sai
-
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఉదయ్‌పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాజమహల్లాంటి వేదికపై ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఆమె తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయిని వివాహమాడింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న (మంగళవారం) హైదరాబాద్‌లో వీరి వివాహా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ప్రభుత్వ పెద్దలు హాజరయ్యే అవకాశముంది. -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
పెళ్లి పీటలెక్కనున్న సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పారాణితో ముస్తాబుకానుంది. ఆమె పెళ్లి బాజాకు మూహూర్తం కూడా ఖారారైంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్ (రాజస్తాన్)లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరుగనుంది. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె నవ వధువుగా పెళ్లి పీటలెక్కబోతోంది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది. తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. ‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తాం. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయి’ అని రమణ వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్‌లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలు, రెండు వరుస ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధు... 2017, 2018లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పతకాలు గెలుచుకుంది. -
కొండపల్లి బొమ్మలకు.. మార్వలెస్ టచ్
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!! చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్‌తో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్‌తో 50 షార్ట్ఫిల్్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను. డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..నా గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాయ్‌కథాన్ అనే కాంపిటీషన్లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్లైన్లో కూడా ఔట్‌డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్‌లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్ ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్లో టాయ్స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. 3డీ డిజైన్.. గ్లిమ్స్‌తో యానిమేషన్..హాలీవుడ్ లెగో టాయ్స్లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్‌తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్‌తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్‌్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్‌కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110 బంతుల్లో 155 నాటౌట్; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్–2లో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), హమీద్ (43 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్, నోస్తుష్ చెరో మూడు వికెట్లు తీశారు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్‌ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్‌తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం
కొత్తపల్లి(కరీంనగర్): ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారైన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొద్దుల సాయి, ఓ యువతి ఎదురెదురు ఇంట్లో ఉంటున్నారు. సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తుండగా ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాంటూ సాయి వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పెద్దలు సాయిని మందలించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న సాయి ఇటీవల మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాడు. ఇంట్లోకి చొరబడి.. గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్ట లు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇదే సమయంలో సాయి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి పన్ను విరిగి చేతికి గాయమైంది. అంతటితో ఆగ కుండా కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేక లు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
రైళ్లలో నకిలీ టీసీలు
చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. అతడే కీలకం బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
25 నుంచి ఆర్చరీ శిబిరం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత భారత ఆర్చరీ క్రీడాకారులు మళ్లీ లక్ష్యాలపై గురి పెట్టనున్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి జాతీయ ఆర్చరీ శిక్షణ శిబిరం పునఃప్రారంభం కానుంది. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 16 మంది ఆర్చర్ల బృందం (ఎనిమిది మంది చొప్పున పురుషులు, మహిళలు) రికర్వ్ విభాగంలో తమ శిక్షణను కొనసాగించనున్నారు. వీరితో పాటు నలుగురు కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఈ క్యాంపులో పాల్గొంటారని ‘సాయ్’ తెలిపింది. ఈ క్యాంపునకు ఎంపికైన వారందరూ ఈ నెల 25న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ‘సాయ్’ ఆదేశించింది. అనంతరం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి... 14 రోజుల పాటు క్వారంటైన్ చేయనుంది. పురుషుల జట్టు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... మహిళల జట్టు మాత్రం ఆ పనిలో నిమగ్నమైంది. అంతే కాకుండా వ్యక్తిగత విభాగాల్లో సైతం ఒలింపిక్ బెర్తుల కోసం భారత ఆర్చర్లు పోటీ పడాల్సి ఉంది. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది. శిబిరానికి ఎంపికైన పురుషుల జట్టు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, బి.ధీరజ్, ప్రవీణ్ జాదవ్, జయంత తలుక్దార్, సుఖ్‌మను బాబ్రేకర్, కపిల్, విశ్వాస్; మహిళల జట్టు: దీపిక కుమారి, అంకిత భగత్, బొంబేలా దేవి, రిధీ, మధు వేద్వాన్, హిమని, ప్రమీలా బరియా, తిషా సంచెటి. -
భారత హాకీలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్‌కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. (నర్సింగ్ వస్తున్నాడు...) దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్దీప్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది. -
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు రూ. 30 వేలు: సాయ్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్షిప్లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్‌కు చెల్లిస్తారు. 2020–21 సీజన్లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది. ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు. -
ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగిపోయింది. అటు స్కూలు పిల్లలు దగ్గర్నుంచి, ఇటు క్రీడాకారుల వరకూ అంతా ఆన్లైన్లో తమ ట్రైనింగ్ క్లాస్‌ను వింటున్నారు. ఇలా ఆన్లైన్ పాఠాలు నిర్వహించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ( సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియన్(బాయ్)లు నడుంబిగించగా మధ్యలో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బాయ్, సాయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ ఆన్లైన్ శిక్షణలో 500 నుంచి 700 వరకూ పాల్గొన్నారు. ఇది బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. దీనికి ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్క్రీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాయ్’ ఐటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్న సమయంలో అశ్లీల చిత్రాలు రావడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా అశ్లీల చిత్రాలు రావడం సాయ్ ఐటీ డిపార్ట్మెంట్కు తలపోటుగా మారింది. -
కావ్య, నందినిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కావ్య (‘సాయ్’), నందిని (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి) సత్తా చాటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం జరిగిన పోటీల్లో వీరిద్దరూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల 400మీ. పరుగును కావ్య అందరికన్నా వేగంగా 58.42 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ‘సాయ్’ కేంద్రానికే చెందిన మహేశ్వరి (1ని.00.1సె.), సీహెచ్ పద్మశ్రీ (1ని.01.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అండర్–16 బాలికల లాంగ్‌జంప్ ఈవెంట్లో నందిని 5.21మీ. దూరం జంప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ) 4.07 మీ. దూకి రెండో స్థానంలో నిలవగా... పవిత్ర (సెయింట్ ఆన్స్; 4.05మీ.) మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు పురుషుల 400మీ. పరుగు: 1. రిషబ్ మిశ్రా, 2. శ్రవణ్ కుమార్, 3. తేజ. అండర్–16 బాలుర లాంగ్ జంప్: 1. యోగేందర్, 2. పి. అంజి, 3. వరుణ్. అండర్–14 బాలుర 4/400మీ. రిలే: 1. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి, 2. సీఎంఆర్, సూరారం, 3. మియాపూర్. అండర్–12 బాలుర 80మీ.పరుగు: 1. జె. అనిల్, 2. రామ్ శంకర్, 3. జి. లక్ష్మణ్. అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హృషికేశ్ స్వామి, 2. కె. గౌతమ్, 3. ఆర్. శ్రీకాంత్; 300మీ. పరుగు: 1. రాము, 2. ప్రణయ్, 3. గౌతమ్. అండర్–16 బాలికల 400మీ. పరుగు: 1. శ్రేయ, 2. విజయ లక్ష్మి, 3. ప్రవళిక. అండర్–14 బాలికల 100 మీ. పరుగు: 1. రాగవర్షిణి, 2. ఆర్. ఝాన్సీ బాయి, 3. సవిత; 400మీ. పరుగు: 1. ఝాన్సీ బాయి, 2. రాగవర్షిణి, 3. శరణ్య; లాంగ్ జంప్: 1. సవిత, 2. నవ్య, 3. షీరజ. అండర్–12 బాలికల 80మీ.పరుగు: 1. విభా రావు, 2. రోహిత, 3. ప్రతీకా రెడ్డి. -
శభాష్.. సాయి
సనత్‌నగర్: వృద్ధాప్యానికి వయస్సు ఉంటుందేమో గానీ..మనస్సుకు కాదంటూ ఆ ఏడు పదుల వ్యక్తి నిరూపిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నవ యువకుడిలా కాలనీ అభివృద్ధికి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వర్తిస్తుంటారాయన. ఆయనే మోడల్‌కాలనీకి చెందిన జేఎస్టీ సాయి. చిట్టాతో రెడీ... రాష్ట్ర మంత్రో, ప్రజాప్రతినిధో...లేక అధికారో...మోడల్‌కాలనీ వైపు వస్తున్నారంటే చాలు...ఆ వ్యక్తి సమస్యల చిట్టాతో రెడీగా ఉంటాడు. అవి సొంత సమస్యలేమీ కాదు.. అన్నీ ప్రజా సంక్షేమంతో ముడిపడినవే. ఇక రెగ్యులర్‌గా సమస్యలపై అధికారులతో ఫోన్లో టచ్‌లో ఉంటుండడం ఆయన దినచర్యలో ఒక భాగం. ఆ వ్యక్తి వస్తున్నా...లేదా ఫోన్న్ చేస్తున్నా...మళ్ళీ ఏ సమస్యను మోసుకొస్తున్నారంటూ అని వ్యంగ్యంగా అనే అధికారులూ లేకపోలేదు. తాను ఉండే కాలనీ ప్రజల సంక్షేమం. అభివృద్ధి గురించి ఆయనలోని తపనకు ఇదో ఉదాహరణ. ఇది నాణేనికి ఒక వైపు అయితే... ఆయనలోని సామాజిక కోణం మరోవైపు...తానుండే కాలనీ వారితో కలిసి మానవ సేవా సమితి పేరిట సమాజహిత కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఆయనలోని ఇంకో కోణం ఏమిటంటే సినీ అభిమాని అయిన ఆయన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తనలోని కళాభిమానాన్ని చాటుతుంటారు. ఇవన్నీ చేయాలంటే ఉరకలెత్తే రక్తమే ఉండనక్కర్లేదు..అనుభవాలను ధారపోసే సీనియర్ సిటిజ¯Œన్స్ కూడా చేయవచ్చని నిరూపిస్తున్నారు 78 ఏళ్ళ జేఎస్టీ సాయి. ఆ ప్రాయంలోనూ సామాజిక సేవా కార్యకర్తగా, కాలనీ అభివృద్ధి బాధ్యతలను, జీహెచ్ఎంసీ సర్కిల్–10 ఆసరా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఓపిగ్గా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. స్వచ్ఛ కాలనీ అవార్డు రావడంలో ప్రధాన భూమికగా... ఒకప్పుడు మోడల్‌కాలనీ పార్కు చూస్తే చెట్లపొదలతో చిట్టడివిని తలపించేలా ఉండేది. దాని అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి పార్కును సర్వాంగసుందరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడానికి కారకులుగా నిలిచారంటే ఆయనలోనే తపనకు నిదర్శనం. ఆ పార్కు నిర్వహణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. అలాగే రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతెందుకు రోడ్డుపై చెత్త, చెట్ల కొమ్మలు ఉన్నా వెంటనే అధికారులకు ఫోన్న్ చేయడమో! లేక నేరుగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడమో చేసి పరిష్కారం జరిగే వరకు వెంటపడుతుండడం. ఒకానొక దశలో అధికారులు సైతం విసుగెత్తిపోయి సమస్య పరిష్కారించి తీరక తప్పదు. అందుకేనేమో ఆ కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు వరించింది. ఐక్యతే బలం నినాదంతో... ఇక వినాయక చవితి, స్వాతంత్య్ర, గణతంత్ర, కార్తీక మాస విశిష్ట పూజలు, వనభోజనాలు...ఇలాంటి కార్యక్రమాలను కాలనీవాసులందరినీ భాగస్వాములు చేసి ఒకే వేదిక పైకి చేర్చి ఐక్యతలో ఉండే శక్తిని చాటిచెబుతారు. ఆయా పండుగ వేళల్లో ఉల్లాసభరిత కార్యక్రమాలతో మనస్సును పరవశింపజేసే కార్యక్రమాల నిర్వహణలో రాజీపడరంటే అతిశయోక్తి కాదు. ఇక సహపంక్తి భోజనాలు, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాల నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో పిల్లలకు ఆటలు, పాటలు, వ్యాసరచన, వక్తత్వ , పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఓటు విలువపై విస్తృత ప్రచారం... ఓటు హక్కు...ప్రజల తలరాతలను మార్చే ఆయుధంగా జేఎస్టీ సాయి భావిస్తారు. అందుకే ఎన్నికల వేళ ఓటు విలువను తెలియపరుస్తూ ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం కల్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మానవసేవా సమితితో సేవలకు నాంది కాలనీకి చెందిన బుచ్చిబాబు, శశికాంత్‌లతో పాటు మరికొంతమందితో కలిసి మానవ సేవా సమితి తరుపున జేఎస్టీ సాయి వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. వేసవికాలంలో దాదాపు రెండు నెలల పాటు బాటసారులకు పెరుగన్నం, మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు. దీంతో పాటు నిత్యం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికిలోని రోగుల సహాయకుల కు అన్నదానం చేస్తుంటారు. సత్యసాయి సేవా సమితి తరుపున జరిగే వివిధ కార్యక్రమా ల్లో జేఎస్టీ సాయి చురుగ్గా పాల్గొంటూ తనలోని సేవానిరతిని చాటుతున్నారు. అలాగే విద్యావ్యాప్తిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. కళాకారులకు ప్రోత్సాహం... ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్‌న్ ప్రతినిధిగా జేఎస్ టీ సాయి కళాకారులు అంటే అపారమైన గౌర వం. అందుకే కాలనీలో సామూహికంగా ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారులను చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో వారి చేత ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇప్పిస్తుంటారు. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యం తో స్వయంగా సుమధుర కళానికేతన్‌ను స్థాపిం చి జానపద, కూచిపూడి, భరతనాట్యం, నాటిక, నాటక, అవధానాలు, సంగీతం, మిమి క్రీ వంటి కార్యకమాలు నిర్వహించి తనలోని కళాతృష్ణను తీర్చుకుంటూనే ప్రజలకు వినో దాన్ని అందిస్తున్నారు. శ్రీవిశ్వనాధం సాహిత్య పీఠం జాయింట్ సెక్రటరీ, శ్రీనాటరాజ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, కష్ణ కళాభారతి కార్యదర్శిగా, సుమధుర కళానికేతన్ ఫౌండర్ సెక్రటరీగా, విద్వత్ పరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సాంస్కృతిక రంగంలో తనదైన సేవలు అందించారు. సీనియర్ సిటిజన్స్‌కు ‘ఆసరా’... తోటి సీనియర్ సిటిజన్స్ నిత్యం ఉల్లాసంగా ఉండాలని జేఎస్టీ సాయి తాపత్రయం. అందుకోసం జీహెచ్ఎంసీ నుంచి వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు వారికి సంబంధించిన స్కీములను వినియోగించుకునేలా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో అవార్డులు..రివార్డులు.. మరెన్నో సన్మానాలు... ♦ మోడల్‌కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు దక్కించుకోవడం వెనుక జేఎస్టీ సాయి కాలనీ పరిశుభ్రత విషయంలో కీలక భూమిక వహించారు. ♦ ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రివార్డు. ♦ సీనియర్ సిటిజన్స్, సంఘ సేవకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌చే అవార్డు, సన్మానం. ♦ సామాజిక సేవలకు గానుఎకోష్యూర్ ఎక్సలెన్స్ అవార్డు ♦ సంఘ సేవకు గాను ఖమ్మం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుచే సత్కారం.. -
బ్రహ్మజ్ఞానమంటే...
ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా? ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. ఈ కళ్లు ‘కళ్లు’ కావు! ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి. ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు. చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి. ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది. వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది. ఇదేం శ్లోకం? మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి. ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు. కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా. ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు. ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్ రాజారామ్’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్ పంత్ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు. ఖురాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్‌పంత్ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను. ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ. మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
దైవం మానుష రూపేణా
ఏమిటి? దైవం మానుష రూపేణా! అని సాయిని గురించి అన్నారా? దేవుడు ఓ మనిషి రూపంలో కనిపిస్తున్నాడని కదా దానర్థం. దేవుడంటే కనిపించనివాడు కదా! మనుష్యుడంటే అన్ని బాధలకీ గురవుతూ కనిపిస్తూ ఉండేవాడు కదా! ఇలా ఈ ఇద్దరూ తూర్పు పడమరల్లా ఉంటూంటే ఇద్దరూ ఒకటేనంటూ ఎలా అనడం సబబు? అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే.సంస్కృతంలో ‘గంగాయాం ఘోషః’ (గంగానదిలో గొల్లపల్లె) అనే మాట ఒకటుంది. నిజంగా ఓ పల్లెటూరు ఓ నదిలో ఉండటం అసాధ్యం. మరి అసాధ్యమైనదని తెలిసి కూడా ఇలా ఎలా అనగలుగుతున్నారట? గంగానది ఎంత చల్లగానూ ప్రశాంతంగానూ మనసుకి ఆనందం కలిగించేది గానూ చక్కని చల్లని గాలులతోనూ ఉంటుందో అలా ఈ పల్లెటూరు కూడా అంతగానూ గంగానది పోలికలతోనూ ఉంటుందని దాని భావం. అదే తీరులో ‘దైవం మానుష రూపేణ’ అంటే కావడానికి మనిషే అయినా దైవంలా అన్ని సందర్భాల్లోనూ కాపాడుతూ వస్తూ దైవంతో సమానంగా అనిపిస్తాడని దీనర్థం. ఈ నేపథ్యంలో ఎలా ఈ సాయి ఆ దైవంలా అనిపించాడో చూద్దాం! సాయిలో దైవం... భారతంలో భీష్ముడూ విదురుడూ కుంతీ అనే వాళ్లు కనిపిస్తారు. వీళ్లు జీవిస్తున్న కాలంలోనే కృష్ణుడూ ఉన్నాడు. ప్రధానంగా ఈ ముగ్గురూ ఆ కృష్ణుడ్ని మానవావతారంలో తమ కళ్లతో చూస్తున్నా కూడా, ఎప్పుడూ ఆ కృష్ణుడ్ని ఓ దైవంగా భావిస్తే దర్శించేవాళ్లే తప్ప, ఏనాడూ దైవమనే భావనే వాళ్లకి ఉండేది కాదు. (ఆత్మలో ఎరుకయున్..) అందుకే ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అనే ఆ అంశాన్ని ఒకటికి రెండు మార్లు లోపల అనుకుని ఆ మీదటే మాట్లాడుతూ ఉండేవాళ్లు, 9 తీరుల భక్తి భావంలోనూ ఈ తీరుభక్తి (దైవమే సుమా!) ఒకటి.అదే తీరగా ఖాపర్దే (దాదాసాహెబ్ ఖాపర్దే) అనే ఆయన తన కుటుంబంతో సహా షిర్డీకి వచ్చి కొంతకాలం పాటు ఉండదలిచాడు. ఆయనేదో అందరు భక్తుల్లా సాధారణుడు కాడు. గొప్ప పండితుడు. పైగా అంత విద్య తన వద్ద ఉందనే అహంకారాన్ని ఏ మాత్రమూ ప్రదర్శించేవాడు కాదు. అతి సాధారణంగా ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటూ తన అసాధారణ విధానాన్ని ఏనాడూ చూపించడం కోసం ప్రయత్నం కూడా చేసి లేడు.ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే నిలబడి ఉంటూ కూచోవాలనే ఆలోచనతో కూడా ఉండేవాడు కాడు. ఎవరైనా భక్తులు సాయికి ఏ ఫలాన్ని గానీ ఆహారాన్ని గానీ సమర్పించుకుంటే సాయి దాన్ని తీసుకుని ఖాపర్దేకి గాని ఇస్తే దైవానికి మనం దేన్నైనా సమర్పిస్తే పూజారి దాంట్లో సగాన్ని మనకి ఇస్తే ఎలా దాన్ని ప్రసాదంగా భావిస్తూ తీసుకుంటామో అలా సాయి ఇచ్చిన ఫలహారాలని మాత్రమే తీసుకుంటూ ఉండేవాడు. ఈయన భక్తిలోని లోతు తెలియని ఏ కొందరో మరీ అంతగా ఉండాలా? అనుకునే వాళ్లు. ఇటుపక్క ఆంగ్లభాషలో నిష్ణాతుడు కావడమే కాకుండా, అటుపక్క విద్యారణ్యులవారి ‘పంచదశి’ని చక్కగా తేలిక తేలిక పదాలతో వివరించి చెప్తూండేవాడు దానియందిష్టమున్న భక్తులకి. ఆకాశంలో 7వ ఎత్తులో గరుడుడికి నేల మీద అలా అడుగులేస్తూ నడవడం ఎంతో కష్టం కదా! అయినా అంతటి మహా పండితుడు ఇటు ఆంగ్లం అటు సంస్కృతం ఈ రెంటికీ మధ్యలో తెలుగులోనూ కూడా అయ్యుండీ. అందరికీ అర్థమయ్యే స్థాయికి దిగి ఎదుటివారికి అర్థమయ్యేంత వరకూ తాను తృప్తి చెందేవాడు కాడు. ఇలా వివరించి చెప్పడానికి దేన్నో ఆశించి ఉండటం కాదు కారణం – ఆనాటి మహనీయుల విజ్ఞానం అతిసామాన్యునికి కూడా అందాలి, అందజెయ్యాలనే తాపత్రయం మాత్రమే.సాయి వద్దకొచ్చే ఎందరో సాయిని చనువుగా పలకరించడం, అప్పుడప్పుడు వాదించి మాట్లాడటం, మరి కొందరైతే తిట్లు తినడం, ఇంకొందరైతే ఆయనకి ముందు నడవటం, కలిసి వెళ్తూ ఉండటం... వంటివి చేస్తూ ఉండేవారు గానీ ఖాపర్దే మాత్రం ఏనాడూ అలా ప్రవర్తించేవాడే కాదు సరికదా సాయి సమక్షంలో ఆయన కనీసం కూచుని కూడా ఎరుగడు– నోరు విప్పి మాట్లాడేవాడు కాదు తనంత తానుగా. సాయి మాట్లాడి ప్రశ్నిస్తే తప్ప సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు కాదు. ఈయన్ని చూసే ఈయన విధానం నచ్చి క్రమంగా ఈయన గమనించిన సాయిలోని దైవత్వాన్ని గుర్తించి ‘నూల్కర్ బుట్టి’ అనే ఇద్దరూ కూడా ఖాపర్దేలాగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఖాపర్దేనే ముగ్గురిగా మూడు రూపాలతో ఉన్నాడా? అనిపిస్తూ ‘ఉండేవాళ్లు ఖాపర్దేని చూస్తూ విజ్ఞానంలో పై స్థాయిలో ఉండే పెద్దలంతా ఓ మాటని అనుకునేవాళ్లు – వేదాలదగ్గరికి సామాన్యశబ్దాలు వెళ్లి మారు మాట్లాడలేక మౌనంగా ఎలా ఉంటాయో, అలా ఈ ముగ్గురూ సాయి సమ్ముఖంలో మౌనంగానే ఉంటూ ఉంటారు అని. ఎంత పచ్చినిజం ఆ మాటలు! లోకంలో సాధారణంగా ఎక్కడో కాని భార్యాభర్తలిద్దరూ ఒకే తీరుగా ఉండటమనేది కనిపించదు. ఈమె తీవ్ర దైవభక్తి పరురాలైతే ఆయన నాస్తికుడు కాకపోయినా అంత దైవభక్తి పరుడు కాకుండానూ లేదా ఆమె చేసేదాన్ని మరీ అంత చాదస్తమా? అనుకునే తీరుగానూ ఉంటుంటారు. చిత్రమేమంటే ఖాపర్దే సాయి పట్ల చూపుతున్న ఆ భక్తితత్పరతలోని లోతుని గమనించి ఆమె కూడా సాయి పట్ల అంత గాఢ భక్తి కలిగినదిగానూ అయిపోయింది.ఆయన మహాపండితుడైతే ఆమె చక్కని వంటకత్తె. దాంతో సాయికి ఏయే పదార్థాలు భోజనంలో రుచికరంగా ఉంటాయో ప్రతి నిత్యం గమనిస్తూ ఆ పదార్థాలనే ఆమె స్వయంగా వండి తేవడమూ, తెచ్చిన ఆ పళ్లెం మీద గుడ్డని కప్పి భక్తి పూర్వకంగా సాయికి దైవానికి సమర్పించే నైవేద్యమనుకుంటూనే ఆయన ముందుంచడమూ చేస్తూ ఉండేది.ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో వంటకాలని, సాయి ఇష్టమైన భక్ష్యాలని ఫలాలని తెచ్చి వెండిపళ్లాలలో ఆయన సమ్ముఖంలో ఉంచినా, సాయి మాత్రం ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లెం ఎక్కడుందా? అని ఓ క్షణం పరిశీలించి ముందుగా ఆ పళ్లెంలోని ప్రసాదాన్నే ఆరగిస్తూండేవాడు. ఒక్కోసారి సాయి తన భక్తులతో మాట్లాడుతూనో భిక్షాటనకంటూ వెళ్లి తాను తెచ్చిన ఆహారాన్ని కుక్కలకీ పక్షులకీ... ఇతర జీవులకీ వేస్తూ భోజన సమయాన్ని దాటి తినకుండా ఉంటే, ఆ సాయి భోజనాన్ని తీసుకుని తినేంతవరకూ ఈమె కూడా తింటుండేది కాదు. అంతటి దైవభావన ఆ దంపతులకి సాయి విషయంలో ఉంటూండేది. ఖాపర్దేకి కొన్ని ముఖ్యవ్యవహారాలుండి ఆయన ఒకే బిగిని 4 నెలల కంటే ఉండలేక వెళ్లవలసి వస్తూంటే, ఆయన తన భార్యని అక్కడే సాయికి భోజన సమర్పణం కోసం ఉంచేసి వెళ్లాడు. అంతటి గాఢభక్తి ఆ ఇరువురికీ. అది కూడా దైవసమాన దృష్టితో కూడిన భక్తి మాత్రమే. ఇదీ కారణం! ఎవరెవరి మనసులోని మాటల్నైనా, ఎంత దూరంలో వాళ్లు మాట్లాడుకున్నా గ్రహించగల శక్తి సాయికుందని అనేక ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి సాయి ఎవరిలో భక్తి ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోలేడా? ఆ కారణంగా ఖాపర్దే దంపతుల భక్తిలోని లోతుదనాన్ని గ్రహించి – ఆ దంపతులకి సాధన మార్గంలో తేలికైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చూపాలనుకున్నాడు. అలా అనుకున్న సమయానికి ఖాపర్దే పొరుగు ప్రదేశంలో తన కుటుంబపు పనిమీద వెళ్లి ఉండటాన్ని గ్రహించి, ముందుగా ఆమెకి సులువైన సాధనమార్గాన్ని (భగవంతుని అనుగ్రహాన్ని సాధించే పద్ధతిని) తెలియజేయాలనుకున్నాడు మనసులో.ఓ రోజు ఆమె ప్రతిరోజులాగానే సాయికి పళ్లెం నిండుగా తినుబండారాలని పట్టుకొచ్చింది! సాయికిష్టమైన పూరీ హల్వా అన్నం పప్పు పచ్చడి వడియాలూ మొదలైన పదార్థాలని పళ్లెం నిండుగా తెచ్చి సాయి ముందుంచిందో లేదో ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా సాయి ఆ పళ్లాన్ని తీసుకున్నాడు తన చేతితో. ఇవే పదార్థాలతో పాటు అటూ ఇటూగా మరికొన్ని పదార్థాలని వెండి పళ్లాలలో పట్టుకొచ్చి సాయికి మరింత దగ్గరగా ముందు వరుసలోనే పెట్టారు కొందరు.ఇన్ని పళ్లాలున్నా ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లాన్ని మాత్రమే సాయి తీసుకుని భోజనాన్ని ప్రారంభించగానే సాయి భక్తుడూ అతిసన్నిహితుడూ నిరంతరం ఆయనతోనే ఉండేవాడూ ఆయన శ్యామా సాయిని ఉద్దేశించి పలుకుతూ ఏదో ప్రశ్నని అడుగదలిచినట్లుగా తన ముఖాన్ని సాయి వైపు చూస్తూ ఉంచాడు. సాయి శ్యామాని చూస్తూ – ‘ఏం అడుగదలిచా?’– వన్నట్లు కళ్లెగరేశాడు. శ్యామా నిర్భయంగా! ‘‘సాయిదేవా! దైవసమానులైన వారికి ప్రపంచ పద్ధతుల కంటే భిన్నమైన ధోరణులు కదా ఉంటాయి! ఇందరు ఇన్ని తినుబండారాలని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అతిపవిత్రంగా వండి తెచ్చి సమర్పిస్తూ ఉంటే అందరినీ మౌనంగా కాదంటూ ఖాపర్దే ధర్మపత్ని తెచ్చిన పళ్లాన్నే స్వీకరిస్తూ ఉన్నావు గదా! కనీసం రుచిని చూసి నచ్చలేదంటూ కొన్ని పళ్లాలని దూరంగా జరిపేసినా ఆ భక్తురాండ్రకి కొంత మానసికంగా తృప్తి ఉంటుంది గానీ, కనీసం అలా ముట్టుకోకుండా కూడా ఎంతో పరిశుభ్రత ఉట్టిపడుతూ ఉండే పళ్లాలని కూడా అలా జరిపివేస్తున్నావే! అది ఆ భక్తురాండ్ర మనసుకి గాయాన్ని కలిపించేది కాదా? అయినా అందరూ ఒక్కరే అని ప్రబోధించే నీకు ఈ వివక్షని చూపించడం సమంజసం అనిపిస్తోందా? భోజనాన్ని ఎలా ఉన్నా భిక్షాటనకి వెళ్లి తెచ్చినప్పుడు చద్ది అన్నమైనా, అది తెచ్చాక ఆ అన్నపుగిన్నెలో కాకులు కుక్కలు పిల్లులు మూతిని పెట్టి తిన్నా కూడా ఏ అసహ్యం భేదభావనా లేకుండా.. ఆరగించే నీకు ఖాపర్దేసతీమణి తెచ్చే ఆహారమే అంత ఇష్టం అవుతూ ఉండటంలో లోపలి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నీతో బాగా చనువు ఉన్నవాణ్ని నేను కాబట్టి ఈ ప్రశ్నని ఇందరి సమక్షంలోనూ అడుగుతున్నాను. దీనిలో ఏదో పరమార్థం ఉండి ఉంటుందని భావిస్తున్నాను. నన్ను మన్నించి తెలుపరూ?’ అని అడిగాడు. ఆ సుదీర్ఘ ప్రశ్నని సాయి విని చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! ఈమె తెస్తున్న ఆహార పదార్థాలూ ఎంతటి శ్రేష్ఠమైనవో తెలియజెప్తాను విను. ఈ జన్మలో ఖాపర్దే పండితునికి భార్యగా కనిపిస్తున్న ఈమె తన కిందటి జన్మల్లో మొదటి జన్మలో అతిసాధువూ పుష్టికలదీ ఎందరికో పాలని ఇచ్చినదీ అయిన తెల్లని ఆవు. ఒక వ్యాపారస్తుడు అప్పటి ఆమె యజమాని.తరువాత జన్మలో ఆమె ఓ తోటమాలి ఇంట్లో జన్మించింది. ఆ మీద జన్మలో క్షత్రియజాతిలో పుట్టి ఓ వర్తకునికి భార్య అయింది. ఆ మీదట జన్మలో ఓ బ్రాహ్మణవంశంలో పుట్టి పరమ ఆచారపరురాలూ సంప్రదాయ విధానం కలిగినదీ అయింది. చెప్పలేని దైవభక్తి ఆమెకి ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా అయిపోయింది. ఎంతో కాలం నుండీ ఎదురుచూస్తూ ‘ఎప్పుడు చూస్తానా?’ అనుకుంటున్న ఈమె కాస్త ఈ జన్మలో ఎక్కడో పుట్టి ఇప్పుడు షిర్డీకి వచ్చి తనని తాను నాకు చూపించుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఆమె భర్త కూడా పండితుడయ్యుండీ, ఆ సంస్కృత ఆంగ్ల పాండిత్యం అలాగే అధికారమూ హోదాలేని నన్నే ఆదరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిలోనూ కనిపించే ఆ భక్తీ నా పట్ల చూపుతున్న ఆ భావనా (దైవ సమానభావన) మా ముగ్గురికే తెలుస్తుంది. అందుకే ఇష్టంగా తింటున్నాను. ఈ జన్మలూ ఆ జన్మకీ జన్మకీ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే మరికొంత సమయం పడుతుంది గాని తృప్తిగా రెండు ముద్దల్ని నన్ను తిననీ! ఇలా ఆమె భోజనాన్ని తినడమనేది పక్షపాత బుద్ధిని చూపడం లేదా ఇతరుల్ని గాయపడేలా చేయడం అనుకోవద్దు.నా గురించి తెలియని భక్తులు కాదు వీళ్లంతా.. అంటూ మొత్తం అన్నాన్ని తినేసి తన ఆసనంలో కూర్చున్నాడు సాయి.ఇలా తననీ తన భర్తనీ అందరి సమక్షంలో సాయి అంతగా ప్రశంసించినా ఆమెలో ఏవిధమైన గర్వమూ కళ్లలో మెరుపూ అందరికంటే తానెక్కువ అనే భావంతో కనిపించాల్సిన నవ్వూ... ఏమీ లేనే లేవు. ఎవరి గురించో తానువింటున్నట్లుగా ఓ నది సముద్రంలో చెప్పలేనంత జలంతో వచ్చి కలిసినా సముద్రంలో ఏ మాత్రపు పెరుగుదలా లేకుండా గంభీరంగా యథాపూర్వంగానే (పూర్వం ఎలా ఉందో అలానే) ఉండిపోయింది. అది అందరికీ విస్మయాన్ని కలిగించింది.వాక్కు ద్వారా శక్తిపాతంసాయి అలా ఆసనంలో కూర్చున్నాడో లేదో ఆమె సాయి పాదాలని మృదువుగా నొక్కసాగింది. అలా తన పాదాలని మర్దన చేస్తున్న ఆమె చేతులని తాను తన చేతులతో గ్రహిస్తూ... ‘తల్లీ! ఓ మంత్రాన్నిజపించు’– అంటూ ‘రాజారామ్– రాజారామ్– రాజారామ్.. అంటూ ముమ్మారు అతిమంద్రంగా ఆమెకి ఉపదేశించాడు. ఇదేనమ్మా నువ్వు నిత్యం జపించాల్సిన మంత్రం! అంటూ ఆమె కళ్లలోకి ఆర్థ్రంగా చూశాడు. ‘దేవా!’ అని ఆమె అంటూంటే.. నీ జీవిత పరమార్థం నెరవేరేది ఈ మంత్రంతోనే. మీ దంపతులకి శ్రేయస్సు కలుగుతుంది’ అని ముగించాడు సాయి. వాక్ శక్తిపాతం చేశాడన్నమాట సాయి.శక్తిపాతమంటే..?ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి నీరు పల్లంగా ఉన్న ప్రదేశంలో పడ్డట్టుగా ఉదాత్త తపశ్శక్తి ఉన్న మహనీయుని నుంచి ఆయన ఆర్జించిన తపశ్శక్తిలోని ఓ కొంత(ఈ తపశ్శక్తిని ఎంత నిష్ఠతో ఇష్టంతో మనఃపూర్వకంగా గ్రహించగల శక్తి ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి అంత మాత్రమే లభించడం శక్తిపాతం ద్వారా లభిస్తుంది.ఒక సామాన్యశక్తిమంతుడు నిరంతర వ్యాయామం ద్వారా ఎంత బలవంతుడు తన అభ్యాసానికి అనుగుణంగా కాగలుగుతాడో అలా శక్తి పాతమనేది కూడా సాధకుని భక్తితత్పరతకి అనుగుణంగానే ఉంటుంది. ఖాపర్దే భార్య ఇలా భక్తిశ్రద్ధలతో సాయిని కేవలం ఓ సాధకునిగా లేదా సిద్ధునిగా లేదా తమ కోరికలని తీర్చే మహనీయునిగా కాక ఓ దైవంలానే నిరంతరం భావించింది కాబట్టి, సాయి కూడా తనలో దృష్టితో ఆమెని అంతటి నిరంతర సాధకురాలిగా గుర్తించాడు కాబట్టీ ఆమెకి తన వాక్కు ద్వారా తన తపశ్శక్తిని శక్తిపాతరూపంగా అందజేశాడు.అంతేకాదు. ‘తల్లీ! నా శక్తిపాతం ద్వారా శక్తి మంతురాలివైన నువ్వు చేయాల్సింది ‘నా నామజపం కాదు– రాజారామ్– అనే మంత్రంతో ఆ రామచంద్రుడ్ని మాత్రమే’ అని మౌనంగా తెలియజేశాడు కూడా.స్వాములవారు సమీపానికి భక్తులు వెళ్లడం మంత్రోపదేశాన్ని పొందటం, మళ్లీ మరొకరి వద్దకి వెళ్లడం కొంతకాలమయ్యాక మరొకరి వద్దకి వెళ్లి ఉపదేశం తీసుకుందామనే ఆలోచనతో ఉండటం ఎంత సరికాదో, గురువుని మెప్పించి శక్తిపాతం ద్వారా మంత్రోపదేశాన్ని పొందటం ఎంత సరైనదో పరోక్షంగా తెలియజేశాడు సాయి ఈ సంఘటన ద్వారా. ఆయన ‘మూర్తీభవించిన దైవం’ అనే దృష్టితో సేవించింది కాబట్టే ఆమెకి మంత్రాన్ని పొందడం సాధ్యమైంది. ‘నాకు మోక్షవిద్య కావాలి! అందుకే వచ్చాను....’ – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు