Shakib Al Hassan
-
షకీబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చైర్మెన్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకీబ్ తన భద్రత గురుంచి కీలక వ్యాఖ్యలు చేశాడు. "బంగ్లాలో నా చివరి టెస్టు ఆడాలని ఉంది. భారత్ నుంచి అక్కడకు వెళ్లేందకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. కానీ అక్కడ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు అని షకీబ్ పేర్కొన్నాడు. తాజాగా ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. షకీబ్ భద్రతకు బోర్డు ఎటువంటి హామీ ఇవ్వలేదని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు."షకీబ్ భద్రత ఆంశం మా చేతుల్లో లేదు. బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను అందించదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి భద్రత విషయంపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. బీసీబీ.. పోలీసు లేదా రాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి భద్రతా ఏజెన్సీ కాదు. మేము ఈ విషయం గురించి ప్రభుత్వంలో ఎవరితోనూ చర్చించలేదు. స్వదేశంలో తన చివరి టెస్టు అతడు ఆడవచ్చు. అందుకు ఎటువంటి సమస్య లేదు. షకీబ్ తన జీవితంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడితో తన రిటైర్మెంట్ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు. రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము" అని ఫరూక్ పేర్కొన్నారు -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది. షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్‌ను వన్డే కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్‌కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు. అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో బంగ్లా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది. -
WC 2023: షకీబ్ రెండోసారి! 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గనిస్తాన్
ICC Cricket World Cup 2023 - Bangladesh vs Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తాళలేక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 37.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ధర్మశాల వేదికగా శనివారం టాస్ ఓడిన అఫ్గాన్.. బంగ్లా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ల శుభారంభం.. ఆ తర్వాత ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 47, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరు అవుటైన తర్వాత ఆఫ్గన్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. బంగ్లాదేశ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పెవిలియన్‌కు క్యూ కట్టారు ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా 18, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది 18, నజీబుల్లా జద్రాన్ 5, మహ్మద్ నబీ 6, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22, రషీద్ ఖాన్ 9, ముజీబ్ ఉర్ రహమాన్ 1 పరుగు తీయగా.. నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారుకీ డకౌట్లుగా వెనుదిరిగారు. షోరిఫుల్ ఇస్లాం.. నవీన్‌ను బౌల్డ్ చేయడంతో ఆఫ్గన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 156 పరుగులకే హష్మతుల్లా బృందం చాపచుట్టేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం గమనార్హం. ఇక బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు 3, మెహిదీ హసన్ మిరాజ్‌కు 3 వికెట్లు దక్కగా.. పేసర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒకటి, షోరిఫుల్ ఇస్లాం 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. వరల్డ్‌కప్ టోర్నీలో అఫ్గన్‌తో మ్యాచ్ అంటే షకీబ్ తగ్గేదేలే! ధర్మశాలలో అఫ్గనిస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గతంలో 2015, 2019 ప్రపంచకప్ ఈవెంట్లలో కాన్బెర్రా, సౌతాంప్టన్ మ్యాచ్‌లలో అఫ్గన్‌పై వరుసగా 2/43, 5/29 బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. ఈ క్రమంలో అఫ్గన్‌పై ఐసీసీ ఈవెంట్లో రెండోసారి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దూరం.. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్! -
నదుల గురించి మాట్లాడావా? పాపం.. షకీబ్! పుండు మీద కారం చల్లినట్లు ఏంటది?
ICC Mens T20 World Cup 2022- India vs Bangladesh: టీమిండియా విధించిన భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదిస్తుందా? లిటన్ దాస్ జోరు చూస్తుంటే అది ఖాయంగానే కనిపించింది.. ఇంతలో వరణుడు సీన్లోకి వచ్చేశాడు.. ఇరు జట్లు, అభిమానుల్లో టెన్షన్ టెన్షన్... అయితే, అప్పటికే డక్‌వర్త్ లూయీస్ మెథడ్ ప్రకారం 17 పరుగులతో ముందంజలో ఉన్న బంగ్లా శిబిరంలో సంతోషం.. కాసేపటికి వర్షం ఆగింది.. ఆట మొదలైంది.. 16 ఓవర్లలో 151 పరుగుల సమీకరణం.. 54 బంతుల్లో 85 పరుగులు చేయాలి.. అప్పటికింకా ఒక్క వికెట్ కూడా పడకపోవడంతో గెలుపుపై షకీబ్ అల్ హసన్ బృందం ధీమా.. కానీ లిటన్ దాస్ రనౌట్‌తో సీన్ రివర్స్.. అయినా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకురాగలిగింది.. అయితే, భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒత్తిడిని జయించి నూరుల్ హసన్‌ను కట్టడి చేయడంతో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య చేదు అనుభవాన్ని మూటగట్టుకున్న బంగ్లాదేశ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అంపైర్లతో నదుల గురించి మాట్లాడావా షకీబ్! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు ఓ రిపోర్టర్ సంధించిన ప్రశ్నలు.. అందుకు అతడు స్పందించిన విధానం ఆసక్తికరంగా మారింది. ఆ సంభాషణ ఇలా సాగింది. రిపోర్టర్: ‘‘బ్యాడ్‌లక్ షకీబ్.. వర్షం ఆగిన తర్వాత మీరు బ్యాటింగ్ చేయాలని అనుకోలేదా? అంపైర్‌తో మీరు ఏం చర్చించారు? షకీబ్ అల్ హసన్: ‘‘అంతకంటే మాకు వేరే ఆప్షన్ ఉందా?’’ రిపోర్టర్: ‘‘అవును.. వేరే ఆప్షన్ ఏమీ లేదు. కానీ వాళ్లను కన్విన్స్ చేయాలని ప్రయత్నించారా?’’ షకీబ్: ‘‘ఎవరిని?’’ రిపోర్టర్: ‘‘అంపైర్, రోహిత్ శర్మను’’ షకీబ్: ‘‘నాకు అంపైర్‌ను కన్విన్స్ చేయగల స్థాయి ఉందంటారా?’’ ఏంటీ? రిపోర్టర్: ‘‘మరి అంపైర్‌తో మీరేం మాట్లాడారు? బంగ్లాదేశ్‌లో ఉన్న నదుల గురించి చర్చించారా?’’ షకీబ్: ‘‘ఏంటీ?’’ రిపోర్టర్: ‘‘బంగ్లాదేశ్‌లో ఉన్న నదులు.. దేశ అభివృద్ధిలో వాటి పాత్ర గురించి మాట్లాడారా అంటున్నా.. దయచేసి మీరు అంపైర్‌తో ఏం మాట్లాడారో వివరించగలరా?’’ షకీబ్: ‘‘అవునా.. ఇప్పుడు మీరు సరైన ప్రశ్నే అడిగారు.. అంపైర్ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచాడు. టార్గెట్ ఎంత? రూల్స్ ఏమిటి? అన్న విషయాల గురించి చెప్పారు’’ అవును రిపోర్టర్: ‘‘వాటికి మీరు అంగీకరించారా’’ షకీబ్: ‘‘అవును’’ రిపోర్టర్: ‘‘బ్యూటిఫుల్.. థాంక్యూ’’. పుండుమీద కారం చల్లినట్లుగా వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘పుండుమీద కారం చల్లినట్లుగా.. పాపం.. అసలే ఓడిన బాధలో ఉన్న షకీబ్‌ను ఆ రిపోర్టర్ ఎవరో బాగా ఆడుకున్నట్టున్నాడుగా..’’ అని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అసలే టీమిండియా.. అయినా బెదరలేదు.. ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగారు.. వర్షం లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా! ఏదేమైనా ఆటలో గెలుపోటములు సహజమే’’ అంటూ షకీబ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: T20 WC 2022: అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? T20 WC 2022: షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత.. ప్రపంచ రికార్డు సమం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత.. ప్రపంచ రికార్డు సమం
అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా న్యూజిలాండ్ పేసర్ సౌథీ(127) పేరిట రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్.. ఈ అరుదైన రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు 101 ఇన్నింగ్స్‌లలో సౌథీ 127 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ 106 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇక రెండో స్థానంలో ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 121 వికెట్లతో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను బంగ్లాదేశ్ సంక్లిష్టం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్ తమ అఖరి మ్యాచ్‌లో నవంబర్ 6న పాకిస్తాన్‌తో తలపడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు -
రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(71) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అఫీఫ్ హుస్సేన్(29), షకీబ్ ఆల్ హసన్(23) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, ముజారబానీ తలా రెండు వికెట్లు సాధించగా.. రజా, విలియమ్స్ చెరో వికెట్ సాధించారు. ముఖ్యంగా బంగ్లా ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన నగరవా.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. చదవండి: T20 WC 2022: దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లి -
T20 WC BAN vs NED: నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Bangladesh vs Netherlands- Updates: సూపర్-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 135 పరుగులకే ఆలౌటౌంది. బంగ్లా బౌలర్ టాస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లతో డచ్ పతానన్ని శాసించగా.. హసన్ మహ్మద్ రెండు, షకీబ్, సర్కార్ తలా ఒక్క వికెట్ సాధించారు. డచ్ బ్యాటర్లలో కోలిన్ అకెర్మాన్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 38, షాంటో 25 పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 59 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్.. షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు 15 పరుగులకే నాలుగు వికెట్లు 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్కిన్ ఆహ్మద్.. వరుసగా వి సింగ్,బాస్ డి లీడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాణించిన నెదర్లాండ్స్ బౌలర్లు.. టార్గెట్ 145 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు. 19 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 139/8 వరుస క్రమంలో బంగ్లాదేశ్ రెండు వికెట్లను కోల్పోయింది. 19 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 139/8 ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 121 పరుగులు వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నూరల్ హసన్.. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 110/5 16 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అఫిఫ్ హొసేన్, నూరుల్ హసన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. 11వ ఓవర్ ముగిసే సరికి 76 పరుగులకే 5 వికెట్లు బంగ్లా కష్టాల్లో పడిపోయింది. అఫిఫ్ హొసేన్, నూరుల్ హసన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 47 పరుగులు వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హొస్సేన్ శాంటో.. ప్రింగిల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 43 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్కార్.. పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 35/0 4 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో నజ్ముల్ హొస్సేన్ శాంటో(15), సౌమ్య సర్కార్(13) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ సూపర్-12(గ్రూప్-2)లో భాగంగా హోబర్ట్ వేదికగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు: నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్ చదవండి: T20 World Cup 2022: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా -
టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఔట్ చేసిన సౌథీ... ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 101 మ్యాచ్‌లు ఆడిన సౌథీ.. మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ ఘనత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ పేరిట ఉండేది. షకీబ్ ఇప్పటి వరకు 104 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో సౌథీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్‌గా నాథన్ మెక్ కల్లమ్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు 337 మ్యాచ్‌లు ఆడిన సౌథీ.. 669 వికెట్లు సాధించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Devon Conway: కాన్వే అరుదైన ఘనత.. బాబర్‌తో కలిసి సంయుక్తంగా -
యూఏఈతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్! కెప్టెన్ దూరం!
