Visakhapatnam port
-
బియ్యం బుక్కేది వారే..
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం పేరు గొప్ప తీరు దిబ్బలా ఉంది. సీఎం చంద్రబాబు మొదలు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరకు అందరివీ తాటాకు చప్పుళ్లేనని తేలిపోతోంది. ఎందుకంటే.. ‘ముఖ్య’ నేత సామాజికవర్గానికి చెందిన ఓ వ్యాపారి తన అధికార బలంతో కంటైనర్ల కొద్దీ రేషన్ బియ్యాన్ని దేశాలు దాటించేస్తున్నారు. విశాఖ పోర్టు వేదికగా సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వ పెద్దలు రక్షణ కవచంలా ఉంటూ అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన కూటమి సర్కారు ఈ విషయంలోనూ అందరి దృష్టి కాకినాడ వైపు మళ్లించి విశాఖ నుంచి తమ అస్మదీయుల పని సులభం చేస్తోంది.సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) అనుబంధంగా.. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్) నడుస్తోంది. ఇక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కంటైనర్ కార్గోకు సంబంధించి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు (సీఎఫ్ఎస్) ఉన్నాయి. వీసీటీపీఎల్ ఆధ్వర్యంలో ఒక సీఎఫ్ఎస్ నడుస్తోంది. దీనిపక్కనే మరో మూడు సీఎఫ్ఎస్లు పనిచేస్తున్నాయి. వివిధ దేశాలకు పంపించాల్సిన కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలు అన్ని అనుమతుల్ని తీసుకుని కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత.. సీఎఫ్‌ఎస్‌కు తీసుకొస్తాయి. సీఎఫ్ఎస్ వాటిని గోదాముల్లో నిల్వ ఉంచి.. కంటైనర్లలో లోడ్‌చేసి ఆయా దేశాలకు చెందిన కార్గో షిప్‌లలో కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో లోడ్ చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 9న మంత్రి నాదెండ్ల సీఎఫ్ఎస్లను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. తొలుత వీసీటీపీఎల్కు సంబంధించిన కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్)ని, ఆ పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్ఎస్ని హడావిడిగా తనిఖీచేసి.. అక్కడున్న బియ్యం పీడీఎస్ అని నిర్థారించి వాటిని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. ఇకపై పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా డిప్యూటీ తహశీల్దార్, డీఎస్ఓ, మరో ఇద్దరు అధికారులతో కూడిన నిఘా బృందాన్ని ఏర్పాటుచేశారు. పీడీఎస్ అని తెలిసినా సీజ్ చెయ్యకుండా..ఇక ఇక్కడికొస్తున్న ప్రతి కార్గోని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించి.. ఎగుమతికి అనుమతిస్తోంది. అయితే.. ఆయా కార్గోల్లో పీడీఎస్ బియ్యం ఉంటే వాటిని కచ్చితంగా సీజ్‌చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ, సదరు టీంలో ఉన్న కొందరు అధికారులు సదరు కార్గో బ్రోకర్ సంస్థలతో కుమ్మక్నై బియ్యాన్ని సీజ్ చేయకుండా పక్కనే ఉన్న ఇతర ఫ్రైట్ స్టేషన్లకు పంపించేస్తున్నారు. అక్కడ ఎలాంటి నిఘా లేకపోవడంతో అక్కడ నుంచి రేషన్ బియ్యం సునాయాసంగా విదేశాలకు తరలిపోతోంది.ఆ వ్యాపారి సీఎఫ్ఎస్ ద్వారానే ఎగుమతి..నిజానికి.. ముఖ్య నేత సామాజికవర్గానికి చెందిన ఆ వ్యాపారి ఇక్కడ సీఎఫ్ఎస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచే అడ్డగోలుగా బియ్యం వ్యాపారం జరుగుతోంది. సీజ్ చెయ్యకుండా స్పెషల్ టీం పంపించేస్తున్న బియ్యం మొత్తం సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు వెళుతూ ఎల్లలు దాటిపోతోంది. మంత్రి దాడులు నిర్వహించిన తర్వాత.. దాదాపు రూ.2 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని ఈ స్పెషల్ టీం సీజ్ చెయ్యకుండా సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు పంపించింది. అక్కడ మొత్తం 60 కంటైనర్లలో వ్యాన్హై–367 షిప్లో ఈనెల 12వ తేదీ అర్థరాత్రి చైనాకు బయల్దేరింది. అలాగే, మంత్రి తనిఖీల సమయంలో సీజ్చేసిన బిబో ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన బియ్యాన్ని కూడా పారసోరై లాజిస్టిక్స్ పేరుతో చైనాకు ఎగుమతి చేసేశారు.మరో 110 కంటైనర్లలో లోడింగ్‌కు సిద్ధంగా..ఇక టీడీపీ సానుభూతిపరుడిగా.. షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న ఆ వ్యాపారి ఇప్పటికే 60 కంటైనర్లలో బియ్యం తరలించగా ఇప్పుడు మళ్లీ మరో 10,600కి పైగా టన్నుల రేషన్ బియ్యాన్ని పంపించేందుకు 20 కంటైనర్లను సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ వారంలో మరో 90 కంటైనర్లలో రేషన్ బియ్యం ఎగుమతికి షెడ్యూల్ కూడా సిద్ధంచేసినట్లు సమాచారం.మంత్రి ఆ వేర్‌హౌస్‌కు ఎందుకెళ్లలేదు?మంత్రి నాదెండ్ల ఇటీవల వీసీటీపీఎల్ సీఎఫ్ఎస్తో పాటు పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్ఎస్లోనూ తనిఖీలు నిర్వహించారు. కానీ.. అక్కడున్న మరో రెండు వేర్‌హౌస్‌ల వైపు మంత్రిగానీ, అధికారులుగానీ కన్నెత్తి చూడలేదు. వాస్తవానికి.. అక్కడే రూ.కోట్లు విలువచేసే వేల టన్నుల రేషన్ బియ్యం నిల్వలున్నాయి. ఈ విషయం తెలిసే మంత్రి, అధికారులు అక్కడికి వెళ్లలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా.. ప్రభుత్వానికి నిజంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే.. అన్ని సీఎఫ్ఎస్లనూ తనిఖీ చేసేందుకు టీంలు ఏర్పాటుచేయాలి. కానీ, ఒక్కచోట మాత్రమే ఏర్పాటుచేసి మిగిలిన చోట్ల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విమర్శలొస్తున్నాయి. ఇక మంత్రి సీజ్చేసిన బియ్యాన్ని తీసుకొచ్చిన బిబో సంస్థ నవంబరులోనే వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దాడులు జరగడంతో.. వాటిని ఎక్స్పోర్ట్ చెయ్యకుండా ఆపేశారు. ఇప్పుడు టీడీపీ సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్న కార్గోని కస్టమ్స్ కళ్లుగప్పి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.48 గంటలు గడిచాయి.. ఏం చర్యలు తీసుకున్నారు.?ఈనెల 9న మంత్రి మొత్తం 483 టన్నుల వరకూ బియ్యాన్ని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. అనంతరం బియ్యానికి సంబం«ధించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర బిల్లుల్ని 48 గంటల్లో పంపించాలని గడువు ఇచ్చారు. కానీ, ఇప్పటికి ఐదురోజులు గడిచినా ఎవరూ ఆ ఊసెత్తడంలేదు. త్వరలోనే ఈ బియ్యానికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసి.. సదరు వ్యాపారి సీఎఫ్ఎస్ ఆధ్వర్యంలో చైనాకు పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. -
హ్యాండ్లింగ్.. వెరీ లేట్.!
సాక్షి, విశాఖపట్నం: నెల రోజుల క్రితం వరకూ మేజర్ పోర్టులతో పోటీ పడుతూ దూసుకుపోతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ).. ఇప్పుడు చతికలపడుతోంది. సరకు హ్యాండ్లింగ్‌లో వరుస రికార్డులు సృష్టించిన పోర్టు.. ఇప్పుడు అదే సరకు రవాణా విషయంలో నీలి సముద్రమంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ట్రాఫిక్ విభాగ వైఖరి కారణంగా కార్గో హ్యాండ్లింగ్ కోసం బెర్తుల కేటాయింపుల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ట్రేడర్లు మొరపెట్టుకుంటున్నా తమకేమీ పట్టనట్లుగా పోర్టు అధికారులు వ్యవహరిస్తుండటంతో హ్యాండ్లింగ్ క్రమంగా కుంటుపడుతోంది.ఒకే నెలలో అత్యధిక సరకు హ్యాండ్లింగ్.. ఏడాది వ్యవధిలో అత్యధికంగా కోల్ కోక్ దిగుమతి.. భారీగా క్రూడ్ ఆయిల్ నిర్వహణ.. కంటైనర్ల ఎగుమతిలో సరికొత్త రికార్డు.. రెండు మూడు నెలల క్రితం.. పోర్టు ఖాతాలో జమ అయిన రికార్డులివీ. సరకు రవాణా విభాగంలో దేశంలోని మేజర్ పోర్టుల్లో కొన్నింటికి సాధ్యం కాని రికార్డులను సైతం తన ఖాతాలో జమ చేసుకున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ ప్రస్తుతం నెమ్మదిస్తోంది. ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా హ్యాండ్లింగ్ చాలా ఆలస్యంగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోర్టుకు చేరుకున్న కార్గో షిప్‌లకు సరైన బెర్తింగ్ ఇవ్వడంలో సంబంధిత విభాగాధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వచ్చిన షిప్‌లు బెర్తింగ్ కాకపోవడం సరకు గోదాములకు చేరుకోకపోవడం కొత్త షిప్‌లకు బెర్తులు దొరక్కపోవడంతో పోర్టులో గజిబిజి వాతావరణం నెలకొంది.కొత్త చిక్కులు తెచ్చిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్ఈ ఏడాది సరకు హ్యాండ్లింగ్ 90 మిలియన్ మెట్రిక్ టన్నులు దాటాలంటూ పోర్టు చైర్మన్ లక్ష్యాన్ని నిర్దేశించినా ఆ పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా పోర్టు ఇటీవల రూ.40 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రక్పార్కింగ్ టెర్మినల్ కారణంగా ట్రేడర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ టెర్మినల్ పోర్టుకు లాభాలు తీసుకొస్తుందే తప్ప.. సరకు రవాణాకు పెద్దగా ఒరిగిందేమీ కనిపించడం లేదు. పోర్టు ఏరియాకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్ టెర్మినల్ ఉంది. ఒక ట్రక్‌ని పార్కింగ్ చేయాలంటే రోజుకు రూ.150 వరకూ ట్రేడర్లు చెల్లించాల్సి ఉంటుంది. సరకు ఎగుమతి, దిగుమతి చేసుకోడానికి పోర్టుకు ట్రక్ వెళ్లాలంటే.. కచ్చితంగా టెర్మినల్ నుంచే బయల్దేరాలి. అయితే.. బెర్తింగ్ విషయంలో ట్రాఫిక్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల.. రెండు మూడు రోజులు టెర్మినల్‌లో ట్రక్లు ఉండాల్సి వస్తోంది. ఫలితంగా.. ఒక్కో ట్రక్కు రూ.450 వరకూ చెల్లించడంతో పాటు 16 కిలోమీటర్ల మేర డీజిల్ అదనపు భారంగా మారుతోంది. ఈ కారణంగా.. వచ్చిన లాభాలన్నీ.. పోర్టుకే జమ చేయాల్సి వస్తోందంటూ స్టివడోర్స్ వాపోతున్నారు. మౌలిక సదుపాయాలపైనా కనీస దృష్టి సారించడం లేదని ఈ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ట్రాఫిక్ విభాగంపై చైర్మన్ దృష్టిసారిస్తే తప్ప.. పోర్టు బాగుపడదని విమర్శిస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే స్టివడోర్స్ అంతా పక్కనే ఉన్న గంగవరం పోర్టు వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.రెండు మూడు రోజులైనా..ఇటీవల కాలంలో రెండు మూడు రోజులైనా సరకుతో వచ్చిన షిప్‌లకు బెర్తులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. షిప్ వచ్చిందని హ్యాండ్లింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ట్రేడర్లు అడిగే వరకూ ట్రాఫిక్ విభాగాధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇటీవల గుజరాత్ నుంచి వచ్చిన ఓ అధికారి ఈ వ్యవహారాలను పూర్తిగా విస్మరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టివడోర్లకు అందుబాటులోకి రావడం లేదని ఆయన లేకపోవడంతో దిగువ స్థాయి సిబ్బందికి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదంటూ వాపోతున్నారు. ఫలితంగా తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నామంటూ స్టివడోర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ విభాగంలో ఈ తరహా ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని స్టివడోర్స్ చెబుతున్నారు. ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం కూడా పోర్టు విస్మరించడం విస్మయానికి గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. -
చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెన్నై నుంచి సింగపూర్‌కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్‌ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్‌ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్‌లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్‌ని విశాఖ మీదుగా నడపాలని భావించారు. ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్‌గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి. -
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్‌కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ తొంభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. 1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ తొలి పాసింజర్ షిప్ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్ డన్ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజినీర్లు డబ్ల్యూసీ యాష్, ఓబీ రాటెన్‌బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టులో ప్రధానంగా స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్ పోర్టులోనే ఉండటం విశేషం. ఏటా సంస్కరణలు.. సాంకేతికత పరుగులు గ్రీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్‌ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్ మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తోంది. 2023–24 నాటికి 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ► ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి పనులు పూర్తి కానున్నాయి. ► ఏపీ, తెలంగాణా, చత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర జార్ఖండ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్ గేట్ వే గా వ్యవహరిస్తోంది. ► మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్ధాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్ ను 666 వాహనాల పార్కింగ్ సామర్థ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఏడాది నవంబర్ నాటికి లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన మరో కవర్డ్ స్టోరేజ్ యార్డ్ నిర్మాణం పూర్తి కానుంది. ► పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్త్ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు. ► రూ.800 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సీఎన్జీ బంకరింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు హెచ్‌పీసీఎల్, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది. కాలుష్యాన్ని నియంత్రిస్తూ.. పోర్టు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు. విశాఖ ప్రజల సహకారంతోనే నిరంతరాయంగా పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. నగరం అభివృద్ధితో పాటు కాలుష్య నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించాం. 655 ఎకరాలలో 5.7 లక్షల మొక్కల్ని ఇప్పటి వరకూ నాటాం. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు ఛానెల్స్, బెర్తులని మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల సైతం నుంచి ఆదాయం ఆర్జించేలా సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాం. – డా.అంగముత్తు, విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
