T20 captain
-
నేనే గనుక హార్దిక్ స్థానంలో ఉంటే?.. ఈపాటికి..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్‌ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి. -
హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీ20 కెప్టెన్‌గా అతడే!
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌లోనే భారత్ నిష్క్రమించిన తర్వాత రోహిత్ శర్మ.. దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు. అతడి గైర్హాజరీలో పాండ్యా టీ20లలో టీమిండియాను ముందుకు నడిపించాడు.పాండ్యా గాయపడిన సందర్బాల్లో భారత నంబర్ వన్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరిద్దరు అందుబాటులో లేని సమయంలో రిషభ్ పంత్ సైతం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.శాశ్వత కెప్టెన్ కోసం కసరత్తుఇక టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో తిరిగి పొట్టి ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ కాకుండా సుదీర్ఘకాలం పాటు టీ20లలో టీమిండియాను ముందుకు నడిపే ఆటగాడినే ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. తరచూ గాయాలు ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్-2024 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తరచూ గాయాల బారిన పడే ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బోర్డులోని కొందరు వ్యక్తులు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాకే తమ ఓటు అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.ముఖ్యంగా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించినప్పటికీ గాయాల బెడద సమస్యగా మారింది.సూర్య సూపర్ అని చెప్పారుమరోవైపు.. సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పటికే మేము ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అతడి కెప్టెన్సీ పట్ల ఆటగాళ్లంతా సానుకూలంగా ఉన్నారు. సూర్య హయాంలో డ్రెసింగ్‌రూం వాతావరణం కూడా చాలా బాగా ఉందని చెప్పారు’’ అని పేర్కొన్నాయి.కాగా ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో హార్దిక్ పాండ్యా ఇప్పటికే చాలా సార్లు గాయపడ్డాడు. గాయాల భయంతోనే అతడు టెస్టు క్రికెట్‌కు కూడా పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.కెప్టెన్సీ భారం వల్లఫిట్నెస్ విషయంలో తరచూ సమస్యల బారిన పడుతున్న ఇలాంటి ఆటగాడిని పూర్తిస్థాయి కెప్టెన్ చేయడం పట్ల బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆల్‌రౌండర్‌పై హార్దిక్ ప్రదర్శనపై కెప్టెన్సీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీ20లలో సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలిచాడు. గంభీర్ ఓటు ఎవరికో?ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచింది. తదుపరి జూలై 27న మొదలయ్యే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు భారత్ సిద్ధం కానుంది. ఈ టూర్తోనే గంభీర్ హెడ్‌కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్ ఎంపిక విషయంలో అతడి అభిప్రాయం కూడా ప్రధానం కానుంది.చదవండి: నో రెస్ట్: కోహ్లి, రోహిత్, బుమ్రా ఆడాల్సిందే.. గంభీర్ అల్టిమేటం?! -
Official: షాహిన్‌పై వేటు.. పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు. అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను సారథులుగా ఎంపిక చేశారు. ఘోర పరాజయాలు ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు! ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్? Babar Azam appointed as white-ball captain Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024 -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్ మార్పు.. నూతన సారధిగా స్టార్ ఆల్‌రౌండర్
జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ టీ20 జట్టుకు నూతన కెప్టెన్‌ను నియమించింది. ఇటీవల స్వదేశంలో పసికూన నమీబియాతో చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌పై వేటు వేసింది. ఎర్విన్ స్థానంలో జింబాబ్వే టీ20 జట్టు సారధిగా స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా నియమించబడ్డాడు. ఎర్విన్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా పరిమితం చేయబడ్డాడు. వచ్చే నెలలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ కీలక మార్పు చేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చడంతో పాటు మరిన్ని కీలక మార్పులు కూడా చేసింది. మాజీ హెడ్ కోచ్ డేవ్ హటన్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పింది. అదనంగా హటన్‌కు సెలక్షన్ ప్యానెల్లో చోటు కల్పించింది. హటన్తో పాటు మాజీ కెప్టెన్ ఎల్టన్ చిగుంబరకు కూడా సెలక్షన్ ప్యానెల్లో చోటు దక్కింది. జింబాబ్వే క్రికెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బ్లెస్సింగ్ గొండోను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హమిల్టన్ మసకద్జ, కెన్యోన్ జెహ్లా, రసెల్ టిఫిన్, జూలియా చిబాబ, డేవ్ హటన్, చిగుంబరలకు చోటు దక్కింది. కాగా, స్వదేశంలో ఇటీవల నమీబియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జింబాబ్వే 2-3 తేడాతో ఓటమిపాలైంది. -
IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా
ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. రేపు (ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో జరుగబోయే తొలి టీ20తో బుమ్రా ఈ ఘనత సాధించనున్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ భారత టీ20 జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించగా.. రేపటి మ్యాచ్‌తో బుమ్రా టీమిండియా 11వ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, బుమ్రా గతంలో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా భారత కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బుమ్రా నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా టీమిండియా రేపు తొలి టీ20 ఆడనుంది. దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన శివమ్ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్ టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఈ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది, మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానం వేదిక కానుంది. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌గా మిచెల్ మార్ష్.. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 14 మంంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ20ల్లో ఆస్ట్రేలియా సారధి ఎంపికైన 12వ ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం శాశ్వత కెప్టెన్ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్ ఫించ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. అయితే టీ20 ప్రపంచకప్-2024కు ముందు మార్ష్‌ను టీ20ల్లో తమ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించే ఛాన్స్ ఉంది. కాగా మార్ష్ మూడు ఫార్మాట్లలో కూడా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా అతడు అద్బుతమైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 250 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ! ఇక ప్రోటీస్ సిరీస్‌తో ముగ్గురు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ స్పెన్సర్ జాన్సన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ , మాథ్యూ షార్ట్‌లకు తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఆరోన్ హార్డీ వన్డే ప్రపంచకప్-2023కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రాథమిక జట్టులో కూడా ఛాన్స్ లభించింది. ప్రోటీస్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ -
ఈ టీ20ల నుంచి రోహిత్ అవుట్...? ఫుల్ టైం కెప్టెన్‌గా హార్దిక్
-
అమిత్ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు హార్దిక్ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్, క్రునాల్ పాండ్యాలు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో రోహీత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k — hardik pandya (@hardikpandya7) December 31, 2022 ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు
అఫ్గానిస్తాన్ టి20 క్రికెట్ కొత్త కెప్టెన్‌గా జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ఆఫ్గన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి బోర్డు కొత్త టి20 కెప్టెన్‌ను ఎన్నుకోలేదు. తాజాగా బోర్డు మరోసారి రషీద్ ఖాన్‌వైపే చూసింది. గతంలో వద్దనుకున్న ఆటగాడే మళ్లీ దిక్కయ్యాడు. ఇక టి20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 2021 టి20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన రెండు రోజులకే రషీద్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాడు. కొన్ని విషయాల్లో బోర్డుతో తలెత్తిన సమస్యల కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రషీద్ ఆ సమయంలో వివరించాడు. దీంతో మహ్మద్ నబీని బోర్డు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలా రెండేళ్ల పాటు మహ్మద్ నబీ జట్టును నడిపించాడు. అతని కెప్టెన్సీలో అఫ్గానిస్తాన్ జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో మాత్రం నిరాశజనక ప్రదర్శనను కనబరిచింది. రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నబీ మరుసటి రోజే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నూతన టి20 కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రషీద్ ఖాన్ తన ట్విటర్లో స్పందించాడు. ''నన్ను అభిమానించిన శ్రేయోభిలాషులకు.. అండగా నిలబడిన కుటుంబసభ్యలుకు, మిత్రులకు కృతజ్ఞతలు. టి20 కెప్టెన్‌గా తిరిగి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్ పాత్రతో నా పాత్ర మరింత పెరిగింది. కెప్టెన్సీ అనేది ఎంతో చాలెంజ్‌తో కూడుకున్నది. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా రషీద్ ఖాన్‌ను మరోసారి టి20 కెప్టెన్‌గా ఎంపిక చేసిన బోర్డు స్పందించింది. ''అఫ్గానిస్తాన్‌ను మూడు ఫార్మాట్లలో సమర్థంగా నడిపించగల సత్తా రషీద్ ఖాన్‌కు ఉంది. టి20 కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలు తీసుకుంటున్న రషీద్‌కు ఇవే మా కృతజ్ఞతలు. కెప్టెన్‌గా తాను ఉన్నత స్థానాన్ని అందుకుంటాడని.. జట్టును గౌరవ స్థానంలో నిలుపుతాడని ఆశిస్తున్నాం'' అంటూ అఫ్గన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మిర్వయిస్ అష్రఫ్ పేర్కొన్నాడు. ఇక రషీద్ ఖాన్ అఫ్గానిస్తాన్ తరపున ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు, 86 వన్డేల్లో 163 వికెట్లు, ఐదు టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. Grateful for this opportunity 🇦🇫🙏 Thank you to all my supporters, well wishers and loved ones ❤️ Ready to take on the big responsibility and an even bigger challenge 💪 pic.twitter.com/2rOSE5Asjp — Rashid Khan (@rashidkhan_19) December 29, 2022 Meet Our T20I Captain 🚨🤩@rashidkhan_19, Afghanistan’s Cricketing Wizard, has replaced @MohammadNabi007 as AfghanAtalan’s captain for the T20I format. Read More 👉 https://t.co/fYUYXrjmxe pic.twitter.com/ZKz9IuVGtL — Afghanistan Cricket Board (@ACBofficials) December 29, 2022 చదవండి: కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్‌గా టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య -
రోహిత్ కు తలనొప్పిగా మారిన హార్ధిక్ పాండ్య
-
బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై!
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో మధురానుభూతులు ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన మోర్గాన్... గాయంతో చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా భావించా. ఇది బాధాకరమే అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కెరీర్ ఆరంభం నుంచి 2019 ప్రపంచకప్ గెలవడం వరకు నా కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో జట్టు కూర్పు నుంచి నేను తప్పుకుంటే కొత్తగా వచ్చే కెప్టెన్‌కు జట్టును రాబోయే వరల్డ్‌కప్‌లలో సమర్థంగా నడిపించేందుకు తగినంత సమయం లభిస్తుందని భావించా. దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతా’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్‌లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా ప్రత్యేక అధ్యాయం... డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్ శైలి కలిగిన మోర్గాన్ 2010 టి20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా సభ్యుడు. అప్పటి నుంచి అతను రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రెగ్యులర్‌గా మారిపోయాడు. అయితే అతని కెరీర్లో అసలు మలుపు కెప్టెన్‌గా వచ్చింది. 2015 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అలిస్టర్ కుక్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మోర్గాన్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ప్రదర్శన పేలవంగా ఉన్నా... తర్వాతి నాలుగేళ్లలో అతను జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పటి వరకు వన్డేలను కూడా టెస్టుల తరహాలోనే ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్... ఎన్నడూ లేని రీతిలో విధ్వంసకర జట్టుగా ఎదిగింది. వన్డేల్లో అతని హయాంలోనే ఇంగ్లండ్ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మోర్గాన్ కెరీర్ లో 2019 వన్డే వరల్డ్‌కప్ విజయం అత్యుత్తమ క్షణం. బ్యాటర్‌గా కూడా పలు ఘనతలు సాధించిన మోర్గాన్ పేరిటే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (17) రికార్డు ఉంది. 16 టెస్టుల తర్వాత తన వల్ల కాదంటూ 2012లోనే అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ కెరీర్ ►248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు). ►115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్‌రేట్‌తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు). చదవండి: IND vs IRE: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ "It's been the most enjoyable time of my life." Morgs' reflects on his incredible England career after announcing his international retirement 🏏#ThankYouMorgs — England Cricket (@englandcricket) June 28, 2022 -
India T20 Captain: పని ఒత్తిడి.. రోహిత్ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్!?
India T20 Captain: పనిభారం తగ్గించేందుకు రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తున్నారా? అతడి స్థానంలో మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా? అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి విశ్వసనీయ వర్గాల నుంచి! అయితే, వరుస సిరీస్‌లు ఉన్నపుడు మాత్రం రోహిత్‌కు విశ్రాంతి కల్పించేందుకు అతడి స్థానంలో ఇకపై స్టార్ ఆల్‌రౌండర్‌కు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉందట బీసీసీఐ! మొదటి మ్యాచ్‌లోనే ఘన విజయంతో ఇంతకీ ఎవరా ఆల్‌రౌండర్? ఐపీఎల్-2022తో తొలిసారిగా కెప్టెన్‌గా ప్రయాణం ప్రారంభించాడు హార్దిక్ పాండ్యా. తొలి సీజన్లోనే తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్ల తేడాతో జట్టును గెలిపించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా మరోవైపు.. అదే సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇక టీ20 ప్రపంచకప్-2022 తర్వాత టీమిండియా పలు వరుస టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా రోహిత్‌కు బ్రేక్ ఇస్తే అతడి స్థానంలో ఇకపై పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడట! కేవలం టీ20 మ్యాచ్‌లకేనా? ఈ మేరకు సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ స్థానాన్ని ఇప్పటికిప్పుడు వేరే ఆటగాడితో భర్తీ చేసే అవకాశమే లేదు. అయితే, తనపై పని ఒత్తిడిని తగ్గించే మార్గాలు అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగానే హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని టూర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, టెస్టుల విషయంలో మాత్రం అతడి పేరు మా ప్రణాళికల్లో లేదు’’ అని పేర్కొన్నారు. కాగా రోహిత్ శర్మకు పనిభారాన్ని తగ్గించే క్రమంలో టీ20 కెప్టెన్సీ వేరే వాళ్లకు ఇవ్వాలంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ మెంబర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ENG_W vs SA-W: టెస్టుల్లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్.. 61 ఏళ్ల రికార్డు బద్దలు..! -
T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! అప్పుడే!
Rohit Sharma T20 Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్‌మ్యాన్‌పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. వరుస సిరీస్‌లు గెలిచి! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచాడు. వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌కు ముందు గాయం కారణంగా రోహిత్ జట్టుకూ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంతవరకు టీమిండియా తరఫున పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో రీషెడ్యూల్డ్ టెస్టుతో సారథిగా తన ప్రయాణం ప్రారంభిస్తాడనుకున్నా కరోనా బారిన పడటం గమనార్హం. టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు చాంపియన్ అయిన ఈ జట్టు తాజా సీజన్లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ టీ20 కెప్టెన్సీ గురించి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్‌కు గనుక కొత్త కెప్టెన్ ఫలానా వ్యక్తి అని భారత క్రికెట్ జట్టు యాజమాన్యం మదిలో ఎవరి పేరైనా ఉంటే.. కచ్చితంగా రోహిత్ శర్మను రిలీవ్ చేయాలి. తద్వారా.. ఒకటి.. రోహిత్‌పై పనిభారం తగ్గుతుంది. ముఖ్యంగా తన వయసు దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే.. రోహిత్‌కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. తను పునరుత్తేజం పొందుతాడు. టెస్టులు, వన్డేల్లో మరింత దృష్టి సారించి జట్టును ముందుకు నడిపించగలుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? -
Ind Vs SA: అయ్యో పంత్! ఒకే మ్యాచ్‌లో.. అరుదైన ఘనత.. చెత్త రికార్డు కూడా!
Rishabh Pant- Virat Kohli: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ నేపథ్యంలో భారత్‌కు టి20ల్లో నాయకత్వం వహించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్. దేశం తరఫున 43 టి20లు ఆడిన తర్వాత ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఈ అవకాశం దక్కింది. 24 ఏళ్ల 248 రోజుల వయసులో సారథిగా వ్యవహరించిన పంత్... సురేశ్ రైనా (23 ఏళ్ల 197 రోజులు) తర్వాత పురుషుల క్రికెట్లో భారత్ తరఫున కెప్టెన్సీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందడం విశేషం. కాగా దక్షిణాఫ్రికాతో మొదటి టీ20 సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించిన పంత్.. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. పంత్ కంటే ముందు విరాట్ కోహ్లి ఈ అప్రదిష్టను మూటగట్టుకున్నాడు. టీమిండియా డైనమిక్ కెప్టెన్‌గా పేరొందిన కోహ్లి 2017లో కాన్పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌కు తొలిసారి సారథిగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక తాజా దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ పంత్ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అదే విధంగా ఆనాటి మ్యాచ్‌లో కోహ్లి 29 పరుగులు(26 బంతుల్లో 4 ఫోర్ల సాయం) సాధించగా.. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో పంత్ సైతం 29 పరుగులే(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో) చేయడం మరో విశేషం. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం తెంబా బవుమా బృందం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో గెలుపొంది వరుసగా 13వ విజయం సాధించి చరిత్ర సృష్టించాలన్న భారత్ జోరుకు బ్రేక్ వేసింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్ Setting the stage on fire, @ishankishan51 hammered 76 & was #TeamIndia's top performer in the first innings. 👍 👍 #INDvSA | @Paytm A summary of his knock 🔽 pic.twitter.com/3qUAZZKPf3 — BCCI (@BCCI) June 9, 2022 .@ishankishan51 dazzled & put on an absolute show with the bat! 🔥 🔥 #TeamIndia | #INDvSA | @Paytm Watch his 4⃣8⃣-ball 7⃣6⃣-run blitz 🎥 🔽https://t.co/VUi8n7B8aZ — BCCI (@BCCI) June 9, 2022 ఎప్పటికైనా సరే #𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞𝐈𝐧𝐁𝐥𝐮𝐞 💙 ఆటలో గెలుపోటములు సహజమే 😊 తిరిగి పుంజుకుని Paytm T20I ట్రోఫీని గెలవటమే లక్ష్యంగా వస్తుంది #TeamIndia 😎 మరి మీరు మీ విషెస్ ను సెండ్ చెయ్యండి 👇🏻 చూడండి #INDvSA 2nd T20I 12 జూన్ 6pm నుంచి మీ #StarSportsTelugu / Disney + Hotstar లో pic.twitter.com/j1YLHFELcr — StarSportsTelugu (@StarSportsTel) June 9, 2022 -
టి20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు
సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ద్వారా రిషబ్ పంత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గాయంతో కేఎల్ రాహుల్ టి20 సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో పంత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సౌతాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా పంత్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్న వయసులో టీమిండియా తరపున టి20 కెప్టెన్ అయిన ఆటగాడిగా పంత్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం పంత్ వయస్సు 24 ఏళ్ల 248 రోజులు. ఇక తొలి స్థానంలో సురేశ్ రైనా 23 ఏళ్ల 197 రోజులు, ఎంఎస్ ధోని 26 ఏళ్ల 68 రోజులతో మూడో స్థానంలో, అజింక్యా రహానే 27 ఏళ్ల 41 రోజులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Ishan Kishan : అదృష్టం బాగుంది.. ముగ్గురు ఒకేసారి పరిగెత్తుకొచ్చినా European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో! -
టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టి20ల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా స్వదేశంలో 15 విజయాలు అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం. తద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్లను(చెరో 15 విజయాలు) రోహిత్ అధిగమించడం విశేషం. ఇప్పటికే స్వదేశంలో టి20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోని(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్‌గా టి20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్లో వరుసగా 11వ విజయం. టి20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చదవండి: IPL 2022 CSK: అతనితో బ్యాటింగ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్పా.. Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్‌మ్యాన్ -
'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్ శర్మ కౌంటర్
కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపుపై ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు తననెవరు సంప్రదించలేదని.. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లి ఘాటూ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. అయితే ఇదే విషయాన్ని గంగూలీ వద్ద ప్రస్తావించగా.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని చెప్పి సమాధానం దాటవేశాడు. ఈలోగా టీమిండియా సౌతాఫ్రికా టూర్ ఆరంభం కావడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్ తాజాగా కోహ్లి కెప్టెన్సీ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టెర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఎవరు సంప్రదించలేదన్న కోహ్లి మాటల్లో నిజం లేదు. వాస్తవానికి బీసీసీఐలోని ప్రతి సెలెక్టర్ సహా ఆఫీస్ బెరర్స్, సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఇతర స్టాఫ్ మొత్తం కోహ్లిని కలిసి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరాం. టి20 ప్రపంచకప్ ముగిసేంత వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునే విషయాన్ని ప్రకటించొద్దని తెలిపాం. కానీ టి20 ప్రపంచకప్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయంలో బోర్డు సభ్యులంతా మరోసారి కోహ్లిని పునరాలోచించమన్నాం. అయితే టి20 ఫార్మాట్లో కెప్టెన్సీ వదిలేస్తే వన్డే ఫార్మాట్లో కూడా వదిలేయాలని కోహ్లికి ఆ సమయంలో చెప్పాలనుకోలేదు. దానిని కోహ్లి అపార్థం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత అన్నీ ఆలోచించి కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాం. ఉద్దేశపూర్వకంగా మాత్రం చేయాలనుకోలేదు. అంతిమంగా టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా ఉన్నా సరే.. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదు.. దయచేసి ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
రోహిత్, రహానే.. మనకు తెలియకుండా ఇన్ని పోలికలా!
Similarities Between Rohit Sharma And Ajinkya Rahane.. రోహిత్ శర్మ, అజింక్యా రహానే.. ఈ ఇద్దరు టీమిండియా సమకాలీన క్రికెట్లో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. రోహిత్ మూడు ఫార్మాట్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. మరొకరు టెస్టుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. కోహ్లి అందుబాటులో లేని సమయాల్లో ఈ ఇద్దరు తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించారు. గతేడాది ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చేయడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రహానే జట్టును విజయవంతంగా నడిపించాడు. 2-1 తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చదవండి: Ravi Shastri: గంగూలీతో విభేదాలు నిజమే.. ఇక తాజాగా టి20 ప్రపంచకప్ 2021 అనంతరం విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మకు టి20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. కోహ్లి గైర్హాజరీలో కివీస్‌తో తొలి టెస్టుకు రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించింది. నవంబర్ 17 నుంచి మొదలవనున్న సిరీస్‌లో మొదటగా మూడు టి20లు.. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, రహానే శైలిలో మనకు తెలియని పోలికలు చాలానే ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►రోహిత్, రహానే... ఇద్దరు ముంబై నుంచి వచ్చినవారే ►రోహిత్ వన్డేల్లో, టి20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉంటే... రహానే టెస్టుల్లో వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు. ►ముంబైలో ఫేమస్ అయిన వడాపావ్ అంటే ఈ ఇద్దరికి చాలా ఇష్టమంట ►కోహ్లి గైర్హాజరీలో రోహిత్, రహానే ప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు( టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడంతో రోహిత్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు) ►రోహిత్, రహానే ఇద్దరు సియెట్ కంపెనీ బ్యాట్‌నే వాడడం విశేషం. ►రోహిత్ చాలా సందర్భాల్లో కూల్‌గానే ఉంటాడు.. రహానే స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మ్యాచ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుతో వివాదాలకు పోకుండా కూల్‌గా ఉండడం ఇతని నైజం చదవండి: Jaydev Unadkat: బ్యాటింగ్ వీడియో షేర్ చేశాడు.. 'నన్ను ఆల్‌రౌండర్‌గా పరిగణించండి' -
టి20 కెప్టెన్‌గా కోహ్లి కథ ముగిసింది
Virat Kohli T20 Captaincy End With No T20 Wc Title.. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి కోరిక తీరలేదు. టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన తర్వాత కోహ్లి టి20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా కోహ్లికి ఇదే చివరిది కావడంతో ఎలాగైనా కప్ కొట్టాలని భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే టి20 కెప్టెన్‌గా కోహ్లి కథ ముగిసిపోయింది. బ్యాట్స్‌మన్‌గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి మొదలుకొని.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్.. తాజాగా టి20 ప్రపంచకప్ వరకు కోహ్లికి కెప్టెన్‌గా కలిసిరాలేదనే చెప్పాలి. చదవండి: Team India: ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా ఓవరాల్‌గా కోహ్లి టి20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్‌లు గెలిచి 16 ఓడిపోయింది. 63.27 శాతంతో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్‌కప్ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే. ఎందుకంటే వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని.. రోహిత్‌కు వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి.. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్‌గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఓడిపోవడంతో టీమిండియా సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. సోమవారం నమీబియాతో జరగనున్న మ్యాచ్ కోహ్లికి టి20 కెప్టెన్‌గా ఆఖరిది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దారుణ పరాభవాలు చూడడం టీమిండియా సెమీస్ అవకాశాలు దెబ్బతీసింది. కానీ ఆ తర్వాత అఫ్గాన్, స్కాట్లాండ్పై భారీ విజయాలతో టీమిండియా ఆశలు రేపింది. అయితే కివీస్ టీమిండియా ఆశలపై నీళ్లు చల్లుతూ అఫ్గాన్‌పై కూల్‌గా విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది. చదవండి: AFG Vs NZ: చేతులెత్తేసిన అఫ్గాన్.. టీమిండియా ఇంటికి -
భారత టీ20 కెప్టెన్‌గా ఆ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయండి...
Jasprit Bumrah Can Replace Virat Kohli As India Captain In T20Is: టీ20 ప్రపంచకప్- 2021 తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ ,కెఎల్ రాహుల్, రిషబ్ పంత్.ల్లో ఒకరు భాద్యతలు స్వీకరించనున్నారనే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా టీ20ల్లో తదుపరి భారత కెప్టెన్‌గా.. కొత్త పేరును తెరపైకి తీసుకువచ్చాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు టీ20 కెప్టెన్ భాద్యతలు స్వీకరించే అర్హతలు ఉన్నట్లు నెహ్రా తెలిపాడు. "రోహిత్ శర్మతో పాటు, రిషబ్ పంత్ ,కేఎల్ రాహుల్ పేర్లును టీమిండియా తదుపరి కెప్టెన్‌గా వింటున్నాము. పంత్ భారత జట్టుతో ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. కొన్ని సార్లు జట్టు నుంచి కూడా తొలగించబడ్డాడు. ఆదేవిధంగా మయాంక్ అగర్వాల్ ఫామ్ లేమి కారణం రాహుల్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. అయితే బుమ్రా మాత్రం అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు.పేసర్లు కెప్టెన్లగా ఉండకూడదని ఎక్కడా వ్రాయలేదు"అని నెహ్రా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni:ఆ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కెప్టెన్‌గా మరోసారి ధోని -
వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?!
Rohit Sharma May ODI And T20I Captain.. టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ఇక టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. చదవండి: IND Vs NZ: రోహిత్ శర్మకే సందేహం వచ్చేలా.. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. కోహ్లికి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి వన్డే, టి20ల్లో రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్ సమయానికి సెలక్షన్ కమిటీ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీతో పాటు టీమిండియా కోచ్ పదవిపై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోహ్లి నాయకత్వంలోని జట్టు టి20 ప్రపంచకప్ 2021లో దారుణ ప్రదర్శన చేయడంతో బీసీసీఐతో సెలక్టర్లను ఆందోళనలో పడేసింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్ 20222తో పాటు 2023 వన్డే వరల్డ్‌కప్‌లోగా కెప్టెన్సీ విషయంలో టీమిండియా ఇబ్బందులు పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా కొనసాగినా.. వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అనే ప్రతిపాధనను బీసీసీఐ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల జట్టు కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది. చదవండి: Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్’ వైరల్ అందుకే రోహిత్‌ను వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా.. కోహ్లి టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కరెక్ట్ అని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటికైతే స్పష్టత లేకపోయినప్పటికీ టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం గ్యారంటీ. ఇక టీమిండియా ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న కివీస్‌తో తొలి టి20 ఆడనుంది. ఈ తర్వాత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది ఇక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సారధ్యంలో టీమిండియా 95 వన్డేల్లో 65 గెలిచి.. 27 ఓడిపోగా.. ఒక మ్యాచ్ రద్దైంది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో 10 వన్డేల్లో 8 గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20ల్లో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 45 మ్యాచ్‌ల్లో 27 గెలిచి.. 14 ఓడిపోగా.. 2 మ్యాచ్‌లు ఫలితం రాలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో 15 గెలిచి.. 4 ఓడిపోయింది. -
టి20 కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్‌తో జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ద్వారా 300 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్ చేర్చిన ధోని.. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను ఫైనల్ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 213 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తర్వాత ఐపీఎల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగా కోహ్లి 140 మ్యచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ కాగా వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోని సీఎస్కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం ధోని సీఎస్కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్లో ఎల్లో డ్రెస్‌లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి -
"ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..!
BCCI Did Not Consult Kohli About Appointing Dhoni As Mentor: ప్రపంచకప్ తర్వాత టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ విరాట్ కోహ్లి బాంబు పేల్చిన నేపథ్యంలో అతని నిర్ణయం వెనుక గల అసలు కారణాలపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇదే విషయపై తాజాగా మరో వార్త నెట్టింట షికార్లు చేస్తుంది. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఆ రెండు నిర్ణయాలే కారణమన్నది ఆ వార్త సారాంశం. ఆ రెండు నిర్ణయాల్లో మొదటిది.. టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం కాగా, రెండోది టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్ ఎంపిక. వివరాల్లోకి వెళితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో టీమిండియా ఓడిన నాటి నుంచి కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. దీంతో కోహ్లిని సంప్రదించకుండానే ధోనిని టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, టీ20 ప్రపంచకప్ జట్టులో చహల్ ఉండాలని కోహ్లి పట్టుబట్టినప్పటికీ.. రోహిత్ సలహా మేరకు సెలెక్షన్ కమిటీ అశ్విన్‌ను ఎంపిక చేసింది. తన ప్రమేయం లేకుండా బీసీసీఐ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను జీర్ణించుకోలేకపోయిన కోహ్లి.. పొట్టి క్రికెట్ పగ్గాలు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కోహ్లిని టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు అశ్విన్ ప్రధాన కారణం అని మరో వాదన వినిపిస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి.. అశ్విన్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని.. ఇది బీసీసీఐకి అస్సలు నచ్చలేదని.. దీంతో కోహ్లి విషయంలో పొమ్మనలేక పొగ పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అశ్విన్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. కోహ్లి అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఈ విషయమై కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మధ్య కూడా వాదన జరిగినట్లు సమాచారం. చదవండి: ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి -
బీసీసీఐ, కోహ్లి మధ్య అగాధం.. అందుకే ఆ నిర్ణయం..!
న్యూఢిల్లీ: ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ టీమిండియా సారధి విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో అందుకు గల కారణాలపై విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ సైతం తన అభిప్రాయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియా సారథికి, బీసీసీఐకి మధ్య చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినట్లనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఈ కారణం చేతనే కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి ఒకటి చెబితే, బీసీసీఐ మరొకటి చెబుతుందని అనుకోలేమని, ఈ నిర్ణయం కోహ్లి వ్యక్తిగత నిర్ణయమే అయ్యింటుందని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనప్పటికీ కోహ్లి నిర్ణయం అతని బ్యాటింగ్‌ను మెరుగుదిద్దుకునేందుకు తోడ్పడుతుందని తెలిపాడు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లి గొప్ప ఆస్తి అని.. అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని కొనియాడాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినా.. దేశం తరఫున పరుగులు చేస్తూనే ఉండాలని ఆకాంక్షించాడు. టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకునేందుకు రోహిత్‌కు మించిన అర్హుడు మరొకరు లేరని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, 1983 భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పాటిల్ 2012-16 మధ్యలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వ్యవహరించాడు. 80ల్లో భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న పాటిల్.. రిటైర్మెంట్ అనంతరం కెన్యా జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో కెన్యా 2003 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించింది. 1980-86 మధ్య భారత జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాటిల్.. 29 టెస్ట్‌లు, 45 వన్డేల్లో 2500లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లలో కలపి అతను 24 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆ ఆర్సీబీ ఆటగాడు ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఇంకా ఉంది.. -
కోహ్లి నిర్ణయం సరైందే