Treasury
-
రత్న భాండాగారం రహస్యం ఇదే
-
బీజేపీ సంచలన నిర్ణయం..
-
భారత్‌కు 100 టన్నుల బంగారం
ముంబై: బ్రిటన్ వాల్టుల్లో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ దేశీ ఖజానాకు తరలించింది. 1991లో భారత్ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించేందుకు పసిడిని తాకట్టు పెట్టిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించడం ఇదే ప్రథమం అని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి. రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నా యి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్‌పూర్‌లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొ త్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగ్గనున్న వ్యయాలు.. ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనడానికి దేశాలు కొన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలైన వాటి వాల్ట్‌లలో సురక్షితంగా నిల్వ చేస్తుంటాయి. ఇందుకు కొంత చెల్లిస్తుంటాయి. తాజాగా బంగారాన్ని మన దేశానికి తరలించి, ఇక్కడే నిల్వ చేయ డం వల్ల విదేశీ కస్టోడియన్లకు చెల్లించాల్సిన స్టోరేజీ ఫీజుల భారాన్ని ఆర్బీఐ తగ్గించుకోగలుగుతుంది. -
ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త!
మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. ఉక్రయిన్తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం -
ఆధార్‌తో 58వేల కోట్లు మిగిలాయ్!
వాషింగ్టన్: ఆధార్ కార్డు పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 900 కోట్ల డాలర్లు (రూ.58.22వేల కోట్లు) మిగిలాయని ఈ పథకం రూపశిల్పి నందన్ నీలేకని వెల్లడించారు. వాషింగ్టన్లో ‘డిజిటల్ ఎకానమీ–అభివృద్ధి’ అంశంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఈయన పాల్గొన్నారు. వందకోట్లకు పైగా భారతీయులు ఆధార్ నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆధార్ కారణంగా లబ్ధిదారుల గుర్తింపులో అవినీతి గణనీయంగా తగ్గిందని నీలేకని పేర్కొన్నారు. ‘ఆధార్ వల్ల ప్రభుత్వానికి దాదాపు 9 బిలియన్ డాలర్లు మిగిలాయి. విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా నకిలీలను అరికట్టడంతో సరైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. -
రూ.760 కోట్లు ఇన్పుట్ అప్లోడ్
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీలో భాగంగా శనివారం నాటికి రూ.760 కోట్ల పరిహారంకు సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్లలో రూ.760 కోట్లు బిల్లులు ట్రెజరీకి సమర్పించినట్లు తెలిపారు. ఇందులో రూ.500 కోట్లకు పైగా పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు తెలుస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లో అప్లోడ్, పంపిణీ పూర్తీ చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆ తర్వాత మిస్‌మ్యాచింగ్ జాబితాలు బ్యాంకుల వారీగా సేకరిస్తామని తెలిపారు. -
GHMC ఖజానాకు గండి
-
అవినీతి నిరోధానికి ట్రెజరీలో కొత్త విధానం
‘ఈ కుభేర్’ ద్వారా చెల్లింపులు సాక్షి, అమరావతి: ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, అవినీతిని అరికట్టేందుకు ఆర్థిక శాఖ కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించే ‘ఈ కుభేర్’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం వల్ల ట్రెజరీల్లో కుంభకోణాలు జరిగే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మానిటరింగ్ సిస్టం (సీఎఫ్ఎమ్ఎస్)ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ట్రెజరీల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు తేలడంతో ప్రత్యేక విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకుల వారు ట్రెజరీలకు పంపిస్తున్న ఈ చెక్‌ను ఆయా ఖాతాలకు జనరేట్ చేసే సందర్భంలో నిధులు స్వాహా అవుతున్నందున ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎఫ్ఎమ్ఎస్ సిస్టం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీల్లో బిల్స్ జనరేట్ చేసే వారికి ప్రత్యేకంగా బయోమెట్రిక్ ట్రెజరీల్లో ఎవరెవరికి ఎటువంటి బిల్స్ ఇచ్చారో వివరాలు నమోదు చేసిన తరువాత వారు జనరేట్ చేస్తున్న బిల్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా బయోమెట్రిక్ మిషన్‌లో ఆ ఉద్యోగి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆన్లైన్లో ఏ ఉద్యోగి, ఏ అధికారి ద్వారా ఏ బిల్లు జనరేట్ అయిందో తెలిసి పోతుంది. దీంతో అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులను పట్టుకోవడం సులువు అవుతుంది. సీఎఫ్ఎంఎస్ సిస్టం అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖకు కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి. నిధులు స్వాహా అయ్యే అవకాశమే లేదని ఆర్థికశాఖ భావిస్తున్నది. -
గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన
►ఆర్నెళ్లుగా పత్తాలేని రెగ్యులర్ డీడీ ►మేడ్చల్ ఏటీఓకు ఇన్చార్జీ బాధ్యతలు ►సక్రమంగా లేని ఇన్చార్జి డీడీ పనితీరు ►అడ్డగోలుగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు ►రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగులు ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్నెళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) లేక జిల్లా ట్రెజరీ కార్యాలయ పాలన గాడితప్పింది. ఈ ప్రభావం బిల్లులు పాస్ చేయడం ఎస్టీఓలకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా శాఖలో ఇద్దరు సీనియర్ ఏటీఓలు ఉండగా.. మేడ్చల్ ట్రెజరీ శాఖ ఏటీఓ మోహన్‌రావుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించడం శాఖలోని సీనియర్ ఏటీఓలతోపాటు ఎస్టీఓలను కూడా తీవ్ర నిరాశ పర్చింది. ఇన్చార్జి డీడీగా వచ్చిన మేడ్చల్ ఏటీఓ పనితీరు సక్రమంగా లేకపోవడం.. అడ్డగోలుగా అక్రమ డిప్యూటేషన్లు, అలాగే మహిళా ఉద్యోగులను పని పేరిట వేధిస్తున్నారనే ఆరోపణలతో 25 రోజుల క్రితం జిల్లా ట్రెజరీ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ కేఎస్‌ఆర్‌సీ మూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు ప్రస్తుతం అనారోగ్యం పేరిట సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ట్రెజరీ ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర డైరెక్టర్ విచారణకు ఆదేశించగా.. ఇంత వరకు విచారణ జరగలేదు. ఆయన తీరే వేరు.. ట్రెజరీ శాఖకు రెగ్యులర్ డీడీగా గతేడాది ప్రభాకర్‌రెడ్డి పని చేశారు. ఆయన 2016 సెప్టెంబర్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు జిల్లాకు ఆర్థికంగా కీలక శాఖ అయిన ట్రెజరీకి రెగ్యులర్ డీడీ లేరు. మధ్యలో హైదరాబాద్‌కు చెందిన యాదగిరికి ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించగా ఆయన కొద్ది రోజులు మాత్రమే పని చేశారు. తరువాత మేడ్చల్‌కు చెందిన ఏటీఓ మోహన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే శాఖలో విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మేడ్చల్ నుంచి జిల్లాకు వచ్చే సరికి మధ్యాహ్నం 3 గంటలు కావడం, తిరిగి సాయంత్రమే విధులు ముగించుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఆయన వచ్చినప్పుడే రిజిస్టర్లో సంతకాలు చేసేవారు. కాగా.. మహిళ ఉద్యోగినులను రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేయించి ఇబ్బందులకు గురి పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. చివరికి రాత్రుల్లో పని చేసే వాచ్‌మన్‌తో పగలు కూడా పని చేయిస్తున్నట్లు తెలిసింది. నచ్చినట్లుగా డిప్యూటేషన్లు శాఖలో ఇన్చార్జి డీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్‌రావు తనకు నచ్చిన విధంగా ఉద్యోగులను డిప్యూటేషన్ల పేరిట వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పక్షం రోజుల క్రితం కొంత మంది అటెండర్లను ఇష్టం లేకున్నా ఎస్టీఓ కార్యాలయాలకు డిప్యూటేషన్లతో బదిలీ చేశారు. సీనియర్ అకౌంటెంట్ రవి కిరణ్‌ను ఇష్టం లేకున్నా బోధన్ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌పై వేయించారనే ఆరోపణలు ఉండగా, ఎస్టీఓ గంగాకిషన్‌ను కూడా జిల్లా కార్యాలయం నుంచి భీమ్‌గల్, మళ్లీ భీమ్‌గల్ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్ ఆర్డర్లను తీశారు. నెల రోజుల్లోనే 36 డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించిన ఆఫీస్ ఆర్డర్లును తీశారు. కాగా తనపై రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగిని బిల్లులేవి పాస్ చేయవద్దని సంబంధిత అధికారులకు ఇన్చార్జి డీడీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ట్రెజరీ శాఖలో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు బాటలోనే శాఖలో పని చేస్తున్న ఓ మహిళా ఇన్చార్జి ఏటీఓ కూడా నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు బిల్లులను పాస్ చేయకుండా తిరిగి పంపుతున్నారని తెలిసింది. ఇబ్బందుల్లో ట్రెజరీ ఉద్యోగులు రెగ్యులర్ డీడీ లేకపోవడం, ఉన్న ఇన్చార్జి డీడీ శాఖను పట్టించుకోకుండా అనారోగ్యం కారణంతో సెలవులో వెళ్లడంతో ట్రెజరీ శాఖ పాలన గాడితప్పుతోంది. ముఖ్యంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి ముగింపు కావడంతో జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు బిల్లులను పాస్ చేయించుకోవడం కోసం ట్రెజరీ కార్యాలయంలో రోజు బారులు తీరుతున్నారు. కానీ.. డీడీ లేకపోవడంతో పెన్షన్, తదితర ముఖ్యమైన బిల్లులు నిలిచిపోతున్నాయి. సమస్యలు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో డీడీఓలకు పాలు పోవడం లేదు. ఇటు ఎస్టీలు కూడా డీడీ లేకుండా పని చేయడం ఇబ్బందిగా మారింది. మార్చి నెలాఖరితో ప్రభుత్వానికి బడ్జెట్‌ను సరెండర్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం డీడీ లేక పనులు నిలిచిపోతున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం ట్రెజరీ శాఖకు తాత్కాలికంగా అధికారిగా వ్యవహరిస్తున్న ఏటీఓ పుష్పలతను ‘సాక్షి’ వివరణ కోరగా.. డీడీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఫైళ్లను మేడ్చల్ వరకు తీసుకెళ్లి ఇన్చార్జి డీడీ మోహన్‌రావుతో సంతకాలు చేసుకుని వస్తున్నామని, బిల్లులు అన్నింటినీ పాస్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. -
గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు...
ఉదయగిరి : ఉదయగిరి ప్రాంతం చుట్టూపక్కల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలిసింది. కొన్నేళ్ల నుంచి ఉదయగిరి కొండపై ఉన్న పురాతన స్థావరాలపై విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. గత పది పదిహేను రోజుల నుంచి ఉదయగిరి దుర్గంపై కొంత మంది స్థానికులు, స్థానికేతరులు ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రమేయముందని భావిస్తున్న కొంత మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో అనంతసాగరం చెరువును గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో ఉదయగిరి వాసులు ఉన్నారు. -
ఖజానా ఖాళీ
- తలకిందులవుతున్న జెడ్పీ - పెద్ద నోట్ల రద్దుతో తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు - పడిపోయిన స్టాంప్ డ్యూటీ ఆదాయం - ఉచిత ఇసుకతో సీనరేజి ఆదాయానికీ గండి - అందని ఆర్థిక సంఘం నిధులు - గ్రాంటు ఇవ్వని ప్రభుత్వం - వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమంటున్న యంత్రాంగం భానుగుడి (కాకినాడ సిటీ) : పెద్ద నోట్ల రద్దు.. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జిల్లా పరిషత్ నడ్డి విరుగుతోంది. వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయానికి గండి పడడంతో ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి తలకిందులవడంతో.. వచ్చే నెలలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కష్టమేనని స్వయంగా జెడ్పీ చైర్మనే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటు పోటు పాత రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారిపై ఆదాయపన్ను శాఖ ఓ కన్ను వేయడంతో.. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు 70 శాతం పైగా పడిపోయాయి. జీఓ నంబరు 725/1998 ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి జెడ్పీకి స్టాంపు డ్యూటీ, సర్‌చార్జి రూపంలో 1/5వ వంతు సొమ్ము జమ చేయాలి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ రూపంలో రూ.12,19,39,000 జెడ్పీకి జమ అయ్యింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆదాయం రూ.27 లక్షలకు మించలేదు. స్టాంపుడ్యూటీ, సర్‌చార్జి రూపంలో ఏడాదికి రూ.24 కోట్లు పైగా రావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 50 శాతం మాత్రమే వచ్చింది. సీనరేజి ఆదాయానికి బ్రేక్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ దళారులకు కాసులు కురిపిస్తుండగా.. జెడ్పీ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొట్టింది. ఇసుక వేలం పాటల ద్వారా జెడ్పీకి మినరల్ సెస్సు సీనరేజి వాటా రూపంలో ఏటా రూ.100 కోట్లు పైగా ఆదాయం వచ్చేది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.33.12 లక్షలు వచ్చింది. అనంతరం మారిన ప్రభుత్వ నిబంధనలతో ఈ పద్దు కింద దమ్మిడీ ఆదాయం కూడా రాలేదు. మరోపక్క ప్రభుత్వం నుంచి జెడ్పీకి వివిధ పద్దుల రూపంలో రూ.59 కోట్లు రావాల్సి ఉంది. రెండేళ్ళ నుంచి ఈ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్థిక సంఘం నిధులు లేవు.. తలసరి గ్రాంటు రాదు గతంలో గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్‌ల నుంచి 14వ ఆర్థిక సం«ఘం నిధులు కేటాయించేవారు. కొద్దికాలంగా ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తున్నారు. దీంతో జెడ్పీకి వచ్చే నిధుల శాతం సగానికి పడిపోయింది. అలాగే, జనాభా లెక్కల ప్రకారం 41,76,541 మందికి తలసరి రూ.4 చొప్పున గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ రూ.75 లక్షల గ్రాంటు విడుదల చేశారు. తదనంతర కాలంలో ఈ నిధులు సైతం ప్రభుత్వం నుంచి సకాలంలో రావడంలేదు. ఆదాయం రూ.27 లక్షలు.. పెన్షన్లకు రూ.43 లక్షలు.. జెడ్పీలో పదవీ విరమణ పొందిన 465 మంది మినిస్టీరియల్ సిబ్బందికి ప్రతి నెలా రూ.43 లక్షల పెన్షన్ చెల్లిస్తున్నారు. ఇసుక సీనరేజి, స్టాంపు డ్యూటీ, ఇతర పద్దుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెన్షన్లు, ఇతర పనులకు కేటాయించేవారు. ప్రస్తుతం ఖజానాలో రూ.27 లక్షలు మాత్రమే ఉంది. దీంతో వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమని సాక్షాత్తూ జెడ్పీ చైర్మనే చేతులెత్తేస్తున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది రిటైరైన 21 మంది దరఖాస్తులను కూడా జెడ్పీ స్వీకరించలేదు. దీనిపై వారు లోకాయుక్తను కూడా ఆశ్రయించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం వచ్చే నెల నుంచి జెడ్పీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.59 కోట్లు తక్షణమే ఇచ్చి ఆదుకోవాలని కోరాం. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. నిధులు రాకుంటే వచ్చే నెలలో పెన్షన్లు ఇవ్వలేం. - నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ -
చెల్లింపులకు బ్రేక్
నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు ఆరో తేదీ నుంచి ఇదే పరిస్థితి ఖాతాలను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం సాంకేతిక సమస్యే కారణమంటున్న అధికారులు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు పుష్కరాలు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆర్థిక లోటు ఉందంటూ వారికి సంబంధించిన వివిధ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. పలు ఖాతాలను సర్కారు ఫ్రీజ్ చేయడంతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రామచంద్రపురం రూరల్ : జిల్లా ఖజానా కార్యాలయంలో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఆర్థిక లోటు పేరుతో వివిధ ఖాతాలను ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి పలు హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సంబంధిం చిన వివిధ బిల్లులతోపాటు, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా నిలిపివేశారు. సరెండర్ లీవ్, టీఏ, కార్యాలయ నిర్వహణ, సప్లిమెంటరీ జీతాలు, జీపీఎఫ్, విద్యార్థుల స్కాలర్షిప్, అంగన్వాడీ వేతనా లు తదితర వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన వాటి లో ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమవరకూ వచ్చేసరికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి సొమ్ము తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం వీటి చెల్లింపులు కూడా నిలిపివేసింది. టీఏ బిల్లుల పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్యోగులు సొంత ఖర్చుతో హాజరై, ధించిన బిల్లులు పెట్టుకుంటారు. వీటి చెల్లింపులను కూడా నిలిపివేశారు. కార్యాలయ నిర్వహణ బిల్లులను కూడా నిలిపివేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీ వేతనాలను కూడా కార్యాలయ నిర్వహణ పద్దు నుంచి ఇస్తారు. వీటిని కూడా నిలిపివేశారు. -
చెల్లింపుల్లేవ్
ట్రెజరీలో బిల్లులు నిలిపివేత వేలల్లో పేరుకుపోతున్న బిల్లులు రూ.150 కోట్ల మేర చెల్లింపులకు బ్రేక్ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలపై ఆంక్షలు ఖజానా మళ్లీ తెల్లమొహం వేసింది. కాసులు విదల్చను పొమ్మంది. దాంతో చెల్లింపులకు బ్రేక్‌పడింది. ట్రెజరీ ఉసూరనే పరిస్థితి ఎదురైంది. విస్తృతంగా చెల్లింపులు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖజానా స్తంభన కారణంగా వందల కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటిలో రూ. 100 కోట్ల వరకు ఉపకార వేతనాలే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో తగిలిన షాక్ కారణంగా రాబడి తగ్గడంతో, మార్చి జీతాల కోసం ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గడిచిన మూడు నెలలుగా ఖజానాకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. రిజిస్ట్రేషన్స్, సేల్, కమర్షియల్ టాక్స్‌ల వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. నోట్ల రద్దు సమయంలో నిధుల కొరత కారణంగా డిసెంబర్లో ట్రెజరీ చెల్లింపులపై ఆంక్షలు విధించారు. జనవరిలో మాత్రం చెల్లింపులపై ఆంక్షలు ఎత్తివేశారు. గత నెల రోజులుగా చెల్లింపులు సజావుగానే సాగినా మళ్లీ ఫిబ్రవరిలో చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఈ నెల 8 నుంచి ట్రెజరీ ద్వారా జరిగే అన్ని రకాల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడం, ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో జీతాల చెల్లింపులకు ఆటంకం తలెత్తకుండా ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు. నెలాఖరులో వెయ్యికిపైగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నిత్యం 500కు పైగా బిల్లులొస్తుంటాయి. నెలాఖరులో అయితే ఏకంగా వెయ్యికిపైగా ఉంటాయి. సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం 50 నుంచి 70 వరకు.. నెలాఖరులో 150 నుంచి 200 వరకు బిల్లులొస్తుంటాయి. రోజువారీ చెల్లింపులకు ఇక్కట్లు ట్రెజరీ ద్వారా వివిధ శాఖల రోజు వారీ ఖర్చులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం నాలుగైదు కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతుంటాయి. కారణాలు కూడా చెప్పకుండా 8 నుంచి ట్రెజరీ ద్వారా చెల్లింపులను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికే బ్యాంకులకు పంపిన బిల్లులను కూడా పాస్ కాకుండా ఆన్లైన్లో లాక్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువే రూ.150 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ మరో రూ.50 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. నిధులొచ్చినా.. మోక్షం లేదు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లాకు ఇటీవలే నిధులొచ్చాయి. వీటి కోసం ఆయా విద్యాసంస్థలు ఎదురు చూస్తున్నాయి. తమకు రావాల్సిన ఫీజు బకాయిలకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్‌తో ట్రెజరీకి బిల్లులు పెట్టాయి. ఉపకార వేతనాలకు చెందిన బిల్లులు కూడా దాఖలయ్యాయి. ఈ నెల 8 నుంచి వీటిని నిలిపి వేశారు. ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద చెల్లించాల్సిన రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు ఆగిపోయాయని చెబుతున్నారు. ఇతర బిల్లులకు సంబంధించి మరో రూ.50 కోట్ల వరకు చెల్లింపులకు బ్రేకులు పడ్డాయంటున్నారు. జీతాలకు ఇబ్బంది లేకుండా.. శనివారం నుంచి జీతాలకు చెందిన బిల్లులు శాఖల వారీగా ట్రెజరీకి చేరుతున్నాయి. మార్చి 1న జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఆంక్షలు మార్చి నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే నెల ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో జీతభత్యాల వరకు చెల్లింపులకు ఇబ్బంది లేకున్నప్పటికి మిగిలిన చెల్లింపులకు అనుమతి నిచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలు రోజువారీ కార్యకలాపాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. -
ఖజానా కొర్రీలు
అడిషనల్ హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఇబ్బందులు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా పట్టించుకోని ట్రెజరీ అధికారులు రెండేళ్లుగా పెండింగ్‌లోనే.. హన్మకొండఅర్బన్ : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాల్సిన అదనపు హెచ్ఆర్ఏను ట్రెజరీ అధికారులు కొత్త నిబంధనలు చెపుతూ నిలిపివేశారు. 2015 ఏప్రిల్ నుంచి ఒక్కో ఉద్యోగి వేతనంతో పొందాల్సి ఉన్న సుమారు రూ.2వేల వరకు నగదు అందడం లేదు. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇటీవల టీఎన్జీఓస్ నేతలు అర్బన్ జిల్లా డీటీఓను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. ఎందుకు సమస్య.. ప్రస్తుతం అదనపు హెచ్ఆర్ఏ చెల్లింపులు చాలా జిల్లాలో డీటీఓలు విడుదల చేస్తున్నాయి. వరంగల్‌తోపాటు మరికొన్నిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2015 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలైన సమయంలో అదనపు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సంబందించి క్యాడర్ల వారీగా వివరాలు వెల్లడిచింది. అందులో ఎవరికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో ఏఎన్ఎంలను మెటర్నటీ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. ఆ క్యాడర్ వారికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో మొదట 1960 నుంచి మెటర్నటీ అసిస్టెంట్లుగా ఉన్నవారిని తరువాత క్రమంలో వారి హోదాను1984లో ఏఎన్ఎంలుగా మార్చారు. ఆ తరువాత ఎన్ఎంల హోదాను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్(ఎంపీహెచ్‌ఏఎఫ్) అని మార్చారు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎంపీహెచ్ఏ(ఎఫ్) అని లేనందున వారికి ఏహెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేమని అందుకు రూల్స్ ఒప్పుకోవని డీటీఓలు బిల్లులు పాస్ చేయలేదు. దీంతో సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఈ విషయంలో స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాలోని ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ బిల్లులు పాస్ చేసి ఏహెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్బన్‌తో పాటు కొన్ని డీటీఓల్లో అధికారులు ససేమిరా అంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నారు. టి.మాధవరెడ్డి టీఎన్జీఓస్(మెడికల్) అధ్యక్షుడు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చింది. మెటర్నటీ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఒకటే అని చెప్పారు. ఈ విషయంలో కొన్ని డీటీఓల్లో అధికారులు బిల్స్ పాస్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఉద్దేశ పూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు ఉద్యోగులు సకాలంలో పొందకుండా చేయడం మంచిదికాదు. ఈ విషయంలో కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతాం. -
మైనింగ్ ఆదాయమే కీలకం
కొలిమిగుండ్ల: ఏపీకి వచ్చే ఆదాయ వనరుల్లో మైనింగ్ శాఖ కీలకంగా మారిందని భూగర్భ గనుల శాఖా మంత్రి పీతల సుజాత అన్నారు. నాపరాతిపై ఆన్లైన్ రాయల్టీ ధరను ప్రభుత్వం 8 నుంచి 5శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లె హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో అభినందనసభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత హాజరయ్యారు. చరిత్రలో మొదటి సారిగా డిస్టిక్ మినరల్ ఫండ్(డీఎంఎఫ్)ను ప్రభుత్వం 30 నుంచి 10 శాతానికి తగ్గించినట్లు గుర్తు చేశారు. డీఎంఎఫ్ ద్వారా ఏటా కర్నూలు జిల్లా నుంచి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోందని.. వాటిని జిల్లా అభివృద్ధికే వెచ్చించేలా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అపార ఖనిజ సంపద విస్తరించినందునా పరిశ్రమల హబ్‌గా మార్చే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమెంట్ కంపెనీలు సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే లీజు రద్దు చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ రాష్ట్ర డైరక్టర్ శ్రీధర్, శిశు సంక్షేమ శాఖ ఆర్జెడీ శారద, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ట్రెజరీ డీడీగా రాజు
నల్లగొండ నుంచి పదోన్నతిపై జిల్లాకు హన్మకొండ అర్బన్ : జిల్లా ట్రెజరీ డి ప్యూ టీ డైరెక్టర్‌గా జి.రాజును నియమిస్తూ ప్ర భుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. రాజు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పదోన్నతిపై జిల్లాకు డీడీ గా వస్తున్నారు. జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తు న్న సత్యనారాయణ పదోన్నతిపై నల్లగొండ జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. కాగా రాజు శనివారం విధుల్లో చేరనున్నారు. ఎస్టీఓ రమేష్‌కు పదోన్నతి.. ప్రస్తుతం డీటీఓలో వైద్య విభాగం ఎస్టీఓగా పనిచేస్తున్న రమేష్ ఏటీఓగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. -
కొత్త జిల్లాల్లో తొలి రోజే ట్రెజరీలు
జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసులకు అవసరమైన భవనాలను గుర్తించి, అవసరమైన ఫర్నీచర్‌ను సమకూర్చాలని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తొలిరోజు నుంచే ట్రెజరీ అకౌంట్లను ప్రారంభించి, ట్రెజరీ కార్యాలయాలు పని చేసేలా చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసేటప్పుడు పదోన్నతులకు సంబంధించి పాత సీనియారిటీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాని ఆధారంగానే పదోన్నతులు వస్తాయని ప్రకటించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, సీనియారిటీ, పోస్టుల సంఖ్య వివరాలను వెంటనే పంపించాలని ఆదేశించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమ పద్ధతిలో ఆయా జిల్లాలకు అందించాలని చెప్పారు. ఫైళ్ల వివరాలను నమోదు చేయడానికి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సూచించారు. కొత్త జిల్లాలకు కావాల్సిన ఉద్యోగులు, ఫర్నీచర్, ఫైళ్లు, వసతి సదుపాయాలు తదితర అంశాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రాజకీయ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. -
ట్రెజరీకి తాళాలు
సాక్షి, విశాఖపట్నం : ట్రెజరీకి మళ్లీ తాళాలు పడ్డాయి. చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లోనే సర్వర్‌ను బంద్ చేశారు. దీంతో ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులన్నింటికి బ్రేకులు పడ్డాయి. రోజుకు రూ.20కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోగా..చివరకు తొలిసారిగా అంత్యక్రియల ఖర్చుల కోసం జరిపే చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. జిల్లా కార్యాలయంలో రోజుకు 200 నుంచి 500 వరకు బిల్లులు పాస్ చేస్తుంటారు. అదే ఒక్కొ సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలో రోజుకు 30 నుంచి వంద వరకు ఉంటాయి. జిల్లా ట్రెజరీ కార్యా లయ పరిధిలో రోజుకు ఐదారుకోట్లవరకు చెల్లింపులు జరుగుతుంటాయి.అదే ఒక్కో సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలో రోజుకు రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటాయి. జీతభత్యాలు కాకుండా జిల్లాలో రోజువారీ చెల్లింపులు రూ.20కోట్ల వరకు ఉంటాయి.ప్రతిరోజు శాఖల వారీగా వచ్చే బిల్లులకు తొలుత ఆయా ట్రెజరీ కార్యాలయాల్లో టోకన్ ఇస్తారు. మూడు దశల్లో వాటిని ఆడిట్ చేసిన తర్వాత పాస్ చేస్తారు. బ్యాంక్‌లకు లిస్ట్‌లు పంపిస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆతర్వాత 25 బిల్లులు ఓ కట్టగా పంపిస్తారు. అలా వచ్చిన బిల్లులు, ఆన్లైన్లో తమ వద్దకు వచ్చిన లిస్టుల్లో ఉన్న బిల్లులను సరి చూసుకుని బ్యాంకులు పేమెంట్స్ చేస్తుంటాయి. సాధార ణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రతి ఏటా మార్చి నెలాఖరున ట్రెజరీపై ఆంక్షలు విధిస్తుంటారు. ఎవరైనా ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియలకయ్యే ఖర్చుల కోసం ముందస్తుగా జరిపే చెల్లింపులతో పాటు కొన్ని రకాల పేమెంట్స్ వరకు మినహాయింపు నిస్తారు. కానీ ట్రెజరీ చరిత్రలో తొలిసారిగా మొత్తం చెల్లింపులన్నింటిని బంద్ చేసారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులపై ఆంక్షలు విధించినట్టు ట్రెజరీవర్గాలు చెబుతున్నాయి. పుష్కరాల సాకుతో ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో సాధారణ చెల్లింపులకు సైతం బ్రేకులు పడ్డాయి. ట్రెజరీ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్లోనే ఓప్రత్యేక సర్వర్ ఉంటుంది. ఈసర్వర్ ఆధారంగానే ఆన్లైన్లో చెల్లింపులు జరుపుతుంటారు. ప్రస్తుతం ఈసర్వర్ను ఆపేశారని ట్రñ జరీ అధికారులు చెబుతు న్నారు. దీంతో రోజువారీ వివిధ శాఖలకు సంబంధించి జరిపే చెల్లింపులతోపాటు ఉద్యోగ వర్గాలకు ఇచ్చే లీవ్ ఎన్‌కేష్‌మెంట్ పేమెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సెటిల్మెంట్స్ను సైతం నిలిపివేశారు. అలాగే ప్యూనరల్ పేమెంట్స్‌తోపాటు రోజువారీ ఖర్చు లకు సంబంధించిన బిల్లులకు సైతం బ్రేకులుపడ్డాయి. ఇలా రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వాదేశాల మేరకే గురువారం నుంచి సర్వర్‌ను ఆపేశారని చెబుతున్నారు.పుష్కరాలయ్యే వరకు ఈ సర్వర్ పనిచేయదని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులంటున్నారు. -
యాహ్యా కేసులో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై విచారణ
కామారెడ్డి: ఉద్యోగం చేయకుండానే ఉద్యోగ విరమణ పేరుతో ప్రభుత్వం నుంచి పింఛన్ పొందే ప్రయత్నంలో చిక్కిన యాహ్యా వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై ఆ శాఖ జిల్లా ఉప సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ నిర్వహించారు.స్థానిక ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన ఆయన అప్పట్లో పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడారు. యాహ్యాకు ఎవరు సహకరించారన్న విషయాలను తెలుసుకున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరపడానికి తాను వచ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. -
సర్కారు ఆర్థిక ఎదురీత!
* ఆదాయ వృద్ధిని మించిన ఖర్చులు * ఇరిగేషన్‌కు ఈ నెలలో బిల్లుల చెల్లింపు వాయిదా * అత్యవసరమైతేనే మిగతా బిల్లులివ్వాలని ట్రెజరీలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మాత్రం ఆర్థికంగా ఎదురీదుతోంది. ఖర్చులన్నీ ఒక్కసారిగా ముంచుకురావటంతో గడ్డు కాలాన్ని చవిచూస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యోగుల జీతాలు మినహా ఇతరత్రా బిల్లుల చెల్లింపులన్నీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఆర్థికశాఖ మౌఖిక అదేశాలు జారీ చేసింది. జీతాలు మినహా బిల్లులేవీ విడుదల చేయొద్దని ఆంక్షలు విధించింది. రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడతగా ఇవ్వాల్సిన రూ. 4,040 కోట్లలో రూ. 2,020 కోట్లను ఇటీవలే విడుదల చేసిన ప్రభుత్వం మిగతా సగం నిధులను ఈ నెలాఖరున చెల్లించాల్సి ఉంది. దీంతో రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయడాన్ని ఈ నెలలో ఆర్థికశాఖ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదలశాఖ పరిధిలో ఈ నెలలో ఇవ్వాల్సిన బిల్లులను నిలిపివేసింది. ఈ ఏడాది బడ్జెట్లో నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా చేపట్టేందుకు ఈ శాఖకు ప్రతి నెలా రూ. 2,000 కోట్లు చెల్లిస్తోంది. తొలి మూడు నెలలు నిధులు విడుదల చేసిన ఆర్థికశాఖ ప్రస్తుత ఇక్కట్ల దృష్ట్యా జూలై కోటాను విడుదల చేయలేదు. దీంతో ప్రాజెక్టుల పరిధిలో బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కొన్ని బిల్లుల చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే చెల్లించాల్సిన బిల్లులు వారం వాయిదాపడే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆదాయం పెరిగినా ఖర్చులెక్కువ గతేడాదితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 24 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 10 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. తొలి రెండు నెలల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా వచ్చిన ఆదాయం నిరుటి కంటే 64 శాతం పెరిగింది. ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం, అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే ఈ నెల అంతకుమించి ఖర్చులుండటంతో నిధుల కటకట తలెత్తింది. సగటున ప్రతి నెలా రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు మించదు. కానీ రూ. 5,000 కోట్లకు మించి ఈ నెల చెల్లింపులు చేయాల్సి ఉండటంతో సమస్య తలెత్తిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు రైతుల రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు చెల్లింపులు, విద్యుత్, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులన్నీ ఏకకాలంలో చుట్టుముట్టాయి. దీనికితోడు ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం సమకూరకపోవటం ప్రతికూలంగా మారింది. పెండింగ్‌లోనే ఇన్పుట్ సబ్సిడీ జూన్‌లోనే మూడో విడత రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు సమకూర్చటం అనివార్యం కావటంతో ముందుగా ఈ నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. అందుకే ఖరీఫ్ సమయం ముంచుకొచ్చినా కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని సైతం పెండింగ్‌లో పెట్టింది. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 820 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ. 198 కోట్లు జత చేయాల్సి ఉంది. కానీ నిధుల కటకటతోనే ఇప్పటికీ చెల్లింపులు చేయలేదు. ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు ఈ నెలలో పెంచాల్సిన డీఏ, తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టింది. సర్వర్ డౌన్ పేరుతో దాదాపు రూ. 3,000 కోట్లకుపైగా బిల్లులు ఆపేసినట్లు వివిధ శాఖల అధికారులు చెబుతున్నారు. మరోవైపు సెర్ప్ ఉద్యోగుల జీతాలకు ఆసరా పెన్షన్లు, ఎన్ఆర్ఎల్ఎం పథకాలకు వినియోగించే నిధులను దారి మళ్లించి వేతనాలు సర్దుబాటు చేసింది. -
ఖజానా భర్తీకి ‘పంచతంత్రం’
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు జీహెచ్ఎంసీ శరవేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ.500 కోట్లు డ్రా చేసుకున్న జీహెచ్ఎంసీ.. పరిస్థితి మెరుగపడకుంటే రెండునెలల తర్వాత సిబ్బంది వేతనాల చెల్లింపులు సైతం కష్టంగా మారనుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఐదు రకాల పన్నుల ద్వారా ఆదాయం పెంపునకు పంచతంత్రాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ట్రేడ్ లెసైన్సుల ఫీజులపై దృష్టి సారించింది. ట్రేడ్ లెసైన్సుల కోసం జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలు 1.50లక్షల వరకు ఉన్నప్పటికీ వాటిల్లో 48 వేల సంస్థలు కూడా ఫీజులు చెల్లించడం లేదు. వాణిజ్యపన్నుల శాఖ వద్ద ఉన్న వివరాలను చూసినా లక్షా పదివేలకు పైగా వ్యాపారాలున్నాయి. వీటన్నింటినుంచీ రావాల్సిన ట్రేడ్ లెసైన్సు ఫీజు వసూలైతే జీహెచ్ఎంసీకి వంద కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం రూ. 30 కోట్లు కూడా వసూలు కాలేదు. దీంతో వ్యాపార సంస్థలన్నింటి వివరాలు జల్లెడ పట్టేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. ఇందులో భాగంగా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు మొదలు బిల్ కలెక్టర్లు, లెసైన్స్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బందితో సహ సమస్త యంత్రాంగం వ్యాపార సంస్థల వివరాలన్నింటినీ సేకరించనుంది. ఆపై ట్రేడ్ లెసైన్సులు లేని వారిని లెసైన్సులు తీసుకునేలా చర్యలు చేపడతారు. లై సెన్సులున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఆన్లైన్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించే విధానాన్ని వివరిస్తారు. ఇలా..అతిత్వరలో ట్రేడ్ లెసైన్సుల ఫీజుల కోసం స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలని కార్యాచరణ సిద్ధం చేశారు. అంతేకాకుండా లెసైన్సు పరిధిలోకి కొత్త సంస్థలను తేనున్నారు. మొబైల్ కంపెనీలు, వైన్స్ దుకాణాలు, హాస్టళ్లు తదితరమైన వాటికి సంబంధించి ట్రేడ్‌లెసైన్సు ఫీజులు వసూలు చేసే అంశంలో స్పష్టత లేదు. వీటిపై స్పష్టత నిస్తూ జీవోలను సవరించే అవకాశం ఉంది. -
ట్రెజరీలో కుర్చీలాట
కీలక సెక్షన్ల కోసం కుమ్ములాట ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు విభేదాలతో బజారుకెక్కుతున్న ఖజానా శాఖ సామాజిక వర్గాలుగా విడిపోయిన వైనం కరీంనగర్/ముకరంపుర: కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో కుర్చీలాట తారాస్థాయికి చేరింది. ఉద్యోగుల మధ్య ఆధిపత్యపోరు, అవినీతి ఆరోపణలు ఆ శాఖను బజారుకీడుస్తున్నాయి. కీలక సెక్షన్లలో తమ వర్గానికి చెందిన ఉద్యోగులే కూర్చోవాలనే పట్టుదలతో ఉన్న కొందరు నాయకులు ఈ గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. ఒకరిద్దరు నాయకులైతే ఏకంగా కులం కార్డును కూడా ప్రయోగిస్తుండటంతో ఖజానా శాఖ ఉన్నతాధికారు లు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారి మెతకతనంవల్లే ఇదంతా జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తుంటే... ఒక సామాజికవర్గానికే సదరు ఉన్నతాధికారి వత్తాసు పలుకుతూ తమను పక్కనపెడుతున్నారంటూ మరో సామాజికవర్గ ఉద్యోగులు రుసరుసలాడుతున్నారు. తాజాగా సెక్షన్ల మార్పు వ్యవహారం రెండు ఉద్యోగ సంఘాల మధ్య మరింత చిచ్చురేపింది. ఇరువర్గాల ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లారు. ఉద్యోగుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుతో బెంబేలెత్తిపోయిన ఉన్నతాధికారి తాను ఇక్కడ పనిచేయలేనంటూ కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. తప్పులను సరిదిద్దాల్సిందిపోయి... ఖజానా శాఖలో ఓ అధికారి పొరపాటు కారణంగా రూ.4.95 కోట్ల స్కాలర్షిప్ సొమ్ము అదనంగా ఖాతాల్లో జమ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు సొమ్ము రికవరీకి నానాపాట్లు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ నీతూప్రసాద్ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సూచించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఆ శాఖ డెరైక్టర్ భీమారెడ్డి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్కుల చెల్లింపులకు సంబంధించి అథరైజర్-1గా డీడీ, అథరైజర్-2గా ఎస్టీవో ఉండాలని ఆదేశించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఖజానా శాఖ కార్యాలయంలో రెండేళ్లకుపైగా ఒకే సీటులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ ఇతర సెక్షన్లకు మార్చాలని ఉప సంచాలకుడు శ్రీనివాస్ నిర్ణయం తీసుకుని గత నెల మూడో వారంలో సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య ఈ మేరకు ఒప్పుకున్నటు తెలిసింది. అయితే తాజాగా జరిగిన సెక్షన్ల మార్పులో స్కాలర్‌షిప్పు సొమ్ము అదనపు చెల్లిం పుల్లో బాధ్యుడిగా పేర్కొన్న అధికారికి ఆయన కోరుకున్న సీటును కట్టబెట్టారని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారి తీరుపై ప్రత్యర్థి ఉద్యోగులు మండిపడుతున్నారు. స్కాలర్షిప్ అదనపు చెల్లింపుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కోరుకున్న స్థానాన్ని కట్టబెట్టడమేంటని పేర్కొంటూ సదరు ఉన్నతాధికారిని కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే బజారునపడ్డ ఖాజానా శాఖ వ్యవహారంపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పాలనా సౌలభ్యం కోసమే సెక్షన్ల మార్పులు - ట్రెజరీ డీడీ శ్రీనివాస్ పరిపాలనా సౌలభ్యం కోసమే అంతర్గతంగా అధికారుల సెక్షన్లలో మార్పులు చేశాం. సెక్షన్ల మార్పు విషయంలో సామాజికవర్గ కోణం అంశం లేవనెత్తినందున ఎస్టీవో మల్లేశంకు పాత సెక్షన్ కేటాయించాం. -
పెట్రోల్, మద్యంతోనే ఖజానాకు కిక్కు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వృద్ధి రేటు ప్రధానంగా రెండు అంశాలపైనే ఆధారపడి ఉందని మరోసారి రుజువైంది. ఒకటి మద్యం, రెండోది పెట్రోల్ ఉత్పత్తులు. ఈ రెండింటి కారణంగానే 2015-16 బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా 95.4 శాతం పన్ను వసూళ్లు సాధ్యమైంది. రాష్ట్రంలోని 12 డివిజన్లతో పాటు పెట్రో ఉత్పత్తులు, మద్యం, ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూస్) నుంచి ఏడాదిలో రూ.31,117. 94 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అధికారులతో పని లేకుండానే.. వాణిజ్యపన్నుల శాఖకు మద్యం, పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నుల ద్వారానే సగం రెవెన్యూ సమకూరుతుండడం గమనార్హం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మద్యం నుంచి 'ఎక్సైజ్ బై వ్యాట్' ద్వారా రూ.8168.99 కోట్లు, పెట్రోల్, డీజిల్‌పై విధించే పన్నుల ద్వారా రూ.6485.48 కోట్లు వసూలైంది. సింగరేణి, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.1457.06 కోట్లు పన్నుల రూపంలో వసూలైంది. అంటే ఈ మూడు ప్రధాన పద్దుల ద్వారా వచ్చిన మొత్తం ఏకంగా రూ.16,111.53 కోట్లు కావడం గమనార్హం. ఈ మొత్తం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సంబంధం లేకుండా సర్కారు ఖజానాకు అందుతుండటం మరో విశేషం. రాష్ట్రంలోని 12 డివిజన్ల నుంచి అధికారులు, సిబ్బంది వసూలు చేసే పన్నులు రెవెన్యూ రూపంలో సమకూరుతున్నాయి. 12 డివిజన్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,006.40 కోట్లు వసూలైంది. 12 డివిజన్లలో కూడా పంజాగుట్టలో రూ. 2422.30 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్‌లోరూ. 314.32 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. -
వెయ్యి కోట్లు తాగేశారు
11 నెలల్లోనే రూ. 11,450 కోట్ల ‘మద్యం’ విక్రయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మందుబాబుల జోరుతో మద్యం విక్రయాలకు కిక్కొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది జిల్లాల్లో సగటున నెలకు రూ. వెయ్యి కోట్లకుపైగా విలువైన ‘సుక్క’ అమ్ముడైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు నెల ముందే (ఫిబ్రవరి నెలాఖరు వరకు) సుమారు రూ. 11,450 కోట్ల ఆదాయంతో ప్రభుత్వ ఖజానా గలగలలాడుతోంది. గత ఆర్థిక ఏడాది (2014-15) తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) రూ. 10,888 కోట్ల మద్యం అమ్మకాలు సాగించగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ఆ విక్రయాలను సంస్థ అధిగమించింది. ఈ నెలలో సాగే అమ్మకాలతో ఆదాయం రూ. 13 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు టీఎస్‌బీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. వేసవి ప్రభావం నేపథ్యంలో బీర్ల అమ్మకాలు ఈనెలలో పెరుగుతాయని భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, అనూహ్యంగా ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ. 2,656 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా ఆదిలాబాద్‌లో రూ. 1,629 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే దేశీదారుకు అడ్డుకట్ట వేయడం వల్లే ఆదిలాబాద్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఖమ్మం జిల్లాలో సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) అమ్మకాలు పెరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ అతితక్కువగా 553 కోట్ల మద్యమే అమ్ముడైంది. రెవెన్యూ రూ. 3,484 కోట్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఎక్సైజ్‌శాఖకు మద్యం విక్రయాల ద్వారా రూ. 11,450 కోట్లు, లెసైన్సు ఫీజుల రూపంలో రూ. 1,752 కోట్లు, ప్రివిలేజ్ ఫీజు ద్వారా రూ. 351 కోట్లు వసూలైనా నికర ఆదాయం మాత్రం తక్కువగానే లభించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో రూ. 7,269 కోట్లు వాణిజ్యపన్నులశాఖ ఖాతాకు బదిలీకాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి రూ. 204 కోట్లు జమయ్యాయి. ఇతర ఖర్చులు, చెల్లింపులుపోగా ఆబ్కారీశాఖకు నికరంగా రూ. 3,484 కోట్ల ఆదాయమే లభించింది. గత 11 నెలల్లో జిల్లాలవారీగా మద్యం విక్రయాలు (రూ. కోట్లలో) జిల్లా మద్యం అమ్మకాలు హైదరాబాద్ 2,656 ఆదిలాబాద్ 1,629 కరీంనగర్ 654 ఖమ్మం 553 మెదక్ 773 మహబూబ్‌నగర్ 1,197 నల్లగొండ 841 నిజామాబాద్ 1,176 రంగారెడ్డి 1,261 వరంగల్ 709 -
ట్రెజరీలో ఇక ఈ-పాలన
అన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను ఆన్లైన్లోనే ట్రెజరీకి సమర్పించాలి ఏప్రిల్ నుంచి పేపర్‌లెస్ వర్క్ ఉద్యోగులకు అందనున్న పారదర్శక సేవలు ఒంగోలు టూటౌన్: ట్రెజరీలో ఇక పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. పేపరు కట్టలు (ఉద్యోగుల జీత భత్యాల బిల్లులు) కనపడని పరిస్థితి రాబోతోంది. కాగిత రహిత పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే బిల్లులతో పాటు ఇతరత్రా బిల్లులన్నీ ఆన్లైన్ ద్వారానే ట్రెజరీకి వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. నూతన ఆన్లైన్ వ్యవస్థ వలన జీపీఎఫ్ అమలులో పొరపాట్లకు తావులేకుండా ఉంటుందని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి పేపరు కట్టలు (బిల్లులు) లేకుండా ఈ కొత్త విధానం అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ట్రెజరీకి పేపరు బిల్లులు, ఆన్లైన్ సేవలు రెండూ అందిస్తూ వస్తున్నారు. ఈ రెండింటిలో పేపరు పనికి స్వస్తి చెప్పి.. ఏప్రిల్ నుంచి ఆన్లైన్ సేవలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే గత నెల 25న కృష్ణా జిల్లా నూజివీడులో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులకు, ఉద్యోగులకు ఆన్లైన్ సేవలపై ఒక రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో ట్రెజరీశాఖ స్టేట్ డెరైక్టర్ కనకవల్లి, అడిషనల్ డెరైక్టర్ హనుమంతరావు, జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. పే-రోల్ ప్యాకేజి, పెన్షన్స్ అకౌంట్స్, ఆన్లైన్ సేవలపై సమీక్షించినట్లు వర్క్ షాపునకు వెళ్లిన ట్రెజరీ ఉద్యోగులు తెలిపారు. మన జిల్లా నుంచి డిప్యూటీ డెరైక్టర్ ఎ.లక్ష్మికుమారి, 10 మంది సబ్ ట్రెజరీ ఉద్యోగులు వర్క్ షాపునకు వెళ్లారు. జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలున్నాయి. మొత్తం 24 వేల మందికిపైగా ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు సమర్ధవంతంగా పొరపాట్లు లేని సేవలను ట్రెజరీ శాఖ ద్వారా అందిస్తామని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు.