tajmahal
-
తాజ్ మహల్‌ను తేజో మహల్ అంటూ కావడియాత్రకు మహిళ
‘అది తాజ్ మహల్ కాదు.. తేజో మహల్.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్‌మహల్ దగ్గరకు చేరుకుని నానా హంగామా చేసింది.తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన జనం ఆ మహిళను చూసేందుకు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను తాజ్ మహల్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది.ఈ ఘటన నేటి ఉదయం(సోమవారం) ఉదయం తాజ్ మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు మీనా రాథోడ్. ఆమె.. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని మీడియాకు తెలిపింది. ఆ మహిళ తన భుజాలపై కావడి పెట్టుకుని తాజ్‌మహల్ చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు తాజ్‌లోనికి కావడి తీసుకువెళ్లకూడదంటూ అడ్డుకున్నారు.అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది. రెండు రోజుల క్రితం భోలేనాథుడు తనకు కలలో కనిపించాడని, తేజోమహల్ ఒక దేవాలయం అని, అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. అమె తాజ్‌మహల్ లోనికి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు.. సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె మరో మార్గంలేక కావడితో సహా ఇంటిదారి పట్టింది. -
‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్!
తాజ్‌మహల్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేవారి నుంచి ప్రభుత్వానికి ప్రతీయేటా ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విదేశీయులు ఎవరైనా భారతదేశానికి వస్తే ముందుగా వారు చూడాలనుకునేది తాజ్‌మహల్. ఇక మనదేశంలోని ప్రతీఒక్కరూ తాజ్‌మహల్ చూడాలని తప్పనిసరిగా అనుకుంటారు. తాజ్‌మహల్‌కు ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం దాని నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజ్‌మహల్ అనునిత్యం పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. మరి అటువంటప్పుడు తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది. అలాగే ప్రతీయేటా తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడవుతాయనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందువరుసలో... దేశంలోని అత్యంత పురాతన అందమైన కట్టడాలలో తాజ్‌మహల్ ముందువరుసలో ఉంటుంది. తాజ్‌మహల్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదంటే.. కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినప్పుడు కూడా.. ఆ రెండు సంవత్సరాల్లో తాజ్‌మహల్ సందర్శించేందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టిక్కెట్లు విక్రయమయ్యాయి. ఇది కూడా చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు సందర్శకుల సంఖ్య ఎంతంటే.. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తాజ్‌మహల్ సందర్శనకు ప్రతీయేటా సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేలమంది విదేశీయులు ఉంటారు. తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి స్థానికులకు (భారత్) రూ. 50, విదేశీయులకు రూ.1100 టిక్కెట్ రూపంలో వసూలు చేస్తారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో రూ.152 కోట్ల ఆదాయం తాజ్‌మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీయేటా రూ. 40 కోట్లు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా రూ.110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తరువాతి స్థానంలో ఆగ్రాకోట పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ల విక్రయాల కారణంగా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతీయేటా వచ్చే ఆదాయంలో.. తాజ్‌మహల్, ఆగ్రాకోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53 శాతం మేరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా.. -
అమ్మ కోసం తాజ్‌మహల్.. ఫిదా అవుతున్న జనం!
తమిళనాడుకు చెందిన ఒక కోటీశ్వరుడు తన తల్లికి గుర్తుగా మరో తాజ్‌మహల్ నిర్మించారు. ఇందుకోసం లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశారు. అమ్మే తన జీవిత సర్వస్వం అని అతను చెప్పుకొచ్చాడు. అమ్మ చనిపోయినప్పుడు ఎంతో కుమిలిపోయానని అన్నాడు. అమ్మ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయన పాల రాతితో మరో తాజ్‌మహల్ నిర్మించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు ప్రతీకగా తాజ్‌మహల్ నిర్మించారు. ఇప్పుడు ఒక కుమారుడు తన తల్లికి గుర్తుగా కోట్లాది రూపాయలు వెచ్చించి తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని నిర్మించారు. ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాకు చెందిన ఉదంతం. ఈ ప్రాంతానికి చెందిన అమ్రుద్దీన్ షేక్ దావూద్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ తాజ్‌మహల్ తరహాలో ఒక అద్భుత నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. 2020లో అమ్రుద్దీన్ తల్లి జెలానీ బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అమ్రుద్దీన్ ఎంతగానో కుంగిపోయారు. తల్లి జ్ఞాపకాలు మరువలేక.. అమ్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం అతని తల్లి అతనికి శక్తి, ప్రేమలకు ప్రతీకలుగా నిలిచారు. 1989లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన తరువాత ఆమె తన ఐదుగురు పిల్లలను పెంచిపోషించారు. ఆ సమయంలో ఆమె వయసు 30 ఏళ్లు మాత్రమే. భర్తను కోల్పోయాక ఆమె మరో వివాహం చేసుకోలేదు. పిల్లలను పెంచి పోషించేందుకు ఎంతో కష్టపడ్డారు. తండ్రిలేడనే లోటును లేకుండా పిల్లలను చూసుకున్నారు. 