Siddham
-
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్‌షిప్.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్ వచ్చిందా?. ఇంటికే రేషన్ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్‌పాత పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయ్యాక రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి కోసం ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్లోనే దిశ యాప్. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు? చేశారా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్‌ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్ చేతుల మీదుగానే జరుగుతుంది.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్‌లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్ఆర్(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్ గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. -
చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోవొద్దు: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. .. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?చంద్రబాబు విఫల హామీలుమొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. సెల్ఫీతో సీఎం జగన్ సందడిచిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్‌తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది. -
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్‌కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ. రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన.. నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.కుట్రలు గమనించాలిజరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.అలాగే.. ల్యాండ్ టైటిలింగ్‌యాక్ట్, రిజిస్ట్రేషన్ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్ ఇచ్చారా?.. మరి జిరాక్స్‌లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్ కోరారు. -
పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్
గుంటూరు, సాక్షి: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. కానీ, రియల్‌లైఫ్‌లో పవన్‌కు ఆ పంచ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్ పీరియడ్ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా మారిన సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు. ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుందిబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేజగన్‌కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమేమంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్‌కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
కర్నూలు, సాక్షి: గతంలో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల పాలన కాలంలోనే జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ సర్కిల్లోని ఎస్పీ కాంప్లెక్స్ రోడ్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రచార భేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.కర్నూలు.. సిద్ధమేనా?. ఇంతటి ఎండలో మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.కేవలం నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోటమే. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. మంచి చేసిన మనందరి ప్రభుత్వం ఒకవైపు. గత చరిత్రను మారుస్తూ.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ.. 99 శాతం హామీలు అమలు చేసింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఇదే 59 నెలల కాలంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యింది. అదీ ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా. గతంలో ఎప్పుడూ జరగని గొప్ప మార్పులివి.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, ఐబీ దాకా ప్రయాణం, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?.పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం.. మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా జరిగిందా?.రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను. రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే.. ఇవన్నీ గతంలో చూశారా?స్వయం ఉపాధికి అండగా, తోడుగా.. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న తోడు చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా?..పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. పేదవాడికి ఆరోగ్య ఆసరా.. మొట్టమొదటిసారిగా పేదవాడి కోసం గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.ఏకంగా 600 రకాల సేవలు అందించే గ్రామ సచివాలయం. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను. నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా?.. ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో.. దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ చేశాడు.మాట్లాడితే 14 ఏళ్లు పాలించానని.. మూడు సార్లు సీఎం చేశానని చంద్రబాబు అంటారు. మరి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి, సంక్షేమ పథకం అయినా గుర్తుకు వస్తుందా? అని కర్నూలు అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రసంగించారు. -
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
కర్నూలు, సాక్షి: చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు. ‘‘చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా?. ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్సార్ బిడ్డ మాట’’ అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ‘‘ మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్ నిలదీశారు. మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్, సయ్యద్, మొగల్స్ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు?. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ, సీఏఏ విషయంలో.. ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్ ఇమాందార్‌కు మేం మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
-
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్ డ్యామేజ్ ఎంతలా అంటే.. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్. సైకిల్‌కు పెడెల్ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్ ఏదైనా బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. 👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే జగన్లాగా బాబు బటన్లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
‘నా అక్కాచెల్లెమ్మలందరూ సిద్ధం’
గుంటూరు, సాక్షి: ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ.. పేదల తరఫున పెత్తందారులతో సమరానికి సిద్ధం అయ్యారు వైస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో.. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ సారథికి జనం నీరాజనం పడుతున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. జగన్ వన్స్‌మోర్.. జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా సిద్ధం నినాదాన్ని వినిపిస్తున్నారు కూడా. తాజాగా నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! అంటూ ట్వీట్ చేశారాయన. నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! #VoteForFan#YSRCPStarCampaigners pic.twitter.com/AIxA9Nccsm— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 గత 59 నెలల పాలనలో అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో పాటు పడ్డారు. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బటన్ నొక్కి వాళ్ల ఖాతాల్లోనే జమ చేశారు. అంతేకాదు.. ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే రిజిస్టర్ చేయించారు. అంతటితోనే ఆగకుండా.. సొంత కాళ్ల మీద నిలబడేందుకు పథకాల ద్వారా ఆసరాగా నిలుస్తూ వచ్చారు. అందుకే ఏపీ మహిళా లోకం జగన్ కోసం సిద్ధం అంటోంది. మరోవైపు చంద్రబాబుకు ఉన్నట్లు తనకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని.. తాను చేసిన మంచిని అందుకున్న సామాన్యులే తన స్టార్‌క్యాంపెయినర్లు అని సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. అందుకు తగ్గట్లే.. 12 మంది సామాన్యులను ఎంపిక చేసింది వైస్సార్సీపీ. అందులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్‌లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎస్సార్సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన. దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
వీళ్లా YSR వారసులు?.. పులివెందులలో సీఎం జగన్ ఫైర్
వైఎస్సార్, సాక్షి: ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు.. ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్.. అంతకు ముందు సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ.... పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలే. .. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు?.. ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు... వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వాళ్లా వైఎస్సార్ వారసులు?.. అని ప్రశ్నిస్తున్నా... YSR పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా?. .. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా?. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారు?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా!. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు. అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్‌ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి.ఇదీ చదవండి: సునీత, దస్తగిరి లాలూచీ!.. అవినాష్ లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే.... బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు?. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండి. .. పరిపాలనలోనూ, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్‌ను ఎవరూ కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్లు చెప్పుకోలేరు. వైఎస్సార్, జగన్ పేర్లు చెరిపేయాలని చూసేవాళ్లు మన శత్రువులే. జగన్ బ్రాండ్, వైఎస్సార్ బ్రాండ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తాం. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చాడు. అందుకే మరింత మంచిని అందించే అవకాశం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Siddham: సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాసేపటి కిందటే ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అందుకు ముందు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నామినేషన్ గ్యాప్‌లో తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. సిద్ధం పేరుతో ఒకవైపు వైఎస్సార్సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తాజాగా ట్వీట్ చేశారాయన. Andhra Pradesh Siddham!#VoteForFan— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2024 అంతకు ముందు వైఎస్సార్సీపీ సిద్ధం సభల్లో తన ప్రసంగాలతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల సమయంలోనూ ఆయా జిల్లాలను ఉద్దేశిస్తూ సిద్ధం అని ట్వీట్లు చేసింది చూశాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుస్తూ.. పార్టీలో జోష్ నింపుతూ ఆంధ్రప్రదేశ్ సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. -
పులివెందుల నా ప్రాణం.. శత్రువులతో చేతులు కలిపిన నా చెల్లెమ్మలు.. సీఎం జగన్ డైనమిక్ ప్రసంగం (ఫొటోలు)
-
సరికొత్త నినాదంతో జనంలోకి YSRCP
గుంటూరు, సాక్షి: నిలువెల్లా విషం నింపేసుకున్న రాజకీయ ప్రత్యర్థులు.. అక్కసుతో ఆయనపై రాళ్లు వేయించారు. పైగా సింపథీ డ్రామాలంటూ ఎల్లో మీడియా ద్వారా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కానీ, సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం. సంయమనంతో వ్యవహరిస్తూ.. నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పచ్చ కుట్రల్ని అర్థం చేసుకుంటున్నారు గనుకే జనం సైతం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త స్లోగన్ తెరపైకి రాగా.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొన్నాళ్ల కిందట సిద్ధం.. పేరుతో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం రెండు అక్షరాలతోనే షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం సృష్టించగలిగారాయాన. అంతేకాదు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించి.. అశేష ప్రజా స్పందన దక్కించుకున్నారు. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ విపక్షాలు ప్రచారం చేసుకున్నాయేగానీ అవి అస్సలు వర్కవుట్ కాలేదు. ఆపై కొత్తగా ఎన్ని స్లోగనులు తెచ్చినా.. జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ముందుకు వచ్చింది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్ని మినహాయించి 21 రోజుల యాత్రను చేపట్టారు సీఎం జగన్. మేమంతా సిద్ధంలోనూ సీఎం జగన్‌కు బ్రహ్మరథమే పడుతున్నారు జనం. ఇక ఇప్పుడు.. జగన్ కోసం సిద్ధం అంటూ మరో కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి సంబంధించి ప్రచారాల విషయంలో వైఎస్సార్సీపీ మొదటి నుంచి దూకుడునే ప్రదర్శిస్తోంది. వైవిధ్యతతో జనాల్ని ఆకట్టుకోగలగడమే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ విషయంలో అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైఎస్సార్సీపీకి దరిదాపుల్లోకి రాలేకపోవడం గమనార్హం. -
పల్లెల్లో అపూర్వ ఆదరణ
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది. శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మూడో రోజు యాత్ర సైడ్‌లైట్స్ ♦ ఉదయం 9.30 గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను పెంచికలపాడు శిబిరంలో కలిశారు. ♦ 10.35 గంటలకు పెంచికలపాడులోని రాత్రి బస శిబిరం నుంచి సీఎం వైఎస్ జగన్ బయటకు వచ్చి బస్సు ఎక్కారు. అక్కడ భారీగా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ♦ 11.35 గంటలకు సీఎం జగన్ కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. ♦ 11.38 గంటలకు సీఎంకు కోడుమూరులో చేనేతలు మగ్గం, నేసిన చీరను బహూకరించారు. గొర్రెల పెంపకందారులు గొర్రె పిల్లలను అందించి తమ అభిమానం చాటుకున్నారు. ♦ 11.45 గంటలకు కోడుమూరులో బుడగ జంగాలు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎ జగన్ హామీ ఇచ్చారు. ♦ 12.20 గంటలకు కోడుమూరు మండలం వర్కూరుకు బస్సు యాత్ర చేరుకుంది. ♦మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం బస్సుయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగొండ్ల మండలం వేముగోడుకు చేరుకోగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా ఘన స్వాగతం పలికారు. ♦ 1.59 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర గోనెగండ్ల చేరుకోగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. ♦ 2.30 గంటలకు సీఎం జగన్ భోజన విరామం కోసం గోనెగండ్ల మండలం రాళ్లదొడ్డిలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు. ♦ సాయంత్రం 4 గంటలకు గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరగా, ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. ♦ సాయంత్రం 5.45 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ♦ రాత్రి 7.14 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామానికి సీఎం జగన్ చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ♦ 7.25 గంటలకు ఎమ్మిగనూరు మండలం అరెకల్కు, అక్కడి నుంచి 8.15 గంటలకు ఆదోని క్రాస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ♦ 8.20 గంటలకు ఆదోని నియోజకవర్గం విరుపాపురం చేరుకున్నారు. ♦ 9 గంటలకు ఆలూరు నియోజవకర్గం బిణిగేరి మీదుగా ఆస్పరి చేరుకున్నారు. ♦ 9.30 గంటలకు చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైసాస్ చేరుకోగా నేతలు అపూర్వ స్వాగతం పలికారు. ♦ రాత్రి 9.47 గంటల సమయంలో పత్తికొండ మండలం రాతన సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. నేడు తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి 4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగనుంది. బస్సు యాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం రాత్రి వెల్లడించారు. పత్తికొండలో రాత్రి బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుని ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి.. గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
వచ్చే ఎన్నికల్లో YSRCP గెలిచే ఛాన్స్ ఎంత...ఆధారాలతో శేఖర్ రెడ్డి
-
ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం
-
షార్లెట్‌లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు) -
నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ..
-
ప్రజలకు చేసిన మేళ్లే..మరో చారిత్రక విజయానికి మెట్లు
-
నంద్యాల సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
Best Photos Of Siddham : మేమంతా సిద్ధం (ఫొటోలు)