Rising Pune Supergiants
-
సలహాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చాడు.. ధోనిపై ఐపీఎల్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ (4 సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనలిస్ట్) మహేంద్ర సింగ్ ధోనిపై రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ మాజీ పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్ ప్రసన్న అఘోరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2016 సీజన్లో ధోని పూణే కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో తాను ఆ జట్టు పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్‌గా ఎంపికయ్యానని, తమ తొలి మీటింగ్‌లో ధోని ప్రవర్తన ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించిందని నాటి విషయాలకు క్రిక్‌బజ్‌తో పంచుకున్నాడు. తొలుత ధోనితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు చాలా లక్కీగా ఫీల్ అయ్యానని, అయితే ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎవరూ ఊహించని మాటలు రావడంతో అవాక్కయ్యానని తెలిపాడు. మొదటిసారి ధోనిని పూణే స్టేడియంలో కలిసినప్పుడు ఫిల్టర్ కాఫీ ఆఫర్ చేశాడని, ఆ తర్వాత జట్టు ప్రణాళికలు, వ్యూహ్యాల గురించి చర్చించాడని, అయితే ఊహించని విధంగా తనను మీటింగ్లకి రావాలని పిలవకండని వార్నింగ్ ఇచ్చాడని ఆరోపించాడు. అలాగే అడగనిదే సలహాలు ఇవ్వకండని తనతో చెప్పాడని అఘోరామ్ క్రిక్‌బజ్‌కు తెలిపాడు. కాగా, ప్రసన్న అఘోరామ్ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో పాటు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు స్ట్రాటెజిక్ కోచ్‌గా పనిచేశాడు. అఘోరామ్ గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ టెక్నికల్ హెడ్‌గా కూడా వ్యవహరించాడు. అఘోరామ్.. ధోని తరహా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడిన రెండేళ్లు (2016, 2017) ధోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. చదవండి: ఒంటరివాడైన రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2022లో ఏకైక కెప్టెన్‌గా..! -
మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..!
టీమిండియా కెప్టెన్‌గా ఓ వెలుగు వెలిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్-2017 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ.. సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ధోనీతో జట్టు యాజమాన్యానికి పడటం లేదని వార్తలు వచ్చాయి. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా ధోనీపై పరుష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. క్రికెట్ మైదానంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండే మిస్టర్ కూల్.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటాడు. టీమ్ యాజమాన్యం తన పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించినా.. మహీ మాత్రం ఎప్పటిలాగే సహచర ఆటగాళ్లతో కలసి ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమయ్యాక ధోనీ సహచర పుణె ఆటగాళ్లతో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. మహీ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో ఓ షార్ట్ వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ.. అజింక్యా రహానెతో కలసి డాన్స్ చేస్తుండగా.. బెన్ స్టోక్స్ వెనుక నిల్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్, 4400 కామెంట్లు వచ్చాయి. 2008 ఐపీఎల్ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్ నుంచి చెన్నై జట్టును సస్పెండ్ చేశాక గత సీజన్లో పుణె కెప్టెన్‌గా ధోనీ నియమితుడయ్యాడు. కాగా కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోనీ ఐపీఎల్లో ఆడుతుండటం ఇదే తొలిసారి. -
ముంబై ఇండియన్స్‌పై విజయం
-
ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఒకటైన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్(ఆర్పీఎస్) ఓ కీలక ఆటగాడి సేవలను కోల్పోనుంది. భారత స్టార్ స్పిన్నర్, పుణే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అశ్విన్ తాజా ఐపీఎల్-10కు దూరం కానున్నడాని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతేడాది ఏర్పడిన పుణే జట్టు తమ తొలి సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అశ్విన్ సేవలు కోల్పోతే ఈ సీజన్లో జట్టు విజయాలపై ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అశ్విన్ కానీ, పుణే జట్టుగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను కోహ్లీ నేతృత్వంలో 2-1తో నెగ్గిన జట్టులో కీలక సభ్యుడు అశ్విన్. ఈ క్రమంలో సిరీస్ ముగిసిన అనంతరం ముంబైలో అశ్విన్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు అశ్విన్ విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్లో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వరకు పూర్తిస్థాయిలో కోలుకుని భారత జట్టుతో చేరనున్నాడని సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో గాయపడ్డ రాహుల్ ఐపీఎల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. -
పుణె జట్టు పేరులో మార్పు!
న్యూఢిల్లీ:గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ..ఈ ఏడాది తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో పలు మార్పులను చేస్తోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన పుణె.. ఈసారి జట్టు పేరులో స్వల్ప మార్పులు చేసింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ లో ఎస్ అనే అక్షరాన్ని తొలగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఇక నుంచి పుణె సూపర్ జెయింట్ గానే తమ ఫ్రాంచైజీ పేరు ఉంటుందని ఆ జట్టు అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు. 'గతేడాది మా స్క్వాడ్‌లో నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లలో మాత్రమే సూపర్ జెయింట్ లక్షణాలను చూశాం. అయితే ఈఏడాది మొత్తం జట్టునే సూపర్ జెయింట్గా చూడాలనుకుంటున్నాం. అందుచేత 'సూపర్ జెయింట్' గా బరిలోకి దిగుతున్నాం' అని అధికారి ప్రతినిధి తెలిపారు. -
ఐపీఎల్‌కు మార్ష్ దూరం
ఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ భుజానికి గాయం కారణంగా ఐపీఎల్ పదో సీజన్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్లో మార్ష్ పుణే రైజింగ్ సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్ష్ ఇప్పటికే భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్ భుజానికి సర్జరీ చేయడం వల్ల తొమ్మిది నెలలు విశ్రాంతి అవసరం. గాయం కారణంగా 2009లో ఐపీఎల్‌కు కూడా మార్ష్ దూరమయ్యాడు. మార్ష్ ఆడకపోవడం తప్పనిసరిగా తన ఫ్రాంచైజ్ పూనే రైజింగ్ సూపర్‌జెయింట్స్‌కు ఒక పెద్ద దెబ్బన్ని చెప్పవచ్చు. -
ధోనీపై వేటా..? ఇంత అవమానమా??
-
ధోనీపై వేటా..? ఇంత అవమానమా??
రానున్న ఐపీఎల్లో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీపై వేటు వేసిన రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ తీరుపై మాజీ టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది చెత్త నిర్ణయమని, ధోనీని తీవ్రంగా అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు. 'నిర్ణయం తీసుకున్న తీరు, దానిని అమలుపరుచిన విధానం చెత్తగా, తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. భారత క్రికెట్ ఆణిముత్యం ధోనీ. తన 8-9 ఏళ్ల కెప్టెన్సీలో అతను అన్నింటినీ సాధించాడు. మా సొంత డబ్బుతో జట్టును నడిపిస్తున్నామని, కాబట్టి మాకు నచ్చిన నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీ అనుకొని ఉండొచ్చు. కానీ ధోనీని కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికేటప్పుడు అతని ప్రతిష్టను, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. గౌరవప్రదంగా అతనిని తప్పించి ఉంటే బాగుండేది. ఒక మాజీ క్రికెటర్‌గా ఫ్రాంచైజీ తీరు ఆగ్రహం, బాధ కలుగుతోంది' అని అజారుద్దీన్ 'ఆజ్‌తక్'తో పేర్కొన్నారు. -
డేర్‌డెవిల్స్ ఢమాల్
* పుణే చేతిలో ఢిల్లీ ఓటమి * రాణించిన జంపా, దిండా సాక్షి, విశాఖపట్నం: అంచనాలకు మించి రాణిస్తూ ప్లే ఆఫ్ వైపు దూసుకెళ్లిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి దశలో తడబడుతూ తమ అవకాశాలను క్లిష్టం చేసుకుంటోంది. మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ జట్టు తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిందే. అలాగే తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది నాలుగో ఓటమి. మరోవైపు తమకు నామమాత్రమైన మ్యాచ్‌లో మాత్రం పుణే సమష్టి కృషితో రాణించి ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 121 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (43 బంతుల్లో 41; 5 ఫోర్లు) పోరాడగా... చివర్లో మోరిస్ (20 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మోతెక్కించాడు. అశోక్ దిండా, ఆడమ్ జంపాకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పుణే 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసిన సమయంలో రెండోసారి వర్షం అంతరాయం కలిగిం చింది. దీంతో ఢిల్లీకన్నా రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో పుణే విజేతగా నిలిచింది. వికెట్లు టపటపా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టును పుణే బౌలర్లు ఓ ఆటాడించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడమే కష్టమైంది. ఓపెనర్ డి కాక్ (2)ను మూడో ఓవర్లోనే పేసర్ దిండా ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. తన మరుసటి ఓవర్లో శ్రేయస్ (8)ను కూడా అవుట్ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 28/2 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి తోడు మధ్య ఓవర్లు కట్టుదిట్టంగా పడడంతో సింగిల్స్ తీయడమే కష్టంగా మారింది. కరుణ్ నాయర్ ఒక్కడే నిలబడ్డాడు. పదో ఓవర్లో జంపా ప్రవేశంతో ఢిల్లీ పతనం ప్రారంభమైంది. శామ్సన్ (10), రిషబ్ (4), కరుణ్లను అవుట్ చేయడంతో జట్టు వంద పరుగులు చేయడం కూడా కష్టంగా అనిపించింది. అయితే చివరి ఓవర్లో మోరిస్ 4,6,4,6తొ మొత్తం 22 పరుగులు రాబట్టాడు. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే ఇన్నింగ్స్ ఖవాజా (13 బంతుల్లో 19; 4 ఫోర్లు) జోరుతో 3 ఓవర్లలోనే 30 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత పరుగుల వేగం మందగించింది. తొమ్మిదో ఓవర్లో వర్షం కారణంగా గంట పాటు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత 11వ ఓవర్లో రహానే 4,6 బాదగా మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఆట సాధ్యం కాలేదు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ ఎల్బీడబ్ల్యు (బి) దిండా 2; శ్రేయస్ అయ్యర్ (సి) ఖవాజా (బి) దిండా 8; నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) జంపా 41; శామ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జంపా 10; రిషబ్ (సి) పెరీరా (బి) జంపా 4; డుమిని (సి) ఇర్ఫాన్ (బి) దిండా 14; మోరిస్ నాటౌట్ 38; నైల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1-4, 2-25, 3-49, 4-62, 5-70, 6-93. బౌలింగ్: దిండా 4-1-20-3; చాహర్ 2-0-13-0; పెరీరా 3-0-27-0; ఇర్ఫాన్ 3-0-17-0; జంపా 4-0-21-3; అశ్విన్ 4-0-23-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 42; ఖవాజా (సి) అయ్యర్ (బి) మోరిస్ 19; బెయిలీ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 76. వికెట్ల పతనం: 1-31.; బౌలింగ్: జహీర్ 3-0-19-0; కౌల్టర్ నైల్ 3-0-21-0; మోరిస్ 2-0-12-1; మిశ్రా 2-0-10-0; షమీ 1-0-12-0. -
పుణెకు సాధారణ లక్ష్యం
విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్‌లో తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 122 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించింది. ఢిల్లీ ఆటగాళ్లలో కరుణ్ నాయర్(41), క్రిస్ మోరిస్(38నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. డీ కాక్(2), ఐయ్యర్(8), సంజూ శాంసన్(10), రిషబ్ పంత్(4), జేపీ డుమిని(12)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుణె బౌలర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీని కట్టడి చేశారు. పుణె బౌలర్లలో ఆడమ్ జంపా, అశోక్ దిండాలు తలో మూడు వికెట్లతో రాణించారు. చివరి ఓవర్లో 22 పరుగులు ఆది నుంచి పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడిన ఢిల్లీ ప్రత్యేకంగా చివరి ఓవర్లో 22 పరుగులు సాధించడం ఇన్నింగ్స్‌కే హైలెట్. తిషారా పెరీరా వేసిన ఆఖరి ఓవర్ లో ఢిల్లీ దూకుడును ప్రదర్శించింది. తొలి రెండు బంతులు సింగిల్ మాత్రమే వచ్చినా.. ఆ తరువాత నాలుగు బంతులను మోరిస్ ఫోర్, సిక్స్, ఫోర్, సిక్స్ గా మలచి ఢిల్లీ సాధారణ స్కోరు చేయడంలో సహకరించాడు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే అట్టడుగు స్థానంలో నిలిచి ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన పుణెకు ఈ మ్యాచ్ నామమాత్రం కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మాత్రం కీలకం. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఆరింట గెలిచి ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో పుణె విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), ఎస్ఎస్ ఐయ్యర్, డీకాక్, కేకే నాయర్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, జేపీ డుమినీ, క్రిస్ మోరిస్, కౌల్టర్ నైల్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ పుణె తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, జార్జ్ బెయిలీ, సౌరభ్ తివారీ, ఇర్ఫాన్ పఠాన్, తిషారీ పెరీరీ, రవి చంద్రన్ అశ్విన్, అడమ్ జంపా, అశోక్ దిండా, దీపక్ చాహర్ -
పుణె-కోల్ కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
కోల్‌కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ గెలిచి పుణె బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పుణె 17.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(2), ఉస్మాన్ ఖాజా(21), జార్జ్ బెయిలీ(33), సౌరభ్ తివారీ(13), ఇర్ఫాన్ పఠాన్(7), తిషారా పెరీరా(13)లు పెవిలియన్ కు చేరారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్ కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కోల్ కతా 10 మ్యాచ్‌లాడి ఆరింట గెలవగా, పుణె 11 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే నెగ్గింది. కోల్ కతా తుది జట్టు:గౌతం గంభీర్(కెప్టెన్), మనీష్ పాండే, రాబిన్ ఉతప్ప, సూర్యకుమార్ యాదవ్, షకిబుల్ హసన్, యూసఫ్ పఠాన్, ఆండ్రీ రస్సెల్, పీయూష్ చావ్లా, మోర్నీ మోర్కెల్, అంకిత్ రాజ్ పుత్, సునీల్ నరైన్ పుణె సూపర్ జెయింట్స్ తుది జట్టు:మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, జార్జ్ బెయిలీ, సౌరభ్ తివారీ, తిషారా పెరీరా, ఇర్ఫాన్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్, అడమ్ జంపా, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా -
కోరుకున్నదే దక్కింది: ధోని
విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న 40వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎక్కువ పరుగులు సాధించడం కీలకమైన అంశమని వార్నర్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో మార్పులు ఏమీ లేవని తెలిపాడు. తాము ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని, కోరుకున్నదే దక్కిందని పుణే కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. ముందుగా ఫీల్డింగ్ దక్కడం పట్ల తమ ఆటగాళ్లు అందరూ సానుకూలంగా ఉన్నారని చెప్పాడు. తమ టీమ్ లో కూడా ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, పుణే ఏడో స్థానంలో ఉంది. -
ధోని సేనకు దెబ్బమీద దెబ్బ
పుణే: ఐపీఎల్ లో ఎంఎస్ ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కు దెబ్బమీద తగులుతోంది. గాయాలతో విదేశీ స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగారు. వీరి సరసన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. మణికట్టు గాయంతో స్మిత్ ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధ పడుతున్న అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. వరుసగా స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో పుణే విజయావకాశాలపై ఆ ప్రభావం పడుతోంది. ఆరంభ మ్యాచుల్లో ఆకట్టుకోని స్మిత్ తర్వాత పుంచుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాడు. ఇలాంటి సమయంలో అతడు టీమ్ కు దూరం కావడంతో పుణేకు ప్రతికూలంగా మారే అవకాశముంది. -
కోల్ కతా విజయ లక్ష్యం 161
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డు ప్లెసిస్(4) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అనంతరం అజింక్యా రహానే(67;52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(31; 28 బంతుల్లో 2ఫోర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై పెరీరా(12), ఆల్బీ మోర్కెల్(16)లు విఫలమైనా, చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(23 నాటౌట్;12 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం పుణె సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈరోజు మ్యాచ్ లో పుణె జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోగా, కోల్ కతా ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ కెవిన్ పీటర్సన్, ఇషాంత శర్మ స్థానంలో సౌరభ్ తివారీ, ఆల్బీ మోర్కెల్‌లు పుణె తుది జట్టులోకి రాగా, కోల్ కతా జట్టు నుంచి మనీష్ పాండే గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. అతని స్థానంలో రాజ్ గోపాల్ సతీష్ జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా కోల్ కతా మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పుణె ఒక దాంట్లో మాత్రమే గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
కోహ్లీకి భారీ జరిమానా
పుణె: విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పొట్టి క్రికెట్ పోటీలో భారీగా పరుగులు సాధిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు. అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు. మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది. శుక్రవారం నాటి మ్యాచ్ లో కోహ్లీ సేన ధోని సేనపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్, కోహ్లీల దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ఆదినుంచే తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. -
పంజాబ్ కింగ్స్ బోణీ
ఐపీఎల్ తాజా సీజన్లో తొలి రెండు పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విజయాల బోణీ చేసింది. పటిష్ట రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట పైచేయి సాధించిన కింగ్స్... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పవర్ చూపెట్టడంతో జట్టుకు తొలి విజయం దక్కింది. అటు ధోని సేన వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. * రైజింగ్ పుణేపై విజయం * విజయ్, వోహ్రా అర్ధ సెంచరీలు * డు ప్లెసిస్ శ్రమ వృథా మొహాలీ: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు మురళీ విజయ్ (49 బంతుల్లో 53; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), మనన్ వోహ్రా (33 బంతుల్లో 51; 7 ఫోర్లు) సూపర్ అర్ధ సెంచరీలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్-9లో తొలి విజయాన్ని అందుకుంది. ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (26 బంతుల్లో 38; 5 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మోహిత్ శర్మకు మూడు, సందీప్ శర్మకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. మురుగన్ అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. డు ప్లెసిస్ ఒంటరి పోరాటం టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న రైజింగ్ పుణేకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రహానే (9) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. ఈ దశలో డు ప్లెసిస్, పీటర్సన్ (15 బంతుల్లో 15; 2 ఫోర్లు) కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. నాలుగో ఓవర్లో పీటర్సన్ రెండు ఫోర్లు, డు ప్లెసిస్ ఓ ఫోర్ బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పీటర్సన్ ఐపీఎల్లో వెయ్యిపరుగులు పూర్తి చేసిన కొద్ది సేపటికే అవుటయ్యాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 55 పరుగులు జత చేరాయి. అనంతరం మధ్య ఓవర్లను పంజాబ్ బౌలర్లు నియంత్రించడంతో పుణేకు పరుగులు తీయడం కష్టమైంది. డు ప్లెసిస్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 17వ ఓవర్లో స్మిత్ మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డులో కాస్త కదలిక వచ్చింది. ఆ తర్వాత ఓవర్లోనే అతను అవుట్‌కాగా చివరి ఓవర్‌ను మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస బంతుల్లో డు ప్లెసిస్, ధోని (1)ని అవుట్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. పుణే ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. ఇది ఐపీఎల్ రికార్డు. ఓపెనింగ్ అదుర్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు విజయ్, వోహ్రా వేగంగా ఆరంభించారు. రెండో ఓవర్లో రెండు ఫోర్లతో పాటు 3వ ఓవర్లో మ్యాచ్‌లో తొలి సిక్స్‌ను విజయ్ బాదాడు. ఇక ఐదో ఓవర్లో వోహ్రా హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో 50 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు ఓవర్ల పాటు పుణే బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టగా ఆచితూచి ఆడారు. దీంతో ఇందులో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. అయితే 11వ ఓవర్లో వోహ్రా విజృంభించి వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ జోరుతో తను 31 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అంకిత్ శర్మ బౌలింగ్‌లో అనవసర స్వీప్ షాట్‌కు యత్నించి బౌల్డయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 97 పరుగులు భారీ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే మురుగన్ అశ్విన్ తన ఓవర్లో మార్ష్, విజయ్ను అవుట్ చేశాడు. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు; 2 సిక్సర్లు)ధాటిగా ఆడడంతో పంజాబ్ ఇబ్బందిపడకుండా మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) సందీప్ శర్మ 9; డు ప్లెసిస్ (సి అండ్ బి) మోహిత్ 67; పీటర్సన్ (సి) వోహ్రా (బి) అబాట్ 15; పెరీరా (సి) మోహిత్ (బి) సందీప్ శర్మ 8; స్మిత్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 38; ధోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 1; ఇర్ఫాన్ నాటౌట్ 1; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత ్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-10, 2-65, 3-76, 4-139, 5-149, 6-149, 7-152. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-23-2; అబాట్ 4-0-38-1; అక్షర్ 3-0-26-0; సాహు 4-0-31-0; మోహిత్ శర్మ 4-0-23-3; మ్యాక్స్‌వెల్ 1-0-3-0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ధోని (బి) ఎం.అశ్విన్ 53; వోహ్రా ఎల్బీడబ్ల్యు (బి) అంకిత్ 51; షాన్ మార్ష్ (బి) ఎం.అశ్విన్ 4; మిల్లర్ (సి) పీటర్సన్ (బి) ఎం.అశ్వి న్ 7; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; సాహా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్త్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-97, 2-103, 3-112, 4-119. బౌలింగ్: ఇషాంత్ 3-0-26-0; అంకిత్ 4-0-27-1; అశ్విన్ 4-0-27-0; ఎం.అశ్విన్ 4-0-36-3; ఇర్ఫాన్ 1-0-7-0; పెరీరా 2.4-0-30-0. -
కింగ్స్ పంజాబ్ బోణి
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో కింగ్స్ పంజాబ్ జట్టు బోణి చేసింది. ఆదివారం పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విజయంలో మురళీ విజయ(53;49 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు), వాహ్రా(51;33 బంతుల్లో 7ఫోర్లు) ధాటిగా ఆడి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభం అందించింది. అనంతరం మిచెల్ మార్ష్(4), డేవిడ్ మిలర్ల్(7)లు విఫలమైనా, మ్యాక్స్ వెల్(32 నాటౌట్;14 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు నమోదు చేసింది. పుణె జట్టులో డు ప్లెసిస్(67;53 బంతుల్లో 8 ఫోర్లు), స్టీవ్ స్మిత్(38;26 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(9), కెవిన్ పీటర్సన్(15), తిషారా పెరీరా(8),కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(1) లు నిరాశపరిచారు. -
ఆకట్టుకున్న డు ప్లెసిస్
మొహాలి:ఐపీఎల్లో భాగంగా ఇక్కడ ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు డు ప్లెసిస్ ఆకట్టుకున్నాడు. ఒకవైపు పుణె వికెట్లును కోల్పోతున్నా..ఫస్ట్ డౌన్ లో వచ్చిన డు ప్లెసిస్ మాత్రం అత్యంత నిలకడగా ఆడి జట్టు స్కోరును చక్కదిద్దాడు. డు ప్లెసిస్(67;53 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి స్టీవ్ స్మిత్(38;26 బంతుల్లో 5 ఫోర్లు) అండగా నిలవడంతో పుణె జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణె ఆదిలోనే అజింక్యా రహానే(9) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెవిన్ పీటర్సన్(15), తిషారా పెరీరా(8)లు కూడా నిరాశపరిచారు. ఆ తరుణంలో డు ప్లెసిస్-స్మిత్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. మంచి బంతులను జాగ్రత్తగా ఆడుతూనే, చెత్త బంతులను బౌండరీలను దాటిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లింది. కాగా చివరి ఓవర్లో డు ప్లెసిస్‌తో పాటు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(1)లు అవుట్ కావడంతో పుణె 153 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచకల్గింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు సాధించగా, సందీప్ శర్మకు రెండు, కేల్ అబాట్‌కు ఒక వికెట్ దక్కింది. -
బ్యాటింగ్ ఎంచుకున్న పుణె
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం ఇక్కడ కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో పుణె ఒక మ్యాచ్‌లో గెలిచి, మరొకదాంట్లో ఓటమి పాలవ్వగా, పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. -
ధోనీపై సురేష్ రైనాదే పైచేయి
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా గురువారం రాత్రి ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్ మరో 12 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రెండు కొత్త జట్ల మధ్యపోరులో ధోనీ నేతృత్వంలోని పుణెపై సురేష్ రైనా జట్టు గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. లయన్స్ జట్టుకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (50 పరుగులు; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (49 పరుగులు; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో స్టంప్ అవుటయ్యాడు. చివర్లో బ్రావో (22 పరుగులు; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. పుణె బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది. పుణె ఇన్నింగ్స్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణె ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, డు ప్లెసిస్‌లు దాటిగా ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రహానే(21) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం డు ప్లెసిస్-కెవిన్ పీటర్సన్ల జంట స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించింది. ఈ జోడి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 12.0 ఓవర్లు ముగిసే సరికి పుణె వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. పుణె జట్టులో డు ప్లెసిస్ (69;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పీటర్సన్(37;31 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), మహేంద్ర సింగ్ ధోని(22 నాటౌట్;10 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కాగా, పీటర్సన్, డు ప్లెసిస్‌లు 19 పరుగుల వ్యవధిలో నిష్క్రమించిన తరువాత స్టీవ్ స్మిత్(5), మిచెల్ మార్ష్(7) లు నిరాశపరచడంతో పుణె స్కోరు మందగించింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో తాండే, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
గుజరాత్ లక్ష్యం 164
రాజ్‌కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పుణె జట్టులో డు ప్లెసిస్ (69;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పీటర్సన్(37;31 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), మహేంద్ర సింగ్ ధోని(22 నాటౌట్;10 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణె ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, డు ప్లెసిస్‌లు దాటిగా ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రహానే(21) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం డు ప్లెసిస్-కెవిన్ పీటర్సన్ల జంట స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించింది. ఈ జోడి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 12.0 ఓవర్లు ముగిసే సరికి పుణె వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. కాగా, పీటర్సన్, డు ప్లెసిస్‌లు 19 పరుగుల వ్యవధిలో నిష్క్రమించిన తరువాత స్టీవ్ స్మిత్(5), మిచెల్ మార్ష్(7) లు నిరాశపరచడంతో పుణె స్కోరు మందగించింది. ఇక చివర్లో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో తాండే, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
బ్యాటింగ్ ఎంచుకున్న పుణె
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే తమ తమ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేసిన ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో గెలుపుపై ఎవరికే వారే ధీమాగా ఉన్నారు. పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండగా, గుజరాత్ లయన్స్ జట్టులో రైనాతో పాటు బ్రెండన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేష్ కార్తీక్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా ,ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.