Upendra
-
ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే.. జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
దీని గురించి ఎవరూ మాట్లాడరేంటి?: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఉపేంద్ర చెప్పినట్లుగానే ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రారంభంలో కొన్ని చిత్రవిచిత్ర డైలాగులు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అందులో.. 'తెలివైనవాళ్లు తెలివితక్కువవాళ్లుగానే కనిపిస్తారు. కానీ తెలివి లేనివాళ్లు మాత్రం పైకి తెలివైనవాళ్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు' అన్న డైలాగ్ కూడా ఉంది.ఇప్పుడిది అవసరమా?దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థియేటర్లో సినిమా వీక్షించిన ఏ ఒక్కరూ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఇప్పుడిది అవసరమా సర్? మీ సినిమా అందరి కంట్లో పడింది. అందుకు సంతోషించండి అని కామెంట్ చేశాడు. మరికొందరేమో.. 'మేము అంత ఇంటెలిజెంట్ కాదు సర్..', 'అసలు యూఐ సినిమాను థియేటర్లో చూడనివారు నిజమైన మేధావులు..', 'అక్కడ కనిపిస్తున్న డైలాగ్‌లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అబ్బో.. ఇలాంటి డైలాగులకు కొదవే లేదుయూఐ సినిమాలో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. నువ్వు మేధావివైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపో.. తెలివితక్కువవాడితైనే సినిమా అంతా చూడు.. వంటి వింత కొటేషన్లు దర్శనమిస్తాయి. రేష్మ నానయ్య, సన్నీలియోన్, జిష్షు సేన్‌గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Why is no one talking about this that was seen on screen ? ! pic.twitter.com/ZzrOJJsuUK— Upendra (@nimmaupendra) December 23, 2024 చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
ప్రపంచాన్నే టాలీవుడ్ షేక్ చేస్తోంది: ఉపేంద్ర
‘‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకుని, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ,ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతోంది. ఈ గొప్పదనం అంతా తెలుగు ప్రేక్షకులదే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండియానే కాదు... ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. వెయ్యి కోట్లు, రెండువేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు.ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘యూఐ’ రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది. ఆడియన్స్ ఓ కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు (ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ..) మైథలాజికల్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చూశారు.కానీ ‘యూఐ’ సినిమా సైకలాజికల్ కల్కి. ‘యూఐ’ సినిమాలోని అంశాలను ఆడియన్స్ డీకోడ్ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను. కేపీ శ్రీకాంత్‌గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు, ఆయన లహరిలాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు. ఇక ‘యూఐ’ సినిమాను అల్లు అరవింద్‌గారు తెలుగులో రిలీజ్ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు రేష్మ. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు ఎస్కేఎన్, అంబికా రామచంద్రరావు, ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ తులíసీ రామ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ చంద్రు మనోహరన్, కోప్రోడ్యూసర్ నవీన్ మనోహరన్, డైలాగ్ రైటర్ పార్థసారథి, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల మాట్లాడి, ‘యూఐ’ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. -
గ్లామర్ డాల్‌లా ఉపేంద్ర ‘యూఐ’ మూవీ హీరోయిన్ రీష్మా నానయ్య (ఫొటోలు)
-
ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది: ఉపేంద్ర
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు. -
సందేశాలు ఇవ్వను... తీసుకోను: ఉపేంద్ర
‘‘ఆడియన్స్ వినోదం కోసం థియేటర్స్‌కు వస్తారు. వారిని అలరించే అన్ని కమర్షియల్ హంగులు ‘యూఐ’ సినిమాలో ఉన్నాయి. నార్మల్‌గా చూసినప్పుడు ‘యూఐ’ ఓ సినిమాగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే కథలో మరో లేయర్ కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్‌గా వెళితే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో అన్నీ కొత్తగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నా దృష్టిలో ప్రేక్షకులే సూపర్ స్టార్స్. ఈ విషయాన్ని నా తొలి సినిమాతోనే గ్రహించాను. వాళ్లు ఫిల్మ్‌మేకర్స్ కంటే పైనే ఉంటారు’’ అని ఉపేంద్ర అన్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంటాను.ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక ఫూల్ వెళ్తాడనేది సామెత. బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో(నవ్వుతూ). అయితే నేను ఫీలయ్యే కథనే ఆడియన్స్ కూడా ఫీలవుతున్నారనుకుని, కొందరితో చర్చించి, ‘యూఐ’ సినిమా తీశాను. ‘యూఐ’ అంటే ఏమిటో థియేటర్స్‌లో చూడండి. ‘యూఐ’ వార్నర్ అంటూ వచ్చిన ఈ సినిమా వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోని కాంప్లెక్స్ తరహా విజువల్స్ కనిపించాయంటున్నారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మైథలాజికల్. ‘యూఐ’ మూవీ సైకలాజికల్. ఒక సినిమాతో మరొక దానికి సంబంధం లేదు.‘యూఐ’కిపార్టు 2 లేదు. ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్. టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఇప్పుడున్న టెక్నాలజీతో రూమ్‌లోనే సినిమా తీయొచ్చు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నేను ఏం మార్చలేను. నన్ను నేనే మార్చుకోలేకపోతున్నాను. అందుకే సందేశాలు ఇవ్వను. తీసుకోను. సినిమా అంటే వ్యాపారమే. సినిమా సక్సెస్ వేరు... పొలిటికల్ సక్సెస్ వేరు’’ అని అన్నారు.అల్లు అర్జున్ మంచి పెర్ఫార్మర్. ఆయనకు నేను ఫ్యాన్. త్రివిక్రమ్ అంటే కూడా ఇష్టమే. వారి కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో నటించడం హ్యాపీ. ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే తెలుగులో చేయలేకపోయాను. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.. ఆయన బయటకు వచ్చారు. సమస్య లేదు.రజనీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నిజమైనట్లుగా ఉంది. దాదాపుపాతిక సంవత్సరాల క్రితం రజనీకాంత్‌గారిని కలిశాను. ఆయన అప్పుడు నాకు చెప్పిన విషయాల అర్థం ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. -
'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024 -
2040లో ఏం జరుగుతుంది?
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ: ది మూవీ’. రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్యపాత్రలుపోషించారు. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్ – వీనస్ ఎంటర్టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘‘ప్రపంచంలో 2040లో ఏం జరుగుతుంది? అనే నేపథ్యంలో ‘యుఐ: ది మూవీ’ కథ ఉంటుంది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
రజినీకాంత్ కి విలన్ గా ఉపేంద్ర..?
-
రజనీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ..?
సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా కన్నడ సూపర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. -
కంచర్ల సందేశం
‘ఉపేంద్రగాడి అడ్డా’ ఫేమ్ కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ జైస్వాల్ హీరోయిన్. సుమన్, అజయ్ ఘోష్ ఇతర పాత్రలు చేశారు. ఎస్ఎస్ఎల్వీ క్రియేషన్స్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. అరకులో చిత్రీకరించిన తాజా షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ–‘‘మా ఇంటి పేరైన ‘కంచర్ల’ టైటిల్‌తో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 15 తర్వాత సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో తీసిన మా చిత్రం గొప్ప విజయం అందుకుంటుంది’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర బాబు. ‘‘కంచర్ల’ సినిమాలో మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు యాద్ కుమార్. ‘‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది’’ అన్నారు మీనాక్షీ జైస్వాల్. -
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 'కబ్జ' చిత్రానికి అభినందనలు
కన్నడలో భారీగా ప్రేక్షకాధరణ పొందిన చిత్రం 'కబ్జ'. ఇందులో ఉపేంద్ర , సుదీప్ , శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మల్టీస్టారర్ చిత్రంగా 2023 మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయనప్పటికీ నష్టాలు అయితే రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు అయిన ఆర్. చంద్రుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రంతో సత్కరించింది.శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై కబ్జ సినిమాను ఆర్. చంద్రు నిర్మించారు. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను పూర్తిగా ఆయన క్లియర్ చేశాడు. దీంతో ఆర్.చంద్రు నిర్మాణ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం జారీ చేసింది. పన్ను బకాయిలు పెట్టకుండా ఆ శాఖకు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఆర్.చంద్రు నిర్మించి, దర్శకత్వం వహించిన 'కబ్జా' దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ సినిమా నిర్మాత శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇప్పుడు అత్యధిక పన్ను కట్టిన ఘనత దక్కింది.ఈ బ్యానర్‌పై ఐదు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.చంద్రు కన్నడ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. చిక్కబళ్లాపూర్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రు ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో దర్శకుడిగా విజయం సాధించడం అనేది చాలెంజింగ్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ, అతను ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించాడు. తమ సొంత బ్యానర్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు.ఇటీవల జరిగిన కన్నడ సినీ అవార్డ్స్‌లో 'కబ్జా' ఉత్తమ VFX పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ కబ్జ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. -
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్మేట్స్ దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు. -
ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఆ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని (41) హీరోయిన్గా నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.ఉపేంద్రతో నటించిన 'ఏ' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు 'ఏ' సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్ చేశారని తెలిపింది. ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. 'వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్లు బాగుంటాయి.' అని చాందిని తెలిపింది. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
మళ్లీ ఏ
ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఏ’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. 1998లో దాదాపు రూ. 1 కోటీ 25 లక్షలతో రూపోందిన ఈ చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేసింది. కొత్త తరహా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని తాజాగా 4కేలో ఉపేంద్ర ఉప్పి క్రియేషన్స్, లింగం యాదవ్ చందు ఎంటర్టైన్మెంట్ విడుదల చేయనున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.ఈ సందర్భంగా లింగం యాదవ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఏ’ ఒక సంచలనం. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాం. ఇక మేం 4కేలో విడుదల చేసిన ప్రభాస్ ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ‘ఏ’కి కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్‌తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్‌గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్‌లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్‌లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్‌లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్‌గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్‌ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్‌కుమార్‌తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అంటూ ఆయన చెప్పడం విశేషం. -
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్. -
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వివాహా వార్షికోత్సవ వేడుక (ఫొటోలు)
-
‘ఉపేంద్ర గాడి అడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్: ఉపేంద్ర గాడి అడ్డా నటీనటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, మురళీధర్ గౌడ్, అప్పారావు, కిరీటి దామరాజు, సంధ్య జనక్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఎల్ ఎస్ క్రియేషన్స్ నిర్మాత: కంచర్ల అచ్యుతరావు దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్. కె విడుదల తేది: డిసెంబర్ 1, 2023 కథేంటంటే.. ఉపేంద్ర(కంచర్ల ఉపేంద్ర) బంజారాహిల్స్ ని ఓ బస్తీ కుర్రాడు. డిగ్రీ వరకూ చదువుకున్నా... ఈజీగా మనీ సంపాధించి సెటిల్ అయిపోవాలనునుకునే కుర్రాడు. అందుకోసం ఓ ధనవంతురాలిని పెళ్లి చేసుకోవాలని అప్పులు చేసి... పబ్ ల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సావిత్రి(సావిత్రి కృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె గొప్పింటి అమ్మాయి అనుకుని... తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి... ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే తన గురించి ఆమెకు నిజం చెప్పాలని అనుకుని... తాను ధనవంతుడిని కాదని... బంజారాహిల్స్ లో ఓ బస్తీ కుర్రాడిని అని చెబుతాడు. మరి ఆ బస్తీ కుర్రాడిని... సావిత్రి పెళ్లి చేసుకుందా? అసలు సావిత్రి ఎవరు? వీరిద్దరికీ పెళ్లి అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. యువతను ఆకట్టుకునే అంశాలతో మంచి సందేశం అందించిన చిత్రమిది. నేడు సోషల్ మీడియా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో... దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మాయిలు సోషియల్ మీడియా ప్రభావంతో తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే దానిని చాలా బాగా చూపించారు. సోషియల్ మీడియాలో అబ్బాయిలు... అమ్మాయిలను ఎలా మోసం చేసి... చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు? దాని వల్ల వారు చేసే క్రైం ని ద్వితీయార్థంలో దర్శకుడు చక్కగా చూపించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లల జీవితాలను ఎంత ప్రమాదంలోకి నెడుతోందనేదాన్ని చూపించారు వారి తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా చూపించడం బాగుంది. రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం సరదాగా సాగిపోతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్‌లో కథ స్లోగా సాగుతుంది. మంచి సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. సోషియల్ మీడియా ప్రభావంతో యువతులు ఎలా మోసపోతున్నారనే దాన్ని ఈ చిత్రం ద్వారా చూపిస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు. ఎవరెలా చేశారంటే.. కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడైనా చాలా చక్కగా నటించారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి... మాస్ ను ఆకట్టుకున్నాడు. ఓ బస్తీ కుర్రాడు ఎలా ఉంటారో అలాంటి మాస్ లుక్ తోనూ... మరో వైపు రిచ్ కిడ్ గానూ రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు.. ఉపేంద్రకు జోడీగా నటించిన సావిత్రి కృష్ణ కూడా బాగా చేసింది. బాధ్యత గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ కూడా బాగా నవ్వించారు. అలాగే జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు కాసేపు ఉన్నా నవ్వించారు. బలగం మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. సోషియల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... అమ్మాయిలను మోసం చేసే పాత్రలో కిరీటి దామరాజు పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా సంధ్య జనక్, బస్ స్టాప్ కోటేశ్వరరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. సంగీతం మాస్ ను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.