Vizianagaram District Latest News
-
గంజాయి నిర్మూలనే లక్ష్యం
–8లోఅరకొరగా హోమియో మందులు జిల్లా ప్రజలను హోమియో మందుల కొరత వెంటాడుతోంది. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించే మందులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.రాజాం సిటీ: జిల్లాలో గంజాయి నివారణే లక్ష్యంగా పనిచేయాలని, గంజాయి కేసుల్లో ప్రధాన మూలాలు ఛేదిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో సీజ్చేసిన వాహనాలను పరిశీలించి ఆరా తీశారు. కేసుల దర్యాప్తుపై స్టేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూతగాదాలు, గొడవలు, రాజకీయ పార్టీల గొడవలు, పాత నేరస్తుల, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలని కోరారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఏటీఎం మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సచివాలయ మహిళా సంరక్షణ పోలీసులతో ఎస్పీ సమావేశమయ్యారు. మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాల పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం బదిరిలపాఠశాల విద్యార్థులకు నూతన వస్త్రాలను అందజేశారు. మెయిన్ రోడ్డులో గతంలో పడగొట్టిన పోలీసు క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్రరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సిబ్బంది పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణతోనే నేరాల నియంత్రణ ఎస్పీ వకుల్ జిందాల్ -
విజయనగరం
గిరిజన వర్సిటీని త్వరగా పూర్తి చేయాలిగిరిజన యూనివర్సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు.గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024పర్యాటక రంగం.. విస్తరణ మార్గం కబడ్డీలో ‘ఆదర్శ’నీయం గంట్యాడ: మదనాపురం ఏపీ ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థి జుత్తాడ గుణవర్ధన్ ఎస్జీఎఫ్ అండర్–17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. విద్యార్థితో పాటు పీడీ రాధను పాఠశాల హెచ్ఎం ఆర్.ఆర్.కె.రావు, ఉపా ధ్యాయులు బుధవారం అభినందించారు. నృత్య ప్రదర్శన రాజాం: బాలల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజాం విద్యార్థులు పాల్గొని అలరిస్తున్నారు. నిహారిక, యామిని, దీక్షిత, చాతుర్యలు భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే జానపద గీతానికి బుధవారం నృత్య ప్రదర్శన ఇచ్చారు. వీరిని బాలభవన్ రాజాం డైరెక్టర్ సుంకరి రమేష్, అధికారులు అభినందించారు. 22న ఉద్యోగ మేళా గజపతినగరం: గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తామని ఏపీఎస్ఎస్డీసీ నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌కుమార్, కళాశాల ప్రిన్స్‌పాల్ రావాడ సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హెటెరో ఫార్మాస్యూటికల్, అస్పిరై టెక్నాజీస్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హులైన యువతీ యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివిన 18–30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ముందుగా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుని విద్యార్హత పత్రాలతో ఆ రోజు ఉదయం 9 గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. వివరాలకు సెల్ 79898 26953, 99888 53335 నంబర్లను సంప్రదించాలని కోరారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా మీదుగా జాతీయ రహదారుల విస్తరణకు తోడు విశాఖ–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధమవుతోంది. విజయనగరం రైల్వేస్టేషన్లో అదనపు హంగులు, పలు రైళ్లకు హాల్ట్ కల్పించడం, మరోవైపు భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి పలు మార్గాలు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చొరవతో పర్యాటక రంగ విస్తరణకు కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ● ప్రకృతి ఆరాధకుల కోసం... పచ్చని కొండల నడుమ అందమైన తాటిపూడి జలాశయం జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. దీన్ని ప్రకృతి ఆరాధకులకు స్వర్గధామంగా మార్చేందుకు ‘ఎకో–టూరిజం’ కోణంలో పలు ప్రాజెక్టులకు పర్యాటక శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐసీహెచ్‌ఎల్) అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ రనడే బృందం తాటిపూడి రిజర్వాయర్ పరిసరాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. స్టార్ హోటల్, రిసార్ట్స్ నిర్మించాలనేది వారి ఆలోచన. తగిన ప్రదేశం కోసం తాటిపూడి రిజర్వాయరుతో పాటు భోగాపురం విమానాశ్రయం పరిసరాలను రోహన్ బృందం పరిశీలించింది. ఇదే విషయమై కలెక్టర్ అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌తో చర్చించారు. అదే సమయంలో పర్యాటక శాఖ కూడా కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. రిజర్వాయర్‌కు ఇరువైపులా ఉన్న రెండు కొండలను అనుసంధానం చేస్తూ రోప్ వే, కేబుల్ వంతెన నిర్మిస్తే సాహస కృత్యాలను, ప్రత్యేక అనుభూతిని కోరుకొనే పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న బోటింగ్ సౌకర్యాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు రిక్రియేషన్ సెంటర్లు, చిల్డ్రన్ పార్కు, బర్డ్స్ పార్కు, రెస్టారెంట్, క్లబ్ హౌస్, ఓపెన్ ఎయిర్ ఆంపి థియేటర్, కన్వెన్షన్ హాల్ వగైరా అదనపు సౌకర్యాల కల్పన దిశగా ఆలోచిస్తున్నారు. ఇక రిజర్వాయరు ఆవల అటవీ శాఖ సహకారంతో అప్రోచ్ రోడ్డు, 12 కాటేజీలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.చింతపల్లి బీచ్ –8లోన్యూస్రీల్సుందరతీరంలో సేద తీరేలా... కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చొరవతో కొత్త ప్రతిపాదనలు తాటిపూడి జలాశయం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టులు రామతీర్థం పుణ్యక్షేత్రంలో అదనపు ఆకర్షణ పనులు చింతపల్లి బీచ్‌లో కొత్తగా పది కాటేజీల నిర్మాణానికి సమాలోచనలు రామతీర్థంలో అదనపు హంగులు... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రామతీర్థం అభివృద్ధికి రూ.4 కోట్లు వెచ్చించారు. ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అదనపు హంగులు కల్పించనున్నారు. కోదండ రామస్వామి ఆలయం ఉన్న బోడికొండపైకి ఇప్పటికే నిర్మాణంలోనున్న రహదారిని పూర్తి చేయనున్నారు. మరోవైపు రోప్‌వే కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. వ్యూ పాయింట్లను అభివృద్ధి చేస్తారు. అలాగే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా కొండపై రెస్ట్ రూములు, కెఫెటేరియా కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. రామతీర్థంలోని ఆలయాలన్నీ మరింత ఆకర్షించేలా విద్యుత్తు దీపాలను ఏర్పాటుచేస్తారు. మ్యూజియం నిర్మాణంతో పాటు ఆధ్యాత్మిక సేవలు నిర్వహించే కోనేరు సుందరీకరణ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే భోగాపురం, పూసపాటిరేగ తీరంలో సన్ రే వంటి ప్రముఖ రిసార్ట్స్‌తో పాటు కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే సుందర తీరంలో సేద తీరడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి తీరంలో రెండేసి గదులుండేలా పది కాటేజీలను నిర్మించాలని పర్యాటక శాఖ యోచిస్తోంది. అక్కడి చేరుకోవడానికి ఉన్న రోడ్డు అభివృద్ధితో పాటు అలల ధాటి నుంచి రక్షణ గోడ, రెస్టారెంట్, కెఫెటేరియా నిర్మించాలనే ప్రతిపాదనలు చేసింది. పర్యాటక అభివృద్ధికి అవకాశం... ఉత్తరాంధ్రలో అటు విశాఖను, ఇటు శ్రీకాకుళం జిల్లాను అనుసంధానం చేస్తున్న విజయనగరం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. రోడ్డు, రైలు కనెక్టెవిటీ పెరిగింది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా సిద్ధమవుతోంది. స్టార్ హోటల్స్, రిస్టార్ట్స్ పెట్టడానికి టాటా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు జిల్లాలో అవకాశాలను పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధికి పర్యాటక శాఖ ద్వారా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జిల్లా కలెక్టర్ -
350 కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు స్వాధీనం
విజయనగరం: విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై దాడులు నిర్వహించిన ప్రజారోగ్య విభాగ బృందం 350 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో వివిధ ప్లాస్టిక్ విక్రయాల దుకాణాలపై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ప్లాస్టిక్ విక్రయదారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఈ మధ్యనే 560 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, మళ్లీ పీడబ్ల్యూ మార్కెట్లో కొందరు నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టామన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టిక్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అలాగే ప్రజలు కూడా క్యారీ బ్యాగులు కాకుండా కాటన్ సంచులు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు సాగిస్తే భారీ అపరాధ రుసుములతో పాటు దుకాణాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
