section 377
-
377, 497 సెక్షన్లు మళ్లీనా?
కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. పలు కీలకాంశాలపై ముఖ్యమైన సవరణలను తెరపైకి తెచ్చింది. స్వలింగ సంపర్కం (సెక్షన్ 377, వివాహేతర సంబంధాలు (సెక్షన్ 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించే అంశాన్ని పరిశీలించేలా ముసాయిదా నివేదికను రూపొందించింది. ఈ రెండు సెక్షన్లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి విదితమే. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు తెచ్చేంiదుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో.. ఐపీసీలో సెక్షన్ 497ను రీ క్రిమినలైజ్ చేయాలని.. ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. అంతేకాదు.. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నిబంధనను ప్రవేశపెట్టడం కూడా ఉంది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉంది, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అయితే.... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. సెక్షన్ 497 ఏం చెప్పింది భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. 2023లో సవరణ.. అయితే.. 2023లో సెక్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది. ఐపీసీ 377 సెక్షన్ కూడా.. భారత న్యాయసంహిత ముసాయిదా నివేదికలో.. ఐపీసీ 377 సెక్షన్ నేరంగా పరిగణించే అంశాన్ని పునరుద్ధరించడంపై కూడా స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసింది. 2018లో సుప్రీం కోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. * ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదు. * ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు. * రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది. 377 సెక్షన్ రద్దు తర్వాత.. ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే పశుత్వ చర్యలను (అసహజ శృంగారం) కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
‘తను వెళ్లిపోయాడు; రెండేళ్లు నరకం అనుభవించా’
తిరువనంతపురం : ‘మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళకు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్ చెబుతూ..‘ మాది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను. అందరిలాగా మాకు ప్రత్యేక మ్యాట్రిమొనీలు లేవు. అందుకే వ్యాపారంలో కాస్త తీరిక దొరికితే చాలు బెంగళూరు, తిరువనంతరపురం వెళ్లి నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడేమోనని వెదికేవాడిని. అలా ఓ ఎల్జీబీటీ సంస్థ ద్వారా సోను పరిచయమయ్యాడు. తను నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. రెండు రోజుల చాటింగ్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా తనను చూశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పినపుడు చాలా భయపడింది. అమెరికా లేదా యూకేకు వెళ్లి అక్కడే ఉండమని సలహా ఇచ్చింది. ఇండియాలో మాలాంటి వాళ్లను సమాజం గేలి చేస్తుందని, కుటుంబాన్ని వెలి వేస్తుందని ఆమె భయం. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా హక్కు. అందుకే మేమిద్దరం గుడిలో దేవుడి ఎదుట ఉంగరాలు మార్చుకున్నాం. కారు పార్కింగ్ ఏరియాలో ఒకరి మెడలో ఒకరం తులసిమాలలు వేసుకుని దంపతులమయ్యాం’ అని ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సోను.. తన 29వ ఏట వధువు వెతుకుతున్న సమయంలో తల్లిదండ్రులకు తన గురించిన నిజాన్ని చెప్పాడన్నాడు. మొదట వాళ్లు భయపడినప్పటికీ.. తన వల్ల ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని ఆలోచించిన తనను ప్రశంసించారని చెప్పుకొచ్చాడు. నికేశ్, తాను ప్రస్తుతం కొత్త జీవితం గడుపుతున్నామని, అయితే పిల్లలు లేని లోటు, చట్టబద్ధత లేని వివాహం తమను వేదనకు గురిచేస్తుందన్నాడు. కాగా ఈ విషయమై ఎల్జీబీటీ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయని, తాము కూడా ఇందులో సగర్వంగా భాగస్వాములమవుతామని నికేశ్, సోను పేర్కొన్నారు. తాము ఇప్పుడు అనుభవించే కష్టాలు భవిష్యత్ తరాలు పడకూడదనే తమ పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సెప్టెంబరు 6 తమ జీవితాల్లో వెలుగునింపిందని అయితే తమ మనుగడకు ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. కాగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబరులో తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నేను అమ్మాయిలా ఉన్నాను..అందుకే!
చెన్నై : గే అయిన కారణంగా సమాజం తన పట్ల వివక్ష చూపిస్తోందని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబ్బాయినైన తను అమ్మాయిలా ఉండటానికి ఆ దేవుడే కారణమంటూ సముద్రంలో దూకి ప్రాణాలు విడిచాడు. జూలై 3 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. వివరాలు.. ముంబైకి చెందిన అవిన్షు పటేల్ చెన్నైలోని ఓ స్పాలో పనిచేస్తున్నాడు. తాను గే అని తెలుసుకున్న అతడు ఛీత్కారాలు తట్టుకోలేక కుటుంబ సభ్యులకు దూరంగా బతుకున్నాడు. అయితే పనిచేసే చోట కూడా అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో చెన్నైలోని ఇంజమ్బాక్కం బీచ్ వద్ద సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా చనిపోయేముందు అవిన్షు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. ‘ నేను ఒక అబ్బాయిని. కానీ నా నడక, మాట, ప్రవర్తన అన్నీ అమ్మాయిలాగానే ఉంటాయి. భారతదేశంలో ఉన్న కొంతమంది ప్రజలకు ఇలాంటివి నచ్చవు కదా. అందుకే గే, ట్రాన్స్జెండర్లను గౌరవించే దేశాలను చూస్తే గర్వంగా ఉంటుంది. అదే విధంగా ఇండియాలో నాలాంటి వాళ్లను మనుషులుగా చూసేవాళ్లను కూడా. అయినా నేనిలా ఉండటం నా దోషం కాదు. ఇది దేవుడు చేసిన తప్పు. అందుకే నన్ను నేనే ద్వేషిస్తున్నా’ అంటూ అవిన్షు ఫేస్బుక్లో భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఈ ఘటన నేపథ్యంలో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ట్రాన్స్జెండర్లకు వేధింపులు మాత్రం తప్పడం లేదంటూ పలువురు వాపోతున్నారు. -
మా అక్కే బ్లాక్మెయిల్ చేసింది: ద్యుతీ చంద్
భువనేశ్వర్ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, బిడ్డలాంటి అమ్మాయితో సహజీవనం ఏంటని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ ప్రశ్నించగా.. ద్యుతీని భయపెట్టి, బ్లాక్మెయిల్ చేయడం వల్లే అలా మాట్లాడుతుందని ఆమె సోదరి సరస్వతి చంద్ ఆరోపించారు. అయితే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయిన ఈ విషయంలో వెనక్కు తగ్గే ముచ్చటే లేదని ద్యుతిచంద్ మరోసారి స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంగళవారం మీడియాతో మాట్లాడింది. తనను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదని, తన అక్కనే రూ.25లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిందని బాంబుపేల్చింది. ‘నా సొంత అక్కనే నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగింది. ఇవ్వకపోవడంతో కొట్టింది కూడా. ఈ విషయంపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ మా అక్క బెదిరిస్తూనే ఉంది. దీంతోనే నేను నా బంధాన్ని నలుగురికి చెప్పుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ బాహటంగా స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ ‘ద్యుతీ చంద్ ప్రమాదంలో ఉంది’ -
బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్
న్యూఢిల్లీ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత రన్నర్ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్యుతీని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి అలా చెప్పించారని ఆమె సోదరి ఆరోపించగా.. గే సెక్స్‌ను అంగీకరించేది లేదని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ కరాఖండిగా చెప్పారు. ద్యుతీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది. నా మేనకోడలు కూతురు ఆమె. ఆ అమ్మాయికి ద్యుతీ తల్లిలాంటిది. అలాంటి ఆమెతో పెళ్లి ఎలా సాధ్యమవుతోంది. ఇది ఒడిశా సమాజం ఎలా అంగీకరిస్తోంది. ఈ బంధాన్ని అంగీకరించనని ద్యుతీకి నేను గట్టిగా చెప్పాను. దీనికి ఆమె హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపింది. నేను బతికుండాగానే నీవు కోర్టు ఆదేశాలు పాటిస్తున్నావా?అని అడిగాను. దీనికి అవును.. కోర్టు అనుమతి ఉంది. నీవు సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు.. నాకు సహాయక సిబ్బంది మద్దతు ఉందని పేర్కొంది. నేను ఏవరు సపోర్ట్ చేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె వారి మద్దుతుతో ఏమైనా చేస్తానని చెప్పింది. నేను వారితో ఒకసారి మాట్లాడుతానని చెప్పాను. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను నా పెద్ద కూతురిని వారి దగ్గరకు తీసుకెళ్లమన్నాను. మేం వారి దగ్గరికి వెళ్లేసరికే వారు అక్కడ లేరు. ద్యుతీ ఆటపై దృష్టి పెట్టడమే నాకు ప్రభుత్వానికి కావాల్సింది. దేశం కోసం ఆడుతున్న ద్యుతీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బు ఇచ్చింది. ద్యుతీ వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టకపోయినా పర్లేదు.. కానీ తన ఆటద్వారా దేశ గౌరవాన్ని మాత్రం కాపాడాలి.’ అని అఖోజీ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ తమ గ్రామం మాత్రం ఇలాంటి బంధాలను అంగీకరించదని ద్యుతీ బంధువు ఒకరు అభిప్రాయపడ్డారు. అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ -
ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నా : ద్యుతీచంద్
భువనేశ్వర్ : తన స్నేహితురాలితో రిలేషన్షిప్లో ఉన్నానంటూ భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన ప్రకటన చేశారు. తద్వారా స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని బయటపెట్టిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు. ఒడిశాలోని తన సొంత గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టు పేర్కొన్న ద్యుతీ.. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు. ఈ విషయం గురించి ద్యుతి మాట్లాడుతూ.. ‘ నా సోల్‌మేట్‌ను కనుగొన్నాను. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది(సెక్షన్ 377ను ఉద్దేశించి). అథ్లెట్‌ను అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్ చేయాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాను. మరో ఐదేళ్ల దాకా రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలంపిక్ క్రీడలపైన దృష్టి సారించాను. ఆటల నుంచి విరామం తీసుకున్న తర్వాత పూర్తి సమయం తనకే కేటాయించి.. జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని పేర్కొంది. కాగా పేదరికాన్ని జయించి ‘ట్రాక్’ బాట పట్టిన ద్యుతిలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా కలత చెందిన ఈ ఒడిషా అథ్లెట్ ఆర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది. ఇక గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377..సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. -
ఆమెకు 40, ఈమెకు 24.. సహజీవనం చేయొచ్చు
తిరువనంతపురం : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు చట్టబద్దం చేయడంతో కేరళ హైకోర్టు మంగళవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఓ 40 ఏళ్ల మహిళ, 24 యువతితో కలిసి జీవించవచ్చని అనుమతినిచ్చింది. సీకే అబ్దుల్ రహీమ్, నారయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఇద్దరు మహిళలు సహజీవనం చేయవచ్చని తీర్పునిచ్చింది. కొల్లామ్‌లోని వెస్ట్ కల్లాడకు చెందిన శ్రీజ(40) తన పార్టనర్ అరుణ(24)ను కోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరుణతో కలిసి జీవించాలని ఉందని, దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, బలవంతంగా తన నుంచి ఆమెను దూరం చేశారని పేర్కొన్నారు. గత ఆగస్టు నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, అరుణ పేరేంట్స్ మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసి తన నుంచి దూరం చేశారని తెలిపారు. అరుణను బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారని, ఎలాగోలా ఆమెను అక్కడ కలిసానని, కానీ ఆసుపత్రి వారు తనతో తీసుకెళ్లడానికి అనుమతినివ్వలేదన్నారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అరుణను తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు అరుణను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు. శ్రీజతో కలిసుండటంలో తన ఉద్దేశం ఏమిటో కోర్టుకు అరుణ వివరించింది. అలాగే పిటిషనర్ శ్రీజ ఇటీవల స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. దీంతో ఈ ఇద్దరు సహజీవనం చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. -
6 రోజుల్లో 8 తీర్పులు
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ–చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రాకు సుప్రీంకోర్టులో మరో ఆరు పనిదినాలే మిగిలున్నాయి. వచ్చే నెల 2న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా జస్టిస్ మిశ్రా ఘనత వహించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేస్తూ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే ఓ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే మిగిలున్న ఆరు పనిదినాల్లో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని వివిధ ధర్మాసనాలు ఎనిమిది కీలక కేసుల్లో తీర్పులు వెలువరించనున్నాయి. ఆధార్ చెల్లుబాటు నుంచి అయోధ్య కేసు వరకు.. దేశ గతిని మార్చగల ఈ తీర్పులు చెప్పే వివిధ ధర్మాసనాల్లో మొత్తం కలిపి పది మంది న్యాయమూర్తులు పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించే ఎనిమిది కీలక కేసులేంటో ఓ సారి పరిశీలిద్దాం.. 1. ఆధార్ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చిన్న పనికీ ఆధార్ కావాలంటున్న ఈ రోజుల్లో అసలు ఆధార్ కార్డే చెల్లుబాటు కాదనీ, దానికి రాజ్యాం గబద్ధత లేదనీ, వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్ ఉల్లంఘిస్తోందంటూ అనేక పిటిషన్లు వచ్చాయి. హైకోర్టు మాజీ జస్టిస్ కె.పుట్టస్వామి కూడా ఈ పిటిషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు ఏకధాటిగా విచారించి నాలుగున్నర నెలల ముందే తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు ఈ ఆరు రోజుల్లో వెలువడనుంది. 2. అయోధ్య కేసు వివాదాస్పద రామ జన్మభూమి–బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడాల మధ్య సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయలా? వద్దా? అన్న విషయంపై ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం ప్రకటించనుంది. 3. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు ప్రభ్యుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ 2006లో ఎం.నాగరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించనుంది. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లను తొలగించేం దుకు మోదీ ప్రభుత్వం విముఖంగా ఉండగా, తరతరాల నుంచి ఐఏఎస్ అధికారులుగా ఉంటున్నవారి కుటుంబీకులు కూడా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారనీ, అదేమీ వారసత్వ హక్కు కాదని సుప్రీంకోర్టు అంటోంది. 4. శబరిమల ఆలయ ప్రవేశం కేసు 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమ తించాలా? వద్దా? అన్న విషయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు స్త్రీలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తుండగా సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. 5. వ్యభిచారం కేసు వ్యభిచారం, వివాహేతర సంబంధం కేసుల్లో మహిళ తప్పు ఉన్నా కూడా ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ పురుషుడిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్న అంశంపై కూడా సీజేఐ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించనుంది. ఐపీసీ సెక్షన్ 497కు సవరణలు చేసి మహిళపై కూడా కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతించే అవకాశం ఉంది. 6. విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు కోర్టుల్లో జడ్జీలు కేసులను విచారిస్తుండగా ఆ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయాలన్న కేసుకు సంబంధించి సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తే ముందుగా సీజేఐ విచారించే కేసులను ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 7. నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు రాజకీయ నేతలపై ఏదైనా కోర్టు నేరాలు, అభియోగాలు మోపితే.. వారిని ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ వచ్చిన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం రాజకీయ నేతలు దోషులుగా తేలితేనే నిషేధం వర్తిస్తుండగా తుది తీర్పులు రావడానికి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. 8. లాయర్లుగా ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలా మంది న్యాయవాదులై ఉండి కోర్టుల్లో కేసులు కూడా వాదిస్తున్నారు. న్యాయవాదులుగా ఉన్నవారు పార్లమెంటుకు లేదా శాసనసభలకు ఎన్నికైతే వారికి ప్రభుత్వం వేతనం చెల్లిస్తోందనీ, వారు మళ్లీ సొంత సంపాదన కోసం కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు నెరవేర్చడం లేదు కాబట్టి వారు కోర్టులకు వెళ్లకుండా నిలువరించాలంటూ వచ్చిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది. -
బొట్టు, దుప్పట్టతో ట్రాన్స్‌జెండర్‌లా గంభీర్.!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ పెద్దబొట్టు, దుప్పట్ట కొంగుతో ట్రాన్స్‌జెండర్‌లా కనిపించాడు. గతకొంత కాలంగా అతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ ఢిల్లీ ఆటగాడు.. దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్ కమిటీ నిర్వహించిన హిజ్రా హబ్బా వేడుకలకు గంభీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మగవారు బొట్టు, దుప్పట్ట, ఆడవారు మీసాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే గంభీర్ దుప్పట్ట, బొట్టు ధరించాడు. అతనికి ట్రాన్స్‌జెండర్స్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక గంభీర్ ట్రాన్స్‌జెండర్స్‌కు మద్దతుగా ఉండటం ఇదే తొలిసారేం కాదు. రక్షాబంధన్ సందర్భంగా వారితో రాఖీ కట్టించుకుని వారిని గౌరవించాలని పిలుపునిచ్చాడు. “It’s not about being a man or a woman. It’s about being a HUMAN.” With proud transgenders Abhina Aher and Simran Shaikh and their Rakhi love on my hand. I’ve accepted them as they are. Will you? #respecttransgenders pic.twitter.com/6gBOqXu6nj — Gautam Gambhir (@GautamGambhir) August 25, 2018 -
‘నన్నొక క్రిమినల్లాగా చూశారు’
స్వలింగ సంపర్కం నేరం కాదని, అందుకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు సెప్టెంబరు 6న చారిత్రాత్మకతీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలకడంతో ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) వర్గానికి ఊరట లభించింది. ఇక ఆనాటి నుంచి ఇంద్రధనుస్సు జెండాలు రెపరెపలాడుతూనే ఉన్నాయి. తమకు దక్కిన గుర్తింపును సెలబ్రేట్ చేసుకుంటూ పలువురు స్వలింగ సంపర్కులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిలో జాతీయ అవార్డు గ్రహీత, థియేటర్ ఆర్ట్, టీవీ ప్రముఖుడు, రచయిత అపూర్వ ఆస్రాని కూడా ఉన్నారు. పదకొండేళ్ల బంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తన సహచరుడు, మ్యుజీషియన్ సిద్ధాంత్ పిళ్లైతో కలిసి ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అపూర్వ ఆస్రాని... ‘ పదకొండేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. మా బంధాన్ని కొనసాగించకుండా చట్టం ఆపలేకపోయింది. అయితే ఈ ఏడాది మా సెలబ్రేషన్లో తేడా ఏంటంటే మా బంధానికి చట్ట బద్ధత రావడం.. అంతే తప్ప పెద్దగా ఏ మార్పు లేదు’ అంటూ రాసుకొచ్చా రు. నా సోదరుడికి ఉండే హక్కు నాకూ ఉండాలి కదా.. సెక్షన్ 377పై సుప్రీం తీర్పు వెలువరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అపూర్వ... ‘ ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం అనుకుంటున్నాం. అయితే ఈ దేశంలో నేను కోరుకున్న స్వేచ్ఛ ఏనాడు లభించలేదు. నన్నో క్రిమినల్లాగా చూశారు. నా సొంత సోదరుడికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అదే విధంగా పిల్లల్ని దత్తత తీసుకునే హక్కు కూడా ఉంది. కానీ నాకు మాత్రం అటువంటి హక్కులేమీ లేవు. పైగా నేనంటే చులకన భావం. ఇప్పటికైనా మాలాంటి వాళ్లని మనుషులుగా గుర్తిస్తే చాలంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు. -
సుప్రీం చరిత్రాత్మక తీర్పు : టీవీలో సంచలన షో
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందటే చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర టీవీ కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకుంటోంది. బుల్లి తెరపై మొట్ట మొదటిసారి ‘గే స్వయంవరం’ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి ‘గే వరుడు’ కావాలంటూ ఈ గే స్వయంవరం కార్యక్రమం ప్రసారం కానుంది. ‘అవును, రెండు ప్రొడక్షన్ హౌజ్‌లతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనంతరం ఈ షో చేయాలనుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన టెలివిజన్ రియాల్టీ షోల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా ఈ గే రియాల్టీ స్వయంవరం షో చరిత్ర సృష్టిస్తుంది’ అని సవ్యసాచి అన్నారు. బిగ్ బాస్ 11 హౌజ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సవ్యసాచి, తనకున్న హాస్య భావనతో హౌజ్ మేట్లను ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే వాడు. కానీ బాధకరంగా అతను షోలో ఉండేందుకు తగిన ఓట్లు సంపాదించుకోలేక, హౌజ్ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్ బాస్ 11కు ముందు, అతను ఒడిశా టెలివిజన్ ఇండస్ట్రిలో ఉండేవాడు. పలు కుకింగ్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఫెమినా మిస్ ఇండియా 2017 ఆడిషన్స్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నాడు. ఇంతకుముందు వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ‘రాఖీకీ స్వయంవర్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో తనకు తానే స్వయంవరం ప్రకటించుకుని, వచ్చిన వారిలో ఓ వరుడిని ఎంచుకుని కొద్దికాలం అతనితో ట్రావెల్ చేసింది. అలాగే ‘రాహుల్ కా స్వయంవర్’ పేరుతో కూడా ఓ టీవీ కార్యక్రమం ప్రసారమైంది. అది తీవ్ర వివాదాస్పదమైంది. వీటితో పోలిస్తే ‘సవ్యసాచి స్వయంవరం’ పూర్తిగా విరుద్ధం. సవ్యసాచి సత్పతి కోసం మంచి హైటు, వెయిటూ ఉన్న గే వరుడు కావాలంటూ కార్యక్రమం రూపొందించబోతున్నారు. భారతదేశంలో గే కల్చర్‌ను చూపిస్తూ ఇంతవరకూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందలేదు. -
కేంద్రంపై జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం సహా పలు సున్నితమైన కేసుల్లో తుది నిర్ణయాన్ని కేంద్రం కోర్టుల విచక్షణకు వదిలేస్తుండటంపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీలో 19వ బోధ్‌రాజ్ సావ్నీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ అధికారాలను న్యాయమూర్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ తరహా వ్యవహారాలు సుప్రీంకోర్టులో నిత్యకృత్యంగా మారిపోయాయి. ‘ఐపీసీ సెక్షన్ 377(స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోంది)పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం’ అనడం జడ్జీలకు చాలా సమ్మోహనపరిచే మాట. పొగడ్తలు ఎన్నటికైనా చేటు తెస్తాయనీ, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని జడ్జీలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇతరులు, సమాజంతో మన కలివిడి కారణంగానే వ్యక్తిత్వం ఏర్పడుతుందనీ, లైంగికత అలా ఏర్పడదని ఆయన అన్నారు. సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలు ‘పురుషులంటే ఇలానే ఉండాలి, స్త్రీలంటే ఇలాగే ఉండాలి’ అంటూ ఉందనీ వెల్లడించారు. దీని కారణంగా స్వలింగ సంపర్కులపై కొందరు చాదస్తపు మనుషులు వివక్ష చూపారన్నారు. ప్రజలపై జాతి, లైంగికత, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని 15వ అధికరణ చెబుతోందనీ, సెక్షన్ 377 దీన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. -
ఒక్క తీర్పులో ఎన్ని తీర్పులో!
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో లెస్బీయన్లు, గేలు, బైసెక్సువల్స్, ట్రన్స్‌జెండర్లు (ఎస్‌జీబీటీలు) కూడా వ్యక్తులేనని, వారికి కూడా వ్యక్తిత్వం, మానవత్వం ఉంటాయని, వారికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని, వారి మధ్య లైంగిక సంబంధాలను నిషేధిస్తున్న 377వ సెక్షన్ చెల్లదంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ తీర్పు ఒక్క ఎస్‌జీబీటీల విజయమే కాదు, భారత పౌరులందరి విజయంగా పేర్కొనవచ్చు. అన్ని హక్కులకన్నా ప్రాథమిక హక్కులు ముఖ్యమని ఈ తీర్పు చెప్పడమే కాకుండా సమాజంలో మెజారిటీ, మైనారిటీ అని తేడా లేకుండా అందరికి సమానంగా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తద్వారా భిన్నత్వంలో ఏకత్వానికున్న ప్రాధాన్యతను తెలియజేసింది. దేశంలో అతి తక్కువగా ఉన్న ఎస్‌జీబీటీల కోసం ఎప్పటి నుంచో చట్టంలో కొనసాగుతున్న 377వ సెక్షన్‌ను కొట్టివేయలేమని 2013లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. స్ఫూర్తిదాయకమైన సుప్రీం కోర్టు తీర్పునకు కారణమైంది భారత రాజ్యాంగంలోని 32వ అధికరణం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఈ అధికరణ కల్పిస్తోంది. అందుకనే ఈ అధికరణ కిందనే ఎస్‌జీబీటీలు తమ వాదనను కోర్టుకు నేరుగా వినిపించగలిగారు. ఈ ‘32వ అధికరణ’నే మొత్తం రాజ్యాంగానికి ఆత్మ, హృదయమని నాటి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్వయంగా నాటి రాజ్యాంగ పరిషద్‌లో నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం ఓ బండరాయి కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే వీలున్న ‘పరివర్తనా రాజ్యాంగం’ అని కూడా సుప్రీం తాజా తీర్పు సూచిస్తోంది. తీర్పు చెప్పిన జడ్జీల్లో ఒకరు ‘పరివర్తనా రాజ్యాంగం’ అని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం కూడా. 2013లో ఎస్‌జీబీటీల వాదనను తిరస్కరించిన సుప్రీం కోర్టు 2018 నాటికి వారి వాదనకు సానుకూలంగా స్పందించడమే అందుకు నిదర్శనం. -
‘గే’లుపు సంబరాలు
-
తీర్పులో ఏం చెప్పారు?
జస్టిస్ దీపక్ మిశ్రా ‘భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 ప్రస్తుత రూపం పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నిర్వచించే రాజ్యాంగంలోని ఆరిక్టల్ 19(1)(ఏ)ను ఉల్లంఘిస్తోంది. మేజర్లయిన ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు లేదా స్త్రీ, పురుషుల మధ్య శృంగారాన్ని రాజ్యాంగవిరుద్ధంగా పరిగణించలేం. ఎవరైనా స్త్రీ, పురుషులు జంతువులతో అసహజ శృంగారానికి పాల్పడితే సెక్షన్ 377 కింద వారిని శిక్షించవచ్చు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రెండో వ్యక్తి సమ్మతి లేకుండా శృంగారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద నేరమవుతుంది. సమాజంలోని ఓ వర్గం లేదా మైనారిటీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల పాత్రకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. సమాజంలోని వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, అల్పసంఖ్యాకుల హక్కులను హరించేందుకు చేపట్టే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవాలని రాజ్యాంగ నైతికత అనే భావన న్యాయశాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతుంది’. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ‘స్వలింగ సంపర్కులకు సమాజంలో గౌరవంగా బతికే ప్రాథమిక హక్కు ఉంది. వాళ్లు ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడటం లేదు. సెక్షన్ 377 అన్నది బ్రిటిష్ హాయాంలో నైతికతను వివరిస్తూ తెచ్చింది. కాలం చెల్లిన ఈ చట్టాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. స్వలింగ సంపర్కుల విషయంలో సెక్షన్ 377 వైఖరి ఏకపక్షంగా ఉంది. ఇటీవల జరిగిన సైకియాట్రిక్ అధ్యయనాలు గే, ట్రాన్స్జెండర్లు మానసిక రోగులు కాదని, కాబట్టి వారిని శిక్షించరాదని చెబుతున్నాయి. ప్రాథమిక హక్కులన్నవి రాజ్యాంగం అనే విశ్వంలో ధ్రువ నక్షత్రం లాంటివి. ప్రభుత్వాల పరిధికి దూరంగా ఉన్న ప్రాథమిక హక్కులకు కస్టోడియన్ సుప్రీంకోర్టే. ఈ హక్కులు ఎన్నికలను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారవు. స్వలింగ సంపర్కులకు ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కుంది. చట్టాల ప్రకారం వీరికి రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి వివక్ష లేకుండా మనుషులుగానే చూడాలి. ఈ తీర్పుపై కేంద్రం విస్తృత ప్రచారం కల్పించాలి’. జస్టిస్ చంద్రచూడ్ ‘స్వలింగసంపర్కులు భయంతో బతకడానికి వీల్లేదు. 158 ఏళ్లు ఈ వర్గం అవమానాలను సహిస్తూ బతికింది. స్వాతంత్య్రం తరువాత కూడా ఇది కొనసాగింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చెబుతున్న సెక్షన్ 377 రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి భావనలను ఉల్లంఘించింది. లైంగిక భాగస్వామిని ఎన్నుకునే హక్కును నిరాకరించడం గోప్యత హక్కును నిరాకరించడమే. రాజ్యాంగంలో రాసిన రాతలకు ఏమాత్రం అర్థం ఉన్నా స్వలింగ సంపర్కులు భయంతో బతకటానికి వీల్లేదు. ఈ డిజిటల్ యుగంలోనూ లైంగికత అన్నది దోపిడీకి అస్త్రంగా మారిపోయింది. ఈ సెక్షన్‌ను కొనసాగించడం ద్వారా మూస ఆలోచనలను, వివక్షను ప్రభుత్వం ప్రోత్సహించింది. భారత రాజ్యాంగం సమాజంలో వివక్షతను నిషేధించింది. తమ లైంగికత ఆసక్తుల ఆధారంగా ఎల్జీబీటీ వర్గంపై వివక్ష చూపరాదు’. -
స్వలింగ సంపర్కం నేరం కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులంతా స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ఇన్నాళ్లుగా సరైన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2013లో సురేశ్ కౌశల్ కేసులో ‘అంగీకారం ఉన్నప్పటికీ.. అసహజ శృంగారం నేరమంటూ’ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘నవభారతంలో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయమిది’ అని చెప్పి తీర్పును సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ముగించారు. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది. ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే లైంగికవాంఛ సహజమైన జీవసంబంధమైన ప్రక్రియని.. దీన్ని సాకుగా చూపి వివక్ష కనబరచడం స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. ‘18 ఏళ్లు నిండిన వారి స్వలింగ సంపర్కాన్ని సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21లకు విఘాతం కల్గించడమే. అయితే వీరి మధ్య శృంగారం పరస్పర అంగీకారంతోనే, నిర్బంధ రహితంగానే జరగాలి’ అని 493 పేజీల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377.. మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతోంది. ఇదే సెక్షన్ ఓ మగాడైనా, ఆడదైనా.. జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్నీ తప్పుబట్టింది. అంతేకాదు, పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ నేరంగానే పరిగణిస్తోంది. ఇలాంటి కేసులకు సెక్షన్ 377 గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తోంది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. శృంగార వాంఛ నేరం కాదు: నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. ‘శృంగారమనేది జీవసంబంధమైన ప్రక్రియ. ఇది సహజం, ప్రతి ఒక్కరిలోనూ న్యూరోలాజికల్, బయాలాజికల్‌గా అంతర్గతంగా కలిగే మార్పు. పరస్పర ఆకర్షణ కలిగినపుడు శృంగార భావన ఏర్పడటం సహజం. ఇలాంటి వారిని నేరస్తులుగా చూడడం ఎల్జీబీటీక్యూల భావప్రకటన హక్కుకు విఘాతం కల్గించినట్లే’ అని కోర్టు తీర్పు పేర్కొంది. ఎల్జీబీటీక్యూల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ కూడా సంతకాలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇక మేమూ సమాజంలో భాగమే! 17 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినందుకు ఢిల్లీ సహా దేశంలోని పలుచోట్ల ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వరా>్గన్ని ప్రతిబింబించే ఇంద్రధనస్సు రంగుల జెండాలను ఊపుతూ తీర్పును స్వాగతించారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని ఈ సమాజం అడ్డుకోలేదంటూ నినాదాలు చేశారు. ‘మా ఆవేదనను అర్థం చేసుకుని భారత న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. మొత్తానికి మేం కూడా సమాజంలో భాగస్వాములమయ్యాం’ అని ఎల్జీబీటీక్యూల కోసం డెల్టా యాప్‌ను రూపొందించిన ఇషాన్ సేథీ పేర్కొన్నారు. స్వాగతించిన న్యాయనిపుణులు: సుప్రీం తీర్పును సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు స్వాగతించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మిగిలిన వారితో సమానంగా, హుందాగా బతికే హక్కు ఉందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే తీర్పు అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాలను, మానవ విలువలను మారుస్తుందని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. ప్రముఖుల మద్దతు బాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లోని వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ప్రాథమిక మానవ హక్కులు కల్పించేలా సుప్రీం తీర్పు ఉందన్నారు. గే అయినందుకు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చిత్ర దర్శకుడు హన్సల్ మెహతా ఈ తీర్పు కొత్త ఆరంభానికి సూచకమన్నారు. బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ ‘దేశానికి మళ్లీ ఆక్సీజన్ అందింది’ అని ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తులో ఒకరోజు ఎవరు ఏంటి అనే ముద్ర వేయడం ఉండదు. అలాంటప్పుడు దేశం స్వర్గం అవుతుంది’ అని నటి సోనమ్ కపూర్ పేర్కొన్నారు. నైతికత పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఎవరి తరం కాదని నటి స్వరా భాస్కర్ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడినందుకు తనను లోక్‌సభలో అడ్డుకున్న బీజేపీ ఎంపీలంతా సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర వీరికి క్షమాపణ చెప్పాలి: జస్టిస్ ఇందు మల్హోత్రా ‘తోటి సమాజమంతా స్వలింగ సంపర్కం పూర్తిగా సహజమైన ప్రక్రియ అని గుర్తించలేకపోవడంతో ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా భయం భయంగా బతుకుతున్నారు. ఏదో మహాపరాధం చేశామన్న భావనలో పడిపోయారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడంలో, హక్కులు కల్పించడంలో ఆలస్యమైనందుకు చరిత్ర వీరికి క్షమాపణలు చెప్పాలి. శతాబ్దాలుగా వీరు అవమానాలకు గురయ్యారు. సమాజానికి వీరి గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందువల్ల ఆర్టికల్ 14 కల్పించిన ప్రాథమిక హక్కులను ఎల్‌జీబీటీక్యూలు కోల్పోయారు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 377 నేపథ్యమిదీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది. ఢిల్లీలో సెక్షన్377 రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న దృశ్యం -
ఓ స్వలింగ సంపర్కుడి ఆత్మనివేదన!
భారతీయ స్వలింగ సంపర్కుడిగా నన్ను నేను తొలుచుకుని ప్రపంచం ముందుకొస్తున్నాను! నా యవ్వనమంతా అనుమానం, అనిశ్చితితో కూడుకున్న సందేహాలతో నిండిఉంది. అందరిలా కాకుండా నేను ‘వేరే’ అని నాకు తెలుసు కానీ తెలియందల్లా ఎందుకిలా? అన్నదే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ‘ఒరేయ్ హిజ్రా’ అంటూ గేలిచేసినప్పుడు నా సందేహం బద్దలైంది. నా సహ విద్యార్థుల నుంచి, నా ఆటల నుంచి, పాటల నుంచి మొత్తంగా నన్నది వేరు చేసింది. క్రమంగా నాకిష్టమైన అన్నింటినుంచీ నన్ను దూరం చేసి, నన్నొంటరిని మిగిల్చింది. నేనెందుకిలా ఒంటరినయ్యాను. నేనందరిలా ఎందుకు లేను? నాకెందుకీ శిక్ష? ఆ మానసిక స్థితిలోంచి బయటపడేందుకు కఠోరతపస్సు చేయాలి. నాలాంటి వారే నా చుట్టూ ఉన్నవారు నాలాగే వేరుగా ఉన్నవారు వారెందుకిలా ఉన్నారో అర్థం కాక, చెప్పేవారు లేక కనీస లైంగికపరిజ్ఞానం కరువై తమలో తామే నలిగిపోయి మృత్యువును కోరితెచ్చుకుంటుంటే నిశ్చేష్టుడిలా మిగిలిపోయాను. నా సందేహాలకు ఇంటర్నెట్‌ని శరణుకోరాను. అప్పుడర్థం అయ్యింది వేనవేల గేల బేల చూపులతో ఈ ప్రపంచం నిశ్శబ్దంగా నిండిఉన్నదని. అలాంటి విశాల ప్రపంచంలో మన దేశం ఆచూకీ నాకేదీ దొరకలేదు. బహుశా అది ‘మన’ సంస్కృతి కాదేమోనని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి నేనుగా ఉండడం మానేసాను. సహజంగా నాకిష్టమైనవన్నీ చేయడం ఆపేసాను. గత చాలా కాలంగా నా పని ఒక్కటే. అదే అవమానాలనుంచి, అసహ్యపు చూపులనుంచి, వెలివేతల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉండడం. మేమంతా ఓ ఆత్మన్యూనతా భావంలో, అభద్రతా భావంలో కూరుకుపోయాం. ఆత్మగౌరవం కోసం స్వలింగ సంపర్కుల పోరాటం మాకు కొత్తసవాళ్ళను ఎదుర్కొనే శక్తినిచ్చిందే తప్ప పరిస్థితుల్లో పెద్దగా మార్పుతీసుకురాలేదు. తీర్పులూ మమ్మల్ని సేదతీర్చలేదు. అదే వేధింపులు, అవే భయాలూ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టిన రోజు. మా దేహాల గాయాల నుంచి తొలుచుకుని మేం మేముగా నిలిచిన రోజు. సుప్రీంకోర్టు తీర్పుతో గొంగళిపురుగు దశనుంచి రెక్కలువిప్పుకున్న సీతాకోక చిలుకల్లా మేం మా రంగుల ప్రపంచంలోకి సగర్వంగా రెక్కలల్లార్చుకుని ఎగిరిపోయే రోజు. అయినా మాముందు ఇంకా అవమానాల మూకలు నిలిచే ఉన్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు మిగిలేవున్నాయి. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు ‘‘నేను ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’. ‘‘నన్ను నమ్మండి. మీరిక ఒంటరి కాదు’’. దేశంలోని స్వలింగ సంపర్కులందరికీ ఈ సందేశం అందాలి. ఇంకా మమ్మల్ని అంగీకరించలేని వారికి ఓ చిన్న మాట.... ‘‘అవును మేం స్వలింగ సంపర్కులం. మేమిక్కడే ఉన్నాం. మేం అదృశ్యం కాము.’’ ఇట్లు సంజయ్ దేశ్‌పాండే, వయస్సు 26 న్యూఢిల్లీ వాస్తవ్యుడు -
ఆ ఆరుగురు..
పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే... నవతేజ్ సింగ్ జౌహర్ నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ మెహ్రా ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్‌ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు. రీతూ దాల్మాయి ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్‌కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్‌గా పేరు తెచ్చుకున్నారు. అమన్ నాథ్ 67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్‌తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్‌గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు. కేశవ్ సూరి 33 ఏళ్ల వయసున్న కేశవ్సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయేషా కపూర్ అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నారు. -
అప్పుడు తప్పన్న సుప్రీం కోర్టే..
పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని ఉద్ఘాటించిన సుప్రీం కోర్టు ఇప్పుడది నేరం కాదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, చర్చోపచర్చలు సాగడం, అంతర్జాతీయ సమాజం సానుకూలత వ్యక్తం చేస్తుండటం, మన ప్రభుత్వాల వైఖరిలో కూడా మార్పు రావడం వంటివి సుప్రీంపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. చట్టంలో ఏముంది? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది.1862 నుంచి అమల్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా స్త్రీ, పురుషులు లేదా జంతువులతో లైంగిక చర్య జరపడం శిక్షార్హమైన నేరం. అలాంటి వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధింవచ్చని సెక్షన్ 377 స్పష్టం చేస్తోంది. చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009 జులైలో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరారిస్తోందని,అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2013, డిసెంబర్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.వివాదాస్పదమైన ఈ అంశంపై చర్చించాల్సింది పార్లమెంటేనని పేర్కొంది. భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కం నిషేధమన్న భావన చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఎల్జీబీటీ లే కాకుండా పలువురు స్వేచ్ఛాకాముకులు కూడా వాదిస్తున్నారు.అయితే, దీనిని ‘విపరీత ప్రవర్తన’గా చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం మొదట్లో ప్రభుత్వాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, 377 వ సెక్షన్‌ను సమర్థిస్తూ వచ్చాయి.అయితే ఈ అంశంపై సీరియస్‌గా జరిగిన చర్చలు, మీడియా కథనాల ఫలితంగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.గతంలో సెక్షన్ 377ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది.గత నవంబర్‌లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై మాట్లాడుతూ‘ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది స్వలింగ సంపర్కాన్ని ప్రత్యామ్నాయ లైంగిక ప్రాధాన్యంగా పరిగణిస్తోంటే మనం ఇప్పటికీ వారిని జైల్లో పెట్టాలన్న అభిప్రాయంతో ఉండటం సరికాదు.ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యమనిపిస్తోంది’అన్నారు.కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎంలు కూడా సెక్షన్ 377 రాజ్యాంగవిరుద్ధమన్న భావననే వ్యక్తం చేశాయి. ట్రాన్స్‌జండర్లపై తీర్పు ట్రాన్స్ జండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారికి కూడా ఇతరులలాగే వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సి ఉందని స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో ట్రాన్స్జండర్ల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాల ధృక్కోణం మారాల్సి ఉందని 2015, నవంబర్‌లో జాతీయ న్యాయ సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సభలో ఆయన ఉద్ఘాటించారు.ట్రాన్స్ జండర్ల కోసం చట్టాలను సవరించాలని, కొత్త చట్టాలు తేవాలని ఆయన అన్నారు.ట్రాన్స్ జండర్ల హక్కులను గుర్తిస్తూ ఎన్డీఏ సర్కారు ముసాయిదా చట్టాన్ని కూడా తయారు చేసింది. ఈ పరిణామాలన్నీ సెక్షన్377 విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం మారడానికి దారి తీశాయి. నైతికత సమస్య స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును బాలల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. బాలలపై అకృత్యాల నివారణకు ఈ సెక్షను అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నాయి. అంతే కాకుండా స్వలింగ సంపర్కమన్నది సమాజపు నైతిక విలువలకు విరుద్ధమని పలువురు వాదిస్తున్నారు.అయితే,2012లో తెచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోస్కో) చట్టం సెక్షన్ 377 కంటే సమర్థంగా, పటిష్టంగా ఉందని ఈ చట్టంతో బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మరో వర్గం వాదిస్తోంది. నైతికత పేరుతో ప్రాథమిక హక్కుల్ని హరించడం సరికాదని అంటోంది. చట్టపరంగా తప్పయినది నైతికంగానూ తప్పే అవుతుందని,అయితే నైతికంగా తప్పయినదంతా చట్టపరంగానూ తప్పేననడం సరికాదని వారంటున్నారు. ఏ నైతిక నేరమైనా సమాజంపై దుష్ప్రభావం చూపినప్పుడే అది చట్టపరంగా నేరమవుతుందేకాని వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టపరంగా తప్పు కాదని తాజా తీర్పును సమర్థించేవారు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగా సానుకూలత స్వలింగ సంపర్కం నేరం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. వివిధ దేశాలు స్వలింగసంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాలు కూడా చేశాయి.ప్రస్తుతం 120 దేశాలు హోమోసెక్సువాలిటీని చట్టబద్ధంగా పరిగణిస్తున్నాయి. 2000లో నెదర్లాండ్స్ హోమో సెక్సువాలిటీని చట్టబద్ధం చేసింది. ఈ పరంపరను బెల్జియం, కెనడా,స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడెన్, ఐస్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, ఉరుగ్వే. న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్,ఇంగ్లండ్ అండ్ వేల్స్, ఫిన్లాండ్, మాల్టా కొనసాగించాయి. అమెరికా వ్యాప్తంగా గే వివాహాలు చట్టబద్ధమంటూ 2015 జూన్ 27న యూఎస్ సుప్రీంకోర్టు ప్రకటించింది. 25 దేశాల్లో వీరి మధ్య పెళ్లిళ్లకు కూడా అనుమతి ఉంది. 2003లో తొలిసారిగా నెథర్లాండ్స్ ఈ వివాహాలకు ఆమోదం తెలపగా, జర్మనీ, తాజాగా ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరాయి. ఈ దంపతులు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని 26 దేశాలు కల్పించాయి. 72 దేశాల్లో నేరమే..! భారత్ సహా 72 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. షరియా చట్టంలో భాగంగా ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా, ఉత్తర నైజీరియా స్వలింగ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా శిక్షిస్తున్నాయి. ఖతర్‌లో ముస్లింలను మాత్రమే శిక్షిస్తుండగా, సౌదీ అరేబియాలో ముస్లింతో ఇలాంటి సంబంధం కలిగిన ముస్లిమేతరుడికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) అయితే ఏకంగా బహిరంగ హత్యలకు పాల్పడుతోంది.పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతర్, మౌరిటానియా చట్టాల ప్రకారం మరణశిక్షను విధించవచ్చు. -
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
-
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఎంతో ఉద్వేగమవుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీ కలర్‌ఫుల్ సెలబ్రేషన్స్ నిమగ్నమైంది. వారి సెలబ్రేషన్స్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు. ఈ తీర్పు ఢిల్లీలోని లలిత్ హోటల్‌కు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి స్టాఫ్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎందుకంటే, లలిత్ గ్రూప్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ సురి, ప్రముఖ ఎల్జీబీటీ కార్యకర్త. ఇంధ్రదనస్సు రంగుల్లో ఉన్న స్కార్ఫ్‌ను మెడలో, చేతికి ధరించి, హోటల్ స్టాఫ్ డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఇతరులను కూడా భాగస్వాములు కావాలని, హోటల్ స్టాఫ్ కోరారు. దీనిపై పనిచేసిన న్యాయవాదులందరికీ, జడ్జీలకు కృతజ్ఞతలని కేశవ్ సురి అన్నారు. పండుగ చేసుకోవడానికి ఇది చాలా పెద్ద సమయమని ఆనందం వ్యక్తం చేశారు. సెక్షన్ 377 కేసులో కేశవ్ సురి కూడా ఫిర్యాదుదారు. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377పై కీలక వ్యాఖ్యలు చేసింది. చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లుగా) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. -
సెక్షన్ 377పై తీర్పు : ‘హెచ్ఐవీ కేసులు పెరుగుతాయి’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు. స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. -
స్వలింగ సంపర్కంపై సుప్రీం సంచలన తీర్పు
-
సెక్షన్ 377: సుప్రీం సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. హోమో సెక్సువాలిటీ నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ను రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. చరిత్ర క్షమాపణ చెప్పాలి చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది.వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఖాన్విలకర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. స్వజాతి లైంగిక చర్య నేరం కాదని తాజా తీర్పు తేల్చి వేయడంతో ఎల్జీబీటీ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కొత్త శకానికి ఇది నాంది అని వ్యాఖ్యానించారు. సెక్షన్ 377 పరస్పర అంగీకారంతో జరిపే స్వలింగ సంపర్కంపై మనదేశంలో బ్రిటీష్‌కాలం నుంచే నిషేధం కొనసాగుతోంది. 1861 చట్టం ప్రకారం, స్వలింగ సంపర్కానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1950 నుంచి ఇప్పటివరకు ఇండియన్ పీనల్ కోడ్‌లో అనేక సార్లు సవరణలు చేసినప్పటికీ సెక్షన్ 377లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే ఈ సెక్షన్‌లోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధమని 2009లో ఢిల్లీ హైకోర్టు తేల్చింది. గే హక్కుల కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు పోరాడిన నాజ్ ఫౌండేషన్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377 రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా వర్ణించింది. ఈ తీర్పును 2013లో సుప్రీం కొట్టి వేసింది. ఆ అయిదుగురు సెక్షన్ 377కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇటీవలి కాలంలో తీవ్ర రూపం దాల్చింది. తమ హక్కులను కాపాడాలంటూ ఎల్జీబీటీ కమ్యూనిటీ పిటిషన్ వేసింది. ముఖ్యంగా రెండేళ్ళ క్రితం భరతనాట్యం డ్యాన్సర్ నవతేజ్ ఎస్ జోహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, రితూ దాల్మియా, నిమ్రాణ హోటల్ కో ఫౌండర్ అమన్ నాథ్, మహిళా వ్యాపార వేత్త అయేషా కపూర్ సెక్షన్ 377నురద్దు చేయాలంటూ పిటీషన్ వేశారు. వీటితో పాటు ఆరు పిటీషన్లను విచారించిన దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సంబరాలు: సుప్రీం తీర్పుపై ఢిల్లీ, ముంబై, బెంగళైరు నగరాలు సహా దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఈ తీర్పు కొంచెం ముందువచ్చి వుంటే ఎంతోమంది తమ సన్నిహితులు ప్రాణాలతో ఉండేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. #WATCH People in Mumbai celebrate after Supreme Court decriminalises #Section377 and legalises homosexuality pic.twitter.com/ztI67QwfsT — ANI (@ANI) September 6, 2018 #WATCH Celebrations in Karnataka's Bengaluru after Supreme Court legalises homosexuality. pic.twitter.com/vQHms5C0Yd — ANI (@ANI) September 6, 2018 -
‘ముందు పెళ్లి చేసుకుని ఆ పని చెయ్’
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్ కౌగిలింత’ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత దుబే.. రాహుల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. (‘లోఫర్లే అలా చేస్తారు’), (అదో రకం షాక్) ‘మేం ఆయన్ని ఎందుకు కౌలిగించుకోవాలి?. పైగా స్వలింగసంపర్కానికి సంబంధించి సెక్షన్ 377ను ఇంకా రద్దు కాలేదు కదా. ఈ సమయంలో రాహుల్‌ను కౌగిలించుకుంటే మా భార్యలు మాకు ఖచ్ఛితంగా విడాకులు ఇస్తారు. అయితే రాహుల్‌కి ఓ సలహా. ఆయన గనుక ముందు వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు నిరభ్యరంతంగా కౌగిలించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అయితే దుబే చేసిన ‘తేడా వ్యాఖ్యల’పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డా(జార్ఖండ్)లోని నిశికాంత్ ఇంటి బయట ధర్నాకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.