sholapur
-
తిరుగు లేదనుకుంటే.. తిప్పిపంపారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. తమకు మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలలో విజయం ఖాయమని భావించి బరిలోకి దిగిన మహామహులు పరాజయభారాన్ని మోయక తప్పలేదు. తమకు తిరుగులేదని, ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కొందరు విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు ఊహించని విధంగా తీర్పునివ్వడంతో వారంతా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తథ్యమనుకుని బరిలో దిగి ఓటమిని చవిచూసిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.సోలాపూర్ నార్త్‌సిటీ.. బీజేపీదే ఐదోసారీసోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ఘనవిజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ తరపున కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించినప్పటికీ తన ప్రత్యర్థి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి మహేష్ కోటేపై మాభైఒక్కవేల ఎనభైఎనిమిది ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన అభ్యర్థిగా విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు.బీజేపీ, మహాయుతి కూటమి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారని, ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. అన్ని వర్గాల మద్దతు వల్లే తన గెలుపు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మహాయుతి కూటమి పదాధికారులు, కార్యకర్తలు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు పేలుస్తూ గులాల్ జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.వర్లీలో ఆదిత్య ఠాక్రే ఘనవిజయం ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో మొదటిసారిగా పోటీ చేసిన గెలిచిన ఆదిత్య ఈసారీ విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఈఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేయగా, శివసేన (శిందే) నుంచి మిలింద్ దేవ్రా ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) నుంచి సందీప్ దేశ్‌పాండే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వర్లీలో ఆదిత్య ఠాక్రే విజయం కోసం స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. చివరకు 8,801 ఓట్ల మెజారీ్టతో ఆదిత్య ఠాక్రే తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించారు.భివండీ రూరల్‌లో శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం భివండీ: భివండీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహాయుతి కూటమి శివసేన (శిందే) అభ్యర్థి శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. మహావికాస్ ఆఘాడీ కూటమి శివసేన(యూబీటీ) అభ్యర్థి మహాదేవ్ ఘటల్పై 57,962 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చదవండి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలుహోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో శాంతారామ్ మోరే 1,27,205 ఓట్లతో మొదటిస్థానంలో, మహాదేవ్ ఘటాల్ 69,243 ఓట్లతో రెండోస్థానంలో, జిజావు సంస్థ స్వతంత్ర అభ్యర్థి మనీషా ఠాక్రే 24,304 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి ఈసారి కేవలం 13, 816 ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నారు. -
షోలాపూర్ సీటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్‌ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా. .. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
‘వధువు కావలెను’.. పెళ్లి బట్టలతో రోడ్డెక్కి నిరసనలు
ముంబై: లింగ నిష్పత్తి బేధాలు.. చాలా దేశాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో ఏకంగా జనాభా తగ్గిపోతున్న దేశాలనూ చూస్తున్నాం. కడుపులో ఉండగానే.. ఆడ బిడ్డగా నిర్ధారించుకుని చిదిమేయడం, ఇతర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది, ఈ క్రమంలో.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ కొందరు యువకులు రోడ్డెక్కిన ఘటన మన దేశంలోనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో పెళ్లీడుకొచ్చిన యువకులు.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ వాపోతున్నారు. వయసు మీద పడుతుండడంతో తమకు పెళ్లి కూతుళ్లు దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. పెళ్లికాని ప్రసాదులంతా రోడ్ల మీద పరేడ్ నిర్వహించారు. అదీ వినూత్నంగా.. పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్ మేళంతో మరికొందరు.. తమకు వధువులు కావాలంటూ డిమాండ్ వినిపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలో మగ-ఆడ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం అమలయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) వినతి పత్రం సమర్పించారు. వీళ్లంతా బ్రైడ్‌గ్రూమ్(వరుడి) మోర్చా పేరిట ఏర్పాటు చేసిన ఓ సంఘంలోని సభ్యులు. ‘‘మమ్మల్ని చూసి నవ్వుకున్నా ఫర్వాలేదు. కానీ, పెళ్లీడు వచ్చినా.. చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదు. వయసు మీద పడుతోంది. ఇదంతా రాష్ట్రంలో పురుష-స్త్రీ లింగ నిష్పత్తి రేటు పడిపోవడం వల్లే’’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేశ్ బరాస్కర్ తెలిపారు. మహారాష్ట్రలో పురుష-స్త్రీ నిష్పత్తి రేటు 1000 మందికి 889 మందిగా ఉంది. భ్రూణ హత్యలు.. అసమానతల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని పలువురు యువకులు కోరుతున్నారు. ये बारात नहीं प्रदर्शन है...जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw — Zee News (@ZeeNews) December 22, 2022 ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ నిషేధ చట్టాలను పటిష్టం చేయాలని యువకులు కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే షోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలుకా అక్లుజ్‌లో ఒక యువకుడు.. కవలలైన అక్కాచెల్లెలను వివాహం చేసుకున్న ఘటన ఈమధ్యే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది కూడా. Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t — Siraj Noorani (@sirajnoorani) December 4, 2022 -
ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో..
షోలాపూర్: కరోనా రెండో వేవ్ సమయంలో రాష్ట్రానికి 300 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి షోలాపూర్ జిల్లా కరమాల తాలూకా విటూ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కాకడే వీరాభిమానిగా మారాడు. వైఎస్ జగన్ స్ఫూర్తితో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రీ బ్యాంక్ స్థాపించి షోలాపూర్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటికే తమ చుట్టుపక్కలున్న 18 గ్రామాల్లో 4,700 మొక్కలు నాటాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ కాకడే పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వు, సాదాసీదా దుస్తులతో ఉండే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సేవలకు తాను ఆకర్శితుడినయ్యానని చెప్పారు. ట్రీ బ్యాంకు ద్వారా కరమాల తాలూకాలో ఉన్న 118 గ్రామాల్లోని పాఠశాలల ఆవరణల్లో పండ్ల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు తెలిపారు. ఒక్కో పాఠశాల పరిధిలో 25–30 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజున హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు వెళ్లి, ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు పదిహేను రోజుల ముందే ఇక్కడి నుంచి సైకిల్‌పై బయలుదేరతానని పేర్కొన్నారు. తాను ఏమీ ఆశించకుండానే వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయన తనను వెన్ను తట్టి వెల్డన్ అంటే చాలని, తన జీవితం ధన్యమవుతుందని అన్నారు. -
21వ శతాబ్దపు పౌరులకు టీచర్‌ను!
