stickers
-
పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?
మాములుగా అందరం ఆరోగ్యం కోసం పళ్లను తినడం జరుగుతుంది. అయితే చాలా పండ్లలో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. ఎందుకిలా స్టిక్కర్లు అంటిస్తారనేది చాలామందికి తెలియదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయోమో అనుకుంటాం . మరికొందరూ అలా స్టిక్కర్లు ఉన్న పళ్లే మంచివని కూడా అనుకుంటారు. అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు?. దానికేమైన అర్థం ఉందా? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!. పండ్లపై ఉండే స్టిక్కర్ల గురించి ఇటీవలేఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు, వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది. ఇక ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం..నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి. ఫ్రూట్స్‌కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9తో మొదలైతే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు ఉడి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్‌తో పండించారని, ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి. (చదవండి: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!) -
కేసీఆర్ కిట్ ఇక.. ఎంసీహెచ్ కిట్
నల్లగొండ టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లను అతికించి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తున్న కేసీఆర్ కిట్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ కిట్‌కు బదులు ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ కిట్లపై ఉన్న కేసీఆర్ ఫొటోపై తెల్లని స్టిక్కర్ అతికించి దానిపై ఎంసీహెచ్ కిట్ అని పేరు రాసి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటుగా గర్భిణులకు అందజేస్తున్న న్యూట్రీషియన్ కిట్‌లోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ అతికించి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఎంసీహెచ్ పేరుతో ముద్రించిన కిట్లు వచ్చే వరకు.. ఇప్పటికే జిల్లాలో ఉన్న కిట్ల స్టాక్‌పై ఉన్న కేసీఆర్ పేరు, ఫొటోపై స్టిక్కర్లు అతికించి ఎంసీహెచ్ కిట్ల పేరు రాసి పంపిణీ చేస్తున్నాం. అలాగే న్యూట్రిషియన్ కిట్లలోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ వేస్తున్నాం. – డాక్టర్ కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?
బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు... మాయిశ్చరైజర్ : బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది. నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది. జెల్ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. -
మందు మితంగా తాగితే మంచిదే అంటారుగా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. పిటిషన్‌ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, దొరికారో అంతే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
Whatsapp: ఫొటోలను స్టిక్కర్స్‌గా ఇలా మార్చేయండి
వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేయడం బాగుంటుంది. ఫొటోలను వాట్సాప్ స్టిక్కర్స్‌గా మార్చితే మరీ బాగుంటుంది. అప్పుడు ఏంచేయాలంటే.. ► చాట్ విండోని ఓపెన్ చేయాలి ►అటాచ్మెంట్ ఆప్షన్ నొక్కి స్టిక్కర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి ►ఫైల్ ఎక్స్‌ప్లోరర్ విండో ఓపెన్ అవుతుంది ►వాట్సాప్ స్టిక్కరుగా మార్చాలనుకుంటున్న ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి ►సెండ్–క్లిక్ ►ప్రస్తుతానికైతే ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్‌కు మాత్రమే పరిమితం చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ -
వాట్సాప్‌లో మీ ఫొటోలు సరికొత్త రూపంలో..!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. కొన్నిరోజుల క్రితం యూజర్ల కోసం సరికొత్త ఫోటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ ఫోటోలను స్టిక్కర్స్‌గా మార్చే ఫీచర్‌ను యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లు ఎలాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ను వాడకుండా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను బీటావాట్సాప్ వర్షన్లో వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం..వాట్సాప్ చాట్ డైలాంగ్ బాక్స్‌లో ఈ ఫీచర్ కన్పించనుంది. యూజర్లు ఎంచుకున్న ఫోటోలను స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆయా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును. తాజాగా వాట్సాప్ మల్టీ-డివైజ్ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఆన్లైన్లో లేకున్నా ఏకకాలంలో నాలుగు డివైజ్‌లకు సపోర్ట్ చేస్తూ యాప్‌ను ఉపయోగించవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
వాట్సాప్ న్యూ అప్డేట్.. ‘పాపా మేరే పాపా’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు చక్కటి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా (జూన్ 20, 2021) యూజర్ల సౌలభ్యం కోసం ‘పాపా మేరే పాపా’ పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. బాలీవుడ్ మూవీ ‘ మై ఐసా హీ హూం’’ లోని పాపులర్ సాంగ్ ‘పాపా మేరే పాపా’ ప్రేరణతోనే దీన్ని తీసుకొచ్చింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో స్టిక్కర్ ప్యాక్ అందుబాటులో ఉంది. స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకునేందుకు వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట భారత్, ఇండోనేషియాలో లాంచ్ చేసినా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్, వాబేటా ఇన్ఫో ఈ ప్యాక్ గురించి నివేదించింది. "చెప్పడానికి కష్టంగా అనిపించే విషయాలు చెప్పడంలో సహాయం చేస్తూ లవింగ్ తండ్రీ కొడుకులను గుర్తుచేస్తుంది" అనే సందేశంతో దీన్ని తీసుకొచ్చింది. కాగా వాట్సాప్ సందర్భానికి తగినట్టు సిక్కర్ ప్యాక్‌లను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లవ్ అండ్ ప్రైడ్ స్టిక్కర్ ప్యాక్‌ను, అదేవిధంగా మదర్స్ డే స్టిక్కర్లను కూడా విడుదల చేసింది. స్టిక్కర్న ప్యాక్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వ్యక్తిగత చాట్ విండో లేదా గ్రూప్ చాట్ విండోను ఓపెన్ చేయండి. కొత్త స్టిక్కర్ విభాగాన్ని బ్రౌజ్ చేసేందుకు స్టిక్కర్స్ మెనులో ప్లస్ చిహ్నంపై ప్రెస్ చేస్తే తాజా స్టిక్కర్ ప్యాక్ పైన కనిపిస్తుంది. దాంట్లోంచి ఇష్టమైన ఎమోజీని డౌన్ లోడ్ చేస్కోవచ్చు. -
ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!
నా ఫేస్ చూసీ చూసీ నాకే బోర్ కొడుతుంది... అనుకుంటాం చాలాసార్లు. మీ ఫేస్ కొత్తగా, తమాషాగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. జపాన్ యానిమేషన్ చిత్రాలలో కనిపించే ఫేస్‌లతో కనిపించడానికి యానిమి స్టైల్ లెన్స్, అమెరికన్ కంప్యూటర్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘ది గ్రించ్’లో మాదిరిగా పచ్చగా కనిపించడానికి గ్రించ్ లెన్స్, పిల్లి ముఖంతో గర్జించడానికి క్యాట్ వుమెన్ లెన్స్, ప్రిన్సెస్ జాస్మీన్లా అందంగా మెరవడానికి స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే...ఇంకా మీరు ప్రయత్నించడానికి చాలా ఫేస్ ఫిల్టర్లు ఉన్నాయి. జస్ట్ ట్రై చేసి చూడండి.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్) -
వాట్సాప్ న్యూ ఇయర్ స్టిక్కర్స్!
