vijay antony
-
మర్డర్ మిస్టరీ
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గగన మార్గన్’ టైటిల్ ఖరారైంది. ‘అట్టకత్తి, సూదు కవ్వుం, ఏ1, మాయవన్’ వంటి తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.‘‘గగన మార్గన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో చిత్రీకరించిన అండర్ వాటర్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సైలెంట్‌గా కొత్త సినిమా పూర్తి చేసిన విజయ్ ఆంటోని
కథానాయకుడిగా సక్సెస్ అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి బాగా కనెక్ట్ అయిన విజయ్ నుంచి జయాపజయాలకు అతీతంగా పలు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నున్న విజయ్ నిర్మాతగానూ విజయాలు అందుకున్నారు. విజయ్‌ఆంటోని తాజాగా నటించిన హిట్లర్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని అటుంచితే ఈయన తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, అసలు ప్రారంభం అయిన విషయాన్నే తెలపకుండా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం ద్వారా లియో జాన్‌పాల్ అనే ఎడిటర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈయన పిజ్జా, సూదుకవ్వుమ్ (గడ్డం గ్యాంగ్ పేరుతో తెలుగులో రీమేక్ అయింది) తదితర చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. మహానది శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ఆంటోనినే సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'తుఫాన్'.. పదిరోజుల్లోనే స్ట్రీమింగ్
కోలివుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతుంది. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.తుఫాన్ సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ, అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తమిళ్లో తుఫాన్ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేశారు. టాలీవుడ్లో ఆగష్టు 11న విడుదల చేశారు. ఈ క్రమంలోనే ముందుగా తమిళ్ వర్షన్‌ను ఓటీటీలో విడుదల చేసిన మేకర్స్ వచ్చే వారంలో తెలుగు వర్షన్ కూడా విడుదల చేయనున్నారని సమాచారం. -
ఆ సీన్లో నటించింది నేను కాదు... విజయ్ ఆంటోని
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మలై పిడిక్కాద మనిదన్. ఇన్ఫినిటీ ఫిలిం వేంచర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. నటుడు శరత్‌కుమార్, సత్యరాజ్, నటి మేఘాఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఈ చిత్రంలోని ఆరంభంలో వచ్చే ఒక నిమిషం సన్నివేశాలను తనకు తెలియకుండా కలిపారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయమై ఆయన మీడియాను కలవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తరువాత మీడియాను కలవాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్రంలో కథానాయకుడు ఏం చేస్తాడు, అతను రౌడీనా? పోలీసా? అతనికి వర్షం అంటే ఎందుకు నచ్చదు? వంటి విషయాలను సస్పెన్స్‌గా ఉంచానన్నారు. అయితే ఆ సన్నివేశాలను చిత్రంలో ముందుగానే రివీల్ చేసేలా తనకు తెలియకుండా చేర్చారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో నటుడు శరత్‌కుమార్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని దర్శకుడికి, నిర్మాతకు మధ్య సమన్వయం కుదిర్చినట్లు సమాచారం. ఈ వివాదం గురించి ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొంటూ మలై పిడిక్కాద మనిదన్ చిత్రంలో నిమిషం పాటు సాగే సన్నివేశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సన్నివేశాల్లో నటించింది తాను కాదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగినా? అనే చర్చ సాగుతోంది. -
నా లుక్ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్
‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్. ‘‘తుఫాన్’ను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు విజయ్ మిల్టన్. ‘‘తుఫాన్’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ. -
విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో బర్త్‌డే.. సంతోషమే లేకుండా పోయింది!
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో బర్త్‌డే నేడు (జూలై 24). పుట్టినరోజు అనగానే ఎవరైనా హుషారుగా ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ కుటుంబమే ప్రాణంగా బతికే విజయ్ ఆంటోనికి ఈసారి ఆ భాగ్యం లేకుండా పోయింది. కూతురు చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది.కూతుర్ని పోగొట్టుకుని..గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని గుండెలవిసేలా రోదించారు. తన బాధను తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ విచారాన్ని తొలగించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటినుంచి విజయ్ దంపతులు కుమిలిపోతూనే ఉన్నారు. తన రెండో కూతురి కోసం ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు. ఆ విషాదం నుంచి బయటపడని ఆంటోనిఇటీవల వచ్చిన రోమియో సినిమాలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు చనిపోయిన కూతురు మీరా పేరును వాడారు. అక్కడే వారు గడిచిన విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాక్క ముక్క పాటకుగానూ కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్న తొలి సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. నాన్ మూవీతో హీరోగా మారాడు. తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టి హీరోగానే ఎక్కువ సినిమాలు చేశాడు.చదవండి: పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్? -
తెలుగులో అమ్మ పాట పాడి అదరగొట్టిన విజయ్ ఆంటోని
-
విజయ్ ఆంటోని 'తుఫాన్' ట్రైలర్ విడుదల
విజయ్ ఆంటోని.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో బాగా దగ్గరపయ్యాడు. రీసెంట్గా ఇటీవలే 'లవ్‌గురు'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇప్పుడాయన 'తుఫాన్'తో మెప్పించనున్నాడు. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన తుఫాన్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది ఒక దీవిలో జరిగే కథతో రూపొందించారు. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగు పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ ట్రైలర్లో ఉంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలున్నట్లు తెలుస్తోంది. -
Vijay Antony: కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. టాలీవుడ్లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్‌లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్‌ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
లవ్ గురులా పరిష్కారాలు చెబుతాను
‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్‌గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘లవ్ గురు’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్ గురు’ చిత్రం విజయ్ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
బిచ్చగాడు హీరో రొమాంటిక్ మూవీ.. తెలుగులో ఆసక్తికర టైటిల్!
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని
'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్'. చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) ఈ సినిమాలో ప్రియా సుమన్ హీరోయిన్ కాగా.. గౌతమ్ మేనన్, రెడిన్ కింగ్స్లీ, వివేక్, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్‌కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్‌లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'మీరా బంగారం..' విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ పోస్ట్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీరా బంగారం.. నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో! నిన్ను కలిసేవరకు.. ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్ అవుతోంది..' అంటూ ఎక్స్(ట్విటర్)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా బాధపడకండి మేడమ్ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023 చదవండి: సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం -
విజయ్ ఆంటోనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరోయిన్
కోలీవుడ్‌లో నటి అనూయకు మంచి గుర్తింపే ఉంది. 'శివ మనసుల శక్తి' చిత్రంలో నటుడు జీవాతో జత కట్టి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఒరుకల్ఒరు కన్నాడి, మదురై సంభవం, నన్బన్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఐటెం సాంగ్స్‌లోనూ నటించడానికి వెనుకాడ లేదు. అయితే అలా శృంగార తారగా అందాలు ఆరబోసిన అవకాశాలు లేకపోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగయ్యారనే చెప్పాలి. అయితే తరచూ తన గ్లామరస్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. కాగా ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భాన్ని అనూయ పేర్కొంటూ తాను దుబాయ్‌లో పుట్టి పెరిగానని చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేశానని, కాగా తనకు సంబంధం లేకపోయినా నటుడు విజయ్ ఆంటోని, సుందర్ సి, జీవాతో తనను కలుపుతూ వదంతులు ప్రచారం చేశారని చెప్పింది. తాను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేకున్నా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రచారాలు అన్నీ అవాస్తవాలు కావడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. దీంతో ఎందుకు ఒంటరిగా ఉన్నారు? పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ఒక అభిమాని ప్రశ్నకు అనూయ బదిలీస్తూ తన చుట్టూ మంచి మగవాళ్లెవరూ లేరని చెప్పింది. దీంతో అనూయ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనూయ హీరో విజయ్ చిత్రం అయిన స్నేహితుడులో నటించింది. ఆ చిత్రంలో వారి ప్రొఫెసర్ పాత్రలో కనిపించిన సత్యరాజ్‌కు కూతురిగా ఆమె మెప్పించింది. -
విజయ్ ఆంటోని అలాంటివాడు.. ఈగో లేకుండా..: సత్యరాజ్
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్‌సామియిన్ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్. విజయ్.. నిరాడంబర వ్యక్తి నల్లుసామి పతాకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు. అప్పుడు ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్ చిత్రంలో విజయ్ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్ టైటిల్ దర్శకుడు సుశీంద్రన్ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్ ప్రశంసించారు. చదవండి: తెలంగాణ ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు -
‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్‌గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023