VaraLakshmi SharathKumar
-
ఆస్తులు, అప్పులు వెల్లడించిన విరుదునగర్ ఎంపీ అభ్యర్థులు
చెన్నై: విరుదునగర్ అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆస్తులు, అప్పుడు వెల్లడించారు. బీజేపీ నాలుగో జాబితాలో లోక్‌సభ టికెట్ దక్కించుకున్న నటి 'రాధిక శరత్‌కుమార్', నటుడు & రాజకీయ నాయకుడైన విజయకాంత్.. కుమారుడు విజయ ప్రభాకరన్ DMDK తరపున విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు. విరుదునగర్ నుంచి పోటీ చేయడానికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన రాధిక వద్ద రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు.. ఇలా మొత్తం రూ. 53.45 కోట్లు ఉన్నట్లు తెలిపింది. రాధిక రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం అప్పులు రూ. 14.79 కోట్లు ఉన్నట్లు సమాచారం. చెన్నై సిటీ కాలేజీకి చెందిన బీ ఆర్చ్ గ్రాడ్యుయేట్ అయిన విజయ ప్రభాకరన్ దగ్గర రూ. 2.50 లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, చరాస్తులు రూ.11,38,04,371 గా ఉన్నాయి. ప్రభాకరన్ మొత్తం అప్పులు రూ.12,80,78,587 వరకు ఉన్నాయని సమాచారం. ఈయన మొత్తం ఆస్తి రూ. 17.95 కోట్లు అని తెలుస్తోంది. -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మీ శరత్కుమర్
-
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మైఖెల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్
విలన్ గ్యాంగ్‌లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్... ఇలా నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్లతో దూసుకెళుతున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ‘మైఖెల్’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్ కిషన్ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
NBK107 నుంచి క్రేజీ అప్డేట్, బాలయ్యతో ‘జయమ్మ’ ఢీ!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నెక్ట్ ప్రాజెక్ట్ ప్రముఖ డైరెక్టర్ గోపిచంద్ మిలినేనితో చేస్తున్న విజయం విధితమే. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన చిత్ర బృందం ఎన్బీకే 107నే వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని ప్రారంభించింది. చదవండి: మహేశ్ బాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ‘పుష్పరాజ్’, ఫ్యాన్స్ ఫిదా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్‌ని తీసుకున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఈ చిత్రంలో మరో విలన్ పాత్రకు పవర్ ఫుల్ లేడి పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా బుధవారం చిత్ర బృందం ఎన్బీకే 107 నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ దక్షిణాది లేడి విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాగస్వాయ్యం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెను సెట్స్‌లోకి ఆహ్వానిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళనాట తిరుగులేని విలన్‌గా కొనసాగుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తిగా మారింది. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. ఇక తెలుగులోను తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోను .. 'క్రాక్' సినిమాలో జయమ్మగాను ఆమె తన విలనిజాన్ని చూపించింది. ఇక బాలయ్యను కూడా ఆమె ఏ రేంజ్లో ఢీ కోట్టనుందో చూడాలి. Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ — Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022 -
Tatvamasi: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘తత్వమసి’
వరలక్ష్మీ శరత్ కుమార్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. రమణ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఈఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని గురువారం విడుదల చేసింది చిత్రబృందం. నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, ఇషాన్, రాధాకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ'
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవలె క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ జాంబిరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మరో ఇంటట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను సంప్రదించారట. ఇటీవలె తెలుగులో ఆమె నటించిన క్రాక్, నాంది సినిమాలకు మంచి ఆధరణ లభించింది. ముఖ్యంగా వరలక్ష్మి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చదవండి : వైరల్ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు -
కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్ అవగాహన
సాక్షి, చెన్నై: ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కరోనాపై అవగాహన కలిగించే విధంగా ద్విపాత్రాభినయం చేసిన వీడియో విడుదలైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కరోనాపై పోరాటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. చదవండి: సోనూసూద్ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్ట్రేటర్ -
చిరంజీవి ఫోన్ చేశారు: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘నన్ను నేను ఓ ఇమేజ్ చట్రానికి పరిమితం చేసుకోవాలనుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేయకూడదని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా.. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలం. నా దృష్టిలో నటన ఓ ఉద్యోగంలాంటిది. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి మాట్లాడుతూ–‘‘నాంది’ సినిమాలో ఆద్య అనే క్రిమినల్ లాయర్ పాత్ర చేశా. ఆద్య పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. లాయర్ పాత్ర కాబట్టి భారీ డైలాగులు చెప్పాల్సి వచ్చేది. దీంతో స్కూల్ పిల్లల్లా రాత్రిళ్లు డైలాగ్స్ బట్టీ పట్టి, ఉదయం షూటింగ్‌కి వెళ్లేదాన్ని. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా విజయ్ ఈ కథ తయారు చేసుకున్నాడు. సౌత్‌లో 30కి పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించా.. ఇకపై కూడా నటిస్తాను. ఈ విషయంలో నటుడు విజయ్ సేతుపతిగారే నాకు స్ఫూర్తి. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ సినిమాలో నేను నటించిన జయమ్మ పాత్ర బాగుందని నాన్నగారు(శరత్‌కుమార్) గర్వంగా ఫీలయ్యారు. చిరంజీవిగారు ఫోన్ చేసి ‘జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు.. డబ్బింగ్ కూడా బాగుంది’ అని అభినందించడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా.. మరో రెండు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
కరోనాకి భయపడాలి
నటుడు శరత్‌కుమార్ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయనకు నెగిటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నాన్నను మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కరోనా అనేది ఎంత ప్రమాదమో కుటుంబంలో ఎవరికైనా పాజిటవ్ అని నిర్ధారణ అయినప్పుడే తెలుస్తుంది. అది ఎంత ఘోరమైన వైరస్సో తెలిసింది. అందుకే కరోనాకి భయపడాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన తండ్రికి వైద్యం చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారామె. -
గోవాలో ఆటా పాటా
‘డాన్ శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నేటి నుంచి గోవాలో జరుగుతున్న చివరి షెడ్యూల్లో రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఒక ఇంటెన్స్ స్టోరీతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన ‘భూమ్ బద్దల్’ అనే ప్రత్యేక పాట బ్లాక్‌బస్టర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
జయమ్మకు బైబై
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా నటిస్తోన్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘క్రాక్’. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై మధు .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మంగళవారం తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ ముగియడంతో జయమ్మ పాత్రకు బైబై చెప్పారు వరలక్ష్మీ. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా... ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అయిపోతారు వరలక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉండటం విశేషం. -
‘పెళ్లి చేసుకోను.. సినిమాలను వదలను’
మనసులో ఏం దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్. తనపై వచ్చే రూమర్లపై కూడా అలాంటి సమధానాలే ఇస్తారు వరలక్ష్మి. ఈ ఫైర్‌బ్రాండ్ వివాహం గురించి ఫిలింనగర్లో ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి వరలక్ష్మి పెళ్లి ముచ్చట ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే సినిమాలను వదిలేసి.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వరలక్ష్మి వివాహం చేసుకోబోయే వ్యక్తికి ఇండియన్ క్రికెట్ టీమ్‌తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించారు వరలక్ష్మి. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అదేంటో నా పెళ్లి గురించి నాకే చివరగా తెలుస్తుంది. మళ్లీ అవే పుకార్లు. నా పెళ్లి గురించి ఎందుకు అందరికి ఇంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. ఆ వార్తను ఇంటి పైకెక్కి అరిచి మరి అందరికి చెప్తాను. అప్పుడు దీని గురించి వార్తలు రాయండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు.. సినిమాలు వదిలేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు వరలక్ష్మి.(మిమ్మల్ని మీరు నమ్మండి) Why am i the last to know that I'm getting married..??Hahahah the same nonsense rumors..why is everybody obsessed with me getting married..if I'm getting married I will shout it off the roof tops..to all u media ppl writing abt this..IM NOT GETTING MARRIED. IM NOT QUITTING FILMS pic.twitter.com/VimowM2pMR — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath) May 18, 2020 అయితే ఇన్నాళ్లు మీడియాలో విశాల్ - వరలక్ష్మిల వివాహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఈ వార్తలను ఖండించేవారు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్‌లో విశాల్‌కు అనిశా రెడ్డితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.(విశాల్... నా ఓటు కోల్పోయావ్) -
పాటలే బ్యాలెన్స్
‘క్రాక్’ షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్‌వర్క్ ఉంటుందట. షూటింగ్స్ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
రొమాంటిక్ పోలీస్!
బీచ్‌లో ప్రేయసితో ప్రేమరాగం తీస్తున్నారట రవితేజ. ‘డాన్ శీను’(2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చీరాలలోని ఓ బీచ్‌లో జరుగుతోందట. అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ పాట చిత్రీకరణకు ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు రవితేజ. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే8న విడుదల కానుంది. -
మిమ్మల్ని మీరు నమ్మండి
హీరోయిన్.. లేడీ విలన్...క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా కథ రీత్యా ఎలాంటి పాత్రలోనైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా నటిగా ఒదిగిపోగలరు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇప్పటికి పాతిక సినిమాలను పూర్తి చేశారామె. ఈ సందర్భంగా ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి, తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు వరలక్ష్మి. ఆ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘మన జీవితంలో మంచి విషయాలు అంత సులభంగా జరగవు. కానీ మన కలలు నిజం కావాలి. అందుకే నేను శక్తి వంచన లేకుండా కష్ట పడుతుంటాను. ఇప్పుడు నా జీవితంలో నేను ఈ స్థాయిలో నిలబడటానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. 25 సినిమాలు పూర్తి చేసి నా కెరీర్లో ఓ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నన్ను సరిగా అర్థం చేసుకోలేని, నా పట్ల వ్యతిరేక భావనలను కలిగి ఉన్నవారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే... వీరి వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక–నిర్మాతలు, సహాయం చేస్తున్న నా స్టాఫ్ మెంబర్స్‌కు, అండగా ఉంటున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్మి పని చేయండి. కలలు కంటూనే ఉండండి’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. తమిళంలో ఫుల్ బిజీగా ఉంటూ డబ్బింగ్ చిత్రాల్లో ప్రేక్షకులకు కనిపించే వరలక్ష్మి సందీప్‌కిషన్ ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో తెలుగులో తొలి స్ట్రయిట్ సినిమా చేశారు. ఇప్పడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
సరికొత్త కోణానికి నాంది
‘అల్లరి నరేష్ నూతన చిత్రం ‘నాంది’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా, దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా పరిచయమవుతున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్‌నివ్వగా, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. అందరూ కొత్తవారితో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నరేష్‌గారికి, సతీష్‌గారికి థ్యాంక్స్. క్రైమ్ థ్రిల్లర్‌లో సాగే కథ అయినప్పటికీ ఓ సామాజిక అంశాన్ని కూడా చర్చిస్తున్నాం’’ అన్నారు విజయ్ కనకమేడల. ‘‘ఈ నెల 22నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. మార్చిలో షూటింగ్ పూర్తి చేసి, వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘నరేష్‌గారిలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. ఈ సినిమాకు కథ: వెంకట్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిద్. -
పాత బస్తీలో డిష్యుం డిష్యుం
పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఓ పెద్ద ఫైట్‌ని చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్‌లో సాగే ఈ ఫైట్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ చక్కగా డిజైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
జాతరలో క్రాక్
రికార్డింగ్ డ్యాన్స్‌లు, పాటలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. ఓ గుడికి సంబంధించిన జాతరతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. అప్పుడు అక్కడికి పోలీస్ డ్రెస్‌లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్ సీన్‌ను వెండితెరపై చూడాల్సిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రధారి. ఇందులో పోలీసాఫీర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ నెల 21న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి సహ – నిర్మాత. ‘క్రాక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆ హీరో సరసన వరలక్ష్మి..