యూఏఈతో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ దూరం కావడంతో వికెట్ కీపర్ నూరల్ హాసన్ సారధిగా ఎంపికయ్యాడు. కాగా షకీబ్ ఆల్ హాసన్ ప్రస్తుతం కరీబియన్ లీగ్‌లో భాగం కావడంతో ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇక యవ స్పిన్నర్ రషీద్ హోస్సెన్ తొలి సారిగా బంగ్లా సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అదే విధంగా గత కొంత కాలం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్ తిరిగి ఈ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా బంగ్లా జట్టు రెండు టీ20ల సిరీస్ నిమిత్తం యూఏఈ పర్యటనకు వెళ్లనుంది. సెప్టెంబర్ 25న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసియాకప్-2022లో బంగ్లా జట్టు ఘోరంగా విఫలమైంది. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్ జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), సబ్బీర్ రెహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్, నజ్మ్ మహ్ముద్, నజ్ మహ్మద్, హసన్ మహ్ముద్స్ షోరిఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్, రిషద్ హొస్సేన్ చదవండి: Dinesh Karthik: 'అవమానించాలని కాదు.. అసలు దినేశ్ కార్తిక్ రోల్ ఏంటి?' -
Asia cup 2022: బంగ్లాదేశ్ అవుట్! ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్!
ఆసియాకప్-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించిగా.. బంగ్లాదేశ్ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. #BANVSSL #SLvBAN emotions pic.twitter.com/j0zUbBojz9 — Wasif (@Wasif_93) September 1, 2022 చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
ఇబాదత్ హొస్సేన్ అరుదైన ఫీట్.. తొలి బంగ్లాదేశ్ పేసర్‌గా! చెత్త ప్రదర్శన కూడా!
బంగ్లాదేశ్ యువ పేసర్ ఇబాదత్ హొస్సేన్ తన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ పేస్ బౌలర్‌గా ఇబాదత్ హొస్సేన్ రికార్డులకెక్కాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇబాదత్ మూడు వికెట్టు సాధించినప్పటికీ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అఖరి రెండు ఓవర్లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. చివరి 2 ఓవర్లలో శ్రీలంక విజయానికి 25 పరుగులు కావల్సిన నేపథ్యంలో 19వ ఓవర్ వేసిన ఇబాదత్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. ఇక అఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమవ్వగా.. శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కాగా శ్రీలంక సూపర్-4కు ఆర్హత సాధించగా.. బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టింది. చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
శ్రీలంకతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్‌కు గుడ్ న్యూస్..!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మే 15న ఛటోగ్రామ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మే9 న అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత షకీబ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐషోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతడికి తాజాగా నిర్వహించిన పరీక్షలలో నెగిటివ్‌గా తేలింది. ఇక షకీబ్ చివర సారిగా 2021లో పాకిస్తాన్‌పై ఆడాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు వ్యక్తిగత కారణాలతో షకీబ్ దూరమయ్యాడు. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్ ఖాన్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహెదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్ చౌద్యుల్, ఎబాడోత్ హుస్సేన్ చౌదుల్, హసన్ సోహన్, రెజౌర్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం చదవండి: Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్
శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన పేసర్ షోరిఫుల్ ఇస్లాం తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు చోటు దక్కింది. స్వదేశంలో శ్రీలంకతో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్, ఎబాడోత్ హుస్సేన్, సయ్యద్ ఎన్ ఖజావుర్, సయ్యద్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం చదవండి: Rajesh Verma: గుండెపోటుతో ముంబై మాజీ పేసర్ మృతి -
Shakib Al Hasan: నీటిలో ఫీల్డింగ్ చేసిన షకీబ్ అల్ హసన్.. వీడియో వైరల్..
ఢాకా: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. వానతో రెండో రోజు కేవలం 6.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 161/2తో ఆదివారం ఆటను కొనసాగించిన పాకిస్తాన్ వర్షంతో ఆటను నిలిపి వేసే సమయానికి 63.2 ఓవర్లలో రెండు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ అజహర్ అలీ (52 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతడికి తోడుగా కెప్టెన్ బాబర్ ఆజమ్ (71 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... తొలి టెస్టులో నెగ్గిన పాకిస్తాన్ సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. ఆదివారం ఇక ఆట సాధ్యంకాదని అంపైర్లు ప్రకటించాక... మైదానంలో కప్పి ఉంచిన కవర్లపై ఉన్న నీటిలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సరదాగా డైవ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs NZ: ఏంటి అశ్విన్.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్ అనుకున్నావా.. Excitement when the play is officially called off for the day @Sah75official 😂🏏 #BANvPAK pic.twitter.com/4ewyRqM23u — Sikandar Bakht (@ImSikandarB) December 5, 2021 -
పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్...