2020లో అమృద్దీన్ తన తల్లి మరణానంతరం అతను తల్లి జ్ఞాపకాలను మరచిపోలేకపోయారు. ఆమె తమతోనే ఉందని భావించారు. తిరువూరులో వారికి గల భూమిలో తల్లిని ఖననం చేశారు. చదవండి: చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు డ్రీమ్ బిల్డర్స్ సహాయంతో.. తరువాత డ్రీమ్ బిల్డర్స్‌ను సంప్రదించి, తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని అక్కడ నిర్మించారు. ఒక ఎకరాభూమిలో 8 వేల చదరపు అడుగులలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్ నిర్మాణం కోసం 200 మంది పనిచేశారు. ఈ నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా అతని తల్లి 5 కోట్ల రూపాయలను పొదుపు చేశారు. ఆ మొత్తంతో ఇంటిలోని వారి అనుమతి తీసుకుని, అమ్రుద్దీన్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్‌మహల్‌ను చూసినవారంతా అద్భుతంగా ఉందని అంటున్నారు. కాగా ఈ భవనాన్ని చిన్నారులకు విద్యనందించేందుకు, ముస్లింలు నమాజ్ పఠించేందుకు వినియోగించనున్నామని అమ్రుద్దీన్ తెలిపారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం -
తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల్లో ఏముందంటే...
లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పెద్ద హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయగా, వీటిని తాజాగా ఏఎస్ఐ విడుదల చేసింది. అంతేగాదు తాజ్‌మహల్ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ — Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022 (చదవండి: ‘తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయా పిటిషన్’.. కోర్టు ఏమందంటే..) -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య కోసం రొటేటింగ్ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆకు పచ్చ ముఖభాగం, రెడ్ మెటల్ రూఫ్‌తో 360 యాంగిల్లో తిరిగే ఈ రొటేటింగ్ హౌస్‌ను వోజిన్ కుసిక్ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
తాజ్‌మహల్ వద్ద పైథాన్ హల్చల్
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్‌మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్‌మహల్ సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి సమీపంలోని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్‌ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్‌ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్ఓఎస్ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ( చదవండి: రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి ) -
తాజ్, ఎర్రకోటల వద్ద మళ్లీ టూరిస్టుల సందడి!
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా తాజ్‌మహల్, ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు జులై 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కట్టడితో విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం పూర్తి భద్రతతో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించినా ఇప్పటివరకూ తెరుచుకోని చారిత్రక కట్టడాల వద్ద జులై 6 నుంచి తిరిగి పర్యాటకుల సందడి మొదలవనుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో సంప్రదింపులు జరిపిన మీదట కేంద్ర ప్రభుత్వం చారిత్రక కట్టడాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. చదవండి : తాజ్ అందాలు ఆస్వాదించా -
ట్రంప్ టూర్ : వావ్ తాజ్ అంటారా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించనున్న అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ అపూర్వ కట్టడంతో అనుభవాలు చాలానే ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ తిరుగులేని ఆదాయ వనరుగా మార్చుకోవడంలో అందెవేసిన చేయిగా పేరొందిన ట్రంప్‌నకు ఆ తాజ్‌మహల్ మాత్రం బిన్న అనుభవాలనే మిగిల్చింది. 1990లో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో ప్రారంభమైన ట్రంప్ తాజ్ మహల్ క్యాసినో ప్రారంభించిన నెలల్లోనే దివాలాకు దరఖాస్తు చేసింది. అనంతరం దీన్ని ట్రంప్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చారు, అప్పటికీ అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చినా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రెండు చేతులా ఆర్జించారు. ట్రంప్ తాజ్ మహల్ ను 2017 లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్ యజమానులకు విక్రయించే సమయానికి, డొనాల్డ్ ట్రంప్‌కు మాతృ సంస్థలో వాటా లేదు. (నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్) తాజ్ వద్ద తాజా సాయంత్రం.. ఇక ఇప్పటి విషయానికి వస్తే తాను నిర్మించిన తాజ్ మహల్ అనుభవం అలా ఉంటే ఇక ప్రపంచంలోనే అత్యంత సందర్శనీయ స్ధలాల్లో ఒకటై ఆగ్రాలో కొలువుతీరిన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో సందర్శించనున్నారు. ట్రంప్ తాజ్ పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. తోటలు, ఫౌంటెన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆర్భాటపు ఏర్పాట్లు, తాజ్ అందాలు ట్రంప్‌ను ఎలాంటి అనుభూతులకు లోనుచేస్తాయి..? తన తాజ్‌మహల్ జ్ఞాపకాలను గుర్తుకుతెస్తాయా..? వాటిని మనతో ఆయన ఎలా పంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
ట్రంప్ టూర్ : ఆగ్రా మేకోవర్..
ఆగ్రా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారత్ పర్యటన సందర్భంగా ఆయన సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌నకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతుంటే ఆయన పర్యటించే ఆగ్రాలోనూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. అగ్రనేత రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దడంతో పాటు యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. అమెరికా నుంచి వచ్చిన సెక్యూరిటీ బృందం తాజ్‌మహల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చారిత్రక కట్టడాన్ని సందర్శించి ట్రంప్ రాకకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా 500 క్యూసెక్కుల నీటిని యుమనా నదిలోకి యూపీ ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. నదీ జలాల వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసనను నియంత్రించేందుకు తాజా నీటిని అధికారులు విడుదల చేశారు. చదవండి : ఆగ్రా పేరు ఇక 'అగ్రవాన్'..! -
ప్రేమించే స్నేహితుడు! అజ్ఞాత ప్రేమికుడు..
సినిమా : తాజ్ మహాల్(2010) తారాగణం : శివాజీ, శృతి, కోటాశ్రీనివాసరావ్, బ్రహ్మానందం, నాజర్, రఘుబాబు డైరెక్టర్ : అరుణ్ శింగరాజు సంగీతం : అభిమన్ కథ : అజయ్( శివాజీ) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. డిగ్రీ చదువుల కోసం హైదరాబాద్ వస్తాడు. నగరంలో అడుగుపెట్టగానే అతడి వేషభాషల్లో, ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. పేదవాడిననే విషయాన్ని దాచిపెట్టి బాగా డబ్బున్నవాడినని చెప్పుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే తన కాలేజ్‌లో చదివే శృతి(శృతి)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. కానీ, శృతి మాత్రం అతడ్ని ఫ్రెండ్‌లానే ట్రీట్ చేస్తుంది. ఇదిలా ఉండగా శృతి, కుమార్ అనే ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అతడ్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ నేపథ్యంలో శృతి ప్రేమను పొందటానికి అజయ్ చేసే ప్రయత్నాలేంటి? చివరకైనా శృతి! అజయ్ ప్రేమను అంగీకరిస్తుందా? ఇంతకీ ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరు? అన్నదే మిగితా కథ. విశ్లేషణ : 2010లో విడుదలైన తాజ్ మహాల్ ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. 2008లో విడుదలైన కన్నడ చిత్రం తాజ్‌మహాల్‌కు ఇది రీమేక్. వన్‌సైడ్ లవర్‌గా శివాజీ నటన అద్భుతంగా ఉంటుంది. అజ్ఞాత ప్రేమికుడి కోసం పరితపించే యువతిగా శృతి నటన ఆకట్టుకుంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. క్లైమాక్స్‌లో చోటుచేసుకునే సంఘటనలు సినిమాకు హైలెట్‌గా నిలవటమే కాకుండా మన మనసులో ముద్రపడిపోతాయి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమసౌథం ‘‘తాజ్‌మహాల్’’
ప్రేమికులకు పరిచయం అక్కర్లేని కట్టడం ‘‘తాజ్ మహాల్’’. రెప్పవేయనీయని సౌందర్యం ఈ ప్రేమ మహాల్ సొంతం. సామాన్యులైనా.. దేశాధినేతలైనా ప్రేమసౌథం అందాలకు దాసోహం అనకమానరు. ఆ పాలరాతి అందాలను ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.. మక్కువ చావదు. భార్యాభర్తల ప్రేమ బంధానికి చిరునామా.. షాజహాన్ ప్రేమికులకు అందించిన వీలునామా ‘‘తాజ్ మహాల్’’. ప్రేమ చిహ్నంగా ప్రేమికులను.. ప్రపంచ ఏడో వింతగా పర్యటకులను ఆకర్షిస్తోంది వెండి వెలుగుల సోయగం. భార్య ఆఖరికోరికకు రూపమే తాజ్‌మహాల్ షహాబుద్ధీన్ మహమ్మద్ షాజహాన్ చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. షాజహాన్‌కు మూడవ భార్య ముంతాజ్ మహాల్ అంటే ఎంతో ప్రేమ. ముంతాజ్ 14వ సంతానమైన గౌహరా బేగానికి జన్మనిస్తూ కన్నుమూసింది. ఆమె మరణంతో షాజహాన్ తీవ్రంగా కృంగిపోయాడు. ముంతాజ్ తన మరణానికి ముందు రోజుల్లో.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఓ అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. భార్య కోరిక మేరకు షాజహాన్ సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా కళాపిపాసి అయిన షాజహాన్ తన భార్యకు అంకితమివ్వబోయే కట్టడం కనీవినీ ఎరుగని రీతిలో ఉండాలని శిల్పులను ఆదేశించాడు. ఆనాటి ప్రముఖ శిల్పులు ఉస్తాద్ అహ్మద్ లహోరీ, ఉస్తాద్ అబ్దుల్ కరీమ్‌లు తాజ్‌మహాల్ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. 1932లో యమునా నది తీరంలోని ఆగ్రాలో తాజ్‌మహాల్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 22 వేలమంది కార్మికులు 22 సంవత్సరాల పాటు శ్రమించి తాజ్ మహాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పర్షియన్, భారతీయ, ఇస్లాం నిర్మాణ శైలిలో పాలరాయితో రూపుదిద్దుకున్న తాజ్‌మహాల్ ఓ అద్భుతం. -
అనంతపురం తాజ్‌మహల్
సాక్షి, రాయదుర్గం(అనంతపురం) : తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించాడు. ఈ కట్టడ నిర్మాణం 1632లో మొదలై 1653లో పూర్తయింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న గిరిజన యువతి భాగ్యమతి కోసం ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడు షాహీ సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుందరమైన ఈ నగరం 1590లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఇలాంటి చారిత్రక ఆధారమే జిల్లాలోనూ ఉంది. క్రీ.శ 18వ శతాబ్దంలో రాయదుర్గంలో సతీసహగమనంలో భాగంగా కోనేటి నాయకుని భార్య వెంకటలక్షుమమ్మ ఆత్మార్పణం చేసుకుంది. ఆమె జ్ఞాపకార్థం ఓ సమాధి నిర్మించారు. ప్రస్తుతం అది రాయదుర్గంలోని మధు టాకీస్ సమీపంలో ఉన్న ఓ తోటలో ఉంది. ఇది చదవండి : పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం -
‘తాజ్ సిటీలో ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటారు’
లక్నో : యూపీలోని ఆగ్రాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొద్ది గంటలు ముందు ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తాజ్‌మహల్ కొలువైన ఆగ్రాలోనైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రేమ, ఆప్యాయతల గురించి తెలుసుకుంటారని ఆకాంక్షిస్తూ అఖిలేష్ ట్వీట్ చేశారు. ఆగ్రా సమీపంలో బంగాళదుంప, చెరకు, ధాన్యం రైతుల కష్టాలను సైతం ఆయన గుర్తుతెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఇక్కడి రైతులు, వ్యాపారుల దీనావస్థ చూడలేనంతగా యూపీ ఢిల్లీకి దూరంగా లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం కోట్లాది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదన్నారు. రైల్వేల్లో 63,000 పోస్టులకు రెండు కోట్ల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే యువత మోదీ సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉందన్నారు. కాగా అక్రమ మైనింగ్ కేసుల్లో సీబీఐ తనను ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో అఖిలేష్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడటం విశేషం. -
తాజ్‌మహల్ గేటు ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: 400 ఏళ్లనాటి శివాలయం లోకి అనుమతించే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చారిత్రాత్మక కట్టణం తాజ్‌మహల్ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజ్‌మహల్‌కు సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మూసివేస్తోందని వీహెచ్‌పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధ్వేశ్వర మహాదేవ్ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్‌మహల్, సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఐరన్రాడ్లతో దాడిచేశారు. గేట్‌ను తొలగించి, అక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేలకు వారిని నిరోధించిన తాజ్ మహల్ సిబ్బంది వారిని అదుపులోకి కున్నారని తాజ్ భద్రతా అధికారి ప్రభాత్‌కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ సభ్యులు రవిదుబే, మదన్‌వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30మంది పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. తాజ్‌మహల్ చుట్టూ ఉన్న హిందూసంస్కృతికి సంబంధించిన అంశాలను ఏఎస్ఐ నాశనం చేస్తోందని విహచ్పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ సత్సంగ్ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇకముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు. -
దత్తతకి తాజ్
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్‌మహల్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్‌ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ? మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజ్‌పై జీఎంఆర్ విజన్ డాక్యుమెంట్ తాజ్‌మహల్‌కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యజమాని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజ్‌మహల్‌ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్‌మహల్ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్ కారిడార్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్‌ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్‌తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్–ఉద్–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్‌లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్‌లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బందరు 'తాజ్'
మచిలీపట్నం టౌన్ (మచిలీపట్నం): షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలైన ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను నిర్మిస్తే బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్సన్ కోసం అదే రీతిలో తమ ప్రేమకు ప్రతిరూపంగా 1815వ సంవత్సరంలో ఓ సుందర మందిరాన్ని నిర్మించారు. తాజ్‌మహల్‌లో లేని ఓ విశేషాన్ని అరబెల్లా మందిరంలో ఉంది. అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా ఈజిప్ట్ మమ్మీ తరహాలో ఏర్పాట్లుచేశారు. ఓ అందమైన గాజు పెట్టెలో మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచాడు. ప్రియురాలిని చూడలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను అమర్చి, దానిని తిప్పితే భూమి లోపలి అరలో పెట్టి పైకి వచ్చేలా అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. మందిరం కథ ఏమిటంటే.. మేజర్ జనరల్ పీటర్ మచిలీపట్నంలో నాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా పనిచేశారు. వారి వద్ద కెప్టెన్‌గా పనిచేస్తున్న రాబిన్సన్ కుమార్తె అరబెల్లాను పీటర్ ప్రేమించి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి అరబెల్లా తండ్రి రాబిన్సన్, మతాధికారులు అంగీకరించలేదు. అయినా వారిద్దరూ సహజీవనం చేశారు. ఈ దశలో పీటర్, రాబిన్సన్ మధ్య కలతలు పెరిగాయి. తండ్రి, ప్రియుడి మధ్య విభేదాల నేపథ్యంలో మానసిక ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతిని 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. పీటర్ కన్నీటి నడుమ అరబెల్లా మృతదేహాన్ని వివాహ వస్త్రాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు జరిపించాడు. అరబెల్లా పాపపు స్థితిలో మరణించిదనే నెపంతో నాటి పరిశుద్ధ యోహాను ఆవరణలో, బందరు కోటలోని ఆంగ్లేయుల శ్మశానవాటికలో మృతదేహాన్ని సమాధి చేసేందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆనందపేట సమీపంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచాడు. ప్రేయసి జ్ఞాపకాలు మదిని తట్టినప్పుడల్లా అరబెల్లా మృతదేహాన్ని బయటకు తీసి, తీరని దుఃఖంతో కుమిలిపోయేవాడు. మరణించిన అరబెల్లాను చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె మృతదేహాన్ని ఉంచిన చోటే సెయింట్ మేరీస్ చర్చిని నిర్మించాడు. అరబెల్లాను తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ పీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చాడు. ఆయన మద్రాసుకు బదిలీపై వెళ్తు ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. 1819 నుంచి మతాధికారులు ఆ చర్చిలో అందరూ ప్రార్ధనలు జరుపుకునేలా అనుమతిచ్చారు. ప్రేయసి దూరమైన బాధతో 1819లో పీటర్ మద్రాసులో మృతిచెందాడు. ఆయన పేరుతో మద్రాసులో ఉద్యానవనం ఏర్పాటు చేసి, ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. పరిశుద్ధ మేరీ చర్చిలో పనిచేస్తున్న పనిమనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పడంతో సమాధిపై ఉన్న రాయి తొలగి అరబెల్లా మృతదేహం పైకి రావడాన్ని హఠాత్తుగా చూసి మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఆ ఆరను శాశ్వతం మూయించారు. ప్రస్తుతం చర్చి కూడా మూతపడింది. -
అడుసు తొక్కనేల...?
♦ అక్షర తూణీరం ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు లేనివి కొనితెచ్చుకోవడం మనకో విలక్షణమైన అలవాటు. ప్రసిద్ధ చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ని యూపీ పర్యాటక శాఖ వెలి వేయడం, దాని నిర్మాతలు సన్మార్గులు కారనడంతో వివాదం చెలరేగింది. సెగ పైదాకా తగిలింది. తాజ్‌మహల్ లాంటి మహల్ ప్రపంచంలో మరెక్కడా లేని మాట నిజం. ప్రపంచ ప్రజల్ని తాజ్‌ని చూసినవారు, చూడనివారు అని రెండు వర్గాలుగా విభజించవచ్చని ప్రముఖులు తీర్మానించారు. ఎవరేమన్నా భారతదేశానికి ఆ పాలరాతి మందిరం ఓ కొండగుర్తు. కాదు, అసలది తేజ్మహల్. శివాలయం కాగా దాన్ని మార్చి, పరిమార్చి తాజ్‌మహల్ చేశారని కోతిచేత నిప్పు తొక్కించారెవరో. ఇది చినికి చినికి గాలివాన అయ్యేట్టుందని యూపీ ముఖ్యమంత్రి రంగప్రవేశం చేసి, నిర్మాతలెవరైనా, రాళ్లెత్తిన కూలీలు చిందించిన స్వేదాన్ని, రక్తాన్ని గౌరవిస్తా, తాజ్‌మహల్‌ని గౌరవిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు. కనీసం ఆ మహా నిర్మాణక్రమంలో నలిగి, కమిలి బలవన్మరణాల పాలైనవారి పేర్లైనా ఉండవు. ‘‘మీ మహాప్రస్థానానికి అక్షరం అక్షరం పొది గిన వారెవరు? అచ్చులొత్తిందెవరు? అట్టలు కుట్టిందెవరు? కట్టలు మోసిందెవరు? ఎక్కడైనా వారి పేర్లు అచ్చు వేశారా?’’అని మహాకవిని నిలదీశారు. జవాబు లేదు. అంతే, కొన్ని కోటబుల్ కోట్స్ అవుతాయిగానీ చర్చకు నిలవవు. తిరిగి తాజ్‌మహల్ దగ్గరకు వస్తే– అన్నట్టు ముగ్గేలా తాజ్‌మహల్ ముని వాకిటలో అన్నాడు శ్రీశ్రీ! ముఖ్యమంత్రి యోగి మొత్తం శుద్ధి చేయడానికి తాజ్‌మహల్ పరిసరాలన్నీ తుడుస్తూ చీపురుతో పాదయాత్ర ప్రారంభించారు. అయ్యవార్లంగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుంది. ఈ నైజం భాజపా రక్తంలోనే ఉందనిపిస్తుంది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం పాతనోట్ల రద్దు– పైకి తేవా ల్సిన చిచ్చుబుడ్డి అడుగునించి గుంటపూలు పూసిందని అపోజిషన్ ఆక్షేపిస్తోంది. బ్లాక్ డేని బ్లాక్‌మనీ డేగా తిరగ్గొడతామని సర్కార్ అంటోందిగానీ మాట నీళ్లు నవుల్తున్నట్టుంది. ‘‘వీళ్లింతేనండీ, అడుసు తొక్కడం, గంగాజలంతో కాళ్లు కడుక్కోవడం, మళ్లీ అడుసువైపు పరుగులు తీయడం... వీళ్లకి దేశభక్తి, మతాభిమానం ఉంటే ఏదండీ రామమందిరం? నాలుగేళ్లలో నాలుగు స్తంభాలైనా నిలిపారా’’ అన్నాడొక అపర హనుమంతుడు ఆక్రోశంగా. ‘‘చూస్తున్నాంగా ఈయనవీ ఊకదంపుడు ఉపన్యాసాలే. కాకపోతే మరీ నాసిరకం ఊక కాకుండా హెర్బల్ ఊక వాడుతున్నాడని’’ ఓ పెద్దమనిషి ఆక్షేపించాడు. జీఎస్టీ కూడా బురద బురదగానే ఉంది. దాన్నొక క్రమంలో పెట్టకుండా, అచ్చీపచ్చీగా జనం మీదకు వదిలారని అనుభవజ్ఞులంటున్నారు. హిందీ భాషలో ఏది స్త్రీ లింగమో, ఏది పుంలింగమో చెప్పడం క్లిష్టతరం. దానికో వ్యాకరణ సూత్రం లేదు. వస్తు సేవల పన్ను పరిభాష కూడా అలాగే ఉంది. కొన్ని వేల లక్షల పన్ను విధానాలు. ఇది అంకెలలో నిర్మించిన హిందీ భాష. ఇది నా మనసులో మాట! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అక్కడ నమాజ్‌ను నిషేధించండి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన అద్భుత కట్టడం తాజ్ మహల్ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. బీజేపీ ఎమ్మేల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది. అదే సమయంలో తాజ్ మహల్ ఒకప్పటి శివాలయం అంటూ ఎంపీ వినయ్ కతియార్ చేసిన మరో వ్యాఖ్య వివాదాన్ని మరింత పెంచింది. అప్పటినుంచి తాజ్ చుట్టూ వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంస్థ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ ఇతిమాస్ సంకల్ప సమితి (ఏకేబీఐఎస్‌ఎస్) సంస్థ ఒకటి తాజ్ దగ్గర ముస్లిం మత ప్రార్థనలను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఏకేబీఐఎస్‌ఎస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ బాలముకుంద్ పాండే.. మాట్లాడుతూ తాజ్ మహల్ అనేది జాతి వారసత్వ సంపద అయినప్పుడు.. కేవలం ఒక్క ముస్లింలకు మాత్రమే అక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తాజ్ మహల్ దగ్గర నమాజ్ చేయడాన్ని తక్షణమే నిషేధించాలని ఆయన యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజ్ మహల్ దగ్గర ముస్లింలు నమాజ్ చేయడాన్ని నిషేధించలేకపోతే.. హిందువులకు కూడా.. అక్కడ శివ పూజ చేసుకునే అవకాశాన్నికల్పించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని పాలించిన ముస్లిం చక్రవర్తులు.. అనేక ఆలయాలు పడగొట్టి సమాధులు కట్టారని ఆయన చెప్పారు. -
తాజ్‌మహల్ రత్నం
ఆగ్రా: ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన, ఇటీవల వివాదాలు చుట్టుముట్టిన తాజ్‌మహల్‌ను యూపీ సీఎం యోగి సందర్శించారు. తాజ్‌మహల్‌ను రత్నంగా అభివర్ణించిన యోగి, అక్కడి పరిసరాలను చీపురుకట్టతో ఊడ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. భారత సంస్కృతిలో తాజ్ మహల్ అంతర్భాగమేననీ యోగి స్పష్టం చేశారు. ‘తాజ్‌మహల్‌ను ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టారనేదానిపై మనం లోతుగా ఆలోచించకూడదు. భారతీయ రైతుల, కార్మికుల సంపద, శ్రమతో ఇది నిర్మితమైంది. తాజ్ ఒక రత్నం’ అని అన్నారు. యోగి తాజ్‌మహల్ లోపల ఉండగానే బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బయట మాట్లాడుతూ శివాలయాన్ని కూలదోసి తాజ్‌మహల్‌ను నిర్మించారనీ, అదే నిజమని మళ్లీ చెప్పుకొచ్చారు. తాజ్‌ను యోగి సందర్శించడంపై సీపీఐ నేత అతుల్ అంజన్ మాట్లాడుతూ యోగిది ప్రాయశ్చిత్త యాత్ర అని విమర్శిం చారు. కాగా, యోగి తాజ్‌మహల్‌ను సందర్శించిన సమయంలో వేలాది మంది పోలీసులను అక్కడ మొహరించారు. -
యోగిని అలా చూడాలనుకుంటున్నా!
లక్నో: ప్రముఖ కట్టడం తాజ్‌మహల్ ఎదుట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ఫొటో దిగితే చూడాలని ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తాజ్‌మహల్ విషయంలో తాజా వివాదం నేపథ్యంలో దానిముందు యోగి ఎలా ఫొటో దిగుతారన్నది ఆసక్తి కలిగిస్తున్నదని చెప్పారు. ఈ నెల 29న సీఎం యోగి తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజ్‌మహల్ వివాదంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన అఖిలేశ్.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు దానిని సందర్శించానని, తాజ్‌మహల్ గొప్ప కట్టడమని ప్రశంసించారు. 'నా భార్య డింపుల్‌తో కలిసి నేను తాజ్‌మహల్‌ను సందర్శించాను. అక్కడ మేం ప్రారంభించిన బెంచ్ మీద కూర్చుని ఫొటోలు దిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి తాజమహల్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు. అప్పుడు ఆయన తాజ్‌మహల్ ముందు ఫొటో దిగుతారు. ఆ ఫొటో ఎలా ఉంటుందో చూడాలని వేచిచూస్తున్నా' అని అఖిలేశ్ అన్నారు. తాజ్‌మహల్ హిందూ సంస్కృతిపై మచ్చ, తాజ్‌మహల్ శివాలయం అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు తాజ్‌మహల్ ఏమిటో మొదట బీజేపీ నేతలు తేల్చుకోవాలని సూచించారు. -
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
-
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
చండీగఢ్: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అని హరియాణా క్రీడల మంత్రి అనిల్ విజ్ శుక్రవారం ట్వీట్ చేశారు. గతంలోనూ విజ్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. భారత వారసత్వం, చరిత్రలో తాజ్‌మహల్ స్థానం ఏంటంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైన సంగతి తెలిసిందే. -
‘తాజ్’ భారతీయుల స్వేద ఫలితం
గోరఖ్‌పూర్/లక్నో/న్యూఢిల్లీ: భారతీయ శ్రామికుల స్వేదం, రక్తపు బొట్లతో తాజ్‌మహల్ నిర్మితమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ను ద్రోహులు నిర్మించారని.. ఇలాంటి కట్టడాలకు చరిత్రలో స్థానం లేదని సొంతపార్టీ ఎమ్మెల్యే సోమ్ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. సోమ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. చరిత్ర, వారసత్వాలను గౌరవించలేని ఏ దేశమూ ముందుకెళ్లలేదన్నారు. కాగా, బానిస చిహ్నాలుగా ఉన్న తాజ్మహల్తోపాటుగా ఎర్రకోట, పార్లమెంటు భవనాలనూ తొలగిస్తే బాగుంటుందని సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. నిర్మించిందెవరని కాదు.. కాపాడటం మా బాధ్యత భారత కార్మికుల కష్టంతోనే తాజ్‌మహల్ నిర్మితమైందన్న యోగి.. వచ్చేవారం ఆగ్రాలో పర్యటించి నగరాభివృద్ధి, తాజ్ పర్యాటకం కోసం రూ.370 కోట్లతో రూపొందించిన ప్రణాళికపై సమీక్ష జరుపుతామన్నారు. ‘ప్రపంచ ప్రఖ్యాత అద్భుతమైన కట్టడమది. చరిత్రాత్మకమైన ఈ కట్టడాన్ని ఎవరు నిర్మించారనే దానితో సంబంధం లేకుండా.. దీన్ని కాపాడుతూ, పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయటం యూపీ ప్రభుత్వం బాధ్యత’ అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. తాజ్‌మహల్ భద్రత, పర్యాటకులకు సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామన్నారు. ‘ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్.. దేశానికే గర్వకారణం. అందుకోసం దీన్ని వివాదాల్లోకి లాగటం, దీనిపై రాజకీయాలు చేయటం సరికాదు’ అని యూపీ గవర్నర్ రాంనాయక్ పేర్కొన్నారు. ‘ఏ దేశమైనా తన చరిత్ర, వారసత్వంపై గౌరవం లేకుండా అభివృద్ధి చెందలేదు. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే.. కొంతకాలం తర్వాత ఆ దేశం తన ఉనికిని కోల్పోవటం ఖాయం’ అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే సోమ్ వ్యాఖ్యలపై మోదీ పరోక్షంగా స్పందించారు. వాటినీ కూల్చేయండి: ఆజంఖాన్ సోమ్ వ్యాఖ్యలపై వివాదం చల్లారకముందే సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ స్పందించారు. ‘బానిస చిహ్నాలను తప్పనిసరిగా తొలగించాలన్న అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఎప్పుడూ తాజ్‌మహల్ ఒక్కటే ఎందుకు? పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, కుతుబ్ మినార్, ఎర్రకోట.. వంటివన్నీ బానిస చిహ్నాలే కదా’ అని అన్నారు. తాజ్‌మహల్ భారత సంస్కృతి వారసత్వం కాదని బీజేపీ, సోమ్లు అంత పట్టుదలగా ఉంటే.. అప్పుడు తాజ్‌ను ధ్వంసం చేసేందుకు ఆ ఎమ్మెల్యే, ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు కలసిరావాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని ఆజంఖాన్ మండిపడ్డారు. -
తాజ్‌కు చరిత్రలో స్థానం లేదు
మీరట్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్రాత్మకంగా తాజ్‌మహల్‌కు ఎటువంటి ప్రాధాన్యం లేదని, హిందువులను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు తండ్రిని జైల్లో పెట్టిన వ్యక్తిని చరిత్రలో గొప్పవాడిగా చూపారని సోమ్ వ్యాఖ్యానించారు. నిజానికి తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్‌ను ఆయన కుమారుడు ఔరంగజేబు చెరసాలలో బంధించాడు. అంతేకానీ షాజహాన్ తన తండ్రిని చెరసాలలో బంధించలేదు. ఇలా చరిత్రను తప్పుగా వక్రీకరించిన సోమ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం మీరట్ జిల్లా పర్యటనలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఆనంగ్పాల్ సింగ్ తోమర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాబర్, అక్బర్, ఔరంగజేబులు ద్రోహులని, వారి పేర్లను చరిత్రపుటల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాజ్‌మహల్‌ను యూపీ టూరిజం బుక్లెట్ నుంచి తొలగించినందుకు కొందరు బాధపడు తున్నారని, అసలు తాజ్‌మహల్‌కున్న చరిత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాణా ప్రతాప్, శివాజీలు నిజమైన యోధులని, వారి జీవితచరిత్ర గురించి స్కూళ్లు, కాలేజీల్లో బోధించాలని సూచించారు. మరి ఎర్రకోటనూ వారే కట్టారు కదా: ఒవైసీ సాక్షి, హైదరాబాద్: తాజ్ మహల్æపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఎర్రకోటను కూడా మీరన్న ఆ దేశ ద్రోహులే నిర్మించారని.. అక్కడి నుంచి ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆపుతారా? ఓవైసీ ప్రశ్నించారు. అలాగే అదే దేశద్రోహులు నిర్మించిన హైదరాబాద్ హౌస్‌లో దేశ పర్యటనకు వచ్చిన విదేశీ నేతలకు ఇస్తున్న ఆతిథ్యాన్ని కూడా మోదీ ఆపేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించే సత్తా కేంద్రానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. -
తాజ్‌మహల్‌తో చాలామందికి ఉపాధి
సాక్షి, ఆగ్రా: తాజ్‌మహల్‌తో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బుధవారం రాత్రి భార్య డింపుల్‌యాదవ్, పిల్లలతో కలిసి ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మహల్ ఓ అద్భుతం, షాజాహాన్ తన ప్రేయసి చిహ్నంగా కట్టిన గొప్ప కట్టడమని కొనియాడారు. ఎస్పీ అధికారంలో ఉండగా తాజ్‌మహాల్ చుట్టు పక్కల వ్యాపారాలు విస్తరించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈ అద్భుత కట్టడం చరిత్రను వివరిస్తూ ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఇక రాత్రి వేళల్లో తాజ్‌మహాల్ గొప్పతనం మరింత తెలుస్తుందన్నారు. ప్రపంచమంతా చీకటిగా ఉన్నా తాజ్‌మహాల్ మాత్రం తెల్లని పాలరాతి స్తంభాలతో మెరుస్తుందన్నారు. యూపీ పర్యాటక బుక్లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.