revanth
-
ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రింగ్‌రోడ్డు కోసం చౌటుప్పల్ జంక్షన్ వద్ద 184 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. ఆ భూములు, ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాత వారి అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించే మహాధర్నాకు రావాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. వారి సమస్యలపై కూడా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దివ్యాంగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించి.. ఏడాది అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. -
ఢిల్లీ హీట్: అటు కేటీఆర్.. ఇటు రేవంత్.. గవర్నర్ కూడా..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బయలేర్దారు. కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. మరో వైపు సీఎం రేవంత్‌పై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు ఒకే సమయంలో ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమృత్ పథకంలో స్కాం జరిగిందని కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్‌కు వెళ్లడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరినట్లు సమాచారం.కాగా, మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన సస్పెన్స్‌గా మారింది. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించేందుకా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్‌కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో విమర్శించారు. -
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతంగా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.కొన్న గంటల్లో రాష్ట్ర ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీరవాణి బృందం కలిసింది. అందులో సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లు ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక ఇలా చెప్పుకొచ్చింది. 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్‌కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
విభజనతో చేదు అనుభవాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, అనేక చేదు అనుభవాలను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఇటు తెలంగాణగానీ, అటు ఏపీగానీ సంబరాలు చేసుకోలేపోయాయని.. విభజన సమయంలో విషపు బీజాలు నాటబడ్డాయని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రసంగించిన మోదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందరి సమ్మతితో కష్టతరమైన పనులనూ పార్లమెంటు పూర్తి చేసింది. ఇదే సభలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ఆ రాష్ట్రాల విభజన సమయంలో అన్నిచోట్లా సంబరాలు జరిగాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్.. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి. అందరి సమ్మతితో సుహృద్భావ వాతావరణంలో విభజన జరిగింది. కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’అని మోదీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఫిబ్ర వరి 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ వ్యాఖ్యలు: రేవంత్‌రెడ్డి తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ మాట్లాడటం ఘోరం. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. మనం బీజేపీని తరిమికొడదాం’’అని ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే: రాహుల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే..’’అని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు: బీఆర్ఎస్ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సభలో తిప్పికొట్టారు. బీఆర్ఎస్ తరఫున ప్రసంగించిన నామా... ‘‘తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిలి్చందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ నేడు దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. తలసరి ఆదాయం, తల సరి విద్యుత్ వినియోగంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ రావాల్సి ఉంది..’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలే ఉంటే ఇప్పుడు 300కు పైగా ఉన్నారని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని... అదే మాదిరి గా ఇద్దరు ఎంపీలే ఉన్నా తమ పార్టీ కొట్లాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఇక నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని, హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతని కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పారు. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
రేవంత్, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వార్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లి డి.కె.శివకుమార్‌ను కలిసిన ఫొటోను పోస్టు చేస్తూ ‘అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడం’ అని కవిత ట్విట్టర్లో జత చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ దండం పెడుతున్న ఫొటోతో రీట్వీట్ చేశారు. ‘గల్లీల్లో సవాళ్లు.. ఢిల్లీలో వంగివంగి మోకరిల్లి వేడుకోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు, జగమెరిగిన నిక్కర్ లిక్కర్ లాజిక్కు’ అని పోస్టు చేశారు. -
ఒరిజినల్ కాంగ్రెసును కాపాడుకోవడమే మా లక్ష్యం : ఉత్తమ్
-
తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత
బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్‌కే ఉందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ.. రేవంత్ కంటతడి
బిగ్‌బాస్ ఆరో సీజన్ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఇందులో బాగంగా మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆదిరెడ్డి తన భార్య కవిత, కూతురు అద్వితను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. కూతురికి అన్నం తినిపించాడు. అనంతరం తన ఆటతీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. తన డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నామని కవిత చెప్పడంతో ఆదిరెడ్డితో సహా ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వారు. ‘అందరు మంచి వాళ్లు గేమ్ వరకు కొట్టుకోండి..తింటుకోండి కానీ..’ అని కవిత ఏదో చెప్పబోతుండగా.. ‘ఏంటి నన్ను కూడా కొట్టమంటున్నావా?’ అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది కవి. కేక్ కట్ చేసి కూతురు బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. భార్య, కూతురు రాకతో ఆదిరెడ్డి చాలా సంతోషంగా ఉంటే.. రేవంత్ మాత్ర తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. మరి రేవంత్ ఫ్యామిలీ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తుందా? అన్నది చూడాలి. -
కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవాలంటే..
బిగ్‌బాస్ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌజ్ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్‌కి కఠిమైన టాస్క్‌తో పాటు వారి ప్రైజ్‌మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్‌బాస్. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. దీంతో ఆదిరెడ్డి ఈ పాస్ తనకు వద్దంటూ టాస్క్ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్, శ్రీహాన్, ఫైమా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 6: కంట్రోల్ తప్పిన రోహిత్.. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ఫుల్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మరింత వాడివేడిగా జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘నాగమణి’టాస్క్‌లో విజయం సాధించిన పాముల టీమ్ సభ్యులు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తిలతో పాటు శ్రీసత్య, మెరీనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి ‘వస్తా నీవెనుక’అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా థర్మాకోల్ బాల్స్ నిండి ఉన్న బ్యాగ్‌లను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి.. రోహిత్, మెరినాలను టార్గెట్ చేసినట్లు చేసింది. అందరికంటే ముందే మెరినా టాస్క్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్‌పై అటాక్‌కి వెళ్లిన ఆదిరెడ్డికి ఫైమా తోడైంది. ఇద్దరు కలిసి రోహిత్‌ని బ్యాగ్‌ను చించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్ సంచాలక్‌పై ఫైర్ అయ్యాడు. ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకుంటే ఏం అనలేదు కానీ.. నన్ను మాత్రం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ‘నేను బ్యాగ్‌ని పట్టుకోలేదు’ అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే మెరినా మాత్రం రోహిత్‌ని కూల్ చేస్తూ..‘జనాలు చూస్తున్నారు’లే అని సర్థిచెప్పింది. అయినా రోహిత్ కోపం చల్లారలేదు. ఇక ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరు అనేది నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
హౌస్మేట్స్ కోసం త్యాగం, చివరకు బకరా అయిన రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 40: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్, ఆది రెడ్డి, గీతూలకు సర్ప్రైజ్లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌస్మేట్స్ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు. మరి ఎవరికి ఎలాంటి సర్ప్రైజ్లు అందాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. ఇనయ- సూర్యలు ఒకరికొకరు ఫెవికాల్లా అతుక్కుపోయారు. ఇప్పటిదాకా ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకున్న ఈ ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్‌ను మరొకరు చప్పరించారు. ఇనయ లాలీపాప్ తింటూ దాన్ని సూర్యతో షేర్ చేసుకుంది. అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం. అటు బాలాదిత్య సిగరెట్లు లేక అల్లాడిపోయాడు. పొద్దునకల్లా తిరిగి పంపించేస్తాను ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్‌బాస్ అని కెమెరాల దగ్గర మొత్తుకున్నాడు. కానీ బిగ్‌బాస్ ఏడిపించే రకమే కానీ కరుణించే రకం కాదు కదా! మరోవైపు అన్నం సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ వండమని ఆదిరెడ్డి కెప్టెన్‌ను అడిగాడు. దానికతడు రైస్ వేస్ట్ కాకూడదు అంటూ కస్సుబుస్సులాడాడు. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బందిపడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి ప్రశ్నించగా మీరు ఇబ్బందిపడ్డారా? అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉంది కాబట్టే అడిగానని ఆదిరెడ్డి చెప్తున్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో టెలిఫోన్ బూత్‌కు బిగ్‌బాస్ కాల్ చేశాడు. రోహిత్, వాసంతిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు స్వతాహాగా నామినేట్ అయితే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. ఇంటిసభ్యుల కోసం తాను నామినేట్ అవడానికి సిద్ధమని రోహిత్ వెల్లడించడంతో బ్యాటరీ వంద శాతం రీచార్జ్ అయింది. కాకపోతే ఈసారి బిగ్‌బాస్ పిలవడం కాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికే సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. మొదటగా రేవంత్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతడు 10 శాతం రీచార్జ్ వినియోగిస్తూ భార్య ఫొటో సెలక్ట్ చేసుకున్నాడు. ఫైమా 25 శాతం రీచార్జ్ ఉపయోగించి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. కీర్తి.. 15 శాతం ఉన్న మానస్ ఆడియో మెసేజ్ విని సంతోషపడింది. సూర్య.. 20 శాతం ఉన్న అమ్మ లేఖ అందుకుని చదివి మురిసిపోయాడు. వాసంతి.. 15 శాతం రీచార్జ్ ఉన్న అక్క కూతురి ఫొటో తీసుకుంది. రాజ్.. 15 శాతం రీచార్జ్ వినియోగిస్తూ అమ్మతో ఆడియో కాల్ తీసుకున్నాడు. రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీచార్జ్ మొత్తం అయిపోయింది. నిజానికి రోహిత్ వల్లే బ్యాటరీ రీచార్జ్ అయినా అతడికి, మెరీనాకు మాత్రం ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా బంతిని వారి బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కిందామీదా పడ్డ హౌస్‌మేట్స్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టు విడవకుండా గేమ్ ఆడి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: శ్రీసత్య కన్నింగ్, వాసంతి ఎడ్డిది: స్రవంతి సినిమా ఛాన్స్ పేరుతో నన్ను ఇంటికి పిలిచి... బిగ్‌బాస్ కంటెస్టెంట్ బండారం బయటపెట్టిన నటి -
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్‌లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
Bigg Boss 6: సిగ్గూ, శరం ఉండాలి.. కోపంతో ఊగిపోయిన రేవంత్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.ఒక టీమ్ పోలీసులుగా వ్యవహరించనుండగా, రెండో టీమ్ దొంగలుగా ఉన్నారు. గీతూ రాయల్ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా ఉంటోంది. అయితే టాస్క్‌లు రెండు టీమ్‌లు సభ్యులు బిగ్‌బాస్ రూల్స్‌ని బ్రేక్ చేశారు. వస్తువులను కాపాడాల్సిన పోలీసులే.. అడవిలోని విలువైన వస్తువులను దొంగతనం చేశారు. ఇక వస్తువులను కొనాల్సిన గీతూ కూడా కొన్నింటిని కొట్టేసింది.దీంతో బిగ్‌బాస్ మరోసారి టాస్క్ గురించి వివరించాడు. రైడ్‌కి వెళ్లిన పోలీసులు సమయానికి మించి అక్కడే ఉంటే..వారిని దొంగలు కిడ్నాప్ చేయ్యొచ్చు. ఈ కండీషన్‌పై స్టోర్ రూంలోకి వెళ్లిన ఇనయాను దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఇద్దరు దొంగలు మాత్రమే ఇనయాను కిడ్నాప్ చేయాల్సి ఉండగా.. అందరూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. తనను తాను తప్పించుకునే క్రమంలో ఇనయా.. ఆరోహిని కాలితో తన్నడంతో పాటు నేహ చెంపపై కొట్టింది. గుండెల మీద పట్టుకొని బయటకు నెట్టి చెంపపై కొట్టిందని రేవంత్‌తో చెబుతూ నేహా బాధ పడుతుంటే..షూతో ఆరోహి మొహం మీద తన్నిందని రేవంత్ చెప్పాడు. ఇక ఇదే విషయంపై కీర్తి, ఇనయా మధ్య డిస్కషన్ జరిగింది. నేను రైడ్‌కి వెళ్లే సమయంలో నేహ బెడ్ రూమ్‌లో ఉందని ఇనయా అంటే..లేదని కీర్తి చెప్పింది..ఇలా ఇద్దరు గొడవపడుతుంటే.. చంటి కలగజేసుకొని ఆ సమయంలో నేహ బెడ్ రూమ్‌లో లేదని చెప్పడంతో అందరూ కూల్ అయిపోయారు. గీతూ, ఇనయాల మధ్య కూడా కిడ్నాప్ గురించే గొడవ జరిగింది. ఆ సమయంలో దొంగల టీమ్‌లోని సభ్యులెవరో తన డ్రెస్‌ని పైకి లాగారని ఇనయా అంటే.. ఇవన్నీ తప్పుడు మాటలని గీతూ మొహం మీదే చెప్పేసింది.‘నువ్ తప్పు మాటలు మాట్లాడుతున్నావ్.. మాటలు మారుస్తున్నావ్ ’అంటూ ఇనయాను రెచ్చగొట్టింది. చివరకు ఇనయా నేను చేసిందే తప్పే..కానీ వాళ్లు చేసింది ఎంతవకు కరెక్ట్? అని చెబుతూనే.. కిడ్నాప్ చేసుకోండి అని ఇంట్లోకి వెళ్లింది. ‘అడవిలో ఆట’ టాస్క్‌లో ఎలాగైనా గెలిచి కెప్టెన్సీ కంటెండర్ కావాలని గీతూ కన్నింగ్ ప్లాన్ వేసింది. తను కొనుగోలు చేసిన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌లతో డీల్ కుదుర్చుకుంది. అయితే గీతూ ఇచ్చిన డబ్బులను శ్రీహాన్ తీసుకున్నాడు కానీ.. సూర్య మాత్రం తీసుకోలేదు. ఇక దొంగల టీమ్ సభ్యుడైన రేవంత్‌పై ఆ టీమ్ సభ్యులే అనుమానం వ్యక్తం చేశారు. గీతూతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నాడని, అతని బొమ్మలు లేపేద్దామని నేహా, ఆరోహి ప్లాన్ వేశారు. అనుకున్నట్లే రేవంత్ దాచుకున్న బొమ్మలను దొంగిలించారు. దీంతో రేవంత్ కోపంతో ఊగిపోయాడు. తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గూ శరం లేదంటూ మండిపోయాడు. నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా అంటూ దొంగల టీమ్‌పై అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా రాత్రంతా నిద్ర పోనని, పోలీసుల టీమ్‌ని గెలించడమే తన లక్ష్యమని చెప్పాడు. బుధవారం నాటి ఆట ముగిసే సరికి.. శ్రీహాన్, సూర్యల వద్దే ఎక్కువ డబ్బులున్నట్టు కనిపిస్తోంది.అలాగే గీతూ కూడా తనకు కావాల్సిన బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. -
బిగ్‌బాస్ 6 టైటిల్ నాదే.. వైరల్‌గా సింగర్ రేవంత్ పోస్ట్
హౌజ్‌లో ఇంకా అడుగు పెట్టకుండానే టైటిల్ నాదే అంటూ ధిమా వ్యక్తం చేశాడు సింగర్ రేవంత్. అయితే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ తాజాగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ 6వ సీజన్ రేపు గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. హౌజ్‌లో అడుగుపెట్టేది వీరేనంటూ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఐడల్ విజేత సింగర్ రేవంత్ ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: పవన్ కల్యాణ్‌కి విషెస్ చెప్పని బన్నీ, కారణమిదేనా? తాజాగా ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేశాడు రేవంత్. ‘జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం చాలా కష్టం... నా కుటుంబాన్ని మిస్ అవుతాను. ముఖ్యం నా భార్యను అలాగే నా సంగీతాన్ని. కానీ ఓ భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటికు వస్తాను. త్వరలోనే మీ అందరి కలుసుకుంటా. ఓటింగ్స్ ద్వారా మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి. మీ అందరిని అలరించేందుకు చివరి రంగం సిద్ధమైంది. మీ అందరి ప్రేమ, ఆశ్వీర్వాదంతో టైటిల్ గెలిచి వస్తాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసి అతడి ఫ్యాన్స్ ‘ఆల్ ది బెస్ట్’ అంటూ రేవంత్‌ని విష్ చేస్తున్నారు. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి కాగా బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ కానీ, అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మూడు నెలల పాటు హౌజ్‌లో ఉండాలనేది బిగ్‌బాస్ రూల్. అంతేకాదు హౌజ్‌లో అడుగుపెట్టేవరకు కంటెస్టెంట్స్ ఎవరూ తాము బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్న విషయాన్ని బయటకు లీక్ చేయొద్దు. అది బిగ్‌బాస్ రూల్. కానీ రేవంత్ ఇంకా బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టకుండానే అఫిషియల్‌గా పోస్ట్ షేర్ చేయడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది. మరి ఇది బిగ్‌బాస్ పర్మిషన్‌తోనే చేశాడా? లేక ఆత్రుత ఆగలేక తొందరపడి పెట్టేశాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. -
సింగర్ రేవంత్ పెళ్లి, ఫొటోలు వైరల్
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితను పెళ్లాడాడు. ఆదివారం (ఫిబ్రవరి 6న) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబర్ 24న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
టెన్త్ క్లాస్ డైరీస్ నుంచి సిలకా సిలకా సాంగ్ వచ్చేసింది..
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘సిలకా.. సిలకా.. రామా సిలకా.. ఏదో ఉందే మెలికా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సందర్భంగా ‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్స్‌పై ఈ పాటను తెరకెక్కించాం. ఈ పాటలో ఇద్దరు ముంబై డ్యాన్సర్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు. -
గ్రాండ్‌గా సింగర్ రేవంత్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
Singer Revanth Engagement With Anvitha, Pic Goes Viral: ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్‌గా కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్ ఇండియన్ ఐడల్-9 టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్-1లో మనోహరి పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రేవంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. డిసెంబర్24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రేవంత్‌కి కాబోయే భార్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
మిస్టేక్: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్.. సాంగ్ వైరల్
ఇటీవల వచ్చి 'రామ్ అసుర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అభినవ్ సర్దార్. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా విజయం సాధిస్తున్నాడు. తాజాగా 'మిస్టేక్' అనే మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అభినవ్. ఏఎస్పీ మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా రొమాంటిక్, సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్‌లో కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఎప్పటికప్పుడూ సినిమా అప్డేట్స్ వదులుతూ చిత్రం పట్ల ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి సాంగ్ 'గంటా గ్రహచారం' విడుదల చేశారు. తాజాగా గుంటూరులోని వీవీఐటీ కాలేజ్‌లో సుమారు 4 వేల మంది విద్యార్థుల నడుమ రెండో పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ సందడి చేశారు. రేవంత్ 'పిల్లా పిల్లా' అంటూ పాడిన ఈ పాట (TAQUERO MUCHO SONG) యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్ థీమ్, మణి జెన్నా సంగీతం, శ్రీరామ్ పిసుపాటి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. అయితే ఈ పాట కోసం సుమారు 40 మంది లిల్లీపుట్స్ను సేకరించడం విశేషం. అంటే ఈ పాటలో 40 మంది లిల్లీపుట్స్ నటించినట్లు తెలుస్తోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మిస్టేక్ చిత్రంతో అభినవ్ సర్ధార్ మరో మెట్టు ఎక్కనున్నాడని చిత్రబృందం అంటోంది. అతి త్వరలో సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. -
‘చిరంజీవి, రామ్ చరణ్ వల్ల మా జీవితమే మారిపోయింది’
‘సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి, రామ్ చరణ్ మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది’అన్నారు ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ►చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను. ►నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే. ►నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. ►మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది. మనలోని యూనిక్ పాయింట్‌ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు. ► చిరంజీవి ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు. ► చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు. కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది. కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ► క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం. కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి. ► నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పని చేస్తూ వచ్చాను. అలా హీరోయిన్లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది. ► నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.. ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది. ► నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది. ► నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉంది. ► మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలను చేయను. డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను. ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను. మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను. అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను. ► మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్
‘‘కొందరు వ్యక్తులు ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు అంటే వినిపించుకోరు. కానీ కథ ద్వారా చెబితే వింటారు. ‘నాట్యం’ కథ తప్పొప్పులను చెబుతుంది’’ అన్నారు రేవంత్. నాట్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ – ‘‘నాకు విఠలాచార్య, కె. విశ్వనాథ్‌గార్లంటే అభిమానం. తెలుగులో మంచి సినిమాలంటే ముందుగా కె. విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. అందుకే దర్శకుడిగా నా తొలి సినిమాను క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో తీయాలనుకుని ‘నాట్యం’ తీశాను. నాట్యం అనే ఊరిలోని ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఆ ఊరిలోని ఓ నాట్యగురువు వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతాడు. అయితే ఈ గురువు శిష్యురాలు తన నాట్య కళ ద్వారా ప్రజలను ఎలా చైతన్యవంతులను చేసింది? అన్నదే కథ. శిష్యురాలి పాత్రను సంధ్యారాజు చేశారు. ఈ సినిమాకు మెయిన్ లీడ్‌గానే కాదు.. నిర్మాత, సాంకేతిక నిపుణురాలిగా కూడా సంధ్యారాజు ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాటిక్ అంశాలను ‘నాట్యం’ చిత్రంలో పొందుపరిచాను’’ అన్నారు. -
ట్విట్టర్ వార్ కేటీఆర్ V/S రేవంత్
-
కాగ్నిజెంట్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ, కుమార్‌పల్లికి చెందిన సిద్ధోజు రేవంత్ (32) కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో అతను మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ షహనాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరు శ్రీరాంనగర్ ఏ బ్లాక్‌లో ఉంటున్నారు. ఏడాది క్రితం రేవంత్ భార్యను ఉద్యోగం మన్పించాడు. ప్రతి వారాంతంలో ఎవరి తల్లిదండ్రుల ఇళ్లకు వారు వెళ్లేవారు. ఈ క్రమంలో శనివారం షహనాజ్ మాదాపూర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి తాను ఇంటికి రావడం లేదని భర్తకు మెసేజ్ పెట్టింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రేవంత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో ఆమె అత్తమామలు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రేవంత్‌ను పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గచ్చిబౌలి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.