Unstoppable
-
అచ్చ తెలుగుతో అల్లు అర్జున్ కూతురు సర్ప్రైజ్
'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ షురూ చేశారు. మరోవైపు బన్నీ కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని మూవీని ప్రమోట్ చేస్తూనే తన వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పాడు. అయితే బన్నీ ఎపిసోడ్స్‌ని రెండుగా చేశారు. గతవారం ఒకటి రిలీజ్ చేయగా.. ఈ శుక్రవారం మరో ఎపిసోడ్ విడుదల చేస్తారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఇందులో అల్లు అర్జున్‌తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ షోలో కనిపించారు. హోస్ట్ బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా అని అడిగేసరికి.. 'అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..' అని పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న పద్యాన్ని ఆపకుండా చెప్పేసింది. ఇది చూసి బన్నీ, బాలయ్య తెగ మురిసిపోయారు.వ్యక్తిగత విషయాలతో పాటు 'పుష్ప 2' గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ ఎలివిషన్ ఇచ్చాడు. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా) -
ప్రభాస్ లేదా మహేశ్.. నీకు పోటీ ఎవరు? బన్నీ ఏం చెప్పాడంటే!
మరో 20 రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. అంతలోనే బన్నీ ప్రచారం మొదలుపెట్టేశాడు. 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్లో ఇతడు పాల్గొన్న ఎపిసోడ్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ గురించి, అలానే చాలా విషయాల గురించి బన్నీ ఓపెన్‌గా మాట్లాడేశాడు.మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేశ్ అని హోస్ట్ బాలయ్య అడగ్గా.. బన్నీ చాలా లాజికల్‌గా సమాధానం చెప్పాడు. 'నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే ! ఐ యామ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్' అని అన్నాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)ప్రస్తుతం 'పుష్ప 2'కి వస్తున్న హైప్ చూస్తుంటే బన్నీ చెప్పింది నిజమనేలా ఉంది. ఈ మూవీకి రిలీజ్‌కి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ తరహాలో భారీ కలెక్షన్స్ రావడం గ్యారంటీ. అదే టైంలో ప్రభాస్, మహేశ్.. ఇద్దరిలో ఎవరు పేరు చెప్పినా సరే ఆయా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.అలా ఓవైపు తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకున్న బన్నీ.. మిగతా హీరోల అభిమానులని ఇబ్బంది పెట్టకుండా కామెంట్స్ చేశాడని చెప్పొచ్చు. ఇదే ఎపిసోడ్లో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్.. ఇలా తన తోటీ హీరోలందరి గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)I'm my biggest competitor. Says in Pushpa Raj style#AlluArjun #UnstoppableWithNBK #Pushpa2TheRule pic.twitter.com/2wZgZXVMWn— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు
గురువారం థియేటర్లో రిలీజైన సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయారు. ఇదే టైంలో ఓటీటీల్లో ఈ శుక్రవారం ఒక్కరోజే 12 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. అంతకు ముందు రోజు మరో 8 మూవీస్-సిరీసులు వచ్చాయి. ఆదివారం మరో మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ)ఇలా చూసుకుంటే ఈ వీకెండ్లో ఏకంగా 20కి పైగా సినిమాలు-సిరీసులు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. కాకపోతే వీటిలో మా నాన్న సూపర్ హీరో సినిమా, అల్లు అర్జున్ 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతా వాటిలోనూ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. కానీ వాటి టాక్ బయటకు రావాల్సి ఉంది.ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (నవంబర్ 15)జీ5మా నాన్న సూపర్ హీరో - తెలుగు సినిమాపైథనీ - హిందీ సిరీస్ఆహాఅన్స్టాపబుల్ 4 ఎపిసోడ్ 04 - అల్లు అర్జున్ ఎపిసోడ్రేవు - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)నందన్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సోనీ లివ్ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ - ఇంగ్లీష్ సినిమాద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అన్ హ్యాపీ ఫర్ యూ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ సీజన్ 2 - హిందీ సిరీస్గన్నర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)క్రాస్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ - ఇంగ్లీష్ సినిమాజియో సినిమాద డే ఆఫ్ ది జకల్ - ఇంగ్లీష్ సిరీస్బ్యాక్ టూ బ్లాక్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 17)ద మ్యాజిక్ ఆఫ్ శిరి - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ద వాచర్స్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఆపిల్ ప్లస్ టీవీసిలో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేఆపరేషన్ బ్లడ్ హంట్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్ఆదితట్టు - మలయాళ సినిమా(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?
'దేవర', 'వేట్టయన్', సమంత 'సిటాడెల్' లాంటి క్రేజీ మూవీస్, సిరీస్‌లన్నీ గత వారం ఓటీటీల్లోకి వచ్చేశాయి. దీంతో ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. ఉన్నంతలో అన్ స్టాపబుల్ సీజన్ 4 అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తోంది. ఇది కాకుండా అంటే పలు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులే ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. కిరాక్ రెమ్యునరేషన్)మరోవైపు థియేటర్లలో ఈ వారం సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండింటిపైన హైప్ బాగానే ఉంది. కానీ ఏది హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం 22 సినిమాలు-సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఏ ఓటీటీలో రానుంది?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 11 - 17వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్ఇన్ కోల్డ్ వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 12క్రాస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 14నెట్ఫ్లిక్స్ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ద డార్క్ క్వీన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 12రిథమ్ ప్లస్ ఫ్లో: బ్రెజిల్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 12రిటర్న్ ఆఫ్ ది కింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 13హాట్ ఫ్రాస్టీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 13ద మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ (పోలిష్ సిరీస్) - నవంబర్ 13ఎమిలియా పెరెజ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 13ద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 14కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 15మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 15ఆహాఅన్స్టాపబుల్ టాక్ షో (అల్లు అర్జున్ ఎపిసోడ్) - నవంబర్ 15సోనీ లివ్ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 15జియో సినిమాసెయింట్ డెనిస్ మెడికల్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 13ద మ్యాజిక్ ఆఫ్ శ్రీ (హిందీ సిరీస్) - నవంబర్ 14ద డే ఆఫ్ ది జకల్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 15హాట్స్టార్డెడ్పూల్ అండ్ వాల్వరిన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 12యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 15జీ5పైథనీ (హిందీ సిరీస్) - నవంబర్ 15ఆపిల్ టీవీ ప్లస్బ్యాడ్ సిస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 13సిలో సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 15లయన్స్ గేట్ ప్లేఆపరేషన్ బ్లడ్ హంట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 15(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు) -
అమ్మాయిలకు అన్యాయం జరిగితే కోపం వచ్చేస్తుంది: అల్లు అర్జున్
డిసెంబరు 5న 'పుష్ప 2'తో అల్లు అర్జున్ రాబోతున్నాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు. ఇంతలో బన్నీ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.ప్రోమో బట్టి చూస్తే జాతీయ అవార్డ్ రావడంపై బన్నీ స్పందించాడు. తెలుగు వాళ్లకు ఇంతవరకు రాలేదు. దీన్ని రౌండప్ చేసి ఎలాగైనా కొట్టాలి అని ఫిక్సయ్యాను, ఇప్పుడు దక్కింది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. యాక్షన్ ఇష్టమా? రొమాన్స్ ఇష్టమా? అని బాలయ్య అడగ్గా.. తొక్కలో యాక్షన్ సర్ అని నవ్వుతూ మరీ మనసులో మాట బయటపెట్టాడు. షోకి అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా వచ్చారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా? అని బాలకృష్ణ అడిగితే బన్నీ మాట్లాడుతూ.. ఒక్కటా, దేనితో కొట్టలేదా అని అడిగిండి. అన్ని వెపన్స్ ఉపయోగించారు. అందుకే ఇలా సినిమాలు చేస్తున్నాం అని తాను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి ఫన్నీగా చెప్పాడు. ఏ వెపన్ వల్ల నువ్వు మారావ్ అనుకోవచ్చు అని బాలకృష్ణ అడగ్గా.. స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల మారానని సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.ఏ విషయంలో కోపం వస్తుంటుంది అని అడగ్గా.. బయటకు చెప్పకపోవచ్చు, కానీ అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుందని అల్లు అర్జున్ చెప్పాడు. చివరలో కొత్త మూవీ గురించి మాట్లాడుతూ.. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తాను అని బన్నీ, బాలయ్యతో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ 'పుష్ప' మేనరిజమ్‌తో నడుస్తూ 'తగ్గేదే లే' అని చేసి చూపించారు. ఓవరాల్‌గా చూస్తే ప్రోమోలో అయితే బన్నీ పెద్దగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పలేదు. ఫుల్ ఎపిసోడ్లో ఏమైనా ఉంటాయేమో చూడాలి?(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ) -
షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య.. బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. దాదాపు నాలుగున్న నిమిషాల ఈ వీడియోలో సూర్యతో పాటు 'కంగువ' దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. కంగువ సినిమా.. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)సూర్యని ఫుల్‌గా ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ.. ఎవరికీ తెలియని విషయాల్ని కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే.. వద్దు సర్ ఇప్పుడు పెళ్లయిపోయింది అని సూర్య అన్నాడు. కానీ తమ్ముడు కార్తితో ఫోన్ మాట్లాడిన టైంలో మాత్రం ఓ హీరోయిన్‌పై అన్నయ్యకు క్రష్ ఉందని చెప్పిన కార్తీ.. బాలయ్యకే షాకిచ్చాడు.'అగరం' ఫౌండేషన్ స్థాపించి ఎందరో విద్యార్థులకు సూర్య అండగా నిలుస్తున్నాడు. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలోనూ ఆ వీడియో ప్లే చేయగా.. సూర్య మళ్లీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం (నవంబర్ 8న) రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?) -
హైదరాబాద్‌లో సూర్య.. ఫోటోలు వైరల్
-
కాలకేయులకు ‘కూటమి’ అండ
నగరి: రాష్ట్రంలో నేరస్థులు, ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని తన స్వగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లల తండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. కూటమి నేతల అండతో కాలకేయులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాసమున్న చోటే టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని అనుచరుడు నవీన్ ఒక అమ్మాయిపై దాడిచేస్తే ఆమె బ్రెయిన్ డెడ్ అయి ఆస్పత్రిలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌గానీ, హోమ్ మంత్రి అనిత గానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ పరామర్శించలేదన్నారు.సత్వర వైద్యసేవలు సైతం అందించే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ ఇచ్చే పని పక్కన బెట్టి అధికార పార్టీ నాయకులు చెప్పే వారిపై కేసులు ఎలా బనాయించాలి, ఎలా అరెస్టు చేయాలి అనే ఆలోచిస్తున్నారని విమర్శించారు. 120 రోజుల్లో 74కు పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే.. సమాధానం చెప్పాల్సిన హోమ్ మంత్రి నేను గన్ ఎత్తుకు తిరగాలా, లాఠీ ఎత్తుకు తిరగాలా అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు.బద్వేలులో నిన్న అమ్మాయి చనిపోయిందని, 10వ తరగతిలో టాపర్ అయిన దస్తగిరమ్మను విఘ్నేష్ అనే వ్యక్తి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకుని కాల్చి చంపేస్తే.. బావమరిది బాలకృష్ణ నడిపే అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న వీరికి.. ఆడపిల్లలపై ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా మహిళా పోలీస్ స్టేషన్లను, దిశా చట్టాన్ని, యాప్‌ను పునరుద్ధరించాలని రోజా డిమాండ్ చేశారు. -
కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఏపీలో ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాలిటీ షోల్లో మునిగిపోయారు. ఓ వైపు రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యాచారాలు జరుగుతుంటే.. ఇటు విజయనగరం జిల్లా గుర్లలో అతిసారా వ్యాధితో 11మంది మరణిస్తే ఇవేమీ పట్టకుండా బావ బాలకృష్ణతో చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. వీకెండ్ విహారంలో భాగంగా రియాలిటీ షో అన్‌స్టాపబుల్‌కి హాజరయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు జరుగుతుంటే రియాలిటీషోలు చేసుకుంటున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.విజయ నగరం జిల్లా గుర్లలో అతిసారతో 11మంది ప్రాణాలు పోయినా పట్టించుకోని చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోనే ప్రధానంగా భావించారా? అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతమంది చనిపోతే ఒక్క సమీక్ష చేయలేదు చంద్రబాబు. శనివారం వీకెండ్ విశ్రాంతి కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ అన్ స్టాపబుల్ షోలో బిజీగా గడిపారు.హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు బాధితుల్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లలేదు. దీంతో వియ్యింకులు వినోదపు షోలపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
సూపర్ హీరోగా బాలయ్య.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన ట్రైన్.. ‘అన్‌స్టాపబుల్’
ప్రస్తుతం సోషల్‌మీడియాలో దేశవ్యాప్తంగా ఒక వార్త వైరల్ అవుతుంది. డ్రైవర్ లేకుండానే కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు గూడ్స్ రైలు పరుగులు తీసింది. గంటకు సుమారు 80 కిలామీటర్ల వేగంతో దూసుకెళ్లింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదీ సంగతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అన్‌స్టాపబుల్ పేరుతో సినిమా .. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథ ఇలాంటి సంఘటనతో ముందే ఒక సినిమా వచ్చిందని తెలుసా.. అన్‌స్టాపబుల్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా అచ్చు ఇలానే జరుగుతుంది. ఎంతో ఉత్కంఠతో సాగే ఈ సినిమా 2010లో విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా టోనీ స్కాట్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జరిగిన సంఘటన మాదిరే.. అన్‌స్టాపబుల్ సినిమా కథ ఉంటుంది. ఇందులో కూడా ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పొరపాటు వల్ల ట్రాక్ నుంచి కదిలిన ట్రైన్ ఆటోమెటిక్‌గా వెళ్లిపోతుంది. ఆ ట్రైన్లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగితే భారీ విధ్వంసం జరగడం ఖాయం. లోకో పైలట్ లేకుండానే వేగం పెంచుకుంటూ గంటకు 100 కిలోమీటర్లతో దూసుకెళ్తుంది. ఆ సమయంలో ఎదురుగా 150 మంది పిల్లలతో ఒక ట్రైన్ వస్తుంది. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఎలా బయటపడ్డారు..? అనే సీన్స్ నరాలు తెగె ఉత్కంఠతను పెంచుతాయి. ఆ తర్వాత ట్రాక్‌పై ప్రమాదానికి గురైన ఒక లారి పడి ఉంటుంది.. అప్పుడేం జరుగుతుంది..? అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఈ ఘటన దాటిన తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ వేగం తగ్గించుకోవాలి కానీ అందులో లోకో పైలట్ లేడు.. వేగం తగ్గకపోతే విధ్వంసమే.. ఆ సమయంలో డైరెక్టర్ మలుపు తిప్పిన ట్విస్ట్ ఏంటి..? చివరకు టన్నుల కొద్ది కెమికల్స్‌తో ఉన్న ఆ ట్రైన్‌ను ఎలా ఆపారు.. ఆ సమయంలో జరిగిన సీన్స్ తలుచుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రాణాలతో చెలగాటం లెక్క ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడకుంటే చూసేయండి మిమ్మల్ని మరో ప్రపంచంలోకి పక్కాగ తీసుకెళ్తుంది. ఫైనల్ ట్విస్ట్ ఎమిటంటే ఇది రియల్ సంఘటన అని కొన్ని అమెరికన్ పత్రికలు ప్రచురించాయి. 78 km without driver. Goods train ran over: Forgot to start and apply handbrake; Train reached Punjab from Jammu, stopped by placing wooden stopper#Train pic.twitter.com/dDIj7G78py — Dushyant Kumar (@DushyantKrRawat) February 25, 2024 -
యాప్ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!
మహబూబాబాద్: ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ లేదు. అయినా ఓ యాప్‌లో హాల్టింగ్ చూపడంతో ప్రయాణికులు సోమవారం ఆ రైలు ఎక్కారు. తీరా ఆగకుండా వెళ్లడంతో గందరగోళానికి గురయ్యారు. ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఉండగా, ఇటీవల రద్దు చేశారు. అయితే ఓ యాప్‌లో హాల్టింగ్ ఉన్నట్లు చూపడంతో కేసముద్రంలో దిగాల్సిన ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో ఆ రైలు ఎక్కారు. తీరా చూస్తే డౌన్‌లైన్‌లో కేసముద్రంలో ఆగకుండా వెళ్లడంతో మహబూబాబాద్‌లో దిగారు. అలాగే, అప్‌లో లూప్‌లైన్ మీదుగా ఆగకుండా వెళ్తుండడంతో రైలులో ప్రయాణిస్తున్నవారితోపాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో స్టేషన్లో రైలును నిలిపారు. అనంతరం యథావిధిగా ముందుకు కదిలింది. మొత్తానికి ఓ యాప్ తప్పుడు సమాచారం చూపడంతో గందరగోళానికి గురైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'అన్‌స్టాపబుల్' మూవీ
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సీమ శాస్త్రి', 'ఈడోరకం ఆడోరకం' తదితర కామెడీ సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ 'అన్‌స్టాపబుల్'. 'అన్లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. IMDBలోనూ 7.8 రేటింగ్ , బుక్ మై షోలో 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అశ్విన్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా బవాల్ - హిందీ మూవీ అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా ఆహా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ - తెలుగు సినిమా నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో జీ5 మౌరా - పంజాబీ చిత్రం జియో సినిమా ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22 స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23 దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
ఇకపై నవ్వించే సినిమాలే చేస్తాను
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్‌స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్‌స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు. -
బిగ్ బాస్ తరువాత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే...?
-
అన్ స్టాపబుల్ చూసి ఒక్కసారి కూడా నవ్వని వాళ్లకు...!
-
సన్ అఫ్ ఇండియా సినిమా డిజాస్టర్ కి కారణం అదే
-
ఈవీవీ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు. -
అన్‌స్టాపబుల్ డైరెక్టర్ తో సూపర్ కాండీడ్ ఇంటర్వ్యూ
-
అందుకే ‘అన్ స్టాపబుల్’ టైటిల్ పెట్టాం : వీజే సన్నీ
నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని. అన్‌స్టాపబుల్ షోకి కూడా వెళ్లాను. నా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెడుతున్నారని రత్నబాబుని అడిగాను. ‘మన టైటిల్ అన్ స్టాపబుల్ అన్ లిమిటెడ్ ఫన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టైటిల్ జనాల్లో ఉంది కాబట్టి అన్ స్టాపబుల్ యాప్ట్ గా ఉంటుంది’ అని చెప్పారు. నాకు కూడా టైటిల్ బాగా నచ్చింది’ అని హీరో వీజే సన్నీ అన్నాడు. రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీజే సన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే కథలన్నీ ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో 'అన్ స్టాపబుల్' లాంటి అన్ లిమిటెడ్ ఫన్ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది. ► ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లంతా నాకు కంఫర్ట్ జోన్ కల్పించారు. పృద్వీతో మంచి స్నేహం ఏర్పడింది. అలాగే పోసాని, రాజా రవీంద్ర, రఘు ఇలా అందరితో పని చేయడం మంచి అనుభూతి. నన్ను ఎప్పుడూ కొత్తవాడిలా ట్రీట్ చేయలేదు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది. ► సప్తగిరి చాలా ఎనర్జిటిక్. సీన్ లో ఆయన ఉండే ఇన్వాల్వ్ మెంట్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. సీన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక ప్లాన్ లో ఉంటారు. ఆ ప్లాన్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. తనని పరిశీలించాను కాబట్టి అతనకి తగట్టు నేను వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో వర్క్ చేశాం. ► ఇందులో నాకు జోడిగా నక్షత్ర నటించింది. తను ఇంతకుముందు ‘పలాస’ అనే సినిమా చేశారు. తను తెలుగమ్మాయి కావడం వలన సెట్స్ లో ఉన్నప్పుడు ప్రామ్టింగ్ ఇచ్చే అవసరం ఉండేది కాదు. చాలా చక్కగా నటించారు. ► బిగ్ బాస్ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్ రత్నబాబు గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రత్నబాబు గారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. ► ‘ఎటీఎం’ చూసి దర్శకుడు హరీష్ శంకర్ గారు ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉంది. నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే ఓ పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ► ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి ఫన్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్. -
కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్
‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను. ఏ రచయిత అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు. -
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేసిన ‘అన్ స్టాపబుల్’ రిలీజ్ డేట్ (ఫొటోలు)
-
షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు, బుల్లెట్ తగలడంతో..
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ షూటింగ్లో గాయపడ్డాడు. సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి స్పెషల్ ప్రోమో షూట్ చేసే క్రమంలో అతడికి గాయాలయ్యాయి. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్‌స్టాపబుల్. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఓ ప్రోమో షూట్ నిర్వహించింది. ఇందులో పోలీస్ గెటప్‌లో ఉన్న సప్తగిరి అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు? అని గన్ పట్టుకుని పృథ్వీరాజ్‌ను బెదిరించాడు. ఇంతలో అటువైపుగా సన్నీ రావడంతో పృథ్వీ అతడిపైకి గన్ ఎక్కుపెట్టాడు. పొరపాటున అది పేలడంతో సన్నీకి బుల్లెట్ తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ డమ్మీ గన్ను కావాలనే పేల్చారని, సన్నీకి ఏ గాయమూ కాలేదని, ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలోనూ సన్నీ డబ్బులు దొంగతనం చేసిన వీడియో వైరల్ అయింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ కోసం అలా స్టంట్ చేశాడని ఇట్టే పసిగట్టారు ఆడియన్స్. ఇకపోతే గతంలో సీరియల్స్‌లో నటించిన సన్నీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. షూటింగ్ లో బిగ్ బాస్ సన్నీకి ప్రమాదం బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలింపు#vjsunny #UnstoppableEknath pic.twitter.com/CO3Vqtf3Kn — yenugula somasekhar (@yenugulasomase1) May 12, 2023 చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?