Sidda Raghava rao
-
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వివాహ వార్షికోత్సవ వేడుకలు
-
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరిఢవిల్లుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శిద్ధా రాఘవరావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తాడేపల్లివైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారన్నారు. ఏపీ సీఎంను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. అలాగే, వాసవీ దేవాలయాలకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సీఎం జగన్ మినహాయింపులు ఇస్తున్నారని తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన శిద్దా రాఘవరావు
-
ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాను. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. -
ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం!
సాక్షి, దర్శి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వ పాలనలోఐదేళ్లు వెనక్కు చూస్తే ప్రతి ఒక్కరికీ నష్టాలు తప్ప ఏం ఒరిగిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. 2014–15వ సంవత్సరంలో అక్రమ కేసులతో నియోజకవర్గం అట్టుడికింది. మంత్రి శిద్దారాఘవరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నేతల పై దాడులు చేసి అక్రమ కేసుల పేరుతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టించారు. ఆతరువాత రైతులకు సాగర్ జలాలు విడుదల చేశారు. రైతులు వరి నాటుకున్న తరువాత సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు. దీంతో వరి పంట పూర్తి గా ఎండి పోయింది. కానీ మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పట్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సాగర్ కాలువలపై పర్యటన జరిపి కొంతమేర రైతులకు సాగర్ జలాలు అందించేందుకు కృషి చేశారు. మిరప రేట్లు బాగా ఉన్నా తెగుళ్లు రావడంతో రైతులు భారీగా నష్ట పోయారు. కంది వేసిన రైతులకు కనిస మద్దతు ధర కూడా రాలేదు. 2015–16లో సాగర్ జలాలు విడుదల చేయలేదు. రైతులు కంది, మిరప వంటి పంటలు వేసుకున్నారు. కందికి కొంత గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. 2016–17లో సాగర్ జలాలు విడుదల కాలేదు. వర్షాలు కురవక వేసిన పంటలు బాగా దెబ్బతిన్నాయి. మిరప మొదట్లో మంచి గిట్టుబాటు ధరలు ఉండటంతో రైతులు ఆపంటలే అధికంగా వేశారు. దీంతో రేటు పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. 2017–18 సాగర్ జలాలు విడుదల కాలేదు. సంవత్సరం నియోజకవర్గంలో మరణ మృదంగంలా విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి రోజూ ఒకటీ రెండు మరణాలు సంభవించడం జరిగింది. సుమారు 80 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది సాగర్ జలాలు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవక కురువు మేఘాలు కమ్ముకున్నాయి. కందులకు గిట్టు బాటు ధరలు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కందులు తక్కువ ధరలకు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పేరిట మార్క్ ఫెడ్, నాపెడ్ ద్వారా రైతులకు చెందాల్సిన గిట్టు బాటు ధరలను మంత్రి బినామీలే మింగేశారు. మిరప పంటలు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కరువు దెబ్బకు రైతులు కూడా కూలి పనులకు పోవడం మొదలు పెట్టారు. 2018 –19 సంవత్సరంలో ప్రభుత్వం సాగర్ జలాలు ఇస్తామని చెప్పడంతో వేసిన కందిని చెడగొట్టి వరి నాటుకున్నారు. వరి కంకి దశలోకి వచ్చేసరికి సాగర్ జలాలు నిలిపివేశారు. దీంతో కంది పంటకు ఎకరాకు రూ.5 వేలు, వరి పంటలో రూ.25 వేలు రైతులు నష్ట పోయారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ వరి రైతుల పరిస్థితి చూసి చలించి పోయారు. వరి పొలాలు సందర్శించి రైతులకు సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అయినప్పటికీ మంత్రి శిద్దారాఘవరావు కాని , జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ సాగర్ జలాలు తీసుకు రావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వేలాదిఎకరాలు ఎండి రైతులు నష్ట పోయారు. ఐదేళ్లుగా గొంతెండుతోంది.. ఎన్ఏపీ రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు దిగు నీరు అందిస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు చేసుకుని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బొక్కుతున్నారు. ఇలా ప్రజలకు అందించాల్సిన తాగునీటిలో కూడా అవినీతిని పారించారు. నీరు చెట్టు పేరుతో భారీగా దోచుకున్నారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలు పెట్టి సామాన్యులకు పింఛన్లు , కార్పొరేషన్ లోన్లు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల పంపిణీ పేరుతో అనాదీనం భూములను సాగు దారులనుంచి అతి తక్కువ ధరలకు కొనుగోనుగోలు చేసి ప్లాట్లుగా వేసి వాటిని అధిక లాభాలకు అమ్మకాలు చేసి వారికి ప్రభుత్వ పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ముసుగులో ఈ పట్టాలన్నీ మంత్రి శిద్దా రాఘవరావు ఉచితంగా ఇచ్చినట్లు ప్రచారం చేసి పట్టాల ముసుగులో పక్కా దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్స్టేషన్లలో 48 మంది నూతన సిబ్బందిని తీసుకున్నారు. వారిలో ఎస్సీల కోటాలో 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్.. రోష్టర్ పాటించాలి. అయితే కేటాయించాల్సిన ఉద్యోగావకాశాలను కూడా ఇతర కులాలకు ఒక్కో ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. ఈ తతంగంలో మంత్రి శిద్దా హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఈకారణంతోనే టీడీపీకి చెందిన ప్రధాన ఎస్సీ, ఎస్టీ నాయకుతు గాలిమూటి దేవప్రసాద్, ఉప్పల పాటి కిరణ్ ప్రసాద్, జి. వరప్రసాద్, కవలకుంట్ల గోవింద్ ప్రసాద్, కే సన్నీబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర వంటి మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రధాన ఎస్సీ , ఎస్టీ నాయకులు మంత్రికి దూరమయ్యారు. హామీలు గాలికొదిలారు దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి, హెలికాప్టర్ల కంపెనీ, కార్ల విడిభాగాల కంపెనీలంటూ మంత్ర చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పిచ్చిచెట్లు దర్శిన మిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరక పోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. దర్శిలో డిగ్రీకళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, మినీ స్టేడియం, జీప్లస్ త్రీ కాంప్లెక్స్‌లు, శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దర్శిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. చందవరం సమీపంలోని గుండ్లకమ్మపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే ఇదే నా.. అభివృద్ది అంటూ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఆబ్రిడ్జిపై కనీసం ఆపార్టీ గుర్తు అయిన సైకిల్ కూడా తిరగడం లేదు. ఈసారి ఓటర్లు చూపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే. -
వీరి మధ్యే అసలు పోటీ
సార్వత్రిక ఎన్నికల సమరం చివరి ఘట్టానికి చేరింది. మైకుల హోరు.. హామీల జోరుతో ముందుకు సాగిన నేతలు.. తమ తలరాతలు ఎలా మారబోతున్నాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. జన సేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు వారి గుణగణాలు, విజయావకాశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. ఎందరో ఉద్దండులు, మహామహులు ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు బరిలో నిలిచారు. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తోంది. శిద్దా రాఘవరావు పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా.. శిద్దా రాఘవరావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెంది ఎంఎల్సీగా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శిద్దా.. మాగుంట సహకారంతోనే ఆ ఎన్నికల్లో గట్టెక్కారని ఆయన సన్నిహతులే చెబుతుంటారు. శిద్దాకు రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇలా మాగుంట, శిద్దా.. జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు. శిద్దా అందుబాటులో ఉన్నట్టే ఉంటారు. కొందరికే ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కష్టమే. కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో జనంపై చిర్రుబుర్రులాడతారు. జనం సమస్యలపై ఇచ్చే అర్జీల సంగతి పట్టించుకోరు. మంత్రిగా ఆయన ఇక్కడ సాధించిన విజయాలు అతి తక్కువే. కలుపుగోలుతనంగా ఉండరన్న విమర్శలున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన నిజ రూపాన్ని ప్రదర్శించారని శిద్దా అనుచరులే అంటున్నారు. చేసే సాయం పది మందికీ తెలిసేలా చేయడం శిద్దా నైజం. తనకు ఇబ్బంది వచ్చే అంశాల నుంచి తప్పుకోవడానికి ఎంతటి వారినైనా ప్రలోభపెట్టడంలో ఆయకు ఆయనే సాటి అనే విమర్శ ఉంది. మాగుంట సౌమ్యంగా ఉంటారు. పది మందితో కలిసి ముందుకు సాగుతారు. కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎంతటి వారినైనా గౌరవిస్తారు. పిల్లలతో