Riyadh
-
ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ
రియాద్: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో 20 ఏళ్ల కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మూడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఏకంగా.. 3 గంటల 4 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 7–6 (7/2)తో ప్రపంచ ఏడో ర్యాంకర్, చైనా రైజింగ్ స్టార్ కిన్వెన్ జెంగ్పై చిరస్మరణీయ విజయం అందుకుంది.విజేతగా నిలిచిన కోకో గాఫ్నకు 48,05,000 డాలర్ల (రూ. 40 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కిన్వెన్ జెంగ్‌కు 23,05,000 డాలర్ల (రూ. 19 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచిన కోకో గాఫ్నకు తుది పోరులో గట్టిపోటీనే ఎదురైంది.టైబ్రేక్‌లో కోకో పైచేయితొలి సెట్‌ను చేజార్చుకున్న కోకో రెండో సెట్లో ఒకదశలో 1–3తో వెనుకబడింది. కానీ వరుసగా మూడుసార్లు కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కోకో 3–5తో వెనుకంజలో పడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న కోకో పదో గేమ్‌లో కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది.ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కోకో పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకొని 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది కోకో మొత్తం 54 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మూడు టైటిల్స్ (బీజింగ్ ఓపెన్, ఆక్లాండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్) సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Tennis (@tennischannel) -
అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లు.. తొలి అడుగు వేసిన భారత్! కానీ..
భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏకైక ప్రపంచ స్థాయి మెగా స్పోర్ట్స్ ఈవెంట్ 2010 కామన్వెల్త్ గేమ్స్. దేశ రాజధాని వేదికగా జరిగిన ఈ పోటీలు ఆటల పరంగా విజయవంతంగా ముగియడంతో పాటు ఆర్థికపరంగా వివాదాలను కూడా వెంట తెచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మన దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరం కోసం ముందుకు వస్తోంది.2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి తమ ఆసక్తిని కనబరుస్తూ అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ‘లెటర్ ఆఫ్ ఇన్టెంట్’ను సమర్పించింది.ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు‘ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే అది భారత ఆర్థిక వ్యవస్థకు, సామాజిక పురోగతికి, దేశవ్యాప్తంగా యువత స్వావలంబనకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఐఓఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో జరిగిన ఐఓసీ సెషన్లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అంశాన్ని మొదటిసారి ప్రస్తావించారు. ఆయన సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ అధికారులు సమగ్ర సమాచారంతో ప్రత్యేక నివేదికను రూపొందించారు.ఒలింపిక్స్‌కు ఎలా బిడ్ వేయాలనే అంశం మొదలు అవకాశం దక్కించేందుకు సాగే ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. ఆ తర్వాతే ఐఓఏ దీనిపై ముందుకు వెళ్లింది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్ (అమెరికా)లో, 2032 బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి. ప్రక్రియ ఇలా... సాధారణంగా ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి మొదలు హక్కుల కేటాయింపు వరకు మూడు దశలు ఉంటాయి. ఎలాంటి ప్రక్రియలో అడుగుపెట్టకుండా వేర్వేరు వేదికలపై మేమూ నిర్వహిస్తాం అంటూ ప్రకటించే ‘ఇన్ఫార్మల్ డైలాగ్’ ఇందులో మొదటిది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి మాత్రం ఏర్పడుతుంది తప్ప అధికారికంగా ఎలాంటి విషయమూ ఉండదు. అయితే ఇప్పుడు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ ఇవ్వడంతో దానిని దాటి భారత్ ‘కంటిన్యూయస్ డైలాగ్’ దశకు చేరింది.ఆసక్తి కనబర్చిన దేశాలు, అక్కడి రాజకీయ, ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఓసీ తెలుసుకుంటుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల అమలు లేదా ఉల్లంఘన వంటివి కూడా ఉంటాయి. ఆయా దేశాలతో కూడా దీనిపై ఐఓసీ చర్చిస్తుంది. అయితే నిర్వహణపై ఎలాంటి హామీని ఇవ్వదు. మూడో దశలో ‘టార్గెటెడ్ డైలాగ్’ ఉంటుంది. ఇక్కడే అసలు నిర్వహణపై స్పష్టత వస్తుంది.తుది నిర్ణయం ఆ కమిటీదేఆయా దేశాలు నిర్వహణపై తమ ప్రణాళికలు, మొత్తం బడ్జెట్ సహా ఇతర ఆర్థికపరమైన సమాచారం, తమకు అవకాశం ఇస్తే ఇతర దేశాలకంటే భిన్నంగా ఏం చేస్తామో అనే అన్ని అంశాలకు ఒక ఫార్మాట్లో వెల్లడించాల్సి ఉంటుంది. దీనిపై ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2036 క్రీడల వేదికను 2025 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అవకాశం వస్తే అహ్మదాబాద్‌లో! ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు బిడ్‌లో వేదికగా నగరాల పేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను దీని కోసం భారత్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కలిపి 22 రకాల క్రీడా వేదికలను అధికారులు గుర్తించారు. అయితే 2036 కోసం పోటీ పడుతున్న ఇతర నగరాలు, దేశాలతో పోలిస్తే మన దేశానికి అవకాశం రావడం అంత సులువు కాదనేది వాస్తవం.నుసాన్తారా (ఇండోనేసియా), ఇస్తాంబుల్ (తుర్కియే), శాంటియాగో (చిలీ), న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ (ఈజిప్ట్), సియోల్ (దక్షిణ కొరియా), దోహా (ఖతర్), రియాద్ (సౌదీ అరేబియా), బుడాపెస్ట్ (హంగేరి), ట్యురిన్ (ఇటలీ), కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), టొరంటో–మాంట్రియల్ (కెనడా) ఈసారి భారత్‌తో హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో సియోల్, మాంట్రియల్లకు గతంలోనే ఈ క్రీడలను నిర్వహించిన అనుభవం ఉండగా... సుసాన్తారా, ఇస్తాంబుల్, దోహా నగరాలు వరుసగా హక్కుల కోసం పోటీ పడుతూ త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నాయి.అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లుఈ నగరాల్లో అన్నింటిలో కూడా ఆర్థికపరంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు 2022లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ నిర్వహణతో ఇప్పటికే తమ స్థాయిని చూపించిన దోహా... 2034 ‘ఫిఫా’ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న రియాద్ ఒలింపిక్ రేసులో మిగతా నగరాలకంటే ముందున్నాయి. వీటన్నింటిని దాటి భారత్ అవకాశం దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరం. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ బడ్జెట్ అధికారికంగా 900 కోట్ల పౌండ్లు (సుమారు రూ.98 వేల కోట్లు) అంటే ఒలింపిక్స్ నిర్వహణ స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు! చదవండి: ఆఫ్రో–ఆసియా కప్ పునరుద్ధరణ! -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్‌మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్‌మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్‌దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్‌సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
ఇకపై అక్కడ కొరడా దెబ్బలు ఉండవు..
రియాద్: కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీ అరేబియాలో గత కొంతకాలంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణల్లో మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో పాటుగా.. తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన పౌరులను కొరడా దెబ్బలు కొట్టే సంప్రదాయానికి స్వస్తి పలికినట్లు సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా సదరు పౌరులకు నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా జరిమానా విధించడం లేదా రెండూ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి మానవ హక్కుల సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం’’అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఈ సంస్కరణ ఎన్నో ఏళ్ల క్రితమే చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డాయి. ఈ విషయం గురించి సౌదీ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవాద్ అల్వాద్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నిరోజులుగా రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. హ్యూమన్ రైట్స్ అజెండాలో సరికొత్త ముందడుగు ఇది’’అని వ్యాఖ్యానించారు. -
ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష
రియాద్ : జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం అయిదుగురికి మరణశిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం 11 మందిలో, ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించిందని ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును విచారించిన రియాద్ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు హాజరయ్యారనీ, మొత్తం తొమ్మిది సెషన్లను నిర్వహించినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇదొక తప్పుడు ఆపరేషన్ అని సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్ నేడు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసి విచారించారు. వారి వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. అలాగే ఈ హత్య ముందస్తు పథకం ప్రకారం చేసింది కాదని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరిని తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేశారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హత్యలో సౌదీ పాత్ర ఉన్నట్లు అమెరికా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
మిస్సైల్స్ దాడులతో గడగడలాడిన సౌదీ
-
మిస్సైళ్ల వర్షం.. గడగడలాడిన రియాద్