రంజిత్ సిన్హ్ దిశాలె...ఇంజనీర్ కాలేకపోయిన ఒక ఉపాధ్యాయుడు. విద్యాబోధనలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు. పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేశారు. విద్యార్థుల మాతృభాషలో వీడియోలు, ఆడియోలు తెచ్చారు... బాలికల హాజరును నూరు శాతానికి పెంచారు. ఈ పద్ధతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఆ తర్వాత... కేంద్రప్రభుత్వం కూడా. ఈ సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సిన్హ్... గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్నారు. మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లా, పరేటి వాడీ అనే చిన్న గ్రామం. అందులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల లో ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిశాలె. ఆయన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 పురస్కారానికి ఎంపికయ్యారు. 140 దేశాల నుంచి వచ్చిన పన్నెండు వేల ఎంట్రీలలో రంజిత్ విజేతగా నిలిచారు. గురువారం నాడు లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ నటుడు, ప్రసారకర్త స్టీఫెన్ ఫ్రై అవార్డు ప్రకటించిన వెంటనే రంజిత్ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. విద్యాబోధనలో సాంకేతికతను జోడించి విద్యార్థులను మంచి విద్యనందించిందుకు గాను రంజిత్‌కి ఈ గౌరవం లభించింది. బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది! అతడు పని చేసే పాఠశాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండేది. వాళ్లను బడికి రప్పించాలంటే పాఠాలతో వాళ్లను అలరించడమే మార్గం అనుకున్నారాయన. పాఠాలను దృశ్య, శ్రవణ విధానంలో రికార్డు చేశారు. పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించడం ద్వారా పిల్లలందరికీ పాఠాలు చేరేటట్లు చేశారు. దాంతో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎనభై ఐదు శాతం మంది ‘ఏ’ గ్రేడ్‌లో పాసయ్యారు. రెండు శాతం ఉన్న బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఇప్పుడు బాల్య వివాహాల్లేవు. రంజిత్ సాధించిన ప్రగతిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రం మొత్తం క్యూఆర్ కోడ్ సాంకేతికతను దత్తత చేసుకుంది. ఆ తర్వాత భారత విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) ద్వారా ఈ విధానాన్ని అవలంబించింది. ఈ సాంకేతిక విప్లవం ఇంతటితో ఆగిపోలేదు. దేశం సరిహద్దులు దాటింది. పాకిస్థాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యూఎస్, నార్త్ కొరియా కూడా అనుసరించాయి. మొత్తం 19 వేల మంది విద్యార్థులను అనుసంధానం చేశారు రంజిత్ సిన్హ్. ఆయన అందుకుంటున్న గ్లోబల్ టీచర్ ప్రైజ్ వెనుక ఇంతటి కఠోరదీక్ష ఉంది, అంతకు మించిన అంకిత భావమూ ఉంది. (చదవండి: ట్రావెలింగ్ టీచర్) మార్చే శక్తి టీచర్దే! ‘‘రంజిత్ సింగ్ వంటి ఉపాధ్యాయులు ఉంటే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది. మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది’’ అని యునెస్కో విద్యావిభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా గియాన్ని ప్రశంసించారు. రంజిత్ మాత్రం... ‘‘ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విద్యారంగాన్ని కూడా కుదిపేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని నూటికి నూరుశాతం నిర్వర్తించారు. విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన విద్యాహక్కును సమర్థంగా అందించారు. కరోనా పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపకుండా కాపాడగలిగారు’’ అన్నారు. ఈ సందర్భంగా రంజిత్ సిన్హ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఇరవయ్యో శతాబ్దపు ఉపాధ్యాయుడిని, నేను బోధిస్తున్నది 21వ శతాబ్దపు పౌరులకు. మనం పాఠాలు చెప్పే విధానం కూడా మారాలి. సిలబస్ పందొమ్మిదవ శతాబ్దంలో, సాంకేతిక విధానం 18వ శతాబ్దంలోనే ఉండిపోయింది. అలా ఉండిపోకూడదు. అందుకే కొత్త సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నాను’’ అన్నారు. అందరూ విజేతలే! ఈ ఎంపిక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన పదిమందిలో రంజిత్ విజేత... కాగా మిగిలిన తొమ్మిది మంది కూడా తక్కువవారేమీ కాదు. అంకితభావంతో పని చేసిన వారేనంటూ... వర్కీ ఫౌండేషన్ చేంజ్ డాట్ ఓఆర్జీ ఇచ్చే బహుమతిలో సగం డబ్బును మిగిలిన తొమ్మిదిమందికీ పంచుతున్నట్లు ప్రకటించారు రంజిత్. అలాగే తన సగభాగం డబ్బును మూలనిధిగా ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా మారుస్తానని కూడా చెప్పారు. ఈ నిర్ణయంతో రంజిత్ మరోసారి ప్రపంచం ప్రశంసలు అందుకున్నారు. ఈ పురస్కారానికి నగదు బహుమతి పది లక్షలు డాలర్లు (ఏడుకోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా). అందులో సగం అంటే ఐదు లక్షల డాలర్లను తొమ్మిది మందికి ఒక్కొక్కరికీ యాభై ఐదు వేల డాలర్ల చొప్పున పంచుతారు. ఇంతకు ముందు... రంజిత్ సిన్హ్ దిశాలె 2016లో కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇన్నోవేటివ్ రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు అందుకున్నారు. 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్స్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2019లో గ్లోబల్ పీస్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌తోపాటు పారిస్‌లో మైక్రోసాఫ్ట్స్ ఎడ్యుకేషన్ ఎక్సేంజ్ ఈవెంట్లో పురస్కారాన్ని అందుకున్నారు. -
కరోనా అంతమవ్వాలని ప్రార్థించా
షోలాపూర్: కరోనా రహిత సమాజాన్ని చూసే రోజు కోసం ప్రార్థించానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. గురువారం కార్తీకి ఏకాదశి సందర్భంగా షోలాపూర్ జిల్లా పంధర్పూర్లోని విఠల్ ఆలయంలో అజిత్ పవార్ ఆయన భార్య సునేత్రతో కలిసి ‘మహా పూజ’ను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, ప్రపంచం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందే రోజు దగ్గర్లోనే ఉందని పవార్ అన్నారు. మహారాష్ట్రలో ఈ మధ్యకాలంలో వైరస్ అదుపులో ఉన్నట్లు అనిపించిందని అయితే గత కొన్ని రోజులుగా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 26/11 ముంబై ఉగ్ర దాడిలోని అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. "మహారాష్ట్ర మన అమరవీరుల త్యాగాలను, సాహసాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. మనముందున్న గడ్డు కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే ఈ మహమ్మారిని అంతం చేయగలమ’ని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు మహారాష్ట్రలో ఉండగా, తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 6,159 కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య17,95,959కు చేరింది. ఒక్క ముంబై మహానగంలోనే 2,78,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
షోలాపూర్ టు తెలంగాణ.. 68 మంది యువతులు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా మహారాష్ట్రలోని షోలాపూర్‌లో చిక్కుకుపోయిన 68 మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో బుధవారం స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 68 మంది యువతులు షోలాపూర్‌లోని ఓ వ్యవసాయ కేంద్రంలో శిక్షణ కోసం వెళ్లారు. లాక్డౌన్ ప్రారంభం కావడం తో వారికి అక్కడ ఒక ప్రైవేటు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. అయితే ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం, పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి సమస్యను యువతుల కుటుంబసభ్యులు ఒకరు ట్విట్టర్ ద్వారా కవిత దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆమె వారి కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించి, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని స్వస్థలాలకు చేరేలా సాయం అందించారు. ఈ సందర్భంగా యువతుల తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. స్వస్థలాలకు చేరుకున్న యువతులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. -
దారుణ హత్య: సీరియల్ సన్నివేశాలే స్ఫూర్తి
సాక్షి, ముంబై : దినసరి కూలీ అయిన అతగాడు నాలుగేళ్ల క్రితం మరికొందరితో కలిసి దోపిడీకి ఒడిగట్టాడు. విచారణ తుది దశలో ఉన్న ఈ కేసులో అతడికి శిక్ష పడటం దాదాపు ఖరారైంది. దీంతో తన మాదిరిగానే ఉన్న ఓ వ్యక్తిని హతమార్చిన నిందితుడు తన వస్తువుల్ని శవం వద్ద ఉంచి పరారయ్యాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగాయ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అక్కడ పోలీసులు గురువారం నగరంలో పట్టుకున్నారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ సహకారంతో సంతోష్‌నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడకు తరలించారు. మహారాష్ట్రలోని హంగార్గ్ ప్రాంతంలోని షోలాపూర్ రోడ్‌కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్ హాల్లో దినసరి కూలీగా పని చేసేవాడు. డబ్బును తేలిగ్గా సంపాదించే మార్గాల కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరితో కలిసి 2016లో దోపిడీకి పాల్పడ్డాడు. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఉద్యోగి తన సంస్థ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ. 3.2 లక్షలు తీసుకుని ఉడాయించారు. ఈ దోపిడీకి సంబంధించి అంబజోగాయ్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేరాన్ని సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు పగడ్బందీగా దర్యాప్తు చేసి అనేక సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. బీడ్ కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు శిక్ష పడుతుందని భావించిన రసూల్ దాన్ని తప్పించుకోవడానకి అనేక మార్గాలు అన్వేషించాడు. హత్య చేసి ముఖం ఛిద్రం అంబజోగాయ్ ప్రాంతానికే చెందిన అలీం ఇస్మాయిల్ షేక్‌తో ఇతడికి పరిచయం ఉంది. ఒడ్డు, పొడుగు తన మాదిరిగానే ఉండటంతో రసూల్‌కు ఓ ఆలోచన వచ్చింది. అలీంను చంపేసి తానే చనిపోయినట్లు నమ్మించాలని పథకం వేశాడు. ఈ నెల 17న మద్యం తాగుదామంటూ అలీంకు ఎర వేసిన రసూల్ అక్కడి రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పథకం ప్రకారం అలీం చేత ఎక్కువగా తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతడి తలపై బండరాయితో మోది హత్య చేసి ముఖం ఆనవాళ్లు చిక్కకుండా ఛిద్రం చేశాడు. తన వస్త్రాలను ఆ శవానికి కట్టి, తన సెల్‌ఫోన్, పర్సు ఇతర వస్తువుల్ని శవం వద్ద పడేశాడు. ఈ విషయం తన భార్యకు చెప్పి కొన్నాళ్లపాటు ఇతర ప్రాంతంలో తలదాచుకుంటానని ఇంటి నుంచి వచ్చేశాడు. నేరుగా అంబజోగాయ్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రసూల్ అక్కడ కనిపించిన తన పరిచయస్తుడి వద్ద సెల్‌ఫోన్ తీసుకుని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన పరిచయస్తుడికి కాల్ చేశాడు. తాను హైదరాబాద్ వస్తున్నానని, తనకో చిన్న ఉద్యోగం సైతం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. అతడు అంగీకరించడంతో రైలులో హైదరాబాద్‌కు చేరుకున్న రసూల్ రాజేంద్రనగర్ వెళ్లి అతగాడిని కలిశాడు. అతడి సిఫార్సుతో సంతోష్‌నగర్ పరిధిలోని రియాసత్‌నగర్ గ్రేవ్‌యార్డ్ సమీపంలోని షాన్‌బాగ్ ఫంక్షన్ హాల్లో పనికి చేరాడు. ఇదిలా ఉండగా... ఈ నెల 18న అంబజోగాయ్ పోలీసులకు అక్కడి రైల్వేస్టేషన్ సమీపంలో పడి ఉన్న శవానికి సంబంధించి సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు శవంపై ఉన్న వస్త్రాలు, వస్తువుల ఆధారంగా అది రసూల్దిగా భావించారు. అతడి భార్యను పిలిపించిన పోలీసులు శవాన్ని చూపించారు. విషయం ముందే తెలిసిన ఆమె అది తన భర్తదే అంటూ పోలీసులకు చెప్పింది. పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన అధికారులు శవాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో అంతా రసూల్ చనిపోయాడని భావించాడు. ఇది జరిగిన రెండు రోజులకు అలీ ఇస్మాయిల్ షేక్ కనిపించట్లేదంటూ అంబజోగాయ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి తోడు భర్తను కోల్పోయిన బాధ రసూల్ భార్యలో కనిపించకపోవడంతో అంబజోగాయ్ ఇన్స్పెక్టర్ హర్ష పోద్దార్‌కు అనుమానం వచ్చింది. ఆ శవం లభించింది రైల్వేస్టేషన్ సమీపంలో కావడంతో స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం అర్ధమైంది. దీంతో రైల్వేస్టేషన్లో రసూల్‌కు ఫోన్ ఇచ్చిన వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ రోజు రైల్వేస్టేషన్ నుంచి రసూల్ కాల్ చేసిన నంబర్ గుర్తించారు. అది హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలడంతో ఓ ప్రత్యేక టీమ్ బుధవారం సిటీకి చేరుకుంది. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తిని కలిసిన అధికారులు సహాయం కోరారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని టీమ్ రాజేంద్రనగర్‌లోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా గురువారం రియాసత్‌నగర్‌కు వెళ్లి రసూల్‌ను పట్టుకున్నారు. ఇతడిని అంబజోగాయ్ తరలించిన పోలీసులు శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపర్చగా న్యాయ స్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది. రసూల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా ఓ ప్రముఖ హిందీ చానల్లో వచ్చిన సీరియల్లోని సన్నివేశాలే తనకు స్ఫూర్తి ఇచ్చాయని, వాటిలో చూసినట్టే అలీంను చంపి తన స్థానంలో ఉంచానని బయటపెట్టాడు. ఇతడిని పట్టుకోవడానికి సహకరించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీమ్‌కు అంబజోగాయ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. -
షోలాపూర్ మేయర్‌గా తెలుగు మహిళ
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపాలిటీ మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రకాశ్ వాయ్‌చల్ పర్యవేక్షణలో ఎస్ఎంసీ కౌన్సిల్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికలో బీజేపీ కార్పొరేటర్ అయిన కాంచన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బీజేíపీ కార్పొరేటర్ రాజేశ్ కాళే విజయం సాధించారు. 22 ఏళ్లుగా ప్రజా జీవితంలో.. సదాశివపేటకు చెందిన కాంచన కుటుం బం చాలా కాలం కిందే షోలాపూర్ వెళ్లి స్థిరపడింది. కాంచన భర్త రమేశ్ దుప్పట్లు, టవల్స్ సేల్స్ ఏజెంటుగా పనిచేస్తుంటారు. ప్రజా జీవితంలో సేవలందించడం అంటే కాంచనకు ఎంతో ఇష్టమని ఆమె భర్త తెలిపారు. 22 ఏళ్ల కిందట 1997లో కాంచన రాజకీయ ప్రవేశం చేశారని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు స్థాపించి మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. 2002లో ఎన్నికల బరిలో దిగిన తొలిసారే షోలాపూర్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత 2007, 2012, 2017 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ‘అందరినీ కలుపుకొని ముందుకెళ్తా’ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని మేయర్‌గా విజయం సాధించిన అనంతరం కాంచన పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. -
కాలి బూడిదైన తెలంగాణ ఆర్టీసీ బస్సు
షోలాపూర్ : మహారాష్ట్ర షోలాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీ బస్సు పండరీపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం అయిదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్యాటరీల లోడ్‌తో వెళుతున్న ఓ ట్రక్కును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సుతో పాటు లారీ కూడా దగ్ధం అయింది. మరోవైపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షోలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సుమారు పదిమందికి గాయాలు అయ్యాయని, మృతులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కులం లెక్కలు.. గెలుపు చిక్కులు
‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి. అవి మెత్తవి, కొత్తవి, కాలుకు హత్తుకుపోయేవి..’ ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాట ఇది. మహారాష్ట్రలో షోలాపూర్ ఒకప్పుడు చెప్పులకు అంత ప్రసిద్ధి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవాలంటే చెప్పులు అరిగేలా నియోజకవర్గంలో తిరగవలసిందే. అంతటి హోరాహోరీ పోరు నెలకొంది. షోలాపూర్ పశ్చిమ మహారాష్ట్రలో ఉంది. పూర్తిగా కరువు ప్రాంతం. చద్దర్స్, మిల్స్, పవర్ లూమ్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలే. బీడీ కార్మికుల్ని కూడా సమస్యలు వేధిస్తున్నాయి. త్రిముఖ పోటీ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా పని చేసిన సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌పై పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో మోదీ హవాతో ఆయన ఓటమి పాలైనప్పటికీ ఈసారి షిండే గెలుస్తారని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతంలో మూడుసార్లు గెలుపొందిన రికార్డు ఆయనకు ఉంది. అయితే హఠాత్తుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అగాధి అధినేత ప్రకాశ్ అంబేడ్కర్ బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడ్ లక్షన్నర ఓట్ల తేడాతో షిండేపై విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీపై నియోజకవర్గం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా బీజేపీ ఈసారి అభ్యర్థిని మార్చేసి ఆ«ధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిని బరిలోకి దింపింది. షిండే గెలుపులో దళిత, ముస్లిం ఓట్లే కీలకంగా ఉండేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. షిండే, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, సిద్ధేశ్వర్స్వామి పోటీతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కుల సమీకరణలు ఎవరి కొంప ముంచుతాయి? కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగు జనాభా కూడా ఎక్కువే. మొదటి నుంచీ కర్ణాటకు చెందిన లింగాయత్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కల్కోట్ తాలూకా గౌడ్గావ్ మథ్కి చెందిన లింగాయత్ ఆధ్యాత్మికవేత్త జై సిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామీజీని బరిలోకి దింపింది. ముస్లింలు, దళితులు, ఇతర ఓబీసీ జనాభా మిశ్రమంగా ఉన్న నియోజకవర్గం ఇది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకే పట్టున్న నియోజకవర్గం. 2009లో ఇది ఎస్సీ సీటుగా రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో షిండే విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ స్థానం ఎస్సీలకు రిజర్వుడు కాకముందు కూడా ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన చరిత్ర షిండేది. ‘ఈసారి ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేమంతా ఈసారి ప్రకాశ్ అంబేడ్కర్‌కే వేద్దామని అనుకుంటున్నాం’ అని ప్రశాంత్ గైక్వాడ్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు చెప్పాడు. దళితులు ఎక్కువగా ఉండే బుధ్వారా పేట్లోనూ ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ అంబేడ్కర్ నామినేషన్ సమయంలో ఆయన ఒంటరిగానే వచ్చారు. కానీ కాసేపటికే ఆ వీధి వీధంతా జనమే. అదే ఆయనకున్న జనాదరణను చాటుతోందని సూరజ్ సర్వేద్ అనే స్థానికుడు అంటున్నారు. అంబేడ్కర్ పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం జత కట్టింది. దీంతో ముస్లింలు కూడా ఈ పార్టీకి వేసే అవకాశాలున్నాయి. ‘నా ఓటు కాంగ్రెస్‌కే. కానీ చాలామంది అంబేడ్కర్ మనవడిపైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని జావేద్ షేక్ అనే స్థిరాస్తి వ్యాపారి అభిప్రాయపడ్డారు. -
ఆదాయం 9.. దిగ్గజాలతో పోటీ
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చు. డబ్బును నీళ్లప్రాయంగా వెచ్చించగలిగిన వారే.. ఈ రాజకీయ క్రీడలో నెగ్గుకు రాగలరు. కానీ, వెంకటేశ్వర్ మహాస్వామి అనే అభ్యర్థి మాత్రం చేతిలో కేవలం తొమ్మిదంటే తొమ్మిది రూపాయలతో కోట్లాది రూపాయల ఆస్తులున్న, రాజకీయ దిగ్గజాలైన సుశీల్‌కుమార్ షిండే, ప్రకాష్ అంబేడ్కర్, జయసిద్ధేశ్వర మహారాజ్ వంటి దిగ్గజ నాయకులపై పోటీకి దిగి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం ఈయన మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కారు. మహారాష్ట్రలోని షోలాపూర్ లోకసభ నియోజకవర్గంలో హిందుస్తాన్ జనతా పార్టీ తరఫున వెంకటేశ్వర్ మహాస్వామి అలియాస్ దీపక్ గంగారాం కటకదోండ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా చేతిలో కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఇతర ఆస్తులేమి లేవని అందులో పేర్కొన్నారు. తనకు రూ.45 వేల అప్పు మాత్రం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమర్ షిండే, వంచిత్ ఆఘాడీ తరఫున ప్రకాష్ అంబేడ్కర్, బీజేపీ తరఫున జయసిద్ధేశ్వర మహారాజ్ ఈ స్థానంలో బరిలో ఉండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ లోక్‌సభ నియోజకవర్గంపై పడింది. ఇప్పుడు ‘తొమ్మిది రూపాయల అభ్యర్థి’ వెంకటేశ్వర్ మహాస్వామి వారితో తలపడుతున్న విషయం మరింతగా ఆసక్తి కలిగిస్తోంది. డిపాజిట్ కోసం అప్పు.. వెంకటేశ్వర్ మహాస్వామి హిందుస్తాన్ జనతా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. అందులోని వివరాలు చూసిన అందరూ అవాక్కయ్యారు. చేతిలో తొమ్మిది రూపాయల నగదు తప్ప మరేమీ ఆస్తులు లేవని, అదే విధంగా తనపై ఎవరూ ఆధారపడి లేరని తెలపడంతో పాటు తనపై రూ.45 వేల అప్పు ఉందని పేర్కొన్నారు. ఈ అప్పు కూడా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావల్సిన డిపాజిట్ డబ్బు చెల్లించేందుకు తీసుకున్నట్టు వెంకటేష్ తెలిపారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్. దీంతో ఇక్కడ పోటీచేసే అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.12.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ మొత్తం కూడా తన వద్ద లేకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసినట్టు వెంకటేశ్వర్ మహాస్వామి అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎవరీ వెంకటేశ్వర్ మహాస్వామి? వెంకటేశ్వర్ మహాస్వామి అలియాస్ దీపక్ గంగారాం కటకదోండ్ ..కర్ణాటకలోని నాగఠాణా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఈయన పేరు ఉంది. 31 ఏళ్ల వెంకటేశ్వర్ మహాస్వామి ధారవాడ్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేశారు. – గుండారి శ్రీనివాస్, సాక్షి– ముంబై -
ఏలూరులో చెడ్డీ గ్యాంగ్ ?