స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం కొత్త ఏడాది 2021కి సంబందించిన వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? చింతించకండి, ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా కొత్త ఏడాదికి సంబందించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక స్టిక్కర్ ప్యాక్‌లను మాత్రమే లభిస్తాయి అని మీకు తెలుసు. పండుగ ఆధారిత స్టిక్కర్ల కోసం మీరు ఎల్లప్పుడూ థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాలి. ఇప్పుడు కొత్త ఏడాదికి సంబందించిన కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ మేము మీకోసం అందిస్తున్నాం. వీటిని డౌన్లోడ్ చేసుకున్నాక ఏ విదంగా ఉపయోగించాలో క్రింద చదవండి.(చదవండి: ఐఫోన్ ఫ్లిప్ ఫోన్ వచ్చేస్తుంది!) స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి న్యూ ఇయర్ 2021 స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేయండి. స్టెప్ 2: ఇప్పుడు మీకు నచ్చిన లేదా మేము సూచించిన “హ్యాపీ న్యూ ఇయర్ 2021 స్టిక్కర్స్”ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి మీకు మొత్తం ఆరు న్యూ ఇయర్ 2021 స్టిక్కర్ ప్యాక్‌లు కనిపిస్తాయి. స్టెప్ 3: మీరు ప్రతి స్టిక్కర్ ప్యాక్‌ని తెరిచిన తర్వాత అందులో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ని "+" బటన్‌పై క్లిక్ చేసి వాటిని వాట్సాప్‌కు స్టిక్కర్లకు జోడించవచ్చు. స్టెప్ 4: ఇప్పుడు మీరు పంపాలి అనుకున్న వ్యక్తి యొక్క చాట్ విండోను తెరిచి టైపింగ్ బార్లో ఉన్న స్మైలీ చిహ్నాన్ని ప్రెస్ చేసి ఆపై స్టిక్కర్స్ విభాగానికి వెళ్లండి. ఇక్కడ, మీరు కొత్తగా జోడించిన న్యూ ఇయర్ 2021 స్టిక్కర్లను చూస్తారు. ఇప్పుడు మీకు నచ్చిన వాటిని మీ మిత్రులకు, బందువులకు పంపించవచ్చు. -
వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపండి ఇలా
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గత వారం కూడా ఇలాగే స్టిక్కర్ సెర్చ్ వంటి కొత్త అప్డేట్ తో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దింట్లో భాగంగా వాట్సాప్ చాలా స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తుంది, కానీ ఇప్పటికీ పండుగ ఆధారిత స్టిక్కర్ల కోసం మాత్రం థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడక తప్పడం లేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సందర్బంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం సృజనాత్మక లేదా అందమైన స్టిక్కర్లను పంపడానికి చాలా యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా క్రిస్మస్ స్టిక్కర్లు పంపడం కోసం మేము ప్రయత్నించిన కొన్ని ఉత్తమమైన యాప్స్ మీకోసం అందిస్తున్నాం. వీటి ద్వారా వాట్సాప్‌లో క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ స్టిక్కర్లను ఎలా పంపించాలో క్రింద తెలుసుకోండి.(చదవండి: ఐఫోన్లో బగ్ గుర్తిస్తే రూ.11 కోట్లు) వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపడం ఎలా? స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ అని టైపు చేయండి. స్టెప్ 2: ఇప్పుడు ప్లే స్టోర్ లో మీకు చాలా యాప్స్ లభిస్తాయి. దింట్లో మీకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్స్ లేదా 'క్రిస్మస్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ (వాస్టిక్కర్స్ఆప్)', 'క్రిస్మస్ స్టిక్కర్స్ ప్యాక్ 2020' డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేసాక మీకు చాలా క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు థాంక్స్ గివింగ్ స్టిక్కర్లు కనిపిస్తాయి. స్టెప్ 3: వాట్సాప్‌కు స్టిక్కర్లను జోడించడానికి, మీరు స్టిక్కర్ల విండోలో ఉన్న '+' బటన్‌ను ప్రెస్ చేయండి. తరువాత స్టిక్కర్లు ఆడ్ చేయడానికి మీరు 'ADD' ప్రెస్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4: ఇప్పుడు మీరు వాట్సాప్ లో యాప్ లో కొత్త క్రిస్మస్ స్టిక్కర్లను చూస్తారు. ఇప్పుడు మీరు ఎవరికైతే పంపించాలో వారి చాట్ చేయండి. స్టెప్ 5: టైపింగ్ బార్లో ఉన్న స్మైలీ ఐకాన్‌పై క్లిక్ చేసి స్టిక్కర్స్ ని ఎంచుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన కొత్త స్టిక్కర్స్ మీ బంధుమిత్రులకు, స్నేహితులతో షేర్ చేసుకోండి. -