రియాద్: మిస్సైల్స్ దాడులతో ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియా గడగడలాడిపోయింది. పొరుగున ఉన్న యెమెన్ నుంచి బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగంతో అంతా వణికిపోయారు. అయితే సౌదీ ఎయిర్ ఫోర్స్ వాటిని గాల్లోనే అడ్డగించటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గాల్లోనే క్షిపణులు పేలిపోగా.. ప్రజలు మాత్రం వణికిపోయారు. ‘హౌతీ రెబల్స్ వర్గం గత రాత్రి రియాద్ నగరంపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సైన్యం ఆ దాడులకు ధీటుగా తిప్పి కొట్టింది’ అని అధికారిక టెలివిజన్ ఛానెల్ ‘అల్ ఎఖాబారియా’ కథనాలు ప్రసారం చేసింది. అయితే ప్రాణ, ఆస్తినష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ నాలుగు భారీ పేలుళ్ల శబ్ధాలను విన్నట్లు చెబుతుండగా, స్థానికులు మాత్రం ఆ సంఖ్య ఎక్కువే అని అంటున్నారు. అయితే రియాద్ సైన్యం తమ మిస్సైళ్లను కూల్చలేదని, తాము ప్రయోగించిన మిస్సైళ్లు లక్ష్యాలను చేరుకోలేకపోయాయని రెబల్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఇతర మిత్ర పక్షాలు.. ఉత్తర యెమన్‌ను దిగ్బంధించిన హౌతీ మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించేంత వరకూ దాడులు కొనసాగిస్తామని అరబ్ లీగ్ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా మిత్రపక్షాల వైపు నిలిచి దాడులకు ఎగదోస్తోంది కూడా. అసలే అంతర్యుద్ధంతో(రాజకీయ సంక్షోభం) సతమతమవుతున్న యెమెన్‌కు ఈ దాడులు మరింత ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ హౌతీ రెబల్స్ మాత్రం సౌదీపై ఎదురు దాడి చేస్తూ వస్తోంది. పరస్సరం క్షిపణుల దాడులతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. మరోవైపు సౌదీ అరేబియాపై దాడులకు యెమెన్‌కు ఇరాన్ సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలను, ఖండాంతర క్షిపణులను సరఫరా చేయాల్సిన అవసరం తమకు లేదని, హౌతీలు సొంతంగా అభివృద్ధి చేసుకునే స్థాయికి ఎదిగారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీ) స్పష్టం చేసింది. యెమెన్, ఇరాన్ దేశాల సరిహద్దు ఇప్పటికే మూతపడ్డ విషయాన్ని ఐఆర్జీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
మహిళలు జిమ్‌కు వెళ్లాడాన్ని నిషేధిస్తూ సౌదీ!
-
జిమ్‌లో అమ్మాయి.. నిషేధం.. వైరల్
రియాద్ : కఠిన చట్టాలకు మారుపేరైన సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం విధించారు. ఒక అమ్మాయి రియాద్‌లోని ఒక జిమ్ సెంటర్లో స్కిన్ టైట్ దుస్తులు ధరించి వ్యాయమం చేసింది. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అదికాస్త వైరల్ అయింది. దాంతో మహిళల జిమ్‌లను నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ తుర్కీ అల్ షేక్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని తేల్చి చెప్పారు. మహిళలు స్కిన్ టైట్ దుస్తులు ధరించడం సౌదీలో నిషేధం. అదే విధంగా ఆ వీడియోను ఆధారం చేసుకుని దర్యాప్తు చేయాలని తుర్కీ ఆదేశించారు. క్రీడల్లో మహిళలపై నిషేధాన్ని 2014లో ఎత్తేసిన సౌదీ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అనుమతించింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి హలిమా బోలంద్ అని తేలింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నేను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. సౌదీ న్యాయ వ్యవస్థపై తను పూర్తి నమ్మకం ఉందని అన్నారు. -
సౌదీలో ప్రమాదం: నలుగురు బ్రిటిషర్ల మృతి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ జాతీయులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర మక్కాకు 30 మైళ్ల దూరంలో ఉన్న అల్ ఖలాస్ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన 12 మంది కూడా బ్రిటిష్ జాతీయులేనని సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని మక్కాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ సౌదీ అంబాసిడర్ మహ్మద్ బిన్ నవాఫ్ ట్వీట్ చేశారు. -
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం
రియాద్ : సౌదీ అరేబియాలో మహిళలకు భారీ ఊరట లభించింది. ఇక నుంచి వారు కూడా డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొద్దికొద్దిగా మార్పులను ఆహ్వానిస్తున్న సౌదీ తాజాగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి ట్రక్కుల వరకు మహిళలు డ్రైవింగ్ చేసేందుకు వీలుకల్పించాలని నిర్ణయించాం. ఇది జూన్ నుంచి అమలులోకి రానుంది' అని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే సౌదీ రాజు సల్మాన్ ఈ విషయం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇక నుంచి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎలాంటి భేదాలు లేకుండా బైక్‌లపై దూసుకెళ్లనున్నారు. కాగా, మహిళలకు ప్రత్యేక లైసెన్స్ ప్లేటులు ఉండవని, అయితే, వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు, రోడ్డు ప్రమాదాలకు పాల్పడినా వారి కేసులు విచారించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఒక్క సౌదీ అరేబియా మాత్రమే మహిళల డ్రైవింగ్‌పై ఇప్పటి వరకు నిషేధం కొనసాగించిన విషయం తెలిసిందే. -
నిజం: ఆ యువరాజు నిక్షేపంగా ఉన్నాడు!