సరికొత్తగా విశాఖ పోర్టు.. ‘ల్యాండ్ లార్డ్ పోర్టు’ దిశగా అడుగులు
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖపట్నం పోర్టు అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దేశంలోని మేజర్ పోర్టుల్లో 4వ స్థానానికి ఎగబాకిన విశాఖ పోర్టు అథారిటీ.. నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. రూ.755 కోట్ల వ్యయంతో పోర్టు ఆధునికీకరణ పనులను చేపట్టింది. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతోంది. భవిష్యత్‌లో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీల సామర్థ్యాన్ని విశాఖ పోర్టు అధికారులు పెంచుతున్నారు. అలాగే రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ను వేగవంతం చేసేందుకు కూడా వివిధ పనులు చేపట్టారు. పోర్టులోని ఆర్అండ్డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్ల నిర్మాణం, ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా జనరల్ కార్గో బెర్త్ వద్ద కేప్ సైజ్ షిప్‌లను సైతం నిలుపుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇన్నర్ హార్బర్, ఔటర్ హార్బర్లో సింగిల్ బీమ్ ఎకో సౌండర్ను మల్టీబీమ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పోర్టులో మొత్తం 29 బెర్తులుండగా.. ఇందులో 8 బెర్తులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నడుస్తున్నాయి. త్వరలో మరో 3 బెర్తులను కూడా పీపీపీ కింద ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా అంతర్గత నౌకాశ్రయంలోని డబ్ల్యూక్యూ–7, డబ్ల్యూక్యూ–8, ఈక్యూ–7, ఈక్యూ–6 బెర్త్‌ల యాంత్రీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఇన్నర్ హార్బర్లోని ఓఆర్–1, 2 బెర్తుల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే వివిధ మౌలిక వసతులతో మూడు స్టోరేజీ షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
విశాఖ పోర్టుకు యూకే షిప్ హెచ్ఎంఎస్ తమర్
దొండపర్తి(విశాఖ దక్షిణ): యూకే రాయల్ నేవీకి చెందిన ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక హెచ్ఎంఎస్ తమర్ విశాఖ పోర్టుకు శనివారం చేరుకుంది. ఈ నౌకకు చెందిన 17 మంది సిబ్బంది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లలోని విభిన్న ప్రతిభావంతుల ఎన్టీఓ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ దివ్యాంగ పిల్లలు, యువతతో ముచ్చటించారు. వారితో క్రికెట్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు ఆడారు. మొక్కలు నాటి వసతి గృహాలకు రంగులు వేశారు. ఇండో–పసిఫిక్‌లో పూర్తి స్థాయి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే రాయల్ నేవీ నౌకల్లో హెచ్ఎంఎస్ తమర్ ఒకటి. ఇరుదేశాల నావికాదళ సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని నావికాదళ వర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్ఎంఎస్ తమర్ విశాఖ పర్యటన భారత్‌లో రక్షణ, భద్రతా సంబంధానికి తమ దేశం ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. -
విశాఖపట్నం : మత్స్యకారులకు సిరులు వలకు చిక్కిన కొమ్ముకోనం, సొర (ఫొటోలు)
-
విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), గంగవరం పోర్టు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం.. సరుకు రవాణా రంగంలో సత్ఫలితాలిస్తున్నాయి. వీపీఏలో 32 బెర్త్‌లు, గంగవరంలో 9 బెర్త్‌లున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటాయి. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రపంచ పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఎగుమతులకు సిద్ధం చేస్తున్న సముద్ర ఉత్పత్తులు ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే.. దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్‌టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి. విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ–సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్‌ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈపీసీజీతో ఎగుమతి సంస్థలకు వెసులుబాటు దేశ విదేశాల ఎగుమతులకు విశాఖపట్నం స్వర్గధామంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకం ద్వారా ఐజీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. షిప్పింగ్ బిల్స్ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకోవడం విషయంలోనూ వైజాగ్ కస్టమ్స్ ముందుంటుంది. ప్రతినెలా రూ.60 కోట్ల వరకు ఎగుమతిదారులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఐజీఎస్టీ రిఫండ్ ప్రతినెలా రూ.45 కోట్లు జరుగుతోంది. ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఎగుమతులను మరింత సులభతరం చేశాం. ఈ కారణంగా ఎగుమతుల విషయంలో వైజాగ్ దూసుకుపోతోంది. – డా. జేన్ జేసుదాస్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ -
వైజాగ్ పోర్టుకు 6 కనెక్టివిటీ ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతిశక్తి పథకంలో భాగంగా పోర్టు కనెక్టివిటీ రహదారుల్లో వైజాగ్ పోర్టుకు 6 ప్రాజెక్టులను కేటాయించినట్టు పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్రావు చెప్పారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో పోర్టు ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే మారిటైమ్–2022 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రామ్మోహన్రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 35 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్(ఎంఎంఎల్పీ)లో భాగంగా విశాఖపట్నం లాజిస్టిక్ హబ్‌గా భాసిల్లుతుందని అశాభావం వ్యక్తం చేశారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన గతిశక్తి ద్వారా ప్రాజెక్టులు వేగవంతం అవుతాయన్నారు. వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి మాట్లాడుతూ.. పోర్టులు, రైల్వేలు పరస్పర సహకారంతో గతిశక్తి ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు పూర్తి చేసి.. విశాఖపట్నం రైల్వే జంక్షన్‌ను శరవేగంగా అభివృద్ధి చేసే చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు వివరించారు. -
విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నం పోర్టుకు అతి పెద్ద క్రూడాయిల్ పార్సిల్ ఆదివారం చేరుకుంది. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి క్రూడాయిల్ తీసుకురావడం ఇదే మొదటిసారని పోర్ట్ ట్రస్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. టెక్సాస్ నుంచి పోర్టు అధికారులు 2.72 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను తీసుకొచ్చారు. ఈ క్రూడాయిల్ తీసుకొచ్చిన భారీ షిప్ ఆదివారం సాయంత్రం పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖలో పోర్టు ఏర్పడినప్పటి నుంచి ఇంత భారీ మొత్తంలో క్రూడాయిల్ రావడం ఇదే మొదటిసారని తెలిపారు. -
ఎగుమతుల రెట్టింపే లక్ష్యం.. వాణిజ్య ఉత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడలో మంగళ, బుధవారాల్లో (21, 22 తేదీల్లో) నిర్వహిస్తున్న ‘వాణిజ్య ఉత్సవ్’ను ఇందుకు వేదికగా వినియోగించుకుంటోంది. రాష్ట్రం నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులకు వివరించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నాలుగు ఓడ రేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా వీటిని 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో జె.వి.ఎన్.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, లాజిస్టిక్, ఎంతచౌకగా ఎగుమతులు చేయగలమన్న వివరాలను ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించనున్నారు. 2020–21లో 159 ఎంఎంటీల సరుకు రవాణా ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోర్టులకు 253.89 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీల) సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశాఖ పోర్టుకు 127 ఎంఎంటీల సామర్థ్యం ఉంది. రాష్ట్రానికి చెందిన గంగవరం పోర్టు 64 ఎంఎంటీలు, కాకినాడ పోర్టు 18 ఎంఎంటీలు, కృష్ణపట్నం పోర్టు 45 ఎంఎంటీల సామర్థ్యంతో ఉన్నాయి. 2020–21లో రాష్ట్రంలోని పోర్టుల ద్వారా 159 ఎంఎంటీల సరుకును రవాణా చేయడం ద్వారా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం 412 ఎంఎంటీల సరుకు రవాణాతో మొదటి స్థానంలో ఉంది. కొత్తగా రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టులు అందుబాటులోకి వస్తే సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యం 450 మిలియన్ టన్నులకు చేరనుంది. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువ రాష్ట్రానికి వచ్చిన ఓడ అత్యంత తక్కువ సమయంలో సరుకును దిగుమతి, ఎగుమతి చేసుకుని వెళ్లే అవకాశం ఉండటంతో ఎగుమతిదారులకు వ్యయం చాలా తగ్గుతోంది. రాష్ట్ర పోర్టులైన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల టర్న్ ఎరౌండ్ సమయం (సరుకు దింపి నింపుకొని వెళ్లే సమయం) 1.5 రోజులు. విశాఖ పోర్టు టర్న్ ఎరౌండ్ సమయం 2.51 రోజులు. దేశంలో ఇంత తక్కువ టర్న్ ఎరౌండ్ మన రాష్ట్రంలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నాలుగు పోర్టుల్లో 39 బెర్తులున్నాయి. వీటిలో 57 శాతం బల్క్ కార్గో నిర్వహించేవి కావడం కూడా తక్కువ టర్న్ ఎరౌండ్‌కు ఒక కారణం. దీనికితోడు ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్ ఉండటం కూడా కలిసి వస్తోంది. రాష్ట్రంలో 13.38 లక్షల టన్నుల సరుకును నిల్వ చేసుకునే విధంగా 109 గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. 104 కోల్డ్ స్టోరేజీలు, 3 ఇన్లాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీ), 15 కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఉన్నాయి. సరుకు రవాణా వ్యయం మరింత తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ పాలసీ ద్వారా ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది. -
ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు
సాక్షి, విశాఖపట్నం: పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు రాబోయే మూడేళ్ల కాలంలో సరికొత్త సొబగులు అద్దుకోనుందని ట్రస్టు చైర్మన్ రామ్మోహన్రావు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీలు, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుందన్నారు. పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి.. దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్టు ట్రస్ట్ సమావేశ మందిరంలో శనివారం రామ్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ► 2020–21లో కరోనాతో సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ 30.08 మి.టన్నుల దిగుమతులు, 38.73 మి.టన్నుల ఎగుమతులతో, 1.03 ట్రాన్షిప్తో మొత్తం 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశాం. దేశంలోని మేజర్ పోర్టుల్లో వరుసగా రెండో ఏడాది మూడో స్థానంలో నిలిచాం. మొత్తం రూ.606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అదేవిధంగా పోర్టు చరిత్రలో తొలిసారిగా ల్యాండ్ రెంట్స్ మార్చి నాటికల్లా ఖజానాకు చేరాయి. సుమారు 4 వేల ఎకరాలకు గాను రూ.435 కోట్ల అద్దెలు వసూలయ్యాయి. ► చైనాకు ఎగుమతి చేసిన ఐరన్ ఓర్, ఫినిష్డ్ స్టీల్‌తో పాటు గుజరాత్‌కు ఐరెన్ పెల్లెట్స్ ఎగుమతుల్లో వృద్ధి సాధించగా, స్టీమ్కోల్డ్, కుకింగ్ కోల్ రవాణా గణనీయంగా తగ్గాయి. 2019–20లో 2,099 నౌకలు పోర్టుకు రాగా 2020–21లో 2,040 నౌకలు వచ్చాయి. ► రైల్వే ద్వారా చేసిన కార్గో సరుకు రవాణాలో ఈ ఏడాది ఒక శాతం వృద్ధి సాధించాం. గతేడాది 32.13 మి.టన్నుల సరుకు (9,174 ర్యాక్స్) హ్యాండిల్ చేయగా ఈ ఏడాది అత్యధికంగా 32.35 మి.టన్నులు (9,635 ర్యాక్స్) హ్యాండిల్ చేశాం. ► పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు జెట్టీల యాంత్రీకరణకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నాం. వెస్ట్‌క్యూ (డబ్ల్యూ.క్యూ)–7, డబ్ల్యూ.క్యూ–8 జెట్టీల సామర్థ్యాన్ని రూ.300 కోట్లతోనూ, రూ.150 కోట్లతో ఈక్యూ–7 జెట్టీ యాంత్రీకరణ పనులు నిర్వహిస్తున్నాం. ► చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తుల అభివృద్ధి పనులు కూడా రూ.168కోట్లతో చురుగ్గా సాగుతున్నాయి. ► కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతాయి. ఇది పూర్తయితే.. 5.4 లక్షల కంటైనర్లు హ్యాండిల్ చేయవచ్చు. ► రూ.103 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నాం. అనుమతులు వచ్చిన ఏడాదిలోపే టెర్మినల్ పనులు పూర్తిచేసి క్రూయిజ్ టూరిజం కార్యకలాపాలు ప్రారంభిస్తాం. దీంతో సముద్ర విహారం విశాఖ వాసులకు చేరువవ్వడమే కాక అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ► ఏడాది కాలంగా అదానీకి కేటాయించిన టెర్మినల్‌లో కార్యకలాపాలు జరగకపోవడంతో పోర్టు ఆదాయం కోల్పోతోంది. ఇది ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉంది. విచారణ పూర్తయ్యాక ఆ టెర్మినల్‌ను పోర్టు ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తాం. -
మంటల్లో చేపల బోటు, తప్పిన ప్రమాదం
-
మంటల్లో బోటు, తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఔటర్ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, బోటులో మంటల్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. కొందరు మత్స్యకారులు శనివారం ఉదయం ఐదు గంటలకు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బోటులో మటలు చెలరేగగానే వారు పోర్టు ట్రస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంటల నుంచి తమను తాము కాపాడుకునేందుకు నీటిలో దూకారు. అంతలోనే స్థానిక యువకులు అక్కడకు చేరుకుని వారిని రక్షించారు. పోర్టు సిబ్బంది ప్రమాదం బారినపడ్డ బోటు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మత్స్యకారులు వాపోయారు. బోటు ఇంజన్ ద్వారా మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలిపారు. -
కాలుష్య కష్టాలకు చెక్!
విశాఖలో పోర్టు కాలుష్యం తగ్గినప్పటికీ.. బొగ్గు నిల్వల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోర్టు నుంచి సుమారు 3 చదరపు కిలోమీటర్ల వరకూ బొగ్గుకి సంబంధించిన నల్లటి రేణువులు విస్తరించి నగరం కలుషితమవుతోంది. దీన్నిఅధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ఐదేళ్ల ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏటా రూ.100 కోట్లు చొప్పున రూ.500 కోట్లతో బొగ్గు నిల్వల కోసం గోదాములు నిర్మించాలని వీపీటీ భావిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరంలో కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. ఇంటి కాలుష్యం ఓవైపు ఇబ్బంది పెడుతుంటే.. పోర్టు కాలుష్యం మరోవైపు వ్యాధుల బారిన పడేస్తోంది. పోర్టు నుండి బొగ్గు ఎగిరి రావటంతో దుస్తులు వేసుకున్న కొద్ది సేపటికే వాటిపై బొగ్గు పేరుకుపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో రోజుకి నాలుగుసార్లు తడిగుడ్డలు పెట్టినా క్షణాల్లో బొగ్గుపడి పేరుకుంటోంది. నగరంలో 40 శాతానికి పైగా ప్రాంతాలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ధూళికణాల వల్ల ప్రధానంగా శ్వాసకోస వ్యాధులు ప్రబలుతున్నాయి. పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. బొగ్గుకి సంబంధించిన ధూళి కణాలు ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్నాయి. 2002లో పోర్టు ధూళి కాలుష్యంపై విశాఖపట్నం పోర్టు ట్రస్టు చర్యలు ప్రారంభించింది. 4,75,000 చదరపు మీటర్ల పరిధిలో రూ.8 కోట్లతో మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్‌ని ప్రారంభించారు. ఆర్–4, ఆర్–10 కోల్ కార్గో ప్రాంతాల్లో 24 గంటలూ వాటర్ ట్యాంకర్లతో స్ప్రింక్లర్లతో స్ప్రే చేస్తున్నారు. మొత్తం 275 ట్రిప్పుల ద్వారా 4 ఎంఎల్డీ సివరేజ్ ట్రీటెడ్ నీటిని ఈ ప్రక్రియకు వినియోగిస్తున్నారు. దీనికి తోడుగా... 4 మీటర్ల డస్ట్ బ్యారియర్‌తో కలిపి మొత్తం 11.5 మీటర్ల ఎల్తైన రక్షణ గోడని నిర్మించారు. అయితే.. బొగ్గు కణాల వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. లోడింగ్, అన్లోడింగ్ చేసే సమయంలో ఈ కణాలు ఎగిరి నగరంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది. కాలుష్య కారకాల్ని మరింత తగ్గించే దిశగా.... పూర్తిస్థాయిలో బొగ్గు కాలుష్యాన్ని నివారించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో పోర్టు పరిసర ప్రాంతాల్లో పీఎం 10 లెవెల్స్ లీటరుకు 100 ఎంజీ ఉండేది. వీపీటీ తీసుకున్న నివారణ చర్యలతో ఇది ప్రస్తుతం 60 ఎంజీ కంటే తక్కువ నమోదవుతోంది. దీన్ని మరింత తగ్గించేందుకు పోర్టు ముందుకొచ్చింది. నగర ప్రజలు పోర్టు కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన విశాఖ పోర్టు ట్రస్టు 86వ వార్షికోత్సవంలో అధికారులు వెల డించారు. 2018–19లో 25 శాతం బొగ్గు కార్గో... విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర సంస్థలకు అవసరమైన థర్మల్, కోకింగ్ కోల్ని విశాఖ పోర్టు ట్రస్టు నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టీమ్ కోల్ నిల్వలు కూడా పోర్టులో ఉంటాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1.85 మిలియన్ టన్నులు థర్మల్ బొగ్గు, 5.80 మిలియన్ టన్నుల కోకింగ్, 8.95 మిలియన్ టన్నుల స్టీమ్ కోల్ నిర్వహణ కార్యక్రమాల్ని పోర్టు నిర్వహించింది. ఇది పోర్టు కార్గో రవాణాలో 25.42 శాతంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు కార్గో కార్యకలపాలు జరుగుతున్న నేపథ్యంలో దీని కాలుష్య నివారణపై పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది. ఏటా రూ.100 కోట్లతో.... ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్స్‌లో భాగంగా సమగ్ర కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పోర్టు ట్రస్టు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా రూ.100 కోట్లతో ఐదేళ్ల ప్రణాళిక రూపొందించింది. మొత్తం రూ.500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో గోదాములు నిర్మించనుంది. పోర్టు పరిసరాల్లోనే కోల్ కవర్డ్ స్టోరేజ్ షెడ్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే టార్పాలిన్లు కప్పుతూ లారీల ద్వారా లోడ్స్ తీసుకొస్తున్నారు. ఆ లారీలు నేరుగా షెడ్లలోకి వెళ్లి లోడింగ్, అన్లోడింగ్ చేస్తాయి. దీనివల్ల.. ఆ సమయంలో ఎగిరే బొగ్గు కణాలన్నీ.. షెడ్లలోనే ఉండిపోతాయి. బయటకు ఎగరకుండా ఉంటాయి. దీని వల్ల నగరంలోకి ఎగిరే బొగ్గు రేణువుల శాతం గణనీయంగా తగ్గుతుంది. దీనికి సంబంధించి డిజైన్లను ఏయూ ఆర్కిటెక్చర్ విద్యార్థులు రూపొందించారని విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ తెలిపారు. ఈ నెలాఖరు కల్లా టెండర్లను ఆహ్వానించనున్నామని వివరించారు. -
విశాఖ తీరంలో చమురు, గ్యాస్!
విశాఖ పోర్టుకు దక్షిణాన 3 చమురు లోయలు.. భీమిలికి ఉత్తర దిశలో మరో 3 లోయలు ♦ ఒక్కోటి 50 – 60 కి.మీ. మేర విస్తరణ ♦ ఎన్ఐవో అన్వేషణలో వెలుగులోకి లోయలు ♦ విశాఖ, సంకల్ప్‌గా నామకరణం ♦ మరింత లోతుగా శాస్త్రవేత్తల పరిశోధనలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్ తరహాలో చమురు, సహజ వాయువులకు అనువైన లోయలు(కాన్యన్లు) ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరానికి ఆనుకుని సముద్రంలో ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) శాస్త్రవేత్తలు ఆర్వీ సింధు సంకల్ప్ అనే అత్యాధునిక పరిశోధక నౌక ద్వారా విశాఖపట్నం–శ్రీకాకుళంల మధ్య సముద్రంలో ఇటీవల పరిశోధన సాగించారు. ఈ అధ్యయనంలో విశాఖ పోర్టుకు దక్షిణాన మూడు కాన్యన్లు, భీమిలికి ఉత్తర దిశలో మరో మూడు కాన్యన్లు ఉన్నట్టు తేల్చారు. గురువారం విశాఖలోని ఎన్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఐఓ(గోవా) యాక్టింగ్ డైరెక్టర్ ఎస్.ప్రసన్నకుమార్, సైంటిస్ట్ ఇన్చార్జి (విశాఖ), సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ జీపీఎస్ మూర్తి వివరాలను వెల్లడించారు. 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర అధ్యయన విభాగం తొలిసారిగా కోస్తాంధ్రలో ఖనిజ నిక్షేపాలపై అన్వేషణ జరిపిందని చెప్పారు. అప్పట్లో విశాఖకు సమీపంలో మూడు కాన్యన్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. దీంతో పరిశోధన సాగించిన విశ్వవిద్యాలయానికి ఆంధ్ర(ఎ), ప్రొఫెసర్ మహదేవన్(ఎం), వీసీ వీఎస్ కృష్ణ(కె) పేర్లతో ఏఎంకేగా నామకరణం చేశారని పేర్కొన్నారు. వచ్చే నెలలో కోస్తా తీరం మ్యాపింగ్ మళ్లీ 54 ఏళ్ల తర్వాత అత్యా«ధునిక వెసల్‌తో మార్చి 2 నుంచి నాలుగు రోజుల పాటు మల్టీబీమ్ సర్వే చేపట్టామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధనలో సరికొత్తగా ఈ రెండు లోయలు వెలుగు చూశాయన్నారు. ఈ కాన్యన్లు మూడేసి చొప్పున (మొత్తం ఆరు) వేర్వేరుగా ఏర్పడి కొంత దూరం తర్వాత కలిసినట్టు గుర్తించామని తెలిపారు. ఇవి మిలియన్ల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయని, ఒక్కొక్కటి 50–70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని చెప్పారు. వీటిలో హైడ్రో కార్బన్ నిక్షేపాలున్నాయన్నారు. సేకరించిన శాంపిళ్లను అధ్యయనం చేస్తామని, మరో ఏడాది నాటికి ఎంత పరిమాణంలో నిక్షేపాలున్నాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం మ్యాపింగ్ చేస్తామని పేర్కొన్నారు. తీరంలో మార్పులపై సముద్ర గర్భంలో మరింత లోతుగా పరిశోధనలు సాగిస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించారు. విశాఖ, సంకల్ప్‌గా నామకరణం కొత్తగా వెలుగుచూసిన కాన్యన్లుకు విశాఖ, సంకల్ప్‌గా నామకరణం చేసినట్టు ఎన్ఐఓ చీఫ్ సైంటిస్ట్, సంకల్ప్ సింధు రీసెర్చి వెసల్ మేనేజ్మెంట్ అధిపతి పీఎస్ రావు వెల్లడించారు. ఎన్ఐవో కార్యాలయం లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇతర దేశాలు, ప్రాంతాల్లో కాన్యన్లు్లన్న సమీప నగరాల పేరును పెడుతున్నారన్నారు. విశాఖకు ఆనుకుని పోర్టుకు సమీపంలో ఉన్న కాన్యన్లకు ‘విశాఖ’ కాన్యన్గాను, భీమిలి వద్ద ఉన్న కాన్యన్ను కనుగొనడంలో సింధు సంకల్ప్ వెసల్ దోహదపడినందున ‘సంకల్ప్’ కాన్యన్గాను పేర్లను సూచించామని చెప్పారు. వీటిని రిజిస్టర్ చేయించాక అధికారికంగా ఖరారు చేస్తామ న్నారు. 2008లో జపాన్ నుంచి కొనుగోలు చేసిన సింధు సంకల్ప్ పరిశోధక వెసల్ ఇప్ప టిదాకా సముద్ర గర్భంలో 100 అన్వేషణ లను సాగించిందని రావు తెలిపారు. వందో క్రూయిజ్‌లో విశాఖ తీరంలో అత్యద్భుత మైన కాన్యన్లను కనుగొనడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. -
విశాఖ నుంచి నేపాల్‌కు కార్గో రైళ్లు
బాక్స్ రైళ్లు నడపనున్న పోర్టు విశాఖపట్నం: నేపాల్‌కు సరకు రవాణా పెరుగుతుండటంతో దానికి విశాఖ పోర్టు నుంచి ట్రాన్షిప్మెంట్ అవసరాలు కూడా అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి సరకు పంపేందుకు బాక్స్ రైళ్లు నడపాలని విశాఖ పోర్టు భావిస్తోంది. తగిన ఏర్పాట్లు కోసం రైల్వే శాఖతో సంప్రతింపులు మొదలెట్టింది. కోల్‌కతా పోర్టుతో ఇబ్బందులు పడుతున్న నేపాల్ వాణిజ్య రంగం... విశాఖ పోర్టును ప్రత్యామ్నాయంగా తీసుకుంటుండటడమే దీనిక్కారణం. ప్రస్తుతం నేపాల్‌కు ట్రాన్షిప్మెంట్ పోర్టుగా కోల్‌కతాను వాడుతున్నారు. అంటే సరకులు అక్కడికి నౌకల్లో వచ్చి... అక్కడి నుంచి నేపాల్‌కు భూ మార్గంలో వెళతాయన్న మాట. అయితే కోల్‌కతాలో చిన్న చిన్న వెసల్స్‌లో రవాణా చేస్తుండటంతో టర్నరౌండ్కు రెండున్నర రోజులు పడుతోంది. విశాఖ పోర్టు కేవలం ఒక్క పూటలోనే మదర్షిప్ నుంచి సరుకు దిగుమతి చేస్తోంది. దీంతో ప్రతి కంటైనర్‌పై రెండు వందల డాలర్ల లగేజీ ఖర్చు మిగులుతుంది. దీన్ని కూడా నేపాల్ పరిగనలోకి తీసుకుంటోంది. 1400 కిలోమీటర్లు..17 రోజులు: విశాఖ పోర్టు నుంచి నేపాల్‌లోని బీర్‌గంజ్‌కు మధ్యనున్న దూరం1400 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను 90 బాక్స్‌లతో నడపడానికి ప్రత్నిస్తున్నట్లు విశాఖ పోర్టు అధికారులు చెప్పారు. కోల్‌కతా పోర్టు నుంచి నేపాల్‌కు దూరం సగమే. కానీ తాము కోల్‌కతా కన్నా త్వరగా సరకును గమ్యానికి చేరుస్తామని, అదే తమకు అనుకూలమని పోర్టు డిప్యూటీ చైర్మన్ ఎల్.హరనాధ్ నేపాల్‌కు ఇప్పటికే చెప్పారు. -
విశాఖ పోర్టులో నిలిచిన నౌక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్ బయల్దేరాల్సిన ప్యాసింజర్ నౌక విశాఖ పోర్టులో చిక్కుకుపోయింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న సుమారు 1149 మంది అన్నపానియాల్లేక రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. ఈ నౌక బుధవారం సాయంత్రం బయల్దేరాల్సి ఉంది. రోను తుపాన్‌తో వాతావరణ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు కలెక్టర్ యువరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. -
విస్తరణ దిశగా విశాఖ పోర్టు
కంటైనర్ టెర్మినల్‌కు పర్యావరణ అనుమతి రూ.633.11 కోట్ల ప్రాజెక్టుకు త్వరలో పనులు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకూ లైన్ క్లియర్ రూ.200 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఆధునికీకరణ విశాఖపట్నం : సముద్ర రవాణాలో ఎప్పటికప్పుడు నూతన పోకడలను ఆవిష్కరిస్తున్న విశాఖ పోర్టులో రూ.633.11 కోట్ల వ్యయంతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు రూ.400 కోట్ల నిధులతో నిర్మిస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకూ లైన్ క్లియర్ అవుతోంది. రూ.200 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఆధునికీకరించనున్నారు. పోర్టులో ప్రస్తుత కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 0.4 మిలియన్ టీఈయూ(ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్స్)లు మాత్రమే. 2015 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య 4.6 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. 2014-15లో ఇదే సమయానికి 3.9 మిలియన్ టన్నులే చేయగ లిగారు. కాగా విస్తరణతో దానిని 0.94 మిలియన్ టీఈయూలకు పెంచాలనుకుంటున్నారు. దీనికి తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీంతో టెర్మినల్‌కు అవసరమైన భూమిని వీసీటీపీఎల్కు అప్పగించేందుకు పోర్టు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో పోర్టులో ఉన్న రెండు ఆయిల్ రిఫైనరీ బెర్త్‌లు ఓఆర్1, 2లను కూడా ఆధునికీకరించాలని పోర్టు నిర్ణయించింది. దీని కోసం రెండు, మూడేళ్లలో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిని ఆధునికీకరిస్తే పానామాక్స్ వెసల్స్ నేరుగా పోర్టులోకి వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టును చెన్నై ఐఐటీ తయారు చేయనుంది. విడతల వారీగా, ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా ఈ బెర్త్‌లను ఆధునికీకరణ పనులు చేయాలనుకుంటున్నట్లు పోర్టు వర్గాలు చెబుతున్నాయి. 11 ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు దాదాపు రూ.400 కోట్ల నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన 11 ఎకరాల స్థలాన్ని తీసుకుంటున్నారు. అంతే విలువైన పోర్టు స్థలాన్ని ఏఏఐకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దానికి ఇటీవలే కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. ఈ పార్కు పూర్తయితే 4 లక్షల టీఈయూ కార్గో హ్యాండిల్ చేసే సౌకర్యం కలుగుతుంది. -
పోర్టు సిగలో మరో నగ
- సముద్ర రవాణాకు ‘గ్రీన్‌చానల్ ’ - విశాఖ పోర్టు సిద్ధం చేస్తున్న కొత్త బెర్త్ - రూ.90 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి - 1.5 మిలియన్ టన్నుల టర్నోవర్ లక్ష్యం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు బీజం పడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెర్తులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా గ్రీన్‌చానల్ బెర్త్‌ను నిర్మించేందుకు పోర్టు ట్రస్ట్ సన్నాహాలు చేస్తుంది. ఏడాదిలోగా దీన్ని పూర్తిచేస్తే భారీ నౌకలు సైతం నేరుగా ఇన్నర్ చానల్‌కు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం 11 మీటర్ల లార్డ్స్(నౌక) మాత్రమే ఇన్నర్ ఛానల్లోకి వెళ్లగలుగుతున్నాయి. అంతకన్నా పెద్దవి వస్తే వాటిని అవుటర్‌లో లైట్నింగ్ చేయాల్సి వస్తోంది. కనీసం 18.5 మీటర్ల డ్రాఫ్ట్ ఉంటే తప్ప సూపర్ కేప్ వెళ్లలేవు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తొలి దశలో 14.5 లార్డ్స్ వచ్చేలా హార్బర్‌ను విస్తరించనున్నారు. పాతవి ఐదు బెర్త్‌లు తొలగించి వాటి స్థానంలో కొత్త బెర్త్‌లు నిర్మించనున్నారు. దానిలో భాగంగా గ్రీన్‌చానల్ బెర్త్ సిద్ధమవుతోంది. పోర్టులో ప్రస్తుతం ఇన్నర్ హార్బర్లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. అవుటర్‌లో ఎస్పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. తొమ్మిది నెలల్లో గ్రీన్ చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి విడత రూ.45 కోట్లు, మలివిడత రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనిలో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేటాయిస్తుంది. ఈ బెర్త్ అందుబాటులోకి వస్తే 1.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. పోర్టులో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్న ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. గ్రీన్‌చానల్ బెర్త్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఇనుము, సిమెంట్ లావాదేవీలు నిర్వహించనున్నట్లు పోర్టు వర్గాల సమాచారం. యూరప్ దేశాలలో 40 శాతం సరుకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7 శాతం మాత్రమే జరుగుతోంది. నిజానికి ఒక టన్ను సరుకు రోడ్డు మార్గంలో రవాణా చేయడానికి అయ్యే ఖర్చులో సగానికే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతో పాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత పోర్టులను అభివృద్ధి చేసి సముద్ర రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే విశాఖ పోర్టుకు నిధుల సాయం చేయడం ద్వారా గ్రీన్‌చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. -
రైల్వే వల్లే పోర్టుకు నష్టం
- తగినన్ని గూడ్సు వ్యాగన్లను ఇవ్వట్లేదు - పార్లమెంటరీ కమిటీకి కృష్ణబాబు నివేదన - పోర్టులో పర్యటించిన కమిటీ సభ్యులు సాక్షి, విశాఖపట్నం: రైల్వేశాఖ తగినన్ని గూడ్సు వ్యాగన్లను సరఫరా చేయకపోవడం వల్ల విశాఖ పోర్టులో రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు కేంద్ర వాణిజ్యశాఖ అనుబంధ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. సకాలంలో వ్యాగన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎగుమతులు, దిగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా డాక్టర్ చందన్ మిత్రా నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సోమవారం పోర్టు, కంటైనర్ టెర్మినల్, షిప్‌యార్డు, ఫిషింగ్‌హార్బర్‌లో పర్యటించారు. ప్రత్యేకంగా బోటులో వెళ్లి ఇన్నర్, అవుటర్ హార్బర్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, సమస్యలను పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు, ఎంపీ కంభంపాటి హరిబాబు వారికి వివరించారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న బోట్లకు చేస్తున్న మరమ్మతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో ఎంపీలు శాంతారామ్ నాయక్, జితేంద్ర చౌదరి, కేఆర్పీ ప్రభాకరన్, సుధార్ గుప్తా, బోధ్‌సింగ్ భగత్, చరణ్‌జిత్‌సింగ్ సింగ్రోరి, జాయ్ అబ్రహాం ఉన్నారు. పోర్టు యాజమాన్యం, ఎగుమతిదారులు, బెర్తుల నిర్వాహకులు, కార్మికులతో పాటు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో పార్లమెంటరీ కమిటీ సాయంత్రం నోవాటెల్ హోటల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ చందన్ మిత్రా మాట్లాడుతూ విశాఖతో పాటు ముంబై, చెన్నై, కలకత్తా తదితర మేజరు పోర్టుల్లో సైతం సరకు రవాణాలో జాప్యం జరుగుతోందన్నారు. పోర్టులను ఆధునికీకరించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. విశాఖ పోర్టు అభివృద్ధి, ఎదుర్కొంటున్న సమస్యలపై చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు వివరించారు. 2020 సంవత్సరం నాటికల్లా దాదాపు పది కోట్ల టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి సామర్ధ్యాన్ని సాధిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద శాటిలైట్ పోర్టు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా బల్క్ కార్గో ఎగుమతులు నిర్వహిస్తామని వివరించారు. అయితే విశాఖ పోర్టులో సరుకుల రవాణాకు రోజుకు 20 గూడ్సురైళ్లు అవసరం కాగా సగమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. విజయనగరం-రాయ్‌పూర్ రైల్వే లైన్ సామర్థ్యం పెంచాలని, సత్వరమే విద్యుదీకరణ పనులు చేపట్టాలని అన్నారు. దీనికి ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందిస్తూ ఈ విషయమై ఈనెల 27న నగరానికి వస్తున్న రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో చర్చిస్తామని చెప్పారు. డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ స్పందిస్తూ అలమండ, కోరుకొండ మీదు విజయనగరం వరకు మూడో లైన్ జూలై నెల నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే వచ్చే నవంబరు నాటికి రాయగడ రైల్వేలైను విద్యుదీకరణ పనులు విజయనగరం వరకు పూర్తవుతాయని వెల్లడించారు. స్టీల్డోర్స్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణకుమార్, వేదాంత సంస్థ యాజమాన్యం ప్రతినిధులు, పోర్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధి డీకే శర్మ, కస్టమ్స్ శాఖ చీఫ్ కమిషనర్ దీప బి.దాస్‌గుప్తా మాట్లాడారు. సీఐఐ తరఫున ఆర్వీఎస్ రాజు, పలువురు కార్మిక సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
'అవగాహన లేకుండా మాట్లాడొద్దు'
విశాఖపట్నం: సముద్రతీరం కోతకు పోర్ట్ కారణమనడం సరికాదు విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజల్లో భయాందోళన రేగుతుందన్నారు. సంక్రాంతి సంబరాలకు రూ. 300 కోట్లు ఖర్చు పెడతామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సముద్రం కోత నివారణ చర్యలకు డబ్బులు లేవనడం సరికాదన్నారు. డబ్బుల సమస్య లేదని ముఖ్యమంత్రి స్పష్టం చెప్పారని తెలిపారు. -
ముగిసిన స్టేట్ బ్యాంక్ క్రీడా సమ్మేళనం
అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్: భారతీయ స్టేట్ బ్యాంకు జోనల్ స్థాయి సాంస్కృతిక, క్రీడల సమ్మేళనం ఆది వారం రాత్రితో ముగిసింది. లైట్ మ్యూజిక్ పోటీల్లో విన్నర్‌గా విశాఖపట్నానికి (అడ్మినిస్ట్రేషన్) చెందిన కె.స్రవంతి, రన్నర్‌గా అనకాపల్లి (మెయిన్ బ్రాంచి)కి చెందిన ఎం.వి.ఎన్.అప్పారావులు నిలిచారు. మోనో యాక్షన్ పోటీల్లో పి.మోహన్‌దాస్ (పాతపట్నం) విన్నర్‌గాను, ఎస్.రవికుమార్ రన్నర్‌గాను నిలిచారు. ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో విజయనగరం బ్రాంచికి చెందిన ఎ.శ్రీనివాసరావు విన్నర్‌గా ను, విశాఖపట్నం పోర్టు బ్రాంచికి చెం దిన డి.రమణబాబు యాదవ్ రన్నర్‌గాను గెలుపొందారు. ఎలుక్యూషన్ (తెలుగు ) విన్నర్‌గా (పార్వతీ పురం-ఏడీబీ) జి.సిహెచ్. బా బు, రన్నర్‌గా విశాఖపట్నం పో ర్టు బ్రాంచి ఎ.వి.ఎన్.నూకరాజులు విజయం సాధించారు. ఇంగ్లిష్ ఎలుక్యూషన్లో కె.ఎ.ఆర్.వర్ధని (నర్సీపట్నం-ఏడీబీ) విన్నర్‌గాను, కె. ఉమామహేశ్వరరావు (అనకాపల్లి మె యిన్ బ్రాంచి) రన్నర్‌గాను గెలిచారు. క్విజ్‌లో గోపాలపట్నం బ్రాంచ్ ఎం. వి.ఎన్.శర్మ, ఎం.ప్రదీప్‌కుమార్, కె. వి.వి.ఎస్. సతీష్ విన్నర్లుగాను, వి శాఖపట్నం పోర్టు బ్రాంచ్ ఎ.వి.ఎన్.నూకరాజు, డి.రమణబాబు, డి.భరద్వాజ్ రన్నర్లుగా నిలిచారు. పితృవనం నాటికలో బెస్ట్ ప్రొడక్షన్, డెరైక్షన్గా విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ స్, బెస్ట్ ప్రొడక్షన్‌గా ద్వితీయ స్థానం లో రేపేంది నాటికలో శ్రీకాకుళం మొ యిన్ బ్రాంచ్, ఉత్తమ నటులుగా సు ధాకర్, అనీషా, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా వేప తిమ్మయ్య, ఉత్తమ హాస్యనటుడిగా పి.మోహన్‌దాస్ (శ్రీకాకుళం)ను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశా రు. ఎస్బీఐ అనకాపల్లి చీఫ్ మేనేజర్ ఎం.సి.వి. శేషకుమార్, డిజిఎస్ జె.పి.శర్మ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ైెహ దరాబాద్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్, ఏజీఎస్లు ఎన్. సాంబశివరావు, నరేంద్రకుమార్ చేతుల మీదు గా బహుమతులు అందజేశారు. -
40 శాతానికి పడిపోయిన విశాఖ స్టీల్ ఉత్పత్తి
ఉక్కునగరం, న్యూస్‌లైన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉత్పత్తి 40 శాతానికి పడిపోయింది. విశాఖ స్టీల్ ప్రతిరోజూ సుమారు 12-13 వేల టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోంది. యాజమాన్యం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించి సాధ్యమైనంత మేర ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది. వర్షం కారణంగా ప్లాంటుకు అవసరమైన బొగ్గు గంగవరం, వైజాగ్ పోర్టు నుంచి సరఫరా కాకపోవడం, అందుబాటులో ఉన్న నిల్వలు తడవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విశాఖ స్టీల్ క్యాప్టివ్ పవర్ ప్లాంటుకు బొగ్గును, స్టీల్ తయారీకి కోకింగ్ కోల్‌ను వినియోగిస్తోంది. ఒడిశాలోని తాల్చేరు నుంచి బొగ్గు, ఆస్ట్రేలియా నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుంటోంది. వర్షాల వల్ల ప్లాంటులోని అన్ని విభాగాల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గితే తప్ప పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వర్ష ప్రభావం విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తీవ్ర నష్టాన్ని కలిగించింది.