హైదరాబాద్ : తమిళ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్తో ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. సందీప్ కిషన్, హన్సికా మోత్వానీలు ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ సినిమాకు నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఆమె నటించిన తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే వరలక్ష్మి మరో తెలుగు సినిమాకు సైన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజా తదుపరి సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరవనున్నారు. ఆర్టీ66 వర్కింగ్ టైటిల్‌గా రవితేజ, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రల్లో గోపిచంద్ మలినేని నిర్ధేశకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టాగూర్ మధు నిర్మించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పై అడుగుపెట్టనుందని నిర్మాతలు ధ్రువీకరించారు. వరలక్ష్మి సహా పలువురు దిగ్గజ నటులు ఈ మూవీలో నటించనున్నారని సమాచారం. రవితేజ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించే ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతారు. వరలక్ష్మి మారి 2, పందెం కోడి సహా పలు చిత్రాల్లో తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. -
జోరు పెరిగింది
‘పందెంకోడి 2, సర్కార్’ వంటి తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన వరలక్ష్షీ్మ శరత్‌కుమార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడామె డైరెక్ట్‌గా తెలుగు చిత్రాలకు సైన్ చేస్తూ టాలీవుడ్లో జోరు పెంచారు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘రవితేజగారి సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తారు. కాగా, సందీప్‌కిషన్ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ వరలక్ష్మికి తొలి తెలుగు చిత్రం. తమిళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్బిజీగా ఉన్నారామె. -
కేసులు ఇవ్వండి ప్లీజ్
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో లె రకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను తెనాలిలో ఆదివారం విడుదల చేశారు. ‘‘ఇంతకాలం రకరకాల భోజనాలు తిన్నట్టుగా అనిపించినా, ఈ సినిమాతో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉంది. చాలాకాలం తర్వాత నా సినిమాను నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’’ అని తెనాలిలో జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో అన్నారు సందీప్ కిషన్. బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాయికార్తీక్. -
జీవితంలో పెళ్లి చేసుకోను
‘ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడండి?’ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఇది. ‘ఇంకా ఆలోచించలేదు. నచ్చినవాడు దొరికినప్పుడు’ అంటూ సమాధానాలు ఇస్తుంటారు హీరోయిన్లు. వరలక్ష్మీ మాత్రం ‘అసలు పెళ్లి చేసుకునేది లేదు’ అంటున్నారు. అనుకున్నది, అనిపించినది ముక్కుసూటిగా చెప్పేయడం నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు అలవాటు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కన్ని రాశి’ అనే తమిళ సినిమాలో నటించారామె. ఈ సినిమా ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్లో మీరు ఎవర్ని పెళ్లాడతారు? అని ప్రశ్నించగా – ‘‘కన్ని రాశి’ స్క్రిప్ట్ చదవగానే నాకు నచ్చింది. ఇందులో లవ్ మ్యారేజ్ ప్రాముఖ్యతను ప్రస్తావించాం. కానీ నా జీవితంలో నేను ఎవ్వర్ని పెళ్లి చేసుకోను. పెళ్లి అనే సంప్రదాయాన్ని నేను పెద్దగా నమ్మను’’ అని అన్నారు. గతంలో విశాల్, వరలక్ష్మి రిలేషన్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. -
విశాల్... నా ఓటు కోల్పోయావ్
పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్‌కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్‌కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నటి వరలక్ష్మిశరత్‌కుమార్ నటుడు విశాల్‌పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్ పేరుతో విశాల్ జట్టు, స్వామి శంకర్‌దాస్ పేరుతో కే.భాగ్యరాజ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్‌దాస్ జట్టు గురువారం నటుడు విజయకాంత్‌ను కలిసి మద్దతు కోరారు. శుక్రవారం నటుడు కమలహాసన్‌ను కలిశారు. కాగా పాండవర్ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్ నడిగర్‌సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్‌కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్‌కుమార్ విశాల్‌పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్‌కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటుడు విశాల్‌పై మాటల దాడి చేశారు. వరలక్ష్మికి ఆ హక్కు ఉంది కాగా వీడియోను విడుదల చేసిన విశాల్‌పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్‌కుమార్ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్ జట్టు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను స్థానిక ఆల్వార్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్‌సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా? విశాల్ వీడియోపై శరత్‌కుమార్ సతీమణి, నటి రాధికా శరత్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్ మీరు చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్‌కుమార్ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్‌కుమార్ విశాల్‌పై విరుచుకుపడ్డారు.