పిల్లవానిగా, పెద్దలతో పెద్దగా, మేధావులతో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అందరితో కలిసి భోజనం చేస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నా లేచి మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం మాగుంట శ్రీనివాసరెడ్డిది. వ్యాపారాల్లో దిట్టలు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిద్దా రాఘవరావుకు చీమకుర్తి గ్రానైట్‌తో పాటు పాలిషింగ్ యూనిట్ ఇతర వ్యాపారాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి పరిచయం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇరువురూ ధార్మిక కార్యక్రమాలకు కొంత నగదు వెచ్చిస్తున్నారు. మాగుంట కుటుంబం గత 30 ఏళ్ల నుంచి సేవా రంగంలో ఉండి తన సొంత నిధులతో ప్రజలకు తాగునీరు, విద్య అందిస్తున్నారు. శిద్దా రాఘవరావు ధార్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. శిద్దా ఎక్కువగా మఠాధిపతులు, పీఠాధిపతులకు సమయం, ధనం వెచ్చిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘మాగుంట’కు ప్రజాభిమానం మెండు జిల్లా ప్రజానీకంతో మాగుంట కుటుంబానిది విడదీయరాని బంధం. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్న వేళ తాగునీటికి సొంత నిధులు వెచ్చించి దప్పిక తీర్చారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీరు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరుపొందారు. ఒంగోలు నగర అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వివాదాలకు దూరం రాజకీయ వివాదాలకు మాగుంట ఎంత దూరంగా ఉంటారో.. శిద్దా కూడా అంతే. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా మాగుంట ఆలోచిస్తారు. శిద్దా మాత్రం తన కుటుంబానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో బేరీజు వేసుకుని ఆచితూచి అడుగు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రజల నుంచి మంచితనాన్ని మాగుంట మూటగట్టుకున్నారు. శిద్దాకు గ్రానైట్ వ్యాపార రంగం నుంచి కొన్ని వివాదాలున్నా వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్తగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు వచ్చిన పవన్‌కళ్యాణ్ శిద్దా గ్రానైట్ వ్యాపారం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావించడం గమనార్హం. నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ► సామాన్యుడిగా ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు ► నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నారు ► ప్రతి సమస్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ► హోదా వాణిని ఢిల్లీలో వినిపిస్తానని చెబుతున్నారు ► యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ► పార్టీకి ఉన్న సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు. శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ► ఆర్థిక బలంతోనే ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు ► ఎంపీ అయ్యాక నియోజకవర్గంలో ఉన్నది చాలా తక్కువ ► సమస్యలపై అవగాహన లేదు ► హోదాపై పోరాడిన దాఖలాలు లేవు ► ఎన్నికల సమయంలోనూ అంతంతమాత్రం ప్రచారమే.. ► టీడీపీపై వ్యతిరేకత ఉండడం ప్రతికూలాంశం -
శిద్దాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు డిమాండ్
-
‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు’
సాక్షి, అమరావతి : మంత్రి శిద్దా రాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే’ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్ బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శిద్దాను.. ఈసారి ఒంగోల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అధిష్టానం నిర్ణయించింది. అటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉగ్రనరసింహారెడ్డి పేరును టీడీపీ ప్రకటించింది. అయితే తాను ఎంపీగా పోటీ చేసేది లేదంటూ శిద్దా.. చంద్రబాబు నాయుడికి తేల్చి చెప్పారు. -
ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి
సాక్షి, దర్శి: ఈ నెల 28వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు కోరారు. సోమవారం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి ఒంగోలులో చేపట్టే ధర్మపోరాట దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. అనంతరం పట్టణంలోని పుచ్చలమిట్టలో జరిగిన గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, నాయకులు పాల్గొన్నారు. -
శిద్దా లాంటి నాయకులు అవసరమా..?
