track
-
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు
మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు
ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్‌పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్‌పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్‌ను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాశ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. సూరత్‌గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్‌లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి -
రైలు పట్టాలపై సిలిండర్.. ఉగ్రవాదుల పనేనా?
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. -
Madhya Pradesh: పట్టాలు తప్పిన గూడ్సు రైలు
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కత్నీ నుంచి సాగర్‌కు వెళుతున్న బొగ్గుతో కూడిన గూడ్సు రైలు దామోహ్ జిల్లాలోని పఠారియా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్సు రైలులోని ఏడు వ్యాగన్లు ట్రాక్‌పై బోల్తా పడ్డాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటనలో ట్రాక్‌లు, స్లీపర్లు, ఓహెచ్ఈ కేబుల్స్ దెబ్బతినడంతోపాటు సాగర్, దామోహ్, కట్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడ్సు రైలు కోచ్‌ల చక్రాలు విడిపోయి, ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో వ్యాగన్లలోని బొగ్గంతా నేలపాలయ్యింది. అర కిలోమీటరు పొడవునా పదుల సంఖ్యలో రైలు స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. Breaking News: Goods train loaded with coal derailed in Damoh, MP;- Darbhanga Express narrowly escapes accident. pic.twitter.com/TFP4DVPnBm— زماں (@Delhiite_) August 14, 2024 -
స్లీపర్ వందేభారత్ ప్రత్యేకతలివే..
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ రైలు పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్‌కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
కరచరణో రసి మణిగణ భూషణ... లుక్... ఐ వాజ్ గోనా గో
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు. యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్లు గెలుచుకుంది. ‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గవ నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్మెంట్లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జోధ్‌పూర్‌లో బయలుదేరి భోపాల్‌కు వెళ్తోంది. కోటా వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. రైలులోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం రైల్వే బృందం ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ఘటన అనంతరం ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్‌లపైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. #WATCH | Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction. No casualties have been reported. Rescue operations underway. Details awaited. (5.1) pic.twitter.com/zKR7MLQRAr — ANI (@ANI) January 5, 2024 -
నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?
నేరాలకు, హత్యలకు, దోపిడీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికో దేశం కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇక్కడి నేరస్తులు ప్రభుత్వం ఉపయోగించే డేటాబేస్‌ను వినియోగించి మరీ నేరాల్లో మరో ముందడుగు వేశారని వైస్ న్యూస్ నివేదిక వెల్లడించింది. మెక్సికన్ నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను, చివరికి వారి లైవ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తమకు తెలియజేశామని వైస్ న్యూస్ పేర్కొంది. నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను జియోలొకేట్ ద్వారా తెలుసుకునేందుకు వారు టైటాన్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. తద్వారా తాము టార్గెట్ చేసిన వారి ప్రైవేట్ సమాచారంతోపాటు వారికి సంబంధించిన పత్రాలను పొందుతూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 10 వేల మెక్సికన్ పెసోలు (రూ. 600) నుండి 1,80 వేల పెసోలు (రూ. 9,000) చెల్లించి నేరస్తులు వివిధ టైటాన్ సేవలను పొందుతున్నారని వైస్ న్యూస్ తెలియజేసింది. ఈ విధంగా నేరస్తులు అధికారికంగా టైటాన్ సేవల సొంత లాగిన్ పొందుతూ, ఆధునిక మార్గాల్లో తమ నేరాలను కొనసాగిస్తున్నారు. నిజానిక్ టైటాన్ సేవలను ఉపయోగించేందుకు పోలీసు బలగాలు సంబంధిత లైసెన్స్‌లను కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ లైసెన్స్ అక్రమమార్గంలో తిరిగి బ్లాక్ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. మెక్సికన్ ఓటర్ ఐడీ డేటాబేస్, క్రెడిట్ బ్యూరోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫోన్ యాప్‌ల లాగ్‌లు, ఇమెయిల్‌లు, ఇలాంటి సమాచారాల ఆధారంగా టైటాన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సులభంగా నేరస్తులను గుర్తించడానికి ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు కంపెనీ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్‌తో సహా అనేక ప్రభుత్వాలు, రిపోర్టర్లు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష సమూహాలపై గూఢచర్యం చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో తేలింది. అయితే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ అక్రమ వినియోగం వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా వెల్లడికాలేదని వైస్ న్యూస్ తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ లాగిన్ పేజీలోని ఎబౌట్లో ఎటువంటి సమాచారం ఉండదు. అలాగే ఈ సంస్థ సర్వర్లను తరచూ మారుస్తూ ఉంటుంది. బహుశా ఎవరూ ట్రాక్ చేయకుండా ఉండేందుకే ఇటువంటి విధానం అనుసరిస్తుంటుందని తేలింది. నేరస్తులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ సేవలను చట్టాన్ని అమలు చేసే వారి కన్నా.. నేరస్తులే అధికంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. కాగా ఈ వివరాలపై మెక్సికన్ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇది కూడా చదవండి: దావూద్ ఇబ్రహీంకు సీరియస్? -
మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా..
ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్ దాటి, రెయిలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. #Delhi- Girl was jumping from the track of metro station.. police saved her. #delhimetro #delhigirls #DelhiGovernment #Delhi #METRO4D #Metro pic.twitter.com/eFwJ6yNhAH — Arun Gangwar (@AG_Journalist) December 12, 2023 ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్‌పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్‌పాత్ మీదుగా ట్రాక్ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను..
కోల్‌కతా: మొత్తం మూడు ఏనుగులు కలిసి ట్రాక్ దాటుతున్నాయి. ఇంతలో ఓ గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి దూసుకొచ్చింది. వేగంగా గజరాజులను ఢీ కొట్టడంతో అవి కిందపడి మృతి చెందాయి. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా రాజభక్తావ అటవీ ప్రాంతంలో జరిగింది. అలీపూర్‌ద్వార్ నుంచి సిలిగురి వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఏనుగులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సంఘటన జరిగిన రాజభక్తావ-కాల్చిని సెక్షన్లో రైలు ఢీకొట్టడాన్ని నిరోధించే ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్(ఐడీఎస్) ఇంకా అందుబాటులోకి రాలేదని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడ ఐడీఎస్ వ్యవస్థ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను రైళ్లు ఢీకొన్న సంఘటనలు జరగలేదని అధికారులు చెప్పారు. ఇదీచదవండి..ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది! -
తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..
తిరువనంతపురం: పీకలదాక తాగి రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని జయప్రకాశ్‌గా గుర్తించారు. కేరళ, కన్నూర్ సమీపంలోని అంచరకండిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చొవ్వ రైల్వే క్రాస్ దగ్గర ట్రాక్‌పై ఉన్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. జయప్రకాశ్ మద్యం మత్తులో ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌పైకి కారును పోనిచ్చాడు. మత్తులో ఉన్న కారణంగా ట్రాక్‌ను నిందితుడు రోడ్డుగా భ్రమపడినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మీటర్ల దూరం పోగానే ట్రాక్‌పై కారు ఇరుక్కుని నిల్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు. జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎలాంటి రైలు రానుందున ముప్పు తప్పిందని తెలిపారు. ఇదీ చదవండి: Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు.. -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉంటుంది. అంటే తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
ఫోన్ పోతే.. ఇలా వెతకండి!
షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్‌గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి. ∙∙ వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ∙∙ నకిలీ మొబైల్ ఫోన్ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది. సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు: https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్ఇఐ నంబర్‌ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది. పోర్టల్‌లో మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడానికి.. ►ముందుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి. ►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి. ►సిఇఐఆర్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్‌ని యాడ్ చేయాలి. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp ►మీ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది. ►మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి. ►మీ రిజిస్టర్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఐఎమ్ఇఐ నంబర్‌ను చెక్ చేయడానికి.. ►ముందు పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp ►మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ►మీ మొబైల్‌కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ►15 అంకెల ఐఎమ్ఇఐ నంబర్‌ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ►ఐఎమ్ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది. సిఇఐఆర్ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి.. ►పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp ►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్‌ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది. పోర్టల్‌లో రికవరీ మొబైల్ ఫోన్‌ని అన్‌బ్లాక్ చేయడానికి.. https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. ►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ►మొబైల్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి. డివైజ్‌ను గుర్తించాక డేటాను తొలగించడానికి.. ►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి https://support.google.com/ accounts/answer/6160491?hl=en ►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి. https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి.. ►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్‌ను డీకంపైల్ చేయదు. https://reports.exodus-privacy.eu.org/en/ ►మీ మొబైల్ నంబర్లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in ►ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in ►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్‌లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్‌చేయవచ్చు. ►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్‌లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ∙అన్ని అప్లికేషన్లు, సోషల్‌మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ చేస్తే.. పనిచేయదు బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్‌గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఇఐ) డేటాబేస్లకు లింక్ చేస్తుంది. సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్‌వర్క్‌లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్‌వర్క్‌లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
షాకింగ్ ఘటన: రైల్వే పట్టాలపై కూలిన డ్రోన్
ఢిల్లీ మెట్రో స్టేషన్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు పట్టాలపై ఒక డ్రోన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసి ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్‌ను కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఈ డ్రోన్ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో డ్రోన్‌లో కొన్ని మందులు దొరికాయని తెలిపారు. మందులను పంపేందుకు కంపెనీ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయినా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు ముప్పు పొంచి ఉందని అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి డ్రోన్లు ఉపయోగించకూడదని అధికారులు తెలిపారు. అయినా అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్టం విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ని పునః ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెట్రో రైలు సేవలు అందుబాటులో లేవని, మిగిలిన లైన్లో యథావిధిగా సేవలు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. (చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత) -
వార్నింగ్.. ఈ ట్రిక్‌తో మనల్ని ఈజీగా ట్రాక్ చేస్తారు!
టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇక మొబైల్ ఉంటే చాలు ఏదైనా మన ముందుకే వస్తోంది. తినే తిండి నుంచి, షాపింగ్ వరకు ఇంటి నుంచి కదలకుండా ప్రజలు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీ వల్ల కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ట్రాక్ చేసేయండి! సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ ప్రదేశాన్నికనుక్కోవాలన్నా అందరి చూపు గూగుల్ మ్యాప్స్ వైపు. అంతేనా ఒకరిని ట్రాకింగ్ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా వ్యక్తుల లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో ఓ లుక్కేద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే వాట్సప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్‌కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్‌ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు మన అనుమతితోనే జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మన ఈమెయిల్‌కి లేదా ఫోన్‌కి మెసేజ్ రూపంలో తెలియని వ్యక్తులు లింక్‌లు పంపితే, వాటిని ఓపన్ చేయకుండా, వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. చదవండి: Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్ మహీంద్రా వైరల్ వీడియో టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే! -
గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్
Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్ మ్యాచ్ లేదా టెన్నిస్ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె 7 ఏళ్ల తలయా నార్త్‌వెస్ట్ హై స్కూల్లోని స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్ రేస్ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో ఆ రేస్‌లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం) -
రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక...వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే
Bhopal man jumps under moving train to rescue girl: ఇంతవరకు మనం తమ ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్యవంతులు గురించి విని ఉన్నాం. నిజానికి ఎవరైన తమకు వీలైనంత పరిధిలో లేదా సాథ్యమైనంత మేర వరకు సాయం చేయగలరు. కానీ మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. పైగా ఆ వ్యక్తిని ప్రశంసించేందుకు మాటలు కూడా సరిపోవు. అచ్చం అలాంటి సంఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. అయితే మెహబూబ్ ఒక రోజు తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఇంతలో వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. అయితే ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. దీంతో అందరూ ఆందోళనగా చూస్తుండిపోవడమే ఏంచేయలేని సంకట పరిస్థితి. అక్కడే ఉన్న మెహబూబ్ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు. ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. అంతేకాదు ఆమె భద్రత నిమిత్తం తల పైకెత్తనీయకుండా కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్‌రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Incredible bravery! 37 year old Mehboob was returning to his factory when he and some other pedestrians saw a goods train they stopped to let it pass a girl standing with her parents in fell on the tracks Mehboob sprinted dragged kept her head down @manishndtv @GargiRawat pic.twitter.com/IDqQiBLAv7 — Anurag Dwary (@Anurag_Dwary) February 12, 2022 -
అపర కుబేరుడు.. రూ. 37 లక్షలు ఓ లెక్కా?!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నెంబర్ వన్. అలాంటి వ్యక్తికి 37 లక్షలు ఒక లెక్కా? అనే సందేహం చాలామందికే కలుగుతోంది ఇప్పుడు. ఓ కాలేజీ స్టూడెంట్‌తో ఒప్పందం కోసం ప్రయత్నించిన ఎలన్ మస్క్.. తీరా ఆ కుర్రాడు ఎక్కువ డిమాండ్ చేసేసరికి మౌనంగా ఉండిపోయాడట. ఇంతకీ ఏమా కథ తెలుసుకోవాలని ఉందా? వ్యక్తిగత భద్రత దృష్ట్యా తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయడం ఆపాలంటూ ఓ టీనేజర్‌తో ఎలన్ మస్క్ ఒప్పందం కోసం ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కింది. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ‘ఎలన్ మస్క్స్ జెట్’ పేరుతో నిర్వహించే ట్విటర్ అకౌంట్‌కు స్వయంగా ఎలన్ మస్క్ సందేశాలు పంపాడు. కిందటి ఏడాది ఈ ట్విటర్ ఎక్స్ఛేంజ్ జరిగినట్లు తెలుస్తోంది.తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయడం ఆపేస్తే 5 వేల డాలర్లను ఇస్తానని (మన కరెన్సీలో 3 లక్షల 75 వేల రూపాయలకు పైనే) ఎలన్ మస్క్, స్వీన్కు ఆఫర్ చేశాడట. అయితే అది తక్కువని, బదులులుగా 50 వేల డాలర్లు ఇవ్వమని(37 లక్షల 55 వేలు) స్వీన్ మస్క్‌తో అన్నాడట. తద్వారా తన స్కూల్ ఫీజులతో పాటు టెస్లా కారు కొనాలన్న (టెస్లా మోడల్ 3) కూడా నెరవేరుతుందని స్వీనే ఎలన్ మస్క్‌కి బదులిచ్చాడట. కానీ, అది పెద్ద మొత్తం అని చెబుతూ ఎలన్ మస్క్ ఆ బేరాన్ని అక్కడితోనే ఆపేసి.. మళ్లీ మెసేజ్ చేయలేదట. ట్విటర్లో ఈ ఎలన్ మస్క్‌తో జరిగిన సంభాషణను ఓ ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ ద్వారా బయటపెట్టాడు స్వీన్. దీంతో భద్రత కన్నా డబ్బులు ముఖ్యమా? అని ఎలన్ మస్క్‌కు తిట్టిపోస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు ‘ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను ఆ కుర్రాడు రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్‌గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్‌కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉన్నారు. మస్క్ తనతో బేరానికి రావడం సంతోషంగా, కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉందని, భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం ఆశిస్తున్నట్లు చెప్తున్నాడు 19 ఏళ్ల స్వీనే. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..!
జీవిత భాగస్వాములపై అపనమ్మకంతో కొంతమంది వ్యక్తులు స్టాకర్వేర్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. స్టాకర్వేర్ యాప్స్‌పై పరిశోధనలను జరిపిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం కాస్పర్‌స్కై సంచలన విషయాలను వెల్లడించింది. 10 మందిలో ముగ్గురు సై..! క్సాస్పర్ స్కై చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మందిలో ముగ్గురు వ్యక్తులు తమ జీవిత భాగస్వాములపై నిఘా ఉంచేందుకు స్టాకర్వేర్ యాప్స్‌ను వాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. 21 దేశాల్లో కాస్పర్‌స్కై నిర్వహించిన సర్వేలో సుమారు 21 వేల మంది పాల్గొన్నారు. . ఈ ఏడాది భారీగానే వాడకం..! స్టాకర్వేర్ యాప్స్‌ను ఈ ఏడాది మొదటి 10 నెలల్లో దాదాపు 28,000 మంది మొబైల్ వినియోగదారులు స్టాకర్వేర్ యాప్స్ బారిన పడ్డారు. యూరోపియన్ యూనియన్‌లో 3,100 కంటే ఎక్కువ కేసులు, ఉత్తర అమెరికాలో 2,300 కంటే ఎక్కువ మంది వినియోగదారులు స్టాకర్ వేర్ యాప్స్ ద్వారా ప్రభావితమయ్యారని కాస్పర్స్రై వెల్లడించింది. కాస్పర్‌స్కై గణాంకాల ప్రకారం... ఈ యాప్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రష్యా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు ఇప్పటివరకు అత్యధికంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ యాప్స్‌తో భారత్‌లో కూడా 4627 మంది ప్రభావితమైనట్లు కాస్పర్ స్కై వెల్లడించింది. అసలు ఏంటి స్టాకర్వేర్ యాప్స్..! స్టాకర్వేర్ యాప్స్ చిక్కవు..దొరకవు..! స్టాకర్వేర్ యాప్స్‌ను ఫలానా వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో చొప్పిస్తే...వారికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆయా వ్యక్తులను రహస్యంగా ట్రాక్ చేయవచ్చును. దీంతో ఆయా వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజేస్, లోకేషన్లను ఫోన్లోకి స్టాకర్వేర్ యాప్స్‌ను చొప్పించిన వ్యక్తి పొందుతారు. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...! -
మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా...!
తెలుగు రాష్ట్రాలను గులాబ్ తుపాన్ అతాలకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గులాబ్ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గులాబ్ సైక్లోన్ ఒక్కటే కాదు పలు సైక్లోన్స్ వస్తూనే ఉంటాయి. భారత వాతావరణ శాఖ రాబోయే తుపాన్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తాయి. తుపాన్ బలపడిందా, లేదా బలహీన పడిందా అనే విషయాలను అందుబాటులో ఉన్న వెబ్సైట్లను ఉపయోగించి మన స్మార్ట్‌ఫోన్‌తో మనమే ట్రాక్ చేయవచ్చుననే విషయం మీకు తెలుసా...! అందుబాటులోని వెబ్సైట్ల ద్వారా తుపాన్ కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చను. దీంతో తుపాన్ ప్రభావం నుంచి కాస్త ఉపశమన చర్యలను ముందుగా తీసుకునే వీలు ఉంటుంది. తుపాను కదలికలను ఆన్లైన్లో ఇలా ట్రాక్ చేయండి 1. www.mausam.imd.gov.in తుపానును ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వెబ్సైట్లలో mausam.imd.gov.in అత్యంత విశ్వసనీయమైన వెబ్సైట్లలో ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దేశంలో సంభవించే అన్ని తుపానులను ఈ వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేయవచ్చును. మీరు తుపాన్‌ను ట్రాక్ చేయలనుకుంటే బ్రౌజర్లో mausam.imd.gov.in ఎంటర్ చేయండి. తరువాత వెబ్సైట్లో సైక్లోన్‌పై క్లిక్ చేయండి. తరువాత ట్రాక్ సైక్లోన్ డిస్ట్రబెన్స్‌పై క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ద్వారా తుపాన్లను ట్రాక్ చేయవచ్చును. 2.www.rsmcnewdelhi.imd.gov.in ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడే తుపాన్లను ట్రాక్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌ను భారత వాతావరణశాఖ-ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ది చేశారు. 3. ఉమాంగ్ యాప్(UMANG) ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా తుపాన్లను ట్రాక్ చేయవచ్చును. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఉమాంగ్ యాప్ సహాయంతో తుపాన్ల రియల్‌టైమ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. 4. www.hurricanezone.net www.hurricanezone.net వెబ్సైట్ సహయంతో తుఫాన్ల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చును. ఈ వెబ్సైట్లో ఇండియన్ ఓషన్, వెస్ట్ పసిఫిక్, సౌత్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్, ఈస్ట్ పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో వచ్చే సైక్లోన్లు, టైఫూన్ల, హరికేన్లను ట్రాక్ చేయవచ్చును. -
స్మార్ట్‌ఫోన్‌తో ఆక్సిజన్ లెవల్స్ ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవడానికి యాప్‌లో ఎంఫైన్ పల్స్ పేరుతో టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ స్మార్ట్ఫోన్తోనైనా ఉపయోగించవచ్చని ఎంఫైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ నారాయణ్ వెల్లడించారు. శ్వాసకోశ లేదా తీవ్రమైన గుండెజబ్బులున్నవారు స్లీప్ అప్నియా, భారీ గురక, నవజాత శిశువుల్లో ఆక్సిజన్ సంతృప్త స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఫార్సు చేస్తారు. అలాగే ప్రస్తుతం సమయంలో కరోనా వైరస్ రోగుల్లో కూడా ఆక్సిజన్ స్థాయిలను మానిటరింగ్‌లో ఈ ఆ క్సీమీటర్ పాత్ర చాలాకీలకం. ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్ యూజర్లకు ఇది పరిమితం. త్వరలో ఐఓఎస్ వినియోగదారుల కోసం ప్రారంభించబడుతుంది. ఫైన్ పల్స్‌తో స్మార్ట్‌ఫోన్ కాస్తా ఆక్సీమీటర్గా మారిపోతుంది. ఇలా చెక్ చేసుకోండి: ► గూగుల్ ప్లేస్టోర్‌లో mfine యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ► మెజర్ యువర్ బ్లడ్ ఆక్సీజన్ లెవల్స్పైన క్లిక్ చేయండి. ► మెజర్ బటన్‌పైన క్లిక్ చేయండి. ► తర్వాత మీ చేతి వేలిని బ్యాక్ కెమెరాపై 20 సెకన్ల పాటు ఉంచండి ► అంతే రెండు సెకన్లలో మీ ఆక్సిజన్ లెవల్స్ డిస్ప్లే అవుతాయి. -
మొబైల్ పోయిందా? కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త. తస్కరించిన ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. దొంగిలించబడిన మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బిఎస్ఎన్ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల, రీగ్రామింగ్‌తో సహా భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) దీన్ని చేపట్టింది.కోల్పోయిన లేదా కొట్టేసిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అన్ని నెట్ వర్క్‌లలో బ్లాక్ చేయడం, మొబైల్ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నిరోధించడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇతర ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్సెట్లను గుర్తించడానికి అనుమతిస్తుంది. ఫోన్ పోతే ఫిర్యాదు ఎలా చేయాలి మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా అది ఎవరైనా దొంగిలించినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్‌లైన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్)కి తెలియజేయాలి. దీంతో సత్త్వరమే డాట్ మీ ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో దీన్ని ఉపయోగించడం కుదరదు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్‌కు సహకరిస్తాయి.