Vinay
-
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తునకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది -
జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో
సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్‌లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్‌కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు బీజేపీ కక్కుర్తి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు బీజేపీ కక్కుర్తి పడుతోందని, అందుకే కేసీఆర్ అవినీతి, దోపిడీలను బీజేపీ నేతలు బలపరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత పి.వినయ్‌రెడ్డి శుక్రవారం తన అనుచరులతో కలిసి గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘బండి సంజయ్, కిషన్‌రెడ్డి, అరవింద్‌లను అడుగుతున్నా. దేశవ్యాప్తంగా ఐదువేలకు పైగా ఈడీ కేసులు పెట్టా రు. లక్షకు పైగా ఐటీ కేసులు నమోదు చేశారు. వేలాది కేసులను సీబీఐ విచారిస్తోంది. కానీ, కేసీఆర్‌పై ఎందుకు కేసులు పెట్టడం లేదు. మోదీ నుంచి అమిత్‌షా వరకు, బండి సంజయ్ నుంచి జవదేకర్ వరకు ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని అంటున్నారే తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’అని నిలదీశారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారు కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి రూ.50 కోట్లు చొప్పు న రూ.500 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు జమిలీ ఎన్నికల పేరుతో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చినా ఈసారి కాంగ్రెస్ గెలుపును ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో పాటు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యోగం వస్తదో.. రాదోనని.. నానమ్మతో బాధపడి.. చివరికి ఇలా..
సంగారెడ్డి: ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన తీపిరిశెట్టి వినయ్(20) తండ్రి శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. తల్లి మానసిక స్థితి సరిగా లేక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. వినయ్ నానమ్మతో కలిసి చిలాపూర్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. గత ప్రయత్నంలో ఉద్యోగానికి సెలక్ట్ కాకపోవడంతో కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఈసారి కూడా ఉద్యోగం వస్తదో రాదోనని నానమ్మ కనుకమ్మతో చెప్పి బాధపడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వినయ్ మృతి చెందాడు. మృతుని తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తండ్రి శ్రీనివాస్ దుబాయ్‌లో ఉండటంతో బాబాయి రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య తెలిపారు. -
వినోదం..సందేశం
మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా, సుమన్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘దుమారం‘. జీఎల్బీ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాయీ బ్రాహ్మణుల వృత్తి, వారు జీవితంలో పడుతున్న ఇబ్బందులను కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో బార్బర్‌గా చేస్తున్నా. వినోదం, సందేశం అన్నీ ఉన్న చిత్రం అన్నారు. ‘‘హీరో తండ్రి పాత్రను సుమన్ చేస్తున్నారు’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘తొలి చిత్రంలోనే మాస్ క్యారెక్టర్ దొరకడం హ్యాపీ’’ అన్నారు మల్లిక్. ‘‘ఈ సినిమా కో ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, విలన్ కొడుకు పాత్ర చేస్తున్నా’’ అన్నారు పాండు గౌడ్. -
వేగంగా వృద్ధి సాధిస్తాం
ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే. మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది. స్వర్ణయుగం.. వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు. -
తెల్లారితే చెల్లి పెళ్లి.. ఇళ్లంతా హడావుడి.. అంతలో
మొగల్తూరు: తెల్లారితే చెల్లి పెళ్లి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. స్నేహితులతో సరదాగా బీచ్‌కు వచ్చిన యువకుడు, అతని స్నేహితుడు నీటిలో మునిగి మృత్యువాత పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వజ్జిపోతు సత్యనారాయణ కుటుంబం హైదరాబాద్‌లోని దిండిగల్‌లో స్థిరపడింది. వారి కుమార్తె వజ్జిపోతు ఆశాజ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయించగా, తమ సొంత ఊరైన పాలకొల్లులోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కలిసి పాలకొల్లు వచ్చారు. బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమార్తె అన్న వజ్జిపోతు రాజేష్ (22), నిజాంపేటకు చెందిన అతని స్నేహితుడు బండారు వినయ్ (16) మరో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. స్నానానికి దిగిన రాజేష్, వినయ్ నీటిలో గల్లంతవడంతో అతని స్నేహితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టగా, రాజేష్ మృతదేహం లభించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుమార్తె పెళ్లి వేళ కుమారుడు శాశ్వతంగా దూరమవడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, నాగవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పీటలపై పెళ్లికొడుకు వేషాలు.. బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా!
