Serp
-
పవన్ శాఖలో చీలిక.. !
-
AP: పింఛన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు, బయో మెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే: సజ్జల -
పేద మహిళలకు మహిళాశక్తి ఆటోలు
సాక్షి, అమరావతి: కిరాయి ప్రాతిపదికన ఆటోలు నడుపుకొంటున్న పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం గురువారం ‘మహిళాశక్తి’ పేరుతో ఆటోలను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలివిడతగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి వీటిని అందజేయనున్నారు. జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. గ్రా మీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ విజ యవాడకు సమీపంలోని గొల్లపూడిలోగల టీటీడీసీ కేంద్రంలో పదిమంది లబ్ధిదారులకు ఆటోలను పంపిణీ చేస్తారని తెలిపారు. మహిళాసాధికారత లక్ష్యంగా నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత సహా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా స్వశక్తితో ఎదగాలని ఆశపడే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు ‘మహిళాశక్తి’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యం మేరకు మిగిలిన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తిచేసి వారికి ఆటోలు అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. లబ్ధిదారులు భరించాల్సింది 10 శాతమే ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం పదిశాతం మేర లబ్ధిదారులు భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్ ద్వారా అందిస్తోంది. ఆ 90 శాతం రుణాన్ని కేవలం అసలు మొత్తం 48 నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా పేదలు ఆటో కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి రుణం తీసుకుని, నెలవారీగా కిస్తీలు చెల్లి స్తుంటారు. ప్రభుత్వం ఇప్పడు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వడంతో పాటు రుణం మొత్తాన్ని నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించడంతో వడ్డీ రూపంలో దాదాపు రూ.లక్షన్నర మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుందని అధికారులు వివరించారు. ఆటోలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తున్నట్టు చెప్పారు. -
63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,33,349 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సోమవారం (మే 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పింఛన్ల పంపిణీకి గాను రూ.1,747.38 కోట్లను ప్రభుత్వం శనివారమే విడుదల చేసి ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. శనివారం సాయంత్రానికే సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి ఆ నిధులను డ్రా చేసి వలంటీర్లకు అందజేసినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. వలంటీర్లు సోమవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేపడతారని ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయంలోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్డీఏ పీడీ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
‘పొదుపు’ మహిళలకు వ్యక్తిగత రుణాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పొదుపు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులైన మహిళలకు వైఎస్ జగన్ అందించిన చేయూత అక్కచెల్లెమ్మలు మరింతగా పురోభివృద్ధి సాధించేందుకు బాటలు వేసింది. రాష్ట్రంలో పొదుపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానూ వ్యాపారానికి బ్యాంకు రుణాలు లభించనున్నాయి. ఈ రుణాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకొంది. సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి. హేమ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, సెర్ప్ బ్యాంకు లింకేజీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు బ్యాంకులు సంఘాల ప్రాతిపదికన మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మహిళలు పొదుపు సంఘంగా ఏర్పడి, నెలనెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటుంటే.. సంఘాల పని తీరు ఆధారంగా బ్యాంకులు వాటిలోని మహిళలందరికీ ఉమ్మడిగా మాత్రమే, సంఘం పేరుతోనే రుణాలిస్తున్నాయి. ఈ రుణాలతో వారి అత్యవసర కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. దీంతో అప్పట్లో పొదుపు సంఘాలపై వడ్డీలు, చక్రవడ్డీల భారం పడి పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయాయి. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించలేకపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు నిరర్ధక ఆస్తులు(ఏన్పీఏ)గా ముద్రపడ్డాయి. ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలంతా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ పూర్తి తోడ్పాటునందించారు. దీంతో పొదుపు సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఇప్పుడు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకున్న రుణాలను నూటికి 99.55 శాతం మేర తిరిగి చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సీఎం జగన్ అందించిన ‘ఆసరా’ చంద్రబాబు చేసిన మోసంతో దారుణంగా దెబ్బ తిన్న మహిళల పొదుపు సంఘాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ. 25,571 కోట్ల మేర అప్పులు ఉండేవి. ఆ రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి రాగానే, ఇచ్చిన హామీని అక్షరాలా అమలుచేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ మొత్తం రూ.19,178 కోట్లు అందజేశారు. దీనికి తోడు గత చంద్రబాబు ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిన పొదుపు సంఘాలపై సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ భారాన్ని కూడా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా రూ. 3,615. 29 కోట్లు వడ్డీని అక్కచెల్లెమ్మలకు అందజేసింది. పెరిగిన మహిళా సంఘాల పరపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపారాలనూ వృద్ధి చేసుకుంటున్నారు. దీంతో మహిళా సంఘాల పరపతి పెరిగింది. పెద్ద ఎత్తున రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు బ్యాంకులు పొదుపు సంఘాలకు మొత్తం రూ. 1,09,956.87 కోట్ల రుణాలు అందజేశాయి. ఒకప్పుడు ఒక్కొక్క సంఘం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల మధ్య మాత్రమే రుణాలు పొందగలిగేవి. ఇప్పుడు 3,00,468 సంఘాలు (మూడో వంతుకు పైగా) రూ. 10 లక్షలకు పైబడి రుణాలు పొందుతున్నాయి. వీటిలో 41,139 సంఘాలు ఏకంగా రూ. 20 లక్షల మేర రుణాలు పొందడం గమనార్హం. ఈ రుణాలతో వ్యాపారాభివృద్ధి చేసుకున్న పొదుపు సంఘాల మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారు ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు చేసుకోగల స్థాయికి వచ్చారు. అయితే, వారికి బ్యాంకులు వ్యక్తిగతంగా రుణం ఇవ్వకపోవడం అవరోధంగా మారింది. ఇప్పుడు వీరికి రుణాలివ్వడానికి ఎస్బీఐ ముందుకు వచ్చింది. వారు ఏర్పాటు చేసుకొనే వ్యాపార సంస్థనుబట్టి సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రుణాలు లభిస్తాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
