technical error
-
SSLV - D1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
-
ఎయిరిండియాకు సాఫ్ట్వేర్ షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ‘ఎయిరిండియా’ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వేలాది మంది ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం వరకు 155 విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో దేశ, విదేశాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎయిరిండియా చెక్–ఇన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రయాణికుల గుర్తింపు, బ్యాగేజి, రిజర్వేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా, దేశ, విదేశాల్లోని ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ జారీ చేయలేకపోయారు. దీంతో ఇందుకు అవసరమైన పాసింజర్ సర్వీస్ సిస్టం(పీఎస్ఎస్) సేవలందించే అమెరికాలోని అట్లాంటాకు చెందిన ‘సిటా’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ యంత్రాంగం లోపాన్ని సరిదిద్దటానికి దాదాపు ఐదుగంటల సమయం తీసుకుంది. అనంతరం 8.45 గంటలకు ఎయిరిండియా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. ఈ విషయమై ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) అశ్వనీ లొహానీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్వేర్ సమస్యలో లోపంపై సిటా విచారణ జరుపుతోంది. సాఫ్ట్వేర్ షట్డౌన్కు వైరస్‌నా లేక మరేదైనా కారణమా తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘ఎక్కడ లోపం తలెత్తినా మేం పీఎస్ఎస్ వ్యవస్థను వాడుకుంటాం. కానీ, పీఎస్ఎస్లోనే సమస్య వచ్చింది. అందుకే వేరే మార్గాల్లో ప్రయాణికులకు వెంటనే సమాచారం అందించలేకపోయాం’ అని ఆయన వివరించారు. -
5 లక్షల గూగుల్ ప్లస్ ఖాతాల డేటా లీక్?
కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
పెట్రోల్ 1 పైసా తగ్గింది
న్యూఢిల్లీ: వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తొలుత లీటర్‌కు 60 పైసల చొప్పున పెట్రో ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రోజువారీ ధరల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలకే సాంకేతిక లోపం కారణంగా అలా వచ్చిందని.. వాస్తవానికి తగ్గించింది ఒక పైసా మాత్రమే అని చమురు సంస్థలు స్పష్టంచేశాయి. సాంకేతిక లోపం వల్లే..: ఐవోసీ తగ్గించిన మొత్తం 1 పైసానే అని, క్లరికల్ ఎర్రర్ కారణంగా మే 25 నాటి ధర.. బుధవారం నాటి ధరగా ప్రకటించామని, వాస్తవానికి తగ్గించింది ఒక పైసానే అని ఐవోసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఐవోసీ దీనిపై ఓ ప్రకటన చేసింది. ఒక పైసా తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.42కు, లీటర్ డీజిల్ ధర రూ. 69.30కి తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోందని, దీంతో దిగుమతుల ధర తగ్గుతుందని, దీని ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రో ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి 16 రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 3.80.. డీజిల్ ధర లీటర్‌కు రూ.3.38 పెరిగింది. పిల్ల చేష్టలా ఉంది: రాహుల్ పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ప్రజలను వేళాకోళం చేయడానికి మోదీ ఈ ఐడియా వేయలేదు కదా అని ఎద్దేవా చేశారు. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉందని విమర్శించారు. ‘డియర్ పీఎం. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఒక పైసా తగ్గించారు. ఒక్క పైసానా..!?? ప్రజలను వేళాకోళం చేయడానికి మీరు వేసిన ఐడియా కాదు కదా ఇది. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉంది’ అని ట్వీట్ చేశారు. పెట్రో ధరలను రూ. 1 తగ్గించిన కేరళ తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్ తమ రాష్ట్రంలో పెట్రో ధరలను లీటర్‌కు రూ. 1 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.509 కోట్ల భారం పడుతుందని విజయన్ చెప్పారు. -
మెట్రోలో గడబిడ
సాక్షి, బెంగళూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో రైలు కొద్ది నిమిషాల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10:17 గంటలకు మైసూరు రోడ్ నుంచి బయ్యప్పనహళ్లికి బయలుదేరిన మెట్రోరైలు కబ్బన్‌పార్క్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు రెండుసార్లు ఆగిపోతున్నట్లుగా అనిపించింది. ఎలాగో కబ్బన్స్టేషన్కు చేరుకోగానే సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు తలుపులు తెరుచుకోలేదు. బోగీల్లో ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. గాలి సరిగా ఆడక కంగారు పడ్డారు. మెట్రో సిబ్బంది బయట నుంచి చేసిన సూచనలతో ఎగ్జిట్ ద్వారాల వద్దనున్న అత్యవరసన బటన్‌ను ఒత్తడంతో ఎగ్జిట్ ద్వారాలు తెరుచుకోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులతో ప్రయాణికుల వాగ్వాదం వెంటనే రైలు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో మెట్రో అధికారులు, సిబ్బందితో జరిగిన ఘటనపై వాగ్వాదానికి దిగారు. అసలే భూగర్భంలో ప్రయాణించే రైలులో ఇటువంటి అనుకోని ఘటనలు చోటుచేసుకున్నపుడు ఏం చేయాలనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు. రైలులో ఏసీ కూడా సరిగా పనిచేయకుపోవడాన్ని కూడా పట్టించుకోలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది నిమిషాలు పాటు రైళ్లో ఊపిరి ఆడక వందలాది మంది అగచాట్లు పడ్డామని, ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యులెవరని మెట్రో అధికారులపై మండిపడ్డారు. హఠాత్తుగా కదిలిన రైలు.. మళ్లీ ఆగ్రహం అదే సమయంలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రోరైలు ఎటువంటి సూచన లేకుండా ఒక్కసారిగా ముందుకు కదలడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించాలంటూ పట్టుబట్టారు. అధికారులు, సిబ్బంది ఫోన్ల ద్వారా చాలాసేపు ప్రయత్నించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో మరోసారి ఇటువంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహిస్తామని, ఈ ఒక్కసారికి మన్నించాలంటూ కబ్బన్‌పార్క్ స్టేషన్ అధికారులు, సిబ్బంది వేడుకోవడంతో ప్రయాణికులు శాంతించారు. -
సాయినగర్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం
వరంగల్: షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న ఎక్సైప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. శుక్రవారం వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. బ్రేక్ జాం అవడం వల్ల రైలు భోగీల్లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. ఇది గుర్తించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించి నెక్కొండ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది అరగంట పాటు మరమ్మతులు నిర్వహించి లోపాన్ని సరిచేశారు. -
జైకా నిధులా...ఆగాల్సిందే
► ప్రతిపాదనల్లో సాంకేతిక లోపాలతో పనుల మంజూరులో జాప్యం ► కొత్త ఆర్థిక సంవత్సరంలోనే పనులు జరిగే అవకాశం విజయనగరం గంటస్తంభం: జైకా నిధులతో ప్రాజెక్టుల అభివృద్ధి జరగాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో సాంకేతికపరమైన లోపాలు ఉండడంతో పనుల మంజూరులో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి అంతా ఒక కొలిక్కి రావచ్చనే సమాచారం ప్రస్తుతం షికారు చేస్తుంది. జిల్లాలో తోటపల్లి తరహా భారీ ప్రాజెక్టుతో పాటు పలు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని ప్రాజెక్టులు నుంచి పూర్తిస్థారుు విస్తీర్ణానికి సాగునీరు అందని పరిస్థితి. ప్రాజెక్టుల చెంత నిర్మాణాలు, కాలువలు ఆధ్వానంగా ఉండడం ఇందుకు కారణం. నీరు చెట్టు పథకంలో మట్టి పనులు చేసినప్పటికీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అలా పడి ఉన్నారుు. నిధుల కోసం జపం.. ఈ నేపథ్యంలో అధికారులు పనుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల జరగడం లేదు. జపాన్ ఇంటిగ్రేటెడ్ కోపరేటవ్ ఏజెన్సీ(జైకా) సాయం చేస్తుండడంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఆధునీకికరణ పనులకు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆండ్ర ప్రాజెక్టు పనులకు రూ.37 కోట్లు, వెంగళరాయసాగర్‌కు రూ.70 కోట్లు, వట్టిగెడ్డకు రూ.40 కోట్లు, పెదంకాలం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు గతేడాది పంపారు. కానీ నిధులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. నిధులు రాకపోవడానికి కారణాలేంటి..? ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడానికి కారణాలు అనేకం. అధికారులు పంపిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలమండలికి పంపడంలో జాప్యం, వారు జైకాకు నివేదించడం, జైకా బృందం రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టులు పరిశీలించడంలో విపరీతమైన జాప్యం కారణంగా నిధులు మంజూరు కాలేదు. ఎట్టకేలకు జైకా బృందం పక్షం రోజలు క్రితం జిల్లాకు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించింది. దీంతో నిధులు విడుదల అవుతాయని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడం, భూమి గట్టి పడుతుండడంతో జనవరి నుంచి పనులు ఆరంభించవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. ప్రాజెక్టులు పరిశీలన చేసిన జైకా బృందం క్షేత్రస్థారుు పరిస్థితికి, ముందుగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు మధ్య తేడాని గమనించించింది. ప్రతిపాదనల్లో సాంకేతిక సమస్యలున్నాయని, మార్పు చేసి తిరిగి పంపించాలని సూచించింది. ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు మార్చి పంపిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ)కి వెళ్లి అక్కడ నుంచి జైకాకు వెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. వారు పరిశీలించి పనులకు నిధులు మంజూరు చేస్తే తర్వాత టెండర్ల పక్రియ జరుగుతుంది. ఇదంతా జరిగేసరికి రెండు, మూడు నెలలు సమయం పడుతుంది. ఈ ఏడాదిలో మరి నిధులు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా పనులు చేసే సరికి సమయం పడుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే సాగునీరు... ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టుల కింద సాగునీరు అందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదలవుతాయని అధికారులు భావించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల అధునీకీకరణ జరిగి నీరందుతుందని అనుకున్నారు. కానీ ఆపరిస్థితి లేదు. పోనీ వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరందాలంటే మార్చి, ఏప్రిల్ నాటికి పనులు ప్రారంభమై జూన్ నాటికి పూర్తి కావాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు కల వచ్చే ఏడాది కూడా నెరవేరదు. వాస్తవానికి ఈ నాలుగు ప్రాజెక్టులు సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఏడాది సగం విస్తీర్ణానికి కూడా నీరంద లేదు. 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందకుండా పోరుుంది. కావున ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నిధులు వచ్చేట్లు చేస్తే రైతులకు సాగునీటి చింత తీరుతుంది. -
రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో సాంకేతిక లోపం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడపజిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో ఐదో యూనిట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఐదో యూనిట్‌లోని గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎన్టీపీసీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్లో ఏర్పడిన సాంకేతిక కారణాలు వలన సోమవారం రాత్రి యూనిట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా యూనిట్ నుంచి సరఫరా కావాలసిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. మొదటి యూనిట్ బ్రాయిలర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసింది. సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. బుధవారం నాటికి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ః శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 7.20 గంటలకు ఎఐ 559 విమానం ఢిల్లీ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ తీసుకుంది. పదినిమిషాల తర్వాత విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీ అధికారులను సంప్రదించి అనుమతి తీసుకున్నాడు. 7.40 గంటలకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించారు. ఎయిర్ ఇండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు 11 గంటలకు ఇక్కడి నుంచి మరో విమానంలో ఢిల్లీకి పంపినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. -
ఎన్టీపీసీ 5వ యూనిట్లో సాంకేతిక లోపం
రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్లో మంగళవారం సాంకేతికలోపం తలెత్తింది. ప్రాజెక్టు 5 యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ అయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. -
సాంకేతిక లోపంతో నిలిచిన హౌరా ఎక్స్‌ప్రెస్
సాంకేతిక లోపం తలెత్తటంతో వాస్కోడగామా- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు నిలిచిపోయింది. హౌరా నుంచి వాస్కోడగామా వైపు వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో లోపం తలెత్తటంతో 11.15 గంటల సమయంలో అధికారులు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద నిలిపివేశారు. ఇంజిన్‌ను శ్రీకాకుళం తీసుకెళ్లి మరమ్మతులు చేయించి తిరిగి ఉర్లాం చేర్చారు. తిరిగి రైలు 12.15 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. -
తప్పిన పెనుముప్పు
* విమానంలో సాంకేతిక లోపం * 117 మందికి తప్పిన ప్రాణాపాయం కేకేనగర్: ముంబైకు బయల్దేరిన విమానం లో సాంకేతిక లోపం ఏర్పడంతో విమానాన్ని కిందకుదింపారు. ఈ సమయంలో పెలైట్ లోపాన్ని గుర్తించడంతో 117మంది ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డారు. చెన్నై విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 6:40 గంటలకు ప్రైవేటు విమా నం ముంబైకు బయలుద్దేరింది. కొద్దిసేపటికే ఇంజన్లో లోపం ఉన్న విషయాన్ని గురించారు. ఆ సమాచారాన్ని చెన్నై విమానాశ్రాయం కంట్రోల్ రూమ్ అధికారులకు తెలిపారు. అనంతరం వారి సూచనలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. -
వారమైనా జీతం రాలే!
♦ డీటీఓ వేతన చెల్లింపుల్లో సాంకేతికలోపం ♦ 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతం ♦ ‘ఈ-పేమెంట్స్’ పద్ధతితో ప్రతినెలా ఇదేతీరు ♦ ప్రహసనంగా కొత్త పద్ధతి పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్ట్రిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వీరి వివరాలన్నీ అప్లోడ్ కాలేదు. దీంతో జీతాలన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 వేల మంది వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ‘ఈ -పేమెంట్స్’ పద్ధతి ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టెస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన తీసుకోవాల్సిన వేతన సొమ్మును నాలుగైదు రోజులు ఆలస్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ (ఈ-పేమెంట్స్) పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రక్రియను తొలుత జిల్లా ఖజానా కార్యాలయాల(డీటీఓ) పరిధిలో అమలు చేసింది. మూడు నెలలుగా ఈ -పేమెంట్స్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారు. ఈ -పేమెంట్స్ పద్ధతిలో బ్యాంకు స్థాయిలో చేయాల్సిన పనిని నేరుగా ఖజానా శాఖ పరిధిలోనే పూర్తి చేస్తూ ఉద్యోగుల వేతనాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా డీటీఓ కార్యాలయంలో వేతనాలు అప్లోడ్ చేసే ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయ ఉద్యోగులకు ఈనెల వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. 15 వేల మంది ఎదురుచూపు.. పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్టిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. ప్రతినెలా దాదాపు 15వేల మంది ఉద్యోగుల వేతనాలకు సంబంధించి డ్రాయింగ్ అధికారులు డీటీఓకు నివేదికలు అందిస్తారు. వీటన్నింటినీ ఈ-పేమెంట్స్ ద్వారా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేసి వివరాల్ని బ్యాంకులకు అందిస్తున్నారు. అయితే మార్చి నెలకు సంబంధించి యధావిధిగా వివరాల్ని అప్లోడ్ చేశారు. కానీ సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలన్నీ నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం వరకూ సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో జీతాల ప్రక్రియ కొలిక్కి రాలేదు. సాయంత్రంలోపు సాంకేతిక సమస్యను అధిగమిస్తామని, వీలైనంత త్వరితంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని జిల్లా ఖజానాశాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.పద్మజ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఎన్టీపీసీ లో సాంకేతిక లోపం
రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ప్రాజెక్ట్‌లోని 200 మెగావాట్ల ఒకటో యూనిట్లో అంతరాయం కలగడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. -
కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో మంగళవారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కర్మాగారంలోని 1 నుంచి 10 యూనిట్లు ట్రిప్ అవడంతో దీని వల్ల 1220 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఒకే సారి యూనిట్లన్నీ ట్రిప్ అయినట్లు సీఈ లక్ష్మయ్య తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘రాజ్‌కోట్’
- అప్రమత్తమైన డ్రైవర్.. తప్పిన ప్రమాదం - పలు రైళ్ల రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు నవాబుపేట: సాంకేతిక లోపంతో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం శంకర్పల్లి మండలం గొల్లగూడ- రావులపల్లి స్టేషన్ల మధ్య సుమారు మూడు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు.. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌కు వెళుతుంది. గొల్లగూడ, రావులపల్లి స్టేషన్ల మధ్యకు రాగానే సాంకేతిక లోపం సంభవించినట్లు డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై రైలును అదుపు చేసి నిలిపివేశాడు. గొల్లగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ కె. నాగరాజుకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం మొదటి ఇంజిన్ మరమ్మతులకు గురైనట్లు తెలుసుకున్నాడు. రెండో ఇంజిన్ సహాయంతో ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి గొల్లగూడ స్టేషన్ వరకు మెల్లగా వెనక్కి తీసుకెళ్లి స్టేషన్ వద్ద ఉంచాడు. విషయాన్ని స్టేషన్ మాస్టర్, సికింద్రాబాద్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి సంఘటన స్థలానికి చేరుకుని సాంకేతిక లోపానికి గురైన మొదటి ఇంజిన్‌ను తొలగించారు. రైలుకు ఉన్న రెండో ఇంజిన్ కూడా సక్రమంగా లేకపోవడంతో వారు తీసుకువచ్చిన మరో ఇంజిన్‌ను జత చేసి రైలును మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సికింద్రాబాద్‌కు తరలించారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సుమారుగా మూడు గంటలు నిలిచి పోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రైవర్ సాంకేతిక లోపాన్ని గమనించి రైలును ఆపక పోయి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. రైళ్ల నిలిపివేతతో ప్రయాణికుల ఇబ్బందులు.. వికారాబాద్ రూరల్ : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు వచ్చే పల్నాడు, తాండూరు ప్యాసింజర్లు రద్దయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. వికారాబాద్ నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు వందలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రద్దు కావడం, ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. శంకర్పల్లి: శంకర్పల్లి స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నిత్యం వందలాది ప్రయాణికులు శంకర్పల్లి రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్- వికారాబాద్ వైపు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మంగళవారం ఉదయం రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గొల్లగూడ-రావులపల్లి రైల్వే స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. అసలే ఆర్టీసీ సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మరింత ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను మరమ్మతులు చేయడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు 3 గంటల పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్ స్టేషన్లలో నిలిపివేశారు. వికారాబాద్- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలును పూర్తిగా రద్దు చేశారు. -
కలకలం రేపిన విమానం
కడియం : అంతెత్తున ఎక్కడో ఎగురుతూ, చిన్నగా కనిపించే విమానం ఇంకొంచెం కింద నుంచి వెళితే స్పష్టంగా చూడాలని పిల్లలే కాదు.. చాలామంది పెద్దలూ ఉబలాటపడతారు. ముఖ్యంగా విమానాల రాకపోకలకు అవకాశంలోని ప్రాంతాల్లోని పల్లెళ్లో ఈ ముచ్చట ఎక్కువగా ఉంటుంది. మండలంలోని దుళ్ల, మురమండ గ్రామాలకు చెందిన వారికీ ఆ సరదా ఉంటుంది. వారు ఆశించినట్టు ఓ బుల్లి విమానం బుధవారం ఉదయం 9 గంటల సమయంలో చెవులు గింగురుమనేలా పెనుశబ్దం చేసుకుంటూ, ఆ గ్రామాల మీదుగా బాగా తక్కువ ఎత్తు నుంచి ప్రయూణించింది. అది ఎంత దిగువకు వచ్చిందంటే.. ఎత్తై చెట్ల కొమ్మలు దానికి తగులుకుంటాయేమో అనేంతగా! దీంతో.. ‘ఓరి బాబోయ్! ఇది ఏదో ప్రమాదానికి గురైన విమానంలా ఉంది. ఇప్పుడేమవుతుందో, ఏమోనని హడలిపోయూరు. చివరికి అది అలాఅలా పైకి దూసుకుపోయి, కనుమరుగైంది. చాలామందికి ఆ విమానంలో సాంకేతికపరమైన లోపం వచ్చి కింద నుంచి ప్రయూణించిందేమో, తమ ప్రాంతం దాటాక ఏదైనా ప్రమాదం జరిగిందేమో అన్న అనుమానం రేకెత్తింది. కొందరు మధురపూడి విమానాశ్రయూనికి ఫోన్ చేసి తాము చూసిన దాన్ని చెప్పి, ఏం జరిగిందని ఆరా తీశారు. అయితే విమానాశ్రయూనికి వచ్చి, పోయే విమానాలన్నీ ఎంచక్కా ప్రయూణించాయని అక్కడి సిబ్బంది చెప్పారు. ఏదైమైనా సాయంత్రం వరకూ విమానం గురించి ‘అక్కడ కూలింది’ అంటే ‘కాదు.. మరో చోట’ అంటూ పుకార్లు షికారు చేశాయి. కాగా విమానాన్ని చూసి వారిలో కొందరు అది నేవీకి చెందినదని చెప్పారు. -
భూపాలపల్లి కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కేటీపీపీలో బుధవారం సాంకేతిక లోపం జరిగింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో 500 మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. లోపం ఎలా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. (గణపురం) -
నిలిచిన చెన్నై మెయిల్
సాంకేతిక లోపంతో అన్నవరంలో అవస్థలుపడిన ప్రయాణికులు అన్నవరం: సాంకేతిక లోపం కారణంగా హౌరా-చెన్నై మెయిల్ ఆదివారం సాయంత్రం సుమా రు రెండు గంటలపాటు తూర్పుగోదావరిజిల్లా అన్నవరం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైలు విశాఖపట్నంలో బయలుదేరినప్పటి నుంచీ సెకండ్ క్లాస్ బోగీల్లోని ఒకదాని చక్రాల నుంచి శబ్దం తేడాగా వస్తోందని డ్రైవర్ గుర్తించారు.దీంతో రైలును హంసవరం స్టేషన్లో ఆపి తనిఖీలు చేశారు. ఎస్-11 బోగీ చక్రాల నుంచి శబ్దంతోపాటు మంటలు వస్తున్నాయని గుర్తించారు. రైలును నిలిపే వీలు లేకపోవడంతో నెమ్మదిగా అన్నవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి లూప్లైను మీదకు తరలించారు.ప్రయాణికులను మరో బోగీలో ఎక్కించారు. విడదీసిన రైలును మళ్లీ పంపించేటప్పటికి రాత్రి 7.40 గంటలైంది. ఆ ప్రయాణికుల కోసం రాజమండ్రి లేదా విజయవాడలో మరో బోగీ కలుపుతామని అధికారులు చెప్పారు. మెయిల్ నిలిచిపోయిన ప్రభావం ఇతర రైళ్లపై కూడా పడింది. భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను తుని, యలమంచిలి రైల్వే స్టేషన్లలో సుమారు పావుగంట నిలిపివేశారని అధికారులు తెలిపారు. -
బంగాళాఖాతంలో బోటు గల్లంతు
హైదరాబాద్: బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతయింది. ఇందులో ఆరుగురు మత్స్యకారులున్నారు. బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సముద్రంలో ఆగిపోయింది. మత్స్యకారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని బంధువులకు తెలియజేశారు. నడిసముద్రంలో చిక్కుకుపోయామని తెలిపారు. మూడు రోజుల క్రితం వీరు ఉప్పాడ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. -
సచిన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానం ముంబైకి వెళ్లాల్సివుంది. హైదరాబాద్ వచ్చిన సచిన్ ఈ విమానంలో ముంబైకి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఆపివేశారు. దీంతో సచిన్ సహా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో వేచిఉన్నారు. -
రాజమండ్రి-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి శనివారం హైదరాబాద్ వచ్చిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఈ తర్వాత ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. అయితే అప్పటికే ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. కాగా విమానంలో పొగలు రావడంతో ఆందోళన రేకెత్తించింది. -
ఏటీఎం మాయగాడు
* సాంకేతిక లోపాన్ని అడ్డుపెట్టుకుని రూ. 1.45 కోట్లు డ్రా * నకిలీ పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు.. 32 ఏటీఎం కార్డులు * నిందితుడు ఎల్బీనగర్ వాసి * వెంటాడి పట్టుకున్న గుంతకల్లు పోలీసులు గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్: ఏటీఎంలోని సాంకేతిక లోపాన్ని పసిగట్టి, మారుపేర్లతో వివిధ బ్యాంకుల్లో 32 ఏటీఎం కార్డులు సంపాదించి.. రూ.1.45 కోట్లు కొల్లగొట్టిన ఏటీఎం మాయగాడి ఉదంతమిది. ఇతడిని అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన మనగంటి కార్తీక్ విలాసాలకు బానిసై చోరీల బాటపట్టాడు. ఈ క్రమంలో ఓ రోజు నంద్యాలలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న ఏటీఎం నుంచి తన ఏటీఎంతో రూ. 10 వేలు డ్రా చేశాడు. అయితే మిషన్ నుంచి డబ్బు వచ్చే లోగా ట్రాన్సాక్షన్‌ను వద్దనుకుని క్యాన్సెల్ బటన్ నొక్కాడు. అయినా ఆశ్చర్యంగా రూ. 10 వేలు బయటకు వచ్చాయి. వెంటనే చెక్ చేసుకోగా కార్తీక్ అకౌంట్లో మొత్తం డబ్బు అలాగే ఉంది. దీంతో ఏటీఎంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. ప్రతిసారీ డబ్బు డ్రా చేయడం, ఆ వెంటనే క్యాన్సిల్ బటన్ నొక్కడం చేస్తూ నగదు కొల్లగొట్టేవాడు. ఇలాగైతే పట్టుపడతానని భావించి వివిధ పేర్లతో, నకిలీ గుర్తింపు కార్డులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి 32 ఏటీఎం కార్డులను సంపాదించాడు. రూ. 13 లక్షలతో హుందాయ్ వెర్న కారును కొన్నాడు. నంద్యాల్లోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నగదులో తేడా వస్తుండటంపై బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరాలను పదేపదే పరిశీలించారు. ఎట్టకేలకు దొంగ ఎవరో తెలుసుకుని.. అతను ఎక్కువగా నగదు డ్రా చేసే ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును అలర్ట్ చేశారు. బుధవారం తెల్లవారు జామున కార్తీక్ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు చెప్పాడు. పసిగట్టిన కార్తీక్ కారులో ఉడాయించాడు. అతడి కారు అనంతపురం వైపు మళ్లడంతో అనంతపురం జిల్లా ఎస్పీకి సమాచారమిచ్చారు. పోలీసులు వెంటాడుతున్నారని గమనించిన కార్తీక్ గుంతకల్లు సమీపంలో కారాపి పొలాల్లోకి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ వైపు పరుగుదీస్తుండగా గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో కార్తీక్‌ను పట్టుకున్నారు. 32 ఏటీఎం కార్డులు, రూ. 8వేలు, 4 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఓ మహిళ ఉన్నట్లు ఆనవాళ్లను బట్టి కనుక్కున్నారు. ఆమె పరారీలో ఉంది. -
వైఎస్ జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
కర్పూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్, అనంతరం హెలికాప్టర్లో అనంతపురం జిల్లా మడకశిరకు వెళ్లారు. అక్కడ జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లేందుకు బయల్దేరారు. కాగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడంతో మడకశిర నుంచి రోడ్డు మార్గం ద్వారా హిందూపురం పయనమయ్యారు.