రియాద్ : సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మోక్రెన్ చనిపోయి 24 గంటలు గడవక ముందే మరో యువరాజు మృతి చెందాడన్నది అవాస్తమని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. గతంలో మృతిచెందిన సౌదీ అరేబియా రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజిజ్ ఫహద్ (44)పై కొందరు కాల్పులు జరపగా యువరాజు మరణించాడన్న కథనాలు అవాస్తవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఏజెన్స్ ఫ్రాన్స్ మీడియాకు తెలిపింది. యువరాజు అబ్దుల్ అజిజ్ ఆరోగ్యంగా, నిక్షేపంగా ఉన్నారని సమాచార మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఏజెన్స్ ఫ్రాన్స్ మీడియా యువరాజు అజిజ్ను సంప్రదించేందుకు యత్నించినా వీలు చిక్కలేదని తమ కథనంలో పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్ క్రాష్ కావడంతో అసిర్ ప్రావిన్స్‌కి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న మన్సూర్ బిన్ మోక్రెన్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గతంలో సౌదీ అరేబియాను పాలించిన కింగ్ ఫహద్ కుమారుడు అబ్దుల్ అజిజ్‌పై ఆ మరుసటిరోజు కొందరు దుండగులు కాల్పులకు తెగబడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా కొన ఊపిరితో ఉన్న యువరాజు మరణించినట్లు అజ్ మస్డార్ నెటవర్క్ మీడియా వెల్లడించింది. అరెస్ట్ చేయడానికి వెళ్లగా జరిపిన కాల్పుల్లో అజిజ్ చనిపోయాడని మరో స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల కొందరు రాజులు, యువరాజులు, మంత్రులు, ఉన్నతాధికారులను సౌదీ రాజు ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. మరికొందరు విదేశాలకు పారిపోతున్నారు. వీరిలో సౌదీ గత పాలకుడు ఫహద్ మనవడు, బంధువులున్నట్లు సమాచారం. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అరెస్టయిన రాజులు, యువరాజులు, మంత్రులు ఎక్కడ ఉన్నారో మాత్రం వెల్లడించడం లేదు. -
సౌదీ అరేబియాపై క్షిపణి దాడి
-
సౌదీ అరేబియాపై క్షిపణి దాడి
రియాద్ : కల్లోలిత యెమన్ నుంచి దేశ రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్(షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణులు).. తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. రియాద్‌పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్ ఖలీద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మిస్సైల్ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు చెప్పారు. ఈ ఏడాది జులైలో కూడా యెమెన్ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. -
292 మంది.. 16 గంటల పాటు..
చెన్నై: ఒకటి రెండూ కాదు ఏకంగా 16 గంటలపాటు విమానంలో బందీలుగా మారిన చేదు అనుభవాన్ని చెన్నై-రియాద్ విమానంలోని 292 మంది ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియాద్ వెళ్లే సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం 292 మంది ప్రయాణికులతో ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కేరళ రాష్ట్రం కొచ్చికి చేరువవుతున్న సమయంలో తీవ్రమైన సుడిగాలులు వీచడంతో చెన్నైకి తిరిగి వచ్చేసింది. కొద్దిసేపు వేచిచూశాక ప్రయాణం ప్రారంభిస్తామని ప్రయాణికులు చెప్పి.. వారిని విమానంలోనే ఉంచేశారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని సమాచారం అందింది. అప్పటికి విమాన పైలట్, కో-పైలట్ల డ్యూటీ సమయం పూర్తవడంతో వారు వెళ్లిపోయారు. దీంతో రాత్రి 11 గంటలకు మరో విమానంలో రియాద్‌కు తీసుకెళ్తామని ఎయిర్‌హోస్టెస్‌లు ప్రకటించారు. 11 గంటలకు కూడా విమానం రాకపోవడంతో మరో విమానం ఒంటిగంటకు వస్తుందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమను విమానం నుంచి బయటకు పంపించేయాలని, ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా గమ్యస్ధానానికి వెళ్లిపోతామని కోరారు. అయితే, ఎయిర్‌హోస్టెస్ అందుకు నిరాకరించారు. దీంతో మరింత మండిపడిన ప్రయాణికులు గంటల తరబడి విమానంలో ఆకలితో అలమటిస్తున్నామని కేకలు వేయడంతో హాడావిడిగా ఆహారపొట్లాలు పంపిణీ చేశారు. తమను రిసీవ్ చేసుకునేందుకు కొచ్చిలో కాచుకుని ఉన్న తమ వారికి సైతం ఆహారం సరఫరా చేయాలని ప్రయాణికులు పట్టుబట్టగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. కొచ్చిలో పంపిణీ జరగకుంటే తాము కూడా తినేది లేదని ప్రయాణికులు భీష్మించారు. కొన్ని గంటల పోరాటం తరువాత సోమవారం తెల్లవారుజామున 40 మంది స్పెషల్ క్లాస్ ప్రయాణికులను మాత్రం విమానం నుంచి దింపి గట్టి బందోబస్తుతో చెన్నైలోని ఒక హోటల్‌కు చేర్చారు. మిగతా ప్రయాణికులు గత్యంతరం లేక ఆహారం తీసుకుని విమానంలోనే గడిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం చెన్నైకి చేరుకోగా.. అందులోని ప్రత్యామ్నాయ పైలెట్లు విధుల్లో చేరారు. ఉదయం 10 గంటలకు ఈ విమానం కొచ్చికి బయలుదేరింది. సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ నిర్వాహణ లోపం 292 మంది ప్రయాణికుల పాలిట శాపంగా మారడంతో 16 గంటలపాటూ బందీలుగా నానాయాతన అనుభవించారు. -
మక్కా మసీదులో తొక్కిసలాట
18 మందికి గాయాలు రియాద్: ముస్లింల పుణ్యక్షేత్రమైన సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. 18 మందికి గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది హజ్ యాత్రలో ఇక్కడ తొక్కిసలాటలో 2,000 మందికి పైగా యాత్రికులు చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా శుక్రవారం మళ్లీ తొక్కిసలాట జరిగింది. రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లింలు పరమ పవిత్ర దినంగా భావిస్తారు. ఆ రోజున మక్కా మసీదుకు ప్రార్థనలకోసం వచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి అక్కడే చికిత్స అందించారు. ఈ ఏడాది హజ్‌యాత్రకు వచ్చేవారు ఎలక్ట్రానిక్ బ్రేస్లెట్లను ధరించి, దానిలో తమ సమాచారాన్ని భద్రపరచుకోవాలని సూచించడం తెలిసిందే. -
అక్రమంగా వైఫై వాడితే దొంగలేనట!
రియాద్: వైఫై సర్వీసులను ఇష్టమొచ్చినట్లు వాడితే దొంగతనం కేసుగా గుర్తిస్తామని సౌదీ అరేబియాలో ఫత్వా విడుదలైంది. మరోకరి వైఫై ఉపయోగించడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సౌదీ అరేబియన్ స్కాలర్‌కు నోటీసులు జారీ చేసింది. సీనియర్ స్కాలర్స్ మండలి సభ్యుడూన అలీ అల్ హకామీ అనే వ్యక్తి ఈ ఫత్వాను విడుదల చేశాడు. 'వైఫై సర్వీసును ఇతరుల అనుమతి లేకుండా.. యజమాని పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైతే ఉపయోగిస్తారో వారు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తిస్తాం. ఈ సదుపాయం పొందుతున్న వ్యక్తి చాలా స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. ఎవరు వైఫై కోసం డబ్బు చెల్లిస్తారో వారు కచ్చితంగా అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలి' అని ఆయన చెప్పారు. -
వాషింగ్ మెషిన్లో 2 కిలోల బంగారం...
ముంబై: రెండు కిలోల బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. బంగారు బిస్కట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ముంబై ఎయిర్ పోర్టు నిఘా విభాగం(ఏఐయూ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 19 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి రియాద్ నుంచి భారత్ కు వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అధికారులు రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ లో ఏదో అనుమానిత వస్తువులు ఉన్నట్లు గమనించారు. వాషింగ్ మేషిన్ ను పరిశీలించి చూడగా ఒక్కొక్కటిగా 19 గోల్డ్ బిస్కట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు రెండు కిలోలకు పైగా ఉందని, విలువ దాదాపు అరవై లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు బిస్కట్లను మరో వ్యక్తిని తాను అప్పగించాల్సి ఉందని, అతని పేరు సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అస్లాం షేక్ కోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సల్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టమామని ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు వివరించారు. -
పాకిస్థాన్ వాసిని ఉరితీశారు
రియాద్: తమ దేశంలో హత్యకు పాల్పడిన ఓ పాకిస్థానీయుడిని సౌదీ అరేబియా ఉరి తీసింది. ఆదివారం ఉదయం పాక్ పౌరుడికి మరణ శిక్షను అమలుచేసినట్లు రియాద్ అధికారులు చెప్పారు. ఈ తాజా ఉరితో ఈ ఏడాది సౌదీలో అమలు చేసిన మొత్తం ఉరి శిక్షల సంఖ్య 79కి చేరింది. జెడ్డా అనే నగరంలో పాక్ చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళపై దోపిడికి పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుకున్నందుకు దారుణంగా పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అంతకుముందే ఆ వ్యక్తిపై పలు దోపిడీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ శిక్షను ఈ రోజు ఉదయం జెడ్డాలో అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది అమలుచేసిన మొత్తం ఉరిశిక్షల్లో 47 ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలతో అమలు చేసినవే ఉన్నాయి. కాగా, గత ఏడాదిలో సౌదీలో 153మందిని ఉరి తీశారు. -
ఎడారిలో నందనవనం
వాది హనిఫా మధ్య సౌదీ అరేబియాలో రియాద్‌కి అతి సమీపంలో అత్యంత కాలుష్యానికి లోనైన లోయ ఒకటుంది. దానిని పునరుద్ధరించి ఇటీవలే పూర్వ వైభవం తీసుకువచ్చారు అక్కడి అధికారులు. ఎడారిలో ఆకుపచ్చని అందాలను విరబూయించారు. ఏ మాత్రం నివాసయోగ్యం కాని ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. ప్రతి పట్టణం ఈ ప్రాంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్.ఎన్.ఆర్ నీరు మనిషికి ప్రాణాధారం. నాగరికతలన్నీ నది తీరాననే ఊపిరిపోసుకున్నాయి. నీరు ఎంత తక్కువ ఉంటే అక్కడ అభివృద్ధి కూడా అంతగా కుంటుపడుతున్నది తెలిసినదే! సౌదీ అరేబియా ఎడారి దేశం. దీనికి రియాద్ ముఖ్య పట్టణం. రాజధాని కూడా! రియాద్ సమీపంలో 120 కిలోమీటర్ల వైశాల్యంలో ‘వాది హనిఫా’ ఒక లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతంలో చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఉన్నాయి. సాంస్కృతిక పరంగానూ ఎంతో చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి. ప్రాచీన కాలంలో ఈ లోయలో విస్తారంగా వర్షాలు పడేవి. ఇక్కడ సారవంతమైన భూములు వ్యవసాయానికి అనువుగా ఉండేవి. మానవ ఆవాసాలకు అత్యంత యోగ్యంగా ఉండేది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదిగిన నగరంగా రియాద్ అభివృద్ధి ‘వాది హనిఫా’ వల్లే సాధ్యమైంది. అయితే అంతే వేగంగా ‘వాది హనిఫా’ కాలుష్యానికి లోనైంది. నీరు, గాలి కాలుష్యం వల్ల ప్రజల జీవనశైలి దెబ్బతింది. అనారోగ్యాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 2001 నుంచి అపరిమిత కాలుష్యం కారణంగా ఇక్కడ అమితమైన వేడి పెరిగిపోవడంతో ఏడాదిలో కొన్ని వారాలు మాత్రమే ఇక్కడ జనం నివసించే పరిస్థితులు ఏర్పడాయి. ఈ విషమ పరిస్థితుల నుంచి ‘వాది’ని నివాస యోగ్యంగా మార్చడానికి ఎఆర్-రియాద్ అభివృద్ధి అధికార బృందం (ఎడిఎ) నడుం బిగించి, విజయవంతంగా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది. పర్యావరణాన్ని పునరుద్ధరించడంలో ఇప్పుడీ పట్టణం ఎన్నో దేశాలకు కొత్త దారులు చూపుతోంది. ఒక అందమైన నగరం... పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగుకు ‘వాది’ లోయ డంప్‌యార్డ్‌గా మారింది. నిజానికి ‘వాది’ అంటే అరబిక్ సాహిత్యంలో ‘తోట’ అనే అర్థం ఉంది. 