IWD2023: విలేజ్‌వనిత ఘనత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మహిళలు రూట్ మార్చారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు.‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ వీరికి చేదోడుగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న మహిళలు తాము ఆదాయాన్ని పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద విలేజ్ ఆర్గనైజేషన్స్ (గ్రామ సంస్థలు)లో ఈ ‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ ఏర్పాటవుతున్నాయి. ఒక్కో విలేజ్ ఆర్గనైజేషన్‌లో 5–8 దాకా మోడల్ ఎంటర్ప్రైజెస్ ఉంటున్నాయి. గత రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్ ఎంటర్‌ప్రెజెస్‌ను ప్రమోట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద కూడా గ్రామ ప్రాంతాల్లో స్టార్టప్ ప్రమోషన్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీల) సభ్యులుగా ఉంటున్న మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. 2022–23లో ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి. నాడు వ్యవసాయ కూలీ.. ♦ మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన పండ్ల శ్రీలత స్కూల్ స్థాయిలోనే చదువు మానేశారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. శ్రీరామ విలేజ్ ఆర్గనైజేషన్‌లోని ఝాన్సీ ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలు. ప్రస్తుతం భీమారంలోనే ఆదివాసీ విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా.. బ్యాంకులు, ఇతర రూపాల్లో అందిన రుణాలతో మోదుగ, అడ్డాకులతో పర్యావరణహిత టేబుల్ ప్లేట్లు, బఫె ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, దొప్పలు తయారీకి సంబంధించి సొంత మెషిన్లను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలత, ఆమె భర్త, పిల్లలు ఈ యూనిట్లోనే పనిచేస్తున్నారు. మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. తాము ఆదాయం పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. బిస్కెట్ల యూనిట్‌తో భరోసా.. ♦ వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన కొడంగల్ హజీరా బేగం గతంలోనే మహబూబ్ సుభానీ ఎస్‌హెచ్‌జీలో చేరారు. తర్వా త బిస్కెట్ల తయారీ, మార్కెటింగ్ యూనిట్ వైపు మళ్లారు. బ్యాంకులు, స్త్రీనిధి, ఇతర రూపాల్లో ఆర్థిక సహకారం అందడంతో బేకరీ ఉత్పత్తులతో పాటు పలురకాల తినుబండారాలు తయారు చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వివిధ రకాల బిస్కెట్లు, బ్రెడ్డు, బన్ను, టోస్టులు, ఎగ్, కర్రీ పఫ్‌లు విక్రయిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాపారంలో నిమగ్నం కావడంతో పాటు మరో ఐదుగురు పనివారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్టఫికెట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టఫికెట్ పొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా ఆదాయం మిగులుతోంది. అవుషా ఫుడ్స్ అదుర్స్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన 18 మంది మహిళా సభ్యులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్‌గా ఏర్పడి ఎన్ఐఆర్డీలోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో శిక్షణ అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పా టు చేశారు. తమ తమ సంఘాల నుంచి రుణ రూపేణా తీసుకున్న మొత్తంతో ఆహార భద్రత, ప్రమా ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ పొంది అవుషా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కారంపొడి, పసుపు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కోల్డ్‌ప్రెస్డ్ నూనెలు, రాగి, జొన్న ఇతర పిండి పదార్థాలు కలిపి మొత్తం 41 వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ నెలవారీ టర్నోవర్ రూ.3 లక్షలుగా ఉంది. గ్రూపులోని మహిళలంతా సొంతకాళ్లపై నిలబడడమే కాకుండా ఎస్‌హెచ్‌జీలకు చెందిన మరో పది మంది మహిళలకు నెలకు రూ. 4 వేల చొప్పున ఉపాధి కల్పి స్తున్నారు. ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షలకు పైగా ఎంటర్‌ప్రెజెస్ ప్రమోట్ చేశాం. వాళ్లకు రూ.75 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫండింగ్ సపోర్ట్ కల్పించాం. బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందిన రుణాలను ఈ ఔత్సాహిక మహిళలు తమ తమ యూనిట్లతో పొందే ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌హెచ్‌జీ బృందాల్లోని ఉత్సాహవంతులు, సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారిని బ్యాంక్‌లతో టయ్యప్ చేయిస్తాం. 2021–22లో దీనిని మొదలు పెట్టాం. ఆ ఏడాది 65 వేల దాకా ఎంటర్‌ప్రెజెస్ గ్రౌండ్ చేశాం. 2022–23లో 1.34 లక్షలు టార్గెట్‌గా పెట్టుకుని 1.10 లక్షల దాకా సాధించాం. – రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులు -
సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...
సంక్షేమ కార్యక్రమాలు వర్సెస్ ఉచితాలు, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలు కావనీ మానవ వనరుల అభివృద్ధికి అవి తప్పనిసరి అనీ, దీర్ఘకాలంలో నిలకడైన అభివృద్ధికి అవి దోహదపడతాయనీ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. పైగా ఈ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు కింది వర్గాల కొనుగోలు శక్తిని పెంచి దారిద్య్రాన్ని తగ్గించడమే కాక, కుటుంబాల శ్రేయస్సును, పురోగతిని పెంచుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపున ప్రధాన ప్రతిపక్షం మాత్రం సంక్షేమ పథకాలు అంటే ఉచితాలు మాత్రమేననీ, అవి వృధా ఖర్చు మాత్రమేననీ, అనుత్పాదకమైనవనీ విమర్శిస్తోంది. పైగా ఈ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాకర్షక మార్గాలు మాత్రమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకుల నుంచి రుణాల ప్రభావం గురించి సెర్ప్ (ఎస్ఈఆర్పీ) సంస్థ సీఈఓ అంచనా వేయాలని భావించారు. కూలంకషమైన చర్చల తర్వాత, ఒక కన్సల్టెంటుగా (ఎమ్ అండ్ ఈ) విశాఖపట్నం జిల్లాలో పద్మనాభ మండలాన్ని, రెండు మండల మహిళా సమాఖ్యలు, మరో రెండు గ్రామ సంస్థలను పరిశీలన కోసం ఎంపిక చేసుకున్నాను. ఎఫ్‌జీడీల ద్వారా, వీఓ నేతలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో వ్యూహాత్మక ఇంటర్వ్యూల ద్వారా ఈ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పనిలో భాగంగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, వ్యవసాయ అధికారులు, మండలంలోని అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆదర్శ వ్యవసాయదారులతో కూలంకషంగా చర్చించాను. పద్మనాభ మండల మహిళా సమాఖ్య 45 వీవోలతో కూడి ఉంది. ప్రతి వీఓలో ఇద్దరు లీడర్లు ఉంటారు. 1,423 స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) ఉన్నాయి. వీటి మొత్తం సభ్యుల సంఖ్య 15,363. మండలంలోని దాదాపు 90 శాతం గృహాలు ఎస్‌హెచ్‌జీల పరిధి కింద ఉంటున్నాయి. మండలంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలపై అభిప్రాయాలు తీసుకోవడానికి 100 మందితో మాట్లాడటం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, మండలంలోని ప్రజల సామాజిక నిర్మాణం గురించి తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. అప్పుడే ఏఏ వర్గాల వారు ఏ మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందుతున్నారో అవగతమవుతుంది. ఎస్‌హెచ్‌జీలోని మొత్తం సభ్యులలో ఎస్సీలు 10 శాతం, ఓసీలు 10 శాతం, బీసీలు 70 శాతం మంది ఉంటున్నారు. సామాజికంగా వెనుకబడిన బృందాల వద్ద తక్కువ పరిమాణంలో భూమి ఉన్నదనీ తేలింది. దారిద్య్రం నుంచి బయటపడేయటానికి ప్రధాన సూచికలలో ఒకటి ఏమిటంటే డబ్బు అందుబాటులోకి రావడం. బ్యాంకులు, స్త్రీనిధి కలిసి 2019 నుంచి 2022 జూలై వరకు స్వయం సహాయక బృందాలకు రూ. 130 కోట్ల నగదును పంపిణీ చేశాయి. సున్నా వడ్డీ కారణంగా బృంద సభ్యులు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోగలిగారు. పైన పేర్కొన్న కాలంలోనే రూ. 130 కోట్లను వీరికి పంపిణీ చేశారు. ఎస్జీహెచ్లలోని సభ్యుల్లో 95 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారని తేలింది. మరోమాటలో చెప్పాలంటే 5 శాతం మంది సభ్యులు ఒక ప్రయోజనం మాత్రమే పొందగా 40 శాతం మంది సభ్యులు 3 ప్రయోజనాలు పొందారనీ, మిగిలిన 55 శాతం సభ్యులు 6 కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారనీ తేలింది. సగటున ప్రతి గ్రూప్ మెంబర్ సంవత్సరానికి 50 వేల నుంచి లక్షరూపాయల వరకు లబ్ది పొందారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్వయం సహాయక బృందాలకు దాదాపు రూ. 170 కోట్లు పంపిణీ చేశారు. ఇది కాకుండా, రైతు భరోసా, అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, శ్రీనిధి తదితర సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు కలిసి రూ. 300 కోట్ల నగదు మహిళలకు అందింది. ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని అనుసరించింది. దీంతో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నేరుగా లబ్ధి దారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. వలంటీర్ వ్యవస్థతో కూడిన గ్రామ, వార్టు సచివాలయాల వ్యవస్థ ద్వారా కులం, మతం, జెండర్, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. బ్యాంకుల రుణాలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందితే వ్యవసాయరంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఏపీ ప్రభుత్వ పాలన నిరూపించింది. గత మూడేళ్ల నాలుగు నెలల్లో ఈ మండలంలో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ మూడు పంటలు పండిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ప్రధానంగా వరి పంట పండించారు. రబీలో బోర్‌వెల్స్‌లో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రాగులు, వరి, నువ్వులు, నల్ల ఉలవలు వంటి పంటలను పండించారు. ఈ మూడేళ్ల నాలుగు నెలల కాలంలో వరి ధాన్యం 24– 26 సంచులు ఎక్కువగా పండించారు. వరి పంట పండించిన రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెరిగింది. రాగి పంట 7 బస్తాలు అదనంగా పండింది. ఆదాయం రూ. 30 వేలవరకు పెరిగింది. నువ్వుల పంట కూడా 3 క్వింటాల్స్ అదనంగా పెరిగి రూ. 30 వేల వరకు ఆదాయం కూడా పెరిగింది. మూడేళ్లలోపే పంటల విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగి రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరగడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వల్ల లభించే సహాయం సకాలంలో రైతులకు అందడమే కారణమని స్వయం సహాయక గ్రూపు సభ్యులు ముక్త కంఠంతో చెప్పారు. రైతుభరోసా కేంద్రాల్లో అవసరమైనంత పరిమాణంలో ఎరువులు, పురుగు మందులు మార్కెట్ రేట్ కంటే పది శాతం తక్కువ ధరకే లభించడంతో వ్యవసాయ దిగుబడుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. వ్యవసాయ యంత్రాలు, ఇతర ఉప కరణాలను కూడా రైతు భరోసా కేంద్రాలు అద్దె ప్రాతిపదికన అందించడంతోపాటు వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరించడంతో రైతుకు బహుళ ప్రయోజనాలు కలిగాయి. మండలంలో అనేక కార్యక్రమాల ద్వారా కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. సున్నావడ్డీ కారణంగా ఒకటి నుంచి రెండులక్షల రూపాయల మేరకు రుణాలను తీసుకున్న మహిళా సభ్యులు పెద్దగా కష్టం లేకుండానే రుణ చెల్లింపులు చేస్తూవచ్చారు. దీంతో మహిళా స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న బ్యాంక్ రుణాల్లో నిరర్థక రుణాల శాతం 0.5 శాతం మాత్రమే నమోదవడం విశేషం. ఏపీలో ప్రభుత్వం ప్రారభించిన అమ్మ ఒడి పథకం కారణంగా మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున చేర్పించ గలిగారు. ఇక ‘విద్యా దీవెన’, ‘విద్యా వసతి’ పథకాల ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండానే మహిళలు తమ పిల్లలను ఉన్నత విద్య చదవడానికి పంపించారు. పద్మనాభ మండలంలోని స్వయం సహాయక బృందంలోని 600 మంది సభ్యుల్లో వందమంది చేయూత పథకం కింద గొర్రెలు, మేకలు కొన్నారు. ఈ మండలం లోని 900 మంది మహిళా సభ్యులు ‘జగనన్న తోడు’ పథకం కింద తమ కూరగాయాలు, ఆకు కూరలను అమ్ముకోగలిగారు. దీంతో వడ్డీ చెల్లింపుల భారం తగ్గిపోయింది. ‘తోపుడు బండి’ పథకం కింద 300 మంది మహిళలు ఊరగాయలు తయారు చేసి అమ్మి లాభాలు సంపాదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాల కల్పన, చక్కటి వర్షపాతం కారణంగా పద్మనాభ మండలంలోని ప్రతి ఒక్క కుటుంబం తాము సంతోషంగా ఉంటున్నట్లు తెలిపారు. రెండు పంటలు పండటం, పంటల్లో వైవిధ్యత, ప్రత్యేకించి కూరగాయలు, ఆకుకూరల సేద్యం పెరగడం వల్ల రైతుల నికర ఆదాయం బాగా పెరిగింది. దీంతో లేబర్‌కి డిమాండ్ పెరిగి కూలీ రేట్లుకూడా పెరిగాయి. ఇవన్నీ చేరి రైతు కుటుంబాలు రుణ భారం నుంచి బయటపడ్డాయి. కుటుంబాలు తమ సొంత వనరులను ఏర్పర్చుకోవడంతో అప్పులు లేకుండా ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇటుకల బట్టీలు, ఆటో ట్రాన్స్పోర్ట్ వంటి వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను వీరు సృష్టించుకున్నారు. పిల్లలకు ఉచిత విద్య కారణంగా మహిళలు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కేటాయించినా, 65 శాతం పైగా సీట్లను మహిళలే కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల వితరణ కారణంగా కుటుంబాల్లో దారిద్య్రస్థాయి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా నిరుపేదల్లో కెల్లా నిరుపేద కుటుంబాల్లో 90 శాతంపైగా దారిద్య్ర రేఖను అధిగమించేశారు. ప్రతి సంవత్సరమూ పెరుగుతున్న సంపాదన కారణంగా వీరు ఇప్పుడు దిగువ మధ్యతరగతి వర్గంలోకి చేరుకున్నారు. పోషకాహారం పట్ల శ్రద్ధ పెరగడం, నాణ్యమైన దుస్తులు ధరించడం, రోజువారీ దుస్తుల స్టయిల్ కూడా మారిపోవడం వంటి పలు కారణాలతో మహిళా బృంద సభ్యులు ఎలాంటి ఆకస్మిక పరిణామాలు, ఎదురుదెబ్బలనైనా తాము తట్టుకోగలమని ఆత్మ విశ్వాసంతో ఉండటం మరీ విశేషం. అంతిమంగా పేదల అనుకూల విధానాలను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రియాశీలకంగా అమలు చేయడం వల్లే గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గొప్ప మార్పు చోటు చేసుకుంటోందని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలు, పేదల జీవితాల్లో సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుండటమే దీనికి కారణమని నొక్కి చెప్పవచ్చు. (క్లిక్ చేయండి: పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు) - ప్రొఫెసర్ కె.వి.రమణా రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ -
విద్యాశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సెర్ప్‌తో షేర్
ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్‌లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం సెర్ప్‌లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి. – బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
AP: మహిళా మార్ట్స్
మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధం చేసింది. తద్వారా పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి బీజం వేస్తోంది. పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. సాక్షి, నెల్లూరు: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది. వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసÆమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో రెండు చోట్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల మహిళా మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో చర్యలు వేగవంతమయ్యాయి. జిల్లాలో తొలుత ఐదు మండలాలను ఎంపిక చేశారు. కావలి, వెంకటాచలం, కోవూరు, వింజమూరు, కందుకూరు వంటి ప్రాంతాలను ఎంపిక చేసి అందులో రెండు చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా సంఘాల ఎంపిక, స్థల సేకరణ, పెట్టుబడి నిధి సమీకరణ, వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్త్రీనిధి, బ్యాంక్ రుణంతో.. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన వాహన పార్కింగ్ ఉండేలా బ్యాంకులు, బస్సు స్టేషన్ సమీపంలో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ మార్ట్‌ల్లో స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయనున్నారు. సుమారు రూ.60 లక్షల వరకు మూలధనంగా సమీకరించనున్నారు. స్వయం సహయక సంఘాల మహిళలను ఈ మార్ట్‌ల్లో వాటాదారులుగా చేర్చనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మహిళలు ఇష్టపడితే ప్రతి ఒక్కరి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వాటా ధనం సేకరిస్తారు. బ్యాంకుల నుంచి, స్త్రీ నిధి అప్పుల రూపంలో సేకరిస్తారు మార్ట్ సేవలు ఇలా.. మహిళా మార్ట్ల ఏర్పాటుతో గ్రామీణ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనవసర వ్యయం, రవాణా ఖర్చు తగ్గించేలా దృష్టి పెడతారు. హోల్ సేల్ విక్రయాల ద్వారా తక్కువ ధరలకు సరుకుల లభ్యత ఉండేలా చూస్తారు. స్థానిక రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ మధ్యవర్తిగా వ్యవహరించి వారికి మద్దతు ధర లభించేలా చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం వంటివి మార్ట్లు చేపట్టనున్నాయి. మహిళా సంఘాలు బలోపేతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలు మరింత బలోపేతం అయ్యేందుకు మహిళా మార్ట్లు ఎంతో ఉపయోగపడతాయి. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థల సేకరణ, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై సమీక్ష నిర్వహించాం. వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్ల మాదిరిగానే మార్ట్లు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలో మార్ట్లు కార్యరూపం దాల్చనున్నాయి. – సాంబశివారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఆర్డీఏ -
సూపర్మార్కెట్ల ‘చేయూత’
సాక్షి, అమరావతి: మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్మార్కెట్లను ఏర్పాటుచేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. ప్రయోగాత్మకంగా జూలై నాటికల్లా జిల్లాకు రెండేసి చొప్పున 52 మండలాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. చేయూత మహిళా మార్ట్‌గా వీటికి నామకరణం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ మహిళా మార్ట్లను ఏర్పాటుచేస్తారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన పేద మహిళలకు ఏటా దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక లబ్ధిపొందిన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయెన్స్, అమూల్ వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు సాధారణ మార్కెట్ ధర కన్నా తక్కువకే తమ కిరాణా సరుకులను 78,931 మహిళా సంఘాల రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధరకే సేకరణ.. విక్రయాలు ఇక సూపర్ మార్కెట్‌కు అవసరమైన ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కారం, పసుపు, వివిధ రకాల మసాలాలతో పాటు నెయ్యి, పల్లీచిక్కీ వంటి స్థానికంగా దొరికే నాణ్యమైన ఉత్పత్తులను పొదుపు సంఘాల్లోని మహిళలు సేకరిస్తారు. మరోవైపు.. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను హోల్‌సేల్ వ్యాపారులకు ఇచ్చే ధరకే మహిళా సంఘాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యాపారుల కన్నా తక్కువ ధరకు ఈ సూపర్ మార్కెట్లు నాణ్యమైన నిత్యావసర సరుకులు సేకరించే వీలుందని.. అదే సమయంలో కొంత లాభం వేసుకుని మార్కెట్ ధర కన్నా తక్కువకు వినియోగదారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళా మార్ట్ల ఏర్పాటు ఇలా.. మండలంలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఫెడరేషన్‌గా ఏర్పడతారు. అందులో ప్రాథమికంగా ఒకొక్కరు రూ.150ల నుంచి రూ.200ల మధ్య షేర్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెడతారు. అదనంగా అవసరమైన నిధులను మండల సమాఖ్య ద్వారా స్త్రీనిధి, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కనీసం రూ.30 లక్షలతో ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటుచేస్తారు. ఆ మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ప్రతినెలా తమ కుటుంబ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఆ సూపర్‌మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇతర వినియోగదారులను కూడా ఆకర్షించేలా హోల్‌సేల్ ధరలకే సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. మండల పరిధిలో ఎక్కువమందికి అందుబాటులో ఉండేలా ఓ పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కనీసం 1000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా నెలకు కనీసం లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. వచ్చే లాభాలను మొదట్లో ఫెడరేషన్ సభ్యుల్లో అవసరమైన వారికి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం.. తర్వాత దశలో లాభాలను సమానంగా పంచుకోవడం వంటివి ఉంటాయి. సూపర్‌మార్కెట్ నిర్వహణకు కమిటీలు ఇక సూపర్ మార్కెట్ నిర్వహణకు పొదుపు సంఘాల్లోని మహిళలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. వాటిల్లో పనిచేసేందుకు సిబ్బందిని కూడా పొదుపు సంఘాల్లోని చురుకైన మహిళలనే ఎంపిక చేస్తారు. ఇక సూపర్ మార్కెట్ రోజు వారీ నిర్వహణ, కావాల్సిన సరుకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం.. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణపై సభ్యులకు సెర్ప్ అధికారులతో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో శిక్షణ ఇప్పిస్తారు. 15, 16 తేదీల్లో జిల్లా పీడీల భేటీ పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేయూత మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు రెండేసిచోట్ల జూలై నాటికి వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల పీడీలతో సమావేశం ఏర్పాటుచేశాం. – మహ్మద్ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
ఆదాయం.. ఆరోగ్యం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: గ్రామీణ మహిళల్లో పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు ఆరోగ్యం, వారి ఆర్థిక స్థితిని పెంచేందుకు ‘పెరటి కోళ్ల పెంపకం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెరటికోళ్ల పెంపకం యూనిట్లను అందజేశారు. నాటు కోళ్ల పెంపకంపై మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలో 2,566 యూనిట్లు జిల్లాలో పెరటి కోళ్ల పథకాన్ని సెర్ప్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 2,566 యూనిట్లను అందజేసింది. ఒక్కొక్కటి కిలో నుంచి 1,200 గ్రాములు ఉండే 8 పెట్టలు, 3 పుంజులు (జిల్లా వాతావరణానికి తట్టుకునే హసిల్ క్రాస్), 30 కిలోల దాణా, మెడికల్ కిట్ (డీవార్మింగ్, ఇమ్యునోబూస్టర్, మల్టీ విటమిన్స్, మినరల్స్, యాంటీబయాటిక్స్)ను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. యూనిట్ ధర విషయానికి వస్తే కోళ్ల విలువ రూ.2,640, దాణా విలువ రూ.1,100, మెడికల్ కిట్ రూ.155, రవాణా ఖర్చు రూ.75గా మొత్తం కలిపి రూ.3,970. నాటు కోళ్లకు మంచి గిరాకీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ ఉంది. వీటి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. ఒక్కో కోడి పెట్ట ఏ డాదికి 180 గుడ్లు పెడుతుంది. సెర్ప్ ఇస్తున్న 8 పె ట్టల ద్వారా ఏడాదికి 1,440 గుడ్లు లభిస్తాయి. మార్కెట్లో నాటు కోడి గుడ్డు ధర రూ.8 పలుకుతోంది. ఈ గుడ్లు వెయ్యి విక్రయించినా ఏడాదికి రూ.8 వేల ఆదాయం వస్తుంది. గుడ్లను పొదిగించడం ద్వారా కోళ్ల ఉత్పత్తి పెంచుకోవచ్చు. సగటున ఏడాదికి 500 కోళ్లు అమ్మినా రూ.2.50 లక్షలు ఆదాయం పొందవచ్చు. ప్రయోజనం చేకూర్చే పథకం మహిళ ఆరోగ్యం, ఆర్థిక స్థితి పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటి కోళ్ల పెంపకం చాలా మంచి పథకం. జిల్లాలో ఇప్పటి వరకు 2,566 యూనిట్లను ఏర్పాటు చేశాము. ఈ పథకం ద్వారా మహిళలు ఆదాయం పొందడమే కాకుండా పౌష్టిక విలువ అధికంగా ఉన్న నాటుకోడి గుడ్డును తినడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలు తొలగి ఆరోగ్యంగానూ ఉంటారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీలో అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా గత ఆరు నెలలుగా మన రాష్ట్రంలోనే మరో చోట నివాసం ఉంటుంటే.. తాము ఉన్న చోటనే పింఛన్ పొందేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు) -
ఏ నెల పింఛను ఆ నెలలోనే..
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు దర్జాగా వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. లబ్ధిదారులు ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి అన్ని నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే. బకాయిలు కూడా చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరుచేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం ఏపీలో అసలు నివాసమే ఉండకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే శాశ్వతంగా నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో పింఛను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారు మూడు నెలలకోసారి వారి ఊరికి వచ్చి బకాయిలతో కలిపి ఒకేసారి డబ్బులు తీసుకెళ్తుతున్నారు. వాస్తవానికి ఇలాంటి వారిలో దాదాపు అందరూ అర్హత లేకపోయినా అక్రమంగా పింఛను పొందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. రెండు లక్షల మందికి పైగానే అలాంటి వారు.. రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. వీరిలో పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు కారుల్లో ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టారు. అసలైన అర్హులకు ఇబ్బంది ఉండదు ఇక రాష్ట్రంలో నివాసం ఉంటున్న అర్హులైన పింఛనుదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టంచేశారు. వలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారని.. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వారికి ఇప్పటికే తెలియజేసినట్లు వారు చెప్పారు. -
సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో షీటీమ్స్!
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణ కోసం ఆరేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాలకూ ‘షీ టీమ్స్’ సేవలు విస్తరించాయి. ఇప్పుడు ఇదే కోవలో పల్లెల్లోని మహిళల కోసమూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకానున్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో సామాజిక కార్యాచరణ కమిటీ(సోషల్ యాక్షన్ టీమ్)లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సొసైటీ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో ఇవి ఏర్పడనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)కీ చోటు కల్పిస్తారు. గ్రామ, మండల మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి కమిటీలు పరిష్కరించనున్నాయి. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి కార్యాచరణలోకి... రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ముగ్గురు స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులతో సహా ఎమ్మార్వో, సబ్–ఇన్స్పెక్టర్, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం, అంగన్వాడీ సూపర్వైజర్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్త్రీల సమస్యల పరిశీలన, తమ దృష్టికొచ్చే సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఈ కమిటీలు తీసుకుంటాయి. ఇప్పటికే వివిధ జిల్లాల పరిధిలో పలుచోట్ల సామాజిక కమిటీలు ఏర్పడగా, విడతల వారీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాక క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ కమిటీల సభ్యులకు న్యాయ, చట్ట, భద్రతా, రెవెన్యూ, ఇతరత్రా అంశాలపై ఆయా రంగాల నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు, మూడు దశలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా వేలాది సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన జెండర్ కమిటీల్లో ఉన్నవారితోపాటు, గ్రామ, మండల సమాఖ్య పాల క మండళ్ల సభ్యులనూ ఈ కమిటీల్లోనూ నియమిస్తున్నారు. అలాగే కార్యాచరణ కమిటీకి గ్రామ స్థాయిలో ముగ్గురిని అనుబంధ సభ్యులుగా నియమిస్తారు. మహిళల సమస్యలను తక్షణం గుర్తించేందుకు వీరి నియామకం ద్వారా అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఆయా అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఈ సోషల్ యాక్షన్ టీంలు నిర్వహించనున్నాయి. ఏయే బాధ్యతలు అప్పగించనున్నారంటే.. గ్రామీణ మహిళల సాధికారత సాధన దిశలో స్త్రీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అంశాల్లో అండగా ఉండడం. బాల్య వివాహాలు, వరకట్న, లైంగిక వేధింపులు, గృహ హింస, మహిళల అక్రమ రవాణా నివారణ, మూఢ నమ్మకాలు అరికట్టడం యుక్త వయసు దశ దాటే వరకు అమ్మాయిలు ఎదుర్కొనే వివిధ సమస్యలు అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక అవగాహన కల్పించడం. కౌమార దశకు వచ్చే బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా వచ్చే మార్పులపై అవగాహన కల్పించడం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం. అనాథలు, వితంతువుల సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారమూ కమిటీలకే ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ మహిళల రక్షణకు సోషల్ యాక్షన్ టీమ్‌లు -
అసలేం జరిగింది.. ఆరా తీయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో జరిగిన అక్రమాలపై కేంద్రం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమేగాకుండా.. రూ.కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణించింది. సెర్ప్‌లో పశు గణన–జీవనోపాధి (లైవ్ స్టాక్–లైవ్లీ హుడ్స్) పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్రం.. దీనిపై విచారణ జరిపి ఆగస్టు6లోగా నివేదిక పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివద్ధిశాఖ జాయింట్ సెక్రెటరీ లీనా జోహ్రీ సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు లేఖ రాశారు. ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్) పథకం కింద 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కాగా, ఇదే అంశంపై సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఇవే..!. మహిళా సంఘాల సభ్యుల దగ్గర ఉన్న గొర్రెలు, మేకల పశు ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఈ ఏడాది మార్చినాటికి 2,875 లైవ్ స్టాక్ ఫార్మర్ ప్రొడ్యూ సింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూపులలో లేని 75% మంది మహిళలకు జీవాలు లేకున్నా ఉన్నట్లు నమోదు చేసి.. భారీగా నకిలీ గ్రూప్‌లను సృష్టించారు. ఆ తర్వాత కమీషన్లకు ఆశపడి.. పశుఉత్పత్తి సామర్థ్యం, చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఉపయోగపడని పరికరాలను కొనుగోలు చేశారు. ఏటా రూ.1.50 కోట్ల పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నా.. గత రెండేళ్లలో ఎలాంటి ఇ–టెండర్లను పిలవకుండా బహిరంగ మార్కెట్ల లోని ధరల కంటే 2–3 రెట్లు ఎక్కువకు కొనుగోలు ధరలను నిర్ణయించి లైవ్ స్టాక్ లైవ్లీ హుడ్స్ యూనిట్లలో అవినీతికి పాల్పడ్డట్లు తెలిసింది. డిజిటల్ వేయింగ్ మిషన్, డ్రెంచింగ్ గన్, డిటిక్కింగ్ మిషన్ – వాక్సిన్ కారియర్ కొనుగోళ్లలో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పశుమిత్రల శిక్షణ కోసం చేసిన ముద్రణ పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పశుమిత్రలకు ఆన్లైన్ క్లాస్‌లు..! ఎన్ఆర్ఎల్ఎం కింద పశు మిత్ర శిక్షణ ఇస్తారు. దీన్ని పశుసంవర్థకశాఖ లేదా వెటర్నరీ వర్సిటీ ద్వారా ఇప్పించకుండా..సెర్పే ఇచ్చింది. దీంతో ఈ శిక్షణకు సెక్షన్ 30(b) ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్ 1984 ప్రకారం అవసరమైన గుర్తింపు నేటి వరకు రాలేదు. సెర్ప్ వద్ద నమోదైన పశుమిత్రల పని వివరాలు కూడా తప్పుల తడకేనని తెలుస్తోంది. శిక్షణ పొందిన 2,300 పశుమిత్రలలో కనీసం 200 మంది కూడా గ్రామాలలో పని చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,850 మంది పశుమిత్రలకు శిక్షణ ఇవ్వడానికి ఓ ఏజెన్సీకి చెల్లించేందుకు రూ.10.57కోట్లను ఖరారు చేశారు. పశువైద్య శాస్త్ర ప్రకారం ‘ప్రాక్టికల్ ఓరియెంటెడ్’గా శిక్షణ ఇవ్వాల్సిఉంటుంది. కోవిడ్–19 ఆంక్షలున్నా కమిషన్ల కక్కుర్తికి ఆశపడి ‘ఆన్ లైన్’పద్ధతిలో శిక్షణ ఇవ్వడం విడ్డూరం. -
సచివాలయాల్లో మళ్లీ పింఛన్ల అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: పింఛన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించిన కొత్త జాబితాలను ప్రభుత్వం శనివారం నుంచి మళ్లీ సచివాలయ నోటీసు బోర్డుల్లో ఉంచింది. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు విడతల వారీగా గ్రామ, వార్డుల వారీగా సోషల్ ఆడిట్ జరిపి.. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా తుది జాబితాలను ప్రకటిస్తుందని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. అర్హత ఉన్నా వలంటీర్ల సర్వేలో కొందరికి పింఛన్లు తొలగించారంటూ పలుచోట్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై మరోసారి ఎంపీడీవోలతో రీ సర్వే చేయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలా తొలగించిన వారితో పాటు ఇటీవల కాలంలో పింఛన్లు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతనూ అధికారులు పరిశీలించారు. ఆయా జాబితాలను ఎక్కడికక్కడ శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డులలో ఉంచారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి నెలతో పాటు జనవరి నెల పింఛన్‌ను కలిపి.. 2 నెలల పింఛన్‌ను ఒకేసారి అందజేస్తారు. పింఛనుకు అర్హత ఉండీ ఇంకా ఎవరైనా మిగిలిపోతే సంప్రదించాల్సిన సమాచారాన్ని కూడా సచివాలయ నోటీసు బోర్డులో ఉంచారు. -
నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పింఛను పొందే లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనుంది. వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు. మిగిలిన పాత పింఛనుదారులందరికీ ఇప్పటికే పింఛను పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా.. అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోందని, ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
దివ్యాంగులకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(యూడీఐడీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు రాయితీ పొందడానికి ఈ స్మార్ట్ కార్డును చూపిస్తే సరిపోతుంది. అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించి, ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్, ఎంపవర్మెంట్(సదరమ్) సర్టిఫికెట్లు కలిగిన వారు మళ్లీ ఇందుకోసం వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ‘సెర్ప్’ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనున్నారు. దివ్యాంగులకు స్వావలంబన కార్డు పేరిట స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూడీఐడీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దివ్యాంగులు తమ వైకల్యాన్ని రుజవు చేసేందుకు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. -
పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి: సంతృప్త (శాచ్యురేషన్) స్థాయిలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వారి ఇంటివద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే సమయంలో ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1–14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్టు వారు వివరించారు. నవంబర్ 5 నుంచి అధికారులకు శిక్షణ.. కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై నవంబర్ 5 నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 5న జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ ఇస్తారు. నవంబర్ 7, 8 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ అందజేస్తారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో నవంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నవంబర్ 15–20 తేదీల మధ్య గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్రక్రియపై శిక్షణ ఇస్తారు. -
సెర్ప్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సెర్ప్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : గ్రామీణ పేదరిక నిర్మూలన కమీటీ(సెర్ప్)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెంచిన పెన్షన్ పంపిణీపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సైతం బడ్జెట్ సమీక్షలు నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఆయా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రెండు రోజులు పాటు జరిగే కీలక సమీక్షల్లో ఏ శాఖకు ఎంత బడ్జెట్ కావాలో మంత్రులు, అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోనున్నారు. బడ్జెట్లో నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో నవతర్నాలు అమలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేటాయింపుపై సమీక్ష జరుగనుంది. -
సెర్ప్ కార్యాలయమా..టీడీపీ ఆఫీసా..
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలన్నింటినీ పర్యవేక్షించే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించి మరీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇందుకోసం సెలవురోజుల్లోనూ సిబ్బందిని కార్యాలయానికి రప్పించి మరీ పనిచేయిస్తున్నారు. వారితో డ్వాక్రా మహిళా సంఘాలకు ఫోన్లు చేయిస్తూ వారిని అధికారపార్టీకి అనుకూలంగా ఓటేసేలా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో అధికారపార్టీకి తోడ్పడేలా పనిచేయాలంటూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తేవడమేగాక.. బెదిరింపులకు సైతం దిగుతున్నారు. అంతేగాక జిల్లాల్లో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు ఎక్కడికక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థులను కలవాలని, వారు చెప్పినట్టు చేయాలని బెదిరిస్తూ ఫోన్లు సైతం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ అభ్యర్థిని కలవాలని అక్కడి సిబ్బందిని బెదిరిస్తూ కృష్ణమోహన్ మాట్లాడిన ఆడియో టేపు బయటపడడం తెలిసిందే. సెర్ప్ సీఈవో అరాచకాలకు ఈ ఆడియో టేపు నిదర్శనంగా నిలుస్తోంది. శుక్రవారం సెలవురోజునా పనిచేసిన కార్యాలయం.. సాధారణంగా సెలవు రోజున ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. కానీ కృష్ణమోహన్ సీఈవోగా పనిచేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ(సెర్ప్) ప్రధాన కార్యాలయం మాత్రం శుక్రవారం సెలవు రోజునా పనిచేసింది. కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా కార్యాలయానికి పిలిపించుకున్నారు. జిల్లాలో ఉన్న సిబ్బందికి ఫోన్లు చేస్తూ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం బిజీబిజీగా మారింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 72 లక్షలమంది డ్వాక్రా మహిళలలో.. ఎక్కువ మందితో టీడీపీకి ఓటు వేయించాలన్న లక్ష్యంగా సెలవురోజు కార్యాలయం పనిచేయడం గమనార్హం. అంతేకాదు.. అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాకు ఇద్దరేసి ఉద్యోగులు, వారి కింద జిల్లా స్థాయిలో ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీలను సెర్ప్ సీఈవో ప్రత్యేకంగా నియమించారు. జిల్లా స్థాయిలోని ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీ పని ఏంటంటే.. ఎప్పటికప్పుడు తమ పరిధిలో మండల స్థాయిలో ఉండే ఏరియా కోర్డినేటర్లకు, గ్రామ స్థాయిలో ఉండే సంఘ మిత్రల(యానిమేటర్ల)కు ఫోన్లు చేస్తూ పర్యవేక్షించాలి. ఈ సందర్భంగా సంఘమిత్రలు తమ పరిధిలో ఉండే డ్వాక్రా మహిళలతో నిత్యం సంప్రదింపులు జరిపేలా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఆయా నియోజక వర్గాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంత డ్వాక్రా మహిళల తరలింపు వంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కార్యక్రమాలు ఈ ప్రక్రియలో యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్నికల వరకు ఇలా సెర్ప్ సిబ్బందిని అధికారపార్టీకోసం పని చేయించడానికి వీలుగా శనివారం ఉగాది పండుగ రోజున, అలాగే ఆదివారం రోజున కూడా రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయం, జిల్లా స్థాయి డీఆర్డీఏ, మండల స్థాయిలో ఎంసీసీ కార్యాలయాలు పనిచేయాలని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఎన్నికల పోలింగ్ జరిగేరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం. అయితే ఆ రోజు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు సీఈవో ఇప్పటికే దిశానిర్దేశం చేయడం గమనార్హం. దీన్నిబట్టి సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ అధికార తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తోడ్పడేందుకోసం ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోంది. టీడీపీ కోసం పనిచేసినందుకు ప్రతిఫలం.. ప్రస్తుతం సెర్ప్ సీఈవోగా పనిచేస్తున్న కృష్ణమోహన్ గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సీఎం ఓఎస్డీగా నియమితులయ్యారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యుటేషన్‌పై ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను 2016లో సెర్ప్ సీఈవోగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో సెర్ప్ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పనిచేశారు. అత్యంత కీలకమైన ఈ బాధ్యతల్లో ఐఏఎస్ లేదా కనీసం రిటైర్డు ఐఏఎస్ కూడా కాని వ్యక్తిని నియమించడమేంటని అందులో పనిచేసే ఉద్యోగ సంఘ నాయకులు విమర్శించినా సర్కారు పట్టించుకోలేదు. పూర్తిగా చంద్రబాబుకు స్వామిభక్తి పరాయణుడిగా వ్యవహరిస్తున్నందునే కృష్ణమోహన్‌ను ఈ పోస్టులో కొనసాగిస్తోంది. సొంత అజెండాతో సిబ్బందిని వేధిస్తున్నాడు కృష్ణమోహన్ వైఖరిపై సెర్ప్–వెలుగు ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ ఎన్నికల సమయంలో తన కిందిస్థాయి ఉద్యోగులను టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల దగ్గరకు వెళ్లి కలవాలంటూ ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగడంపై సెర్ప్– వెలుగు ఉద్యోగుల జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆయన తనకంటూ సొంత అజెండా పెట్టుకుని సెర్ప్– వెలుగు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెంచి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ జె.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నందిగామ ఏరియా కో–ఆర్డినేటర్ కిరణ్‌ను ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఈవో కృష్ణమోహన్ దుర్భాషలాడడాన్ని ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ శాఖ చేయనన్ని కార్యక్రమాలను సిబ్బంది చేత చేయిస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్న సీఈవో నిరంకుశ వైఖరిని గర్హిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నరేళ్లలో సుమారు 48 మంది ఆయన పెడుతున్న మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక చిన్న వయస్సులోనే మరణించారని తెలిపారు. సిరబ్బంది చనిపోయారు అన్నప్పుడు కూడా కనీస మానవత్వం లేకుండా, సానుభూతి సైతం చూపకుండా అదంతా సాధారణం అన్నట్టుగా మాట్లాడడం ఈ సీఈవోకే చెల్లిందని విమర్శించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాల్సిన సీఈవో కుర్చీలో గతంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నాన్–ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించిందని నాగరాజు ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో, సొంత ఎజెండాతో సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న సీఈవో కృష్ణమోహన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై న్యాయపోరాటానికి కూడా తాము సిద్ధమేనన్నారు. -
‘నీ జన్మలో నిజం చెప్పడం తెలుసా నీకు?’
సాక్షి, అమరావతి: డ్వాక్రా మహిళా సంఘాల వ్యవహారాలు పర్యవేక్షించే సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అవతార మెత్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబుకు బాకా ఊదుతూ ఏరియా కో–ఆర్డినేటర్లపై అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేగాక వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొన్ని మండలాలకు ఏరియా కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కు ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ తరఫున నందిగామ నుంచి పోటీచేస్తున్న తంగిరాల సౌమ్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని, ఆమెను కలవాలంటూ కిరణ్‌కు హుకుం జారీ చేశారు. అంతేకాక కిరణ్‌ను వ్యక్తిగతంగా ఫోన్లో సీఈవో కృష్ణమోహన్ తీవ్రంగా దుర్భాషలాడారు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. అంటూ తిట్లదండకం వినిపించారు. ఈ మేరకు కిరణ్‌కు సీఈవో కృష్ణమోహన్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సంభాషణల వివరాలు ‘సాక్షి’కి చిక్కాయి. అందులో సీఈవో కృష్ణమోహన్ సంభాషణ ఇలా ఉంది.. ఎంత ధైర్యం నీకు.. ‘‘నీ జన్మలో నిజం చెప్పడం తెలుసా నీకు? నీకంటూ ఎవరికైనా విశ్వాసంగా ఉండటంగానీ, నిజం చెప్పడంగానీ ఎప్పుడైనా ఉందా? నీవు ఆసుపత్రికి వెళితే పలకరించి మీ వెనుక మేము ఉన్నామయ్యా అంటే... ఇంత విష మనస్తత్వం గల నీవు ఎలాగ మనిషివయ్యావో.. నాకు అర్థం కాలేదు. నీ పరిస్థితి అలాగ కాదంటే ఇంకా దరిద్రంగా ఉందని చెబుతోంది ఆవిడ.. అర్థమైందా బెటర్ యూ.. నీవు నీ హద్దులో ఉండు.. లేకపోతే నీవు పెద్ద నాయకుడివైనా నీవే ఇబ్బంది పడతావు.. నీ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను.. ఎంత ధైర్యం నీకు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. ఆమె నీ మీద ఎందుకు ఫిర్యాదు చేసిందంటావు.. ఎందుకు పెట్టింది ఆవిడ? ఏమైనా చెడ్డ ఆవిడా? అగ్రకుల అహంకారంతో పెట్టిందా? మనిషి అన్న తరువాత కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా విశ్వాసం ఉండాలి కదా కిరణ్. రిటన్‌గా ఫిర్యాదు ఇచ్చిందయ్యా ఆవిడ. ఎందుకిచ్చింది.. అంతమందిలో నీ మీదే ఎందుకు ఇచ్చింది ఆవిడ? నీ స్టాఫ్ అందరికీ చెప్పిన మేసేజ్‌లు చూపిస్తున్నారు వారు.. వెళ్లి మాట్లాడు మరి. ఊళ్లోనే ఉంటావు కదా.. వెళ్లి మాట్లాడవచ్చు కదా. ఎందుకు పెట్టారని, నీవు ఇంత దుర్మార్గుడవని అందరూ చెప్పారు. పాత రోజుల్లో ప్రశాంతి చెప్పింది. గతంలో నీ అంతటి దుర్మార్గుడు లేడని చెప్పారు.. కానీ నీ నక్క జిత్తుల వినయాలు చూసి నేను మోసపోయాను. అయ్యోపాపం ఆపదలో ఉన్నావని చెప్పి.. చేయ్ ఎంతవరకు చేస్తావో. నీవు ఎలాగ ఉంటావో చూస్తా.. చెయ్యి నీ ప్రతాపం ఏమిటో? నీవు చూపించింది ఇదయ్యా.. మేం కూడా చూపిస్తాం. నిన్ను ఉంచుకుని తప్పు చేశాం మేము. కొద్దిగా కాకపోతే కొద్దిగా సెన్స్ ఉండాలి కనీసం.. వెళ్లు కలు.. కలవకపోయినా.. కలిసినా అక్కడ ఇంకో నక్కజిత్తులతో ఏదో చెబుతావు.. కేరెక్టర్ లేనప్పుడు ఎలాగైనా బతికేయవచ్చు.. నీ దగ్గరున్న స్టాఫ్‌ను పురిగొలిపి మహిళల్లో సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నావంట. ఎంత ధైర్యం నీకు.. నీ ఎజెండా ఏమిటి.. నీతో మాట్లాడం కూడా సమయం వృథా. సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేశావు ఎంత ధైర్యం నీకు. నీలాంటి వాడితో మాట్లాడటం వేస్ట్’’ అంటూ సీఈవో కృష్ణమోహన్ ఫోన్లో తిట్ల దండకం వినిపించారు. అయితే మీకు(సీఈవో) వచ్చిన సమాచారం తప్పని, ఆరు మండలాల్లో చెక్‌లు పంపిణీ చేశానంటూ ఏరియా కో–ఆర్డినేటర్ కిరణ్ పదేపదే వివరణ ఇచ్చినప్పటికీ సీఈవో పట్టించుకోలేదు. టీడీపీ ఆఫీసుగా సెర్ప్ కార్యాలయం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవురోజు కూడా సెర్ప్ కార్యాలయానికి వచ్చి డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో టీడీపీకి ఓట్లు వేయించడమే లక్ష్యంగా సీఈవో కృష్ణమోహన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయంగా సెర్ప్ కార్యాలయాన్ని కృష్ణమోహన్ మార్చేశారని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని పర్యవేక్షించకూడదని ఎన్నికల నియమావళి చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా సీఈవో వ్యవహరించడం గమనార్హం. -
గ్రామీణ మహిళలకు సరికొత్త రుణం!
సాక్షి, పాన్‌గల్: గ్రామీణ మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)అండగా నిలుస్తోంది. సంఘాల్లోని సభ్యులందరికీ తక్కువ వడ్డీరేటుకు రుణం అందిస్తోంది. సంఘాల ఆర్థిక స్వావలంభనకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘంలోని సభ్యులకు అందించే రుణ సదుపాయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా పొదుపు సంఘంలో సుమారు 10మంది నుంచి 15మంది వరకు సభ్యులుగా ఉంటారు. వీందరికి తీసుకున్న రుణం, వారి చెల్లింపు ఆధారంగా నిధులను బ్యాంకర్లు మంజూరు చేస్తారు. సంఘం సభ్యులు రుణం పొందినవారు కనీసం మూడేళ్లపాటు వాయిదాలు చెల్లిస్తుంటారు. చివరి వాయిదా చెల్లించే వరకు మరో రుణం అందదు. సంఘంలోని 15మందికి ఒకేసారి ఆర్థిక అవసరాలు వస్తే మరొకరి పేరిట రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తుంటారు. సెర్ప్ లక్ష్యాలకు ఇది విరుద్ధం. వీటిని అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. ఇందుకు హౌస్ హోల్డ్ లైవ్లీ హుడ్ ప్లాన్(హెచ్ఎల్పీ) పేరిట పథకాన్ని రూపొందించింది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. మండలంలో 7219 మంది సభ్యులు మండలంలోని 28 పంచాయతీల పరిధిలోని గ్రా మాల్లో 631 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 7219 మంది సభ్యులు ఉన్నా రు. ఆయా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యం బ్యాంకుల ద్వారా రూ.8.20కోట్లకు ఇప్పటికీ రూ.5.68కోట్ల రుణాలు అందించారు. స్త్రీనిధి ద్వారా రూ.4.06కోట్ల లక్ష్యానికి ఇప్పటికి రూ.3.28కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా ప్రతి çసభ్యురాలికి రుణం అందనుంది. రుణ సదుపాయం ఇలా.. సంఘంలోని సభ్యులను రెండు లేదా మూడు, అంతకుమించి గ్రూపులుగా విభజిస్తారు. మొదటి సంవత్సరంలో మొదటి గ్రూప్ సభ్యులకు రూ.5లక్షల వరకు రుణం అందించి మిగతా వారికి రెండో ఏడాదిలో అప్పు సదుపాయం కల్పిస్తారు. మొదటి సంవత్సరం రుణం తీసుకున్న సభ్యులు వాయిదాలు చెల్లిస్తే మరుసటి సంవత్సరం అదే సంఘానికి పరిమితిని మించి లేదా పరిమితికి లోబడి రెండో గ్రూప్ సభ్యులకు రుణాలు ఇస్తారు. దీంతో ప్రతి సభ్యురాలికి రుణం అందుతుంది. ప్రతి సంఘంలోని ప్రధాన బాధ్యులకు కొత్తరుణ విధానం గురించి అవగాహన కల్పిస్తారు. వీరు మిగతా మహిళలకు శిక్షణ ఇస్తారు. రుణం తీసుకోవడం, అవసరాలకు వినియోగించుకోవడం, తిరిగి చెల్లించడం వంటి అంశాలను వివరిస్తారు. సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిలకు అవగాహన కల్పిస్తారు. దీంతో ప్రతి సభ్యురాలి ఆర్థిక అవసరాలు తీరనున్నాయి.