Union - Budget - 2017
-
Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలు ధరిస్తే!
సలోని లా కాలేజి విద్యార్థి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ మారుమూల ప్రాంత వాసులను కలిసే అవకాశం వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్లామా అనుకోలేదు సలోని. తన ఇంటర్న్‌షిప్‌తోపాటు పర్యటిస్తోన్న గ్రామాల్లో.. ముఖ్యంగా గిరిజనుల ఆర్థికస్థితిగతులు, జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంది. వీరికోసం ఏదైనా చేసి మంచి జీవితం ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఐదుగురు మహిళలతో కలిసి వెదురుతో జ్యూవెలరీని తయారు చేయించడం మొదలు పెట్టింది. ఈ వెదురు నగలు అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో విక్రయాలు బాగానే జరిగేవి. గిరిపుత్రికలకు శిక్షణ ఇస్తున్న సలోని అలా 13 నెలలు గడిచిపోయాక సలోని ప్రాజెక్టు వర్క్ పూర్తయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లడం, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ వెదురుతో జ్యూవెలరీ తయారు చేస్తూ ఉపాధి పొందవచ్చని గ్రహించిన గిరిజన మహిళలు .. తమ జ్యూవెలరీ వర్క్‌ను మరింత ముందుకు తీసుకెళ్లమని సలోనిని అడగడంతో.. సలోనికి మళ్లీ రంగంలో దిగక తప్పలేదు. వెంటనే ‘బాన్సూలి’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. గిరిజన మహిళలు సొంత ఊరు వదిలి, వలస వెళ్లకుండా అక్కడే ఆనందంగా, ఆర్థిక భరోసాతో జీవించేలా ఉపాధి కల్పిస్తోంది. అల్వార్ అమ్మాయి రాజస్థాన్‌లోని అల్వార్‌లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించింది సలోని సఛేతి. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఫిలాసఫీ చేసింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే సలోని కాలేజీలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. డిగ్రీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకుంది. బిఏ తరువాత బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో చేరింది. ఎల్ఎల్బీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గుజరాత్‌లోని డ్యాంగ్ జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధిలేక పేదరికంతో అల్లాడడం చూసింది. పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్న వారి దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి 2009లో ‘బాన్ సూలి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. బాన్సూలీ అంటే బాన్ అంటే వెదురు. సూలీ అంటే నగలు బాన్సూలీ అంటే నగల నమూనా అని అర్థం. బాన్సూలీ ద్వారా డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ అధికంగా దొరికే వెదరును జూవెలరీ తయారీలో వినియోగించడం విశేషం. సమకాలిన ఫ్యాషన్‌కు అద్దం పట్టేలా వెదురుకు రాళ్లు, రత్నాలు, పూసలు జోడించి జ్యూవెలరీని తయారు చేస్తున్నారు. ఎక్కువ బరువు లేకుండా కేవలం ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఆకర్షణీయమైన ఆభరణాలను రూపొందించి విక్రయిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్యా, మిమనాస, ద్యుతి, బోగన్ విలియ డిజైన్లను రూపొందించగా, ప్రస్తుతం రెండువందలకు పైగా విభిన్న రకాల డిజైన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో జ్యూవెలరీతోపాటు లాప్టాప్ స్టాండ్స్, లైట్ స్టాండ్స్, రాఖీలు, దియాలు, కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ప్రారంభంలో బాన్సూలీ డిజైన్లను... ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేజీలు క్రియేట్ చేసి వాటిల్లో వీరి సరికొత్త వెదురు జ్యూవెలరిని అప్లోడ్ చేసేవాళ్లు. అంతేగాక వివిధ నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి వెదురు నగలను ప్రదర్శించేవారు. వీటికి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొరియర్ కంపెనీలతో కలిసి బాన్సూలీ జ్యూవెలరినీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బాన్సూలీ పదిహేనులక్షల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తోంది. దీని ద్వారా దాదాపు నలభై మంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో... బాన్సూలీ ఉత్పత్తుల విక్రయాలు ఆశించిన దానికంటే అధికంగా జరగడంతో అనేక సంస్థలు సలోని కృషికి గుర్తింపుగా వివిధ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని పేరు ఉండడం విశేషం. ఇవేగాక 3ఎమ్ సీఐఐ ఇన్నోవేటర్ ఛాలెంజ్ అవార్డు, ఎన్ఐఆర్డీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ‘‘బెస్ట్ స్టార్టప్ అవార్డు’’, టాప్ 18 సోషల్ ఇన్నోవేటర్, సోషల్ సెక్టార్లో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డులను దక్కించుకుంది. ఒక్క గుజరాత్లోనేగాక వెదురు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాల్లో బాన్సూలిని విస్తరించనున్నట్లు సలోని చెబుతోంది. చదవండి: Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే.. -
కరోనా: భయపెడుతున్న హాంకాంగ్ కేసు
హాంకాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్ రూపాన్ని మార్చుకుంటూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికి మలేషియాలో వెలుగు చూసిన కేసుల్లో కరోనా వైరస్ రూపాన్ని మార్చుకోవడమే కాక 10 రెట్లు ప్రమాదకరంగా మారినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాంకాంగ్‌లో వెలుగు చూసిన ఓ కేసు మరింత ఆందోళన కలిగిస్తుంది. మూడు నెలల క్రితం మహమ్మారి బారిన పడిన వ్యక్తికి మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు హాంకాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆగస్టు మధ్యలో స్పెయిన్ పర్యటన నుంచి హాంకాంగ్‌కు తిరిగి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ భిన్నమైన జాతి లక్షణాలు ఉన్నట్లు జన్యు పరీక్షలలో వెల్లడయ్యింది. సదరు వ్యక్తి మార్చిలో కరోనా బారిన పడి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కెల్విన్ కై మాట్లాడుతూ.. ‘ఈ వ్యక్తికి మొదటిసారి కరోనా వచ్చినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపించాయి. కానీ రెండవసారి అసలు ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. అతనికి రెండో సారి కరోనా వచ్చినట్లు హాంకాంగ్ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ ద్వారా తెలిసింది. దీన్ని బట్టి కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి జీవితం కాలం ఉండటం లేదని తెలియడమే కాక కొందరు రెండో సారి వైరస్ బారిన పడుతున్నట్లు అర్థమయ్యింది. అయితే ఎంత మందిలో ఇలా జరుగుతుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేం’ అన్నారు. (ప్లాస్మా థెరపీ: అమెరికా ఆమోదం!) ప్రస్తుతం వెలుగు చూసిన కేసు వల్ల పలు కీలకాంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అనేక చిక్కులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ‘ముఖ్యంగా వ్యాక్సిన్ అభివృద్ధి, పాఠశాలలు తెరవడం, పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక కార్యకలాపాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాక రెండో సారి వైరస్ బారిన పడివారిలో తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా వారి రోగ నిరోధక శక్తి కాపాడుతుంది, లేనిది ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఎదుర్కొన్న వైరస్ల విషయంలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీలను ఎలా తయారుచేయాలో గుర్తుంచుకుంటుంది’ అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే రెండో సారి వైరస్ బారిన పడిన వారిలో ఎంత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలియదు. కనుక ఇప్పటికే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వాటిని తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక వీరి ద్వారా వైరస్ మరికొందరికి వ్యాపిస్తుంది లేనిది అనే దాని గురించి ఇంకా స్పష్టం తెలియదు అంటున్నారున నిపుణులు. -
జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం
అనంతగిరి: టీఆర్ఎస్ అన్నివిధాలుగా జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని, వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. అది బీజేపీ టీం అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌ను మార్చి జిల్లాకు టీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదన్నారు. జిల్లా విభజనలో అన్యాయం చేయడంతో పాటు, చార్మినార్ జోన్లో కలపకుండా జోగులాంబలో కలిపారని మండిపడ్డారు. జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన టీఆర్ఎస్ నుంచి తాను కాంగ్రెస్‌లో చేరానని ఎంపీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం కోర్టులో ఉందని, త్వరలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావంవ్యక్తం చేశారు. అప్రజాస్వామయ్య పద్ధతిలో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ది నియంత పాలన అని, అక్కడ ఇమడలేకనే ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. కొండా కాంగ్రెస్ పార్టీలోకి రావడం కొండంత బలం అని పేర్కొన్నారు. ఆయనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నాడని తెలిపారు. ఒకే కుటుంబంతో అన్యాయం అనంతరం డీసీసీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ఈవీఎంల ట్యాంపరింగ్ ఘటనలో త్వరలో తమకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాను ఒకే కుటుంబం అన్యాయం చేస్తోందని, ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండడంతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. వికారాబాద్‌లో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్కు అభ్యర్థి దొరకడం లేదని రోహిత్‌రెడ్డి ఎద్దేశా చేశారు. అసెంబ్లీలో మన జిల్లా విషయంలో గొంతెత్తని వ్యక్తి పార్లమెంట్లో ఏం మాట్లాడుతారని ఈ సందర్భంగా పైలెట్.. మహేందర్‌రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెఓచ్చరించారు. అనంతరం పరిగి మాజీ ఎమ్మెల్యే రామోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ఈ ఎన్నికల్లో ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. జోన్ విషయంలో అన్యాయంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ..పార్లమెంట్లో ప్రజాసమస్యలపై గొంతువిప్పిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ను అప్పట్లో తిట్టినోళ్లు ప్రస్తుతం పొగుడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ధూం ధాం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జెడ్పీటీసీ రాములు, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, ఎంపీపీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడుద అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రత్నారెడ్డి, అడ్వకేట్ బస్వరాజు, నర్సింహారెడ్డి, కమాల్‌రెడ్డి, సంగమేశ్వర్, నర్సింలు, మురళి, విజయ్, సుధాకర్, శ్రీనివాస్‌గౌడ్, మేక చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు ఉన్నారు. ఎంపీ జన్మదిన వేడుకలు సమావేశం అనంతరం నాయకులు, కార్యకర్తలు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అతిథులతో పాటు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆయా గ్రామాల్లో ఒక్కో విద్యార్థికి తన ట్రస్టు తరుఫున రూ.1500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. -
వ్యూహాల్లో అ‘ద్వితీయం’
షాద్‌నగర్ టౌన్: ఎన్నికల్లో విజయతీరం చేరుకోవాంటే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరుపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వాటిని నేతలు పసిగట్టి అప్రమత్తం అయితే ఫలితాన్ని సునాయసంగా అందుకోవచ్చు. అందుకు తగ్గట్లు నేతలు పావులు కదపాలి. తద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి గల్లీకి వెళ్లి చక్రం తిప్పలేరు. దీనికోసం ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అద్వితీయమైన వ్యూహాలు రచిస్తూ పార్టీతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాన అనుచరులే అండ.. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు ఉంటారు. వీరే పార్టీ అభ్యర్థులకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. వీరు కార్యకర్తలను ఏకం చేయడం, ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మామూలు సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర అన్ని పార్టీల్లో కీలకంగా మారుతుంటుంది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించడం.. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పావులు కదుపుతున్నారు. బరిలో ఉండే తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుల సమాచారాలను చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. అనుక్షణం.. అప్రమత్తం అనుక్షణం ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికలను గమనిస్తూ వారి కోటలను బద్దలు కొట్టి తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతుంటారు. పార్టీ బలాన్ని పెంచడంతో పాటుగా ఎదుటి పార్టీలో అలకబూనిన నేతలను, అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి అక్కున చేర్చుకొని సరికొత్త వ్యూహాలను అమలు చేసే బాధ్యతను నేతలు తమ భుజాలపై వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఓట్లు వేయించి ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగేలా దూసుకెళ్తున్నారు. అన్ని తామై వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణినేతలు ఆయా గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల్లో కీలక పాత్ర ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండో శ్రేణి నేతలది కీలక పాత్ర. ఎన్నికల నేపథ్యంలో ప్రతిచోట నాయకులు పార్టీలు మారడం, కొత్త వారిని పార్టీల్లోకి చేర్చడంలో అభ్యర్ధుల ప్రధాన అనుచరులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగే సమాయానికి ఓటర్లను ఆకట్టుకొని వారి ద్వారా ఓట్లు వేయించే విషయంలోనూ వీరిపాత్ర అద్వితీయం. ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు పాలించాలంటే ఈ నేతలే కీలకంగా మారుతున్నారు. -
ముంచెత్తనున్న మొక్కజొన్న
మార్కెట్ ధర కంటే సర్కారు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ముందస్తుగా కోత కొచ్చే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అధికార యం త్రాంగం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించింది. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ముంచెత్త నుంది. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజను కంటే ఈ సారి సుమారు రెండింతలకు మించి కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నట్లు అధికార యం త్రాంగం భావిస్తోంది. మార్కెట్ ధర కంటే సర్కా రు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉం డటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి పోతున్నాయి. ముందస్తుగా కోత కొచ్చే ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలను దృష్టిలో ఉం చుకుని అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. క్వింటాలుకు రూ.300 ఎక్కువ ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధర క్విం టాలుకు రూ.1,425 నుంచి రూ.1,700 పెంచింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.1,300 నుంచి రూ.1,400 మిం చి ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇంతకు మించి ధర ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అలాగే ఫౌల్ట్రీ యజమానులు సైతం రూ.1,400 మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు సర్కారు కేంద్రాలకే ఎక్కువగా మొక్కజొన్నను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న పంటనే అధికం గా సాగు చేస్తారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొం డ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సువాడ ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజనులో సుమారు 1.17 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. సుమారు పది లక్షల క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మొత్తం 92 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో సేకరణ షురూ చేశారు. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గత ఏడాది కొనుగోళ్లు.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి 3.59 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 1.75 లక్షల క్వింటా ళ్లు, కామారెడ్డి పరిధిలో 1.84 లక్షల క్వింటాళ్లు సేకరించారు. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు పది లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ కేంద్రాలను 92 వరకు పెంచాలని నిర్ణయించారు. ఈసారి కూడా కొనుగోళ్ల బాధ్యతలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. మొక్కజొన్న సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రైతులకు ఇబ్బందులు రాకుండా పది లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాము. కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ చేసేందుకు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఎంపిక చేశాము. ఈసారి ప్రైవేటు గోదాముల్లో కాకుండా, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములనే వినియోగిస్తున్నాము. ఈ కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.– చంద్రశేఖర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ -
కత్తులు దూసుకుంటున్న మిత్రులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల ముందు మిత్రపక్షంగా కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్న చూపు చూస్తుందని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమని ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్లోనూ తమకు కనీస వాటా ఇవ్వడం లేదని, ఘోరంగా అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి, అధికారుల వద్ద జరిగే పనుల వరకు అన్నింట్లోనూ తమకు అన్యాయం జరుగుతోందంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రభుత్వం, పార్టీ ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉందంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో సైతం టీడీపీ, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగిన ఘటన అందరికి తెలిసిందే. ఇలా జిల్లాలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పదవులు ఇస్తామని తూచ్... అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాలో బీజేపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏ ఒక్క పథకాన్ని వారికి అప్పగించకుండా టీడీపీ కార్యకర్తలకే పూర్తిగా అప్పగిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గంలో బీజేపీకి రెండు డైరెక్టర్ పోస్టులు ఇస్తామంటూ తొలుత చెప్పి, ఆ తర్వాత ఒక్కటి మాత్రమే ఇస్తామంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. అయితే అధికారికంగా ప్రకటించిన తరువాత అందులో బీజేపీకి చోటు దక్కకపోవడంతో జిల్లా బీజేపీ నేతలు దీనిపై తమ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రతి పథకాన్ని మంజూరు చేసేందుకు అధికారికంగా నియమించిన జన్మభూమి కమిటీల్లోనూ బీజేపీ నేతలకు స్థానం కల్పించకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సీట్ల విషయంలోనూ అసంతృప్తి.. ఎన్నికల ముందు జిల్లాలో బీజేపీకి గుంటూరు వెస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినప్పటికీ టీడీపీ ఓటమి పాలవుతుందని భావించిన నరసరావుపేటను తమకు కేటాయించారని మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు పోటీ చేయకుండా వెళ్లిపోయిన నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారంటున్నారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన వ్యక్తులను ఇన్చా ర్జిలుగా నియమించిన టీడీపీ ఇక్కడ మాత్రం ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావును పక్కన పెట్టడం దారుణమంటున్నారు. అక్కడ కోడెల తనయుడు శివరామకృష్ణ చెప్పిందే అధికారులు చేస్తున్నారని, బీజేపీ నేతలకు కనీస గౌరవం లేకుండాపోయిందని వాపోతున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేస్తున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బీజేపీ నేతలకు కనీస ఆహ్వానం కూడా అందకపోవడంపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై గుంటూరు నగరంలోని 26, 45, 51 డివిజన్లలో బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీంతో బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సైతం తమకు గెలిచే సత్తా ఉన్నా నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని దౌర్జన్యంగా టీడీపీ నేతకు కట్టబెట్టారని బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏమాత్రం ప్రాధాన్యం లేదంటున్న బీజీపీ నేతలు.. గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అవినీతి తారస్థాయికి చేరిందని, దీని వల్ల బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు, పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు బహిరంగంగా కోప్పడిన విషయం తెలిసిందే. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా టీడీపీ నేతల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘బీజేపీతో పొత్తు – ఇంటికి రాదు విత్తు’ అంటూ రాయించడం కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు అనేకం ఉన్నాయి. నగరపాకల సంస్థ ఎన్నికల్లో 40శాతం సీట్లు అడుగుతాం నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 40శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిందే. అలా ఇవ్వని పక్షంలో సొంతంగా పోటీ చేస్తాం. మాతో కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా మేం కలిసి పోటీ చేసేందుకు అధిష్టానాన్ని ఒప్పిస్తాం. నగరంలో జరిగే యూజీడీ పనుల నుంచి హౌసింగ్ ఫర్ ఆల్ పథకాల వరకూ కేంద్రం నిధులు మంజూరు చేస్తే శంకుస్థాపన కార్యక్రమాలకు కనీసం బీజేపీ నేతలకు ఆహ్వానం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా పథకాలు పెట్టి ఎక్కడా మోదీ పేరు గానీ, కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన కానీ లేకుండా అంతా తామే చేస్తున్నామంటూ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. వీటిని ఇప్పటికే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. మా పార్టీకి మార్కెట్ యార్డు డైరెక్టర్ పోస్టు ఇస్తామని మోసం చేశారు. అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ గుంటూరు నగర అధ్యక్షుడు -
వచ్చే ఏడాది వృద్ధి 7.1 శాతం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. బడ్జెట్లో పలు ప్రోత్సాహక ఫలితాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుకు దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక విడుదల సందర్భంగా హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ తెలిపారు. ఆయన తెలిపిన నివేదిక అంశాలను పరిశీలిస్తే– దేశంలో రానున్న నెలలో వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది పెట్టుబడులకు కొంత రికవరీ అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 6.3 శాతంగా అంచనా వేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది గణనీయంగా మెరుగుపడే వీలుంది. -
చైనాతో భారత్‌కు పోలికా..?
‘రేటింగ్’పై సుబ్రమణియన్ ఆరోపణలను తోసిపుచ్చిన ఏజెన్సీ ముంబై: వివిధ దేశాలకు సార్వభౌమ రేటింగ్ ఇచ్చే విషయంలో అత్యంత పారదర్శకంగా, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన విధానాలను పాటిస్తున్నామని... భారత్ దీనికి మినహాయింపేమీ కాదని ఎస్అండ్పీ తేల్చిచెప్పింది. తాము అనుసరిస్తున్న ప్రమాణాలు, పద్ధతులన్నీ వెబ్సైట్లో సవివరంగా ఉన్నాయని సంస్థ డైరెక్టర్(సార్వభౌమ రేటింగ్స్) కైరన్ కరీ పేర్కొన్నారు. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు అస్థిరమైన ప్రమాణాలను పాటిస్తున్నాయంటూ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తీవ్రంగా దుయ్యబట్టిన నేపథ్యంలో ఎస్అండ్పీ ఈ విధంగా స్పందించింది. ‘రేటింగ్‌ను నిర్ణయించే విషయంలో విభిన్నమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. భారత్‌కు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధిని ప్రోత్సహించడంలో సమతుల్యతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని కరీ వివరించారు. చైనా తలసరి ఆదాయం 5 రెట్లు ఎక్కువ గ్లోబల్ రేటింగ్ విధానాలకు సంబంధించి చైనా, భారత్‌ల మధ్య అసమానతలు ఉన్నాయని.. స్థిరమైన ప్రమాణాలను పాటించడం లేదంటూ ఆర్థిక సర్వేలో సుబ్రమణియన్ ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, దివాలా చట్టం అమలు, ద్రవ్య విధాన కార్యాచరణకు ఆమోదం, వస్తు సేవల పన్ను(జీఎస్టీ).. ఆధార్ బిల్లుకు మోక్షం వంటి పలు సంస్కరణలను రేటింగ్ ఏజెన్సీలు గుర్తించడం లేదని.. గతేడాది ఎస్అండ్పీ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటువంటి చర్యలు వాటి(ఏజెన్సీలు) విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తాయని సుబ్రమణియన్ విమర్శించారు. ఎస్అండ్పీ నుంచి చైనాకు ప్రస్తుతం ‘ఏఏ మైనస్(ప్రతికూల అవుట్‌లుక్) రేటింగ్ ఉండగా.. భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్(స్థిర అవుట్‌లుక్)’. భారత్ కంటే చైనా రేటింగ్ ఆరు అంచెలు ఎక్కువ కావడం గమనార్హం. కాగా, 2010 నుంచి చూస్తే... చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 10 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోగా... భారత్ జీడీపీ వృద్ధి మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతూ వస్తోందని, అయినప్పటికీ.. ఎస్అండ్పీ చైనా రేటింగ్‌ను స్థిరంగానే కొనసాగిస్తోందంటూ సుబ్రమణియన్ పేర్కొన్నారు. అయితే, రేటింగ్స్ విషయంలో చైనాతో భారత్‌కు పోలికే లేదని కైరన్ కరీ స్పష్టం చేశారు. ‘చైనా తలసరి ఆదాయం భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ. అంతేకాదు జీడీపీలో చైనా రుణ భారం కూడా దాదాపు 30 శాతం మాత్రమే. రుణాలపై భారత్ తమ ఆదాయాల్లో 21 శాతాన్ని ఖర్చు చేయాల్సి వస్తుండగా.. చైనా విషయంలో ఇది 3 శాతమే. అందుకే చైనా రేటింగ్ భారత్ కంటే అత్యంత మెరుగ్గా ఉంది’ అని కరీ వివరించారు. -
‘అప్పు’డే రేటింగ్ పెంచలేం!
అప్‌గ్రేడ్ చేయడానికి భారీ ప్రభుత్వ రుణమే అడ్డంకి... • బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి • ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు తాజా బడ్జెట్లో మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వ్యాఖ్యానించింది. అయితే, కొండంత ప్రభుత్వ రుణ భారం, బలహీనంగా ఉన్న పన్ను ఆదాయాలు... రేటింగ్ పెంపుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018–19కి ఈ లోటును 3 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016–17)లో ద్రవ్యలోటు 3.5%గా ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. ‘ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుచుకునే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్ కళ్లకుకట్టింది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా సమీపకాలంలో వృద్ధి రేటు దెబ్బతింటున్నప్పటికీ భారత్ ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఎస్అండ్పీ పేర్కొంది. జీడీపీలో 68.5 శాతానికి రుణభారం... భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుతం జీడీపీతో పోలిస్తే 68.5 శాతంగా ఉంది. 2016 సెప్టెంబర్ చివరినాటికి విదేశీ రుణ భారం 484.3 బిలియన్ డాలర్లు (రూ.32.93 లక్షల కోట్లు.. జీడీపీలో 24 శాతం). దీనికి అంతర్గత రుణాలు కలిపితే 68.5 శాతంగా లెక్కతేలుతుంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) సమీక్ష కమిటీ నివేదిక ప్రకారం 2023 నాటికి జీడీపీలో రుణ భారాన్ని 60 శాతానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని బడ్జెట్లో జైట్లీ ప్రస్తావించారు. కాగా, ఆర్థిక, విధానపరమైన సంస్కరణలు గణనీయంగా మెరుగుపడిన పక్షంలో రుణ భారం 60 శాతం దిగువకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఎస్అండ్పీ తెలిపింది. ఇది భారత్ సార్వభౌమ రేటింగ్ పెరిగేందుకు రానున్న కాలంలో సానుకూలాంశంగా నిలుస్తుందని కూడా వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికైతే అధిక రుణ భారం, బలహీన పన్ను ఆదాయాలు రేటింగ్ పెంచేందుకు కీలకమైన అడ్డంకులని స్పష్టం చేసింది. ఎస్అండ్పీ ప్రస్తుతం భారత్‌కు ‘బీబీబీ మైనస్’ రేటింగ్(స్థిర అవుట్‌లుక్‌తో) ను కొనసాగిస్తోంది. ఇది జంక్ గ్రేడ్‌కు(పెట్టుబడులకు అత్యంత కనిష్టస్థాయి గ్రేడ్) ఒక్క అంచె మాత్రమే ఎక్కువ. ఈ ఏడాది(2017)లో భారత్ రేటింగ్‌ను పెంచే ప్రసక్తే లేదని 2016 నవంబర్‌లో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. జీడీపీలో రుణ భారాన్ని 60 శాతం దిగువకు తీసుకువచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. అదేవిధంగా మధ్యకాలానికి ద్రవ్యలోటు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గేవిధంగా ప్రభుత్వ పన్ను ఆదాయాలేవీ పెరుగుతాయని భావించడం లేదని పేర్కొంది. బ్యాంకులకు రూ.10 వేల కోట్లేనా? ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు మూలధనం కిందం ఈ బడ్జెట్లో రూ.10 వేల కోట్లను మాత్రమే కేటాయించడంపై ఎస్అండ్పీ పెదవి విరిచింది. ఇది ఏమాత్రం సరిపోదని.. దీనివల్ల బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో(బ్యాలెన్స్ షీట్ల క్లీన్అప్) జాప్యం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా లోటును బ్యాంకులు బీమా కంపెనీలు.. ఇతర ప్రభుత్వ సంస్థలు లేదంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సిందేనని ఎస్అండ్పీ సీనియర్ డైరెక్టర్(ఆర్థిక సంస్థల రేటింగ్స్ విభాగం) గీతా చుగ్ పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని మూలధన నిధులను ఇస్తామంటూ ఆర్థిక మంత్రి జైట్లీ హామీనివ్వడం కాస్త ఊరటనిచ్చే విషయమని ఆమె చెప్పారు. కాగా, కొన్ని బ్యాంకులు అత్యంత బలహీనంగా ఉన్నాయని.. టేకోవర్ లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని చుగ్ హెచ్చరించారు. బాసెల్–3 నిబంధనల ప్రకారం 2019 చివరినాటికి దేశీ బ్యాంకింగ్ రంగానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది ఎస్అండ్పీ అంచనా. కాగా, 2015లో మోదీ సర్కారు ప్రకటించిన ‘ఇంద్రధనుష్’ కార్యాచరణ కింద నాలుగేళ్లలో పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మూలధనం ఇవ్వాలనేది ప్రణాళిక. దీనిలో భాగంగా గడిచిన తొలి రెండేళ్లలో(2015–16, 16–17) రూ.25 వేల కోట్ల చొప్పున కేంద్రం కేటాయించింది. -
సమ్మిళిత భారత్ దిశగా..
బడ్జెట్ కామెంట్ సమ్మిళిత భారత్ దిశగా.. ఎకానమీ వృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ ఇది. ఉద్యోగావకాశాల పెంపు, మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు పేదరికాన్ని తగ్గించేలా రూపొందించారు. బడ్జెట్ ప్రకటన చూస్తుంటే సమ్మిళిత భారత్ నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులు జారీ చేయనుండడం ఆహ్వానించదగ్గది. పీజీ మెడికల్, డీఎన్బీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు మెచ్చుకోతగ్గ అంశం. ప్రాణాధార ఔషధాల ధరల సవరణ, వైద్య పరికరాల ధరల క్రమబద్ధీకరణతో ఆరోగ్య సేవల రంగంపై సానుకూల ప్రభావమే చూపిస్తుంది. వైద్యానికి ప్రాధాన్య దేశంగా భారత్ అవతరించింది. –ప్రతాప్ సి రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గేమ్ చేంజర్ మాత్రం కాదు.. సానుకూల బడ్జెట్ అయినప్పటికీ గేమ్ చేంజర్ మాత్రం కాదు. వైద్య రంగం వృద్ధికి చర్యలు తీసుకోలేదు. 1.5 లక్షల హెల్త్‌కేర్ సెంటర్ల నవీకరణ, 2 ఎయిమ్స్‌ల ఏర్పాటు మినహా పెద్దగా ప్రకటించిందేమీ లేదు. జనరిక్ మందులను ప్రోత్సహించడంలో భాగంగా డ్రగ్స్, కాస్మెటిక్స్ యాక్టు సవరణకు ప్రతిపాదించారు. ఔషధ రంగాన్ని వృద్ధిబాటలో పెట్టేలా నిర్ణయాత్మక ప్రకటన ఉంటుందని పరిశ్రమ భావించింది. అటువంటిది ఏమీ జరగలేదు. ఎఫ్‌డీఐల రాకకు అవరోధంగా ఉన్న ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. –సతీష్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ -
డిజిన్వెస్ట్‌మెంట్ @ రూ.72,500 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. డిజిన్వెస్ట్చేయదల్చిన పీఎస్‌యుల్లో 3 రైల్వే పిఎస్‌యులు( ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, ఐఆర్‌సిఒఎన్) కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచ స్థాయి పిఎస్యులతో పోటీపడేలా దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం కొన్నింటి విలీనం, కొన్నింటి కన్సాలిడేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎదురైన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పిఎస్‌యుల లిస్టింగ్‌ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా, ఉపసంహరణ ప్రక్రియలో జవాబుదారీతనం పెరిగేలా, కంపెనీల వాస్తవ విలువ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.56 వేల కోట్లుగా నిర్ణయించుకున్నా, చివరకు రూ. 45వేల కోట్లనే సమీకరించింది. 10 పిఎస్‌యుల షేర్లతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్‌కు మంచి స్పందన వచ్చిందని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది మరో కొత్త ఈటీఎఫ్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. -
బ్యాంకులకు రూ.10,000 కోట్లే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్ర బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.10,000 కోట్లు కేటాయించింది. అయితే అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చడానికి సిద్ధమనీ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో పునరుత్తేజానికిగాను 2015లో ప్రకటించిన ఇంద్రధనస్లో భాగంగా ఈ నిధులను సమకూర్చుతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో రూ.70,000 కోట్లు... నాలుగేళ్లలో ఈ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. అంతర్జాతీయ బ్యాంకింగ్ మూలధన ప్రమాణాలు బాసెల్ 3కి అనుగుణంగా అవసరమైతే బ్యాంకులు తమ మూలధన అవసరాలకు రూ.1.1 లక్షల కోట్ల నిధులను సమీకరించుకోడానికీ ఈ పథకం కింద వీలుంటుంది. ఇంద్రధనస్సు బ్లూప్రింట్‌లో భాగంగా బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–2017) రూ.25,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం అందించాలని ప్రతిపాదించింది.. వీటిలో ఇప్పటికే రూ.22,915 కోట్లను 13 ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం కేటాయించింది. ఇందులో 75 శాతాన్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఎన్పీఏ కేటాయింపులపై పన్ను రాయితీలు తాజా బడ్జెట్లో బ్యాంకింగ్‌కు ఆర్థికమంత్రి కొన్ని పన్ను రాయితీలనూ ఇచ్చారు. మొండిబకాయిల (ఎన్పీఏ)కు సంబంధించి కేటాయింపులపై పన్ను రాయితీలు ఇస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. దీనివల్ల వాస్తవ ఆదాయాల (వసూలైన వడ్డీలు) ప్రాతిపదికనే పన్నులు ఉంటాయితప్ప, ఎన్‌పీఏల్లో చిక్కుకున్న అకౌంట్లకు సంబంధించి పన్నులు ఉండబోవని బడ్జెట్ స్పష్టతనిచ్చింది. ఇది షెడ్యూల్డ్, నాన్–షెడ్యూల్డ్ సహకార బ్యాంకులకు వర్తిస్తుందని పేర్కొంది. ‘‘బ్యాంకింగ్ రంగానికి బూస్ట్ ఇవ్వడం లక్ష్యంగా ఎన్‌పీఏకు ఆమోదనీయ కేటాయింపులను 7.5 శాతం నుంచి 8.5 శాతానికి పెంచుతున్నాం. బ్యాంకుల పన్ను చెల్లింపు భారాన్ని ఇది తగ్గిస్తుంది’’ అని కూడా జైట్లీ బడ్జెట్ పేర్కొంది. -
మసాలా బాండ్లకు పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: రూపాయి ఆధారిత మసాలా బాండ్లపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ప్రవాసీల మధ్య ఈ బాండ్ల బదలాయింపుపై పన్ను భారం ఉండబోదని పేర్కొన్నారు. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారికి 2020 దాకా టీడీఎస్ రూపంలో 5 శాతం మాత్రమే పన్ను ఉంటుందని వివరించారు. దీన్ని 2016 ఏప్రిల్ 1 నుంచే వర్తించే విధంగా నిబంధనలను ప్రతిపాదించారు. విదేశీ వాణిజ్య రుణాలు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై విదేశీ సంస్థలు ఆర్జించే వడ్డీపై ప్రస్తుతం 5 శాతం మాత్రమే పన్ను ఉంటోంది. 2017 జూన్ 30 దాకా అమల్లో ఉండే ఈ వెసులుబాటును 2020 జూన్ 30 దాకా పొడిగించారు. తాజాగా ఇన్వెస్టర్ల విజ్ఞప్తుల మేరకు ఈ ప్రయోజనాన్ని మసాలా బాండ్లకూ వర్తింపచేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. -
స్టార్టప్స్‌కు ఊరట
న్యూఢిల్లీ: స్టార్టప్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న పన్నురాయితీని కంపెనీ స్థాపించిన తొలి ఏడేళ్లలో మూడేళ్లకు పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకు ఈ లాభాధారిత పన్ను (ప్రాఫిట్ లింక్డ్ డిడక్షన్) తొలి ఐదేళ్లలో మూడేళ్లుగా ఉండేది. అయితే పలు స్టార్టప్స్ స్థాపించిన తొలినాళ్లలో లాభాలను అందుకోలేపోతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ పరిమితిని సవరించింది. పాత నిబంధనను పొడిగించి ఏడేళ్లలో మూడేళ్లుగా మార్చినట్లు జైట్లీ చెప్పారు. స్టార్టప్స్ నష్టాలను దృష్టిలో ఉంచుకొని 51% ఓటింగ్ హక్కును కూడా సడలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సడలింపు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందన్నారు. అదేవిధంగా మ్యాట్‌ను పూర్తిగా ఎత్తేయడం, తొలగించడం కుదరదని, అయితే కంపెనీలు మ్యాట్ క్రెడిట్‌ను వినియోగించుకునేందుకు వీలుగా మ్యాట్ క్యారీఫార్వర్డ్ను 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు. -
ఎఫ్ఐపీబీ రద్దు... ఇక ఎఫ్‌డీఐల జోరు
ఎఫ్‌డీఐ విధానం మరింత సరళతరం న్యూఢిల్లీ: సింహభాగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తున్న నేపథ్యంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ)ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరమైన విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలపై .. సంబంధిత మంత్రిత్వ శాఖలే తగు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ప్రస్తుతం దాదాపు 90 శాతం ఎఫ్‌డీఐలు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తుండగా.. కేవలం పది శాతం ప్రతిపాదనలే ఎఫ్ఐపీబీ వద్దకు వెడుతున్నాయని జైట్లీ చెప్పారు. అందుకే ఎఫ్ఐపీబీని విడతలవారీగా రద్దు చేసే సమయం వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికలను రాబోయే నెలల్లో ప్రకటించగలమన్నారు. మరోవైపు, ఎఫ్‌డీఐ విధానాన్ని మరింత సరళతరం చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, త్వరలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. తాజా పరిణామాలతో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వ్యవధి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తిగా ఉన్న సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కంపెనీలకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఈవై ఇండియా సంస్థ పేర్కొంది. 1990లలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) కింద ఎఫ్ఐపీబీ ఏర్పాటైంది. ఆ తర్వాత 1996లో దీన్ని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ)కి బదలాయించారు. 2003లో ఆర్థిక వ్యవహారాల విభాగం కింద చేర్చారు. ఆటోమేటిక్ పద్ధతిలోకి రాని రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం ఎఫ్ఐపీబీ ఆమోదముద్ర అవసరమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐలు 30 శాతం పెరిగి 21.62 బిలియన్ డాలర్లకు చేరాయి. -
పోంజీ స్కీములపై కొరడా
సహకార సంస్థల ముసుగులో అక్రమంగా డిపాజిట్లు సమీకరించే (పోంజీ స్కీములు) మోసపూరిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టనుంది. బహుళ రాష్ట్రాల సహకార సొసైటీల (ఎంఎస్సీఎస్) చట్టం 2002లోని లొసుగులను ఉపయోగించుకుని అక్రమ పథకాలతో మోసగించే సంస్థల నుంచి పేద, అమాయక ఇన్వెస్టర్లకు తక్షణం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే క్లీన్ ఇండియా అజెండా కింద.. వివిధ వర్గాలతో సంప్రదింపుల అనంతరం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు, ఖరారయిన తర్వాత తుది బిల్లును త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు జైట్లీ చెప్పారు. బ్యాంకర్ల మాట వృద్ధికి ప్రోత్సాహం... బడ్జెట్ ‘‘సమతౌల్యత’’ ఉంది. ద్రవ్య క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, వృద్ధికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ఆర్థికమంత్రి శ్రమపడ్డారు. రైతులు, పేదల అభ్యున్నతి, మౌలిక రంగం అభివృద్ధి, ఆర్థికరంగం పటిష్టతకు బడ్జెట్ తోడ్పడుతుంది. – చందాకొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సానుకూల అంశాలు... ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతౌల్యతను పాటించే విధంగా బడ్జెట్ ఉంది. గ్రామీణ వృద్ధి లక్ష్యంగా ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తాయి. హౌసింగ్ రంగ వృద్ధికి చొరవలు, పన్ను సరళీకరణలు సానుకూల అంశాలు. – శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ -
ఇన్వెస్టర్లకు 'జై' ట్లీ
• విదేశీ ఇన్వెస్టర్లకు పన్నులపై స్పష్టతతో మార్కెట్ దూకుడు • 28వేల పైకి సెన్సెక్స్.. 8,700 దాటిన నిఫ్టీ • 486 పాయింట్ల లాభంతో 28,142 వద్ద ముగింపు • 155 పాయింట్ల లాభంతో 8,716కు నిఫ్టీ అరుణ్ జైట్లీ బడ్జెట్‌కు స్టాక్ మార్కెట్ జై కొట్టింది. ద్రవ్య లోటుకు సంబంధించి క్రమశిక్షణ, విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుపై స్పష్టత మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 వేల పాయింట్లపైన, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,700 పాయింట్ల పైన ముగిశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 28,142 పాయింట్ల వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 8,716 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 3 నెలల గరిష్ట స్థాయి. గతేడాది అక్టోబర్ తర్వాత స్టాక్ సూచీలు ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే తొలిసారి. పదేళ్ల కాలంలో(2005 తర్వాత) బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడడం కూడా ఇదే మొదటిసారి. బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేంత వరకూ స్తబ్దుగా ఉన్న స్టాక్ మార్కెట్, బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి జైట్లీ చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి జోరందుకుంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 504 పాయింట్ల వరకూ లాభపడింది. ఆర్థిక, రియల్టీ షేర్లు జోరును చూపించాయి. అన్నీ శుభ శకునములే... దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకపోవడం చాలా సానుకూల ప్రభావం చూపించింది.షేర్ల పరోక్ష బదిలీ సంబంధిత పన్నుల నుంచి కేటగిరీ వన్, కేటగిరీ టూ విదేశీ ఇన్వెస్టర్లను మినహాయించడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడడం కలసివచ్చింది. ప్రభుత్వం తీసుకునే రుణాల లక్ష్యాన్ని తగ్గించడం వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని సూచిస్తోందన్న అంచనాలు, ప్రపంచ మార్కెట్లు లాభాలు.. ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి. భయాలు తగ్గాయ్... ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో మార్పు లేకపోవడం ఇన్వెస్టర్ల భయాలను తగ్గించిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.2 శాతానికి తగ్గించడం మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేనందున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని ఏంజెల్ బ్రోకింగ్ సీఎండీ దినేశ్ టక్కర్ చెప్పారు. రియల్టీ షేర్ల జోరు.. రియల్టీ షేర్లు దుమ్ము రేపాయి. అందుబాటు ధరల గృహ రంగానికి మౌలిక హోదాని ఇవ్వడం, నిర్మాణం పూర్తయి, అమ్ముడుపోని గృహాల కోసం డెవలపర్లకు పన్ను రాయితీలు ప్రకటించడం, మౌలిక రంగానికి 3.96 లక్షల కోట్లు కేటాయించడంతో రియల్టీ షేర్లు కళకళలాడాయి.రియల్టీ షేర్లతో పాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్, సిమెంట్ కంపెనీల షేర్లు కూడా ఎగిశాయి. డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రొపర్టీస్, హెచ్‌డీఐఎల్, ఒబెరాయ్ రియల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, శోభ డెవలపర్స్, యూనిటెక్ షేర్లు 7 శాతం వరకూ లాభపడ్డాయి. గృహ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, కెన్ ఫిన్ హోమ్స్, డీహెచ్ఎఫ్ఎల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వ బ్యాంక్ షేర్ల పరుగు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంక్‌లకు రూ.10,000 కోట్ల మూలధన నిధుల ప్రకటనతో ఆయా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బీఓబీ, పీఎన్బీ, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడిబీఐ బ్యాంక్ షేర్లు 6 శాతం వరకూ లాభపడ్డాయి. జనవరిలో అమ్మకాల జోరుతో మారుతీ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.6,105)ను తాకి 4.6% లాభంతో రూ.6,172 వద్ద ముగిసింది. రూ.1.71 లక్షల కోట్లు అప్ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం ఒక్క రోజే రూ.1.71 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం ఇన్వెస్టర్ల సంపద రూ.114.27 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌పీఐ నిబంధనల సడలింపు న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు(ఎఫ్‌పీఐ) ఊరట నిచ్చేలా ప్రభుత్వం కీలక సడలింపు చేసింది. కేటగిరీ 1, 2 ఎఫ్‌పిఐలను పరోక్ష బదిలీల కింద విధించే పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో సరైన నియంత్రణ ఉన్న ఎఫ్‌పీఐలు భారత్‌లో పెట్టుబడి ఉపసంహరణ సందర్భంగా విదేశీ కంపెనీల్లో ఆస్తులు, షేర్లు విక్రయించినప్పుడు పన్ను చెల్లింపులు చేయాల్సిన పనిఉండదు. 2012లో చేసిన ఐటి సవరణలో ఈ లావాదేవీలను పన్ను పరిధిలోకి తెచ్చారు. దీనిపై ఎఫ్‌పీఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీరి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని తాజాగా కేటగిరీ 1, 2 ఎఫ్‌పిఐలను పరోక్ష బదిలీ నిబంధననుంచి ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో తెలిపారు. కేటగిరీ 1 ఎఫ్పిఐల్లో సావరిన్ వెల్త్ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు ఉండగా, కేటగిరీ 2లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులున్నాయి. ప్రస్తుత సడలింపు హైరిస్క్ విదేశీ మదుపరులకు, వ్యక్తిగత మదుపరులకు, హెడ్జ్ఫండ్స్కు వర్తించదు. సాగు షేర్లు కళకళ.. మంచి వర్షాలు కురియడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధి సాధించగలదని విత్త మంత్రి పేర్కొనడం, ఐదేళ్లలో వ్యవసాయాదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా చేసిన ప్రతిపాదనల ఫలితంగా సాగు సంబంధిత, ఎరువుల కంపెనీల షేర్లు దూసుకుపోయాయి. దీపక్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, ధనుక అగ్రిటెక్, జైన్ ఇరిగేషన్, 3–7% రేంజ్లో పెరిగాయి. ఫార్మా షేర్ల వెలవెల.. జనరిక్ ఔషధాలను ప్రోత్సహించడం, ఔషధాల, కాస్మొటిక్స్ ధరలను తగ్గించేలా నియమ నిబంధనలను సవరించనున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఫార్మా షేర్లు నష్టపోయాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, వొకార్డ్, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, తదితర షేర్లు 2 శాతం వరకూ కుదేలయ్యాయి. -
క్యూఐబీ హోదాని ఆహ్వానిస్తున్నాం: ముత్తూట్
ఐపీఓలో క్యూఐబీ కోటాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తింపజేయడాన్ని ఆహ్వానించదగ్గ అంశమని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ముత్తూట్ లాంటి ఎన్బీఎఫ్సీ కంపెనీలకు ఐపీఓ మార్కెట్లో బ్యాంకులు, బీమా సంస్థలకు సమానంగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభించిందని అన్నారు. జైట్లీ తీసుకున్న నిర్ణయం ఎన్‌బీఎఫ్‌సీకు నిధుల సమీకరణలో తోడ్పాటునిస్తుందని అభిప్రాయపడ్డారు. క్యూఐబీ హోదాలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండడం వల్ల, పోర్టిఫోలియో డైవర్సిఫికేషన్‌కు అవకాశం లభించడమే కాకుండా పెట్టుబడులలో పారదర్శత పెరుగుతుందని అన్నారు. ఆన్లైన్లో బ్రోకింగ్ సంస్థల రిజిస్ట్రేషన్ వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా.. బ్రోకింగ్ సంస్థలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలు నమోదు చేసుకునేందుకు పేపర్ రహిత ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎగుమతి లక్ష్యం మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధం ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్) పేరిట నూతన స్కీంను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీం విధివిధానాలను ప్రకటించనున్నారు. -
పెరిగిన, తరిగిన షేర్లు
అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రతిపాదనల కారణంగా పెరిగిన, పతనమైన షేర్ల వివరాలు -
ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్
సీఐఐ తెలంగాణ బడ్జెట్ ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసేలా నిలిచిందని సీఐఐ తెలంగాణ వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, అందుబాటు గృహాలు, గ్రామీణ రహదారులు నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్, అభివృద్ధి వంటి గ్రామీణ భారతానికే పెద్ద పీట వేశారని’’ బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. ‘అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రకరకాల సమస్యల్లో ఉన్నాయి. మన దేశానికి ఇదే సరైన సమయం. బడ్జెట్ కేటాయింపులను ఆసరా చేసుకొని ఆర్ధికాభివృద్ధిని పరుగులు పెట్టించాలని’ సీఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర్ రావు పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులు, స్కిల్ డెవలప్మెంట్, రహదారుల నిర్మాణం, యువతలో స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటితో ఈ బడ్జెట్ గ్రామీణ బడ్జెట్‌గా నిలిచిందని సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ వీ రాజన్న తెలిపారు. అయితే లైఫ్ సైన్స్, బయో రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు కల్పించలేదని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కే ఇల్లా పేర్కొన్నారు. దేశ మొత్తం జీడీపీలో 16 శాతం వాటా ఉండే మహిళలకు ఈసారి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవీ చేయలేదని ఎలికో ఇండియా వైస్ చైర్పర్సన్ వనిత దాట్ల పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిజిక్వెస్ట్ ఇండియా లి. ఎండీ కే బసి రెడ్డి, డైనాటెక్ ఇండస్ట్రీస్ ఎండీ కే హరీష్‌రెడ్డి, గటీ లి. ఫౌండర్ అండ్ ఎండీ మహేంద్ర అగర్వాల్, పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదికి 8 మార్కులు ఇస్తున్నాం: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు 10కిగాను 8 మార్కులు ఇస్తున్నట్టు ఫ్యాప్సీ తెలిపింది. వ్యవసాయ రుణాలకు రూ.10 లక్షల కోట్లు, ఇల్లు లేనివారికి 2019 నాటికి ఒక కోటి గృహాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.64,000 కోట్ల కేటాయింపుల వంటివి స్వాగతించే అంశాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ తెలిపారు. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ టి.ఎస్.అప్పారావు, మాజీ ప్రెసిడెంట్ వి.ఎస్.రాజు తదితరులతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మా ట్లాడారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద కేటాయింపులను రెండింతలు చేస్తూ రూ.2.44 లక్షల కోట్లు ప్రకటించారని, ఔత్సాహిక యువత తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఈ నిధులు దోహదం చేస్తాయన్నారు. మెట్రో రైల్ పాలసీతో హైదరాబాద్‌కు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీలో ఒకే స్లాబ్.. ప్రతిపాదిత జీఎస్టీలో ఒకే స్లాబ్ కింద పన్ను వసూలు చేయాలని రవీంద్ర మోదీ అన్నారు. లేదంటే వ్యాట్‌కు, జీఎస్టీకి పెద్ద తేడా ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ‘ఎగ్జిట్ పాలసీ ప్రకటిస్తారనుకున్న పరిశ్రమకు నిరాశ కలిగించారు. స్టార్టప్స్‌తోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు ఈ పాలసీ అమలవ్వాలి. రిస్క్ తీసుకోవాలంటే ఇది తప్పదు. సరుకు రవాణాపై బడ్జెట్లో దృష్టిసారించ లేదు. రూ.50 కోట్ల వరకు ఆదాయం ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆదాయపు పన్ను 5 శాతం తగ్గించడం ఊరట కలిగించే అంశం. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిశ్రమ కుదేలైన మాట వాస్తవం. ఒకట్రెండు నెలల్లో ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది’ అని తెలిపారు. -
కంపెనీల పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాల వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.63 శాతానికి పెరగనుంది. 2017–18 బడ్జెట్ ప్రకారం పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లుగా తేలింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.76,857.70 కోట్ల విలువైన పన్ను ప్రోత్సాహకాలను అందించారు. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి భారం 8.63 శాతానికి పెరిగింది. -
జనవరిలో పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కష్టాల నుంచి వాహన కంపెనీలు తేరుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, , టయోట, నిస్సాన్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు 9 శాతం చొప్పున పతనం కాగా, టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 21 శాతం ఎగిశాయి. -
రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఎత్తివేత!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో చిన్న మదుపరుల వాటాను పెంచడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్జీఈఎస్ఎస్)పై అందుతున్న పన్ను ప్రయోజనాన్ని ఎత్తివేస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంపై అందుతున్న పన్ను ప్రయోజనం అసెస్మెంట్ ఇయర్ 2018–19 నుంచి ఉండదని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లో తొలిసారి పెట్టుబడి పెట్టినవారు మూడు అసెస్మెంట్ ఇయర్స్‌లో పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు ఉండగా, 2018 ఏప్రిల్ 1 నుంచి రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఉండవని జైట్లీ తెలిపారు. అసలు ఏంటీ పథకం: చిన్న మదుపరులే లక్ష్యంగా 2012 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా యూపీఏ ప్రభుత్వం ఈ స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం అంతకుముందెన్నడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టని వారు.. తొలిసారిగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, అటువంటి వారి పెట్టుబడిని పన్నుమినహాయింపుగా చూపించే వెసులుబాటుని ఇస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీంలో గరిష్టపన్ను ప్రయోజనం రూ.50,000 కాగా, వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపు ఉన్నవారికే ఈ వెసులుబాటుని ఇచ్చింది. ఆ తరువాత 2013–14లో గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచింది. 80సీసీజీ కింద పెట్టుబడిలో 50 శాతాన్ని పన్ను మినహాయింపుగా పరిగణస్తూ, రూ.50,000 వరకు మాత్రమే డిడెక్షన్ ఇస్తూ ఆర్జీఈఎస్ఎస్ పథకాన్ని పొడిగించింది. -
పెద్ద ఆయిల్ కంపెనీ వచ్చేస్తోంది!
• చమురు పిఎస్‌యుల విలీనం దిశగా అడుగులు • పూర్తయితే రోజ్‌నెఫ్ట్, బిపి బలాదూర్ • బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశీయ చమురు అవసరాలు తీర్చగలిగేలా, అంతర్జాతీయ చమురు దిగ్గజాలైన రోజ్‌నెఫ్ట్, బిపి, చెవరాన్ను తలదన్నేలా ఒక భారీ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో ఉన్న 13 చమురు పిఎస్యులన్నింటినీ, లేదా కొన్నింటినీ విలీనం చేయాలని భావిస్తోంది. నిజానికి ఇలాంటి భారీ దిగ్గజ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని పుష్కర కాలం నుంచి ప్రతిపాదనలున్నాయి. అప్పట్లో నాటి చమురు శాఖా మంత్రి మణిశంకర్ అయ్యర్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. హెచ్‌పీసీఎల్, బిపీసీఎల్ను ఓఎన్జీసితో, ఓఐఎల్‌ను ఐఒసితో విలీనం చేసి రెండు దిగ్గజ కంపెనీలను ఏర్పాటు చేయాలని 2004లో అప్పటి చమురు మంత్రి అయ్యర్ ప్రతిపాదించారు. దీంతోపాటు పిఎస్‌యుల అనుబంధ సంస్థలను మాతృ సంస్థతో విలీనం చేయాలన్నారు. అయితే ఆ సమయంలో చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండడంతో విలీనం ప్రతిపాదనల వద్దే నిలిచిపోయింది. ఈ ప్రతిపాదనలనకు కార్యరూపాన్ని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ చమురు దిగ్గజాలను, దేశీయంగా ఉన్న భారీ ప్రైవేట్ చమురు సంస్థలను దీటుగా ఎదుర్కొనే ఒక దిగ్గజ చమురు పిఎస్‌యు ఏర్పాటుపై సన్నాహాలు జరుపుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశీ ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం చమురు ఉత్పతి సంస్థలు ఓఎన్జీసి, ఓఐఎల్, మార్కెటింగ్ సంస్థలు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్, సహజవాయువు రవాణా సంస్థ గెయిల్, ఇంజనీరింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఇంజనీర్స్ఇండియా తదితర కంపెనీలున్నాయి. క్షీణించిన చమురు ధరల వల్ల ఎదురవుతున్న నష్టాలను తట్టుకొని, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వం యోచన ఆరంభించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని టాప్ ఎనిమిది చమురు కంపెనీల సామూహిక మార్కెట్ విలువ 8000 కోట్ల డాలర్లు. తాజాగా ఏర్పాటు చేయప్రతిపాదిస్తున్న కంపెనీ మార్కెట్ క్యాప్ రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్, అంబానీకి చెందిన రిలయన్స్ మార్కెట్ విలువ కన్నా చాలా ఎక్కువగా ఉండనుంది. ఇంచుమించు ఈ కంపెనీ మార్కెట్క్యాప్ బ్రిటన్‌కు చెందిన బిపి సంస్థ మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుందని అంచనా. 2015–16లో అన్ని చమురు పిఎస్‌యులు కలిసి రూ. 45,500 కోట్ల రూపాయల లాభాన్ని, రూ. 9.32 లక్షల కోట్లరూపాయల ఆదాయాన్ని నమోదు చేశాయి. కన్సాలిడేషన్లతో పిఎస్‌యుల బలోపేతం కొనుగోళ్లు, విలీనాలు, కన్సాలిడేషన్ల ద్వారా దేశీయ పిఎస్‌యులను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. చమురు, సహజవాయు రంగంలో ఇలాంటి కన్సాలిడేషన్, విలీనానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పిఎస్‌యులను బలోపేతం చేసినప్పుడే అవి భారీ రిస్కులను ఎదుర్కొనే సత్తా పొందుతాయని, భారీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలుగుతాయని అన్నారు. అయితే పీఎస్‌యుల పునర్యవస్థీకరణపై ఏర్పాటైన హైలెవల్ కమిటీ ఇలాంటి విలీన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇలా ఏకీకృత కంపెనీ ఏర్పాటు చేసే బదులు ఉన్న వాటికి మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం పీఎస్‌యుల్లో ప్రభుత్వ వాటాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేసి నిర్వహించేలా చూడాలని పేర్కొంది. ప్రపంచం చమురు రంగంలో ధరలు క్షీణించినప్పుడు జరిగిన విలీనాలన్నీ వ్యయాలు తగ్గించుకునేందుకు జరిగినవేనని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత దేశీయ చమురు పిఎస్‌యుల్లో ఒఎన్‌జిసి అతిపెద్ద ఉత్పత్తిదారు కాగా ఐఓసి అతిపెద్ద రిఫైనరీ, గెయిల్ అతిపెద్ద గ్యాస్ పైప్‌లైన్ సొంతదారు.