14వ శతాబ్దపు అరబ్ యాత్రికుడు ఇబ్నె మటుటా తన సాహిత్య గ్రంథంలో ఈ లోయ ప్రాంతంలో ఉన్న నగరాన్ని ‘ఒక అందమైన నగరం’గా అభివర్ణించారు. ఆ అందమైన నగరమే ఆ తర్వాత కాలంలో అంధవికారంగా మారింది. ఎడిఎ పునరుద్ధరణ ప్రాజెక్టు అమలు వల్ల ఈ ప్రాంతానికి పూర్వవైభవం వచ్చింది. పూర్వ వైభవాన్ని ఇలా తెచ్చిన వైనం.. ఎడిఎతో పాటు మొరియా, తెషిమా, కెనడాకు చెందిన నెల్సన్ పర్యావరణ కేంద్రం రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కింద ‘వాది హనిఫా’ (డబ్ల్యుహెచ్ఆర్పి) పునరుద్ధరణ పనులను చేపట్టాయి. వర్షాకాలంలో వచ్చే వరద నీరు పల్లానికి పోకుండా ముందుగా అడ్డంకులు ఏర్పరిచారు. ఈ లోయ భూభాగం చుట్టూర 50,000 రకాల మొక్కలు నాటి తోట పనులు మొదలుపెట్టారు. చెత్తను తొలగించి, నీటి శుద్ధి కార్య క్రమాలను చేపట్టారు. మూడు పెద్ద కొలనులలో విషపదార్థాలు, హానికరమైన బ్యాక్టీరియాను ఆహారంగా స్వీకరించే జీవ మొక్కలను ఏర్పాటు చేశారు. మానవ నివాసానికి నీటిపారుదల వసతులు కల్పించడానికి సురక్షిత చర్యలు చేపట్టారు. రియాద్ నదికి 35 కిలోమీటర్ల దిగువన వరదలను అడ్డుకోవడానికి చిన్న చిన్న ఆనకట్టలను ఏర్పాటు చేశారు. గుర్రపు డెక్క ఆకారంలో కుటుంబాల కోసం ‘పిక్నిక్ ప్యాడ్లు’ ఏర్పాటు చేశారు. సబ్మెర్జిడ్ ఏరియేషన్ వ్యవస్థను, ఫౌంటేయిన్లను ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రతి పాడ్‌కు ఒక పెద్ద కోర్టు, నీడలో విశ్రాంతికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లతో కిలోమీటర్ల పరిధిలో ‘వాది’ లోయలో పట్టణ విస్తరణ పునరుద్ధరించబడింది. పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు వేగంవంతం చేశారు. దీంతో ఇక్కడకు పర్యాటకులు తమ కుటుంబాలతో సంవత్సరం పొడవునా సందర్శనకు వస్తున్నారు. అందవికారంగా మారిన లోయను అత్యద్భుతంగా మార్చడం వెనక జరిగిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘వాదీ హనిఫా’ పునరుద్ధరణ పనులు దాదాపు పదేళ్లలో అద్బుతమైన ఫలితాన్ని చూపెట్టాయి. ఇప్పుడు వాదిలో 62 ఎకరాలలో 30,000 పామ్ చెట్లు ఏపుగా పెరిగాయి. దారంతా పచ్చని పచ్చిక, తొమ్మిది పార్కులు, 7.4 కి.మీ లలో ఐదు సరస్సులతో నేడు వాది హనీఫా అందరూ నివసించడానికి యోగ్యతను పొందింది. పర్యాటకులకు ఆకర్షణీయ స్థలంగా మారింది. -
బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి
ఖమ్మం : ఏళ్లతరబడి ఇంటికి దూరంగా ఉన్నా డు.. దేశంకాని దేశానికి వెళ్లి రెక్కలుముక్కలు చేసుకున్నాడు. కుటుంబాన్ని సుఖంగా ఉంచాలనే ధృడ సంకల్పంతో తన సౌఖ్యాన్ని త్యాజిం చాడు. ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు కోసం పరితపించాడు. అష్టకష్టపడి నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న క్రమంలోనే అతడిని విధి వంచించింది. మృత్యువు రూపంలో కుటుంబం నుంచి శాశ్వతంగా దూరం చేసింది. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన వ్యక్తి.. మరో 15 రోజుల్లో సొంతగడ్డకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా దేశాయిపేట రోడ్డుకు చెందిన నసీర్‌ఖాన్(40) 18 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికి బతుకుదెరువు కో సం వెళ్లాడు. ఖమ్మానికి చెందిన జరీనాతో పదేళ్ల క్రితం అతడికి వి వాహమైంది. వీరికి కుమార్తె అరీబా(9) ఉంది. భార్య, కూతురు ఖమ్మంలోని అ జీజ్గల్లీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. రెండు, మూడేళ్లకోసారి నసీర్ ఖమ్మానికి వచ్చి పోతుండే వాడు. ఈనెల 23న మళ్లీ రావడానికి సిద్ధమై విమానం టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. తాను వస్తున్నట్లు భార్యకు ఫోన్‌ద్వారా శుభవార్త తెలిపాడు. ఇంతలోనే అతడిని మృత్యు కబళించింది. బుధవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నసీర్ ఖాన్ తుదిశ్వాస విడిచాడు. నసీర్ ఇక లేడనే దుర్వార్తను రియాద్‌లోని అతడి బంధువులు ఖమ్మంలోని భార్య జరీనా, మామ జియావుద్దీన్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఖమ్మానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు సన్నాహాలు చేస్తున్నారు. రియాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు దినాలు కావడంతో ఆదివారం అక్కడి ప్రభుత్వంతో అనుమతి తీసుకుని మృతదేహాన్ని ఖమ్మం తరలించే అవకాశం ఉందని మృతుడి మామ తెలిపారు. మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న నసీర్ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ ఇంటిల్లిపాది విషాదంలో మునిగిపోయింది. -
భార్యపై వేడినీళ్లు గుమ్మరించిన భర్త
రియాద్: కట్టుకున్న భార్యతో గొడవ పడి ఆమెపై వేడినీళ్లు పోశాడు ఓ భర్త. సౌదా అరేబియాలోని జాజన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాదవ ద్రవ్యాలకు బానిసైన భర్త నుంచి విడిపోవాలని కోరుకోవడంతో అతడి దారుణానికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. చాలా కాలంగా భర్త వేధింపులను మౌనంగా భరించిన బాధితురాలు గతవారం విడాకులు కావాలని అడిగింది. దీంతో రెచ్చిపోయిన అతడు వేడినీళ్లు ఆమెపై గుమ్మరించాడు. గాయాలపాలైన బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి చేయడం లేదు..తల్లితండ్రులపై కూతుళ్ల కేసు!
రియాద్: సాధారణంగా పెళ్లి చేసుకోమని తల్లితండ్రులు పిల్లల్ని విసిగించడం చూస్తుంటాం కాని.. సౌదీలో మాత్రం అందుకు విరుద్ధమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేయడం లేదనే ఆరోపణలతో గత సంవత్సరం 23 మంది సౌదీ మహిళలు తమ తల్లితండ్రులపై కేసు నమోదు చేసినట్టు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. రియాద్ లో 11 కేసులు, మదీనాలో నాలుగు, దామ్మమ్, మక్కాలో ఇద్దరేసి, జెడ్డా, జజాన్ లో ఒక్కొక్కరు తమ తల్లితండ్రులపై కేసులు నమోదు చేసినట్టు అరబ్ న్యూస్ ఓ కథనంలో వెల్లడించింది. అరబిక్ లో ఇలాంటి కేసులను 'అదిల్' అంటారు. ఆదిల్ నుంచి మహిళలకు రక్షణ కల్పించాని మానవ హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత మహిళలు పెళ్లి చేసుకునే విధంగా ఓ చట్టం తీసుకురావాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. కేసుల్ని నమోదు చేసిన మహిళలు తమ తల్లితండ్రులను విముక్తిని కోరుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు తెలిపారు. అయితే తల్లి తండ్రులు మాత్రం తమ కూతుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూరంగా పెడుతున్నట్టు తెలిసింది. వారి సొంత సంపాదనతోనే తమ పిల్లలు బ్రతకాలని తల్లితండ్రులు సూచించారట. Follow @sakshinews -
సౌదీలో భారతీయుడి తల నరికివేత
రియాద్: హత్యానేరంపై భారతీయ కార్మికుడొకరికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారు. శిరచ్ఛేదం(తల నరికివేత) చేసి శిక్ష అమలు చేశారు. తనకు ఉపాధి కల్పించిన డాఫిర్ ఆల్-డొసరిని హత్య చేసిన భారతీయ కార్మికుడు మహ్మద్ లతీఫ్‌కు శిరచ్ఛేదం చేసినట్టు ఆంతరంగిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. డాఫిర్తో గొడవపడి అతడిని ఇనుప రాడ్‌తో లతీఫ్ కొట్టి చంపాడు. తర్వాత డాఫిర్ మృతదేహాన్ని గొతిలో పూడ్చిపెట్టాడు. కేసు విచారించిన స్థానిక న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అయితే మృతుడి కుమారులు పెరిగి పెద్దవారయి శిక్ష ఆమోదించాలన్న అభ్యర్థనతో శిక్ష అమలును గతంలో కోర్టు వాయిదా వేసింది. గురువారం శిక్ష అమలు చేశారని సౌదీ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం ముగ్గురు నేరస్థులకు శిరచ్చేదం చేశారు. హత్య, అత్యాచారం, దోపిడీ, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు.