Robbery
-
వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
-
భలే చోరీ చేసినవ్ అవ్వ..
-
బాపట్ల బీచ్ లో బాదుడే బాదుడు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్గేట్లో డబ్బులు వసూలుచేసేవారు. ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.వేలంపాటకు మంగళం..నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే!
ఓ మహిళా తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది. ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని.. వారితో పోరాడింది. దొంగల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చివరికి దొంగలు చేసేందేంలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది. మన్దీప్ కౌర్ అనే మహిళ తన భర్త జగ్గీత్సింగ్, పిల్లలతో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం మన్దీప్ కౌర్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు.మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరుగెత్తింది. అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్‌ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు. కానీ కౌర్ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది. చివరికి డోర్‌కు తాళం వేసి.. పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది.ఈ దృశ్యాలు అన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం, డోర్ పెట్టి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగట్టిగా అరుస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్ కూడా చేసింది. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆమె కొడుకు, కూతురు అటు ఇటు కంగారుగా చూడటం కనిపిస్తుంది. చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सीसीटीवी में कैद हुई मनप्रीत की बहादुरी, तीन चोरों को अकेले ही घर में घुसने से रोका पंजाब के अमृतसर जिले के वेरका इलाके की महिला मनप्रीत की बहादुरी की चर्चा सोशल मीडिया पर सभी कर रहे हैं। मनप्रीत ने अकेले अपने साहस के दम पर तीन चोरों को अपने घर में घुसने से रोक दिया। pic.twitter.com/YKXFgOVDZ0— Sharad Kumar Tripathi (@officesharad) October 2, 2024 మహిళా ధైర్య సాహాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఏకే సోహి తెలిపారు. జగ్గీత్ సింగ్ నగల వ్యాపారి కాగా..దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వీడెవండీ బాబు... తాగిన మత్తులో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
నిర్మల్‌లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో దోపిడీకి యత్నం
-
జర్మనీ పర్యాటకుణ్ణి దోచుకున్న పాక్ పోలీసులు
పాకిస్తాన్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్లో జరిగిన ఓ లూటీ సంచలనంగా మారింది.జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ పోన్‌తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్‌పై పాకిస్తాన్లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే..
సాక్షి, ఖమ్మం జిల్లా: దొంగల బీభత్సం సృష్టించిన షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్‌లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం.బి3,బి4,బి5 ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్‌లో ఆందోళన దిగారు..రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు
ప్రముఖ నటికి ఫారెన్ ట్రిప్‌లో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుని, కొన్నిరోజులు ఎంజాయ్ చేద్దామని టూర్‌కి వెళ్తే దొంగలు మొత్తం దోచేశారు. పాస్పోర్ట్స్తో పాటు డబ్బులు, విలువైన వస్తువుల్ని పట్టపగలే దొంగతనం చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటి?యే హై మొహబత్తీన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. ప్రస్తుతం పలు రియాలిటీ షోల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2016లో తోటి నటుడు వివేక దహియాని పెళ్లి చేసుకున్న ఈమె.. తాజాగా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు యూరప్ వెళ్లారు. స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) అయితే ఫ్లోరెన్స్ అనే ఊరిలో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఉండేందుకు ఇల్లు చూసే క్రమంలోనే ఓ చోటుకి వెళ్లి వచ్చే లోపు కారులో ఉన్న పాస్‌పోర్ట్, విలువైన వస్తువులు, డబ్బులని దొంగలు దోచుకున్నారు. దీంతో నటి దివ్యాంకతో పాటు ఆమె భర్త రోడ్డున పడ్డారు. సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.ప్రస్తుతం తాత్కాలిక పాస్పోర్ట్స్ పొందే ప్రయత్నంలో దివ్యాంక-ఆమె భర్త ఉన్నారు. దొంగతనం జరిగిన రోజు ఎంబసీకి వెళ్లగా అది మూసి ఉంది. తాజాగా అక్కడికి వెళ్లి తమ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తిరిగి వీళ్లిద్దరూ స్వదేశానికి తిరిగి రావొచ్చని సమాచారం.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?) -
నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు...
-
NH 65 యమ డేంజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత కీలక రహదారుల్లో ఒకటైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నం. 65 డేంజర్ మార్గ్‌గా మారిపోయింది. హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న దీనిపై అనునిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ప్రయాణంలో అలసిపోయిన కొందరు రహదారి పక్కన, సర్వీస్ రోడ్లలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఇలాంటి వారితోపాటు లారీ డ్రైవర్లకు ఎర వేసి దోచుకునే ముఠాలతో ఈ రహదారి యమడేంజర్‌గా మారిపోయింది. గడిచిన నెల రోజుల్లో ఈ తరహాకు చెందిన నాలుగు ఉదంతాలు చోటుచేసుకోగా... నిందితులు ఇప్పటివరకు చిక్కలేదు. వీరి కోసం నల్లగొండ జిల్లా, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ 65పై ఆగే ప్రయాణికులకు పోలీసులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.గత నెలలో కట్టంగూర్ పరిధిలో⇒ హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని కట్టంగూర్ సమీపంలో సరీ్వస్ రోడ్డులో వాహనం ఆపి విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి దోచుకున్నారు. ⇒హైవేపై ఉన్న మరో ప్రాంతంలో సెల్‌ఫోన్ తస్కరణకు గురైంది. నిద్రిస్తున్న వ్యక్తికి ఏమాత్రం తెలియకుండా కారు డోర్ తెరిచి ఫోన్ దొంగిలించారు.ఈ నెలలో నార్కట్‌పల్లి, చిట్యాలలో⇒ ఏపీ లింగోటం దగ్గర టార్చ్లైట్లు వేసి నిల్చున్న ఇద్దరు మహిళల్ని చూసి ఆకర్షితుడైన లారీ డ్రైవర్ ఎల్లేష్ వాహనం ఆపి వారితో మాటలు కలిపాడు. అప్పటివరకు చీకటిలో మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు అదును చూసుకుని అతడిపై విరుచుకుపడ్డారు. కాళ్లు, చేతులు కట్టేసి లారీలోని టూల్ బాక్సులో ఉన్న రూ.22 వేల నగదు తీసుకుని నలుగురూ ఉడాయించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఓ కుటుంబం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద విశ్రాంతి కోసం ఆగింది. ముసుగులు ధరించి వచి్చన ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు. ఆ శబ్ధానికి నిద్రలేచిన బాధితులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.ఎక్కువగా వ్యక్తిగత వాహనాలే...⇒ ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల్లో అత్యధికం వ్యక్తిగత వాహనాలైన కార్లు, జీపులు వంటి తేలికపాటివే ఉంటాయి. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌తోపాటు మధ్యలో ఉన్న కోదాడ, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పగటిపూట కంటే రాత్రి వేళల్లోనే ఈ బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సమయాభావం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతోపాటు అనివార్య కారణాల నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు.ఈ రెండు నగరాల మధ్య దూరం 277 కిలోమీటర్లే కావడంతో వాహనం నడిపే వాళ్లు అలసిపోవడం అనేది చాలా తక్కువ. హైదరాబాద్, విజయవాడల కంటే దూరమైన ప్రాంతాల నుంచి వీటి మీదుగా ప్రయాణించే వాళ్లు రాత్రి వేళల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా రహదారి పక్కన, ట్రక్ లే బైలో, సరీ్వస్ రోడ్లపై నిద్రిస్తున్న వారే దొంగలకు టార్గెట్‌గా మారుతున్నారు. లైట్ వేశారంటే స్కెచ్ వేసినట్లే..వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్కులు తదితరాలు నడిపే వారూ బాధితులుగా మారిన సందర్భాలున్నాయి. అనునిత్యం హైవేలపై సంచరించే వీరికి ఏయే రూట్లలో, ఏయే ప్రాంతాలు సురక్షితం? ఎక్కడ వాహనాలు ఆపుకోవాలి? ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అయితే ఈ కమర్షియల్ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు వారి బలహీనతల కారణంగా దొంగల బారినపడుతున్నారు. కమర్షియల్ వాహనాల డ్రైవర్లు ఉద్యోగనిమిత్తం దీర్ఘకాలం ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటారు.ఇలాంటి వారిని ఆకర్షించడానికే అనేక ప్రాంతాల్లో హైవే వ్యభిచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ తరహా బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకునే ముఠాలు ఎన్‌హెచ్ 65లో రంగంలోకి దిగాయి. రాత్రివేళల్లో రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రాంతాల్లో నక్కి ఉండే దొంగలు... తమ భాగస్వాములైన మహిళలు టార్చిలైట్లు లేదా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించేలా పథకం వేస్తారు. వీటిని చూసి ఆకర్షితులై వచ్చే వాణిజ్య వాహనాల డ్రైవర్లపై దాడి చేసి దోచుకుంటున్నారు. ఈ లోపాలే ప్రధాన కారణం..హైవేపై జరుగుతున్న ఉదంతాల్లో అనేకం పోలీసుల వరకు రావట్లేదు. భారీ సొత్తు పోగొట్టుకోవడమో, గాయపడటమో జరిగితేనే ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న ఉదంతాలు, బలహీనతల కారణంగా చోటు చేసుకున్నవి బయటకు రావట్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ హైవేపై గస్తీ కోసం ప్రత్యేకంగా వాహనాలు ఉండేవి. ఆపై తేలికపాటి వాహనాల స్థానంలో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బృందం చొప్పున విధులు నిర్వర్తించేది.కొన్నాళ్లు ఈ గస్తీ బృందాలు కనుమరుగయ్యాయి. జాతీయ రహదారి వెంట ఉన్న శాంతిభద్రతల విభాగం ఠాణాలకు చెందిన అధికారులు, సిబ్బందే గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్లలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత నేపథ్యంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ సాధ్యం కావట్లేదు. ఈ హైవేపై వెలిమినేడు వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ, గస్తీ బాధ్యతల్ని వీరికే అప్పగించాలనే ప్రతిపాదన ఏళ్లుగా ఫైళ్లకే పరిమితమైంది. బస్ బేలు, ట్రక్ లే బైలో ఎక్కడా సరైన వెలుతురు, నిఘా లేకపోవడమూ దుండగులకు కలిసొస్తోంది.ఈ చర్యలు తీసుకోవాలి...⇒ వాహనచోదకులు కేవలం టోల్‌ప్లాజాల వద్ద, దాబాలు, హోటళ్ల సమీపంలో మాత్రమే తమ వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.⇒ నిర్మానుష్య ప్రాంతాలు, ట్రక్ లే బైల్లో నిలపాల్సి వస్తే నిరీ్ణత సంఖ్యలో వాహనాలున్న చోటనే ఆపుకోవాలి.⇒ ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను రాత్రి వేళల్లో హైవేలపై మోహరించాలి. ఒక్కో వాహనానికి నిరీ్ణత ప్రాంతం కేటాయించి పెట్రోలింగ్ చేయించాలి. ⇒మఫ్టీ పోలీసులను కార్లలో ఉంచడం ద్వారా ఆపరేషన్లు చేపట్టాలి. ఇలా వీళ్లు ప్రయాణికుల్లా వ్యవహరిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది.⇒జాతీయ రహదారుల వెంట ఉన్న బస్ బేలు, ట్రక్ లే బైల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంచాలి.⇒ఎన్‌హెచ్ 65లో అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే వీటిలో అత్యధికం మరమ్మతులకు గురయ్యాయి. వీటిని తక్షణం వినియోగంలోకి తేవాలి.నిఘా ఉన్న చోటే పార్క్ చేసుకోండి ఎన్‌హెచ్ 65పై చోరీలతోపాటు స్నాచింగ్స్ కూడా నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ విస్తృతం చేయడంతోపాటు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ప్రయాణికులు సైతం తమ వాహనాలను సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లోనే పార్క్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆథరైజ్డ్ హోటళ్లలోనే బస చేయాలి. కొత్త వారు ఎవరైనా సమీపంలోకి వస్తున్నా, మాట్లాడాలని ప్రయతి్నస్తున్నా అప్రమత్తం కావాలి.ఏదైనా నేరం బారినపడితే వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితులు భయాందోళనలకు లోనై గందరగోళానికి గురికాకూడదు. నేరం చేసిన వ్యక్తి ధరించిన దుస్తులు, అతడి వేషభాషలతోపాటు అతడు ఏదైనా వాహనంపై వస్తే దాని నంబర్ తదితరాలు గమనించి నోట్ చేసుకోవాలి. ఎంత త్వరగా పోలీసులకు సమాచారమిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. –ఎం.రాజేశ్ చంద్ర, డీసీపీ, యాదాద్రి -
మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ఆ రోజు ఏం జరిగిందంటే?ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. -
USA: సీక్రెట్ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు
కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్లో డెమొక్రాట్ల ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టస్టిన్ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు. అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు. ఈ సమయంలో ఆ సీక్రెట్ ఏజెంట్ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని, ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మాస్టర్ ప్లాన్.. రెండు రైళ్లలో దోపిడీ
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం
ప్రముఖ నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులు కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సదరు పోలీసులకు ఫిర్యాదు చేసి, చోరీ గురించి అసలు నిజాలు బయటపెట్టింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎంత మొత్తం దోపీడికి గురైంది?మరాఠీ నటి శ్వేత షిండే.. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నిర్మాతగానూ పలు సీరియల్స్ తీస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి ఈమె నివాసముంటోంది. అయితే జూన్ 3న ఎవరూ ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బు కూడా దొంగతనం చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో పనిలో భాగంగా శ్వేత, ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)దొంగతనం జరిగిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి శ్వేత షిండే ఫిర్యాదు చేసింది. 10 గ్రాముల బంగారంతో పాటు చాలా డబ్బు దొంగతనానికి గురైందని పేర్కొంది. అయితే డబ్బులు మొత్తం ఎంతనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ప్రముఖ నటి ఇంట్లోనే దొంగలు పడటం అనేది చాలామంది అవాక్కయ్యేలా చేసింది.శ్వేత వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో సందీప్ భన్సాలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. 2016లో నిర్మాతగా మారి అప్పటినుంచి యాక్టింగ్ కాస్త పక్కనబెట్టి పలు సీరియల్స్, సినిమాలు తీస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో చోరీ జరగడంతో ఈమె వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్) -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.