service programs
-
వైఎస్ జగన్ పుట్టినరోజు.. వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. ఆ రోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్దేశించింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాటమరో వైపు, అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు. పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటానికి సిద్ధమైంది. జనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించనున్నారు. -
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
అమెరికాలో వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ డల్లాస్ విభాగం, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టెక్సాస్‌లోని ఇర్వింగ్ రెడ్ క్రాస్ అండ్ ప్లేట్లెట్ డొనేషన్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ డల్లాస్ విభాగం నాయకులు వల్లూరు శివశంకర్ రెడ్డి, డాక్టర్ రాజేంద్ర పోలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఉన్న చరీష్మా మరే ఇతర నాయకులకు లేదన్నారు.అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వైఎస్సార్ సేవలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారన్నారు. ఆయన తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం అర్పించారన్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు కృష్ణారెడ్డి, సుధాకర్ మీనకూరు, రవీందర్ రెడ్డి అరమింద, శివకోటిరెడ్డి గుడ్డేటి, గడికోట భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరశివారెడ్డి, చంద్ర, అనిల్ కుండ, నాగేశ్వర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ మోపూరు, చైతన్య రెడ్డి, రవితేజ, కిరణ్, శ్రీనాథ్, ఎల్లారెడ్డి, విష్ణు, ప్రసాద్ నాగారపు, ఆనంద్‌రెడ్డి, అజయ్, తరుణ్, దీపేశ్వర్ రెడ్డి, అనురాగ్, మణిదీప్‌రెడ్డి, వివేక్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామచేని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ...1991లో ఏర్పాటైన ఆటా సంస్థ గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్‌కి పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ప్రతి రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సును నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుకి తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ చైర్, C. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లక్ష్ చేపూరి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు ఈ ఆటా వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. అలాగే గవర్నర్ కూడా ఆటా ఆహ్వానాన్ని ఆమోదించారు. (చదవండి: అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్) -
ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!
చారిత్రాత్మక డబ్లిన్ నగరంలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కలసి అర్బన్ అగ్రికల్చర్ రంగంలో చేపట్టిన సేవా కార్యక్రమం ఇటీవల వార్తల్లోకెక్కింది. పౌష్టికాహార భద్రతను కల్పించే ట్టి మొక్కల్ని స్వయంగా తామే పెంచి ఇతరులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్ రాజధాని డబ్లిన్. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది. 1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్గా మార్చారు. అర్జున్ కరర్–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్ హైస్కూల్ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్‌గా మైక్రోగ్రీన్స్‌ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది. సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్ తన 16వ ఏట లైసెన్స్ తీసుకొని మరీ తమ గ్యారేజ్‌లో వర్టికల్ గార్డెన్ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించాడు. ‘గార్డెనర్స్ ఆఫ్ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్ కరర్–పరేఖ్, ప్రెస్టన్ చియు, నికో సింగ్ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. డీయూఎస్‌డీ న్యట్రిషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్‌ను డబ్లిన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (డీయూఎస్‌డీ) పరిధిలోని స్కూల్ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు. ‘మైక్రోగ్రీన్స్ పెంపకానికి అలమెడా కౌంటీ నుంచి హోమ్ గ్రోయర్స్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్ నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్ బ్యాగ్స్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్. డబ్లిన్ నగరపాలకులు మినీ గ్రాంట్ల పేరిట 1,500 డాలర్లను అందజేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. ‘డబ్లిన్ హైస్కల్లో సలాడ్లకు మైక్రోగ్రీన్స్‌ను జోడించడం అద్భుతంగా ఉందని న్యట్రిషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో అన్నారు. ‘మా చొరవ ప్రత్యేకమైనదని మేం నమ్ముతున్నాం. సమాజంలో మార్పు తెస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రజలకు సహాయం చేయడం మంచి అనుభతినిస్తుంది. నేను ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయం చేయాలనుకున్నాను. ఒంటరిగా చేయలేకపోయిన పనిని మేం కలసి చేస్తున్నాం’ అన్నారు జీజీ వైస్ ప్రెసిడెంట్ హరి గణేష్ (16). పై చదువులకు వెళ్లాక కూడా ఈ పని కొనసాగించాలని, మరింత మందికి మైక్రోగ్రీన్స్ అందించాలని ఈ యువ అర్బన్ ఫార్మర్స్ ఆశిస్తున్నారు. ఈ విద్యార్థుల పని స్ఫూర్తిదాయకం ‘గార్డెనర్స్ ఆఫ్ ది గెలాక్సీ సభ్యులైన ఈ విద్యార్థులు ఎంతో మంచి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తీర్చాలని వీరు కంకణం కట్టుకోవడం చాలా స్ఫర్తిదాయకంగా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్‌ను పండించడం కొనసాగించడానికి డబ్లిన్ సిటీ యూత్ అడ్వైజరీ కమిటీ మంచి గ్రాంట్ ఇవ్వటం చసి చాలా సంతోషిస్తున్నాను. – మెలీసా హెర్నాండెజ్, డబ్లిన్ నగర మేయర్ పతంగి రాంబాబు (చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ') -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు
యానాం: ఎదుటివారికి సాయపడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఆ కార్యక్రమం అయిదేళ్లుగా అవిచ్ఛినంగా సాగడమే కాక అభాగ్యులను ఆదుకుంటోంది. తమ పూర్వవిద్యార్థులు అనాథాశ్రమాలకు సహాయ పడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన గుప్పెడు బియ్యం.. గుప్పెడు సాయం సేవా కార్యక్రమం నేటికీ కొనసాగిస్తూ రీజెన్సీ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సేవానిరతి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా... ప్రతి బుధవారం ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యం తీసుకువచ్చి... కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి బుధవారం ఉదయం వచ్చేటప్పుడు తమ వెంట గుప్పెడు బియ్యాన్ని చిన్న పాటి బాక్సుల్లో తీసుకువస్తారు. తరగతి గదికి వెళ్లకముందే బియ్యాన్ని కళాశాల ఆవరణలో ఉంచిన ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద డ్రమ్ములో వేస్తారు. ఆ విధంగా కళాశాలలో ఉన్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 530 మందితో పాటు 23 సిబ్బంది బియ్యాన్ని తీసుకువచ్చి మనం ఒకరికి సహాయపడుతున్నాం అనే భావనతో డబ్బాలో వేస్తారు. ఈ విధంగా 100 కేజీలు అయిన తర్వాత ఆ బియ్యాన్ని వివిధ అనాథ ఆశ్రమాలకు సంచుల్లో అందిస్తున్నారు. దాదాపు రెండు వారాల్లోనే డబ్బా నిండిపోతుంది. దీంతో రెండువారాలకు వచ్చే బియ్యాన్ని అనాథలకు, ఎవరూ ఆధారంలేని అభాగ్యులకు అందిస్తున్నారు. వీటిని స్వయంగా విద్యార్థులే తీసుకువెళ్లి అందించడం గమనార్హం. 2017లో ప్రారంభం విద్యార్థులకు సేవాభావాన్ని, నైతికతను, సామాజిక విలువలను తెలియజేయాలనే ఆలోచనతో 2017లో గుప్పెడు బియ్యం..గుప్పెడు సహాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్తాండప్రసాద్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సరెళ్ల వీరకుమార్, పీఈటీ సోమేష్, అధ్యాపక సిబ్బంది విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉంటున్నారు. మా వంతు తోడ్పడుతున్నాం అభాగ్యులకు తోడ్పాలనే ఆలోచనతో మేమంతా గుప్పెడు బియ్యాన్ని తీసుకువస్తున్నాం. ఈ కార్యక్రమం మా పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. దీనిని అవిఘ్నంగా కొనసాగిస్తూ సేకరించిన బియ్యాన్ని అనాథాశ్రమాలకు అందిస్తూ మా వంతు తోడ్పడుతున్నాం. – ఎం.అరవింద్, పి.మురళీకృష్ణ, ఎస్.సూర్య, సీహెచ్ అవినాష్‌రెడ్డి (రీజెన్సీ ఇంటర్ విద్యార్థులు) అయిదేళ్లుగా నిరాటంకంగా సమాజంలో పేదలకు విద్యార్థులు ఏవిధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. సహాయపడే విధానాన్ని విద్యార్థులకు నేర్పాలి అనే అధ్యాపకుల ఆలోచనతో ఇది మొదలయ్యింది. అయిదేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. –మార్తాండప్రసాద్, ప్రిన్సిపాల్, రీజెన్సీ కళాశాల -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
అన్నార్తులకు అండగా..
పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్ బాలాజీ. వీఎస్ఎస్ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు. అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్‌గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్ పనులతోపాటు వాటర్ ఫ్యూరిఫైయర్ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్‌గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలి బాధలు దూరం చేస్తూ.. యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్ఎస్ పురం, టీఆర్ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను. – బాలాజీ, వలంటీర్, వీఎస్ఎస్ పురం, తడుకు పంచాయతీ -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్‌కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్‌లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్‌లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్‌లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
వాడవాడలా వైఎస్సార్‌కు నివాళులు
సాక్షి నెట్వర్క్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో వాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గుంటూరు జిలాలో జరిగి కార్యక్రమాల్లో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు, ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీలు మోపిదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రక్తదానం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతాప్ కుమార్‌రెడ్డి, సంజీవయ్య, వరప్రసాద్‌రావు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం కర్నూలు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మంత్రి జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, బాలనాగిరెడ్డి, కర్నూలు మేయర్ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉదయభాను, జగన్మో హనరావు, మేకా ప్రతాప్ అప్పారావు, కృష్ణప్రసాద్, రక్షణనిధి, సింహాద్రి రమేష్‌బాబు, జోగి రమేష్, దూలం నాగేశ్వరరావు, అనిల్‌కుమార్, పార్థసారథి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ మణిమ్మ, వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు భవకుమార్, విజయవాడ ఈస్ట్ ఇన్చార్జి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, నారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ‘అనంత’ స్మరణ అనంతపురం జిల్లా ప్రజలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి జయరాం, ఎంపీ రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, పీవీ సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పద్మావతి, ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా లొల్లలో వైఎస్సార్ విగ్రహానికి ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రైతులు క్షీరాభిషేకం చేశారు. పంట పొలాల మధ్య 250 మంది రైతులను సత్కరించారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి íవిశ్వరూప్, ఎంపీలు గీత, భరత్‌రామ్, ఎమ్మెల్యే చంటిబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ విగ్రహానికి పూలమాలలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కృష్ణదాస్, స్పీకర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే లు వీరభద్రస్వామి, జోగారావు, వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, రాజన్నదొర, వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ట్రైసైకిళ్ల పంపిణీ డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు దుప్పట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో సేవా కార్యక్రమాలు జరిగాయి. విశాఖలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలోను, బీచ్రోడ్డులోను వైఎస్సార్ విగ్రహాలకు ఎంపీ విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనందపురం మండలం కల్లివానిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు. భీమిలిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిం చి, అన్నదానం చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి రక్తదానం చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, జకియాఖానం, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అమర్నా థ్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి, మున్సి పల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
-
అసహాయులకు ఆపన్న హస్తం
వారంతా చిరువ్యాపారులు.. టీ కొట్టు, పానీపూరి, బజ్జీలు, కూరగాయలు, వాచ్ రిపేర్, మెడికల్ ల్యాబ్ వంటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటు న్నారు. తమకు ఉన్నంతలో ఇతరులకు సేవ చేయాలన్న సత్సంకల్పంతో ప్రతి నెలా రెండువందల రూపాయల చొప్పున జమ చేసుకుని పేదలకు ‘ఆపన్నహస్తం అంది స్తుంటారు. కిడ్నీబాధితులు, కేన్సర్ పేషెంట్లు, ఇళ్లు లేని నిస్సహాయులు, అనా«థలు ఇలా ఎవరైనా కష్టాలతో బాధపడుతుంటే మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలుస్తారు ఈ ‘ఆపన్నహస్త మిత్ర బృందం’. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన బాలస్వామి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, రాజు, స్వామిలు చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే నిస్సహాయుల కథనాలు చదివి చలించిపోయేవారు. వారి ఆలోచనలు ఉన్నతమైనవే కానీ, ఆదుకోడానికి వారి దగ్గర ఆర్థికంగా అంత స్థోమత లేదు. అందుకే వారంతా కలిసి 2017 నుంచి బృందంగా ఏర్పడి నిస్సహాయులకు ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. ఐదుగురితో మొదలైన ఆ బృందంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు చెందిన 112 సభ్యులు ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరారు. వీరు మొట్టమొదటిగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అంధుల పాఠశాలలో బోరు మోటార్ లేక అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కథనాన్ని పత్రికల్లో చదివి అక్కడికి వెళ్లి వారికి మోటార్ ఇప్పించారు. అప్పుడు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా నగదు అవసరం కావడంతో అప్పటినుంచి వారు మరికొంత మంది సభ్యులతో కలిసి ఆపన్నహస్తం మిత్ర బృందం ప్రారంభించి ప్రతీనెలా రెండువందల చొప్పున నగదు జమచేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాల్లో కొన్ని.. ►జనగామ జిల్లాలోని కళ్లెం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని సుకన్య ఉన్నత చదువుల కోసం రూ.22,000 సాయం ►సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన తల్లీతండ్రిలేని ఒక పాప పేరుతో బ్యాంకులో రూ. 10,000లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ►వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కిడ్నీ బాధితురాలికి రూ.10,000 వైద్యసాయం కోసం అందించారు ►సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి వర్ష కేన్సర్‌తో బాధపడుతుండటంతో రూ. 20,000 లు ఆర్థిక సాయం అందించారు. ►గజ్వేల్ పట్టణంలో మతిస్థిమితం లేక రోడ్లపై సంచరిస్తున్న ముగ్గురిని చేరదీసి వారిని యాదాద్రి జిల్లాలోని అమ్మనాన్న ఆశ్రమంలో చేర్పించి వారి ఖర్చుల నిమిత్తం 26,800 అందించారు. ►నల్గొండ జిల్లాకు చెందిన శివప్రసాద్ కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యసేవలకోసం వారికి రూ.20,000 లు అందించారు. ►కేరళలోని వరద బాధితుల సాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15,200 – తాటికొండ రవి, సాక్షి మెదక్ డెస్క్ సేవతో సంతృíప్తి నేను వాచ్ రిపేర్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మేము చేసేది చిరువ్యాపారం.. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో ఇతరులకు సేవ చేస్తూ తృప్తి చెందుతున్నాం. ప్రతి నెలా ఒక్కో సభ్యుడి దగ్గర రూ. 200 చొప్పున వసూలు చేసి జమ చేసుకుంటాం. మా బృందంలో రాజకీయ నాయకులను చేర్చుకోము. – బాలచంద్రం, అధ్యక్షుడు చలించిపోయాను నేను గజ్వేల్‌లో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తుంటాను. పత్రికల్లో వచ్చే కథనాలు చూసి చలించిపోయాను. మా వంతుగా ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని చూసి చాలామంది సేవా బృందాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. – కటుకం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆపన్నహస్తం ►జనగామ జిల్లా కు చెందిన యువతి నిహారిక కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం చెప్పకుండానే ఆమెకు పెళ్లి చేశారు. కొద్ది రోజుల తరువాత విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ కథనం సాక్షి పత్రికలో రావడంతో ఆమె వైద్యానికి రూ.10,000 బ్యాంకులో డిపాజిట్ చేశాము. తరువాత సాక్షి పత్రికలో మనసున్న మహారాజులు అంటూ కథనం రావడంతో అది చూసి చాలా మంది స్పందించి ఆ యువతికి సాయం చేశారు. -
సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం
‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్‌తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తాం’’ అని ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్. దర్శకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
మహానేతకు జననివాళి
సాక్షి, కడప : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని నివాళి అర్పించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను మరువలేక..అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నామంటూ స్మరించుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలతోపాటు చిత్రపటాల వద్ద నివాళులర్పించిన అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్‌ను అడుగడుగునా తలుచుకుంటూ అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సామాజిక సేవల్లో భాగంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనాథ శరణాలయాల్లో అన్నదానం, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ భారతమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, సాక్షి గ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సోదరి విమలమ్మ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనను స్మరించుకునే సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. కడపలో సేవా కార్యక్రమాలు జిల్లా కేంద్రమైన కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు బండి నిత్యానందరెడ్డి, మాసాపేటలో జహీర్ ఏర్పాటు చేపిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, మేయర్ పాలుపంచుకున్నారు. కోటిరెడ్డిసర్కిల్ వద్ద వైఎస్సార్ చిత్రపటం వద్ద విద్యార్థి సంఘం నాయకుడు ఖాజా రహమతుల్లా, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు. పులివెందులలో రక్తదాన శిబిరం, దుస్తుల పంపిణీ పులివెందులలో భాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైద్యుల విభాగం నాయకులు వైఎస్ అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సౌజన్యంతో దివ్యాంగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని అందజేశారు. పులివెందులలో అన్ని వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి. ప్రొద్దుటూరులో .. ప్రొద్దుటూరులోని పెన్నానగర్లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన మేలు గురించి కొనియాడారు. వైఎస్సార్ సర్కిల్లో ఉన్న దివంగత సీఎం విగ్రహానికి కూడా రాచమల్లు పాలాభిషేకం చేశారు. రాయచోటిలో.. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమలాపురంలో అన్నదానం కమలాపురం నియోజకవర్గంలోని అన్నిచోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానాలు, పాలాభిషేకాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కమలాపురంలోని అనాథ ఛాత్రాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో విగ్రహానికి ఎమ్మెల్యే, సమన్వయకర్తలు పాలాభిషేకం, పూలమాలతో నివాళులర్పించారు. రైల్వేకోడూరులో.. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్‌గేటు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. రాజంపేటలో.. రాజంపేట మన్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానం, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజంపేట పార్లమెంటరీ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్ ఏరియా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. జమ్మలమడుగు, బద్వేలులో.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మలమడుగులోని క్యాంబెల్, ప్రభుత్వ ఆస్పత్రిల్లో పండ్లు పంపిణీ చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి డాక్టర్ సుధీర్‌రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. పోరుమామిళ్ల, బద్వేలులో డాక్టర్ వెంకట సుబ్బయ్య రక్తదాన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
సకారాత్మకమే సమాజ హితం
ఎవరికయితే భవిష్యత్ పట్ల సకారాత్మకమైన దృష్టి ఉంటుందో వారే ఈ ప్రపంచానికి ఉపయోగ పడే విధంగా ఉంటారని, భవిష్యత్ పట్ల ఎన్నో ఆశలతో వారి దృక్పథాన్ని మార్చుకోగలుగుతారని దాది జానకి అంటారు.ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ముఖ్య సంచాలిక దాది జానకి గత 83 సంవత్సరాలుగా తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవకు కైంకర్యం చేశారు. యావత్ భారత దేశంలో ఆమె సేవలను అందించిన తరువాత 1974 సంవత్సరంలో లండన్‌లో తమ సేవా కార్యక్రమాలు ఆరంభించారు. 125 దేశాలలో ఈశ్వరీయ సేవలను విస్తరింప చేయడంలో వారి పాత్ర కీలకమైనది. దాది ప్రకాశ మణి పరమపదించిన తరువాత 2007 సంవత్సరం నుండి ముఖ్య సేవా కేంద్రమైన మౌంట్ అబు రాజస్థాన్‌లో ముఖ్య ప్రసాసికగా బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జానకి దాది గొప్ప అధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. వారి ముఖ్య ధ్యేయం వారి మనస్సుని, హృదయాన్ని భగవంతుని కార్యాన్ని నిర్వహించడమే తమ జీవిత లక్ష్యంగా, ఆశయంగా పెట్టుకున్నారు. భగవంతుడు ఒక పవిత్రమైన ప్రేమ జ్ఞానికి ఆధారం అనే అనుభవాన్ని వారు స్వయంగా అనుభవించి, ఆ గుణాలను తమలో నింపుకొన్నారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఎంతోమందికి స్పూర్తిని ఇచ్చింది. జీవితంలో కొత్త ఆశలను కలిగించింది. ప్రస్తుత సమాజంలో ఉండే స్వార్థ పూరితమైన సంబంధాలు అవగాహన చేసుకొని ఈ ప్రపంచం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని చేరబోతోంది అనే పరిస్థితిని గుర్తించారు కానీ వారి దృష్టి ఎప్పుడూ కూడా సకారాత్మకంగా మానవతా విలువలను పెంచే మంచిని పెంచే విధంగా ఉంటుంది. ప్రాచీన రాజయోగ విధానాన్ని తిరిగి ఆధునిక విధానంలో ప్రచారం చేయడానికి వారు ఆధారమయ్యారు. ఒక చక్కటి క్రమ శిక్షణ, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా దాది అనేక రంగాల వారికి తిరిగి ఆత్మ విశ్వాసాన్ని తమలో ఎలా చిగురింప చేయాలో తమ సాధన ద్వారా తెలియ చేశారు. ఈ విధంగా నేటిసమాజానికే కాకుండా భవిష్య సమాజ ఉన్నతి కోసం వారు ఎంతో పాటు పడ్డారు. 1916 వ సంవత్సరంలో ఉత్తర భారత దేశంలోని పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుండి ఇతరుల సంక్షేమం కోసమే వారు ఆలోచించేవారు. తమ బాల్య అవస్థలోనే వారి తండ్రితో వారు ఎన్నో అధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ శాకాహారం గురించి ప్రచారం చేసేవారు. అనారోగ్యంగా ఉన్నవారికి, వృద్ధులకి సేవ చేసేవారు.బాల్యం నుండే వారు సత్యాన్వేషణ ప్రారంభించారు. 1937వ సంవత్సరంలో జానకి దాది ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపింప బడిన బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రవేశించారు. ప్రజాపిత బ్రహ్మ పూర్వనామం దాదా లేఖ్ రాజ్. వారు ప్రముఖ వజ్రాల వ్యాపారి. వారి 61వ సంవత్సరంలో స్వయగా పరమాత్ముని ద్వారా భవిష్యత్తు ప్రపంచం సాక్షాత్కారం పొందారు. ఒక సత్యమైన, స్వచ్ఛమైన బంగారు ప్రపంచాన్ని నిర్మించడం అనే ఈశ్వరీయ కార్యాన్ని తమ ధ్యేయంగా తమ యావదాస్తిని ఈ సంస్థకు సమర్పించారు. రాజ యోగా అభ్యాసం ద్వారా ఎలా నిద్రాణమైన సత్యమైన శక్తులను జాగృతి చేయవచ్చునో వారు గుర్తించారు. పరమాత్ముని స్మృతి ద్వారానే స్వయం సంస్కారాలను పరివర్తన చేసుకోవచ్చని తెలుసుకున్నారు. ఈ సమయం లోనే వారు స్త్రీ శశక్తీకరణ కోసం ఎంతో పాటుపడ్డారు. కొంత కాలం తరువాత దాది జానకి ఒక వైపు రాజయోగ అభ్యాసం ద్వారా అతీంద్రియ సుఖాన్ని, అద్భుతమైన శాంతిని ఆనందాన్ని అనుభవం చేస్తూ ఈ సంస్థలో సభ్యులందరూ కూడా శారీరక శ్రమ చేయవలసి వచ్చింది. అదే సమయంలో జానకి దాది ఆ సంస్థలోని సభ్యులకు సేవ చేయడానికి నియమితులైనారు. 1974 సంవత్సరంలో వారు ఈశ్వరీయ ఆదేశం అనుసారంగా విదేశాలలో ఈశ్వరీయసేవలను ఆరంభించడం కోసం భారత దేశాన్ని వదలి వెళ్లారు. లండన్ ముఖ్య సేవా కేంద్రంగా చేసుకున్నారు. ప్రేరణాదాయకమైనటువంటి వారి శిక్షణ ద్వారా వ్యక్తిగత అనుభవాల ద్వారా, ఈ అధ్యాత్మిక విశ్వ విద్యాలయం ముఖ్య శిక్షణ లను విదేశీయులు కూడా గుర్తించారు. ఈ విధంగా దాది గారి నేతృత్వంలో దాదాపు 120 దేశాల్లో సేవాకేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ఈశ్వరీయ శిక్షణ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా తమ దైనందిన ఉద్యోగ వ్యవహారాలలో కూడా ఎంతో ఉపయోగ పడుతుందని ఎంతోమంది గుర్తించారు. దాది జానకి చేతుల మీదుగా ఆధునిక భవన ఆరంభం... దాది జానకి నేడు బ్రహ్మ కుమారీల దక్షిణ భారత దేశ ముఖ్య రిట్రీట్ సెంటర్ అయిన శాంతి సరోవర్ గచ్చిబౌలిలో ఒక ప్రత్యేక సేవకు ఏర్పాటు చేయబడిన ఇన్నర్ స్పేస్ అనే ఆధునిక భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సమాజానికి, యువతకు ప్రత్యేకమైన రీతిలో తర్కబద్ధంగా, శాస్త్రీయంగా ఆంతరంగిక వివేకాన్ని స్వయంగా అనుభూతి చెందడానికి అనువైన రీతిలో ఏర్పాటైన ఈ నూతన సేవా కేంద్రం లో అధునాతన రీతిలో ధ్యాన మందిరం, భారత దేశ ప్రాచీన రాజ యోగ విశిష్టతను తెలియచేసే ప్రదర్శనా స్థానం, 140 మంది ఒకేసారి వీక్షించే ఆడియో విజువల్ రూమ్, ఆధ్యాత్మిక గ్రంథాలయం ప్రత్యేక ఆకర్షణలు. ప్రారంభోత్సవం తరువాత, నగరంలో బ్రహ్మకుమారీల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. బ్రహ్మకుమారీ కేంద్రాల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచాలకులు, హైదరాబాద్ నగర బ్రహ్మ కుమారీల ముఖ్య సంచాలకులు, పలువురు ప్రముఖులు, బ్రహ్మకుమారీల ముఖ్యకేంద్రమైన మౌంట్ అబు నుంచి రాజయోగి మృత్యుంజయ హంస బెన్ తదితర సభ్యులు ఉంటారు. -
అభాగ్యులకు అండగా..
విజయనగరం అర్బన్: ‘మానవ సేవయే మాధ వ సేవ’ అన్న నానుడిని బాగా వంటబట్టించుకున్నారు. ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదని నిర్ణయించుకుని, సేవాభావం గల పది మంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ప్రస్తుతం వారంతో ఉద్యోగరిత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నా రు. వీరి మనసులను అర్థం చేసుకున్న మరికొంతమంది సభ్యులుగా చేరి వారున్న ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వివరాల్లో కి వెళితే...విజయనగరం పట్టణానికి చెందిన వర్రి శివప్రసాద్ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే రోజుల్లో కుటుంబ సభ్యుల ఆదరణ లేక రోడ్ల మీద చాలా మంది చనిపోవడాన్ని దగ్గర నుంచి చూశారు. ఇకపై ఎవ్వరూ ఆకలితో చనిపోకూడదని నిర్ణయించుకుని తనతో ఇంట ర్, ఇంజినీరింగ్ చదువుకునే పది మంది స్నేహితులను సంప్రదించి 2015 ఫిబ్రవరిలో ‘ఎయిడ్ ది ఏజ్డ్’ (ఏటీఏ) సమైక్య సహకార వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వీరందరూ తమకున్న ఆర్థిక వనరులతో వారాంతా ల్లో రోడ్లపై కనబడిన వృద్ధులకు ఆహారం, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా.. పది మంది సభ్యులతో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 180 మంది దాకా సభ్యులు చేరారు. సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తిం చిన కొంతమంది తాము కూడా సంస్థలో సభ్యులుగా చేరి వారుంటున్న ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2015లో ఏర్పాటైన సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వర్రి శివప్రసా ద్ (విజయనగరం) వ్యవహరిస్తుండగా, ప్రధాన కా>ర్యదర్శిగా చిన్నంటి వెంకటేశ్వర్లు (ఒంగోలు), వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీనారాయణ (శ్రీకాకుళం), కోశాధికారిగా జీఎస్ భాస్కర్ (విజయనగరం), సభ్యులుగా పి.రాజేంద్రప్రసాద్ (తుని), వర్రి వాసు (విజయనగరం), వీజీఎస్ నాయుడు (వైజాగ్), పి.సంతోష్‌కుమార్ (శ్రీకాకుళం), ఎ.చంద్రశేఖర్ (శ్రీకాకుళం) ఉన్నారు. ఇతర సభ్యులు కూడా వారుంటున్న ప్రదేశాల్లో అనుబంధ సంఘాలుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపడుతుండడం విశేషం. సీజనల్ సేవలు సభ్యులు ప్రతి ఆదివారం వారు న్న ప్రదేశాల్లో వృద్ధులు, అనాథలను గుర్తించి అన్నదానం చేపడుతున్నారు. అలాగే శీతాకాలంలో రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, హైదరా బాద్‌లోని అమీర్‌పేట, భరత్నగరా ఫ్లై ఓవర్, వెంకటగిరి, కృష్ణానగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతా ల్లో సభ్యులు సేవలందిస్తున్నారు. అన్ని పట్టణాలకూ.. ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదనే ఉద్దేశంతోనే ఏటీఏ ప్రారంభించాం. త్వరలో అన్ని పట్టణాలకూ సేవలు విస్తరిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న మిత్రులు ఆయా పట్టణాల్లో సేవలందిస్తున్నారు. దయాగుణం గలవారి –వర్రి శివప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏటీఏ ఎంతో తృప్తి.. ఉద్యోగరీత్యా నిత్యం బిజీగా ఉండాల్సి వస్తోంది. కనీసం ఎవరికి సహా యం చేద్దామన్నా సమయం కేటాయించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏటీఏ ద్వారా ఆదరణలేని వృద్ధులకు సేవ చేయడం వల్ల ఎంతో తృప్తి లభిస్తుంది. –జీఎస్ భాస్కర్, కోశాధికారి, ఏటీఏ -
ప్రారంభమైన ‘టాటా సేవా డేస్’ 2017
హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో ‘టాటా సేవా డేస్ 2017’ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు టాటాను నెలకొల్పామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ‘సేవా డేస్’ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇదీ షెడ్యూల్ ఈ నెల 15న కర్నూలు జిల్లా సున్నిపెంట, 16న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, 19న రంగారెడ్డి జిల్లా జుక్కల్, నల్లగొండ జిల్లా ఆత్మకూరు గ్రామాల్లో, 20న వరంగల్, 21న నిజామాబాద్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 23న టాటాతో పాటుగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్, మధ్యాహ్నం శిల్పకళా వేదికలో కవి సమ్మేళనం ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సినీ నటుడు కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వయిజరీ బోర్డు సభ్యుడు మోహన్ పట్లోల, కార్యక్రమ సమన్వయకర్త వంశీరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ ఎక్కా, సంయుక్త కోశాధికారి జ్యోతిరెడ్డి, సమన్వయకర్త ద్వారక్‌నాథ్ రెడ్డి, జి.బి.కె.రెడ్డి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హెల్పింగ్ హ్యండ్స్ సేవా కార్యక్రమాలు
-
పేదల గోడ..
► జిల్లా ఎస్పీ వినూత్న కార్యక్రమం ► వాల్ ఆఫ్ గాడ్‌తో పేదలకు వస్తువుల అందజేత ► పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు ► ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతంపై దృష్టి ఆదిలాబాద్: జిల్లా పోలీసు శాఖ ఎస్పీ ఎం.శ్రీనివాస్ సారథ్యంలో వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. ఇటు నేరాలు అదుపునకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే.. మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణంగా 24 గంటలు కేసులు, కోర్టులు అంటూ తిరిగే పోలీసుల ఆలోచన విధానం ప్రజాసేవకు మారుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఆ శాఖకు నిధులతోపాటు అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులను చేస్తోంది. తమ విధులు నిర్వర్తించడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసులు మిషన్ కాకతీయ, హరితహారం, వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదలకు తమ వంతు సహాయంగా ఎస్పీ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ గాడ్ పేరుతో పాత వస్తువులను పేదలకు ఉపయోగపడేలా వెలుగులోకి తీసుకొచ్చారు. పాత వస్తువులు ఎంతో ఉపయోగం.. జిల్లాలో పేదలకు సహాయం చేయడానికి జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. స్థానిక టూటౌన్ ఎదుట జూన్ 25న ఎస్పీ ఎం.శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదల కోసం ‘వాల్ ఆఫ్ గాడ్’ ప్రారంభించారు. ఇంట్లో అనవసరమైన అనేక వస్తువులు ఉంటాయి, వాటిని పేదలకు, అవసరమున్న వారికి అందించడానికి ఈ వాల్ ఆఫ్ గాడ్ ఉపయోగపడుతోంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులు, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, దుప్పట్లు, బ్యాగులు ఇతర ఏవైనా నిరుపయోగ వస్తువులు ఈ వాల్ ఆఫ్ గాడ్ వద్ద ఉంచితే ఎవరైన అవసరం ఉన్న వారు వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఉన్నా ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారనే.. ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారికి ఈ వాల్ ఆఫ్ గాడ్‌తో వారు అనుకున్నది చేయగలుగుతారు. ఈ ప్రక్రియ ప్రపంచంలో మొదటిసారిగా ఇరాన్ దేశంలో ప్రారంభమైంది. ఆ దేశంలో 1997లో కరువు వచ్చిన సమయంలో ఓ మహిళ ఆలోచనలో నుంచి ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. తన వద్ద ఉన్న పాత వస్తువులను ఒక దగ్గర చేర్చి బహిరంగంగా ఏర్పాటు చేశారు. తద్వారా ఎవరికి అవసరమైన వస్తువులు వారు తీసుకెళ్లారు. ఇలా ఈ కార్యక్రమం ప్రపంచమంత పాకింది. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోలీసుశాఖతో కలిసి ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో మొదటి సారిగా ఈ కార్యక్రయాన్ని ఎస్పీ ప్రారంభించడం గమనార్హం. రద్దీ ప్రాంతంలో ఏర్పాటుతో మరింత మెరుగు.. ప్రస్తుతం వాల్ఆఫ్ గాడ్‌ను టూటౌన్ ఎదుట ఏర్పాటు చేశారు. ఇలాంటివి పట్టణంలో మరికొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎస్పీ ఆలోచన చేశారు. రద్దీ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతాల్లో నిరాశ్రయులు, నిరుపేదలు చాలామంది ఉంటారు, ఇలాంటి వారు పోలీసు స్టేషన్ వెళ్లేందుకు బయపడుతారు. అదే బహిరంగంగా జనం ఉన్నచోట పెడితే వారికి అవసరమైన కచ్చితంగా తీసుకెళ్తారు. -
నాటా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు
ఈ నెల 18 నుంచి వారం రోజులపాటు నిర్వహణ సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం చెప్పారు. నాటా కో-ఆర్డినేటర్ డాక్టర్ దువ్వూరు ద్వారకనాధరెడ్డి, రవి కందిమళ్ల, మ్యూజిక్ డెరైక్టర్ రఘుకుంచె, బ్రైట్ విజన్ సొసైటీ అధ్యక్షుడు సురసాని నారాయణరెడ్డి, సినీ గాయకుడు చంద్రబోస్‌లతో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతీ రెండేళ్లకొకసారి నాటా తరఫున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ... ఈసారి పలు జిల్లాల్లో చేపడుతున్న వాటిని వివరించారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ జిల్లాలలోని బద్వేలు పట్టణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 19న చిత్తురు జిల్లా తలుపు పల్లెలో ఉచిత వైద్యశిబిరాన్ని, వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని పలు గ్రామాల్లో సోలార్ ప్రాజెక్టులను ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 20న తిరుపతి మహతి ఆడిటోరియంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ కళాశాలలో మంచి ప్రతిభ కనబరిచిన 61 మంది విద్యార్థులకు రూ.6.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. 21న నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో 22న గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి పథకాలు ప్రారంభిస్తామన్నారు. 23న వరంగల్‌లో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25న నల్గొండ జిల్లాలో బధిరులకు ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27న హైదరాబాద్‌లో అక్షరాస్యతపై చారిటీ వాక్‌ను, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన 44మంది విద్యార్థులకు రూ.4.4 లక్షలు అందజేయనున్నట్లు చెప్పారు. సినిమాలో అవకాశం కల్పిస్తాం.. ఆమెరికాలో ఉన్న గాయనీ గాయకులకు సినిమాలో పాడే అవకాశం కల్పించనున్నట్లు సంగీత దర్శకులు రఘు కుంచె తెలిపారు. నాటా ఐడల్ ఆధ్వర్యంలో 10 నగరాల్లో ఫ్రీ ఆడిషన్స్ నిర్వహించి ఒక అబ్బాయి, అమ్మాయిని ఎంపిక చేస్తామన్నారు. వారిని తన తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. -
అనాథ బాలలకు ఆశాకిరణం
స్ఫూర్తి ఊరు కాని ఊరు... రాష్ట్రం కాని రాష్ర్టంలో రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లల ఆక్రందనలు ఆమెను కదిలించాయి. ఓ మంచి కార్యానికి సంసిద్ధురాలిని చేశాయి. తను, తన కుటుంబం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో అనాథలను, వీధిబాలలను ఆదుకోవడానికి ఆమె దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకూ ఈమె ఎవరో, ఈమె చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలు ఎక్కడో చూద్దామా..! ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వాణి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ భార్యాభర్తలు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ ముంబాయిలో నివసిస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక వాణి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే క్రమంలో దారిలో ఎందరో అనాథలు, వీధిబాలలు దయనీయమైన స్థితుల్లో తిరగాడుతుండటాన్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. బెంగాల్‌కు చెందిన దేవాంజలి ఆమెకు తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. వీరికి మరికొందరు స్నేహితులు జత కలిశారు. మొదట్లో వీరందరూ కలిసి దుప్పట్లు, దుస్తులు కొనుగోలు చేసి అనాథలకు అందించేవారు. వివిధ ఆశ్రమాల్లో ఉండేవారికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దుస్తులు, పండ్లు పంపిణీ చేసేవారు. ఇదే సమయంలో వీధిబాలలు చాలామంది ఆకలితో అలమటిస్తుండటాన్ని వీరు గుర్తించారు. దాంతో ఇంటి వద్దనే వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మురికివాడల్లో నివసించే పిల్లలకు తినిపించటంతో బాటు వారికి పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా అందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలను చూసిన పలువురు తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాంతో 75 మంది పిల్లలకు చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరు ‘ఆశాకిరణ్’ పేరుతో ఒక పాఠశాలను, ఒక ఉచిత ఉపశమన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో పిల్లలకు విద్య మాత్రమే కాకుండా చిత్రలేఖనం, వృత్తి విద్య, నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశాకిరణ్’ ఇప్పుడు ఇక్కడి చిరునామాలలో ల్యాండ్ మార్క్‌గా మారడం విశేషం. పేరుకు తగ్గట్టే మురికి వాడలలోని వారికి వీరి పాఠశాల ‘ఆశాకిరణం’లా వెలుగునిస్తోంది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, సేవాభావం, దానిని నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే, ఎక్కడైనా, ఎంతైనా చేయవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి! - కొమ్మినేని వెంకటేశ్వర్లు, సాక్షి, ఖమ్మం ఆసరా ఇస్తే ఖమ్మంలోనూ పాఠశాల ప్రారంభించాలని ఉంది! ‘నేను చేస్తున్న సేవలకు పలువురు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో పాఠశాల నిర్వహిస్తున్నాను. అయితే మా సొంత పట్టణమైన ఖమ్మంలో కూడా అనాథలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. దాతలు ముందుకొస్తే అక్కడ కూడా అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఉంది’ - వాణి -
నవలోకం సృష్టికర్తలు!
ఆటబొమ్మలు పట్టుకోవాల్సిన చేతులు... సత్తు బొచ్చెలు పట్టుకుంటున్నాయి. బడిదారి పట్టాల్సిన పాదాలు... గుడి మెట్ల దగ్గరకు నడుస్తున్నాయి. అక్షరాలు వల్లె వేయాల్సిన పెదాలు... ‘అమ్మా, భిక్షమేయండి’ అని అడుక్కుంటున్నాయి. సిగ్నళ్ల దగ్గర, ఆలయాల ముందర, దుకాణాల పంచన... ముష్టివాళ్ల రూపమెత్తిన పసివాళ్లను చూస్తే గుండె భగ్గుమంటుంది. కానీ వారి జీవితాలను మార్చాలన్న ఆలోచన ఎందరి మస్తిష్కాల్లో మెదులుతుంది? కానీ ఆ నలుగురికీ ఆ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఆ వైజాగ్ కుర్రాళ్లు వడివడిగా అడుగులు వేశారు. నవలోకాన్ని నిర్మించారు! విలువలు పతనమైపోతున్న ఈ రోజుల్లో కొత్త తరానికి విలువల్ని నేర్పేందుకు ఓ నూతన ప్రాజెక్టును ప్రారంభించారు నరేశ్ బృందం. ఇందులో భాగంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొంత స్థలాన్ని నెలకు రూ.15 వేలకు అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ పూర్తి గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు చేపట్టారు. రెల్లుగడ్డి, వెదురు, తాటి దుంగలతో కాటేజులు నిర్మించారు. మధ్యలో కొలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై నిపుణుల సాయంతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. యువకుల్లో సామాజిక సేవాదృక్పథం కల్పించేందుకు శిక్షణనిస్తారు. పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నైతిక విలువల్ని నేర్పిస్తున్నారు! నరేశ్‌కుమార్ బీటెక్ చేశాడు. ఎమ్మెస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అంతలో అతడిలో మథనం మొదలైంది. ఎక్కడికో వెళ్లి ఏదో చేయడమేంటి! ఎమ్మెస్ చేసి, లక్షలు సంపాదించడం వల్ల కలిసొచ్చేదేంటి! మనవల్ల మన ప్రాంతానికి, మనవాళ్లకి ఏం ఒరిగింది అని! దాంతో విదేశాలకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాజం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన క్లాస్మేట్సతో కలిసి ఆశ్రమాలకు వెళ్లేవాడు. రకరకాల సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఆ క్రమంలో అతడికి కోటా రాకేష్‌రెడ్డి, సాల్మన్ జార్జ్ క్యాంప్‌బెల్, రాజశేఖర్‌లు పరిచయమయ్యారు. రాకేష్‌రెడ్డి బీటెక్, ఎంబీఏ చే సి రూ.లక్ష జీతాన్ని ఇచ్చే ఎల్అండ్టీలో జాబ్ వదిలేసాడు. సాల్మన్ మంచి జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పెట్టేశాడు. రాజశేఖర్ కెనడాలోని ఐబీఎంలో సుమారు రూ.2 లక్షలు జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చేశాడు. వాళ్లు కూడా నరేశ్లాగే సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఉన్నారు. ఆలోచనలు కలిశాయి. అభిప్రాయాలు ఒకటయ్యాయి. దాంతో నలుగురూ కలిసి వైజాగ్‌లో ‘జెన్యువ’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వేర్వేరు వృత్తులు చేపట్టినా... ఎక్కువ సమయాన్ని తమ ఎన్జీవోకే కేటాయిస్తున్నారు. బాలల బంధువులయ్యారు... తమ సేవను విస్తరించేందుకు మురికివాడల్లో తిరుగుతున్నప్పుడు నరేశ్ బృందాన్ని ఓ విషయం బాధపెట్టింది. చాలామంది పిల్లలు బడికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతున్నారు. మాసిన గుడ్డలు, మురికి అంటిన దేహాలతో ఉన్న వారిని చూసి వీరి మనసులు కలుక్కుమన్నాయి. వారందరినీ బడికి పంపాలని తీర్మానించుకుని కంచరపాలెం వంతెన వద్ద సామాజిక భవనంలో చిన్నారులకు చదువు చెప్పడం మొదలు పెట్టారు. కొందరిని వేర్వేరు పాఠశాలల్లో చేర్పించారు. కానీ వాళ్లు చదువుకోవడానికి ఇష్టపడేవారు కాదు. బడికెళ్లకుండా రోడ్లమీద తిరుగుతుండేవారు. వారి తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం ఉండేది కాదు. మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే... వారిలో చాలామంది పిల్లలు యాచకులు కావడం! తల్లిదండ్రుల నిర్లక్ష్యం, కుటుంబ తగాదాలు వంటి వాటి కారణంగా ఆ పిల్లలు అలా తయారయ్యారని అర్థమైంది నరేశ్ బృందానికి. వెంటనే ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. పిల్లలందరినీ ఓ చోట చేర్చి, కౌన్సెలింగ్ చేయాలని ప్రయత్నించారు. కానీ వారి రియాక్షన్ వింతగా ఉండేది. ముష్టి ఎత్తితే రోజుకు నాలుగొందలు వస్తాయి, చక్కగా బిర్యానీ తిని జగదాంబలో సినిమా చూసొచ్చి హాయిగా నిద్రపోతాం, ఆ పని మానేస్తే మాకవన్నీ ఎవరిస్తారు అనేవారు వాళ్లు. అంతకన్నా దారుణం ఏమిటంటే వారిలో చాలా మంది డ్రగ్ ్సకు కూడా అలవాటుపడ్డారు. తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం వారిని సంపాదించే యంత్రాలుగా మార్చేశారు. అవన్నీ తెలిశాక తాము అనుకున్నది సాధించడం అంత తేలిక కాదని తెలిసొచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడాది పాటు కృషి చేసి ఓ ఇద్దరిని మాత్రం మార్చగలిగారు. పిల్లలకు డబ్బులు అందకుండా చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిర్ణయించుకుని... తాము కూడగట్టిన ఓ 50 మంది యువకులతో చైతన్య కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువ చ్చారు. 13 లక్షల కరపత్రాలను పంపిణీ చేసి బాల యాచకులకు డబ్బులు అందకుండా చేశారు. బాల యాచకులకు డబ్బులు ఇవ్వద్దంటూ బీచ్, ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు, బ్యానర్లతో ప్రచారం నిర్వహించారు. పిల్లల్ని యాచకవృత్తి వదిలేవరకు ఓపిగ్గా వెంటపడ్డారు. దీంతో పిల్లలతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. పిల్లలూ పెద్దలూ కలిసి సుమారు 1800 మంది యాచక వృత్తిని వదిలేశారు. వేరే ప్రాంతాల నుంచి యాచకత్వానికి వచ్చేవారికి కూడా అక్కడ జనం డబ్బులు వేయరని తెలిసిపోయింది. అందుకే బయటివాళ్లు కూడా రావడం లేదు. యాచక వృత్తిని వదిలేసిన యాభై మంది చిన్నారులు జెన్యువ ఆశ్రమంలో వసతి పొందుతూ, భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుత్నారు. మరొక 50 మందికి వసతి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన సొంత భవనాన్ని నరేష్కుమార్ హోమ్‌కు ఇచ్చేశారు. దాతల సాయం తో కొత్త నిర్మాణాలను ప్రారంభించారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు... వారికి ఉపాధి కల్పించడానికి ఎకోఫ్రెండ్లీ అలంకరణ వస్తువుల షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. ఓ నర్సరీని కూడా పెట్టి, దాని ద్వారా కొందరికి ఉపాధి కల్పించారు. ఈ కృషి ఇలాగే కొనసాగితే, అందరూ నడుం బిగిస్తే... మన దేశంలో అసలు యాచక వృత్తి అన్నదే ఉండదు అంటారు నరేశ్‌కుమార్. నిజమే. కృషి ఉంటే కానిది ఏముంది! - వి.ఆర్.కాశిరెడ్డి, గమనిక ఫ్యామిలీ లోపలి పేజీల్లో కొన్ని శీర్షికలు ఈవారం నుంచి కొన్ని మార్పులతో కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు మెయిన్‌లో వస్తున్న ‘సాగుబడి’, ‘సాహిత్యం’ పేజీలు ఇకపై ప్రతి గురు, శనివారాల్లో ఫ్యామిలీ లోపలి పేజీల్లో మరింత సమగ్రంగా, ఆకర్షణీయంగా రానున్నాయి. ప్రతి బుధవారం వస్తున్న ఆమె-అతడు స్థానంలో అస్త్ర - శాస్త్ర పేజీలు మరింత ఆసక్తికరంగా, మరింత సాధికారికంగా రాబోతున్నాయి. పాఠకులు ఈ మార్పును గమనించగలరు. - ఎడిటర్ -
సేవా నివాళి
శ్రీకాకుళం సిటీ: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పేదలకు ఆయన అందించిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ వై.ఎస్. విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి, పూల మాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా వై.ఎస్. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడంతో జిల్లా అంతా వై.ఎస్. నామస్మరణతో మార్మోగింది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వైఎస్ఆర్ దేశానికే ఆదర్శనీయ నేత అని, ఆయన ఆశయాల సాధనకు సమిష్టిగా కృషి చేస్తామని వక్తలు పేర్కొన్నారు. అనంతరం శరణ్య మనోవికాస కేంద్రం, బెహరా మనోవికాస కేంద్రంలోని బధిరులకు పండ్లు, బిస్కెట్లు, దుప్పట్లు తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ఈక ార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు వరుదు కళ్యాణి, సీజీసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. స్థానిక వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజన్న పాలనను జనం ఎన్నటికీ మరచిపోలేరని, ఆ మహానేత పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, సారవకోట ఎంపీపీ కూర్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ విగ్రహాన్ని పూలమాలలతో ముంచెత్తారు. రాష్ట్రంలో ఈ రోజు కోట్లాది మంది ఆరోగ్యంగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారంటే అదంతా వైఎస్సార్ పుణ్యమేనని ఈ సందర్భంగా సీతారాం అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి అందించిన ఘనత ఎన్టీఆర్, వైఎస్సార్లదేనని అన్నారు. టెక్కలిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేతలు సంపతిరావు రాఘవరావు, దువ్వాడ వాణి, జెడ్పీటీసీ కె.సుప్రియ, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. పలాసలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు నివాళులర్పించారు. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ నేతలు వజ్జ బాబూరావు, కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో నియోజకవర్గ ఇన్చార్జి నర్తు రామారావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్ర అనే పేదరాలికి పార్టీ నేత శ్యాంప్రసాద్‌రెడ్డి రూ. 3వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.రాజ్యలక్ష్మి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, ఎల్ఎన్.పేట మండలాల్లో వైఎస్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం తదితర మండలాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా మండలాల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాజాం నియోజకవర్గంలో రాజాం, వంగర, సంతకవిటి, రేగిడిలలో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
నీవు మమ్మల్ని విడిచి ఏళ్లు గడిచిపోయాయి....నీ జ్ఞాపకాలు కళ్ల ముందే కదలాడుతున్నాయి. నువ్విచ్చిన వరాలే మమ్మల్ని బతికిస్తున్నాయి. అయ్యా గూడు లేదంటే ఇందిరమ్మ ఇంటి కింద నీడ కల్పించావు... ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద విద్యార్థుల జీవితాల్లో విద్యావెలుగులు ప్రసరించావు...ఓ అమ్మకు పెద్ద కొడుకుగా ఆసరాగా నిలుస్తూ పింఛన్ అందజేశావు...గుండె పగిలిన అయ్యకు ఆరోగ్యశ్రీతో ప్రాణభిక్ష పెట్టావు. రైతుల దగ్గర నుంచి విద్యార్థుల వరకూ, పసిపాప నుంచి పండుటాకు వరకూ అందరి అభిమానాన్ని చూరగొన్నావు. అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యావు. ముఖ్యమంత్రిగా కంటే కుటుంబ సభ్యునిగా, ఆత్మీయునిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయావు. అయితే నువ్వు అమలు చేసిన పథకాలన్నీ నీరు గారిపోతున్నాయి. మేము క్షేమంగా ఉండాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి. మంగళవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకుంటూ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలనునిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. విజయనగరం టౌన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సంక్షేమ పథకాల అమలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలోవిలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి సభలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.జిల్లాకేంద్రంలోని పూల్భాగ్లో ఉన్న ప్రేమ సమాజంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ద్వారకామయి అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు పట్టణంలో పలుచోట్ల వర్ధంతి సభలు జరగనున్నట్టు తెలిపారు.