‘సేఫ్’ సర్టిఫికెట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ ధరించలేదని వాహనదారుడికి జరిమానా, సీటు బెల్ట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు ఫైన్, సిగ్నల్ జంపింగ్ చేశాడని మరో వాహనదారుడికి ఈ–చలాన్...ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనులను శిక్షించినట్లుగానే...ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులనూ గుర్తించి ‘సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్’ పేరుతో స్టిక్కర్ ఇచ్చి ప్రశంసిస్తున్నారు. అబుదాబీలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ పేరుతో దేశంలోనే తొలిసారిగా గురువారం చింతల్‌కుంట ఎక్స్‌రోడ్డులో సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వస్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేసిన సీపీ ఈ–చలాన్లో జరిమానాలు లేని కారు డ్రైవింగ్ చేస్తున్న లేడీ డాక్టర్ రిచా, సీనియర్ సిటిజన్ గోపాల కే సురేఖతో పాటు మరికొందరి వాహనాలకు ‘సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్’ను అతికించారు. అనంతరం వారిని సర్టిఫికెట్తో సన్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు 24 వాహనాల చొప్పున ఆరు నెలల్లో నాలుగువేల మంది వాహనచోదకులను గుర్తించి ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అబుదాబీలో 2016 అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తుండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించే అలవాటు పెరిగిందన్నారు. ఆ తరహా మార్పు త్వరలో రాచకొండ పరిధిలోని వాహనదారుల్లో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ సేఫ్ డ్రైవర్ల గుర్తింపు... ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న మర్యాద వాహనచోదకులను కూడా గుర్తించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో ప్రతిరోజూ కొన్ని వాహనాలను గుర్తించి సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందించనున్నారు. తద్వారా వారు ట్రాఫిక్ నియమాలను పాటించడంతో పాటు ఇతరులను చైతన్యం చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన వాహనచోదకుడు ఆరు నెలల పాటు మళ్లీ ట్రాఫిక్ నియమాలు తూచతప్పకుండా పాటిస్తే రివార్డుతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జోన్ల ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు స్టిక్కర్ వేద్దాం... ఫిక్స్ చేద్దాం
సాక్షి, అమరావతి బ్యూరో: రానున్న ఎన్నికల్లో ఓటర్లను బెదిరించి తమకు అనుకూలంగా మలచుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం మరో పన్నాగానికి సన్నద్ధమవుతోంది. టీడీపీకి ఓటేయకపోతే ఇంతవరకు అందిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పేందుకు స్టిక్కర్ రాజకీయానికి తెరతీసింది. ఓ వైపు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. మరోవైపు టీడీపీ నేతల బెదిరింపులకు లైసెన్స్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు చంద్రబాబు ఫొటోతో ప్రత్యేక స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఇతర వివరాలను కుటుంబాల వారీగా జాబితాలను రూపొందించాలని చెప్పింది. స్థానిక టీడీపీ నేతలను వెంటబెట్టుకుని మరీ ఇంటింటికి తిరుగుతూ ఆ స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇంటికి స్టిక్కర్ వేసే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని, లేకపోతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని అధికారుల ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలు హెచ్చరికలు చేస్తారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో ఇలాంటి విధానాన్ని ఏ ప్రభుత్వం అనుసరించలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలతో స్టిక్కర్లు అతికించడానికి సిద్ధపడితే ప్రజలు తిరగబడతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తామెందుకు వివాదాస్పదం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలన్న పట్టుదలతో ఉంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో వేచి చూడాల్సిందే. -
ఇదేం బడాయి..!
విజయనగరం, నెల్లిమర్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం విచిత్రమని ముక్కున వేలేసుకుంటున్నారు. మనం మేలుచేస్తే ఎవరైనా సరే వారే స్వయంగా కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మాత్రం వింతగా ఉంది. సీఎం చంద్రబాబు గోరంత చేసి కొండంత గొప్పలు చెప్పుకోవడమే కాకుండా కోరి మరీ కృతజ్ఞతలు చెప్పించుకుంటున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం తీరుతో అధికారులు సైతం ఇబ్బందిపడుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీచేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు గాల్లో కలిపేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారని ఎదురుచూసిన మహిళలకు నిరాశే ఎదురైంది. రుణమాఫీ కాకపోవడంతో తీసుకున్న అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడి నిధి(పసుపు, కుంకుమ)పేరుతో ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు అందిస్తామని బాబుగారు ప్రకటించారు. అది కూడా ఒకేసారి కాకుండా నాలుగు విడతలుగా విడుదల చేశారు. తాజాగా నాలుగో విడత రూ.2 వేలు విడుదలయ్యాయి. నెల్లిమర్ల నగరపంచాయతీ డ్వాక్రా మహిళలకు ఆ నిధులు నేటికీ అందలేదు. ఇక్కడ మొత్తం 323 సంఘాలకు పసుపు కుంకుమ నిధులు మంజూరయ్యాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. అయితే 299 సంఘాలకు చెందిన 3800మంది సభ్యులకు మూడు, నాలుగు విడతల మొత్తాలు జమకాలేదు. కేవలం 24 సంఘాలకు తాజాగా నాలుగో విడత నిధులు ఖాతాల్లో జమయ్యాయి. కానీ డ్వాక్రా మహిళలకు తామేదో ఒరగబెట్టినట్లు సీఎం డప్పు కొట్టుకుంటున్నారు. ‘ఆడపడుచులకు ధన్యవాదాలు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..సీఎం సర్‌కు ధన్యావాదాలు’ అనే స్టిక్కర్లను పంపిణీ చేసి ప్రతీ డ్వాక్రా మహిళ ఇంటికి అంటించమని ఆదేశించారు. అయితే నిధులే అందని మహిళల ఇళ్లకు స్టిక్కర్లు ఎలా అంటిస్తామని సంబంధిత సిబ్బంది, సంఘాల లీడర్లు వాపోతున్నారు. రుణమాఫీ చేయకపోగా ఇదేం సొంతడబ్బా అని గుసగుసలాడుకుంటున్నారు. బలవంతంగా క్షీరాభిషేకాలు స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ పెద్దల సంకేతాలతోనే ఆ విధంగా చేశారని సమాచారం. అందుకే ఇష్టం లేకపోయినా కాంట్రాక్టు అధ్యాపకులు ఆ కార్యక్రమం చేశారని సమాచారం. అక్టోబర్‌లో నిర్వహించిన మహా సంకల్పం కార్యక్రమంలో కూడా ఇదే విధంగా డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందితో సీఎం చిత్రపటానికి బలవంతంగా క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. ఇష్టం లేకపోయినా ఇలా అడిగి మరీ డప్పు కొట్టించుకుంటున్నారని నియోజకవర్గ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. కృతజ్ఞత అనేది మనసుల్లోంచి రావాలి కానీ ఇలా బలవంతంగా చెప్పించుకోవడమేమిటని పలువురు బహిరంగంగానే అంటున్నారు. -
బుల్లి స్టిక్కర్‌తో భలే ఉపయోగాలు...
గుండెకు ఆపరేషన్ అయినవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటారు డాక్టర్లు. కొంచెం వేగంగా నడిచినా, అవసరానికి మించి ఆహారం తీసుకున్నా సమస్యలొచ్చి.. ప్రాణాలు పోయే అవకాశం ఉండటం దీనికి కారణం. రక్తపోటు, గుండెకొట్టుకునే వేగం వంటి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే సమస్య వస్తుందనిపించినప్పుడు తగిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇప్పటివరకూ ఇందుకు తగిన మార్గం లేకపోయింది. ఈ నేపథ్యంలో పర్డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ స్టిక్కర్ (ఫొటోలో ఉన్నది) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగితం టేపుతో తయారైన ఈ స్టిక్కర్‌ను మణికట్టు వద్ద అతికించుకుంటే చాలు, మన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అంటున్నారు రామేస్ మార్టినెజ్. వ్యాయామం చేస్తున్నా, ఈత కొడుతున్నా కూడా ఈ స్టిక్కర్ చెక్కుచెదరకుండా ఉంటుంది. బ్యాక్టీరియా దరిచేరకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ఒక్కో స్టిక్కర్ ఖరీదు నాలుగు రూపాయలకు మించదు. ఇది కేవలం గుండెజబ్బులు ఉన్న వారికి ఉపయోపగడటమే కాకుండా.. భవిష్యత్తులో రోగ నిర్ధారణ పరీక్షలకూ చవకైన విధానంగా మారగలదని మార్టినెజ్ అంటున్నారు. -
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లారని..
తిరువణ్ణామలై: ఓ ప్రైవేట్ పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లిన విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడాన్ని ఖండిస్తూ తల్లిదండ్రులు, హిందూ మున్నని కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శుక్రవారం రాస్తారోకో చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో ఓ ప్రైవేట్ క్రైస్తవ మెట్రిక్ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు ఐదు వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పూలు, బొట్టు పెట్టుకోవద్దని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవికాపురానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం ఉదయం బొట్టు, పూలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లారు. గమనించిన టీచర్ వాటిని తొలగించాలని తెలిపడంతో వారు పూలు, బొట్టును తొలగించారు. దీంతో వారిని పాఠశాల ఆవరణంలో మోకాళ్లపై నిలబెట్టారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. నిబంధనలు పాటించనందుకే దండన.. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రావడంతోనే ఇలా చేశామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ మున్నని కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలూరు డీఎస్పీ చిన్నరాజ్, పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం వద్ద విచారణ చేస్తున్నారు. -
వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్
వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తులు స్పామ్ పోస్టులను పదే పదే పంపిస్తూ.. యూజర్లను విసుగెత్తిస్తూ ఉంటారు. అవి ఫార్వర్డో కాదో తెలుసుకోకుండా గ్రూప్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా భారీగా వచ్చే స్పామ్ సర్క్యూలేషన్‌ను నిరోధించడానికి వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. అదే ''ఫార్వర్డెడ్ మెసేజ్'' అనే ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వేరే వ్యక్తులు స్పామ్ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినా లేదా ఒకే చాట్ నుంచి ఆ పోస్టు ఫార్వర్డ్ అయినా 'ఫార్వర్డెడ్ మెసేజ్' అనే టాగ్ వచ్చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్ అయితే కానీ మెసేజ్‌ను బ్లాక్ చేయలేదు. దీంతో స్పామ్ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. వాట్సాప్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్ చేసింది. ఆండ్రాయిడ్ వీ2.18.67 వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ కనిపించింది. దీంతో పాటు స్టికర్స్ ఫీచర్ కూడా విండోస్ ఫోన్ బీటాపై స్పాట్ అయింది. ఆండ్రాయిడ్ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్ ఇటీవలే గ్రూప్ డిస్క్రిప్షన్ అనే ఫీచర్‌ను ఆండ్రాయిడ్, విండోస్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. -
వారికి వాట్సాప్ కొత్త ఫీచర్లు
విండోస్ ఫోన్ వాడుతున్న వారు ప్రస్తుతం చాలా కొద్ది మంది మాత్రమే. వారిని కూడా ఎక్కడా నిరాశ పరచకూడదని నిర్ణయించింది వాట్సాప్. ఈ కొద్ది మంది విండోస్ ఫోన్ యూజర్లకు కూడా వాట్సాప్ బీటాను అప్డేట్ చేసింది. ఈ అప్డేషన్లో స్టికర్స్ ఫీచర్‌ను కొత్తగా తీసుకురావడం, స్టికర్స్ నోటిఫికేషన్ ఐకాన్ రీడిజైన్ చేయడంతో పాటు లైవ్ లొకేషన్ షేరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం విండో ఫోన్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.18.24లో అందుబాటులో ఉన్నాయి. స్టికర్స్ ఫీచర్, స్టికర్స్ నోటిఫికేషన్ ఐకాన్ రీడిజైన్ వంటి ఫీచర్లు ఇప్పటివరకు వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ ప్లాట్‌ఫామ్‌లపై అందించడం లేదు. తాజాగా చేసిన విండోస్ ఫోన్ బీటా అప్డేట్, డబ్ల్యూఏబీటాఇన్ఫోలో తొలుత స్పాట్ అయింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్‌లో ఈ స్టికర్స్‌ను విండోస్‌ఫోన్ యూజర్లు పంపించుకోవచ్చు. ప్లాట్ఫామ్లన్నింటిపై కూడా స్టికర్స్ ఫీచర్ కొత్తదని, స్టికర్స్ ఫీచర్‌ను తొలుత 2.18.24 బీటాకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. అయితే వాట్సాన్ బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ ప్లాట్‌ఫామ్‌లపైకి కూడా ఈ కొత్త స్టికర్స్ ఫీచర్స్ రాక కోసం యూజర్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో యూపీఐ ఆధారిత పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడానికి వాట్సాప్ పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రారంభించబోతుంది. -
జీఎస్టీ స్టిక్కర్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: పాత పన్ను వ్యవస్థ కాలంలో తయారై, అమ్ముడుపోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కూడిన ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువిచ్చింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌తో ముగియాల్సి ఉంది. కానీ, నవంబరు 15 నుంచి 150కిపైగా వస్తువులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీంతో కొత్త స్టిక్కర్లను అతికించేందుకు గడువును మార్చి వరకు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లు నీళ్ల సీసాలను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టులో త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామని పాశ్వాన్ చెప్పారు. -
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
-
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్‌చాట్ మాదిరిగా యూజర్లు తమ ఇమేజ్‌పై ఏదైనా టెక్ట్స్ రాసుకునేందుకు, డ్రాయింగ్ వేసుకునేందుకు సౌకర్యం కల్పించనుంది. ఉదాహరణకు వాట్సాప్ యాప్ ద్వారా ఫ్రంట్ పేసింగ్ ఫ్లాష్‌తో ఫోటో తీసుకున్నప్పుడు, ఎడిటింగ్ టూల్స్‌ను తాజా అప్డేషన్తో యూజర్లు పొందుతారు. ఫోటోపై ఏదైనా టెక్ట్స్‌ను రాసుకునే విధంగా, డ్రాయింగ్ వేసుకునేందుకు వీలుగా పెన్సిల్, "టీ"బటన్స్ కనిపిస్తాయి. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాదిరిగా వివిధ రంగులను వాడుకుంటూ యూజర్లు తమ ఫోటోలను డిజైన్ చేసుకోవచ్చు. యూజర్ల ఇమేజ్‌లను మరింత తీర్చిదిద్దడానికి స్టికర్ల కూడా వాడుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చట. మొదట ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. అనంతరం ఇన్స్టాగ్రామ్ కూడా ఇదేమాదిరి ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ కూడా మెసేజింగ్ ప్రేమికుల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇక్కడ ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో తాజా వాట్సాప్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు యూజర్లకు ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా త్వరలోనే యూజర్ల చాట్‌ను వాట్సాప్ చదివేలా టెస్టింగ్ జరుగుతుందట. మెసేజ్‌లో ఉన్న టెస్ట్‌ను వాట్సాపే బయటికి చదివేలా స్పీక్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రాదంట. -
ఎస్సైల ‘స్టిక్కరింగ్’
ఏలూరు (సెంట్రల్) : పోలీసు శాఖ విక్రయించమని ఇచ్చిన స్టిక్కర్స్‌ను అధిక ధరకు అమ్మిన ఇద్దరు ఎస్సైలను జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో ఉంచారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఏటా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని ప్రతి స్టేషన్‌కు ఒక్కొక్కటి రూ.10 చొప్పున విక్రయించమని కొన్ని స్టిక్కర్స్‌ను పంపిస్తారు. తణుకు రూరల్ ఎస్సై జి.కాళీచరణ్, ధర్మాజీగూడెం ఎస్సై ఎం.కేశవరావు స్టికర్స్ విక్రయాల పేరుతో కొంతమంది నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడంతో ఆ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఇద్దరు ఎస్సైలను వీఆర్‌లో ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. ఇటువంటి ఆరోపణలు ఏస్టేషన్‌లోనైనా సిబ్బందిపై వస్తే వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు ఎస్ఎంఎస్ల ద్వారా హెచ్చరికలు జారీచేశారు. దీనికి సంబంధించి తణుకు రూరల్ స్టేషన్లో కొంతమంది సిబ్బందిని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారించినట్టు సమాచారం. ఏలూరులోనూ అంతే.. ఏలూరు టూటౌన్ స్టేషన్లో కొంతమంది సిబ్బంది ఇదే తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి. ఒక కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై ఈ స్టికర్స్ అమ్మకాలు చేపట్టారు. స్టేషన్ సిబ్బంది అధిక లోడ్‌తో వెళుతున్న లారీలను ఆపి డ్రైవర్లకు ఈ స్టికర్స్ ఇచ్చి రూ.2000 చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. స్టేషన్ పరిధిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు, బ్రాందీషాపుల నుంచి కూడా అధిక మొత్తంలో వసూలు చేసినట్టు తెలిసింది.