శంకరపట్నం (మానకొండూర్): పెళ్లికూతురు మెడలో తాళికట్టే సమయానికి బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు మొండికేయడంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే తానుబండి కొనిస్తా అని డబ్బులు ఇచ్చి వివాహంజరిపించిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్‌తో కుదిరింది. రూ.5 లక్షల కట్నంతో పాటు మోటార్ సైకిల్ కొనిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కట్నం డబ్బులు ముట్టచెప్పారు. మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం పెళ్లి మండపానికి వధువు, వరుడి బంధువులు చేరుకున్నారు. కొత్తజంటను ఆశీర్వదించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయంలో మోటార్ సైకిల్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు వినయ్ మొండికేశాడు. దీంతో వరుడు, వధువు బంధువులు గొడవకు దిగడంతో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుని పెళ్లి కొడుకు వినయ్‌తో మాట్లాడి మోటార్ సైకిల్ కొనుక్కోమని సొంత డబ్బులను (సుమారు రూ.50వేలు) అప్పటికప్పుడే పందిట్లోనే అందించారు. మిగతా సొమ్ము కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి వివాహం జరిపించి నూతన జంటను ఆశీర్వదించారు. తోడబుట్టిన అన్నగా పెళ్లి మండపంలో పరువు కాపాడావని మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ కన్నీరు పెట్టుకుంది. -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్‌కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి
ఉదయగిరి/ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు వైఎస్సార్సీపీ నాయకులు ప్రతిస్పందించారు. అయితే ఆయన మాత్రం వారి సవాల్‌ను స్వీకరించలేదు. ఉదయగిరికి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. పార్టీకి అన్యాయం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో అడుగుపెడితే ఒప్పుకోబోమని సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి గురువారం ఉదయం హెచ్చరించారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని ‘నేను బస్టాండ్‌లో ఉన్నాను.. ఏం చేస్తారో రా..’ అంటూ సవాల్ చేశారు. ఈ విషయం తెలిసిన వినయ్‌రెడ్డి.. తన అనుచరులతో బస్టాండ్ వద్దకు చేరుకునేలోపు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రాత్రి, రేపు ఉదయగిరి బస్టాండ్‌లోనే ఉంటా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తమ అనుచరులతో బస్టాండ్‌కు వచ్చి అక్కడే ఉన్న వినయ్‌రెడ్డికి సంఘీభావంగా నిలిచారు. వారు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. సీఎంను, పార్టీ పెద్దలను ఒక్క మాట అన్నా సహించేది లేదని హెచ్చరించారు. కాగా, ఉదయగిరి బస్టాండ్ వద్ద సీఐ వి.గిరిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్నాను ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనపై సవాల్ చేసిన వారి గురించి మాట్లాడతానని చెప్పారు. 2024లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో 3 సంవత్సరాలుగా తాము దూరంగా ఉంటున్నామని, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మేకపాటి కుటుంబం పట్ల సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆదరణగా ఉంటున్నారని తెలిపారు. సస్పెండైన వారు వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానెల్స్ విషప్రచారం చేశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రసారం చేయడం సరికాదన్నారు. -
వినయ్‌కి అండగా ఉంటాం: మంత్రి హరీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సైన్స్‌ఫేర్ ఈవెంట్లో కెమికల్ మీద పడి గాయపడిన ఆరో తరగతి విద్యార్థి వినయ్‌కి అన్ని విధాలా అండగా ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ‘అయ్యో వినయ్.. ఆదుకునేవారే లేరా?’శీర్షికన శుక్రవారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. వినయ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెంటనే తన సిబ్బందిని పంపించారు. ఆ తర్వాత బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వినయ్ ఆరోగ్యం మెరుగై సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చికిత్స ముగిసే వరకు తోడుగా ఉండి, ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటివరకు పంపిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదంలో వినయ్ గాయపడగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కోలీవుడ్ విలన్‌తో ప్రేమలో హీరోయిన్..త్వరలోనే పెళ్లి!
కోలీవుడ్ నటుడు వినయ్, హీరోయిన్ విమలారామన్ ప్రేమలో ఉన్నట్టు తాజా సమాచారం. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయకుడిగా నటించిన వినయ్ ప్రస్తుతం ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా నటి విమలరామన్ కథానాయకగా పలుభాషల్లో నటించారు. ఈమె తెలుగులోనూ ఎప్పుడైనా ఎక్కడైనా, గాయం-2, చట్టం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ మిస్ ఇండియా, ఆస్ట్రేలియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన విమలరామన్ను దర్శకుడు కే.బాలచందర్ పొయ్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. ఆ తర్వాత చేరన్ దర్శకత్వంలో రామన్ తేడియ సీతై చిత్రాల్లో నటించి ఆ తర్వాత మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఏడాది నుంచి వినయ్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇటీవల ఈ అమ్మడు పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకలు ఆమె కుటుంబసభ్యులతో పాటు వినయ్ కూడా పాల్గొనడం విశేషం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందన్న ప్రచారం హోరెత్తుతోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోసుకోబోతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
కోవిడ్ ఇక అంటువ్యాధి స్థాయిలోనే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా? జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా. కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము? ►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్‌ను పరిశీలించడం కోవిడ్‌తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్‌లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది. భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి? ►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్‌లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది. సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్ఐఆర్కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా? ►సీఎస్ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్‌ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్ఐఆర్లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం. దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది. -
ఒమిక్రాన్ బలం మన బలహీనతే!
సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఉంటోంది. ఇదే తరహాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో బలహీన రోగ నిరోధకత ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. కరోనా మూడో దశ వ్యాప్తి, ఒమిక్రాన్ ప్రభావంపై పలు అంశాలను ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. సీసీఎంబీలో ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది? డెల్టాతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ బలహీనంగా ఉంది. డెల్టా వైరస్ శరీరంలోకి వేగంగా ప్రవేశించడంతో పాటు స్పైక్ ప్రోటీన్‌తో కణాలపై దాడి చేస్తుంది. రిప్లికేషన్ (ఉత్పాదక సామర్థ్యం) బాగా ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాíపిస్తున్నా డెల్టా అంత తీవ్రతతో దాడి చేయడం లేదు. రిప్లికేషన్ తగ్గింది. వైరస్ ఎండమిక్ దశకు చేరుకున్నట్లేనా? డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో వైరస్ క్షీణించింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైరస్ ఎండమిక్ దశకు చేరిందని భావించలేం. భవిష్యత్‌లో బలమైన లక్షణాలతో వైరస్ రూపాంతరం చెందవచ్చేమో చెప్పలేం. ఇన్‌ఫ్లూయాంజా దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. కేసుల నమోదు ఎప్పటిలోగా తారస్థాయికి చేరవచ్చు? మన దేశంలో ప్రస్తుతం పాండమిక్ దశలో ఉన్నాం. ఈ దశలో సాధారణంగా ప్రతి మూడు రోజులకు కేసుల నమోదు రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో కేసుల నమోదు తారస్థాయికి చేరుతుంది. పాజిటివిటీ రేటు పెరిగే కొద్దీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే జరుగుతోంది. బలహీన రోగనిరోధకత ఉన్న వారిపై ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదయ్యాయా? ఇప్పటివరకూ మేం పరీక్షించిన నమూనాల్లో ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదవలేదు. కేవలం ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. టీకాల నుంచి రక్షణ ఉంటోందా? గతంలో వైరస్ సోకడం, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన రోగనిరోధకతను దాటుకుని ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. గతంలో వైరస్‌తో పరిచయం ఉండటం, టీకాలు తీసుకుని ఉండటం వల్ల టీ సెల్స్ కొంత రక్షణగా ఉంటున్నాయి. బలహీన రోగ నిరోధకత ఉండే వృద్ధులు, రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులకు ప్రభుత్వం ప్రికాషన్ డోసు అందిస్తోంది. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలి. ప్రికాషన్ డోసు కింద ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? విదేశాల్లో మొదటి రెండు డోసులు కింద తీసుకున్న టీకా కాకుండా వేరే రకం టీకాను ప్రికాషన్ డోసు కింద ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మన దేశంలో మాత్రం మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే ప్రికాషన్ డోసుగా అదే టీకాను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మొదటి రెండు డోసుల కింద ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ప్రికాషన్ డోసు కింద పొందాలి. -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం
వాషింగ్టన్: అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇక ఉపాధ్యాక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎన్నుకున్న బైడెన్.. తన టీమ్‌లో పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లకు చోటు దక్కగా.. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్ సంకేతాలిచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపికచేసి, అందర్నీ బైడెన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎంపిక ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం భారతీయ అమెరికన్లే కాదు, ఆసియా సంతతి మొత్తం బైడెన్ వెంట నిలిచింది. ఇక నూతన అధ్యక్షుడి యంత్రాంగంలోని భారత సంతతి వ్యక్తులు ఎవరు.. ఏ బాధ్యతలు నిర్వహించనున్నారో ఓ సారి చూడండి.. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) 1. నీరా టాండన్ అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా, ఆమెతో కలిసి పనిచేశారు నీరా. ఇక ఆమె బడ్జెట్ తయారీ, అమలు, నియంత్రణ విధానం పర్యవేక్షణ, అధ్యక్ష ఆదేశాలు, కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తారు. 2. వివేక్‌మూర్తి డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. 3. చొల్లేటి వినయ్ రెడ్డి తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి నారాయణరెడ్డి విజయారెడ్డి దంపతుల కుమారుడే వినయ్ రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, హారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, స్పీచ్ రైటర్‌గా పని చేశారు. (చదవండి: వినయ్‌రెడ్డి మనోడే!) 4.వనితా గుప్తా అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్ కూడా వనితానే! లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్ ప్రభుత్వంలో జస్టిస్ డిపార్ట్మెంట్లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛకోసం ఆమె ఎంతో కృషి చేశారు. 5. ఉజ్రా జేయా పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్ డిపార్ట్మెంట్లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిపుణురాలు. గతంలో జేయా 2014 నుంచి 2017 వరకూ ప్యారిస్‌లోని యూఎస్ ఎంబసీలో చార్జ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బాధ్యతలు నిర్వహించారు. మస్కట్, డమాస్కస్, కైరో, కింగ్స్టన్లలో యూఎస్ మిషన్స్‌లో సేవలు అందించారు. 6. మాలా అడిగా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలంపాటు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఇల్లినాయిస్కు చెందిన మాలా ఒబామా హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి) 7. గరిమా వర్మ భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రులతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. 8. గౌతమ్ రాఘవన్ గతంలో వైట్‌హౌజ్‌లో పని చేసిన గౌతమ్ రాఘవన్.. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 9. భరత్ రామ్మూర్తి వైట్ హౌస్‌లోని యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ) భరత్ రామ్మూర్తి అనే మరో ఇండో అమెరికన్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 10. సోనియా అగర్వాల్ బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహాయో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పర్యావరణ, ఆర్థిక, ప్రజా ఆరోగ్య అంశాల మీద వాతావరణ, ఇంధన విధానాల ప్రభావంపై విశ్లేషణ జరిపి, ఇంధన విధానాన్ని, దేశీయ క్లైమెట్ పాలసీనీ రూపుదిద్దే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. అలాగే వైట్ హౌస్‌లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీస్‌లో ఇన్నోవేషన్ విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటారు. 11.సుమోనా గుహా వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్ - హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు. తాజాగా బైడెన్ అధ్యక్ష హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందబోతున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..) 12.శాంతి కలతిల్ శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. ప్రస్తుతం 'నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ'లోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ స్టడీస్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానన హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపించే శాంతికి చైనీస్, మాండరిన్ భాషలు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అగ్రరాజ్య విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా నియమితురాలయ్యారు. 13. తరుణ్ చబ్రా జో బైడెన్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ చబ్రాని నియమించారు. 14.వేదాంత్ పటేల్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్‌ను నియమితులయ్యారు. బైడెన్ ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా వేదాంత్ పనిచేశారు. అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. 15.సమీరా ఫాజిలీ బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో... శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు. 16.అయేషా షా శ్వేత సౌథంలోని డిజిటల్ వ్యూహ కార్యాలయంలో పార్టనర్షిప్ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్ అమిర్ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 1993లో, అయేషా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు. నార్త్ కరోలినాలోని డేవిడ్సన్ కాలేజీలో అయేషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాన్ ఎఫ్.కెనడీ సెంటర్ ఫర్ పెర్పార్మింగ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్- కమలా హారిస్ తరఫున పార్టనర్ షిప్స్మేనేజర్గా వ్యవహరించారు. 17. సబ్రీనా సింగ్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి అమెరికన్ సబ్రిన సింగ్ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్‌కు సబ్రిన్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు. 18. రీమా షా భారతసంతతి రీమా షా పుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. (చదవండి: ఫలించిన మూడు దశాబ్దాల కల) 19. రోహిత్ చోప్రా భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. 20.విదుర్ శర్మ కొవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు. -
వినయ్‌రెడ్డి మనోడే!