దర్శి: మంత్రి శిద్దా రాఘవరావు దర్శి నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, అలాంటి నాయకులు మనకు అవసరమా..? అని టీడీపీ దర్శి మండల మాజీ కన్వీనర్, బీసీ నాయకుడు బల్లగిరి శీనయ్య కరపత్రాలు ముద్రించారు. నియోజకవర్గ ప్రజలు దీనిపై ఆలోచించాలని కోరారు. ఆ కరపత్రాలు ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేస్తున్నాయి. పట్టణంలోని పలు దుకాణాలు, సెంటర్లలో కూడా దర్శనమిస్తున్నాయి. ఆ కరపత్రాల్లో ఏముందంటే... ‘పార్టీ అధికారంలో లేనప్పుడు నిస్వార్థంతో పనిచేసి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మంత్రి మరిచిపోయారు. టీడీపీని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులను అమ్ముకుని రేయనక పగలనక, ఎండనక వాననక కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించారు. పార్టీ గెలిచిన తరువాత వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. బీసీలంటే ప్రాణం, బీసీలే పార్టీకి వెన్నుముక అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే.. దర్శి నియోజకవర్గంలో మంత్రి బీసీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వప్రయోజనాల కోసం ఎప్పటి నుంచో ఒకే తాటిపై కలిసి మెలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తే ఇంకో నియోజకవర్గం చూసుకుంటానని, పార్టీ ఫండ్ ఇచ్చి ఎంఎల్సీ తీసుకుంటానని తనమనుషులతో చెప్పిస్తున్నారు. గతంలో ఈ నియోజక వర్గంలో ఓడిన వారు అడ్రస్ లేకుండా పోతున్నారని, గెలిచిన వారు చేసిన ఖర్చులు సంపాదించుకోవద్దా అని అనడమే తప్ప అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. దొనకొండ పారిశ్రామిక హబ్ అని పేదల పొలాలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దల నివాసాల వద్ద డ్రైనేజీలను వంకర్లు తిప్పి నిర్మించారు. నామినేటెడ్ పదవుల ఆశ చూపి ఖర్చులు చేయించి చివరకు వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు చూపి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులు, తదితర హామీలిచ్చి అమలు చేయలేదు. వీటన్నింటిపై విద్యావంతులు, అనుభవం కలిగిన పెద్దలు, యువకులు, ఉద్యోగులు. మేధావులు ప్రతిఒక్కరూ ఆలోచించాలి’ అని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై బల్లగిరి శీనయ్యను ప్రశ్నించగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ కరపత్రాలను తానే ముద్రించానని చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి అతని సామాజికవర్గం వారిని తప్ప ఇతర సామాజికవర్గాల వారిని పట్టించు కోవడం లేదని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారిని దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మంత్రి శిద్దా ఇంటి ముందు డెయిరీ బాధితుల నిరసన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ బాధితులైన పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు, పాలు సరఫరా చేసిన ట్రాన్స్పోర్టర్స్ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటి ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి శిద్దా రెండు రోజుల నుంచి దాటవేత ధోరణితో వ్యవహరించటంతో సహనం కోల్పోయిన బాధితులు మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా నిరసన చేయాలని నిర్ణయించిన బాధితులు మంత్రి ఇంటి రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. డెయిరీ బాధితులు చేపట్టిన నిరసనకు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శిరిగిరి లలిత సంఘీభావం ప్రకటించారు. అధికార తెలుగుదేశం హయాంలో జిల్లాలోని సహకార సంఘాలను నిలువునా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అందులో