వారు నరరూప రాక్షసులు.ఆ గ్యాంగ్ పేరు వింటేనే సామాన్యులకు హడల్. అదే చెడ్డీ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులు నగలు దోపిడీ చేయటమే కాదు.. మహిళలను మానభంగం చేస్తారు. ప్రాణాలను సైతం నిర్థాక్షిణ్యంగా తీసేస్తారు. ఏలూరు టౌన్ :ఏలూరు నగరంలో ఈ గ్యాంగ్ గురువారం అర్ధరాత్రి 1.05 గంటలకు ఒక ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భగవంతుడే తమని కాపాడాడని..లేకుంటే తమ కుటుంబం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 45నిమిషాల పాటు ఆరుగురు దోపిడీ దొంగల ముఠా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసుల జాడ లేదని తెలు స్తోంది. విపత్కర పరిస్థితుల్లో స్నేహితులకు సమాచారం ఇవ్వటం, వరండాలో లైట్లు వేసి, అలజడి చేయటంతో కొంతసేపటికి దోపిడీ ముఠా వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం నగరంలో దావానలంలా వ్యాప్తించటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీ ముఠా సంచరించటం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఇది షోలాపూర్ గ్యాంగ్ పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో గురువారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగల ముఠా హల్చల్ చేసింది. ఒక చేపల వ్యాపారి ఇంటిలో దోపిడీకి విఫలయత్నం చేసింది. శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ కే.ఈశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ పీ.శ్రీనివాసరావు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే అంశాలపై ఆరా తీశారు. రాత్రి సంఘటన జరిగిన పరిస్థితులను బాధితుని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. ఏలూరు శాంతినగర్ 8వ రోడ్డు చివర దేవరపల్లి సత్యనారాయణ అనే న్యాయవాది నివాసముంటున్నారు. ఈ భవనం కింది పోర్షన్లో సరెళ్ళ రామకృష్ణ అనే చేపల వ్యాపారి తన కుటుం బంతో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న ఇంటికి రామకృష్ణ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ఇంటి బయట అలికిడి కావటంతో అతను సీసీ కెమెరాలను గమనించాడు. ఎవరో ఆరుగురు వ్యక్తులు బయట సంచరిస్తున్నట్లు కనిపించింది. ఆరుగురు ముఠా సభ్యులు ముఖానికి టవల్ కట్టుకుని, షార్ట్‌లు, నిక్కర్లు ధరించి ఉన్నారు. వారి వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ టీవీ కెమేరాల్లో కన్పించింది. వెంటనే సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేశాడు. స్టేట్ కాల్ సెంటర్లో ఉన్న పోలీసులు జిల్లా కాల్‌సెంటర్‌కు సమాచారం వెంటనే ఇవ్వలేదు. కొంతసేపటికి స్థానిక పోలీ సులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే 45 నిమిషాల పాటు దోపిడీ ముఠా లోనికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేస్తోంది. భయాందోళనలో ఉన్న రామకృష్ణ సహాయం కోసం పై అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి, అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ సందర్భంలో వరండాలో లైట్లు వేయటం, ఫోన్లో స్నేహితులకు సమాచారం అందిస్తూ కొంత అలజడి చేయటంతో దోపిడీ ముఠా ఇంటి వెనుక నుంచి గోడదూకి పారిపోయింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అధికారులు అక్కడ సిబ్బందిని పహారా పెట్టారు. చెడ్డీ గ్యాంగా?.. షోలాపూర్ గ్యాంగా? ఏలూరులో దోపిడీకి విఫలయత్నం చేసింది చెడ్డీ గ్యాంగా లేక షోలాపూర్ గ్యాంగా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో కొందరు షార్ట్‌లు, ఇద్దరు నిక్కర్లు వేసుకుని, ముఖానికి గుడ్డలు కట్టుకున్నారు. నడుముకు కత్తులు ఉన్నాయి..ఒక వ్యక్తి భుజానికి బ్యాగు ధరించి ఉన్నాడు. ఈ ముఠా దొపిడీకి పాల్పడిన సందర్భంలో విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ఇంటిని దోచుకోవటంతోపాటు, యజమానులను సైతం నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఖాకీ సినిమా తరహాలో దోపిడీలకు పాల్ప డడం వీళ్ళకు వెన్నతోపెట్టిన విద్యగా చెబుతున్నారు. ఆలస్యమే.ప్రాణాలు కాపాడిందా? చేపల వ్యాపారి రామకృష్ణ గురువారం రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రామకృష్ణ నిద్రకు ఉపక్రమించకముందే ఇంటిబయట ఏదో అలికిడి వినిపించింది. వెంటనే సీసీ కెమెరాలను గమనించాడు. ఈ సీసీ కెమెరాల ఆధారంగానే అప్రమత్తమై తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ముందుగానే వచ్చి నిద్రపోయి ఉంటే దోపిడీ దొంగలు అంతా దోచుకుపోయేవారు. ప్రాణాలకు సైతం గ్యారంటీ లేకపోయేది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం కూడా తమను కాపాడిందని అంటున్నారు. దోపిడీకి ఎలా ప్రయత్నించారంటే.. దోపిడీ దొంగలు ఏమి చేశారంటే...సుమారు 1.05 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక వైపు గోడదూకి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆరుగురు ముఠా సభ్యులు షార్ట్‌లు, పైన బనియన్లు ధరించి, నడుముకు కత్తులు కట్టుకుని ఉన్నారు. చుట్టుపక్కల పరిస్థితిని గమనించి, ఇంటిలోని వారు బయటకు రాకుండా అక్కడే ఉన్న మోటారు సైకిల్‌ను డోర్ లాక్కు బలమైన ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేశారు. అనంతరం వెనుకవైపు ఉన్న డోర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. బయట ఇద్దరు కాపలా ఉండగా, మరో నలుగురు వ్యక్తులు డోర్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. వెనుకతలుపు త్వరగా పగలకపోవటం, ఈలోగా అలజడి రావటంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భీమడోలులో గతంలో దోపిడీ మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు 3సంవత్సరాల క్రితం భీమడోలు ప్రాంతంలో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి 50 కాసుల బంగారాన్ని దోచుకువెళ్ళారు. వాళ్ళూ ఇదే తరహాలో నిక్కర్లు, బనియన్లు ధరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ముఠానే ఇటీవల నెల్లూరు ప్రాంతంలో ఒక ఇంటిలోకి ప్రవేశించి దోచుకుని, అడ్డువచ్చిన ఇంటి యజ మానురాలిని కొట్టి చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. పటిష్ట చర్యలు చేపడుతున్నాం : కే.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఏలూరు నగర ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళల్లో పూర్తిస్థాయి నిఘాను మరింత పెంచుతున్నాం. ఏలూరులో సంచరించిన ముఠా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన వారు కాదు. షోలాపూర్ గ్యాంగ్‌గా అనుమానం ఉంది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తాం. -
షోలాపూర్ దొంగల ముఠా హల్చల్
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు నగరంలో షోలాపూర్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. శాంతినగర్ ఎనిమిదవ రోడ్డులో ఓ చేపల వ్యాపారి ఇంట్లో నిన్న(గురువారం) అర్దరాత్రి దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేశారు. ముఖానికి అడ్డంగా ముసుగులు కట్టుకుని...నిక్కర్లు, షార్టులు ధరించి ఇంటి ఆవరణంతా కలియదిరిగారు. దొంగల వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సీసీ పుటేజీలో దొంగల విజువల్స్ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆరుగురు సభ్యులు గోడదూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్లు రికార్డు అయింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. షోలాపూర్ దొంగల ముఠా ఏలూరు నగరంలో సంచరిస్తున్నారని విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
సీఎం భార్యకు చేదు అనుభవం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం షోలాపూర్‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హజరైన అమృత ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు కూడా అలాంటి మార్కెట్ సదుపాయాలనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళా కార్యకర్తలు వేదికకు వెలుపలకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి మీద కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కోన్నారు. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అమృత ఫడ్నవీస్ అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాం దేవ్, దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హజరయ్యారు. -
ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన ట్రావెల్స్
మహారాష్ట్ర: బస్సు మరమ్మతుకు గురైందంటూ ప్రయాణికులను మార్గం మధ్యలోనే దింపేశారు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది. ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 02పీఏ 2259 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి షిర్డీకి బయల్దేరింది. షోలాపూర్ చేరగానే బ్రేక్ డౌన్ అయిందని చెప్పి అందులోని ప్రయాణికులను సిబ్బంది దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 40మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రే 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిందని, బస్సు ఆగిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. -
మీరేం చేశారు?
షోలాపూర్ ఎన్నికల ప్రచారసభలోకాంగ్రెస్ను నిలదీసిన వెంకయ్యనాయుడు షోలాపూర్, న్యూస్‌లైన్: ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాలు, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే మహారాష్ట్ర పరిస్థితి దిగజారిందని కేంద్ర పట్టణాభిృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. షోలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న వెంకయ్య గతపాలకులపై ధ్వజమెత్తారు. షోలాపూర్ నార్త్ సిటీ బీజేపీ అభ్యర్థి విజయ్ దేశ్‌ముఖ్‌కు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం గొంగడి బస్తీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలలైన పూర్తిచేసుకోలేనే మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. 60 సంవత్సరాల పాలనలో మేరేం చేశారో చెప్పండంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం ఆరు నెలల్లో మోడీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పెళ్లయిన కొత్త జంటకు ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ పిల్లల్ని కనడానికి కూడా కనీసం తొమ్మిది నెలలు ఆగాల్సిందేనని చమత్కరించారు. ఈ మాత్రం కూడా వారికి తెలియదా..? అని నిలదీశారు. టూ-జీ స్కాం, బొగ్గు, భూమి ఇలా అనేక కుంభకోణాల్లో, అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని, ఇక ఆ పార్టీ నాయకుల మాటలు వినేవారెవరూ లేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే రాజ్యసభలో కూడా మా మెజార్టీ పెరుగుతుందని, తదనంతరం మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు సాధ్యమవుతుందని నాయుడు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్త్తోందని, వారి ఆటలు సాగనివ్వకుండా చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏ మత శక్తులు మనల్ని వేరు చేయలేవన్నారు. శివసేనను తాము వీడలేదని, శివసేనే బీజేపీని దూరం చేసుకుందన్నారు. ఈ బహిరంగసభలో మారుతి ప్రకాశ్, ఇందిరా కుడిక్యాల్, మోహిని పత్కి, సురేశ్ పాటిల్, ఎన్.అశోక్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మరాఠా గడ్డపై తెలుగు బిడ్డలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఏర్పాటైన ప్రారంభంలో తెలుగువారు అసెంబ్లీ ఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపారు. అయితే కాలానుగుణంగా తెలుగు వారి ప్రభావం తగ్గిపోతోంది. రాజకీయంగా ఎదిగేందుకు తెలుగువారు చేస్తున్న ప్రయత్నాలు కొంతకాలంగా ఫలించడంలేదు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్, జాల్నా, చంద్రాపూర్, యావత్మల్ తదితర జిల్లాల్లో ప్రధాన పార్టీల నుంచి తొమ్మిది మంది తెలుగు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. షోలాపూర్‌లో... జిల్లా కేంద్రమైన షోలాపూర్‌లో ఇప్పటికీ తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా ఇద్దరు తెలుగు అభ్యర్థుల మధ్యే జరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య సీపీఎం నుంచి బరిలోకి దిగగా శివసేన నుంచి మహేశ్ కోటే పోటీ చేస్తున్నారు. వీరితోపాటు జక్కని నాగమణి, కోడం మహేష్‌లు బరిలో ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం నర్సయ్య, మహేశ్ ల మధ్యే జరగనుంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సుశీల్‌కుమార్ షిండే తనయ, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రణతి షిండే కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ తరఫున విద్యా లోల్గే, బీజేపీ నుంచి మోహినీ పట్కి, ఎంఐఎం నుంచి షేఖ్తౌఫిక్ తదితరులు పోటీ చేస్తున్నారు. మొత్తం 26 మంది పోటీ చేస్తున్నా బరిలో ఉన్న తెలుగువారిపైనే ఓటర్లు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కార్మికనాయకుడు నర్సయ్య... సీపీఎం అభ్యర్థి ఆడెం నర్సయ్య ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో పోటీ చేసినాఆయనకు విజయం దక్కలేదు. అయినప్పటికీ సీపీఎం ఈ సారి కూడా నర్సయ్యనే బరిలోకి దింపింది. పార్టీ అభ్యర్థిగా పేరు ఖరారు అయిన తర్వాత వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చుకున్నారు. ‘ఓటు వేయండి.. నోటు ఇవ్వండి...’ అనే నినాదంతో రెండు నెలలుగా ప్రజల మధ్య తిరిగిన ఆయనకు ప్రజల నుంచి... ప్రత్యేకించి కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటిదాకా ప్రజలు ఇచ్చిన విరాళాలు రూ. 30 లక్షలదాకా పోగయ్యాయని నర్సయ్య ప్రకటించారు. ఆయనకు ఎంతటి ప్రజాదరణ ఉందో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ. కార్మికుల నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన షోలాపూర్ వాసుల సంక్షేమం కోసం ఆందోళనలు చేశారు. పట్టణంలోని బీడీ కార్మికుల సొంతింటి కల నెరవేరిందంటే అందులో నర్సయ్య పాత్ర ఎంతో ఉంది. తిరుగుబాటు నేతగా బరిలో కోటే.. రాజకీయవారసత్వం ఉన్న మహేష్ కోటే శివసేన తరఫున షోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులుగా కోటే కుటుంబానికి గుర్తింపు ఉంది. షిండే రాజకీయంగా ఎదగడానికి మహేష్ తండ్రి విష్ణు కోటే కీలకపాత్ర పోషించారని కూడా చెబుతారు. తండ్రికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని ఆశించి, భంగపడిన మహేశ్ కోటే కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేస్తూ శివసేనలో చేరారు. తండ్రి విష్ణు కోటే కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో శివసేన మహేశ్ కోటేకు టికెట్ ఇచ్చింది. మహేష్ కోటే గురించి చెప్పాలంటే... ఇప్పటి వరకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్, మేయర్‌తోపాటు పలు కీలకపదవులు చేపట్టారు. నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయనకు ఆడెం నర్సయ్య వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొనాల్సిన పరిస్థితి ఏర్పడడం కొంత కష్టమే అయినా గెలుపు అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఓట్లు చీల్చనున్న స్వంతంత్రులు షోలాపూర్ సిటీ సెంట్రల అసెంబ్లీ నుంచి ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు నాగమణి జక్కన్, కోడం మహేష్, సోమశేఖర్ పాసికంటి తదితర తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో నాగమణి, కోడం మహేష్‌లు షోలాపూర్ సిటీ నార్త్ నుంచి కూడా పోటీ చేస్తుండడం విశేషం. బీడి కార్మికురాలైన నాగమణి జక్కన్ గతంలో నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో, అయిదు సార్లు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఇంతవరకు విజయం సాధించలేకపోయిన ఆమె మరోసారి బరిలోకి దిగడం విశేషం. అయితే తెలుగువారైన ఈ ముగ్గురు అభ్యర్థులు ఓట్లు చీల్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. -
కమిషనర్ రాజీనామాతో భగ్గుమన్న షోలాపూర్
- కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించిన రాజకీయ పక్షాలు - మళ్లీ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ రాజీనామా చేయడంతో ఆయా రాజకీయ పక్షాలు బుధవారం షోలాపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. పట్టణంలో నీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని ఆరోపిస్తూ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్కు వ్యతిరేకంగా అధికారపక్ష కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. బీజేపీ, శివసేన, బీఎస్పీ, సీపీఎం, ఎమ్మెన్నెస్ తదితర రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. అంతేకాక కమిషనర్‌కు మద్దతు తెలుపుతూ పలు సామాజిక సంఘాలు హుతాత్మ చౌక్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఐదు చోట్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మోర్చా నిర్వహించారు. దత్తునగర్, బలిదాన్చౌక్, పంజారాపూల్చౌక్, హుతాత్మచౌక్, కర్నాచౌక్ల నుంచి వేర్వేరుగా ప్రారంభమైన ర్యాలీలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. తర్వాత అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ సభలో నర్సయ్య ఆడం మాట్లాడుతూ.. పట్టణంలో తలెత్తుతున్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ శాయశక్తులా కృషిచేస్తున్నారన్నారు. నాందినిలో ఐరన్ ట్యాంకర్ నిర్మించడం, ఎన్టీపీసీ లైన్‌కు తోడుగా మరో పైప్‌లైన్ వేయించడం వంటి పనులను ఆయన చేపట్టారని గుర్తుచేశారు. పట్టణంలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయడంతో కొందరు కుట్రపూరితంగా కమిషనర్‌ను బయటకు పంపే కుట్రలు పన్నారని, అందులోభాగంగానే ఆయన పనితీరుపై ఆందోళనలు నిర్వహించారన్నారు. కాంగ్రెస్ ఆగడాలకు ఇంతకుముందు పనిచేసిన బిపిన్ మాలిక్, రాజేంద్ర మదనే, రామనాథ్ ఝా వంటి మంచి అధికారులుబేజారై వెళ్లిపోయారరు. పట్టణంలోని రూ.212 కోట్ల డ్రైనేజ్ కాంట్రాక్ట్‌ను కమిషనర్ చంద్రకాంత్ రద్దు చేశారని, ఆ కోపాన్ని మనస్సులో ఉంచుకొని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇలా ఆందోళనలకు దిగారన్నారు. చంద్రకాంత్ గూడెంవార్ మళ్లీ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. బంద్‌కు మిశ్రమ స్పందన.. కాంగ్రెసేతర పక్షాలు పిలుపునిచ్చిన బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. ప్రధాన వ్యాపార కూడళ్లలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు బంద్ పాటించాలని దుకాణాదారులను కోరారు. కొన్నిచోట్ల బలవంతంగా దుకాణాలు మూయించారు. దీంతో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, బీఎస్పీకి చెందిన ఆనంద్ చందన్ శిండే, సీపీఎం తరఫున నర్సయ్య ఆడం, ఎమ్మెన్నెస్‌కు చెందిన యువరాజ్ చుంభకర్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్ తదితరులు ప్రసంగించారు. ఆందోళన చేసే హక్కు లేదా? ఎస్ఎంసీ ఫ్లోర్ లీడర్ మహేష్ కోటే మాట్లాడుతూ.. పట్టణ వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం తప్పా? అని నిలదీశారు. తన వార్డులో తనను సంప్రదించకుండానే పైప్‌లైన్ వేశారని, అది ఆరు నెలల వరకు ఉపయోగంలోకి రాదన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు ఆందోళన చేసే హక్కులేదా? అని నిలదీశారు. తగిన సమాధానం చెప్పి ఆందోళన విరమింపజేయాల్సింది పోయి ఇలా తప్పుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని శిరసా వహిస్తానని కమిషనర్ చంద్రకాంత్ పేర్కొన్నారు. -
ప్రజల కోరిక మేరకే ఏపీ విభజన
షోలాపూర్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సమానమేనని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి అక్కల్కోట్ రోడ్వైపున ఉన్న పూజాల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా విధులు నిర్వహించానని, ఆ రాష్ర్టం రెండుగా చీలిపోవడంలో తన పాత్ర కూడా ఉండడం కొంత బాధాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ డిమాండ్ మేరకే రాష్ట్రాన్ని విభజించినట్లు ఆయన తెలిపారు. అయితే విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా తన దృష్టిలో తెలుగువారంతా సమానమేనని ఆయన తెలిపారు. నీలకంఠ, జండ్రా, కురుహిణ్శేట్, కోష్టి సమాజాల మహాసంఘం నిర్వహించిన ఈ సదస్సులో శ్రీమద్గురు నీలకంఠ పట్టాయచాన్య సమక్షంలో సదరు నాలుగు కులాల వారు దీక్ష బూనారు. తమ కులవృత్తి, గోత్రాలు, కులదైవం ఒక్కటే అయినా వేర్వేరు కులాలుగా ఉండే బదులు ఒకే కులం పేరుతో ఉందామని ప్రతిజ్ఞ బూనారు. కాగా, రామకృష్ణ భగుడే అతిథులకు స్వాగతం పలకగా, నాగేష్ మల్వాల్ ప్రాస్తవికోపన్యాసం గావించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రణతి షిండే, మహేష్కోటే, ధర్మన్న సాదులు, విజయకుమార్ ద్యావరకొండ, శివకుమార్ బండా, బాలాజీ అబాత్తిని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, రాయలసీమ అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి శాశ్వతంగా స్థిరపడ్డవారు ఎక్కువ మంది ఉన్నారు. -
‘ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ విధానం’
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండాను బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నసీంఖాన్ అన్నారు. వీరి బారి నుంచి దేశ ఐక్యతను కాపాడుకునేందుకు హిందూ-ముస్లింలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం తెలిపారు. స్థానిక సివిల్ ఆస్పత్రి సమీపంలోని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) స్థలంలో ఉర్దూ భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి నసీంఖాన్ సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నసీంఖాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లో రక్తంతో హోలీ సంబరాలు జరుపుకున్నారని, ఆయన దేశానికి ప్రధాని కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఆయన ప్రధాన మంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని, ఆ కలలను సాకారం కాకుండా చూసే బాధ్యత హిందూ-ముస్లింలదేనని పిలుపునిచ్చారు. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండేని రాష్ట్ర ప్రజలు ఆదరించాల్సి అవసరముందన్నారు. ఆయనను బలపరచడం ఇక్కడి వారందరి కర్తవ్యమన్నారు. అంతకుముందు సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఉర్దూ మన భాషనేనని, పాకిస్తాన్ దానిని జాతీయ భాషగా మార్చుకోవడం మనకు గర్వకారణమన్నారు. ఈ ఉర్దూ భవనంలో చదువుకునే వారంతా విజ్ఞానవంతులు కావాలని, వారు మానవతా ధృక్పదంతో యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు దిలీప్ మానే, ప్రణతి శిందేలతోపాటు ధర్మ బోసుళే, ప్రకాశ్ మల్గుల్వార్, మాజీ మేయర్లు ఉమర్ఖాన్ బెరియా, హరీఫ్ శేఖ్, కార్పోరేటర్ తాపిక్ శేఖ్ తదితరులు పాల్గొన్నారు. -
నాట్యపరిషత్‌కు ఐదెకరాలు : కేంద్ర హోం మంత్రి షిండే
పండరీపూర్‌లో అఖిలభారత మరాఠీ నాట్య సమ్మేళనం ప్రారంభం షోలాపూర్, న్యూస్‌లైన్: నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. పండరీపూర్‌లో జరిగిన 94వ అఖిల భారత మరాఠీ నాట్య సమ్మేళనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకుండా ఉన్నట్లయితే కళారంగంలో కొనసాగేవాడినని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. తాను చదువుకునే రోజుల్లో పలు నాటకాలలో పాల్గొనేవాడినని బాల్యస్మృతులను నెమరువేసుకున్నారు. అదేవిధంగా నాటక రంగంలో కృషిచేసిన పాతతరం కళాకారులను కొనియాడారు. ‘నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోరేగావ్‌లోని ఫిలింసిటీలో ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. అలాగే ఇంతకు ముందు ప్రకటించిన రూ.ఐదు కోట్ల సహాయ నిధితోపాటు రూ.మూడున్నర కోట్లు, ఈ నాట్య సమ్మేళనం కోసం రూ.25 లక్షల నిధిని అందజేశామన్నారు. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం ఏడు గంటలకు తిలక్ స్మారక్ మైదానం నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. నాట్య సమ్మేళనం ప్రస్తుత అధ్యక్షుడు అరుణ్ కాకుడే, మాజీ అధ్యక్షుడు మోహన్ అగాశే, నాట్యపరిషత్ అధ్యక్షుడు మోహన్ జోషి, రాష్ట్ర సంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దేవతాళే, సహకార శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ అథవాలే, సమ్మేళనం స్వాగతాధ్యక్షుడు, ఎమ్మెల్యే భారత్ బాల్కే, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆందోళనతో ఆరంభం
షోలాపూర్, న్యూస్‌లైన్: కొత్త సంవత్సరంలో తొలిరోజే పట్టణంలో ఆందోళనలు మొదలయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని, కోట్ల రూపాయల బకాయిలను వెంటనే వసూలు చేసి, డెరైక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) బ్యాంకు ఎదురుగా ధర్నా ఆందోళన నిర్వహించింది. పార్టీ నాయకులు దిలీప్ దాత్రే, మహేంద్ర భూషణ్‌కర్‌ల నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. కార్యకర్తలు.. డెరైక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ముస్లింల నిరసన: అమాయకులైన ముస్లిం యువకులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ముస్లిం సంఘాలు కూడా బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. రోజంతా అక్కడే బైఠాయించాయి. కావాలనే పోలీసులు అమాయకులు, నిరపరాధులైన ముస్లిం యువకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏటీఎస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ముస్లింలందరూ ఏకతాటిపైకి రావాలని ఉలేమాలు పిలుపునిచ్చారు. పలు డిమాండ్లతో కూడిన నివేదికను ఈ సందర్భంగా కలెక్టర్‌కు అందజేశారు. డాక్టర్‌పై చర్య తీసుకోవాలని... స్థానిక సివిల్ ఆస్పత్రికి ప్రసూతి కోసం వచ్చిన మహిళకు చికిత్స చేసేందుకు నిరాకరించిన డాక్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకొన్నాడు. దీనిని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. దీంతో రోగులపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే సదరు డాక్టరుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పింజారి సమాజాం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. ఎస్ఎంటీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో... షోలాపూర్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్(ఎస్ఎంటి)డెరైక్టర్.. డిపోలో షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడింవార్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ డెరైక్టర్‌కు వ్యతిరేకంగా సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. బుధవారం నిర్వహించతలపెట్టిన బస్సుసేవల బంద్‌ను కార్పొరేటర్ ఆనంద్ చందన్ శివే సూచన మేరకు విరమించుకున్నారు. -
షిండే సొంతూరులో బాంబుల కలకలం
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సొంత ఊరైన షోలాపూర్ పట్టణంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం సృష్టించింది. ఈ కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఉగ్రవాదులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని మహ్మద్ సాదిక్ అబ్దుల్ వహబ్ (32), ఉమర్ అబ్దుల్ హఫీజ్ దండోతి (35)లుగా గుర్తించారు. ఈ కేసు వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్తో పాటు ఔరంగాబాద్ ఏటీఎస్ చీఫ్ నవీన్ చంద్రారెడ్డి వివరించారు. తగిన సమాచారం మేరకు సాదిక్ ఇంటిపై దాడిచేయగా 81 జిలెటిన్ క్యాండీలు, 102 డిటోనేటర్లు, రివాల్వర్, ఏడు బుల్లెట్లు, కంప్యూటర్, స్కానర్ ప్రింటర్, మెమరీకార్డులు, 200 సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు దొరికాయన్నారు. తర్వాత ఉమర్ దండోతి ఇంటిపై దాడి చేయగా, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. మరో ముగ్గురి ఇళ్లపై కూడా దాడులు చేసినా అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వివరించారు. ఇదిలావుండగా ఉగ్రవాదుల కోసం ఏటీఎస్ బృందం దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారం మేరకు అబ్దుల్ ఫజల్, పట్టణానికి చెందిన సిమి కార్యకర్త ఖలీద్ ముచాలేలను ఖండ్వా బార్డర్లో ఈ బృందం అరెస్టు చేసింది. ఖలీద్‌కు ఒక నేరం విషయంలో ఇండోర్ న్యాయస్థానం గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఖలీద్ విడుదలయ్యాడు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చి తన సోదరులతో నహిజిందగి ప్రాంతంలో ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఖండ్వా బార్డర్ సమీపంలో ఏటీఎస్‌కు పట్టుబడ్డాడని కమిషనర్ వివరించారు. అతడిని విచారించగా ఉగ్రవాదులకు సాయం చేసేవారు పట్టణంలో ఇంకా ఉన్నారని తేలడంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల పాటు పట్టణంలో ఉన్న ఖలీద్‌కు సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. బోగస్ డ్రైవింగ్ లెసైన్సులు, ఎన్నికల గుర్తింపు కార్డులు అందజేస్తూ ఖలీద్‌కు సాదిక్ సాయం చేసేవాడని పోలీసులు తెలిపారు. -
షోలాపూర్‌లో ఫైవ్‌స్టార్ హోటల్
షోలాపూర్, న్యూస్‌లైన్: పర్యాటకులను ఆకర్షించేందుకు పట్టణంలో మొట్టమొదటి సారిగా నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్‌ను శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి తెలుగు వారు కావడం గర్వకారణం. స్థానిక ‘బాలాజీ అమైన్స’ యాజమాన్యం అయిన రెడ్డి సోదరులు రాజేశ్వర్‌రెడ్డి, రామ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. బాలాజీ సరోవర్ ప్రీమియర్ పేరుతో కొత్తగా అస్రాచౌక్ సమీపంలో రోడ్డుకు దగ్గరగా మూడు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం.డీ. కె.ఎన్.మాన్వి ఈ హోటల్‌ను ప్రారంభించనున్నారని కంపెనీ ఎండీ రాంరెడ్డి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ హోటల్ పట్టణంలో మొట్టమొదటిది, రాష్ట్రంలో తొమ్మిదవదిగా నిలిస్తుందన్నారు. ఇందులో అత్యంత ఆధునిక హంగులున్న 129 గదులు ఉన్నాయన్నారు. కంపెనీ డెరైక్టర్ ఎన్.రాజేశ్వర్‌రెడ్డి, అనిల్ మదోక్, హోటల్ మేనేజర్ బర్జిన్ మాస్టార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెడ్డి సోదరులు 1985లో పట్టణానికి వచ్చి సిమెంట్ పైపులు తయారు చేసే కార్ఖానా స్థాపించారు. తర్వాత బాలాజీ గ్రూప్‌కు శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. తర్వాత కెమికల్స ఉత్పత్తుల్లో ప్రగతి సాధించారు.