Telangana Public Service Commission
-
మార్చి ఆఖరులోగా ‘గ్రూప్స్’ తుది ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్స్’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్–1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామని తెలిపారు. తర్వాత గ్రూప్–2 ఫలితాలు, వెనువెంటనే గ్రూప్–3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచి గ్రూప్–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు.పకడ్బందీగా ఏర్పాట్లుఈ నెల 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2, 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–3, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు. 783 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారని వెల్లడించారు.గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశామని.. ప్రత్యక్షంగా 49,848 మంది, పరోక్షంగా మరో 25 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నాటికి 75 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన..టీజీపీఎస్సీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. ఈ నెల 18, 19 తేదీల్లో టీజీపీఎస్సీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 18న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను, మరుసటి రోజు స్టాఫ్ సెలెక్షన్కమిషన్(ఎస్ఎస్సీ), తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సందర్శిస్తామని చెప్పారు. పరీ క్షలను పారదర్శకంగా నిర్వహించే విధానాలపై అధ్యయ నం చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పిస్తామని తెలిపారు.వచ్చే నెలలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉందనితెలిపారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రకటిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించినది టీజీపీఎస్సీయేనని చెప్పారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నట్లు తెలిపారు. -
టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల కు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జా బితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఎలక్ట్రికల్ కే టగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపి క చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్నికో లస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీజీపీఎస్సీని భ్రష్టుపట్టించారు
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను రాజ కీయ పునరావాస కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే తాము ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారిని టీజీపీఎస్సీలో నియమించామని చెప్పారు. ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... సీఎం చేతుల మీదుగా 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు.16 నర్సింగ్ కళాశాలలను, 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గతంలో ఆర్ఎంపీ డాక్టర్‌ను, డిప్యూటీ తహసీల్దార్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఒక కలెక్టర్‌ను సెక్షన్ ఆఫీసర్, అటెండర్ నిర్ణయించలేరు కదా. అందుకే ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని టీజీపీఎస్సీలో నియమించాం.టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలతో 563 మంది గ్రూప్–1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేస్తుంటే మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ సర్వేల్లో చదివిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను కమిషన్ చైర్మన్‌గా నియమించాం.రికార్డు స్థాయిలో నియామకాలు చేశాంఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం దేశంలోనే రికార్డు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. కానీ మేం దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొత్తగా 6,500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.ఈ విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునేవాళ్లు. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు అపోలో, యశోదా వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి ఆదుకున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.835 కోట్లను ప్రజలకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటివరకు కోటీ 15 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారు. మేం 50లక్షల కుటంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేం రుణమాఫీ పూర్తి చేయడంతో కొందరి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కొందరు ఫాంహౌజ్‌లలో పడుకుని బాధపడుతున్నారు. మేం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సన్నాలు పండించండి. బోనస్ తీసుకోండి.ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండిసంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులు, బసవన్నల్లా కొందరు ఇప్పుడే వస్తున్నారు. వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. అది సర్పంచి ఎన్నికల కోసమే. ఢిల్లీలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాపై విమర్శలు చేస్తున్నాయి. ఈ 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయా? ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి..’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజారోగ్యంపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భట్టిరాష్ట్రంలో పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆరోగ్య ఉత్సవంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని.. ఆరోగ్యశ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పేదల వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇక మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. అదనంగా రూ.487.29 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. ట్రాన్స్జెండర్ల కోసం దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి పదవీకాలం ఈ నెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆ తర్వాత బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగో చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నిలవనున్నారు. ఆయన వయసు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పదవీ విరమణ చేసిన అధికారులను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తే... సంస్కరణలు తీసుకురావడం, అమలు చేయడానికి తగిన సమయం ఉండదన్న ఉద్దేశంతో బుర్రా వెంకటేశంను సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ హోదాల్లో పనిచేసి... బుర్రా వెంకటేశం ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, జేఎనీ్టయూ వైస్ చాన్స్‌లర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జనగామ జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం.. 1995 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనే టాపర్. ఆయన 2005– 2009 మధ్య మెదక్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం– సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగారు. జిల్లా కలెక్టర్‌గా తన అనుభవాలతో ‘పాత్‌వేస్ టు గ్రేట్ నెస్–కమింగ్ టుగెదర్ ఫర్ చేంజ్’పుస్తకం కూడా రాశారు. కీలక కార్యక్రమాలతో గుర్తింపు బుర్రా వెంకటేశం రాష్ట్రంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్, అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫెస్టివల్, హైదరాబాద్ హెలీ టూరిజం పేరిట విభిన్న కార్యక్రమాలను పరిచయం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. పరీక్ష తేదీ నుంచి కేవలం 65 రోజుల రికార్డు సమయంలో ఏకంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. అదే సమయంలో 35వేల మంది టీచర్లకు పదోన్నతులు, 22 వేల మందికి బదిలీల ప్రక్రియలనూ విజయవంతంగా నిర్వహించారు.2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ప్రశంసా పత్రాన్ని.. 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పది బంగారు పతకాలను అందజేసింది. 2019లో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’అనే పుస్తకం రాశారు. రామాయణ పరివారం, జీవన ధాన్య శతకం, ‘బుద్ధ శతకం’కూడా రాశారు. పదవికి ముందు పదోన్నతి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఆయన పేరు ఖరారైన నేపథ్యంలో ఈ పదోన్నతి ఇవ్వడం గమనార్హం. -
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీజీపీఎస్సీ)గా ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం(నవంబర్30) ఉత్తర్వులు జారీ చేసింది.బురర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవ్వడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు రాజీనామా బుర్ర వేంకటేశం రాజీనామా చేయనున్నారు.ఇప్పటికే ఈయన వీఆర్ఎస్ అప్లై చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవడం వల్ల సంతోషంగా ఉందని వెంకటేశం తెలిపారు. -
డిసెంబర్ 15,16న గ్రూప్–2 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.ఐదోసారి ప్రకటనవివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీలను ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్ మరో ప్రకటన చేసింది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్... గ్రూప్–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్ వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టంచేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్ వెబ్సైట్లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్‌తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది.దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్‌పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్‌ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్‌ను కమిషన్రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది. -
టీఎస్పీఎస్సీ ఉద్యోగులకూ సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తులో ముందుకు వెళ్లే కొద్దీ.. కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ ప్రశ్నిస్తోంది సిట్. తాజాగా.. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 42 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో.. టీఎస్పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్ స్నేహితుడైన సురేష్ నడుమ సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం వీళ్లిద్దరి మధ్య వాట్సాప్ ఛాటింగ్, కాల్ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలను బట్టి.. రాజశేఖర్ టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ తీసుకెళ్లి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించింది సిట్. అయితే సురేష్ సైతం పేపర్‌ను లీక్ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్ ఇచ్చాడు? అనే కోణంలో సిట్ దర్యాప్తు ఇప్పుడు ముందుకు సాగుతోంది. మరోవైపు పేపర్ లీకేజ్ కేసులో.. నేడు సిట్ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్‌లలోని ప్రశ్న పత్రాలు లీక్ కావడంపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో.. పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్‌ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది. ఈ లావాదేవీలపై సిట్ కూపీ లాగుతోంది. ఇక రాజశేఖర్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ ఛాటింగ్ వివరాల ఆధారంగానే సిట్ నిందితులపై ప్రశ్నలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! -
ఒక్కడు చేసిన పాపం.. ఎందరికో శాపం
పరీక్షల రద్దు ప్రకటన వేలాది మందికి అశనిపాతమే అయింది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కేరాఫ్‌గా మారిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, తదితర ప్రాంతాలు పరీక్షల రద్దు ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న వేలాది మందిలో గందరగోళం నెలకొంది. ఒక్క సిటీసెంట్రల్ లైబ్రరీలోనే కాదు..అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అద్దె గదుల్లో, స్టడీరూమ్లలో, కోచింగ్ కేంద్రాల్లోనూ చదువుకుంటున్న లక్షలాది మంది అభ్యర్ధులు కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ ప్రాంతంలోనే చిన్నవి, పెద్దవి సుమారు 30కి పైగా కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వయోపరిమితిలో చివరకు చేరుకొన్న అభ్యర్ధులు మొదలుకొని, ఈ ఏడాదే డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు, మెటీరియల్‌కు, ఇళ్ల అద్దె, భోజనం తదితర సదుపాయాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాంవేసి ఉంటున్నారు.‘పరీక్షల రద్దుతో చదవడం మానేసి ఇంటికి వెళ్లాలా లేకపోతే మరో ప్రకటన కోసం ఎదురు చూస్తూ చదువుకోవాలా’ తేల్చుకోలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం అమ్ముకున్నాడు బోధన్ సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన శంకర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరఎకరం భూమిని తన చదువుల కోసమే అమ్మేశారు. మరో రూ.6 లక్షలు అప్పు చేయవలసి వచ్చింది. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాడు. మెయిన్స్‌లోనూ విజయం సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.‘ఐదు రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాను. స్టడీమెటీరియల్, కోచింగ్, పరీక్షల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నా. ఇటీవల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అయినా సరే ఉద్యోగం వస్తే అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఉండాలా, వద్దా తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పాడు. ఏం సమాధానం చెప్పాలి సంగారెడ్డికి చెందిన పద్మావతి ఏడాదిన్నర కాలంగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇంటికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈసారి ఎలాగైనా జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాయి. ‘ఎప్పటి వరకు ప్రిపరేషన్ పూర్తవుతుంది. పరీక్షలు ఎప్పుడు రాస్తావు, మళ్లీ ఇంటికి ఎప్పుడొస్తావు అని నాన్న అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలి?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు మంచిదే ‘ఒకవిధంగా రద్దు చేయడం మంచిదే. లీకేజీ వల్ల నిజాయితీగా కష్టపడే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత బలహీనంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది’ అని మరో అభ్యర్థిని విజయలక్ష్మి పేర్కొన్నారు. సగటున ఒక అభ్యర్థి ఖర్చులు అంచనా.. నలుగురితో కలిసి ప్రతి నెలా చెల్లించే ఇంటి అద్దె : రూ.3500 నెల భోజనం ఖర్చు : రూ.2900 స్టడీరూమ్ (ఏసీ) రూ.1700 స్టడీరూమ్ (నాన్ ఏసీ) రూ.900 గ్రూప్–1 కోచింగ్ ఫీజు రూ. 75,000 గ్రూప్–2, కోచింగ్ ఫీజు రూ.28,000 స్టడీ మెటీరియల్ రూ.15000 ఒక అభ్యర్ధికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు. మరిన్ని అదనపు సదుపాయాలతో చదువుకుంటే రూ.3 లక్షలపైనే ఖర్చవుతుంది. రద్దు అన్యాయం నేను గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్‌కు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా రాసిన వేలాదిమంది అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకోకుండా పరీక్ష పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికి శిక్ష వేడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచించి మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. – పిట్ల సరిత, డిచ్పల్లి, గ్రూప్–1 అభ్యర్థి -
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?!
సాక్షి, హైదరాబాద్: పేపర్ లీకేజీ ప్రకంపనలతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ జరిగిన కీలక భేటీలో.. కీలకనిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలువుల జాతర పేరుతో.. ఈ మధ్యకాలంలో మొత్తం వివిధ రకాల పరీక్షలకు సంబంధించి 26 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. అయితే ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడం, ఆపై సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండడంతో.. ఇప్పుడు కొన్ని పరీక్షలను రద్దు చేస్తూనే, దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 20 పరీక్షలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏడు పరీక్షలు జరగ్గా.. వాటి పేపర్లు మొత్తం! లీక్ అయినట్లు సిట్ దర్యాప్తు నివేదిక ద్వారా దాదాపుగా నిర్ధారణ చేసుకుంది కమిషన్. ఈ నేపథ్యంలో మొన్న ఏఈ పరీక్ష.. ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పరీక్షలను(ఏఈఈ, డీఏవో పరీక్షలు) సైతం రద్దు చేసి.. వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అయిపోయిన నాలుగు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధం కాగా.. మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అవే.. గ్రౌండ్ వాటర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు. ఈ క్రమంలో ఈ పరీక్షల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలతో పాటు.. రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా పరీక్షల పత్రాలను సైతం మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో.. టీఎస్పీఎస్సీ దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ వేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విమర్శలకు, అభ్యర్థుల అనుమానాలకు తావు లేకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. ప్రశ్నాపత్రాలను తిరిగి రూపొందించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష తేదీలను మార్చేసి, ఆలోపు కొత్త ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో పిటిషన్ ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎన్ఎస్యూఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పిటిషన్లో పేర్కొన్న ఆయన.. రాష్ట్ర పరిధిలోని సిట్‌తో కాకుండా సీబీఐగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన పిటిషన్లో కోర్టును కోరారు. -
TSPSC: మెయిన్ సర్వర్ నుంచే పేపర్ కొట్టేశాడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్‌ను సేకరించాడు. సేకరించిన పేపర్‌ను ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్ చేశాడు ప్రవీణ్. ఆపై.. పేపర్ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్‌నగర్‌లోని సెంటర్ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇదీ చదవండి: ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫొటోలు నిందితులకు 14 రోజుల రిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ కోరిన పోలీసులు పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. -
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
గ్రూప్–1లో తెలుగు అర్హత పేపర్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో తెలుగును అర్హత పేపర్‌గా ప్రవేశపెట్టాలని గ్రూప్–1 పరీక్ష అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు వారు గురువారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వినతి పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాల వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని, దీనివల్ల పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని వారు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నరేందర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, పి.వెంకటేశం తదితరులున్నారు. -
తెలంగాణ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో 122, హెచ్ఎండీఏలో 191, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) పరిధిలో 432, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)లో 233, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా)లో 70, జీహెచ్ఎంసీలో 879, హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. డీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రకటనలు రానున్నాయి. జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఏ, కుడా పరిధిలోని ఖాళీలను శాఖాపరమైన నియామకాల ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పురపాలక శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా.. దేవాదాయ శాఖలో 128.. రాష్ట్ర దేవాదాయ శాఖలో మొత్తం 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ (2), అసిస్టెంట్ కమిషనర్లు (12), అసిస్టెంట్ ఇంజనీర్లు (3), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–1 (4), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–3 (81), జూనియర్ అసిస్టెంట్స్ (16), ఎల్డీసీ (1), టైపిస్టు కమ్ స్టెనో (9). వ్యవసాయశాఖలో 761 ఖాళీలు సాక్షి, హైదరాబాద్: తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 761 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిలో వేర్‌హౌసింగ్‌లో ఎక్కువగా 312 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఇతర విభాగాల్లో.. విత్తనాభివృద్ధి సంస్థలో 89, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలో 59, రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్లో 51, ఆగ్రోస్‌లో 74, హాకాలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. కేటగిరీ పోస్టుల సంఖ్య పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో.. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 26 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 6 హెచ్ఎండీఏలో.. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 37 ఏఈఈలు 54 పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలో.. ఏఈఈలు 175 ఏఈలు 75 టెక్నిల్ ఆఫీసర్ 11 కేటగిరీ పోస్టుల సంఖ్య డీటీసీపీలో.. అడిషనల్ డైరెక్టర్ టౌన్‌ప్లానింగ్ 20 టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ 6 టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 175 ఏఏడీఎం 10 కుడాలో.. జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 2 సర్వేయర్లు 10 జీహెచ్ఎంసీలో... టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్లు 200 వెటర్నరీ ఆఫీసర్లు 31 సానిటరీ ఇన్స్పెక్టర్లు 45 హెల్త్ అసిస్టెంట్లు 44 ఫీల్డ్ అసిస్టెంట్లు 120 టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 60 టౌన్ సర్వేయర్లు 30 కేటగిరీ పోస్టుల సంఖ్య హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీలో.. మేనేజర్ (ఇంజనీరింగ్) 159 టెక్నిషియన్ గ్రేడ్–2 72 జనరల్ పర్పస్ ఎంప్లాయి (సిబ్బంది) 110 జనరల్ పర్పస్ ఎంప్లాయి (వాటర్ సప్లై జనరల్) 1,114 జనరల్ పర్పస్ ఎంప్లాయి (సివరేజీ జనరల్) 297 -
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కోరం నిబంధనతో వీలైనంత త్వరగా కొత్త నియామకాలను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల ఆరేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు... కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్ చైర్మన్‌తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్‌లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్‌తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు. రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్‌లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్‌లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల లెక్కలను తీసే పనిలో వివిధ ప్రభుత్వశాఖలు ఉన్నాయి. ఖాళీల లెక్క తేలాక ప్రభుత్వం వీటి భర్తీకి ఇండెంట్లు ఇస్తే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ ఉత్తర్వులు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు. -
టెట్ నిర్వహిస్తారా లేదా...?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం 5.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే తమకు టెట్ అర్హత ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరుసార్లే నిర్వహించారు. వాస్తవానికి 12 సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను 6 సార్లే నిర్వహించడంతో ఇంకా 5.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) పరీక్ష రాయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2011లో ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం మేరకు టెట్‌ను తప్పనిసరి చేసింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెట్ పేపర్–1లో అర్హత సాధిస్తే ఒకటి నుంచి 5వ తరగతి వరకు, పేపర్–2లో అర్హత సాధిస్తేనే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చని పేర్కొంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగిసిన మూడు టెట్ల వ్యాలిడిటీ.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 2011 జూలై 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండో టెట్, 2012 జూన్ 1న మూడో టెట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్ల స్కోర్‌కు ఎన్సీటీఈ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్ల పేపర్–1, పేపర్–2 పరీక్షలకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్ వ్యాలిడిటీని కోల్పోయారు. ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగో టెట్‌లో ఏపీకి చెందిన 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాకుండా తెలంగాణ అభ్యర్థులు 3 లక్షల మంది ఆయా టెట్లలో అర్హత సాధించారు. అయితే మొదటి మూడు టెట్లలో అర్హత కోల్పోయిన వారు ఇందులో దాదాపు 2 లక్షల మంది ఉండగా, మరో లక్ష మంది అర్హులు కాలేకపోయారు. నాలుగో టెట్‌లో అర్హత సాధించని లక్ష మందితో పాటు మరో 3 లక్షల మందికి పైగా పలు టెట్లలో అర్హత సాధించని వారు ఉన్నారు. వారికి తోడు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో (2018, 2019, 2020) ఉపాధ్యాయ విద్యా కోర్సులను (బీఎడ్, డీఎడ్) పూర్తి చేసుకున్న వారు మరో లక్షన్నర మంది ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో టెట్ కోసం ఇప్పుడు 5.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్‌లో అర్హత సాధిస్తేనే టీఆర్టీ రాసేందుకు అర్హులు అవుతారు. ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరేనా? ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్సీటీఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మొదటి మూడు టెట్లలో అర్హత సాధించినా, తర్వాతి టెట్లలో అర్హత సాధించని మరో 1 లక్షల మందికి టెట్ గండం వచ్చి పడింది. టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్సీటీఈ నిర్ణయాన్ని.. గతంలో టెట్ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్ రాయాల్సిందే. వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి: రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో టెట్‌లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులకు టీఆర్టీ రాసే అర్హత లభిస్తుంది. టెట్ కోసం 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వ్యాలిడిటీ రద్దయిన టెట్ల వివరాలు.. 2011 జూలై 1న మొదటి టెట్.. పేపర్ హాజరు అర్హులు అర్హుల శాతం 1 3,05196 1,35,105 44.27 2 3,34,659 1,66,262 49.68 2012 జనవరి 8 నాటి రెండో టెట్.. 1 55,194 24,578 44.53 2 4,12,466 1,93,921 47.02 2012 జూన్ 1 నాటి మూడో టెట్ 1 58,123 26,382 45.39 2 4,18,479 1,94,849 46.56. ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్లు.. 16–3–2014 – నాలుగో ఏపీ టెట్ 1 65,770 40,688 61.86 2 4,04,385 1,15,510 28.56 22–5–2016– మొదటి తెలంగాణ టెట్ 1 88,661 48,278 54.45 2 2,51,906 63,079 25.04 23–7–2017– రెండో తెలంగాణ టెట్ 1 98,848 56,708 57.37 2 2,30,932 45,045 19.51 –––––––––––––––––––––– 22–5–2016 కానీ జనవరి 24న పరీక్ష జరిగింది. -
సాంకేతికత.. సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సాంకేతికంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిం చింది. కమిషన్‌కు తొలి చైర్మన్‌గా నియుక్తులైన ఘంటా చక్రపాణి ఆరేళ్లలో పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు నియామక పత్రాల జారీ వరకు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్‌గా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దారు. ఈనెల 17న ఘంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో టీఎస్పీఎస్సీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే... అంతా ఆన్లైన్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగ ప్రకటనలు మొదలు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు వసూలు, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన.. చివరకు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాన్ని కూడా ఆన్లైన్లో ఇచ్చి టీఎస్పీఎస్సీ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక చర్యల కారణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి దక్కింది. టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన పలురకాల సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలో ఆయన కీలక భూమిక పోషించారు. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డిసిప్లైన్డ్ ఫోర్సెస్ సర్వీస్ కమిషన్ బృందాలు టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలను ప్రత్యక్షంగా వీక్షించి పలు అంశాలను తమ దేశంలో అమలుకు ఉపక్రమించడం ద్వారా టీఎస్పీఎస్సీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణను సులభతరంగా చేసింది. కమిషన్ తన కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పీఎస్సీగా ఎంపికైంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ)ని అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసింది. పారదర్శకతకు కూడా కమిషన్ పెద్ద పీట వేసింది. టీఎస్పీఎస్సీ కార్యక్రమాలను ఏటా గవర్నర్‌కు నివేదిక రూపంలో అందజేయడం అనవాయితీగా పాటిస్తున్నారు. అవినీతి లేని వ్యవస్థను నిర్మించాం.. ‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పారదర్శక వ్యవస్థను నిర్మించగలిగాం. ఇది దేశంలో పీఎస్సీలకు, మారిషస్ లాంటి దేశాలకు మోడల్‌గా నిలిచింది. వారు మన పద్ధతులను అనుసరించడం గర్వకారణం’అని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
సీఎం కేసీఆర్ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సర్కారీ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది. ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. విద్యాశాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నా యి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్‌గా ప్రిపరేషన్లో మునిగిపోనున్నారు. విద్యాశాఖలో 15 వేలకు పైనే రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అం దులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుశాఖలో 20 వేలు రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా.. రాష్ట్రంలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభిం చకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ గవర్నర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. పాతవి... కొత్తవి కలిపి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్ ఇన్స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మూడేళ్లలో 52 వేలకు పైగా పోస్టుల భర్తీ వైద్యారోగ్య శాఖలో 12 వేలు.. రెవెన్యూలో 4 వేలు తాజా లెక్క తేలాలి... రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. -
బీట్ ఆఫీసర్ల నియామకానికి లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగిపోయిన బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే, టీఎస్పీఎస్సీ 6(A) రూల్స్ పాటించకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నియామకాలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌బెంచ్ విచారించి స్టే విధించింది. దీంతో సింగిల్ బెంచ్ విధించిన స్టే పై పలువురు అభ్యర్థులు డబుల్ బెంచ్‌లో సవాల్ చేశారు. విచారించిన డబుల్ బెంచ్ బీట్ ఆఫీసర్ల నియామకం జరపాలని.. ఇతరత్రా ఏమైనా నిబంధనలు ఉంటే టీఎస్పీఎస్సీ చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖలో అధికారుల నియామకం ఆగిపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. -
ఎస్జీటీ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (ఎస్జీటీ) నియామక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ 4,700 పోస్టుల భర్తీ ప్రిక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఈ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు చెందిన పి.రామకృష్ణ మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం గురువారం విచారించింది. ఆ పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ చేపట్టిన ఎంపిక విధానాన్ని తప్పుపడుతూ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జోక్యం చేసుకునేందుకు సింగిల్ జడ్జి గతంలో నిరాకరించారు. దీంతో వారు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేయగా.. గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నిబంధనల్లోని 6–ఏ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులను విచారించాలని, ఆ పోస్టులకు ఆసక్తి చూపని వారిని తొలగించాకే ఎంపిక నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టుల ఎంపిక ప్రక్రియపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉర్దూ, కన్నడ మీడియం పోస్టులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. మరోవైపు ఇప్పటికే సర్వీస్ కమిషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జాబితాను విద్యాశాఖకు పంపించింది. అభ్యర్థులకు ఆ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వుల్ని తొలగించాలని కోరుతూ సర్వీస్ కమిషన్ జూన్‌లో అప్పీల్ చేసే అవకాశాలున్నాయి. -
కార్బైడ్ వినియోగిస్తే కఠిన చర్యలే
సాక్షి, హైదరాబాద్ : వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్‌ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్‌ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్ïపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది.