Venugopal
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
పవన్‌కు ఇది తగునా?
పవన్ కల్యాణ్‌కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్‌కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్‌కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్‌ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్‌కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్‌కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్‌ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్‌ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్‌ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్‌ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్‌లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
లడ్డూలో ‘కుట్ర’ కోణం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనడంలో కుట్రకోణం దాగి ఉందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ఇచ్చిన నివేదికలోనే అసలు కుట్ర దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆ నివేదికపై సమగ్ర విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలపై తీవ్రమైన దాడి చేసేందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు భారత ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకు కూడా ఆ లేఖను పంపారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ భేటీ∙టీటీడీ లడ్డూ వివాదానికి లోపభూయిష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీటీడీ, ఎన్డీడీబీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉత్ప్రేరకాలుగా మారాయి. ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింది. ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం టీటీడీ విశ్వసనీయతను దెబ్బ తీసింది. ⇒ జూలై 6న నెయ్యి శాంపిళ్లను పరీక్ష కోసం పంపగా, అంతకంటే ముందు అంటే జూలై 5న టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, ఎన్ డీడీబీ మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషిల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ అనేక అను మానాలకు తావిస్తోంది. ⇒ ఈ భేటీ కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురి చర్యల కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది. ఇందుకు వారే బాధ్యత వహించాలి. వ్యాపార లావాదేవీల కోసం వారి దురాశపూరిత వైఖరి క్షమించరానిది. వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేసి, ధార్మిక సంస్థలకు దానం చేయాలి. ఈ వ్యవహారంతో సూక్ష్మ సంబంధమున్న ఎవరినైనాసరే జైలుకు పంపాలి. ⇒ వాస్తవాలను పరిశీలించి ఆరోపణల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడం కంటే హడావుడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యమిచ్చారు. అదే నిజ మైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయ పరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లడ్డూ పవిత్రతను కాపాడడం, మతపరమైన ఆచా రాలను సంరక్షించడం అత్యవసరం. ఇలాంటి రాజ కీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వ హణను మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నియామకం⇒ వ్యాపార లావాదేవీల కోసం టీటీడీ ఈవో శ్యామ లరావుతో భేటీ అయిన ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, వర్షాజోషీల ట్రాక్ రికార్డు వివాదాస్పదం. అధికార, ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించి ఆరోప ణలు వీరిపై వచ్చాయి. 2021 మే 31న వర్షాజోషి ఎన్డీడీబీ చైర్మన్‌గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేశ్.సి.షాను ఆమె ఏకపక్షంగా నియ మించారు. ⇒ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ ఇద్దరు దేశీయ పశు సంపదను పెంపొందించడం కంటే బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను, జెర్సీ ఆవులను ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పని చేశారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనకు, ఆయన హయాంలో నడుస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు విరుద్ధం. వీరిద్దరిపై ఆర్‌జీఎంకు సంబంధించి రూ.4,109 కోట్లు, నేషనల్ డెయిరీ ప్లాన్–1కు సంబంధించి రూ.2,242 కోట్ల నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలున్నాయి.వాళ్లే జవాబుదారీ⇒ టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ఇచ్చిన రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇందుకు బాధ్యులైన అధి కారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావుతో పాటు ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షాలను జవాబుదారులుగా చేయాలి. ⇒ ఎన్డీడీబీ చైర్మన్‌గా మీనేశ్.సి.షా నియామకమే నేరపూరితం. ఆయన పదోన్నతి లభించేందుకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలి. ⇒ విదేశీ రకాలను ప్రోత్సహించి, స్వదేశీ పశు సంపద కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో ఎన్డీడీబీ చైర్మన్‌గా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదనపు కార్య దర్శిగా వర్షాజోషి తన హోదాను దుర్విని యోగం చేయడంపై కూడా విచారణ జరిపించాలి. ⇒ దేశంలోని అన్ని దేవాలయాల్లో దేశీయ ఆవు నెయ్యి ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. ⇒ మీనేశ్.సి.షా, వర్షాజోషిల హయాంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ , పశుసంపద వృద్ధి (సీడీడీ) కార్య క్రమాల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలి. ⇒ ఈ విచారణ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించడంతో పాటు ఈ వ్యక్తుల కారణంగా నష్టపో యిన రైతులకు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజా విశ్వాసం కలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. -
మనిషిలోని చీకటి కోణాల ఆవిష్కర్త!
కాశీభట్ల వేణుగోపాల్ అనే పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచతమే. ఆ పేరుతో పాటు అతను ‘ఏవో మనో చీకటి కోణాల్ని గురించి రాస్తాడట’ అని కూడా పరిచయమే. కాశీభట్లను ఏమీ చదవనివాళ్లు కూడా ఈ మాత్రపు ప్రాథ మిక అవగాహనతో అతడి పట్ల ఒక కొండ గుర్తును ఏర్పరుచుకుంటారు. ఒక ప్రశస్త కుదింపునకు గురైన రచయితలలో కాశీభట్ల ముందుంటాడు.కాశీభట్ల మొదటి నవల ‘నేనూ–చీకటి’ వచ్చినప్పుడు దానిలోని చైతన్య స్రవంతి శైలి వల్ల అతడిని హత్తుకున్నవాళ్లు కొందరైతే, బండ కేసి బాదిన వాళ్లు కొల్లలు. ఎక్కువ మంది భాషాపాటవానికి అచ్చె రువొందారు. కాశీభట్లకు కవితాత్మకంగా వచనం రాయడం ఇష్టం. అది శేషేంద్ర ప్రభావం. కథా కథ నాన్ని సంక్లిష్టమైన చైతన్య స్రవంతిలో రాయడం ఇష్టం. ఇదేమో జేమ్స్ జాయిస్ ప్రభావం. రెండవ నవల ‘తపన’కు చాలా గుర్తింపు వచ్చింది కానీ మూడో నవల ‘దిగంత తాత్వికంగా ఉన్న నవల. సార్త్రే అస్తిత్వవాద ధోరణి ఈ నవలంతా పరుచుకొని ఉంది.నవలల్లో నైనా, కథల్లోనైనా కాశీభట్ల ఒకే దృష్టికోణంతో కథాకథనం చేస్తాడు. అది ప్రధాన పాత్ర మానసిక కోణం నుంచి జరుగుతుంది. కాబట్టి రచయిత ఆలోచనల్ని పాత్ర ఆలోచనలకు రంగరించడం సులభమయ్యింది. ఈ సందర్భంగానే చెప్పు కోవాల్సిన విష య మేమంటే... కాశీభట్ల సాహిత్యంలో స్త్రీ పాత్ర గొంతుకతో కథాకథనం జరగలేదు. స్త్రీలుంటారు గానీ స్త్రీల మానసిక కోణం ఉండదు. ఆయా పాత్రల ఒంటరి ఆలోచనలు (వాటినే రచ యిత చీకటి ఆలోచనలు అంటాడు) కథకు ఉత్ప్రేరకాలు. సర్వ సాధారణంగా బాహ్య ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉండే ప్రవ ర్తనల్ని సృష్టించుకొని వాటి పర్యవసానాల ఆధారంగా కథను నడపడం కాశీభట్ల శైలి. పాత్ర ఆలోచనలో ఒకానొక మైక్రో సెకెనులో తలెత్తే ఆలోచనా శకలం, సభ్య సమాజ ఆలోచనకు అభ్యంతరకరంగా ఉంటుందనీ, అలా అభ్యంతరంగా ఉన్నప్పటికీ నెగెటివ్ ఆలోచనా శకలాలు పుట్టడమే సహజమనీ, వాటిని చూపించి మానవుడిని నగ్నంగా ఎత్తి చూపడమే తన సాహిత్య లక్ష్య మనీ గట్టిగా నమ్మాడు కాశీభట్ల. తన మొదటి నవల నుంచి చివరి నవల ‘అసంగతం’ దాకా దీన్ని చెప్పడానికే రాశానంటాడు.ఒకే ఒక్క సత్యం ‘మానవుడి మొదటి ఆలోచన దిగంబరమైనది’ అంటాడు. అదే కాశీభట్ల ఉద్దేశ్యంలో ‘చీకటి’. తన నవలలూ, కథలూ నిండా చీకటిని ఎన్ని రూపాల్లో చెప్పాడో ఎవరైనా పరిశోధన చేయెచ్చు. చీకటి ఒక ప్రలోభం. చీకటి ఒక కోరిక. చీకటి ఒక క్రియ. చీకటి ఒక ప్రయాణం. ఒక్కోసారి కాశీభట్ల సాహిత్యంలో చీకటే వెలుగు. చీకటిని గౌరవంగా తమోనమః అంటాడు. ఇక నేను అనే వాడు అన్ని సంద ర్భాల్లోనూ తన ప్రధాన పాత్ర. ఈ పాత్ర మనసు లోపలి దుర్మార్గ ఆలోచనల్ని, అభ్యంతరకరమైన యోచనల్నీ, అవి చర్యలుగా మారి, పాత్ర చుట్టూ ఉన్న సమాజంలోని చెడు, ప్రలోభం, దుర్మార్గం లాంటి చీకటులకు దోహదపడటాన్ని చిత్రిస్తాడు.విపరీతంగా ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో పట్టు ఉండటం వల్ల... కథన భాష మణిప్రవాళం కావడం, తను రాసే వస్తువు పట్లా, అంశం మీదా గట్టి విషయ సేకరణా, తర్ఫీదు ఉండటంతో తను అనుకున్న వస్తువుతో ఆటలాడినంత సులభంగా రాస్తాడు. తన కేంద్రంగా రాస్తాడు. పాఠక కేంద్రాన్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ అంగీకరించడు. కథాకథనంలో వాడే ప్రతీక లనో, అన్వయాలనో ఎవరైనా ప్రశ్నిస్తే, ‘మీరు సోమరి పాఠకులు. నన్ను చదవకున్నా ఫర్వాలేదు’ అంటాడు. అయితే ఈ కఠిన శైలి ‘కాలం కథల’లోనూ ఇటీవల రాసిన ‘చీకటీ గలు’, ‘అసత్యానికి ఆవల’, ‘అసంగతం’ నవలల్లో కొంత సరళమవడం చూడొచ్చు.కాశీభట్లను తాత్వికంగా చూసినప్పుడు నిరీశ్వర వాది. సొంత జీవితంలో తన బ్రాహ్మణత్వాన్ని తెంచి అవతలకి విసిరి వేసి డీ కాస్ట్ అయినవాడు. తొలి రోజుల్లో నక్సలైట్ భావాల పట్ల కూడా ఆసక్తి చూపినవాడు. ఇదంతా తన పాత్రల రూపంలో రికార్డు అయ్యే వుంది. ఒక ఇంటర్వ్యూలో కాశీభట్ల నిహిలిస్టును అన్నాడు. ప్రతి దాన్నీ అనుమానిస్తానన్నాడు. రేషనాలిటీ ఏదో మేరకు తన ఆలోచనల్లో భాగమైన రచయిత. తెలుగులో సీరియస్ సాహిత్యంతో మనసా కర్మణా నిజాయితీగా నిలబడ్డాడని చెప్పగలం. తనదైన సాహిత్య శైలి అపూర్వం అని అనవచ్చుగానీ అదే సమ యంలో త్రిపురనీ, వడ్డెర చండీదాస్నూ అతని ముందువారని గుర్తించకుండానూ ఉండలేం.– జి. వెంకటకృష్ణ, వ్యాసకర్త కవి, విమర్శకులు -
సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం...
-
హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్‌తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్‌నగర్‌లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్‌రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్‌ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
T Congress: ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తనదైన శైలిలో బుజ్జగించా రు. పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ నచ్చజెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హా మీ ఇచ్చారు. పలువురికి ఎంపీ సీట్లపై హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. నారాయణఖేడ్‌పై మీరే తేల్చుకోండంటూ నిర్ణయాన్ని ‘ఆ ఇద్దరికే’వదిలిపెట్టారు. ఒకరోజు పర్యటనకు గాను గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అర్ధరాత్రి వరకు తాజ్‌కృష్ణా హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల తో సమావేశమయ్యారు. టికెట్లు రాని దాదాపు 15 మంది నేతలను పిలిపించి ఆయన స్వయంగా మాట్లాడారని సమాచారం. ముఖ్యంగా నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎంపీ టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీ ఇద్దరూ తేల్చుకోండి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్‌ను జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్‌కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కూడా ఈ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించిన కేసీవీ ఎవరికి టికెట్ కావాలో తేల్చుకుని తన దగ్గరకు వస్తే వారికే బీఫారం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారని, ఈ భేటీలో భాగంగా సంజీవరెడ్డి అసెంబ్లీకి, షెట్కార్ లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే చివరి నిమిషంలో బీఫారంను సంజీవరెడ్డికి ఇచ్చారని సమాచారం. షెట్కార్‌ను జహీరాబాద్ లోక్‌సభకు పోటీ చేయిస్తామని కేసీవీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నారాయణఖేడ్ కథ సుఖాంతమైంది. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు మరికొందరికి కూడా.. ఇదే కోవలో కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, పారిజాతా నర్సింహారెడ్డి, గాలి అనిల్‌కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్ తదితరులతో కేసీవీ విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో బలరాం నాయక్ (మహబూబాబాద్), గాలి అనిల్‌కుమార్ (మెదక్)లకు లోక్‌సభ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ (వరంగల్)ను కూడా పార్లమెంటుకు పోటీ చేయిస్తామని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. ఈ సమావేశాల్లో భాగంగా కేసీవీ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పట్టుపట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మళ్లీ ఎంపీ టికెట్లకు పోటీకి రాకూడదని ఆయన సూచించినట్టు తెలిసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కేసీవీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు యువ నాయకులకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టికెట్ రానంత మాత్రాన అసంతృప్తి చెందాల్సిన పని లేదని చెప్పారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. బల్మూరి గురించి బోసురాజు ఏదో చెప్పబోగా.. ‘వెంకట్ గురించి అధిష్టానానికి తెలు సు. ఈ ప్రభుత్వంపై పార్టీ పక్షాన గట్టి పోరాటం చేశాడు. 60కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాహుల్‌గాంధీ జైలుకు వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు..’అని వేణుగోపాల్ అ న్నారు. వెంకట్ రాజకీయ భవిష్యత్తుపై తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, పార్టీ కూడా వెంకట్‌కు తగిన ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బల్మూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లో కేసీవీ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడారనేది పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా వేణుగోపాల్ శుక్రవారం ఉదయం 6:30 సమయంలో ఢిల్లీ వెళ్లారు. -
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్‌గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం
సాక్షి, చిత్తూరు: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అన్నింటిలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. సామాజిక సాధికారత సాధించిన తరువాతే ప్రజల వద్దకు బస్సు యాత్ర ద్వారా వస్తు న్నామన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలో అశేష జనం మధ్య జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు మేలు చేశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. 1931 తర్వాత బీసీ కులగణన జరగలేదని, మళ్లీ ఇప్పుడే సీఎం జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపారని కొనియాడారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం ఎండమావిగా ఉండేదన్నారు. పైగా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు చులకన చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని చెప్పారు. మైనారిటీలను మోసం చేసిన టీడీపీ: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మైనారిటీలకు తీరని మోసం చేశారని విమర్శించారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎంను చేశారని, ఇది చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకొచ్చి, మొక్కుబడిగా ఓ మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. అందుకు భిన్నంగా సీఎం జగన్ మొదటి కేబినెట్లోనే మైనారిటీ సామాజికవర్గానికి అవకాశం కల్పించారని తెలిపారు. మైనారిటీ మహిళను శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీ పాలనలో మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.2,665 కోట్లే ఖర్చు చేశారని, సీఎం జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.23,176 కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీసీలను వాడుకొని, తరువాత తీసి పడేసేదని అన్నారు. వైఎస్ జగన్ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాజకీయ సమానత్వం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులను రెచ్చిగొట్టి చంద్రబాబు విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వారిని కనీసం పరామర్శించలేదని చెప్పారు. పైగా, చిత్తూరు జిల్లా ఎస్పీ, పోలీసుల అంతు చూస్తామని నారా లోకేశ్ అనడం దుర్మార్గమన్నారు. -
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
‘సీఎం జగన్‌తోనే నా పయనం’
సాక్షి, దర్శి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే తన రాజకీయ పయనం ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడి వివాహం, సొంత పనుల కారణంగా రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. కాగా, ప్రకాశం జిల్లా దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో తిరిగి వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు. -
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాల్
-
16న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా. -
ఫైబర్‌గ్రిడ్.. మదర్ ఆఫ్ స్కామ్స్!
సాక్షి, అమరావతి: ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిని కుంభకోణం అనడం కంటే.. మదర్ ఆఫ్ స్కామ్స్ అన టం కరెక్టు అని పేస్ పవ ర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమి టెడ్ ఎండీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైఎస్సార్సీపీ సభ్యుడిని కూడా కాదని, ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున టెండర్ వేశానన్నారు. కానీ, ఎటువంటి అర్హతలేని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్‌గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన రూ.329 కోట్ల టెండరు ఎంపికలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. ఆ తర్వాత సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2లకు సంబంధించి మొత్తం రూ.3,113 కోట్లకు టెండర్లు పిలిచారని.. ఈ వ్యవహారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడిందని ఆయన వివరించారు. వీటన్నింటిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ టెండర్‌కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. టెండరు వెనుక పెద్ద కుట్ర ‘అర్హతలేని టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ టెండరు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే నడిచింది. టెరాసాఫ్ట్ కన్సార్టియం నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రైస్‌బిడ్లు వేశారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా పక్కన పెట్టారు. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున నేను టెండర్ వేశాను. కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ గ్రిడ్ స్కాంకు పాల్పడింది. టెండరు ఖరారుకు 2 నెలల ముందు బ్లాక్‌లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌కు దొడ్డిదారిన క్లియరెన్స్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా టెండర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ వేదికగా ఫైబర్‌గ్రిడ్ టెండర్లు పిలిచారు. బిడ్డర్ తప్పనిసరిగా కంపెనీగా ఉండాలి అనే నిబంధన ఉంది. ఆ కంపెనీకి ఆ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఏ కంపెనీ కూడా బ్లాక్‌లిస్ట్ అయి ఉండకూడదు. నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయి. వీటిలో మూడు కంపెనీలకు అర్హత లేదు. కానీ, ఆ మూడు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డాయి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించినా వాటిని అనర్హులుగా గుర్తించలేదు. టెరాసాఫ్ట్ సంస్థ బ్లాక్‌లిస్టులో ఉంటే పట్టించుకోలేదు. దొడ్డిదారిన బ్లాక్‌లిస్ట్‌ను ఎత్తివేయించుకున్నారు. అదే వైఎస్ జగన్ సీఎం అయ్యాక టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఎప్పుడూ కనిపించనేలేదు. పాత్రధారులు, సూత్రధారులను శిక్షించాలి నిజానికి.. ఫైబర్ గ్రిడ్ తొలిదశ ప్రాజెక్టు రూ.329 కోట్లు అని చెప్పారు. ఇదికాక.. సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2కు సంబంధించి మూడు టెండర్లను పిలిచి వారికి అనుకూలమైన కంపెనీలకే కట్టబెట్టారు. ప్రాజెక్టు మొదటి దశ టెండర్లలోనే ఇంత స్కామ్ జరిగినప్పుడు, మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంలోని వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనకున్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలను కఠినంగా శిక్షించాలి. ఆ రోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లు మాకు దక్కకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి’. -
చంద్రబాబు చేనేతల గురించి మాట్లాడే అర్హత లేదు : వేణుగోపాల్
-
Corona: టీటీ మాజీ ప్లేయర్ చంద్రశేఖర్ మృతి
న్యూఢిల్లీ: భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్‌గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే. చనిపోయే సమయానికి చంద్రశేఖర్ చెన్నైలోనే ఎస్‌డీఏటీ–మెడిమిక్స్ టీటీ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
అస్తమించిన యుద్ధ వీరుడు.. సీఎం జగన్ సంతాపం
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): దేశ సరిహద్దుల్లో శత్రువుతో వీరోచిత పోరాటం చేసి పదవీ విరమణ పొందిన యుద్ధవీరుడు మాజీ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1927 నవంబర్ 14న జన్మించిన వేణుగోపాల్ దేశానికి సేవ చేయాలనే తపనతో ఆర్మీలో హవల్దార్‌గా చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (డెహ్రాడూన్)లో సీటు సాధించారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగి, మేజర్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశారు. దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ విశిష్ట సేవా మెడల్’, ‘మహా వీరచక్ర’ అవార్డులు అందుకున్నారు. 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగిన ఆయన దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ వివాహానికి సైతం దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న తిరుపతి వేదికగా జరిగిన సాయుధ దళాల స్వర్ణోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన గృహానికి వెళ్లి సత్కరించారు. వేణుగోపాల్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సీఎం జగన్ సంతాపం మాజీ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95) మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం -
సరిహద్దుల్లో చిన్న అలజడి రేగినా రక్తం మరిగిపోతుంది
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): ఆయన వయసు 95 ఏళ్లు.. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అయినా.. నిత్యం దేశం కోసమే ఆలోచిస్తారు. దేశ సరిహద్దుల్లో ఏవైనా అలజడులు తలెత్తినట్టు తెలిస్తే మదనపడిపోతారు. ఆ రోజూ భోజనం కూడా సరిగా చేయరు. ఆయన పేరు సి.వేణుగోపాల్.. రిటైర్డ్ మేజర్ జనరల్. ఆర్మీలో పని చేస్తున్నప్పుడు శత్రు దేశాలను వణికించారు. భారత్–పాక్ యుద్ధ సమయంలో భారత జవాన్ల సత్తా ఏమిటో శత్రు సైన్యానికి రుచి చూపించిన ఆ మహాయోథుడు తిరుపతిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి కేంద్రంగా గురువారం ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారు. నాటి యుద్ధంలో పాల్గొన్న ప్రధాన అధికారుల్లో ఒకరైన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను ఆయన ఇంటికి వెళ్లి సీఎం సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆయన ఏమన్నారంటే.. దేశం కోసం పోరాడాలనే ఆలోచనే.. మాది తిరుపతి సరోజినిదేవి రోడ్డు ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. 1927 నవంబర్ 14న పుట్టాను. మా తల్లిదండ్రులు చిన్నస్వామి, రుక్మిణమ్మలకు మేం 9 మంది సంతానం. నేను రెండో వాడిని. అందరూ వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి దేశ సేవ చేయాలనే తపన ఒక్కటే ఉండేది. ఎలాగైనా సైన్యంలో చేరాలని ఆరాటపడేవాడిని. ఆర్మీలో హవల్దార్‌గా చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (డెహ్రాడూన్)లో సీటు సాధించాను. కఠోర శిక్షణ పొంది గుర్కా రైఫిల్స్‌లో చేరి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాకు ఎదిగాను. ఈశాన్య రాష్ట్రాల్లో గుర్కా రైఫిల్స్ మలౌన్ రెజిమెంట్‌లో పనిచేస్తూ మేజర్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశాను. 1971 డిసెంబర్ 4న శుత్రు సైన్యం సరిహద్దులోని వుథాలి, దర్శన ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా.. ఇండో–పాక్ యుద్ధం జరిగింది. అందులో నేను సభ్యుడిగా.. బెటాలియన్‌కు నాయకుడిగా ఉంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసి విజయం సాధించాం. దేశసేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ్ విశిష్ట్ సేవా మెడల్’ (పీవీఎస్ఎం), మహావీర్ చక్ర (ఎంవీసీ) అవార్డులు అందుకున్నాను. 1950 నుంచి 1986 వరకు సుమారు 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగాను. ఇప్పటికీ దేశ సరిహద్దులో శత్రుసైన్యాలు అలజడి చేస్తే రక్తం మరిగిపోతుంది. 95 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా దేశం కోసం పోరాడాలనే ఆలోచనే తప్ప మరో వ్యసనం లేదు. అందుకే వివాహం చేసుకోలేదు. ఎవరికైనా సరే వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు. దేశ ప్రయోజనాల కోసం ఆలోచించే సమాజం కావాలి. అందుకు యువత నడుం కట్టాలి. టెక్నాలజీ మాత్రమే ప్రపంచం కాదు. దేశమే ప్రధానం.. ఆ తరువాతే టెక్నాలజీ. ప్రతి పౌరుడూ రోజుకు కనీసం 5 నిమిషాలపాటు దేశం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం మనకు కోరిన కోర్కెలను తీరుస్తుంది. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ ముగించారు. నేటి నుంచి తిరుపతిలో సాయుధ దళాల స్వర్ణోత్సవాలు సాక్షి, తిరుపతి/సాక్షి,అమరావతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాయుధ దళాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. దాయాది పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలో గురువారం నుంచి శనివారం వరకు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 1971 డిసెంబర్ 4న బంగ్లాదేశ్ విముక్తికి పాక్‌తో జరిగిన యుద్ధంలో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఆ యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్(95). వీరచక్ర అవార్డు పొందిన విశాఖకు చెందిన సన్యాసినాయుడు, కాకినాడకు చెందిన కేజే క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులను సీఎం సన్మానిస్తారు. తిరుపతికి చేరుకున్న విజయ జ్వాల స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో బయలుదేరిన విజయ జ్వాల (విక్టరీ ప్లేమ్) హైదరాబాద్ నుంచి బుధవారం తిరుపతికి చేరింది. విజయ జ్వాలకు ఆర్మీ అధికారులు తిరుపతి ఎస్వీ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఘన స్వాగతం పలికారు. -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
రిట్ దాఖలు చేసిన వేణుగోపాల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కింద తనపై అక్రమ కేసు బనాయించారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని హైకోర్టుకు తెలిపారు. ఈ రిట్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఈ కేసు పూర్తి వివరాలు, బెయిల్ మంజూరు అంశాలపై వైఖరిని తెలపాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 12న ఎన్.రవిశర్మ, బి.అనూరాధను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హఠాత్తుగా వేణుగోపాల్ పేరును నిందితుడిగా చేర్చి పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారని వేణుగోపాల్ తరఫు న్యాయవాది రఘునాథ్ రిట్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి రిమాండ్ కేసు డైరీలో ఉద్దేశపూర్వకంగా ఆయనను ఏడో ముద్దాయిగా పేర్కొన్నారన్నారు. -
జర్నలిస్టులలో దీపధారి–రాఘవాచారి
ఎనభై సంవత్సరాలు నిండిన జీవితంలో అరవై సంవత్సరాల ప్రజా జీవితం, అందులో నలభై సంవత్సరాల పాత్రికేయ జీవితం గడిపి, విలువలతో, విద్వత్తుతో, విస్పష్టమైన దృక్పథంతో, ప్రపంచం పట్ల అపారమైన ప్రేమతో అజాత శత్రువుగా జీవించి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మరణించిన చక్రవర్తుల రాఘవాచారి (సెప్టెంబర్ 10, 1939 – అక్టోబర్ 28, 2019) జీవితమూ, కృషీ, ప్రవర్తన ఉదాహరణప్రాయమైనవి, ఆదర్శప్రాయమైనవి. పాత వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో సంపన్న భూస్వామ్య శ్రీవైష్ణవ కుటుంబంలో చక్రవర్తుల వెంకట వరదాచార్యులు, కనకవల్లి దంపతుల సంతానంలో చివరివాడుగా జన్మించిన రాఘవాచారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి ఇంట్లోనే సంస్కృతం, ఉర్దూ, తెలుగు, తమిళం చదువుకున్నారు. మతాచార పరులైనప్పటికీ కుటుంబానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పట్ల సానుభూతి ఉండడం, గెరిల్లాలకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, సమీప బంధువు ఒకరు గెరిల్లాగా పనిచేస్తూ పోలీసు కాల్పుల్లో చనిపోవడం ఆయన తొమ్మిది, పదేళ్ల వయసు నాటికే కలిగిన అనుభవాలు. పాఠశాల విద్య హనుమకొండలో, పీయూసీ హైదరాబాదులో చదివి, బీఎస్సీ కోసం 1957లో వరంగల్ ఆర్ట్స్ కాలేజి చేరేనాటికే ఆయనలో వామపక్ష భావాలు బలపడ్డాయి. అక్కడే కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా కూడా ఉండి, ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదవడానికి వచ్చేసరికి ఆయన అప్పటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. కులాచారపరంగా వేదాధ్యయనమూ ఉపనయనమూ జరిగి, తొమ్మిదో ఏటి నుంచి పద్దెనిమిదో ఏటి దాకా పూజా పునస్కారాలు చేసిన వ్యక్తే, జంధ్యం ధరించిన వ్యక్తే ఒకటొకటిగా వాటన్నిటినీ వదిలేశారు. ఆ వదిలేయడం కూడా ఏదో ఉద్వేగం కొద్దీ కాదు, క్రమక్రమంగా అధ్యయనంతో దృక్పథం బలోపేతమవుతుండగా కమ్యూనిస్టుగా మారి 1960 నాటికి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అలా బ్రాహ్మణ భూస్వామ్య విలువల్లో పుట్టి పెరిగి, తనలో తాను సంఘర్షణతో, ప్రశ్నలతో, చర్చలతో, అధ్యయనంతో ప్రజానుకూల ప్రగతిశీల వామపక్ష అభిప్రాయాలు పెంపొందించుకుని కొత్త విలు వల కమ్యూనిస్టు కార్యకర్తగా మారారు. ఆ విలువలతోనే అరవై ఏళ్లకు పైగా జీవించారు. ఉద్వేగంతో కొన్ని విలువలు ఏర్పడతాయి, కానీ అధ్యయనంతో వాటిని స్థిరపరచుకోవాలి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ ప్రయాణం సులభంగా సాగిందేమీ కాదు. చదువుకున్న న్యాయశాస్త్ర విద్యతో న్యాయవాదిగా మారి ఉంటే ఏమై ఉండేవారో తెలియదు గానీ, డిగ్రీ రోజుల నుంచే సామాజిక విషయాల మీద రచన అలవాటు ఉండడంతో పత్రికారచనలోకి వచ్చారు. పార్టీ చీలిక సందర్భంగా మొహిత్ సేన్, తానూ కలిసి రాఘవాచారిని న్యాయవాద వృత్తి ఆలోచన నుంచి తప్పించి విశాలాంధ్రలోకి తీసుకువచ్చామని సంస్మరణ సభలో కందిమళ్ళ ప్రతాపరెడ్డి అన్నారు. అలా ఆయన 1965లో విశాలాంధ్ర దినపత్రికలో విలేకరిగా చేరడం న్యాయవ్యవస్థకు జరిగిన నష్టమేమో గాని, తెలుగులో వామపక్ష పత్రికా రచనకు అందిన అద్భుతమైన కానుక. అప్పటికే ఆయనకు ఇంగ్లిష్ రచనలో కూడా ప్రావీణ్యం ఉండడంతో పేట్రియట్, లింక్ పత్రికలకు హైదరాబాద్ లోనూ, ఢిల్లీలోనూ కూడా కరెస్పాండెంట్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాణంలో పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా 1972 నుంచి 2000 వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేసి, అతి ఎక్కువ కాలం సంపాదకుడిగా ఉన్న ఏకైక వ్యక్తి అయ్యారు. ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆయన రాసిన వేలాది సంపాదకీయాలతో పాటు, తీర్చిదిద్దిన పాత్రికేయులు వందల మంది ఉన్నారు. విశాలాంధ్ర ఒక కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక గనుక పత్రికా రచన చరిత్రలో దానికి, సంపాదకుడిగా రాఘవాచారిగారికి దక్కవలసిన స్థానం దక్కకపోయినా, ఆయన వ్యక్తిత్వంలోని ఇతర ప్రభావశీల అంశాలు ఆయనను అపురూపమైన తెలుగు మేధావిగా నిర్ధారించాయి. ఆయన ఒక గొప్ప ఉపన్యాసకుడు. విషయం ఏదైనా, సభా నిర్వాహకులెవరైనా, కొన్నిసార్లు ఆయన భావాలను వ్యతిరేకించేవారైనా ఆయన ఉపన్యాసకుడిగా ఉండాలని కోరుకునేవారు. ఆయన ఉపన్యాసమంటే ఒక ప్రవాహంలా సాగేదేమీ కాదు, నింపాదిగా సాగుతున్నట్టే ఉండేది. కానీ హాస్యం, చమత్కారం, విద్వత్తు నిండిన ఆయన ఉపన్యాసం ఎంతసేపు సాగినా వినాలనిపించేట్టు ఉండేది. అది ఐదు పది నిమిషాల చిన్న ఉపన్యాసమైనా, గంటకు పైగా వివరంగా సాగే ఉపన్యాసమైనా అందులో ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఉటంకింపులు ఉండేవి. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు ఆయన జ్ఞాపకశక్తి విస్తారమైనది. ఉటంకింపులు షేక్ స్పియర్వి అయినా, కాళిదాసువైనా, మార్క్స్, లెనిన్లవి అయినా, గాంధీవైనా ఉపన్యాసం మధ్యలో, తెచ్చిపెట్టుకున్నట్టుగా కూడా కాకుండా, చాలా సహజంగా, అనివార్యంగా వచ్చినట్టుగా ఇమిడిపోయేవి. శ్రోతలకు తెలియని సమాచారం, తెలిసిన సమాచారంలోనే కొత్త కోణాలు, అతి సులభమైన, వివరమైన పద్ధతిలో ఉండేవి. అందువల్ల విజయవాడలో ఆయన ఉపన్యాసం లేకుండా జరిగిన సభలు అరుదు. ఆయన శ్రోతగా వచ్చి కూచున్నా మాట్లాడమని పిలిచిన సందర్భాలెన్నో. అన్నిటికీ మించి ఆయన ఒక అద్భుతమైన మానవీయమైన మనిషి. అంత జ్ఞానసంపన్నుడై కూడా అత్యంత నిరాడంబరంగా, అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారు. నడుస్తున్న గ్రంథాలయంగా, విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకుని కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపేవారు. తనకన్న ముప్ఫై నలభై సంవత్సరాల చిన్నవారితో కూడా గౌరవంగా ప్రవర్తించేవారు. పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం ఉన్నవారి నుంచి కూడా గౌరవాద రాలు పొందిన అజాతశత్రువు. నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి ఆయన ఆహార్యం తెల్లని మల్లెపూవు లాంటి దుస్తులే. ఆహార్యంలో మాత్రమే కాదు ఆయన హృదయంలోనూ, మానవ సంబంధాలలోనూ అటువంటి స్వచ్ఛమైన మల్లెపూల సుగంధాన్నే నింపుకున్నారు. వందల సంపుటాల ఉద్గ్రంథం లాంటి జ్ఞానసంపదను మల్లెపూల పరిమళంలా వ్యక్తిగత సంభాషణల్లోనూ, సభల్లోనూ వెదజల్లారు. ఎన్ వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం పత్రిక సంపాదకులు మొబైల్: 98485 77028 -
సేవే మద్దిశెట్టి అభిమతం, కమీషన్ల కదిరి
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం): దర్శి నియోజక వర్గంలో ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్, టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబూరావు మధ్య నెలకొంది. ప్రజాప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల గుణ, గణాలను ప్రజలు ఈ విధంగా చర్చించుకుంటున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీ.ఈ, డీఎంఎం, ఎం.