతో, ఎంతబాధ్యతతో, ఎంత జవాబుదారీతనంతో ప్రజలతో వ్యవహరించారో చూడండి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శ్రీరెడ్డి వ్యవహారంపై సంచలన ప్రకటన
సాక్షి, ముంబై : శ్రీ రెడ్డి వ్యవహారంపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని శ్రీ రెడ్డితో చెప్పింది తానేనని ఆయన బాంబు పేల్చారు. అయితే పవన్‌ను విమర్శించటం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆమెకు ఆ సూచన చేశానని వర్మ చెప్పారు. ఈ మేరకు పవన్‌కు సారీ చెబుతూ ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో వర్మ ఓ వీడియోను ఉంచారు. పవన్‌ను ఆ పదజాలంతో విమర్శించటంలో శ్రీ రెడ్డి తప్పేం లేదన్న వర్మ.. ఆమెను ప్రభావితం చేసింది తానేనని చెప్పుకొచ్చారు. పవన్‌ను విమర్శించటం ద్వారా కత్తి మహేశ్ పాపులర్ అయిన విషయాన్ని ఆమెతో ప్రస్తావించి.. పవన్‌ను టార్గెట్ చేయమని చెప్పానన్నారు. ఈ విషయంలో పవన్‌ను లాగినందుకు పవన్‌కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ వర్మ ఓ ట్వీట్ చేశారు. డీల్ చేయడానికి యత్నించా... గతంలో శ్రీ రెడ్డితో తానూ ఓసారి ఫోటో దిగానని.. తర్వాత నిరసనల ద్వారానే ఆమెను గుర్తుపట్టానని ఆయన తెలిపారు. సురేష్ తనయుడు అభిరామ్ ఫోటోలను లీక్ చేశాక.. సురేష్ ప్రొడక్షన్ లాంటి ప్రముఖ సంస్థ.. రామానాయుడు కుటుంబం పరువుకు భంగం కలగకూడదన్న ఉద్దేశ్యంతో తాను డీల్ చేయించేందుకు ముందుకు వచ్చానని వర్మ తెలిపారు. ఆ విషయం నిర్మాత సురేష్ బాబుకు కూడా తెలీదని ఆయన అన్నారు. అయితే శ్రీ రెడ్డి ఆ ఆఫర్‌ను(రూ.5 కోట్లు అని చివర్లో వెల్లడించారు) సున్నితంగా తిరస్కరించందని తెలిపారు. డబ్బున్న వాళ్లు కూడా కోట్ల డీల్‌ను వదులుకునేందుకు సిద్ధంగా ఉండరని.. అలాంటిది ఆమె వద్దనటంతో ఇష్యూపై ఎంత సిన్సియర్‌గా పోరాటం చేస్తుందో అర్థమైందని వర్మ తెలిపారు. పవన్‌ను శ్రీ రెడ్డి విమర్శించటానికి పూర్తి బాధ్యత తనదేనని వర్మ స్పష్టత ఇస్తూ అందుకు క్షమాపణలు చెప్పారు. ఆమె గతం ఏంటన్నది పక్కనపెడితే.. ప్రస్తుతం ఆమె ప్రస్తావించిన అంశం(కాస్టింగ్ కౌచ్) మాత్రం ఇండస్ట్రీలో అందరూ ఒప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. సుమారు 16 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. -
'బ్యాంకుల్లో ప్రజల కష్టం ఉంది.. బాధ్యత మీదే'
సాక్షి, ముంబయి : ప్రజలకు బ్యాంకులపై నమ్మకంపోతోందని, వాటిని అనుమానించే పరిస్థితి తలెత్తిందని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బ్యాంకులు ఉన్నపలంగా దెబ్బతింటే ప్రజల సొమ్ముకు భద్రత కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎంతో కష్టపడి తమ డబ్బును కూడ బెట్టుకొని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఈ సందర్భంగా మేం ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా దెబ్బతిన్నా ప్రజల సొమ్ముకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. మరోసారి బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటారా అనే ప్రశ్నకు ఉద్దవ్ కొట్టిపారేశారు. 'మేం మహారాష్ట్ర ప్రజల కోసమే పోరాడుతున్నామని వారు ఇప్పుడిప్పుడే మాపై మరింత నమ్మకం పెట్టుకుంటున్నారు. మేం దాన్ని వమ్ము చేయబోము' అని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. -
ఆడ..పిల్ల?
ఆడపిల్ల పుట్టిన వెంటనే ఈడ పిల్ల కాదు.. అని తల్లే చెప్పింది! అంటే.. ఎప్పటికైనా ఇంకొకరి ఇంటి పిల్లే అని చెప్పడం కాబోలు! లేక.. నువ్వు నా బాధ్యత కాదు అనడం కాబోలు! ఈడ పిల్లని ఆడకి పంపితే.. అక్కడా.. కాదన్నారు! ఎంత అసమానత? ఎంత వివక్ష! ఆరింటి నుంచి వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తున్నా ఎంతకీ పని తరగదే! వాకిట్లో ముగ్గు పెట్టడం నుంచి, రాత్రి పదకొండింటికి వంటగదిని తుడిచి శుభ్రంచేసే వరకు మధ్యలో బడికెళ్లినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పనే! తన ఈడు మగపిల్లలంతా ఎందుకంత హాయిగా ఆడుకుంటుంటారు. తనెందుకు ఎప్పుడూ పని చేయవలసి వస్తోంది? అర్థం కాదు! జీవితం ఎంత కష్టంగా ఉన్నా చదువంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అన్నయ్యతో పోటీపడి చదివేదాన్ని. కానీ నాన్న నన్ను చదవనివ్వలేదు. – వెంకటలక్ష్మి (పేరు మార్చాం) ‘చదువుకుంటా నాన్నా’ అన్నాను అసలు ఇంత చాకిరీ చేయాల్సి వస్తుందని నేనస్సలు అనుకోలేదు. అమ్మపెడితే తిని ఆడుతూ పాడుతూ తిరిగేదాన్ని. అమ్మ దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే బండెడు చాకిరీ భారం నా బాల్యాన్ని మింగేసింది. ఎప్పుడూ అమ్మ ఒక మాట అంటుండేది.. ‘ఏ పనికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ, వంటపనికి ఉండదెందుకనో’ అని. అమ్మా, అమ్మమ్మా, అత్తయ్యా, ఇప్పుడు నేను! రేపోమాపో నా కూతురికీ ఈ వంటగది తప్పదు. ఎవరు శాసించారో వంటగదిని ఆడాళ్లకి శాశ్వత చిరునామాగా?! అందుకే అడిగాను మొదటిసారిగా.. నాన్న తీరిగ్గా ఉన్న సమయం చూసుకుని. ‘‘నాన్నా! నాకు చదువుకోవాలనుంది’’ అని! నాన్న మౌనంగా ఉన్నాడు. వినపడలేదేమోనని రెండోసారి కొంచెం గట్టిగా చెప్పాను. ‘ఎలారా నువ్వు లేకుండా’ అన్నాడు ‘‘చిన్నపిల్లవి! అమ్మపోయాక నీతో వంట పనిచేయించుకోవడం నాక్కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయనూ? ఆడదిక్కు లేని ఇల్లు కదమ్మా! ఇప్పుడు నువ్వే మా అమ్మవి!’’ అన్నాడు. నా ప్రశ్నకి అది సమాధానం కాదని తెలిసినా, అమ్మపోయాక మా అమ్మ పనీ, నాన్నమ్మపనీ నాకు తప్పవని అర్థం అయ్యింది. ఆ పని చేస్తూనే నా చదువు కొనసాగించాలి. అది మొదలు ఒళ్లొంచి చాకిరీ చేయడమే జీవితమైపోయింది నాకు. మూడు గేదెల పోషణా పడింది మాది విశాఖపట్నంలోని ఎండాడ. మాకు సొంతిల్లు, ఆస్తులున్నాయి. నన్ను ఎండాడ సర్కారు బళ్లో చేర్చారు. ఏడో తరగతి పూర్తి కాకుండానే మా అమ్మకు జబ్బు చేసి చనిపోయింది. దాంతో ఇంటి బాధ్యతలన్నీ నా భుజాల మీద పడ్డాయి. అన్నయ్య ఎంత హాయిగా కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు! అన్నయ్యలా తనకి కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదువుకోవాలని కోరిక ఉండేది. కానీ ఈ వంట పని మూలంగానే తన కోరిక తీరలేదు. మా నాన్నకూ అన్నయ్యకూ వండి పెట్టడంతోనే నా బాల్యమంతా గడిచిపోయింది. దానికి తోడు మూడు గేదెల పోషణ భారం నాపైనే పడింది. పొద్దుపొద్దున్నే లేచి గేదెల చావిడి శుభ్రం చేసి పాలు పితికేదాన్ని. నెయ్యి చేసి అమ్మేదాన్ని. ఇంటి పని మొత్తం చేసి బడికి పోయేదాన్ని. సాయంత్రం బడి నుంచి రాగానే మళ్లీ పని! అంట్లు తోమడం, వంట చేయడం, ఇంట్లో వాళ్ల అవసరాలు చూసుకోవడం. మేనమామకు ఇచ్చి చేశాడు జీవితం ఎంత కష్టంగా ఉన్నా చదువంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అన్నయ్యతో పోటీపడి చదివేదాన్ని. కానీ నాన్న నన్ను చదవనివ్వలేదు. అన్నయ్యను మాత్రం బాగా చదివించి, విదేశాలకు పంపాడు. నన్నేమో ఇంటర్ చదువుతుండగానే చదువు మాన్పించేశాడు. మా మేనమామతో పెళ్లి జరిపించాడు. ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు. చివరికి మిగిలింది...! నన్ను పనిమంతురాలంటారు! పుట్టింట్లో ఒంటి చేత్తో ఇల్లు చక్కబెట్టానంటారు. పుట్టింటికి చేసిన సేవలు గుర్తు చేస్తూ అత్తింటివారూ బాగా చాకిరీ చేయించుకుంటున్నారు. కానీ నా చాకిరీకి గుర్తింపు లేదు. నాకు బాధ్యతలే తప్ప హక్కులు లేవు. అప్పుడు పుట్టింట్లో ఇప్పుడు మెట్టినింట్లో... అదే చాకిరీ. బాగా చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు. భర్త సంపాదనతో ఇల్లుగడవడం కష్టమౌతోంది. కనీసం నాన్న పేరున ఉన్న ఆస్తిలో సగం వాటా రాసిమ్మని అడిగాను నాన్నని. అడిగినప్పుడల్లా దాటవేస్తున్న నాన్న ఓ రోజు గట్టిగా అడిగేసరికి ఇలా అన్నారు. ‘అన్న ఉన్నాడుగదా.. చూసుకుంటాడులే’ అని. నాన్నే చూసుకోంది అన్న చూసుకుంటాడా? అసలు నేను వాళ్లకోసం ఎంత చాకిరీ చేశాను! ఈ విషయాలు వాళ్లకు ఎందుకు గుర్తుకు రావు? నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నట్టు? నాకు మిగిలింది పనిమంతురాలనే పేరేనా? గునపర్తి సైమన్, సాక్షి, విశాఖపట్నం, (కల్చరల్) -
బాధ్యతాయుతంగా పనిచేసి ప్రగతి సాధనకు కృషి చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: డీఆర్డీఏ ఆధ్వర్యంలో పనిచేసే ఏరియా కో ఆర్డినేటర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ఆయా మండలాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యక్రమలపై అధికారులతో సమీక్షించారు. ఈ సంవత్సరం 52,920 సంఘాలకు రూ.1223,22 కోట్ల రుణ సహాయం లక్ష్యం కాగా 6495 గ్రూపులకు రూ.223 కోట్ల రుణాలు అందించారన్నారు. ఈనెలాఖరు నాటికి రుణాల కల్పన వేగవంతం చేసి రూ.300 కోట్లకు పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, మెప్మా పీడీ రత్నబాబు, ఏపీడీ శ్రీనివాసకుమార్, క్షేత్రసిబ్బంది పాల్గొన్నారు. 25వ తేదీల్లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి: వివిధ కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోపు 80 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ల ద్వారా పట్టణ, మండలాల్లో జరుగుతున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, ఎస్సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు డేవిడ్‌రాజు, జ్యోతి, వీఎస్ఎస్ శాస్త్రీ, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్... కలెక్టరేట్ కోర్టు హాలు నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా శుక్రవారం రాత్రి మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తట్టు, రుబెల్లా టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డిఎంహెచ్వో కె.చంద్రయ్య, డీఈవో అబ్రహం, ఐసీడీఎస పీడీ «శారదాదేవి పాల్గొన్నారు. -
బాధ్యత పెంచిన విజయం
కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులనూ, జనం నాడి ఇట్టే పట్టేస్తామని చెప్పుకునే సర్వేక్షకులనూ ఖంగు తినిపిస్తూ తన ప్రభంజనానికి ఎదురులేదని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ రుజువు చేసుకున్నారు. బీజేపీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు... దేశ రాజకీయాల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్‌గాంధీ అదే స్థాయిలో బలమైన నేతగా ఎదిగారని 1984 ఎన్నికల తర్వాత అందరూ అనుకున్నా చాలా త్వరగానే అక్కడినుంచి ఆయన జారిపడటం మొదలైంది. ఇన్నాళ్లకు ఇందిర తరహాలో పార్టీ పైనా, ప్రభుత్వంపైనా బలమైన పట్టు సాధించడంతోపాటు విస్తృతమైన జనాక ర్షణను మోదీ సొంతం చేసుకోగలిగారు. యూపీకి చెందని నాయకుడొకరు జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన నాయకుడిగా ఎదగడం ఇది తొలిసారి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన విజయం అసామాన్యమైనది. ఇదంతా పాలక పక్షానికి వ్యతి రేకంగా ఇచ్చిన తీర్పుగా మాత్రమే భాష్యం చెప్పుకుంటే విపక్షాలకు భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు తక్కువేం కాదు. పైగా అక్కడ కుల సమీకరణాలు, బలమైన ముస్లిం ఓటు బ్యాంకు జాతీయ పార్టీలకు కొరుకుడు పడకుండా తయారయ్యాయి. కుల సమీకరణాల్లో కొత్త ఫార్ములా రూపొందించుకుని, ముస్లిం ఓటుబ్యాంకు సైతం ఎంతో కొంత బీటలువారేలా చేసి రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. ముస్లింలకు ఒక్క స్థానం ఇవ్వకపోయినా ఇది సాధ్యం కావడమే విశేషం. బిహార్ తరహాలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు మహా కూటమిగా ఏర్పడి ఉంటే యూపీలో ఫలితం వేరుగా ఉండేదని చెప్పడం కష్టమే అయినా... ఫలితాలకు ముందు సర్వేలు జోస్యం చెప్పినట్టు విప క్షాలు బీజేపీతో నువ్వా నేనా అని పోటీ పడి కనీసం దాని దరిదాపుల్లోకైనా వచ్చే వేమో! బిహార్ ఓటమితో బీజేపీ గుణపాఠం నేర్చుకుని విభిన్నంగా ఆలోచించడం మొదలుపెడితే... ఎస్పీ, బీఎస్పీలు రెండూ తమకేమీ పట్టనట్టు అలవాటైన బాణీని కొనసాగించాయి. అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరిస్తుందని, ఎస్పీ రెండో స్థానంలో ఉంటుందని సర్వేలన్నీ జోస్యం చెప్పినప్పుడు అఖిలేష్ కాస్త వెనక్కి తగ్గి అవసర మైతే బీఎస్పీతో కలిసి అడుగులేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆ ఎరుక ఉన్నట్టయితే బిహార్ మాదిరి మహా కూటమి యూపీలో సాధ్యమయ్యేది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు రెండూ గత రెండేళ్లుగా అవిశ్రాం తంగా పనిచేస్తున్నాయని... బాగా వెనకబడిన కులాలను(ఎంబీసీ), దళితుల్లో జాటవేతర కులాలను సమీకరిస్తున్నాయని ఎస్పీ, బీఎస్పీలకు తెలియనిదేమీ కాదు. అయితే పోలింగ్‌కు దూరంగా ఉండటమో... వేర్వేరు పార్టీల వెనక చేరడమో తప్ప ఐక్యత ఎరుగని ఎంబీసీలను, జాటవేతర కులాలకు చెందినవారిని కూడ గట్టడం అసాధ్యమని ఆ పార్టీలు భావించాయి. మాయావతి తన పాత ఫార్ములాకు స్వల్పంగా మార్పుచేసి ముస్లింలకు ఎక్కువ స్థానాలిచ్చారు. 2007లో దళితులు– బ్రాహ్మణుల కలయికవల్ల 30.4 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసు కున్నట్టు ఈసారి ముస్లింలను చేరదీస్తే సరిపోతుందనుకున్నారు. అయితే అది పార్టీకి లాభించకపోగా ఇతర వర్గాలను దూరం చేసింది. బీఎస్పీకి ఓటేయమని బుఖారీ పిలుపునిచ్చినా ముస్లింలు దాని వెనక నిలబడలేదు. బీజేపీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలే ఆ పార్టీ శ్రేణులు జనంలో ఎంత అవి శ్రాంతంగా పనిచేశాయో చెబుతాయి. క్రితంసారి ఎన్నికల్లో కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను ఇస్తామని ఎస్పీ చెప్పింది. దాన్ని అమలు చేసింది. బీజేపీ దీన్ని కాస్త మార్చింది. ల్యాప్‌టాప్‌తోపాటు అదనంగా 1జీబీ ఫ్రీడేటాను ఏడాది పాటు ఉచితంగా అందజేస్తామని వాగ్దానం చేసింది. బాలురకు పన్నెండో తరగతి వరకూ, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకూ ఉచిత విద్య.. గ్రామసీమల్లో ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, రైతులకు రుణమాఫీ వంటివి చేర్చింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచుతామన్నది. ఇవన్నీ యువతలో, గ్రామీణుల్లో ఆశలు కలిగిం చాయి. అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్రను అలా ఉంచుకుంటూనే బాగా వెనకబడిన బీసీలు, దళితులను కూడగట్ట గలిగింది. పెద్ద నోట్ల రద్దుపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించింది. ఢిల్లీ యూనివర్సిటీలో నెలకొన్న ఘర్షణ వాతావరణం, దేశభక్తిపై చర్చ వంటివి కూడా యూపీ ఎన్నికల్లో ఏదోమేరకు బీజేపీకి తోడ్పడ్డాయి. పదేళ్లుగా పాలించడం వల్లా, మాదకద్రవ్యాల మాఫియా రాజ్యమేలడం వల్లా అకాలీ–బీజేపీ కూటమికి పంజాబ్‌లో ఓటమి తప్పలేదు. కానీ గట్టి పోటీ ఇస్తుంద నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్వీయ తప్పిదాలతో దెబ్బతింది. ఈశాన్యాన అస్సాంలో ఇప్పటికే అధికారం చేపట్టిన బీజేపీ మణిపూర్‌లో సైతం ఆశ్చర్యకరంగా మెరుగైన ఫలితాలను సాధించి ఆ ప్రాంతంలో తాను వేళ్లూనుకుంటున్నట్టు సంకేతా లిచ్చింది. అయితే జనం ఇచ్చిన రెండో స్థానాన్ని స్వీకరించి, విపక్షానికే పరిమితమై ఏం జరుగుతుందో వేచిచూడాల్సింది. కానీ బీజేపీ దూకుడుగా పోతూ ఆ రెండు చోట్లా కూడా అధికారాన్ని కైవసం చేసుకునే ఎత్తులకు దిగింది. అధిక స్థానాలు లభించిన పార్టీలు విఫలమయ్యాక అలాంటి ప్రయత్నం చేసి ఉంటే వేరుగా ఉండేది. ఆ సంయమనం కొరవడటం వల్లే గోవా పరిణామాలపై సుప్రీంకోర్టు జోక్యం అవసరపడింది. విజయోత్సవ సభలో మోదీ చేసిన ప్రసంగం ఎన్నదగినది. విజయంలోనూ వినమ్రంగా ఉందామని శ్రేణులకు పిలుపునివ్వడంతోపాటు హిందువులకైనా, ముస్లింలకైనా ఉమ్మడి శత్రువులు పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులేనని చెప్పడం.. ఐక్యత అవసరమని పిలుపునివ్వడం.. యూపీలో తమది అందరి ప్రభుత్వంగా పని చేస్తుందనడం ప్రజలను ఆకట్టుకుంది. 2022నాటికల్లా నవభారతం నిర్మించడా నికి ఈ ఎన్నికలు పునాది అని చెబుతున్న మోదీకి ఆ దిశగా తమ విధానాలు, కార్యాచ రణ ఉండేలా చూసుకోవడమన్నది పెద్ద సవాలు. ఆ విషయంలో సాధించే విజయం వ్యక్తిగా మోదీని, పార్టీగా బీజేపీని రాబోయే రోజుల్లో శిఖరాగ్ర స్థాయికి చేరుస్తాయి. -
ఆస్తి మీది బాధ్యత మాది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె సొమ్ము ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోన్న రాజుకు నెలనెలా ఠంఛనుగా అందుకుంటున్నాడు. విద్యుత్తు, ఆస్తి పన్ను బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ‘ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)తో ఇది సాధ్యమే. మీ చిన్న చిన్న పనుల్ని దగ్గరుండి చేసి పెట్టడమే వీటి ప్రత్యేకత. సేవల చిట్టా పెద్దదే.. పీఎంఎస్ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజం అంతాఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. ఏయే సేవల్ని వీరు అందిస్తారో ఒకసారి చూద్దామా... ⇔ నెల వచ్చేసరికి ఠంఛనుగా అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు, అద్దెదారునికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే. అద్దెదారులు పాటించాల్సిన నియమ నిబంధల్ని మీ తరఫున ఖారారు చేస్తారు. ⇔ క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమ చేయటం వీరి సేవలో భాగమే. ⇔ మీది ఫ్లాట్ అయితే అపార్ట్మెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ⇔ ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. ⇔ అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. ⇔ విద్యుత్, ఆస్తి పన్ను బిల్లులను చెల్లిస్తారు. ⇔ మీకు అద్దెదారునికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే. ⇔ నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే. ⇔ మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు. ⇔ పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు. -
‘శశాంక్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు’
న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థారుులో విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయంలో బీసీసీఐని ఆయన తన మానాన తాను వదిలేసి వెళ్లాడని ఎద్దేవా చేశారు. బోర్డుకు మేలు చేకూరేలా తాను వ్యవహరించాల్సిన అవసరం లేదని శశాంక్ చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందించారు. ‘ఐసీసీ చైర్మన్ వ్యాఖ్యలపై బోర్డు అధ్యక్షుడిగా మా సభ్యుల ప్రతిస్పందన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన బోర్డు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ‘మునిగిపోతున్న నావను కెప్టెన్ వదిలి వెళ్లినట్టు’ వెళ్లిపోయారు’ అని ఆరోపించారు. -
జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత
మోత్కూరు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని మోత్కూరు మండల ఎంపీపీ ఓర్సులక్ష్మీ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండలంలోని దాచారం గ్రామంలో జీవవైవిధ్యంపై అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు గ్రామంలోని ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరారు. సింగిల్ విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడకపోతే మానవ మనుగడ అసాధ్యమన్నారు. జీవవైవిధ్య జిల్లా కోర్డినేటర్ ఎట్టం శ్రీనివాస్ మాట్లాడుతూ ఔషధ మొక్కల ఉపయోగాన్ని గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, సర్పంచ్ కడమంచి వస్తాద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ యాదగిరి, అవిలయ్య, ఉప సర్పంచ్ కప్పల లింగయ్య, వార్డు సభ్యులు, జీవవైవిధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భద్రత బాధ్యత ఉపప్రధానార్చకుల చేతికి
బంగారు ఆభరణాల మాయంపై చర్యలు శూన్యమేనా ? భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు భద్రపరిచే బాధ్యతల నుంచి ప్రధానార్చకులను తప్పించారు. దీనిలో భాగంగా బుధవారం బంగారు ఆభరణాల లెక్కను ఆలయ ఉపప్రధానార్చకులకు అప్పగించారు. రామాలయంలో రెండు బంగారు నగలు మాయం కావటంతో దీనిపై పెద్దఎత్తున దుమారం రేగింది. గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన నగలు పదిరోజుల పాటు కనిపించకుండా పోయాయి. దీనిపై పెద్దఎత్తున ప్రచారం జరగటంతో వీటిని తీసిన అర్చకులే తిరిగి యథాస్థానంలో పెట్టారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం పరిణామంలో ఆలయంలోని ఇద్దరు ప్రధానార్చకుల బాధ్యాతారాహిత్యం ఉందని గుర్తించిన ఈఓ రమేష్‌బాబు వారిపై చర్యలకు సిద్దమయ్యారు. దీనిలో భాగంగా బంగారు ఆభర ణాలను భద్రపరిచే బాధ్యతలను నుంచి ప్రధానార్చకులైన జగన్నాథాచార్యులు, రామానుజాచార్యులను తప్పించారు. ఇక నుంచి ఆలయంలోని నలుగురు ఉప ప్ర«ధానార్చకుల ఆధీనంలోనే బంగారు ఆభరణాల లెక్క ఉండాలనే ఈఓ సూచనలు మేరకు వాటిని అప్పగించారు. ఇక నుంచి బంగారు ఆభరణాల భద్రతపై ప్రధానార్చకులకు ఎటువంటి బాధ్యత ఉండదు. భద్రాద్రి ఆలయంలో బంగారు నగలు మాయంపై దేశ వ్యాప్తంగా చర్చసాగినప్పటికీ, ఇందుకు బాధ్యులైన వారిపై తగిన రీతిలో చర్యలు లేకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ బంగారు ఆభరణాలు తీసిన అర్చకులెవరనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆభరణాలను మాయం చేసిన వారిని గుర్తించకపోవటంతో, ఆలయంలోని మిగతా అర్చకులపై ఆ ప్రభావం పడుతుందని, కంటితుడుపు చర్యలతోనే దేవస్థానం అధికారులు సరిపుచ్చటం వెనుక ఏదో మర్మం దాగి ఉందని, ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో ఈఓ రమేష్‌బాబు సైతం ఏమీ చేయలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది.