REVANTH Reddy
-
బుల్డోజర్లు రెడీ.. ఎవరు అడ్డం వస్తారో రండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలుగుతారా? ప్రశ్నించారు. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి శనివారం చార్మినార్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తాను. ఈరోజు మూసీ దగ్గరికే వచ్చా.. సవాలు విసిరిన హరీష్ ఎక్కడ పోయాడు?. హైడ్రా అనగానే ఈటల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు. హైడ్రాకి పేదలు ఎవరూ భయపడడం లేదు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారు. అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అడిగినప్పుడు మీ అనుమతి పత్రాలు చూపించండి.రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడకండి. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతాం. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తాం. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. పేదలు తాగే నీళ్ళలో డ్రెనేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతాంబుల్డోజర్ ఖాళీగా ఉంచాను. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకోలేదా.. పోయి చూద్దాం రండి. అజీజ్ నగర్లో హరీష్ ఫామ్ హౌస్ లేదా?. తన ఫామ్‌హౌస్ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడు. హరీష్, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణ పరువు తీస్తున్నారు: జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,సూర్యాపేట జిల్లా: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఆయన ఉపన్యాసాలుంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం(అక్టోబర్ 18)సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. తెలంగాణ ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్‌ను ఇప్పటి బడ్జెట్ పోల్చి చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుంచి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు.420 హామీలొద్దు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం,అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. మూసీ కూల్చివేతల తర్వాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కు భయమేస్తోంది. సీఎం ఏకపక్షంగా వెళుతున్నారని కాంగ్రెస్ సీఎంలే అంటున్నారు.ఇదీ చదవండి: మెగాస్టార్,సూపర్‌స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీశ్‌రావు -
రిజిస్ట్రేషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్
-
మహేశ్ బాబు విరాళం.. డిస్కషన్ మాత్రం వాటి గురించి
హీరో మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. మూవీలోని తన పాత్ర కోసం మహేశ్ లుక్ మొత్తం మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయంగా రూ.50 లక్షల విరాళం అందజేశాడు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించాడు. ఏఎంబీ తరఫున మరో రూ.10 లక్షలు కూడా విరాళమిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)మహేశ్ విరాళం ఇచ్చాడు. అయితే డబ్బులు సాయం చేశాడు అనే విషయం కంటే అతడు లుక్ హైలెట్ అవుతోంది. జూలపాల జట్టు, గుబురు గడ్డంలో మహేశ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు మహేశ్ ప్రయోగాలు చేయలేదు, మాస్‌గా కనిపించలేదు అని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇప్పుడు డిఫరెంట్‌గా కనిపిస్తున్న మహేశ్‌ని చూసి ఫిదా అయిపోతున్నారు.దాదాపు నాలుగేళ్ల క్రితం మహేశ్‌తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈయన తీసిన 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా రెండేళ్లకు పైనే అయిపోయింది. అలాంటిది ఓ అప్డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో వస్తాదనే గ్యారంటీ కూడా లేదు. కానీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలవ్వొచ్చని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను: బాల్కసుమన్
సాక్షి,హైదరాబాద్:ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్18) సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని విమర్శించారు.‘హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్.తమ్మడి కుంట ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చడంలేదు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్‌లను కూల్చరు. ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ప్రజా పాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని, అధికారులను కెసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలి పెట్టను’ అని సుమన్ ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు -
‘టీటీడీ’ తరహాలో యాదాద్రి బోర్డు: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం(ఆగస్టు30) సచివాలయంలో రివ్యూ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు.ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. -
శ్వేతపత్రం విడుదల చేయాలి
-
ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. రీసెంట్గా 'కల్కి'తో ఇంటర్నేషనల్ రేంజుకి చేరుకున్న ఈ హీరోని ఇప్పటికే చాలామంది ప్రశంసించారు. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ లేకపోతే 'బాహుబలి' సినిమా లేదనే కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కోల్‌కతా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ ఆగ్రహం)క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందులోనే పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్టం రాజు అని చెప్పారు. అలానే హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన 'బాహుబలి' సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని పొగడ్తలు కురిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వెళ్లింది. 'సలార్', 'కల్కి' హిట్టవడంతో అది మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)Telangana Chief Minister about Telangana king👑#Prabhas pic.twitter.com/0U1Gsz071F— Prabhas Trends (@TrendsPrabhas) August 18, 2024 -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
సీఎం రేవంత్‌పై ప్రివిలేజ్ మోషన్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. సోమవారం(జులై 29) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకొని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. సభా నాయకుడు మిస్ లీడ్ చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల అంశంలో మెటీరియల్‌లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా... మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో కాంగ్రెస్‌కు ఆ మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు.గతంలో 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదా ? చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్‌లతో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్‌లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు’అని హరీశ్‌రావు అన్నారు. -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీకీ సీఎం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి మంగళవారం(జులై 16) సాయంత్రం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.భారీ వర్షం కురిసేటపుడు 141 లాగిన్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి వెంటనే నీళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థి నేతలపై పోలీసుల అణచివేత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులపై పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఒక ప్రకటనలో తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ములాఖత్‌లు జరిపారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు.ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందని చెప్పారు. కానీ ప్రస్తుతం వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ పదేపదే చెబుతూ..నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ కేలండర్ తేదీల గడువు ఇప్పటికే తీరిపోయిందని తెలిపారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంతవరకు వదలం: హరీశ్‌రావు నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్లు సాధించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తి నిరంతర పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని నిర్బంధించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరిగే అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.అరెస్టులపై బీఆర్ఎస్ ఖండనఏడు నెలలుగా నిరుద్యోగ సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్‌పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందని నిరంజన్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ అందుబాటులో లేరని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. -
నేడు వరంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం సీఎం పర్యటన ఖరారు అయినప్పటికీ ఢిల్లీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున శనివారానికి వాయిదా పడింది. గ్రేటర్ వరంగల్ సమగ్ర అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించేందుకు ఆయన శనివా రం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మే రకు సీఎంవో వర్గాలు శుక్రవారం సాయంత్రం ము ఖ్యమంత్రి పర్యటన వివరాల్ని విడుదల చేశాయి. ఇదీ షెడ్యూల్...ఢిల్లీ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు కాకతీయ టెక్స్టైల్ పార్క్‌కు చేరుకుంటారు. 1.30 నుంచి 1.50 గంటల వరకు టెక్స్టైల్ పార్క్ సందర్శిస్తారు. అక్కడి నుంచి రంగంపేట వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ని సందర్శిస్తారు. 2.10 నుంచి 2.30 గంటల వరకు ఆస్పత్రి సందర్శన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు.2.45 నుంచి 3.00 గంటల మధ్య మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యకలాపాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5.40 నుంచి 6.10 వరకు హంటర్ రోడ్డులోని మెడికోవర్ ఆస్పత్రిని ప్రారంభించి 6.10 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో 7.20 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. -
నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే
సాక్షి, ఢిల్లీ: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని తెలిపారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రహదారి పనులు చేపట్టాలి..హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు వరుసలుగా విస్తరించాలి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో రోజుకు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వరుసల పనులు చేపట్టడం లేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు వరుసలుగా రహదారి విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్-సోమశిల-కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ వాసులకు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.కల్వకుర్తి-నంద్యాల రహదారి (ఎన్‌హెచ్-167కే) హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి-కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు హైదరాబాద్-కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు.హైదరాబాద్-శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహన రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంథనికి జాతీయ రహదారి ప్రకటించండి..మంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదని, జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్-565, ఎన్‌హెచ్-353సీ అనుసంధానమవుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు..తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్-మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్-163) ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం పూర్తయిన ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదు. ఆ మార్గంలో ఉన్న మర్రి చెట్లను కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌లోకేషన్ చేసేందుకు ఎన్‌హెచ్ ఏఐ అంగీకరించింది. ఈ దశలో ఎలైన్మెంట్ మార్చడం సాధ్యం కాదు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి. సేతు బంధన్ స్కీం కింద 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి. గిత్యాల-కాటారం (130 కి.మీ.), దిండి-నల్గొండ (100 కి.మీ.), భువనగిరి-చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్-సంగారెడ్డి (182 కి.మీ), మరికల్-రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి-మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ-బీదర్ (134 కి.మీ.), కరీంనగర్-పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్-రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి-దుద్దెడ (75 కి.మీ.), సారపాక-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ-రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట-కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల-కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్-సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్-రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ.జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలి. -
మీ అబద్ధాలకు సమాధిలో గోబెల్స్ సిగ్గుపడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి అబద్ధాల ప్రచార సృష్టికర్త జోసెఫ్ గోబెల్స్ కూడా సమాధిలో సిగ్గుతో తలదించుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని కేసీఆర్ వ్యతిరేకించినందునే గత ప్రభుత్వం ఎన్నడూ వేలంలో పాల్గొనలేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతోందని ఆరోపించారు. గతంలో నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే ఆ గనుల నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేకపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ పేర్కొన్న రెండు కంపెనీలు 2021లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనులు దక్కించుకున్న విషయాన్ని రేవంత్ మర్చిపోరాదన్నారు.కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలుతెలంగాణ ప్రజల ఆకాంక్షలను క్రూరంగా అణచి వేసి వేల మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాల ను కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తాకట్టు పెడు తున్న తీరును తెలంగాణ పౌరులు గమనిస్తున్నా రన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికే నదీజలాల వాటాను వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.పెట్టుబడుల్లో తెలంగాణ అగ్రస్థానంగత ఆర్థిక సంవత్సరం 2023–24లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తగ్గినా బీఆర్ఎస్ సాగించిన పాలన వల్లే తెలంగాణ మాత్రం 100 శాతానికి మించి ఎఫ్‌డీఐలను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2022–23తో పోలిస్తే 2023–24లో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించగా తెలంగాణ ఏకంగా 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో రావడంతో ఇది సాధ్యమైందన్నారు. -
కేసీఆర్‌కు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి హాజరుకావా ల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ వ్యక్తిగత ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లను సీఎం ఆదేశించారు.ఈ మేరకు కేసీఆర్‌ను కలసి ఆహ్వాన లేఖ, పత్రికను అందించేందుకు వారిద్దరూ కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరిపారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని సిబ్బంది వెల్లడించడంతో.. ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు వేణుగోపాల్, అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది.చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ.. వేడుకలకు ఆహ్వానం..సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి అనారో గ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలంటూ రామయ్యను ఆహ్వానించారు. -
‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న విధానాల కంటే మెరుగైన విధానాలను అమలు చేయాలని యోచిస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన టీజీ ఐపాస్ (గతంలో టీఎస్ ఐపాస్) చట్టంలో సమూల మార్పులు చేస్తూ కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. రెండు పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సర్కార్ నూతన పాలసీలో ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం టీజీ ఐపాస్‌ను అమలు చేసింది. మరోవైపు పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేసింది. టీ ఐడియా (జనరల్ కేటగిరీ), టీ ప్రైడ్ (ఎస్సీ, ఎస్టీ) స్కీమ్‌ల కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ, సేల్స్ టాక్స్ తదితరాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని, నూతన పారిశ్రామిక విధానంలో తాము వీటికి పెద్దపీట వేస్తామన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. పేరుకు పోయిన బకాయిలు కొత్త ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.3,736.67 కోట్లు. వీటిలో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఇచి్చన రూ.684 కోట్ల విలువైన చెక్కులు చెల్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు చెల్లించేలా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
కాళేశ్వరంపై చర్చకు రా! కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ రాంగోపాల్‌పేట్: మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్మూ, ధైర్యముంటే కాళేశ్వరంపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్.. గంటల కొద్దీ టీవీ స్టూడియోలో కూర్చుని కాళేశ్వరంపై మాట్లాడారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల రాజకీయాలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. కేసీఆర్, మోదీ తోడు దొంగలని.. వారికి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చచ్చిన పాములా మారిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో, అంతకుముందు సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాలేదు. అడిగేటోళ్లు, చూపించేటోళ్లు నీవోళ్లే.. గంటల కొద్దీ టీవీ స్టుడియోలో కూర్చుని మాట్లాడావ్. మేధస్సు కరిగించి కాళేశ్వరం కట్టినమంటున్నవ్ కదా.. మరి మేడిగడ్డ మేడిపండు ఎందుకైంది. సూటిగా సవాల్ విసురుతున్నా.. మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం.. కేసీఆర్.. దమ్ముంటే చర్చకు రావాలి. గత పదేళ్లలో దోపిడీ కోసం మెదడు రంగరించారు కనుకనే కాళేశ్వరం కూలిపోయింది. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన ప్రాజెక్టు ఏడాదన్నా లేకపాయే.. ఇంకా ఏం మాట్లాడుతున్నారు. ఇంతకంటే దివాళాకోరు తీరు ఎక్కడా ఉండదు. కాంగ్రెస్ హయాంలో దశాబ్దాల కింద కట్టిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ ఇద్దరూ తోడు దొంగలు ప్రధాని మోదీ, కేసీఆర్ తోడు దొంగలు. ఒక నాణేనికి బొమ్మ బొరుసులాంటి వాళ్లు. వారి చీకటి ఒప్పందాలు, ముసుగు రాజకీయాలతో దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పిన ప్రజలు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, మోదీకి గుణపాఠం చెప్పాలి. వారి కుట్రలను భగ్నం చేయాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ.. పదేళ్లలో ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు. ఏమైనా పొంతన ఉందా? మోదీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. బీజేపీ నల్ల చట్టాలతో అంబానీ, అదానీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్ర చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో హరియాణా, పంజాబ్ రైతులు చేసిన ఉద్యమంతో ప్రధాని మోదీ దిగివచ్చి క్షమాణలు చెప్పిన విషయాన్ని మర్చిపోగలమా? బీజేపీ ప్రజా సంక్షేమాన్ని వదిలేసి మత రాజకీయాలకు పాల్పడుతోంది. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి. అంతే తప్ప రాజకీయం చేయొద్దు. ఓరుగల్లులో విజయం ప్రజాపాలనకు నాంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా.. తెలంగాణను పట్టిపీడిస్తున్న కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరాను. ఆ పిలుపు మేరకు ఇక్కడి 12 అసెంబ్లీ స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఓరుగల్లు ప్రజలు ప్రజాపాలనకు పునాదులు వేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి చీడపురుగును ఓడించిన యశస్విని, ఝాన్సీరెడ్డి ప్రజల మదిలో నిలిచారు. ఓరుగల్లు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు... ఐటీ విస్తరణతోపాటు హైదరాబాద్– వరంగల్– రామగుండం ఇండ్రస్టియల్ కారిడార్‌తో యువతకు ఉపాధి కల్పిస్తాం.వానాకాలం వస్తే నీళ్ల నిలిచిపోయి, మురికి కంపు కొట్టే గోసను రూపుమాపుతాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. హైదరాబాద్ మాదిరి ఔటర్ రింగురోడ్డు నిర్మించి.. విమానాలు సరాసరిగా దించగలిగేలా మహర్ధçశ కల్పిస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వరంగల్ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. హరీశ్.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. ‘‘బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఒక మాట అన్నడు.. రైతు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తానని అన్నడు. నేను ఈ వేదిక మీది నుంచి మాట ఇస్తున్నా.. రామప్ప శివుని సాక్షిగా, సమ్మక్క–సారలమ్మ సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా చెప్తున్నా.. సూర్యుడు పడమరన ఉదయించినా, భూమి ఆకాశం తిరగబడ్డా, తుపాను వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా సరే.. పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా.. హరీశ్‌రావు.. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నావుకదా.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడుతా.. మాటమీద ఉండాలె.. మీ మామలా దళితుడిని సీఎం చేస్తా, లేకుంటే తలకాయ నరుక్కుంటానని తలకాయ లేని మాటలు మాట్లాడుదామని అనుకుంటున్నవేమో! ఆనాడు వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకున్నవ్.. పది పైసల అగ్గిపెట్టె దొరకలే.. ఇప్పుడట్లనే అనుకుంటున్నవేమో.. రుణమాఫీ చేసి పంద్రాగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం సంగతి తేలుస్తా..’’ కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ‘‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగింది. 2004, 2009లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తిని తీర్చింది. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తీసుకువచ్చింది. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను ఎంపీ గెలిపిస్తే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఓటేసే బాధ్యత మీదైతే కీలక స్థానం కల్పించే బాధ్యత నాది. హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీయే. కానీ మోదీ దేవుళ్ల పేరు చెప్తూ, దేవుళ్లను రోడ్డు మీదకు తెస్తూ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు.సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. 2021లో నగరాన్ని వరదలు ముంచెత్తితే.. కిషన్‌రెడ్డి హోం శాఖ సహాయ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ తన పరిధిలో ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేకపోయారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకుపోతుంటే కూడా కిషన్‌రెడ్డి ఏమి చేయలేకపోయారు...’’ అని రేవంత్ విమర్శించారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యరి్థగా పోటీచేస్తున్న పద్మారావుగౌడ్ మంచోడేనని.. కానీ వాళ్ల గురువు కేసీఆర్‌ను నమ్ముకుంటే మాత్రం మునిగినట్లేనని వ్యాఖ్యానించారు. మహంకాళి ఆలయంలో పూజలు.. భారీ ర్యాలీ బుధవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్యాట్నీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ మరో కార్యక్రమానికి వెళ్లిపోగా.. దానం నాగేందర్ ఇతర నేతలతో కలసి నామినేషన్ వేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. సీఎం పర్యటన, ర్యాలీ, కార్నర్ మీటింగ్ సందర్భంగా సుమారు 3 గంటల పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. -
KCR Shocking Comments: ఏ క్షణమైనా రేవంత్ సర్కారుకు..?
సాక్షి,హైదరాబాద్ : కేసిఆర్ సంచలన విషయాలు బయట పెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు మనుగడ కష్టమేనన్నారు. తన వాదనకు కొన్ని ఉదాహరణలను ముందుంచారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో BRSకు కనీసం ఎనిమిది సీట్లు వస్తాయన్నారు కెసిఆర్. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న సంకేతాలిచ్చారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్న వ్యాఖ్యలు చేశారు కెసిఆర్. ముందుంది ముసళ్ల పండగే రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగే అన్న సంకేతాలిచ్చారు కెసిఆర్. "BRS పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది BRS ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే BJP వాళ్ళు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బిజెపి వాళ్లు బతకనిస్తారా?" అని ప్రశ్నించాడు. "రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని BRSని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బిజెపి కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు" అని కెసిఆర్ చెప్పారు. "ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్" అని నన్ను సంప్రదించాడు. కానీ ఇప్పుడే వద్దని నేనే వారించానని కేసీఆర్ చెప్పారు. ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయంటే? ఇప్పుడున్న పరిస్థితులను సమీక్షిస్తే.. "ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో గెలుస్తాం, మరో మూడింటిలోనూ విజయావకాశాలున్నాయి. బస్సుయాత్ర చేద్దాం. జనం నుంచి పార్టీ పట్ల మంచి స్పందన వస్తోంది. ఇప్పుడున్న రేవంత్ సర్కారుపై వీపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభిస్తాను. కీలకమైన "వరంగల్ , ఖమ్మం.. మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిద్దాం" అని అన్నారు. "బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, పదేళ్ల నుంచి లేని కరువు ఈసారి కనిపిస్తోంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. కొంత మంది బీఆర్ఎస్ నాయకులు వెళ్లినంత మాత్రానా.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. మనం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు. వెళ్లిన వారి స్థానంలో అంతకంటే గట్టి నాయకులను తయారు చేసుకుందాం" అని పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచే ప్రయత్నం చేశారు. మన ఎలక్షన్ ప్లాన్ ఏంటంటే? "ఒక్కో లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్డు షోలు నిర్వహించబోతున్నాం. రోజుకు రెండు మూడు రోడ్‌షోలుంటాయి. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు పెట్టబోతున్నాం. అలాగే కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తాం. ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లనున్నట్టు" కెసిఆర్ సూచించారు. "బీఆర్ఎస్లో ప్రతీ నాయకుడు ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై స్పందించాలి. పోస్టు కార్డు ఉద్యమం చేయాలి, ఒక్కోపార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు పోస్ట్ కావాలి, రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.500 బోనస్ పై ప్రశ్నించాలి. రేవంత్ ఇచ్చిన హామీలపై గుర్తు చేయాలి" అని పిలుపునిచ్చారు. కవిత అరెస్ట్‌పై ఏమన్నారంటే.? తన కూతురు కవిత అరెస్ట్‌పై తొలిసారి బహిరంగంగా స్పందించారు కెసిఆర్. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. తన కూతురు కవితను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినందుకు బీజేపీ అగ్రనాయుకుడు బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టినందుకే కవితపై కేసు పెట్టారన్నారు కెసిఆర్. త్వరలో మళ్లీ పాత కెసిఆర్‌ను చూడబోతున్నారని, ఉద్యమ కాలం నాటి నాయకుడిని చూస్తారని అన్నారు. అలాగే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం పైనా స్పందించారు కెసిఆర్. పిల్లర్ల కింద ఉన్న ఇసుకంతా కుంగిపోవడం వల్ల పిల్లర్లు దెబ్బ తిన్నాయని, అంతే తప్ప నిర్మాణంలో లోపాలేవీ లేవన్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
మీ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీ ఆర్కు మతిభ్రమించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రామ్మోహన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, కమల్‌తో కలిసి మాట్లాడారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్‌కు బుర్ర పనిచేయడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారని, పార్లమెంటు ఎన్నికల్లో చేయడానికి కేటీఆర్ దగ్గర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జేబుదొంగ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజల జేబులు కొట్టి దోచుకున్న రూ.వేల కోట్లను కల్వకుంట్ల కుటుంబం నుంచి కక్కిస్తామని చెప్పారు. ‘దొంగలు కాబట్టే చెల్లి తీహార్ జైల్లో ఉంది. నువ్వు కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. ఫోన్‌ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి మీరు చేసిన వసూళ్ల జాబితా వస్తుంది సిద్ధంగా ఉండు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. అందరి దృష్టి ఆ సీటుపైనే -
సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇతడి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి కొందరికి తెలుసు. పలు విద్యాసంస్థలు, వ్యాపారాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాంటిది తాజాగా ఈయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్) అదే కారణమా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. వీళ్లలో కొందరు కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ కూడా అలాంటిదేనని మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్లో టికెట్ అశించి భంగపడ్డ ఈయన.. కాంగ్రెస్ లో చేరారని, అలానే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు. గతంలో ఆ స్థానానికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా.. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తన అల్లుడు అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలిసివచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రామ్‌చరణ్‌ను కలిశా.. ఏం మాట్లాడానో అడగొద్దు: విశ్వక్ సేన్)