సాక్షి, కరీంనగర్: అమెరికా అధ్యక్షుడిగా కొలువుదీరనున్న జో బైడెన్ టీమ్‌లో తెలంగాణ మూలాలున్న వ్యక్తికి చోటుదక్కింది. బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా చొల్లేటి వినయ్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన మూలాలున్న పోతిరెడ్డిపేటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతులు 1970లో అమెరికా వెళ్లారు. నారాయణరెడ్డి అక్కడే డాక్టర్‌గా స్థిరపడగా, ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన వినయ్‌రెడ్డి వైట్‌హౌస్‌లో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికాలోని ఒహియా రాష్ట్రం డేటన్లో పుట్టి పెరిగిన వినయ్‌రెడ్డి కేజీ నుంచి డిగ్రీ వరకు ఒహియాలోనే చదువుకున్నారు. మియామి విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద విద్యలో పట్టా పొందారు. వినయ్‌రెడ్డి.. అమెరికా ఎన్నికల్లో బైడెన్–హ్యారిస్ ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారుగా, ప్రసంగ రచయితగా పనిచేసిన అనుభవం ఉంది. చదవండి: (యూఎస్‌లో రెండు బిగ్ ‘డే’లు.. అందులో ఒకటి నేడే!) కుటుంబ నేపథ్యం ఇదీ..: చొల్లేటి వినయ్‌రెడ్డి తాత తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపేట గ్రామానికి 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. వినయ్‌రెడ్డి తం డ్రి నారాయణరెడ్డి అమెరికా వెళ్లి డాక్టర్‌గా స్థిరపడ్డారు. పోతిరెడ్డిపేటలో వీరికి సొంతిల్లు, ఐదెకరాల పొలం ఉన్నాయి. నారాయణరెడ్డితోపాటు కుటుంబసభ్యులు సొంత గ్రామమైన పోతిరెడ్డిపేటకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. చదవండి: (బైడెన్ కర్తవ్యాలు) -
మేడిపల్లి వినయ్ రెడ్డి దాతృత్వం
-
మేడిపల్లి వినయ్ రెడ్డి దాతృత్వం
హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్లో స్థానిక ప్రతినిధి మేడిపల్లి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినసరి కూలీ పని చేసుకునే నిరుపేదలు నిత్యావసర సరుకులు దొరక్క అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక నిరుపేదల ఇబ్బందులను తెలుసుకున్న వినయ్ రెడ్డి వారికి అండగా నిలుస్తూ దాతృత్వం ప్రదర్శించారు. తనవంతు సహాయంగా నిరుపేదలకు సహాయంగా ఆదివారం 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కూడా పేదలకు సరుకులు పంపిణీ చేయించారు. పేదలకు సహాయం చేయాలని సహృదయంతో ఆలోచన చేసిన వినయ్ రెడ్డిని వారు అభినందించారు. ఆయన దాతృత్వాన్ని కొనియాడారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సూత్రధార్.. పాత్రధార్
హిమాయత్‌నగర్:‘‘అలనాటి నటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు తదితర మహా నటులు సైతం నాటకాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వారే. నటన అనేది థియేటర్ ఆర్ట్స్‌తోనే వస్తుందంటున్నారు నటులు. థియేటర్ ఆర్ట్‌లోనే నటనకు ఓనమాలు దిద్దుకోవచ్చునంటున్నారు ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత వినయ్‌వర్మ. కామెడీ, సీరియస్, విలనిజం, ఏడిపించడం, కవ్వించడం ఆయన సొంతం. థియేటర్ ఆర్ట్స్‌లో ఆయనకు తిరుగు లేదు. నటనలో లీనమవ్వడం, ఇతరులను మెప్పించడం ఆయనకే సాధ్యం. దేశవ్యాప్తంగా ఆయనకో క్రేజ్ ఉంది. నవలల్లోని స్టోరీలను ఆధారంగా చేసుకుని నేటివిటీ తగ్గట్టు నాటకాన్ని రూపుదిద్దుతారు. నాటకం పూర్తయ్యే వరకు కుర్చీలో కూర్చోబెట్టగలిగే ప్రతిభ వినయ్‌వర్మ సొంతం. హిమాయత్‌నగర్‌కు చెందిన వినయ్‌వర్మ. 1980లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సోషియాలజీ’ పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో హుషారుగా ఉండేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన రీసర్చ్ స్కాలర్ డాక్టర్ గోయల్ నాటకం చేస్తావా..అంటూ అడిగారు. రూ.లక్షలు వదిలి..లక్ష్యం దిశగా ఆయన మాటను కాదనలేక నటించేందుకు ఒప్పుకున్న వినయ్‌వర్మ ‘యాంగ్రీయంగ్ మ్యాన్’గా చేశారు. ఒక లీడర్‌గా వ్యతిరేకంగా వెళ్లే క్యారెక్టర్లో లీనమైన వినయ్‌వర్మ యూనివర్సిటీలోని అందర్నీ తన నటనతో మెప్పించాడు. అందరూ ప్రశంసించడంతో నటనపై దృష్టి సారించాడు. ఇదే నటనతో యావత్ ప్రజానీకాన్ని మెప్పించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. చదువు పూర్తయ్యాక ‘డేనా’ బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా, తన లక్ష్యం కోసం రూ. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ‘ సూత్రధార్’ ద్వారా 65కి పైగా నాటకాలు హిమాయత్‌నగర్‌లో 1998లో ‘సూత్రదార్’ పేరుతో థియేటర్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా అనేక నవలల్లోని అతి ముఖ్యమైన కథలను నాటకాలుగా చిత్రీకరించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్, ఉదయ్‌పూర్ తదితర నగరాల్లోనూ నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 45 నిమిషాల నుంచి రెండు గంటల పాటు ఉండే ఈ నాటకాల్లో ‘నవ్వించడం, ఏడిపించడం, టెన్షన్‌కు గురి చేయడం, థ్రిల్ అయ్యేలా చెయ్యడం, మెప్పించడం, ఒప్పించడం’ ఆయనకు మాత్రమే సొంతం అనేలా అక్కున చేర్చుకున్నారు ప్రేక్షకులు. ‘లవ్’తో తెరంగేట్రం.. నాటకాల్లో అతడి నటనను చూసి మెచ్చిన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాల్లో అతడికి అవకాశాలు ఇచ్చారు. 2001లో ‘లవ్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన వినయ్‌వర్మ ఆ సినిమాలో ‘టెర్రరిస్ట్’గా నటించాడు. ఆయన నటకు, తెరపైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలనివ్వకుండా చేశాడు. ఇలా తెలుగులో 19 సినిమాలు, హిందీలో 7 సినిమాలు, హాలీవుడ్లో ‘బీపర్’ అనే సినిమాలో నటించాడు. బుల్లితెరపై కూడా తొమ్మిది సీరియల్స్ చేశాడు. అబ్బే..ఏం లేదు ఇప్పటి వరకు ఆయన చేసిన నాటకాలన్నీ హిందీ, ఉర్దూ, మరాఠి, గుజరాతి తదితర భాషలకు చెందినవే. మొదటిసారి తెలుగు స్టోరీతో తెలుగులో ‘అబ్బే..ఏం లేదు’ అనే నాటకంతో ముందుకొస్తున్నాడు వినయ్‌వర్మ. ఓ కుటుంబంలో భార్య, భర్త, పనివాడు, డాక్టర్, ఇద్దరు దొంగలతో రూపుదిద్దుకున్న నాటకమే ‘అబ్బే..ఏం లేదు’. వినయ్‌వర్మ మొదటిసారి తెలుగులో చేస్తున్న నాటకం కావడంతో సిటీ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో బంజారాహిల్స్‌లోని ‘లామాకాన్’ ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ‘థియేటర్ ఆర్ట్’ బేసిక్ నాలెడ్జ్ నాటకం అంటే ఈ రోజుల్లో వారికి పెద్దగా తెలీదు, దానిని లైట్‌గా తీసుకుంటారు. థియేటర్ ఆర్ట్ అనేది బేసిక్ నాలెడ్జ్. దాని నుంచి సినిమాల్లోకి వెళితే అవలీలగా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు వస్తాయి. హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ ఆర్ట్ నుంచి సినిమాల్లోకి వెళ్లిన వ్యక్తే. విజయ్ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నటనపై ఆసక్తి, డెడికేషన్ ఉన్న వారికే నేను నేర్పిస్తా. మొదటిసారి తెలుగు నవలలోని ఓ కథను ‘అబ్బే..ఏం లేదు’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నాము. – వినయ్‌వర్మ, నటుడు, ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత. -
అనారోగ్యంతో పెద్ద పులి మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం వినయ్ (21) అనే పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందింది. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్న పెద్దపులి మంగళవారం ఉదయం మృతి చెందింది. గత కొంతకాలంగా సమ్మర్ హౌజ్‌లోని ఇన్టెన్సివ్ కేర్‌లో పశు వైద్య నిపుణులు డాక్టర్ ఎం.నవీన్ కుమార్ బృందం దానికి చికిత్స అందజేస్తోంది. డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ డాక్టర్ సదానంద్ తదితరులు పోస్టుమార్టం నిర్వహించారు. నమునాలను సేకరించి శాంతినగర్‌లోని వీబీఆర్‌ఐకు పంపినట్లు వారు తెలిపారు. -
హెలికాప్టర్లో వెళ్లి నామినేషన్
సాక్షి, బెంగళూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప శికారిపురకు హెలికాప్టర్లో వచ్చి గత గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తానేం తక్కువ కాదంటూ వినయ్ రాజావత్ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా హెలికాప్టర్లోనే వచ్చి నామినేషన్ సమర్పించారు. 25 ఏళ్ల ఈ యువకుని స్వస్థలం బెంగళూరు కాగా, హెలికాప్టర్లో శికారిపురకు వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. హెలికాప్టర్ అద్దె డబ్బులను అతని స్నేహితులు భరించడం విశేషం. ఎద్దులబండిలో వెళ్లాలనుకున్నా : రాజావత్ మాట్లాడుతూ అందరి కంటే విచిత్రంగా నామినేషన్ పత్రాలను సమర్పించాలని తొలుత తాను తలచినట్లు చెప్పారు. ఎద్దుల బండిలో వెళితే ఎలా ఉంటుందని ఆలోచించా ను, కానీ ఆ తర్వాత యడ్యూరప్ప లాంటి వ్యక్తిని ఎదుర్కొవాలంటే హెలి కాప్టర్లో వెళ్లడమే ఉత్తమమని తన స్నేహితులు సూచించినట్లు చెప్పారు. రాజావత్ ‘విద్యార్థి’ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో కెమెరా ఆర్డర్ చేస్తే...
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బిజీ లైఫ్ లో షాపింగ్ చేసే ఓపిక లేకో...లేక బిజీబిజీ షెడ్యూల్ ..సమయం లేదనో ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక. ఎందుకంటే ఆన్లైన్ లో విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తే .. రాళ్లు, రప్పలు మనల్ని వెక్కిరించడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వినియోగదారులకు వస్తువులకు బదులు రాళ్లు, ఇటుకలు రావడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఆన్లైన్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్లో రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన వినయ్(24) డీఎస్ఎల్ ఆర్ కెమెరా కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. రూ.41 వేల విలువైన కెనాన్ ఈవోఎస్ 700డి కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. తీరా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే అందులో రాయి, డమ్మి కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని ఎల్బీ నగర్ ఎస్ఐ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఫ్లిప్‌కార్ట్ తిరస్కరించింది. కస్టమర్ కేర్ ద్వారా సంప్రదించినపుడు అత్యంత భద్రత మధ్య తమ ప్యాకింగ్ ఉంటుందనీ, డెలివరీకంపెనీ మోసం చేసి ఉంటుందని, దీనికి తమ బాధ్యత ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆన్లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం.. సో..ఇకపై ఆన్లైన్ షాపింగ్ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. -
రచయిత వినయ్ ఇక లేరు!
శోభన్‌బాబు ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, కృష్ణ ‘అమ్మ దొంగ’తో సహా పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత వినయ్‌కుమార్ ఇక లేరు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం వరంగల్. సినిమాలపై ఆసక్తితో రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘అమ్మనా కోడలా’, ‘ప్రేమ ఖైదీ’ వంటి పలు హిట్ చిత్రాలకు పని చేశారాయన.