బీఏ ఉన్నత విద్యను అభ్యసించారు. ♦ పలు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలను యూఎస్ఏ, సింగపూర్లలో నెలకొల్పి, ఉపాధి కల్పిస్తున్నారు. ♦ ఒంగోలు పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి. ♦ ప్రజాసేవ చేయాలన్న తపనతో కనిగిరి నియోజక వర్గం పామూరు మండలం లక్ష్మినరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం. ♦ 2019లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో పోటీ. ♦ పనిని పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం. ♦ మంచి స్వభావం, నచ్చని విషయాన్ని సుతి మొత్తంగా తిరస్కరించడం. ♦ నమ్మిన వారి కోసం ఎందాకైనా పోరాటం చేయడం. కదిరి బాబురావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీఏ, ఎల్ఎల్బీ విద్యను అభ్యసించారు. ♦ వజ్రాల, గోల్డ్ ముత్యాల వ్యాపారిగా ప్రసిద్ధి ♦ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి బాలక్రిష్ణతో కలసి ప్రచార కార్యక్రమాలు పాల్గొనేవారు. 1987లో సీఎస్‌పురం ఎంపీపీగా, 2004లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్నా సరే నామినేషన్ సక్రమంగా లేక పోవడంతో పోటీకి అనర్హడిగా మిగిలిపోయి ఇండిపెండెంట్‌కి మద్దతు ప్రకటించారు. 2014లో కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ కనిగిరి సీఎస్‌పురం మండలాల్లో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు దానం ♦ తల్లిదండ్రుల పేరిట పేదలకు సాయం ♦ ప్రజలతో మమేకం కాలేక పోవడం ♦ సమస్యలను వినే ఓపిక తక్కువ ♦ తనకు నచ్చిన వారికోసం ఎంత వరకైనా పోరాటం ♦ కనిగిరి నియోజకవర్గంలో కమిషన్ల బాబురావుగా పేరు -
దర్శిలో భారీ మెజార్టీతో గెలుస్తా
-
స్వతంత్ర అభ్యర్థికి మరో పార్టీ గుర్తా..?
సాక్షి, దర్శి: నిబంధనలకు విరుద్ధంగా ప్రజాశాంతి పార్టీ గుర్తు అయిన హెలికాప్టర్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎలా ఇస్తారని దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్ఓ కృష్ణవేణిని నిలదీశారు. స్థానిక ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్‌కు హెలికాఫ్టర్ గుర్తును ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మద్దిశెట్టి కలుగజేసుకుని ఆ గుర్తు ప్రజాశాంతి పార్టీకి చెందినదని ఆపార్టీ ఆభ్యర్థి నామినేషన్ చెల్లలేదని చెప్పారు. ఆ గుర్తును మరలా స్వతంత్య్ర అభ్యర్థికి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆర్ఓ కృష్ణవేణి మాట్లాడుతూ గురువారం స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్ హెలికాఫ్టర్ గుర్తును కావాలని దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం గుర్తును కేటాయించామని బుకాయించారు. మద్దిశెట్టి మాట్లాడుతూ అభ్యర్థి తన నామినేషన్లో పలానా గుర్తులు కావాలని కోరలేదని, గుర్తులు కోరకపోతే నామినేషన్ చెల్లదని అయినా ఆ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. ఇండి పెండెంట్ అభ్యర్థులు సంతకం పెట్టి కింద డేట్ వేయలేదని నామినేషన్‌ను తిరస్కరించారని, గుర్తులు అడగకపోతే నామినేషన్ తిరస్కరించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఇలా పక్షపాత దోరణి మంచి పద్దతి కాదన్నారు. 25వ తేదీ నాటితో దరఖాస్తులు సమయం అయిపోయిందని 28వ తేదీన దరఖాస్తు తీసుకుని గుర్తును కేటాయించడం నిబందనలకు విరుద్ధం కాదా ? అని నిలదీశారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. హెలికాఫ్టర్ గుర్తు ఫ్యాన్ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు టీడీపీ నేతలు కనుసన్నల్లో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదని ఆరోపించారు. ఆగుర్తు ఇవ్వడానికి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తతంగం అంతా అన్నీ పార్టీలకు చెందిన అభ్యర్థుల కళ్లెదుటే జరుగుతున్నా.. మిగితా పార్టీలు ఈ విషయంపై నోరుమెదపకపోవడం గమనార్హం. ఆర్ఓ కృష్ణవేణి మాత్రం నిబంధనలు చూపిస్తానని చెప్పి పొంతన లేని నిబంధలను చెప్తున్నారని మండి పడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎన్నికలు సక్రమంగా జరగనిస్తారా అని మద్దిశెట్టి అనుమానాలు వ్యక్తం చేశారు. కృష్ణవేణి మాట్లాడుతూ తాను నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయించానని మీకు అభ్యంతరం ఉంటే రిటన్‌గా రాసి ఇవ్వాలని కోరారు. అనంతరం మద్దిశెట్టి వేణుగోపాల్ విలేకరుల సమావేశం నిర్వహించి జరిగిన విషయాన్ని వివరించారు. కేవలం వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలంటే ప్రజాభిమానం లేక అధికారులను ఉపయోగించుకుని ఈవిధంగా చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గెలవలేక ఇలాంటి నీచరాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు సరైన బుద్ది చెప్పాలని కోరారు. తమ అదిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఆగుర్తు కేటాయింపుపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.