మొదటిది ఒంగోలు డెయిరీ అన్నారు. కోట్ల రూపాయలు దోచుకోవటానికి సహకార సంఘాల్లో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి తెచ్చి నిలువునా పాడి రైతులను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. పొందూరు సహకార సొసైటీ అధ్యక్షుడు వేజెండ్ల రామారావు మాట్లాడుతూ మంత్రి హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారన్నారు. రెండు రోజుల్లో వచ్చి డైరెక్టర్ల చేత రాజీనామా చేయిస్తానన్న మంత్రి రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకుండా మళ్లీ పది రోజులని చెప్పి వెళ్లిపోవటం దారుణమని, అందుకే ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నాగులుప్పలపాడుకు చెందిన పాడి రైతు చుండూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నెలల తరబడి గొడవలు లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు. రైతులకు మేలు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. డెయిరీ పాలకమండలి చేసిన అవినీతి, అక్రమాల వల్ల డెయిరీలో పూర్తిగా నష్టపోయింది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులేనని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డెయిరీలో ఉద్యోగులు కూడా పార్టీవాళ్లేనని వాపోయారు. ఒంగోలు డెయిరీ పాలు రాష్ట్రంలోనే నాణ్యమైనవని డెయిరీ మహిళా ఉద్యోగులు వివరించారు. ప్రతి రోజూ 1.70 లక్షల లీటర్లు వచ్చే పాలు నేడు రోజుకు 700 లీటర్లకు దిగజారిపోయిందంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గుట్టుగా డెయిరీలో ఉద్యోగాలు చేసుకోవాల్సిన తాము చెట్ల కింద కూర్చొని తమ గోడు వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. శిబిరం వద్దకు మంత్రి శిద్దా... మంత్రి ఇంటి ముందు డెయిరీ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి వెంటనే హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న డెయిరీ బాధితులతో చర్చించారు. పది రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు పూనుకుంటానని చెప్పాను కదా ఇంటి ముందు నిరసన ఏమిటని మండిపడ్డారు. దీంతో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు నెలల తరబడి సమస్యను సాగదీస్తున్నారని, డెయిరీ మూత పడే పరిస్థితికి చేరుకుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే వద్దకు వెళితే మండిపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొండ్రగుంటపై మండిపడిన మంత్రి: తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య డెయిరీలో పాడి రైతులు, ఉద్యోగులు పడుతున్న బాధులు గురించి చెబుతున్నప్పుడు మంత్రి శిద్దా రాఘవరావు ఆయనపై మండిపడ్డారు. డెయిరీ వల్ల పూర్తిగా టీడీపీకి చెందిన వారే పూర్తిగా నష్టపోయారని వాపోయారు. డెయిరీ వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని అనటంతో మంత్రికి కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంట్లోకి రాండి మాట్లాడుకుందామని మంత్రి లోపలకు వెళ్లారు. మంత్రి ఇంటికి వెళ్లకుండా నిరసన దీక్ష వద్దే నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఇవరూ ఇంట్లోకి రాకపోవటంతో మంత్రే నడుచుకుంటూ తిరిగి నిరసన శిబిరం వద్దకు వచ్చారు. నిరసనకారులతో మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నారాయణతోనూ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతోనూ చర్చించి శనివారం ముఖ్యమంత్రితో డెయిరీ విషయం మాట్లాడతామని వివరించారు. ఆదివారం కొందరు ముఖ్యులు వస్తే డెయిరీ సమస్యపై లోతుగా ఆలోచన చేద్దామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు. -
మాకిది కావాలని అడిగేవారు తక్కువ!