‘నాస్’ నిర్వహణపై శిక్షణ
రాజాం: విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే(నాస్) చేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని జీసీఎస్ఆర్ కళాశాలలో రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, మెరకముడిదాం, తెర్లాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలకు చెందిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు బుధవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. 62 మంది ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు సర్వే అంశాలు వివరించారు. ప్రతీ రెండేళ్లకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాస్ సెల్, ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సంస్థలు సంయుక్తంగా సర్వేను చేస్తున్నట్టు వెల్లడించారు. 2021లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించేందుకు సర్వే నిర్వహించగా, ఇప్పుడు 3, 6, 9 తరగతుల విద్యార్థులపై సర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించాలన్నారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి డిప్యూటీ ఈఓ వెంకటరమణ, రాజాం ఎంఈఓలు ప్రవీణ్‌కుమార్, యాగాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ మాణిక్యంనాయుడు -
వచ్చేనెల 15లోగా పనులు పూర్తిచేయాలి
విజయనగరం అర్బన్: పల్లె పండగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. సీసీ రోడ్లు, కాటిల్ షెడ్స్ తదితర పనులపై వీడియో కాన్ఫరెన్స్‌లో మండలాల వారీగా బుధవారం సమీక్షించారు. పంచాయతీరాజ్ విభాగంలో మంజూరైన 2,203 పనుల్లో 1,407 పనులు గ్రౌండింగ్ అయ్యాయని, వీటిలో 61 పనులు పూర్తికాగా 6 పనులకు బిల్లులను సమర్పించారని తెలిపారు. గుర్ల తప్ప మిగిలిన అన్ని మండలాలు పనుల నిర్వహణలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాటిల్ షెడ్స్ జిల్లాలో 858 మంజూరు కాగా 386 గ్రౌండింగ్ అయ్యాయని, వీటిని త్వరగా పూర్తి చేసి బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
350 కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు స్వాధీనం
విజయనగరం: విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై దాడులు నిర్వహించిన ప్రజారోగ్య విభాగ బృందం 350 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో వివిధ ప్లాస్టిక్ విక్రయాల దుకాణాలపై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ప్లాస్టిక్ విక్రయదారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఈ మధ్యనే 560 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, మళ్లీ పీడబ్ల్యూ మార్కెట్లో కొందరు నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టామన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టిక్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అలాగే ప్రజలు కూడా క్యారీ బ్యాగులు కాకుండా కాటన్ సంచులు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు సాగిస్తే భారీ అపరాధ రుసుములతో పాటు దుకాణాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
No Headline
ఈ చిత్రాల్లోని వాహనాలు చూశారా.. ఇవన్నీ ఆపద, అత్యవసర వేళ వైద్య సేవలందించే 108, 104 వాహనాలు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఇలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. చిన్నచిన్న మరమ్మతులకు గురైన వాహనాలను బాగుచేయకుండా విడిచిపెట్టడంతో తుప్పుపట్టి పాడయ్యాయి. వీటిని చూసేవారు అయ్యో.. రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ నిట్టూర్చుతున్నారు. కనీసం వాహనం బాగున్నప్పుడు విక్రయిస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయమైనా వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మత్స్యకారులకు నిరాశే..!
పూసపాటిరేగ: సముద్రమే వారికి సర్వస్వం. పొద్దుపొడవక ముందే బోట్లపై వలలు సర్దుకుని ప్రాణాలకు తెగించి సంద్రంలోకి వెళ్తారు. చేపల వేట సాగిస్తారు. ఆ రోజు వలకు చేపలు చిక్కితే పండగే. లేదంటే నిరాశే. జీవనానికి ఇబ్బందులు తప్పవు. అలాంటి దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులపై టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్నచూపుచూస్తోంది. అధికారంలోకి వచ్చి అర్ధసంవత్సరం అవుతున్నా వేట నిషేధ భృతి(మత్స్యకార భరోసా) అందజేయకపోవడంతో గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు. కనీసం మత్స్యకార దినోత్సవం నాటికి అయినా భరోసా మంజూరవుతుందని ఆశించినా నిరాశే మిగిలిందంటూ వాపోతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, బోగాపురం మండలాలులో 19 మత్స్యకార గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో సుమారు 5 వేల మందికి చేపలవేటే ప్రధాన వృత్తి. వీరిపై పరోక్షంగా మరో 16 వేలు మంది ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికంగా 885 బోట్లలో 3,798 మంది మత్స్యకారులు నిత్యం వేటను సాగిస్తుండగా, మరికొంత మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వివిధ కంపెనీల ఆధ్వర్యంలో వేట సాగిస్తున్నారు. పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, నీలగెడ్డపేట, చింతపల్లిబర్రిపేట, చింతపల్లిపెద్దూరు, కొత్తూరు, పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డు వెంకటేషుపేట, భోగాపురం మండలంలో చేపలుకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చినకొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం తదితర గ్రామాల ప్రజలకు వేటే జీవనాధారం. వాతావరణంలో మార్పులు కారణంగా ఇటీవలకాలంలో చేపలు వేటలేక ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు రూ.23 కోట్ల ఖర్చుతో చింతపల్లిలో జెట్టీ మంజూరు చేసినా.. ప్రస్తుత కూటమి సర్కారు జెట్టీ నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా.. పిట్ ఆంధ్రా యూనిట్లు మంజూరు చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించిందని, డీజిల్ రాయితీలు అందజేసి అండగా నిలిచిందని, ప్రస్తుతం అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటీ అమలుకావడంలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మత్స్యకార దినోత్సవం వచ్చినా ఉత్సాహం కరువు గంగపుత్రులపై టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్నచూపు అధికారంలోకి వచ్చి అర్ధసంవత్సరం అవుతున్నా అందని భరోసా వరుస తుఫాన్లు, అటుపోట్లతో సాగని వేట ఆర్థిక ఇబ్బందుల్లో మత్స్యకారులు మత్స్యకారులకు గడ్డుపరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించింది. గడ్డు కాలం ఎదురైంది. వేట నిషేధ భృతి అందజేయకవపోడం దారుణం. చింతపల్లిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి శంకుస్థాపన చేసిన జెట్టీ నిర్మాణంపై కూడా నిర్లక్ష్యం చేస్తోంది. మత్స్యకార దినోత్సవం రోజున మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం విచారకరం. – బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం జీవనానికి ఇబ్బందులు నిత్యం చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు తుఫాన్లతో వేట సక్రమంగా సాగడంలేదు. ప్రభుత్వం కూడా ఆదుకోవడంలేదు. కనీసం వేట నిషేధ కాలానికి భృతికూడా చెల్లించలేదు. జీవనానికి ఇబ్బందులు పడుతున్నాం. – రాయితి బుచ్చోడు, మత్స్యకారుడు, తిప్పలవలస -
చిల్లంగి నెపంతో దాడి
● రాజకీయ కక్ష అంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు బొబ్బిలి: ‘నిత్యం కడుపునొప్పి వస్తోంది. నువ్వు రోజూ కలలో కనిపిస్తున్నావు. నువ్వే చిల్లంగి పెట్టిఉంటావు’’ అంటూ వైఎస్సార్సీపీ పంచాయతీ వార్డు మెంబర్ భర్తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అనుచరుడు దాడి చేశాడు. అంతే కాకుండా బాధితుడి భార్య వార్డు మెంబర్పైనా దూషణలకు దిగాడు. బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామంలో రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇన్నాళ్లూ గ్రామంలోనే ఉన్న వార్డు మెంబర్ భర్తపై లేనిపోని ఆరోపణలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలతో దాడులకు దిగడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ దాడిపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి బుధవారం బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లి మొరపెటుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. దీంతో శంబంగి పోలీసులకు ఫోన్‌చేసి ఇదేం సంప్రదాయం? ఇలాగేనా రాజకీయ కక్షలు తీర్చుకుంటారు. ఈ రోజుల్లో కూడా చిల్లంగి వంటి పాతనమ్మకాలను అడ్డంపెట్టుకుని రాజకీయకక్షలు సాధిస్తారా? ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి వెనుక నేపథ్యం..! కొండదేవుపల్లిలో పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు వైఎస్సార్ సీపీ, టీడీపీకి సమానంగా వచ్చాయి. ఇందులో బొమ్మరిల్లు అప్పలనర్సమ్మ కూడా ఉన్నారు. వారిలో ఒకరు టీడీపీలోకి వస్తే ఉప సర్పంచ్ పదవి వస్తుందని అప్పలనర్సమ్మను టీడీపీ వారు ప్రలోభపెట్టారు. దీనికి ఆమె, ఆమె భర్త వ్యతిరేకించారు.మేం వైఎస్సార్సీపీకి మద్దతు దారులం. ఎప్పుడైనా పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు ఇలా కక్ష తీర్చుకుంటున్నారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. -
కొనసాగుతున్న నేత్ర వైద్య పరీక్షలు
పార్వతీపురంటౌన్: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ నగేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేత్ర పరీక్షలు, వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందుల పంపిణీ, దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడుతుందని చెప్పారు. నేత్ర సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రి, జెమ్స్ ఆస్పత్రి, పాలకొండ, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి నిర్వహిస్తామన్నారు. వారందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ల జొళ్లు, మందుల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య అధికారులు, కంటి వైద్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మళ్లీ ఎంఈఓపై విచారణ
గరుగుబిల్లి: గతంలో ఎంఈఓగా విధులు నిర్వహించిన ఎన్.నాగభూషణరావుపై స్థానిక ఎంఆర్సీలో విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ పి.దామోదర్‌రావు, పార్వతీపురం డిప్యూటీ డీఈఓ బి.రాజ్‌కుమార్‌లు మరోసారి బుధవారం విచారణ నిర్వహించారు. ఎంఈఓ నాగభూషణ్ రావు పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురైన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా విచారణాధికారులకు పార్వతీపురం యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, కె.భాస్కరరావు, యుటీఎఫ్ మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావులు గతంలో ఎంఈఓ చేసిన అక్రమాలు, అవినీతి, సర్వీస్ తప్పిదాలపై ఆధారాలను సమర్పించారు. అనంతరం ఎ.డి దామోదర్‌రావు మాట్లాడుతూ గతంలో గరుగుబిల్లి, జియ్యమ్మవలస ఎంఈఓగా పనిచేసిన నాగభూషణరావుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలమేరకు విచారణ చేపట్టామన్నారు. విచారణలో సేకరించిన అంశాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి తదుపరి చర్యల నిమిత్తం ఆర్జేడీకి సమర్పించనున్నామన్నారు. ఈ విచారణలో స్థానిక ఎంఈఓ డి.అప్పలనాయుడు, ఎంఈఓ–2 కె.కొండలరావు, జియ్యమ్మవలస ఎంఈఓ–2 ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన వర్సిటీని త్వరగా పూర్తి చేయాలి
● మంత్రి లోకేష్ ప్రకటన విరమించుకోవాలి ● ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మవిజయనగరం పూల్‌బాగ్/మెంటాడ : గిరిజన యూనివర్సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీని కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మారుస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మెంటాడ మండలంలోని కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం విజయనగరంలోని ఎన్పీఅర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ నిర్మాణం లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీని స్థలాన్ని మార్చడంతో నేటికీ కుంటినవలస వద్ద వర్సిటీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఉందన్నారు. నేడు మళ్లీ దీన్ని కొత్తవలస మండలంలో రెల్లి వద్ద అప్పుడు సేకరించిన స్థలంలోనే నిర్మిస్తామని ఈ నెల 13 న రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు. ప్రతిసారీ మార్చడం అవివేకం మత్రి ప్రకటిన వల్ల వర్సిటీ నిర్మాణం మరింత ఆలస్యమవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం రెల్లి నుంచి ఇక్కడికి మార్చిందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా స్థలాలు మార్చుకోవడం భావ్యం కాదని హితవు పలికారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న దీనిని మార్చడం అంటే అవివేకం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించాలి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కేంద్ర విద్యా శాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకే మాత్రం జాప్యం చేయకుండా మెంటాడలోనే దీనిని నిర్మించాలని లేఖలు రాశామన్నారు. గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధత ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. బుధవారం తమ బృందం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు. ఎస్టీ అసెంబ్లీ నియోజక వర్గం సాలూరులో భాగంగా ఉన్న మెంటాడ మండలంలోని కుంటినివలస గ్రామం వద్ద దీని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన 2025 లోగా పూర్తి చేయాలని, శాశ్వత సిబ్బందిని నియమించి, అన్ని కోర్సులను అందుబాటులోకి తేవాలని, గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ వాసా, ఉపాధ్యక్షురాలు కె. విజయ గౌరి, గిరిజన సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి టి. సోములు, మన్యం జిల్లా కార్యదర్శి సీదిరి అప్పారావు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము, జగదీష్, రవికుమార్, కాంతారావు, గ్రామ సర్పంచ్ రమేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
పోటాపోటీగా ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకు పాఠశాల విద్యార్థులకు బుధవారం పోటాపోటీగా ఐటీడీఏ స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. మొత్తం 175 మంది విద్యార్థులు హాజరు కాగా వారికి వాలీబాల్, ఆర్చరీ, జావెలిన్‌త్రో తోపాటు డ్రాయింగ్, వ్యాసరచన, డిబేట్ పోటీలు జరిగాయి. క్రీడాపోటీలను ప్రారంభించిన ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 23 నుంచి 26 తేదీ వరకు విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, డిప్యూటీఈవో పి.నారాయుడు, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవి, జీసీడీవో రాములమ్మ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి
● బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ అప్పారావు విజయనగరం ఫోర్ట్: పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు బాలల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. బాలికలు చెడు స్నేహాలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేఽశించుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై తల్లిదండ్రులకంటే ఉపాధ్యాయలకు బాధ్యత ఎక్కువని స్పష్టం చేశారు. బాలికల విద్యాభివృధ్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ పుట్టిన రోజు నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని, గతంలో బాలలకు హక్కులు గురించి చెప్పేవారు ఉండేవారు కాదన్నారు. నేడు బాలల హక్కులు గురించే తెలియజేసే అనేక సంస్థలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని, సాంకేతికతను మంచికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చదువుపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం శిశు గృహ వారు ఊయల కార్యక్రమంపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వివిధ క్రీడా పోటీల్లో రాణించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ హిమబిందు, సభ్యులు చిట్టిబాబు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు, శిశు గృహ మేనేజర్ త్రివేణి, పీఓఐసీ బి.రామకోటి పాల్గొన్నారు. -
అరకొరగా హోమియో మందులు
● తప్పక బయట షాపుల్లో కొనుగోలు ● వదులుతున్న చేతిచమురు విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన డి.అప్పలసత్యం రెండు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు చర్మ సంబంధిత వ్యాధితో వెళ్లాడు. పరీక్షించిన హోమియో వైద్యుడు మూడు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలోని హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా అక్కడ ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. రెండు రకాల మందులు లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక ప్రైవేట్ హోమియో మందుల దుకాణంలో రూ. 200 పెట్టి కొనుగోలు చేశాడు. – ఇదే మండలానికి చెందిన సీహెచ్.ఈశ్వరమ్మ మెడ, నడుం నొప్పితో మూడు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకు హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. మూడు రకాల మందులు లేవు. బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక రూ.400 పెట్టి ఆమె బయట కొనుగోలు చేసింది. ఇది వీరిద్దరికే కాదు. అనేక మందికి ఎదురవుతున్న పరిస్థితి. హోమియో వైద్యశాలకు వెళ్లిన అధికశాతం మంది బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వచ్చేది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంతో పాటు, మందులు ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన రోగులకు మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. హోమియో వైద్యశాలకు 40నుంచి 50 మంది రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు రోజుకు 40నుంచి 50 మంది వరకు రోగులు వస్తారు. చర్మ, బీపీ. షుగర్, సైనసైటిస్, రక్తహీనత, కీళ్లవాతం, గొంతునొప్పి, తదితర వ్యాధులకు సంబంధించిన రోగులు హోమియో వైద్యశాలకు వస్తారు. వదులుతున్న చేతిచమురు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో మందులు పూర్తి స్థాయిలో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ వైద్య శాలకు వెళ్లిన వారు తప్పక చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. హోమియో వైద్యశాలలో మందులు లేక పోవడం వల్ల ప్రైవేట్ హోమియో మందుల దుకాణాల్లో ఒక్కో రోగి రూ. 400 నుంచి రూ. 500 వెచ్చిస్త మందులు కొనుగోలు చేస్తున్నారు. మందులు సరిపోవడం లేదు కీళ్లవాతానికి సంబంధించి మందులు లేవు. మిగతా వ్యాధులకు ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులకు మందులు సరిపోవడం లేదు. డాక్టర్ వరప్రసాద్, సీనియర్ హోమియో వైద్యాధికారి -
