tamil producer
-
మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?
నయనతార పేరు చెప్పగానే లేడీ సూపర్‌స్టార్ అని అంటారు. 40కి దగ్గర్లో ఉన్నా గానీ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈమె తీరు వల్ల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు మరో నిర్మాత విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమె తీరుపై మండిపడ్డారు.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)నయనతార సినిమా అయితే చేస్తుంది గానీ ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాదు. ఇదనే కాదు వ్యక్తిగత జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. ఇకపోతే నిర్మాత కమ్ యూట్యూబర్ అంతనన్ తాజాగా ఈమెపై విమర్శలు చేశాడు. తన పిల్లలని చూసే ఇద్దరు ఆయాలని కూడా సెట్స్‌కి తీసుకొస్తుందని, వారి ఖర్చులని కూడా నిర్మాతలే భరించాలని ఒత్తడి చేస్తోందని ఆరోపించాడు. గతంలో ఈయనే.. సెట్‌కి వచ్చేటప్పుడు నయన్ ఏకంగా 8 మందిని తీసుకొస్తుందని కామెంట్స్ చేశాడు.'నయనతార తన పిల్లల కోసం ఇద్దరూ ఆయాలతో షూటింగ్ లొకేషన్‌కి వస్తోంది. వాళ్లకి నిర్మాతలు డబ్బులు చెల్లించాలని అంటోంది. ఇదెక్కడ న్యాయం. ఆమె పిల్లల నానీలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు. ఆమె తన వ్యక్తిగత విషయాలపై కూడా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది. తన పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్‌కి భారీ మొత్తానికి అమ్మేసింది. నయనతార ప్రతిదీ వ్యాపారంగా మార్చుకుంది' అని నిర్మాత, యూట్యూబర్ అంతనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం) -
యువ నిర్మాత అరెస్ట్.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి
తమిళ యువ నిర్మాత మహమ్మద్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర పనిచేస్తున్న అమ్మాయిని మాటమాటలు చెప్పి మోసం చేయడమే దీనికి కారణం. అయితే అమ్మాయితో ఈ నిర్మాత చాలా దారుణంగా ప్రవర్తించాడు. సినిమాలు తీసే ఇతడు నిజ జీవితంలో విలన్‌గా ప్రవర్తించడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!)యువ నిర్మాత మహమ్మద్ అలీ.. కిల్ అయనంబాక్కంలో నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. కొరటూరు ప్రాంతానికి చెందిన ఓ యువతి.. గతేడాది సెప్టెంబరులో మహమ్మద్ అలీ కార్యాలయంలో పనికి చేరింది. అయితే గత నెల 13న అదే యువతి.. అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో సదరు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి, తనని ప్రేమిస్తున్నానని, పెళఅలి చేసుకోవాలనుకుంటున్నాని చెప్పి మోసం చేసినట్లు పేర్కొంది.యువతి ఫిర్యాదు ప్రకారం.. 'నాకు తెలియకుండానే సాఫ్ట్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపిచ్చి, నాపై అత్యాచారం చేశాడు. దాన్ని వీడియోగా రికార్డ్ చేశాడు. నాకు ప్రెగ్నెన్సీ రావడంతో.. పౌష్టికాహార మాత్రాలని చెప్పి అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు' అని చెప్పుకొచ్చింది. తనని ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు.. మహమ్మద్ అలీపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు కూడా తరలించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్‌ను ఆనందంగానే లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్‌గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను. ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిదీ కూడా రెండో పెళ్లినే.. ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది. మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ట్రోల్స్‌ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్‌పై చీటింగ్ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు. (ఇదీ చదవండి; సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్) దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్‌పై ఉంది. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్‌ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. (ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!) రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్‌పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్‌కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్లైన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణకు హాజరయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) -
సీనియర్ నిర్మాత కన్నుమూత
సీనియర్ సినీ నిర్మాత ఎస్ఏ రాజ్‌కన్ను (77) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్‌కన్ను అమ్మన్ క్రియేషన్స్ పతాకంపై కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిలతో '16 వయదినిలే' వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఆ చిత్రం ద్వారా భారతీరాజాను దర్శకుడిగా పరిచయం చేశారు. అదే విధంగా కిళక్కు పోగుం రైయిల్ చిత్రం ద్వారా నటి రాధికను పరిచయం చేసిన ఘనత ఈయనదే. నటుడు కె.భాగ్యరాజ్ విలన్‌గా నటించిన 'కన్నె పరువత్తిలే', కార్తీక్, రాధ జంటగా భారతీరాజా దర్శకత్వంలో 'వాలిభమే వావా', పటుడు పాండియన్, రేవతి జంటగా నటించిన 'పొన్ను పుడిచ్చిరిక్కు', కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో 'ఎంగ చిన్న రాసా' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈయన మృతిక నటుడు కమలహాసన్, నటి రాధిక, దర్శకుడు భారతీరాజా మొదలగు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కన్ను భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం చైన్నె క్రోంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఆయన వల్లే ఇదంతా.. ఏడ్చేసిన హీరోయిన్ -
బర్త్‌డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ కూడా చేశారు నెటిజన్లు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం) తాజాగా రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్‌తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. మహాలక్ష్మి బర్త్‌డే విషెష్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్‌లతో పాటు పాజిటివ్ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్‌కు విషెస్ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. -
సినిమాల్లో సక్సెస్ కాలేనని ఎగతాళి చేశారు: నటి
ఇతర రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మహిళలు పురుషులకు ధీటుగా సత్తా చాటుకుంటున్నారు. అలా రంజనా నాచ్చియార్ అనే నటి ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఈమె దర్శకుడు బాల సోదరుడి కూతురు.. ఎంఎస్సీ, ఎంటెక్, ఎల్ఎల్బీ పట్టభద్రురాలైన రామనాథపురం సంస్థానం రాజా భాస్కర్ సేతుపతి మనవరాలు కూడా! మొదట నటనపై ఆసక్తితో సినిమాలపై దృష్టి సారించారు. అలా తుప్పరివాలన్, ఇరుంబు తిరై, డైరీ, నట్పే తునై, రజనీకాంత్ నటించిన అన్నాత్తే వంటి పలు చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇప్పుడు నిర్మాతగా మారి స్టార్ గురు ఫిలిమ్స్ పతాకంపై ఏకకాలంలో రెండు చిత్రాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఒక చిత్రానికి కుట్టి పులి చిత్రం ఫేమ్ శర్వాణి శక్తి, మరో చిత్రానికి విజయ్ టీవీ ఫ్రేమ్ శంకర్ పాండే దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి నిర్మాత రంజనా నాచ్చియార్ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను సినిమాల్లో జయించలేనని చాలామంది అన్నారు. దీంతో నటిగా సక్సెస్ అయిన తాను దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దానికి ముందుగా నిర్మాతగా మారి అనుభవం గడించాలని భావించానని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని ఆమె చెప్పారు. చదవండి: ఆ బిజినెస్‌లో కేజీఎఫ్ విలన్ పెట్టుబడి, పెద్ద ప్లానే వేశాడుగా -
నేను నా బరువు కోసం కాదు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తా: నిర్మాత
కొందరు ఎంత తిన్నా కరెంట్ వైర్లా సన్నగా ఉంటారు. మరికొందరు ఏమీ తినకపోయినా బెలూన్లా ఉబ్బిపోయి బొద్దుగా కనిపిస్తారు. అధిక బరువును దారిలో పెట్టడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత డైట్ చేసినా, కఠోర వ్యాయామాలు చేసినా కొందరికి బరువు తగ్గడం అనేది అందని ద్రాక్షలాగే అనిపిస్తుంది. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఈ కోవలోకే వస్తాడు. ఈయన ఎప్పటినుంచో అధిక బరువుతో బాధపడుతున్నాడు. అయితే ఎప్పుడైతే బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచే తరచూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కట్టుకున్న భార్య సన్నజాజిలా ఉంది, కానీ తనేమో భారీకాయుడు.. ఇంకేముంది, జనాలు ఆడిపోసుకున్నారు. డబ్బుల కోసమే ఆమె ఇతడిని పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల విమర్శలు గుప్పించారు. వీళ్ల వైవాహిక బంధం ఎంతోకాలం నిలవదని శాపనార్థాలు కూడా పెట్టారు. ఆ రూమర్లు వచ్చినప్పుడల్లా భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వదిలి తమది అన్యోన్య దాంపత్యమని చాటిచెప్తూనే వస్తున్నారు. తాజాగా రవీందర్ ఓ ఇంటర్వ్యూలో తన అధిక బరువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను నా బరువుపై దృష్టి పెట్టను. అందుకు బదులుగా ఆరోగ్యం, శ్రేయస్సుపైనే ఫోకస్ చేస్తాను. ఈరోజు ఇది తినకూడదు వంటి నియమనిబంధనలు పెట్టుకోను. ఎందుకంటే నేను డైట్ పాటించి చూశాను, కానీ అది వర్కవుట్ కాలేదు. అయినా నేను నా బరువును మోయడం అంత ఈజీయేం కాదు. నేను దాదాపు 200 కిలోల బరువుంటాను' అని చెప్పుకొచ్చాడు. కాగా రవీందర్ గతంలో ఓ చికిత్స తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగించే కణాలు క్షీణించిపోయాయి. ఇది అతడు బరువు పెరగడానికి కారణమైంది. అందుకే తాను శరీరానికి కాకుండా ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తున్నానని, ఊబకాయం తగ్గించడం తన చేతిలో లేదన్నాడు. చదవండి: బతుకు బండి భారమై డ్రైవర్‌గా మారిన ఒకప్పటి హీరో? -
భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!
జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లిళ్లకు వచ్చేవాళ్లంతా జంట ఈడూజోడూ బాగుందా? అనే చూస్తారు. అమ్మాయి కంటే అబ్బాయి పొట్టిగా ఉన్నా, ఒకరు బక్కచిక్కగా ఉండి మరొకరు లావుగా ఉన్నా, ఒకరిది చిన్న వయసై ఉండి మరొకరిది ముదురు ముఖమైనా బుగ్గలు నొక్కుకుంటారు. జోడీ అస్సలు బాగోలేదని ముఖం మీదే చెప్తారు. తమిళ సెలబ్రిటీ జంట రవీందర్ చంద్రశేఖర్- మహాలక్ష్మిల విషయంలోనూ ఇదే జరిగింది. మహాలక్ష్మి యాంకర్, బుల్లితెర నటి.. పొట్టిగా, నాజూకుగా ఉంటుంది. రవీందర్ చంద్రశేఖరన్ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత.. భారీకాయుడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో వివాహమే! పెద్దల అంగీకారంతో వీరు వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఈ జంటపై నెట్టింట తరచూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఓపక్క భారీకాయంపై రవీందర్‌ను బాడీ షేమింగ్, మరో పక్క డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకున్నావంటూ మహాలక్ష్మిని విమర్శిస్తూ ఉంటారు. ఆ ట్రోలర్స్ నూరు మూయిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఏకంగా వీరు విడిపోయారంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది నటి. 'నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీనికి రవీందర్ కూడా లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. 'మీరిద్దరూ విడిపోయాన్న వార్త రాగానే భయపడిపోయాను, ఇప్పుడు సంతోషంగా ఉంది..', 'ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్లు విడాకుల దాకా వెళ్లిపోయారు, తీరా ఇక్కడ చూస్తే మీరు కలిసే ఉన్నారు. సంతోషంగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: చిన్న వయసులోనే కారు నడిపిన మహేశ్.. పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్! -
దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ నిర్మాతకు అండగా నిలిచాడు స్టార్ హీరో సూర్య. అగ్ర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమిళ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కొంతకాలంగా ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం శికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆయనకు అండగా నిలిచారు. ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాదు మరింత సాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. చదవండి: లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా? అలాగే తమిళ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, కనీసం ఆయన చికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్బుక్లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే! కాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నట్లు ఆయన స్నేహితుడు తెలిపాడు. -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్‌పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత -
టాలీవుడ్ బెటర్, కానీ కోలీవుడ్ మాత్రం.. : ప్రముఖ తమిళ నిర్మాత
తిరుపూర్ కుమరన్ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ నిర్మించిన చిత్రం గుండాన్ మలై. అందరూ కొత్తవాళ్లు నటించిన ఈ చిత్రానికి నాగజీవన్, అజీమ్, రాజా సంగీతం, అన్నై సెల్వ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో చిత్ర నిర్మాత, నటుడు కే.రాజన్, గీత రచయిత సొర్కో కరుణానిధి, దర్శకుడు భారతి గణేష్, న్యాయవాది యాదవ్, సినీ సంగీత కళాకార సంఘం అధ్యక్షుడు దినా, శంకర గణేష్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కరోనా కాలంలో ప్రారంభించినట్లు తెలిపారు. మొదట్లో లో బడ్జెట్ చిత్రంగా ప్రారంభమైన ఇది ఆ తర్వాత పెద్ద చిత్రం అయిందన్నారు. చిన్న మొత్తంలో ప్రారంభించిన ఈ చిత్రం బడ్జెట్ పలు లక్షలు దాటిందని, అయినా అందరి శ్రమతో చిత్రం బాగా వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కే.రాజన్ మాట్లాడుతూ చిన్న చిత్రాలే కార్మికులను బతికిస్తున్నాయన్నారు. తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మన చిత్రాల షూటింగ్‌లను 75 శాతం ఇక్కడ 25 శాతం ఇతర రాష్ట్రాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారన్నారు. మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమలు కార్మికులను బాగా చూసుకుంటున్నాయన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం కార్మికులను వదిలేసి ఇతరులను బతికిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి రెండు పాటలు, మాటలు రాసి, కీలక పాత్రలో నటించిన ఆహాను ప్రసంశించారు. ఆయన శారీరకంగా వికలాంగుడైనా, మానసికంగా బలవంతుడని పేర్కొన్నారు. ఈ గుండాన్ మలై చిత్రం కచ్చితంగా విజయవంతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చిత్రంలో ఓడు ఓడు పాట చాలా బాగుందన్నారు. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా, ఆ చెక్‌తో ఏం చేసిందంటే -
ఆ విషయంలో టాలీవుడ్ గ్రేట్: తమిళ నిర్మాత రాజన్
ఆర్ఎఫ్ఐ ఫిలింస్ పతాకంపై రెహాన్ అహ్మద్ నిర్మించిన చిత్రం ‘విచిత్రం’. వీఆర్ఆర్ దర్శకత్వం వహించిన ఈ త్రంలో నటుడు శ్రీనివాస్, ఈరిన్ జంటగా నటించారు. పలువురు పాత కొత్త నటీనటులు ముఖ్యపాత్ర పోషింన ఈ త్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ చిన్న బడ్జెట్ చిత్రాలు విజయం సాధిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. చదవండి: విజయ్-లోకేశ్ కనకరాజుల మూవీ.. బయటికొచ్చిన కథ! దానివల్ల కార్మికులు బాగుంటారన్నారు. ఈ చిత్ర యూనిట్ విజయవంతం అయితేనే మళ్లీ వాళ్లు సినిమా చేస్తారన్నారు. విచిత్రం మూవీ నిర్మాత చాలా ఉన్నత వ్యక్తి అని, మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని నిర్మించారని, విత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే తమిళనాడులో హీరోలకు 60 శాతం పారితోషికం చెల్లించే పరిస్థితి నెలకొంది అన్నారు. అలాంటి చిత్రాలు చేస్తే ఎలా ఆడతాయని ప్రశ్నించారు. నిర్మాతలు బతికి బట్ట కట్టకపోతే చిత్ర పరిశ్రమ బతక లేదన్నారు. ఈ విషయంలో తెలుగు చిత్ర నిర్మాతలు దమ్మున్న వారని, హీరోలు పారితోషికం, నిర్మాణ వ్యయం వంటివి తగ్గించే విషయమై చర్చించేందుకు షూటింగ్‌లను రద్దు చేశారని ప్రసంశించారు. -
వ్యభిచారం చేయాలని నిర్మాత ఒత్తిడి.. నటి ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయం ఎదుట బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పరమేశ్వరి అలియాస్ భైరవి బుల్లితెర నటిగా ఉన్నారు. ఈమె ఈ నెల 25న పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. అందులో వేలూరుకు చెందిన రాజాదేసింగ్ అలియాస్ సుబ్రమణి తనకు సినీ నిర్మాతగా పరిచయమయ్యాడని, ఆ తరువాత షూటింగ్లో భాగంగా మయిలాడు దురైకు తీసుకెళ్లి గుడిలో తనను పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ భైరవి సోమవారం చెన్నై డీజీపీ కార్యాలయానికి వెళ్లి తలపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమీపంలోని పోలీసులు ఆమెను కాపాడారు. చదవండి: రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా రమ్యకృష్ణ..? అయ్యో పాపం ‘చక్రి’ సోదరుడు.. సదరం కోసం ఎన్ని తిప్పలో.. -
పెళ్లి చేసుకోమని వేధింపులు, నిర్మాత అరెస్ట్
సాక్షి, చెన్నై: యువతిని వేధించిన కేసులో సినీ నిర్మాత వారాహిని పడపళని మహిళా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై విరుగంబక్కం నటేసన్ నగర్లో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్న రాణి (31) వడపళని మహిళా పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు ఇచ్చింది. అందులో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే సినీ నిర్మాత వారాహి కూడా నివసిస్తున్నారని, అతడు తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. అందుకు తాను తిరస్కరించడంతో బెదిరిస్తున్నాడని, అతడిపై తగిన చర్యలు తీసుకోమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన విచారణలో నిర్మాత రాణిని వేధించినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిని సోమవారం కటకటాల్లోకి నెట్టారు. చదవండి 👉 ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. సూరరై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్, షూటింగ్ స్టార్ట్ -
‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది. చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్‌ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సి కల్యాణ్ కృష్ణ నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అప్డేట్ బయటకు వచ్చంది. చదవండి: నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍 Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4 — Studio Green (@StudioGreen2) January 16, 2022 -
దీన్ని ప్రేమంటారా? సిగ్గుపడండి: నిర్మాత ఫైర్
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడేవారు ఇంట్లో స్వీయనిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆ మహమ్మారిని జయిస్తున్నారు. ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కోవిడ్ పాజిటివ్ అని తేలగానే ఆస్పత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, సకాలంలో వైద్యం చేయించుకోలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు కరోనా రోగులకు ప్రధానంగా కావాల్సింది మానసిక ధైర్యం. హత్తుకుని మాట్లాడకపోయినా హద్దుల్లో ఉండి వారికి అండగా, తోడుగా నిలిస్తే అదే పదివేలు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి వంటింట్లో కష్టపడుతుంటే అమ్మ ప్రేమ అని డైలాగులు వల్లె వేస్తున్నాడు. ఆమెకు ఆసరాగా ఉండాల్సింది పోయి అద్భుతంగా పని చేస్తున్నావని కీర్తించాడు. 'అనంతమైన ప్రేమనిచ్చేది అమ్మ మాత్రమే. తనెప్పుడూ తన విధిని నిర్వర్తించడం మానదు' అన్న క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సరిగ్గా ఊపిరాడక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న తల్లితో వంట చేయిస్తున్నారా? అని మండిపడుతున్నారు. This is not love. This is slavery in the name is social structure. இதுக்கு நாம வெக்கப்படணும் சென்றாயன் pic.twitter.com/W72ZdlEhtc — Naveen Mohamedali (@NaveenFilmmaker) May 21, 2021 గ్యాస్ స్టవ్ దగ్గర్లో ఆక్సిజన్ సిలిండర్ ఉండటం చాలా ప్రమాదకరం అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఆ తల్లి ఆక్సిజన్ మెషీన్ మీద బతుకుతున్నప్పుడు కూడా ఆమె కోసం కుటుంబ సభ్యులెవరూ వంట చేయకపోవడం విషాదకరం అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన తమిళ నిర్మాత నవీన్ సైతం దీని మీద విమర్శలు గుప్పించాడు. 'ఇది ప్రేమ కాదు, బానిసత్వం.. ఇలాంటి పని చేయిస్తున్నందుకు సిగ్గుపడండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. చదవండి: డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని: కాజల్ -
విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత
చెన్నై : 2021 ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కే బాలు అకాల మరణం చెందారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే బాలుకి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తోంది. కేపీ ఫిల్మ్స్‌ను స్థాపించిన బాలు ఎన్నో సూపర్ హింట్ సినిమాలను అందించిన ఘనత దక్కించుకున్నారు. కోలీవుడ్‌కు చెందిన బాలు ‘చిన్న తంబీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 1991లో విడుదలైన ఈ సినిమాలో ప్రభు, ఖుష్బూ హరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్).. విన్నర్స్ జాబితా నిర్మాత మరణ వార్తను నటుడు ఆర్ శరత్ కుమార్ ట్విటర్ ద్వారా ద్వారా వెల్లడించారు. బాలు అకాల మరణం షాక్‌కు గురి చేసిందని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని అన్నారు. తమిళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కే బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమిళ పరిశ్రమ తరపున బాలు కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు. బాలు అంత్యక్రియలు శనివారం చైన్నైలోని బెసంట్ నగర్లో నిర్వహించారు. చదవండి: రహస్యంగా పెళ్లి; పాపకు జన్మనిచ్చిన నటి -
హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలో హీరోల దోపిడీ ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో ఒక సినిమా వందకోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో రూ. 50 కోట్లు హీరోలే తీసుకుంటున్నారని వాపోయారు. కానీ తెలుగు హీరోలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, రూ.15 కోట్లు ఇచ్చినా సినిమా చేస్తారని అన్నారు. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం అంతుకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ పద్దతి తమిళంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానవేల్ రాజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోల మద్య తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుహీరోల్లాగే తమిళ హీరోలు కూడా దారికి రాకపోతే తమిళ సినిమాలు మానేస్తానంటూ హెచ్చరించారు. తమిళ పరిశ్రమలో హీరోలకు, నిర్మాతలకు ఎప్పుడు కెమిస్ట్రీ కలవదని అన్నారు. తనకు హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందని.. పూర్తిగా టాలీవుడ్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, ఇంకా తమిళ సినిమాలు చేసి చేతులు కాల్చుకోలేనని తేల్చి చెప్పారు. తెలుగు సినమాలు చాలా రిచ్‌గా ఉంటాయని అందుకే ఉత్తరాదిన వాటికి మంచి డిమాండ్ ఉందని జ్ఞానవేల్ రాజ వ్యాఖ్యానించారు. -
ఆ నిర్మాత లైంగికంగా వేధించాడు
తమిళసినిమా: సినీ రంగంలో లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వరుసలో ఒక తమిళ చిత్ర నిర్మాత తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి శ్రుతీహరిహరన్ చెప్పింది. కన్నడలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు నెరింగివా ముత్తమిడాదే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిపుణన్, రారా రాజశేఖర్, సోలో చిత్రాల్లో నటించింది. ఆమె దీని గురించి చెబుతూ తాను 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించానని చెప్పింది. మొదట్లో పాటలకు డాన్స్ చేసే దానినని తెలిపింది. అప్పట్లోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ విషయాన్ని ఒక నృత్య దర్శకుడికి చెప్పి, తననా వేధింపుల నుంచి తప్పించే మార్గం చెప్పమని కోరగా, అలాంటివి ఎదుర్కొనలేకపోతే సినీ రంగం నుంచి వెళ్లిపో అని ఆయన అన్నారని చెప్పింది. అప్పుడే తనకు సినిమా గురించి అర్థమైందని అంది. తాను నటించిన ఒక కన్నడ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఆ చిత్ర రీమేక్ హక్కుల్ని ఒక తమిళ నిర్మాత పొందారని తెలిపింది. అతను తమిళంలోనూ తననే నటించమని అడిగాడన్నారు. తాను సంతోషంగా అంగీకరించానని చెప్పింది. అయితే ఆ తరువాత అతను తనను పడక గదికి రమ్మని వేధించాడని తెలిపింది. తాను ఎప్పుడూ తన చెప్పును చేతిలోనే ఉంచుకుంటానని బదులిచ్చానని చెప్పింది. ఆ తరువాత ఆ నిర్మాత తన గురించి తప్పుడు ప్రచారం చేసి అవకాశాలు రాకుండా చేశాడని తెలిపింది. చిత్రరంగంలో హీరోయిన్లకు విలువ లేదని, ఆడవారితో వ్యాపారం చేయాలనుకోవడం వేదన కలిగిస్తోందని నటి శ్రుతీహరిహరన్ పేర్కొంది. -
విదేశాలకు పారిపోయిన సినీ నిర్మాత..?
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులకు ఆధారాలు దొరికినట్టు సమాచారం. ఇటీవల నటుడు శశికుమార్ అత్త కొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్ రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అశోక్‌కుమార్ రాసిన లేఖలో అన్బుచెళియన్ ఒత్తిడి, ఆయన అనుచరులతో బెదిరించడమే తన మరణానికి కారణం అని పేర్కొనడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ వ్యవహారంపై నటుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్బుచెళియన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్బు చెళియన్ చిత్ర నిర్మాణ సంస్థ గోపురం ఫిలింస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మేనేజర్ సాధిక్‌బాషా, వ్యక్తిగత కార్యనిర్వాహకుడు మురుసుకుమార్ను అరెస్ట్ చేసి విచారించారు. అయితే వారి నుంచి సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్, బెంగళూర్ వెళ్లి విచారణ చేపట్టారు. కాగా అన్బుచెళియన్ దేశం విడిచి అండమాన్ నుంచి కుటుంబం సహా పారిపోయారనే సమాచరం పోలీసులకు అందింది. అయితే అన్బుచెళియన్ విమానం ద్వారా విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్అవుట్ పోస్టర్లను విమానాశ్రయాల్లో అంటించారు. దీంతో ఆయన చెన్నై నౌకాశ్రయం ద్వారా అండమాన్‌కు పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుంచి కోల్‌కతా.. అటు నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా అన్బుచెళియన్ 18 రోజులుగా అచూకీ తెలియకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. -
దర్శక, నిర్మాత ఆత్మహత్య వెనుక...
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడులోనూ ‘కాల్‌మనీ’ భూతం బుసలు కొడుతోంది. ఏపీలో ఇప్పటికే ఈ రక్కసి బారిన పడి ఎంతో మంది మానప్రాణాలు పోగొట్టుకోగా, తాజాగా పొరుగు రాష్ట్రానికి ఇది పాకింది. కాల్‌మనీ వ్యవహారం కోలీవుడ్ దర్శక నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి కారణమైంది. నటుడు శశికుమార్ సోదరుడైన ఆయన మంగళవారం చెన్నైలో ఆత్మహత్య చేసుకోవటం సినిమా వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ఫైనాన్షియర్లు, కాల్‌మనీ దారుల నుండి గత కొంతకాలంగా బెదిరింపులు వస్తుండటంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సూసైడ్ లెటర్లో అశోక్ కుమార్ వివరించటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో కోలీవుడ్ కాల్‌మనీ దందాకు వ్యతిరేకంగా కదంతొక్కింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది. అశోక్ కుమార్‌ను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కందువడ్డీ, కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయమున్న పైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గతంలో కాల్‌మనీ వ్యవహారంలో ఓ కుటుంబం తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విదారక ఉదంతాన్ని మరువక ముందే కాల్‌మనీకి సినీ నిర్మాత అశోక్ కుమార్ బలి కావడం తమిళనాట తీవ్ర కలకలం రేపింది. -
సుకుమార్ నిర్మాణంలో తమిళ సినిమా
లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రొమాంటిక్ డ్రామా... 100% లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. కేవలం చదువు తప్ప మరేమీ తెలియని బాలు, అతడి మరదలి పాత్రలో తమన్నా చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. మరి తమిళ సినిమాలో సుకుమార్ పాత్ర ఏంటా అని చూస్తున్నారా.. పక్కా కాకినాడ కుర్రోడయిన ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించట్లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు. ఈ వివరాలన్నింటినీ ప్రకాషే ట్వీట్ చేశాడు. తెలుగు దర్శకుడు సుకుమార్ తన తదుపరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారని, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్వాలే లాంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ.. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉంటారని కూడా చెప్పాడు. మొత్తానికి ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టుకుని యాక్షన్.. కట్ చెప్పిన మన లెక్కల మాస్టారు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుమార్ 21ఎఫ్ సినిమాతో నిర్మాతగానూ సూపర్ హిట్ కొట్టిన సుక్కు, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దర్శకుడు సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ లోనూ నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు. Yes telugu director Sukumar is producing my next . 100% love remake . Dir chandramouli . Dop dudely (chennai express , dilwale ) #100%love pic.twitter.com/nh87ToN5L0 — G.V.Prakash Kumar (@gvprakash) 5 May 2017