ఒంగోలు టౌన్: జిల్లాలో మాకిది కావాలని అడిగేవారు చాలా తక్కువగా ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఐదో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమ ముగింఫు సభ శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు క్లియర్ చేయడంతో జన్మభూమి–మాఊరు సాఫీగా సాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు వేదికగా నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో పనిచేసి ప్రభుత్వాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అందరికీ అందేలా చూడాలన్నారు. సీఎంను నవ్వుతూ పంపించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వేది చాలా తక్కువని, అలాంటి ఆయన్ను జిల్లాలో జరిగిన జన్మభూమి సభ అనంతరం అధికారులు నవ్వుతూ పంపించారని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశంసించారు. జిల్లాలో మైనస్ 72శాతం రెయిన్ ఫాల్ ఉందని, రాబోయో రోజుల్లో మరింత క్రిటికల్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. లీకేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందుబాటులో ఉండే నీటిని సక్రమంగా సరఫరా చేసేలా చూడాలని సూచించారు. బాగా పనిచేశారు: కలెక్టర్ జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భయం, ఆందోళనకరంగా ఉన్నా అధికారులు బాగా పనిచేశారని కలెక్టర్ వి. వినయ్‌చంద్ ప్రశంసించారు. చిట్టచివరి గ్రామాల వరకు జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఏరోజుకారోజు స్వీకరించి వాటిని ట్యాబ్‌ల ద్వారా అనుసంధానం చేసి నేరుగా తనతో పాటు ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు డ్వాక్రా మహిళలను సాధికార మిత్రులుగా నియమించినట్లు తెలిపారు. 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి 15 రకాల భద్రతలు, 10 రకాల హామీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూస్తున్నారన్నారు. సభలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు పాల్గొన్నారు. దర్శిలో జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సమయంలో ఆయన్ను ఆకట్టుకున్న ముండ్లమూరు మండలం బృందావనం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి విజయకుమార్ పేరున సీఎం ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్‌ను మంత్రి శిద్దా అందించారు. బెస్టు అవార్డులు జన్మభూమి–మాఊరు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచిన జిల్లాస్థాయి అధికారులు, మండలాలు, నగర పంచాయతీ అధికారులకు బెస్టు అవార్డులు ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు సభలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అవార్డులు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ఐసీడీఎస్ పీడీ సరోజిని, సీపీఓ కేటీ వెంకయ్యలకు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పోలప్ప (యర్రగొండపాలెం), రవి (దర్శి), ప్రభాకరరావు (పర్చూరు), శ్రీనివాసరావు (అద్దంకి), మురళి (చీరాల), శ్రీనివాసరావు (సంతనూతలపాడు), అన్నపూర్ణ (ఒంగోలు), మల్లికార్జున(కందుకూరు), ఉమాదేవి (కొండపి), కొండయ్య (మార్కాపురం), కిషోర్(గిద్దలూరు), కైలాస్ గిరీశ్వర్ (కనిగిరి)లకు అవార్డులు అందించారు. ఉత్తమ మండలాలుగా మార్కాపురం, జరుగుమల్లి మండలాలను ఎంపిక చేశారు. ఉత్తమ మునిసిపాలిటీలుగా కందుకూరుకు మొదటి స్థానం, మార్కాపురానికి రెండో స్థానం కింద అవార్డులు ఇచ్చారు. ఉత్తమ పంచాయతీలుగా అద్దంకి మండలం ధేనువకొండ, అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామాలకు అవార్డులు అందించారు. ఉత్తమ నగర పంచాయతీలుగా అద్దంకి, చీమకుర్తిలకు అవార్డులు అందించారు. చీరాల మునిసిపాలిటీలోని 1వ వార్డు, గిద్దలూరులోని 14వ వార్డు, కందుకూరులోని 12వ వార్డు, కనిగిరిలోని 15వ వార్డు, మార్కాపురంలోని 13వ వార్డు, ఒంగోలులోని 10వ డివిజన్‌ను ఎంపిక చేసి అవార్డులు అందించారు. చేదు అనుభవం ఐదో విడత జన్మభూమి–మాఊరు ముగింపు సభకు హాజరైన వారికి చేదు అనుభవం ఎదురైంది. సభకు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారు. జిల్లా యంత్రాంగం వారికి అరకొరగా భోజన వసతి కల్పించింది. అతిథుల ప్రసంగాలు, సత్కారాలు ముగిసిన అనంతరం భోజనం చేసేందుకు వెళ్లిన వారికి అక్కడ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు జనాలు ఉండటంతో ఆతృతగా అక్కడకు వెళ్లారు. అక్కడి సర్వర్లు తమ వద్ద మిగిలిన కిళ్లీలను ఇవ్వడం ప్రారంభించడం గమనార్హం. -
ఎర్రచందనం కోసం రూ.22కోట్లతో గోదాము
విజయవాడ: ఎర్రచందనం కోసం నిర్మించిన గిడ్డంగులను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సుమారు రూ.22 కోట్లతో 25 ఎకరాల్లో ప్రభుత్వం తిరుపతిలో నిర్మించినట్లు ఆయన తెలపారు. బుధవారం ఆయన అటవీశాఖ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. మరో 2 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ముఖ్యమంత్రితో సంప్రదించి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. -
ముహూర్తం ఖరారు
► ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్న సర్కారు ► జిల్లాకు మరో మంత్రి పదవి దక్కేనా..? ► మాగుంటకు మండలి చైర్మన్, లేదా మంత్రి పదవి.. ► శిద్దా రాఘవరావు శాఖలో మార్పునకు అవకాశం ► జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు పదవీగండం! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ప్రకటనతో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా.. రాదా అన్నవిషయం చర్చ నీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవి కాకుండా ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు రెండో మంత్రి పదవి లేదన్న ప్రచారమూ సాగుతోంది. జిల్లా నుంచి ఇప్పటి వరకూ శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాగుంటకు సమీకరణాలను బట్టి మండలి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్ట నుండడంతో చైర్మన్ పదవి రెడ్డి సామాజికవర్గానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మాగుంట సమర్ధుడని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాగుంట మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సభా నియమ, నిబంధనలపై అవగాహన ఉంది. సౌమ్యుడు, అన్ని వర్గాల నుంచి సానుకూలత, సభను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందనే అంశాలను బేరీజు వేసి ఆయనను మండలి చైర్మన్ చేస్తారా.. లేక మంత్రి పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. శిద్దా శాఖలు మారనున్నాయా..!: జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వక పోయినా మంత్రి శిద్దా రాఘవరావు శాఖల్లో మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా రవాణాశాఖ లేదా రోడ్లు, భవనాల శాఖల్లో ఒక శాఖను ఆయన నుంచి తప్పించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శిద్దాపై ముఖ్య మంత్రికి సదాభిప్రాయమే ఉంది. నమ్మిన బంటుగా ఉన్న శిద్దా కోరుకున్నట్లే ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశముందని, శిద్దాకు ఇష్టంలేని పక్షంలో ఆయన శాఖల్లో మార్పులు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం. రావెల పదవికి ఎసరు..: జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబును మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి రావెల పనితీరుపై ముఖ్యమంత్రి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను తప్పించి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రావెలకు జిల్లా ఇన్చార్జి పదవి కూడా ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. -
విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం
విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు. -
'పచ్చ' కలెక్టర్..!
ఒంగోలు : యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ సుజాతశర్మ తెలుగుదేశం పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు విమర్శలకు తావిచ్చింది. ఏరువాక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. తొలకరి వర్షాల నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం రైతులకు ఆనవాయితీ. ఈ ఏడాది తొలిసారిగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ఆత్మ శాఖ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దానిలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో అధికారులు సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టీడీపీ నేత కరణం బలరాం, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిని తెలుగుదేశం జెండాలతో అలంకరించి పసుపుమయం చేశారు. అదే బండిపై మంత్రి, టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ సుజాతశర్మ ఊరేగారు. పార్టీలకతీతంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాత్రం టీడీపీ జెండాలు కట్టిన బండిలో ఊరేగడం విమర్శలకు దారితీసింది. -
రవాణా శాఖలో అవినీతితో తలవంపులు: మంత్రి శిద్ధా
విజయవాడ : రవాణా శాఖలో అవినీతి తలవంపులు తెచ్చేలా ఉందని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. విజయవాడ ఏపీఆర్టీసీ భవన్లో ఏడాది కాలంలో శాఖ పనితీరుపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ... ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడితే అది వారి వ్యక్తిగతంగానే కాకుండా రవాణా శాఖకు కూడా తలవంపు వస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు రవాణా శాఖ సేవల్లో మరింతగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 1,140 ప్రాంతాలను గుర్తించామని... వాటిలో 840 చోట్ల రోడ్ల విస్తరణతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మిగిలిన చోట్ల స్థలాన్ని సేకరించి పనులు చేయాల్సి ఉందన్నారు. కాగా గతేడాది రూ.1,920కోట్ల ఆదాయ లక్ష్యానికి గాను రూ.2,128 కోట్లు వసూలైనట్టు ఈ సమీక్షలో మంత్రికి అధికారులు వివరించారు. -
హోదా తప్పక వస్తుంది : మంత్రి శిద్దా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో చర్చిస్తారని చెప్పారు. రవాణా శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని ఏసీబీకి తామే ఇచ్చి దాడులు చేయిస్తామని అన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదించిన వాటిలో తమ శాఖకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. -
రవాణా అధికారుల రిలీవ్‌కు రెండో జీఓ జారీ
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్ఏవీ ప్రసాదరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వి.సుందర్‌లు ఉన్న ఫళంగా రిలీవ్ కావాల్సిందేనని ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసింది. ఈ నెల 5న వీరిరువురు బదిలీలపై ప్రభుత్వం జీవో నెంబరు 5 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 6న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బదిలీలు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, సీఎం పేషీ ఆగ్రహంతో ఉన్న వైనంపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సర్కారు వెంటనే అధికారులిద్దరూ రిలీవ్ కావాల్సిందేనని రెండో జీవో జారీ చేసింది. దీంతో మంత్రి శిద్ధా, సీఎం పేషీ అధికారి ఒకరు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది. రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీగా పనిచేస్తున్న ప్రసాదరావు తన బాధ్యతల్ని అదనపు కమిషనర్‌కు అప్పగించి వెంటనే రిలీవ్ కావాలని, విజయవాడలో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడలో పనిచేస్తున్న డీటీసీ సుందర్ అనంతపురంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ ఉత్తర్వులిచ్చారు. -
నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రులు పి.నారాయణ, శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కైవల్యానది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మనుబోలు వద్ద చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రెండో రోజు కూడా ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నేడు కూడా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ జానకి సెలవు ప్రకటించారు. -
'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం ఆదివారం నుంచే తప్పనిసరి కాదని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు హెల్మెట్ మనల్ని రక్షిస్తుందని, దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు. -
'ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం'
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా 600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో మంత్రి వర్గం ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ అన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బాదుడుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు చార్జీల భారం పడనుంది. ఈ మేరకు బస్సు చార్జీల పెంపుదలకు రంగం సిద్ధమైంది. 20 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల్ని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు రెండ్రోజుల క్రితం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావును కలసి అందజేశారు. జూన్ మొదటి వారంలో ‘నవనిర్మాణ దీక్ష’ పేరిట ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున.. అవి పూర్తయిన వెంటనే ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు నిర్ణయించారు. తొలుత తెలంగాణలో బస్సుచార్జీలను పెంచిన తర్వాత ఏపీలోనూ పెంచాలని భావించారు. అయితే ఆర్టీసీ ఆస్తుల విభజన మరో మూడు నెలలు వాయిదా పడటం, పరిపాలనపరంగా ఎప్పటి నుంచి వేర్వేరుగా పాలన జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో మొత్తమ్మీద వీలైనంత త్వరగా బస్సుచార్జీలను పెంచేందుకు నిర్ణయించారు. జూన్ 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్షలు, ఈ మధ్యలో జన్మభూమి-మా ఊరు గ్రామసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన వెంటనే పల్లె వెలుగు బస్సుల నుంచి గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వరకు అన్నింటికీ చార్జీల పెంపు వర్తించేలా ప్రతిపాదనలు రూపొందాయి. రెండేళ్లుగా బస్సుచార్జీలు పెంచలేదని, కాబట్టి తప్పక పెంచాలని సూచిస్తూ సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో పేర్కొంది. బస్సు చార్జీల పెంపుతో రాష్ట్రంలోని ప్రయాణికులపై రూ.830 కోట్లకుపైగా భారం పడనుందని అంచనా. -
కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు ప్రారంభం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ చర్చలకు శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో పాటు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. 43 శాతం ఫిట్మెంట్ అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగలతో సమానంగా తమకు ఇవ్వాలని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చారు. వారు చేపట్టిన సమ్మె నేడు 8 వ రోజుకు చేరింది. అయితే అంత ఫిట్మెంట్ ఇవ్వలేమని చంద్రబాబు మంగళవారం తన కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. ఓ వేళ అంత ఫిట్మెంట్ ఇస్తే... ప్రజలపై ఛార్జీల భారం పడుతుందని ఆయన భావిస్తున్నారు. దాంతో ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణాశాఖ మంత్రి, ఎండీతో బుధవారం ఆర్టీసీ కార్మికులు చర్చలు జరుపుతున్నారు.