stab
-
కరోనాను వ్యాప్తి చేస్తుందని నర్సింగ్ స్టూడెంట్‌పై కత్తితో దాడి
బెంగళూరు: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో వారి పట్ల కృతజ్ఞత చూపకపోయిన పర్వాలేదు కానీ అవమానించడం సమంజసం కాదు. కానీ చాలా చోట్ల జనాలు తమ చుట్ట పక్కల నివాసం ఉండే వైద్య సిబ్బందిని అవమానిస్తూ.. వారిపై దాడులకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్ విద్యార్థిని వల్ల తమకు వైరస్ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో దాడి చేశారు. అంతటితో ఆగక ఆమె తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించారు. ఆ వివరాలు.. బెంగళూరు ఇందిరానగర్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ప్రియదర్శి(20) నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తల్లి కోవిడ్ బారిన పడింది. ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్ సోకింది. ఈ క్రమంలో ప్రభు, ప్రియదర్శి వల్లే తాను కోవిడ్ బారిన పడ్డానని ఆరోపించసాగాడు. ఆమె కుటుంబం వల్లనే తనకు కరోనా సోకిందని ఆరోపిస్తూ.. మూడు రోజుల క్రితం ప్రియదర్శి తండ్రితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ప్రభు సోదరులు ఇద్దరు అతడితో కలిసి బాధితురాలి తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించసాగారు. ఈ క్రమంలో ప్రియదర్శి వారిని వారించడం కోస ప్రయత్నించగా.. ప్రభు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియదర్శి చెయ్యి తెగింది. దాంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రియదర్శి సోదరి సప్న మాట్లాడుతూ.. ‘‘ప్రభుకి కరోనా సోకిన నాటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. మాపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారు’’ అని తెలిపింది. ప్రియదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభు, అతడి సోదరుల మీద కేసు నమోదు చేశారు. చదవండి: కుంభమేళా ఎఫెక్ట్: ఒక్కరి వల్ల 33 మందికి కోవిడ్ -
తనను తాను గుర్తుపట్టలేక.. భర్తపై దాడి
మెక్సికో సిటీ: అల్జిమర్స్ వ్యాధి వస్తే.. తప్ప ఓ వ్యక్తి తనను తాను మర్చిపోవడం అసంభవం. చిన్పప్పటి నుంచి ముసలి వారు అయ్యేవరకు వేర్వేరు వయస్సులో మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా పాత ఫోటోలు కనిపిస్తే.. వాటిల్లో మనల్ని చూసుకుని.. మురిసిపోతూ.. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం. కానీ మెక్సికోలో మాత్రం ఓ పాత ఫోటో భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త పక్కన ఉన్నది తానే అని గుర్తు పట్టలేని మహిళ.. అతడిపై కత్తితో దాడి చేసింది. వివరాలు.. లియోనోరా ఎన్, జువాన్లకు వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది. పైగా ప్రేమ వివాహం. ఇదిలా ఉండగా.. ఓ సారి జువాన్ తాము ప్రేమించుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలు పూర్తిగా పాడయిపోవడం గమనించాడు. దాంతో వాటిని డిజిటలైజ్ చేయించాడు. యవ్వనంలో ఉండగా తీసిన ఫోటోలు.. పైగా డిజిటలైజేషన్ చేయించడంతో అవి మరింత అందంగా ఉన్నాయి. (చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు) ఇక ఈ ఫోటోల్లో అతడి భార్య ఎంతో స్లిమ్‌గా.. అందంగా ఉంది. అలా ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటోని జువాన్ తన మొబైల్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడు. పాపం అప్పుడతడికి తెలియదు.. ఆ ఫోటో తన ప్రాణాల మీదకు తెస్తుందని. ఓ రోజు భార్య ఈ ఫోటోని చూసింది. జువాన్ పక్కన ఉన్నది తానే అని గుర్తుపట్టలేకపోయింది. దాంతో భర్త పెళ్లికి ముంద మరో స్త్రీతో రిలేషన్లో ఉన్నాడని అనుమానించింది. ఆ కోపంలో కత్తి తీసుకుని భర్త మీద దాడి చేసింది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని జువాన్ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయటకు పరుగు తీశాడు. ఎలాగో అలా పోలీసులకు కాల్ చేయడంతో వారు వచ్చి జువాన్ భార్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కోపానికి కారణం చెప్పడంతో షాక్ అయిన జువాన్.. ఆ ఫోటో తమదేనని.. డేటింగ్ చేసే రోజుల నాటి ఫోటోని తాను డిజిటలైజ్ చేయించానని చెప్పాడు. పాపం తనను గుర్తుపట్టలేకపోయినా లియానారో కాస్త ఆలస్యం అయ్యుంటే భర్తను చంపేసేది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ , లావణ్య అనే యువతిని మూడు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన సునీల్ తనను ప్రేమించాల్సిందిగా బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రేమోన్మాది ఆత్మహత్య)\ -
పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి
ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాల్వీని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని యోగేశ్‌కుమార్ మహిపాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉత్తర ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీపై నిందితుడు యోగేశ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్లో యోగేశ్ కుమార్ తనకు ఏడాదిగా తెలుసని.. ఇద్దరం స్నేహితులమని తెలిపింది. ఈ క్రమంలో యేగేశ్ మాల్వీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది’ అని తెలిపారు. (చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ) ఈ నేపథ్యంలో సోమవారం కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీని యోగేశ్ అడ్డగించాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని.. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఇక యోగేష్.. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. తనను తాను నిర్మాతగా చెప్పుకుని మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. -
తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని
చండీగఢ్: తల్లిదండ్రులు తనకు సరైన ప్రధాన్యం ఇవ్వడం లేదనే కారణంతో వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు గుర్గావ్కు చెందిన ఓ వ్యక్తి. ఈ ఘనటనలో తండ్రి అక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. మృతుడు సుశీల్ మెహతా దంపతులకు రిషబ్ మెహతా, మయాంక్ మెహతా ఇద్దరు సంతానం. అయితే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు తనకన్నా తమ్ముడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రిషబ్ భావించేవాడు. దాని గురించి నిత్యం తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కూడా రిషబ్, తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆ కోపంలో కత్తితో వారిపై దాడి చేశాడు రిషబ్. ఈ గొడవలో సుశీల్ మెహతా అక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన రిషబ్ తల్లిని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. రిషబ్ తల్లిదండ్రులతో గొడవపడే సమయంలో మయాంక్ ఇంట్లో లేడు. పండ్లు తీసుకురావడం కోసం మార్కెట్‌కు వెళ్లాడు. పక్కింటి వ్యక్తి ఈ గొడవ గురించి మయాంక్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడు ఇంటికి వచ్చే సరికి రిషబ్.. తన తండ్రిపై దాడి చేస్తూ కనిపించాడు. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మయాంక్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరడంతో రిషబ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం మయాంక్ తన తల్లిదండ్రులను ఆస్పత్రికి తీసుకెళ్లగా సుశీల్ మెహతా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తల్లిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాడు మయాంక్. కేసు నమోదు చేసిన పోలీసులు రిషబ్ కోసం గాలిస్తున్నారు. -
ఐసీయూ వెలుపల సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానికి సమీపంలోని గురుగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన గార్డు కత్తితో దాడి చేసిన ఘటనలో మరో సెక్యూరిటీ గార్డు మరణించారు. శీతల్ ఆస్పత్రిలోని ఐసీయూ వెలుపల జరిగిన ఈ దాడిలో బాధితుడని జుగల్ కిషోర్‌గా గుర్తించారు. సెక్యూరిటీ గార్డు కిషోర్‌ను కత్తితో పొడిచిన నిందితుడు నౌఫిల్ అన్వర్ హత్యానంతరం పరారయ్యాడని పోలీసులు చెప్పారు. దాడి జరిగే సమయంలో ఆస్పత్రి ఎంట్రన్స్ గేట్ వద్ద అన్వర్ ఉండగా, మూడో ఫ్లోర్‌లోని ఐసీయూ వెలుపల కిషోర్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్వర్ కిషోర్‌పై దాడిచేసి అతని ఛాతీ, ముఖం, పొట్టపై కత్తితో పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడని డీసీపీ వెస్ట్‌జోన్ సుమీర్ సింగ్ చెప్పారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, బాధితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసి, ఇతర గార్డులను ప్రశ్నించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. -
అమ్మాయిలను పార్టీకి పిలిచాడని..
ఇస్లామాబాద్ : విద్యార్థినులను పార్టీకి ఆహ్వానించాడనే కారణంతో ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపాడో స్టూడెంట్. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఖలీద్ హమీద్ అనే వ్యక్తి బహవాల్పూర్లోని ప్రభుత్వ సాదిఖ్ ఎగెర్టన్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి విద్యార్థినులను కూడా ఆహ్వానించాడు. అయితే ఆడపిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఓ విద్యార్థి కత్తితో సదరు ప్రొఫెసర్ మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి మతతత్వ సంస్థల ప్రమేయం లేదని తెలిపారు పోలీసులు. అయితే విద్యార్థి గత జీవితం, మానసిక పరిస్థితి వంటి అంశాల గురించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్‌లోని ఎగెర్టన్ కాలేజీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలలో 4 వేల మంది ఆడ పిల్లలు చదువుతుండగా.. అబ్బాయిలు కేవలం 2000 మంది మాత్రమే ఉండటం విశేషం. -
సోషల్ మీడియా, సినిమాల ఎఫెక్ట్‌తో వీరంగం
సాక్షి, నల్లగొండ : పాత కక్షలను మనసులో పెట్టుకొన్న ఓ ఇంటర్ విద్యార్థి.. తోటి విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ సంఘటనన నల్లగొండ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం దోరేపల్లికి చెందిన పసునూరి ప్రవీణ్(18), అదే గ్రామానికి చెందిన బరపాటి లక్ష్మణ్(17)ల మధ్య వారం రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అది కాస్తా ముదిరి ఘర్షణకు దారితీసింది. బుధవారం ప్రవీణ్ బస్టాండ్ వద్ద కూర్చొని ఉండగా, అదే సమయంలో లక్ష్మణ్, తన అన్న చందుతో కలిసి అక్కడికి వచ్చాడు. దీంతో వారిమధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో లక్ష్మణ్ తమ బంధువులైన శ్రీధర్, శివాజీలకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. నలుగురు కలిసి ప్రవీణ్‌తో ఘర్షణ పడ్డారు. ఆ కోపంలో ప్రవీణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మణ్ ఛాతిపై పొడవగా, అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మిగతా ముగ్గురిపై దాడిచేసి గాయపరిచాడు. అక్కడే ఉన్న ప్రశాంత్ అనే యువకుడు ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్చారు. లక్ష్మణ్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ మర్చరీకి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. గొడవ విషయం మాట్లాడదామని అనుకుంటుండగా ఒక్కసారిగా ప్రవీణ్ కత్తితో దాడి చేసాడని చికిత్స పొందుతున్న బాధితుడు దాసరి శివాజీ పేర్కొన్నాడు. గాయపడిన వారిలో చందు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా, సినిమాల ఎఫెక్ట్ : ఎస్పీ టీనేజ్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ, హత్య విషయంపై జిల్లా ఎస్పీ రంగనాథ ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే సోషల్ మీడియా, సినిమాల ప్రభావం కొట్టిచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు. కేసును సీరియస్‌గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. ఇంటర్ విద్యార్థి ప్రవీణ్ నలుగురి మీద దాడి చేయడం.. ఒకర్ని హత్య చేయడంతో ప్రస్తుతం దోరేపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. -
ప్రేమను కాదన్నందుకు అతి కిరాతకంగా..
జైపూర్ : దేశంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించదనే నేపంతో ఓ యువతి గొంతు కోసి చంపడమే కాక అడ్డగించిన యువతి తల్లిని కూడా గాయపర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కి చెందిన షకీల్ ఖాన్(22) అనే వ్యక్తి సైన్ బోర్డ్ పేయింటర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఖుశన్‌సీబా అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమె అతని ప్రేమను ఒప్పుకోలేదు. కొన్నేళ్ల తరువాత షకీల్ దుబాయి వెళ్లాడు. గత నెల 20న ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరో సారి ఖుశన్‌సీబాను కలిసి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఖుశన్‌సీబాపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతిని చంపేయాలని భావించాడు. అందులో భాగంగా షకీల్ తన ఇంటి నుంచి కత్తి తీసుకుని ఖుశన్‌సీబా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి, ఆమె తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన షకీల్, ఖుశన్‌సీబాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. కూతుర్ని కాపాడ్డానికి ప్రయత్నించిన తల్లిని కూడా గాయపర్చాడు. ఇంతలో ఇంటికి వచ్చిన సోదరుడు జరిగిన దారుణాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. సోదరున్ని చూసి పారి పోతున్న షకీల్‌ని పట్టుకోవడానికి కొందరు యువకులు ప్రయత్నించారు. కానీ తప్పించుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం షకీల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన షకీల్, ఖుశన్‌సిబాని తప్పక వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకున్నాడని.. అందుకే ముందే ఆమె పేరు మీద ముందే దుబాయికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాడని పోలీసులు తెలిపారు. -
54 సార్లు పొడిచి.. గొంతుకోసి స్టేషన్‌కు
బాంద్రా : ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఆంగ్లంలో మాట్లాడి తనను అవమానించాడనే అక్కసుతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 54 సార్లు కత్తితో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడి గొంతును చీల్చాడు. ఈ భయానక సంఘటన గత బుధవారం చోటు చేసుకున్నప్పటికీ నిందితుడు పోలీసులకు నేరుగా లొంగిపోయిన తర్వాతే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అమిర్ అబ్దుల్ వహీద్ రహిన్ (21), మహ్మద్ అఫ్రాజ్ అలాం షేక్ (18) ఇద్దరు స్నేహితులు. అయితే, అఫ్రాజ్ పలుమార్లు రహిన్ ముందు ఆంగ్లంలో మాట్లాడుతూ హేళన చేశాడట. దాన్ని అవమానంగా భావించిన రహిన్ ఎలాగైనా అఫ్రాజ్‌ను హత్య చేయాలనుకున్నాడు. అందుకోసం వారం రోజులపాటు ఆలోచించి ప్లాన్ వేసుకున్నాడు. బుధవారం బయటకు వెళ్లి సరదాగా కూల్ డ్రింక్ తాగి వద్దామని తీసుకెళ్లాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసం చనిపోయాడని నిర్ధారించుకునే వరకు 54సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో స్టేషన్‌కు వెళ్లి రహిన్ లొంగిపోయాడు. -
మహిళా ప్రొఫెసర్‌కు 15 కత్తిపోట్లు
సాక్షి, చెన్నై: మధురై కామరాజ్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను, పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన వ్యక్తి కత్తితో 15 సార్లు పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధురై కామరాజర్ విశ్వవిద్యాలయం సాంకేతిక సమాచార విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జెనిఫా (42) పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో పార్ట్‌టైం ప్రొఫెసర్‌గా జ్యోతి మురుగన్ పనిచేసేవాడు. అతడు సరిగ్గా పనికి రావటం లేదని జెనిఫా పలుమార్లు మందలించారు. అయినా అతని తీరు మారకపోవటంతో విధుల నుంచి తొలగించారు. దీంతో అతనికి జెనిఫాపై అతను కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జెనిఫా విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఉండగా జ్యోతి మురుగన్ వచ్చాడు. తనను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆవేశంతో ఊగిపోయిన మురుగన్, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 15సార్లు పొడిచాడు. ఆమె కేకలను విన్న తోటి ప్రొఫెసర్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెని రక్షించే ప్రయత్నం చేశారు. చికిత్స కోసం పుదుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రస్తుతం మధురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నాగమలై పుదుకోట పోలీసులు మురుగన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లుగా చెప్పి వివాహం చేసుకున్నానని, ఇప్పుడు భార్య తరఫు వారు ఉద్యోగం లేదని అడుగుతున్నారని, అందుకే, మళ్లీ ఉద్యోగం ఇవ్వమని జెనిఫాను తాను కోరగా.. ఆమె తిరస్కరించిందని అందుకే కోపంలో దాడి చేసినట్లు మురుగన్ తెలిపాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని మధురై ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
బైక్‌పై వచ్చి ఇంటర్ అమ్మాయిని చంపేశారు
బల్లియా: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కు వెళుతున్న ఓ విద్యార్థినిని అడ్డుకొని వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుచెప్పిందని హత్య చేశారు. కిందపడేసి ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా పొడిచారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణంపోయిందన వైద్యులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాజా అనే గ్రామానికి చెందిన రగ్నీ దుబే అనే 17ఏళ్ల అమ్మాయి తన సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరింది. రెండు బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు బాన్‌సీదేహ్ అనే ప్రాంతంలో ఆమెను అడ్డుకున్నారు. వారితో మాట్లాడాలని బలవంతపెట్టారు. అందుకు యువతి నిరాకరించడంతో ఆమెను సైకిల్‌పై నుంచి తోసి కిందపడేశారు. ఆ తర్వాత పదేపదే కత్తితో పొడిచి రక్తపుమడుగులో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. గత కొంతకాలం నుంచే ప్రస్తుతం దారుణానికి పాల్పడిన యువకులు ఆ యువతి వెంటపడుతున్నారట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. -
ఇండియన్ వైద్య విద్యార్థి హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తనతోపాటే ఉంటున్న ఓ యువకుడు ఓ భారతీయ మెడికల్ విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర కత్తిపోటు గాయాలతో మెడికల్ విద్యార్థి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతీఫ్ షేక్ అనే మెడికల్ విద్యార్థి విన్సన్ మెయిస్నామ్ సింగ్(23) అనే వ్యక్తితో కలిసి ఢాకాలోని అక్బర్ షా అనే ప్రాంతంలోని ఓ ఆరంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. అతడు చిట్టగాంగ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తొలుత సింగ్, అతీఫ్ మధ్య గొడవ ప్రారంభమై అనంతరం కత్తిపోట్ల వరకు దారి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, వీరితోపాటు మరో ఇద్దరు కూడా ఉంటున్నారని చెప్పారు. వారిలో ఒక యువతి కూడా ఉన్నారని తెలిపారు. వీరంతా కూడా మణిపూర్‌కు చెందిన వారని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన అనంతరం సింగ్ ఉరేసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన తోటి ఇద్దరు అతడిని అడ్డుకున్నారని, కత్తిపోట్లకు గురైన అతీఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు వివరించారు. -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య
న్యూయార్క్: 26 ఏళ్ల భారత సంతతి వ్యక్తి అమెరికాలో తన సోదరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్‌గా పనిచేసిన శరణ్‌జిత్ సింగ్ 2013లో అమెరికాకు వెళ్లాడు. తన కజిన్ సోదరుడు లవ్‌దీప్ సింగ్(24)తో కలిసి క్వీన్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 26న సోదరుల మధ్య వివాదం తలెత్తడంతో లవ్‌దీప్ సింగ్.. శరణ్జీత్పై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సోదరుడిని హత్యచేసినట్లు లవ్జీత్ అంగీకరించాడని విచారణ అదికారులు వెల్లడించారు. అయితే.. ఈ హత్య వెనుకాల గల కారణాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. శరణ్జీత్ తల్లిదండ్రులు భారత్‌లోనే ఉన్నారు. లవ్జీత్కు 25 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. -
‘ఆస్పత్రిలో ఉన్నప్పుడే చంపాలని డిసైడ్ అయ్యా..’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మైనర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కిందట తన సోదరిని ఏడిపించి తనపై కత్తితో దాడికి పాల్పడిన వారిపై ప్రతీకార దాడులు చేసి ఒకే రాత్రి రెండు హత్యలు చేశాడు. ఇందులో ఒక హత్యలో తన మిత్రుడు పాల్గొనగా మరో హత్యను ఒంటరిగా చేశాడు. అయితే, గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నాడు. గత ఏడాది సునీల్, కులదీప్ అనే ఇద్దరు యువకులు ప్రస్తుతం హత్యకు పాల్పడిన మైనర్‌తో తరుచూ గొడవపడుతుండేవారు. పైగా ఒకసారి వారి సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అతడిని కత్తితో పొడిచారు. అనంతరం వారిలో సునీల్ అనే వ్యక్తిని జైలులో వేయగా అతడు ఇటీవలె పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఇదే అదనుగా చూసుకున్న మైనర్ తన స్నేహితుడు మనోజ్‌ను పిలిపించుకొని ఖ్యాలా ప్రాంతానికి సునీల్కోసం వెళ్లారు. అతడితో ఏదో మాట్లాడాలని ఓ పార్క్‌కు పిలిచి ఓ ఐదు నిమిషాల తర్వాత నాలుగుసార్లు కత్తితో పొడిచి రక్తపు మడుగులో పడేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ ఓ వ్యక్తి దగ్గర నుంచి బంగారం చైన్ లాక్కొని వెళ్లే క్రమంలో మనోజ్ తల్లి దండ్రులు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. దాంతో మనోజ్ వెళ్లిపోగా మైనర్ మాత్రం మరో హత్య చేసేందుకు కులదీప్ వద్దకు వెళ్లాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో అతడిని బయటకు పిలిచి ఏకంగా 20సార్లు అదే కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోగా తొలుత మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి సహాయంతో మైనర్‌ను అరెస్టు చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇక ఎలాంటి గొడవలు ఉండొద్దనే తాను ఈ హత్యలు చేశానని నేరాన్ని అంగీకరించాడు. -
ఐసిస్‌పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి..
జర్మనీ: సాధారణంగా ప్రతిసారి ఉగ్రవాదులు దాడి చేస్తుంటారు. వారు సృష్టించే మారణకాండను సామాన్యులు అసహ్యించుకుంటారు. వారిపట్ల సానుభూతి అనేది ఏ ఒక్కరికీ ఉండదు. కానీ తొలిసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావానికి గురై, వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన బాలికను జర్మనీ పోలీసులు కటకటాల్లోకి పంపించారు. దాదాపు ఆరేండ్ల కాలంపాటు ఆ బాలిక జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని హనోవర్ ప్రాంతంలో సఫియా ఎస్ అనే బాలిక 16, (దాడి చేసే సమయంలో 15 ఏళ్లు) ఇస్లామిక్ స్టేట్ భావాజాలానికి ప్రేరేపితురాలై వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిని కత్తితో దారుణంగా పొడిచి గాయాల పాలు చేసింది. ఆ బాలిక అలా దాడి చేయడానికి గల కారణాలను ప్రశ్నించగా తాను ఉగ్రవాద సంస్థను కాపాడేందుకు ఈ పనిచేసినట్లు తెలిపింది. దీంతో ఆ బాలికను అరెస్టు చేసి విచారణ అనంతరం కోర్టుకు తీసుకెళ్లగా ఆరేళ్ల శిక్ష పడింది. -
ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైమ్ రిపోర్టర్‌పై దాడి
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్‌లో నివాసం ఉంటున్న ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైం రిపోర్టర్ పవన్‌కుమార్(40), ఆయన మేనత్త హైమవతిపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. పవన్ సమీప బంధువు శ్రీనివాస్(36) ఇద్దరిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు క్షతగాత్రులను నాగోల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలవల్లే ఈ దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. -
అమ్మాయిలా చాటింగ్.. ఉన్మాదిలా కత్తిపోట్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయిగా పరిచయం చేసుకొని దగ్గరై నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గీతా నగర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమిత్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్ లో ఓ నకిలీ ఖాతా క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఖాతాలో తనను ఒక అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. పేరు అధర్వగా పేర్కొన్నాడు. అనంతరం ప్రియా రావత్(17) అనే అమ్మాయితో అమ్మాయిగానే పరిచయం పెంచుకున్నాడు. చివరకు ప్రియాకు ఈ విషయం తెలిసి ముఖం చాటేసింది. అతడితో చాట్ చేయడం మానేసింది. దీంతో ఆ యువకుడు ఆమెను కలిసేందుకు వస్తానంటే నిరాకరించింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు తనతో మాట్లాడాలని బ్రతిమిలాడాడు. అయితే, తనకు అబద్ధం చెప్పి మోసం చేశావని, మాట్లాడటం, చాట్ చేయడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తి పోట్లు పొడిచాడు. ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయే క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు. -
ఇంట్లో ఫిర్యాదు చేశారని టీచర్ని దారుణంగా..
న్యూఢిల్లీ: తమ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రత్యక్ష దైవం గురువు అంటే గౌరవం, మర్యాద లెక్కలేకుండా పోయి చాలా రోజులయింది. అయితే, అదే గురువుపై ప్రస్తుతం భయం కూడా పోవడమే కాకుండా విచక్షణ కూడా లేకుండా పోయిందని ఓ సంఘటన స్పష్టం చేసింది. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తమ దుష్ప్రవర్తన గురించి ఇంట్లో ఫిర్యాదు చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు కత్తితో దాడి చేశారు. ఆరేడుగురు కలిసి ఆ ఉపాధ్యాయుడిని దారుణంగా పొడవడంతో ఆయన ప్రాణాలుకోల్పోయాడు. ఈ నేరానికి పాల్పడినవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోగల గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూలు యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం.. ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ సోమవారం పరీక్ష నిర్వహిస్తుండగా తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థులు అక్కడే అతడిని కత్తితో పొడిచారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. -
ఆలస్యంగా వచ్చిందని తండ్రి ఎంతపని చేశాడు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చిందని ఓ కూతురుని కన్నతండ్రి ఇష్టం వచ్చినట్లు కొట్టి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు రోజులపాటు ఆ అమ్మాయిని ఇంట్లో పడేసి తాళం వేసి ఉంచాడు. ఎట్టకేలకు ఆ అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా తండ్రి పరారయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రాజ్ నగర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి ఆ అమ్మాయి వెళ్లింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తూనే ఆమెపై తండ్రి చేయి చేసుకున్నాడు. అనంతరం బాగా కొట్టి కత్తితో గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి తప్పించుకొని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. దీంతో ఆ అమ్మాయిని లోపలే ఉంచి తాళం పెట్టాడు. అనంతరం పోలీసులు అరెస్టు చేస్తారని పారిపోయాడు. ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయి తల్లే పోషిస్తోంది. -
చదవడంలేదని కొడుకుని పొడిచేశాడు
టోక్యో: సరిగా చదవనందుకు ఓ తండ్రి కుమారుడిని పొడిచేశాడు. వంటింట్లో కూరగాయలు కట్ చేసే కత్తితో పొడవడంతో పన్నేండేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జపాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ జూనియర్ హైస్కూల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించి బాగా చదవాలని కెంగో సతాకే (48) అనే ఓ తండ్రి తన పన్నేండేళ్ల కుమారుడికి చెప్పాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి వంటింట్లో కత్తితో కుమారుడిని పొడిచాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అప్పటికే అతడికి రక్తం సరిపోక ప్రాణాలు విడిచాడు. వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్టు చేశారు. కోపంలో పొరపాటున తాను అలా చేశానని, మంచి స్కూల్లో సీటు వస్తే ఆశించే అతడిని బాగా చదవాలని చెప్పానని తెలిపాడు. కాగా, చదువు విషయంలో అతడు రోజూ తన కుమారుడిని తిడతాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
దంపతులను కత్తితో పొడిచి..
రూ. 5 వేల దోపిడీ ఆత్మకూర్(ఎం)లో దుండగుడి హల్చల్ ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఓ దుండగుడు హల్చల్ సృష్టించాడు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి రూ. 5 వేలు దోచుకుపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లోడి సోమయ్య, లోడి రాములమ్మ దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రిదుండగుడు ప్రహరీ ఎక్కి స్లాబ్ మీదుగా ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశాడు. రూ. 5 వేల నగదును అపహరించాడు. తర్వాత మంచంపై పడుకున్న రాములమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు పుస్తెల తాడును లాక్కొనే ప్రయత్నం చేస్తుండగా ప్రతిఘటించింది. దీంతో దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో మెడపైభాగాన పోడిచాడు. సమీపంలోనే మంచం మీద పడుకున్న సోమయ్య మేల్కొని అడ్డురావడంతో అదే కత్తితో చాతి, మెడపై భాగాన పొడిచాడు. కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారి అలికిడి విని ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి. శివనాగప్రసాద్ అక్కడకు వచ్చారు. తీవ్ర గాయాలు అయిన సోమయ్య, రాములమ్మలను చికిత్స నిమ్తితం 108 అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. జాగిలాలతో గాలింపు దుండగుడి ఆచూకీ కోసం క్లూస్‌టీంను రంగంలోకి దిగారు. బీరువాపై ఉన్న వేలు ముద్రలను సేకరించారు. దుండగుడు అక్కడే వదిలేసిన చెప్పుల వాసనతో పోలీసు జాగీలంతో గాలింపును మొదలు పెట్టారు. పోలీసు జాగిలం మొరిపిరాల రోడ్డు మార్గాన పరిగెత్తి అక్కడ నుంచి ఇసుక ట్రాక్టర్ల బాట గుండా బిక్కేరు వాగు మీదుగా చిన్న గూడెం నుంచి మొరిపిరాల మీదుగా కాల్వపల్లి రోడ్డు వైపు అటు నుంచి తిరిగి మొరిపిరాల బండ వరకు వచ్చి ఆగిపోయింది. సంఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. శ్రీదర్‌రెడ్డి, ఎస్ఐ పి. శివనాగప్రసాద్ సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
దారుణంగా మహిళను 32సార్లు పొడిచి..
నోయిడా: తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. వినేందుకే ఒళ్లుగగుర్పొడిచే తీరుగా ఆమెను హత్య చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32సార్లు కత్తితో పొడిచిపొడిచి చంపేశాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వరుణ్ గోయల్(27)కు నోయిడాలోని సెక్టార్ 63లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహిళకు పరిచయం అయింది. ఘజియాబాద్ లోని ఇందిరాపురం శక్తి ఖండ్ ప్రాంతానికి చెందిన ఇతడు జిమ్ మాస్టర్ గా పనిచేస్తుండగా ఆమె జిమ్ వెళ్లడం ద్వారా పరిచయమేర్పడింది. ఆ పరిచయం చనువుగా మారి గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ ఉంటున్న అపార్ట్ మెంట్లోనే ఉంటున్నారు. అయితే, పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి చేయడంతో అందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో వారిమధ్య ఘర్షణ ముదిరి అతడు వంటగదిలోని కత్తితో 32సార్లు పొడిచి హత్య చేశాడు. -
మంచి నాన్నను చంపేశారు
లండన్: అతడు ఓ డ్రైవర్. తనపని తాను శ్రద్దగా చేసుకుంటూ వెళ్లడం తప్ప ఇంకేం తెలియదు. నలుగురితో భలే మంచివాడని అనే పేరు సంపాధించుకున్నాడు. పొద్దంతా బస్సు నడపడం, సెలవుల్లో తన పిల్లలతో గడపడం ఇదే అతడి సరదా. భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే.. మంచి నాన్న, మంచి భర్త, నలుగురికి మంచి మనషి. అలాంటి వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా పొడిచి చంపేశారు. సెలవు రోజు ఇంట్లో తన కారును తుడుచుకుంటున్న వ్యక్తిని అకారణంగా హత్య చేసి వెళ్లిపోయారు. అయితే, ఆ హత్య చేసింది దోపిడి దొంగలని పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా అనుమానిస్తున్నారు. స్టేజ్ కోచ్ సంస్థలో జాన్ కిల్తీ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు పార్క్ రోడ్డులోని తన నివాసం వద్ద కారును తుడుచుకుంటుండగా కొందరు వ్యక్తులు ఆ కారుపై దాడి చేసేందుకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడ్ని దారుణంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ నేరస్తుల కోసం గాలింపులు చేపట్టారు. చనిపోయన జాన్‌కు ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె ఉంది. జాన్ చాలా మంచివాడని అక్కడ చుట్టుపక్కలవారు చెబుతున్నారు. -
'శృంగారానికి నో అందని పొడిచిపొడిచి చంపా'
లండన్: తనతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించిందనే కారణంతో తన ఫ్లాట్ మేట్, ప్రముఖ ఫ్యాషన్ బయర్ కాటి రూర్కే(27)ను పొడిచిపొడిచి చంపినట్లు గ్యారీ స్టీవెన్సన్(27) తెలిపాడు. లండన్ కు చెందిన గ్యారీ స్టీవెన్సన్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అతడు కాటి రూర్కే అనే ఫ్యాషన్ బయర్ తో బాగా చనువుగా ఉండేవాడు. గ్లాస్గోలోని క్రెయిగ్టాన్లోగల మింటో వీధిలోని గమ్ ట్రీ అపార్ట్ మెంట్లో వారు ఉండేవారు. డిసెంబర్ 29 రాత్రి వారిద్దరి మధ్య తొలుత ఒక స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అతడు ఆమెను తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంత పెట్టాడు. కానీ, ఆమె నిరాకరించింది. దీంతో అతడు కోపంతో ఆమెను కత్తితో పొడిచేసి అదే ఫ్లాట్ లో పడేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆ రోజు జరిగిన వివరాలు తెలియజేస్తూ 'నేను ఆరోజు ఆమెను పొడిచాను. మూడుసార్లు పొడిచానని అనుకుంటున్నాను. ఒక వేళ ఆమెను కాకుంటే మరొకరిని అయి ఉండేదేమో. ఆ సమయంలో నా పరిస్థితి అలా ఉంది. కుటుంబం కోసం ఆ రోజు ఓ నిజం చెప్పాలని అనుకున్నాను. కత్తితోపొడిచేందుకు ముందు బలంగా చాలాసార్లు కొట్టాను. మా మధ్య ఒప్పందం కుదరకపోయే సరికి నాపై నియంత్రణ కోల్పోయాను. అంతే ఆమెను కొట్టడం ప్రారంభించి ఇక ఆపలేకపోయాను. అలా కొడుతూ కొడుతూ కొడుతూనే ఉండి.. తర్వాత పొడిచేశాను' అని వివరణ ఇచ్చాడు.