Shakib Al Hasan set to miss Pakistan T20Is due to hamstring injury: పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. నవంబర్19న మీర్పూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా మెకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ మద్య నుంచి షకీబ్ అల్ హసన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నమెంట్లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరించింది. రెండు సార్లు 100 పరుగుల లోపు ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. చదవండి: Jasprit Bumrah: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా... -
T20 World Cup 2021: స్టార్ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే
ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న తమీమ్‌ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా ఇక స్టాండ్ బై ప్లేయర్స్‌గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్‌పై ట20 సిరీస్‌ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ టీ 20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్ స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్ Bangladesh have announced their 15-member squad for the ICC Men’s #T20WorldCup 2021! 🚨 All you need to know 👇 — ICC (@ICC) September 9, 2021 -
మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే!
Shakib Al Hasan All Time Best ODI XI ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు, పాక్ మాజీ ఆటగాడు సయ్యద్ అన్వర్‌కి ఓపెనర్లుగా చోటు ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంస ఆటగాడు క్రిస్ గేల్‌కు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ గా షకీబ్ చేర్చాడు. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌ని ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా షకీబ్ ఎంచుకున్నాడు . భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. తన టీమ్‌లో తనకి ఆల్‌రౌండర్‌గా తనకి కూడా షకీబ్ చోటు కల్పించాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి తన టీమ్‌లో మరో స్పిన్నర్‌గా షకీబ్ చోటు ఇచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌కి తన టీమ్‌లో మూడో స్పిన్నర్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు . ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను తన టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎంచుకున్నాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌కి షకీబ్ అల్ హసన్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా చోటు దక్కింది... షకీబ్ అల్ హసన్ ఆల్ టైమ్ వన్డే XI ఇదే: సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్ చదవండి: Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా -
బంగ్లా ఆల్‌రౌండర్ ఖాతాలో అరుదైన రికార్డు
ఢాకా: అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. సోమవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో షకీబ్.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే దేశంలో 6 వేలకుపైగా పరుగులు, 300కుపైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అతను స్వదేశంలో ఆడిన మ్యాచ్‌ల్లో(టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) ఈ ఘనతను సాధించాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 51 పరుగులు చేసిన షకీబ్.. ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. గతంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. స్వదేశంలో 4 వేలకుపైగా పరుగులు, 300కుపైగా వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా 340 మ్యాచ్‌లు(56 టెస్టులు, 208 వన్డేలు, 76 టీ20లు) ఆడిన షకీబ్.. దాదాపు 12 వేల పరుగులు, 568 వికెట్లును సాధించి, ప్రపంచంలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. బుకీలతో సంప్రదింపులు జరిపాడన్న కారణంగా ఏడాది పాటు నిషేదానికి గురైన షకీబ్.. ప్రస్తుత విండీస్ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. 2006లో బంగ్లాదేశ్ తరపున అరంగేట్రం చేసిన షకీబ్.. 2019 ప్రపంచ కప్‌లో ఆ జట్టు సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
నన్ను అవమానించారు.. లేదు మనోజ్!
కోల్‌కతా: ఎనిమిదేళ్ల క్రితానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ఐపీఎల్-12 ట్రోఫీని కేకేఆర్ ముద్దాడి నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి నైట్‌రైడర్స్ మనసును తాకిన రాత్రి. తొలిసారి అందుకున్న ట్రోఫీ ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరి మీ జ్ఞాపకాలేంటి?’ అని ప్రశ్నిస్తూ మాజీ సారథి గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెకల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్‌లీలను కేకేఆర్ ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్‌పై కేకేఆర్‌కు చెందిన అప్పటి ఆటగాడు మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అందరితో పాటు.. ఆ రోజుతో నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఈ ట్వీట్లో నన్ను, షకీబుల్‌హసన్‌ను ట్యాగ్ చేయకపోవడం మమల్ని అవమానించినట్టే. మా పేర్లను మరిచిపోవడం నాకు బాధను కలిగించింది’ అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై స్పందించిన కేకేఆర్ ‘అలా కాదు మనోజ్.. నీలాంటి స్పెషలిస్టు ప్లేయర్‌ను మేమెలా మర్చిపోతాం. ఐపీఎల్-2012 ట్రోఫీని కేకేఆర్ గెలుచుకోవడంలో నువ్ కీలక పాత్ర పోషించావు, నువ్వే మా హీరోవి’ అంటూ బదులిచ్చింది. (మురళీ విజయ్ హీరో అయిన వేళ!) ఇక ఐపీఎల్-2012లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని తొలిసారి ట్రోఫీని అందుకుంది. నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్లో మనోజ్ 15 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులతో రాణించాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగిన వేలంలో మనోజ్ తివారీ ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చినా ఎవరూ ఆసక్తికనబర్చకపోవడం గమనార్హం. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) Yes I, along with others have too many memories, emotions and that will remain forever but after seeing this tweet where u all forgot to mention n tag me and @Sah75official is insulting and this mrng tweet of urs will remain close to every knight Rider’s 💓 #disappointed https://t.co/FF53pqP1pE — MANOJ TIWARY (@tiwarymanoj) May 27, 2020 No way, Manoj 🙂 We would never miss tagging such a special 'knight' to our special night. You were, and always be a hero of that 2012 victory 💜 pic.twitter.com/0D0KgUDeGq — KolkataKnightRiders (@KKRiders) May 27, 2020 -
పాక్ గెలిచింది కానీ..!
లండన్ : అద్భుతాలేమీ జరగలేదు. అనుకున్నదే జరిగింది. 1992 ప్రపంచకప్ ఫలితాన్ని పునరావృతం చేయాలనుకున్న పాకిస్తాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిబాటపట్టింది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి అల్ప సంతోషంతోనే ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో పాక్ జయభేరి మోగించింది. పాక్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్ ఆటగాడు షకీబుల్ (64; 77 బంతుల్లో 6ఫోర్లు) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బంగ్లా పతనాన్ని శాసించిన షాహిన్ ఆఫ్రిది (6/35)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అంతకుముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(100: 100 బంతుల్లో 7ఫోర్లు) సెంచరీకి తోడు బాబర్ అజామ్ (96: 98 బంతుల్లో 11ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు చేసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్(5/75) టోర్నీలో వరుసగా రెండోసారి ఐదు వికెట్లతో చెలరేగాడు. అదరగొట్టిన ఇమామ్–బాబర్ జోడీ.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫకార్ జమాన్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ దశలో ఇమామ్–బాబర్ జోడీ రెండో వికెట్‌కు 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఒక దశలో జట్టు స్కోరు 350 దాటుతుందని అనిపించినా మిడిలార్డర్ వైఫల్యం పాక్‌ను దెబ్బతీసింది. తొలుత సెంచరీకి చేరువగా వచ్చిన బాబర్.. సైఫుద్దీన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే సెంచరీ పూర్తిచేసుకున్న ఇమామ్ ఆ వెంటనే హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. హఫీజ్(27), హారిస్ సొహైల్(6), రియాజ్(2), షాదాబ్(1), ఆమిర్(8) వెంట వెంటనే ఔటయ్యారు. ఆఖర్లో ఇమాద్ వసీం(43: 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో పాక్ స్కోరు 300 దాటింది. సర్ఫరాజ్(3), షహీన్ అఫ్రిది(0) అజేయంగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్ 3, మెహిదీ హసన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. -
బంగ్లాపై పంజా విసిరిన ఇంగ్లండ్
కార్డిఫ్ : పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఇంగ్లండ్.. సంచలనాల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా విరుచుకుపడింది. దీంతో బంగ్లా 106 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించింది. తొలుత జేసన్ రాయ్ (153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం షకీబుల్ హసన్(121; 119 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్సర్)వీరోచితంగా పోరాడినప్పటికీ బంగ్లాకు విజయాన్ని అందించలేకపోయాడు. షకీబ్ మినహా ఏవరూ రాణించకపోవడంతో బంగ్లా 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారీ శతకంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. ఆర్చర బౌలింగ్‌లో సౌమ్య సర్కార్(2) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం తమీమ్(19) తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు షకీబ్, రహీమ్‌లు మరోసారి బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆది నుంచి షకీబ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. రహీమ్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో రహీమ్(44) వెనుదిరుగుతాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో ఎనిమిదో శతకం సాధించాడు. అనంతరం స్కోర్ పెంచే క్రమంలో షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి లాంఛనమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్ లభించింది. -
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ అద్భుత విజయం
-
దక్షిణాఫ్రికాకు షాక్.. బంగ్లా ఘనవిజయం
లండన్: ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. డుప్లెసిస్ సేన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభావం మరిచిపోకముందే బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన బంగ్లా తొలి మ్యాచ్‌లోనే సఫారీ జట్టును బొల్తా కొట్టించి ఆగ్రశ్రేణిజట్లకు హెచ్చరికలు జారీ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్ హసన్(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ముష్పికర్ రహీమ్(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో బంగ్లాదేశ్ ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో మోరిస్, తాహీర్, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులకే పరిమితమైంది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమిని రెండో ఖాతాలో పడింది. ఆది నుంచి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వని బంగ్లా బౌలర్లు సఫారీ ఆటగాళ్లను కట్టడి చేశారు. వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తు ఒత్తిడి పెంచారు. అయితే సఫారీ ఆటగాళ్లలో డుప్లెసిస్(62) అర్దసెంచరీతో రాణించాడు. మక్రామ్(45), డసన్(41), డుమినీ(45)లు విజయానికి కావాల్సిన పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో రాణించగా, సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టారు. -
బంగ్లాదేశ్ 259/5
ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో అరంగేట్ర ఆటగాడు షాద్మన్ ఇస్లాం (199 బంతుల్లో 76; 6 ఫోర్లు), కెప్టెన్ షకీబుల్ హసన్ (113 బంతుల్లో 55 బ్యాటింగ్; 1 ఫోర్) అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ గెలిచిన బంగ్లా ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ ఆడుతున్న షాద్మన్ చక్కటి సంయమనంతో ఆడాడు. తొలి వికెట్‌కు సౌమ్య సర్కార్ (19)తో కలిసి 42, రెండో వికెట్‌కు మోమినుల్ హఖ్ (29)తో 45, మూడో వికెట్‌కు మొహమ్మద్ మిథున్ (29)తో 64 పరుగులు జతచేశాడు. అనంతరం షాద్మన్, ముష్ఫికర్ (14) ఔటైనా... చివర్లో షకీబ్ ఆకట్టుకున్నాడు. మహ్ముదుల్లా (31 బ్యాటింగ్)తో కలిసి అతను ఆరో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జతచేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ 2, రోచ్, లెవిస్, చేజ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ముష్ఫికర్...తమీమ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బంగ్లా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. -
బంగ్లాదేశ్‌దే సిరీస్
ఫ్లోరిడా : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 17.1 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 19 పరుగుల తేడాతో బంగ్లాదే విజయమని ప్రకటించారు. దీంతో వరుసగా రెండు టీ20లను గెలుచుకున్న బంగ్లా.. సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ వరించగా.. ఓపెనర్ లిటన్ దాస్(61:32బంతులు: 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకోవడం గమనార్హం.