23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ పోటీలు
● ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు విజయనగరం: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పోటీలు విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, విజయనగరంలోని పీవీజీ రాజు కాంప్లెక్స్, విజ్జి స్టేడియంలలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్‌లు డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. టోర్నమెంట్లో అస్సాం, రైల్వేస్, చండీగఢ్, పాండిచ్చేరి, విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జట్లు పోటీపడనున్నాయి. ఆయా జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఇండియా, ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ పోట్లీల్లో పాల్గొననున్నారు. బోధనేతర పనులు రద్దు చేయాలిపార్వతీపురంటౌన్: పాఠశాలల్లో బోధన సమయాన్ని పెంచేందుకు విద్యాశాఖ, హైస్కూల్ పని వేళల సమయాన్ని పెంచడాన్ని యూటీఎఫ్ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీ మోహనరావు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతున్నాయని, మార్చిన సమయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతాయని, దీనివలన ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ ఉన్నాయని, కావున సమయం పెంచడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. బోధనేతర కార్యక్రమాలు, యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కల్గిస్తే బోధన సమయం పెరుగుతుందన్నారు. కావున వెంటనే ఈ పని వేళలు పెంచే ఆలోచనను విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని తెలియచేశారు. పశువుల లారీ సీజ్దత్తిరాజేరు: పార్వతీపురం నుంచి విజయనగరం కబేళాకు 32 పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ బూర్జవలస ఎస్సై జి.రాజేష్ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి కొంతమంది కబేళా వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు చౌదంతివలస కూడలి వద్ద పట్టుకున్న లారీలో తినడానికి గడ్డి లేకుండా తాగడానికి నీరు లేకుండా కాళ్లు కట్టేసి ఉన్న పశువులను స్వాధీనం చేసుకుని పశువుల యజమాని గణేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
భర్తను హత్య చేసిన మహిళకు, మరో వ్యక్తికి యావజ్జీవ జైలు
విశాఖ లీగల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన మహిళతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతోపాటు నిందితులు రూ.1.50 లక్షలు జరిమానా చెల్లించాలని.. ఆ మొత్తంలో రూ.1.20 లక్షలు మృతి చెందిన వ్యక్తి పిల్లలకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోదవలస గ్రామానికి చెందిన బాడిద బోయిన రాములప్పుడికి 2008లో విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురుపల్లి గ్రామానికి చెందిన నరసయ్యమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొంతకాలం తర్వాత నరసయ్యమ్మ తన అక్క కొడుకు గండిబోయిన అప్పలరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై తరచూ రాములప్పుడు, నరసయ్యమ్మ గొడవలు పడేవారు. 2018 ఫిబ్రవరి 13న శివరాత్రి పండగకు రాములప్పుడు తన స్వగ్రామమైన మోదవలస వెళ్లాడు. భార్యా పిల్లలు కూడా వెంట ఉన్నారు. మోదివలసలో రామప్పడును చంపడానికి నరసయ్యమ్మ.. అప్పలరాజుతో కలిసి పథకం రచించింది. అప్పలరాజు తన తమ్ముడు ఎల్లారావు(ఎల్లాజీ)తో కలిసి రాములప్పడును చంపడానికి సిద్ధమయ్యాడు. రాత్రి సమయంలో రాములప్పడును కరల్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ముగ్గురూ కలిసి మృతుడిని మోదవలస నుంచి పద్మనాభం మండలం కురిపిల్లికి తెచ్చి వదిలేశారు. వెంటనే వారు మళ్లీ గ్రామానికి వెళ్లిపోయారు. తన అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయి ఉండడంతో తమ్ముడు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 302, 120 బి, 364 సెక్షన్ల కింద నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గండిబోయిన ఎల్లాజీ మైనర్ కావడంతో వేరే న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరిగింది. ఆ బాలునికి మూడేళ్ల జైలు శిక్ష విధించి, బాలల సంరక్షణ పరివర్తన కేంద్రానికి పంపించారు. తల్లి జైలుకి వెళ్లడం, తండ్రి మృతి చెందడంతో పిల్లల సంరక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించారు. -
22న బొల్లినేని మెడిస్కిల్స్‌లో జాబ్‌మేళా
శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బస్సును ఢీకొట్టిన మరో బస్సు● 15 మందికి గాయాలు డెంకాడ: విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో అనీల్నీరుకొండ ఆస్పత్రి బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్డడంతో పలువురికి గాయాలయ్యాయని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. బుధవారం ఉదయం అనీల్నీరుకొండ ఆస్పత్రికి చెందిన బస్సు విజయనగరం నుంచి తగరపువలస వైపు వెళ్తోంది. అదే వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సుల్లో ఉన్న 15 మంది వరకూ గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే తగరపువలస వద్ద ఉన్న అనీల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ల చోరీపూసపాటిరేగ : మండలంలోని చౌడువాడ పంచాయతీ కొణతాల పాలెం సమీపంలో గల వ్యవసాయక్షేత్రంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. కొణతాల పాలెం సమీపంలో దన్నాన సత్యనారాయణకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్లో గల మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సుమారు రూ.2 లక్షల విలువైన మోటార్లు చోరీకి గురవడంతో పోలీస్ష్టేషన్లో బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు.షెడ్ తలుపులు విరగ్గొట్టి దొంతనానికి పాల్పడినట్లు బాధిత రైతు ఫిర్యాదులో తెలియజేశాడు. ఇదే తరహాలో మండలంలోని పలు గ్రామాలులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు తరుచూ చోరీకి గురవుతూనే ఉన్నాయి. పోక్సో కేసు నమోదువిజయనగరం క్రైమ్: జిల్లాకేంద్రం విజయనగరం వన్‌టౌన్ పరిధిలో రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో ఉన్న ఓ స్కూల్‌కు రిక్షాలో రెండేళ్లుగా పాపను తీసుకువెళ్లి, తీసుకువచ్చే 56 ఏళ్ల వ్యక్తి మంగళవారం సాయంత్రం చిన్నారిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి చిన్నారిపై లైంగికదాడికి యత్నిస్తుండగా స్థానికులు చూసి చితకబాది వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిపై దిశ స్టేషన్లో పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంరామభద్రపురం: మండలంలోని చందాపురం గ్రామ పరిధిలో బుధవారం ఎకై ్సజ్ సీఐ పి చిన్నంనాయుడు సిబ్బందితో కలిసి సారాబట్టీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసే నిర్వాహకులు, మద్యం దుకాణ యజమానులు బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించినా, అక్రమంగా సరఫరా చేసిట్లు తనిఖీలలో గుర్తిస్తే ఆయా లైసెన్స్‌దారులపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. సారా స్థావరాలపై దాడిగుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గంగన్నదొర వలస గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరంపై ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు.ఈ దాడుల్లో పులియబెట్టిన సుమారు 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ప్లాస్టిక్ టబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా, గంజాయి, మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరిం చారు. అటువంటి సంఘటనలపై తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. -
కొనసాగుతున్న నేత్ర వైద్య పరీక్షలు
పార్వతీపురంటౌన్: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ నగేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేత్ర పరీక్షలు, వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందుల పంపిణీ, దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడుతుందని చెప్పారు. నేత్ర సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రి, జెమ్స్ ఆస్పత్రి, పాలకొండ, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి నిర్వహిస్తామన్నారు. వారందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ల జొళ్లు, మందుల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య అధికారులు, కంటి వైద్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
● నయనం ప్రధానం
నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో దృష్టి లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, కంటి పరీక్షలు చేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. పుష్పగిరి కంటి ఆస్పత్రికి చెందిన విట్రియా రెటినా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ప్రీ మెచ్యూర్ డే ర్యాలీని మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏటా 3.6 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారని, శిశువు దశలో కంటి పరీక్షలు నిర్వహించకపోతే అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. నయనం ప్రధానం అన్నది గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో పుష్పగిరి కంటి ఆస్పత్రి సీఈఓ రాజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, తారక్, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
విజయనగరం అర్బన్: మరుగుదొడ్డి... ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మరుగుదొడ్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10 వరకు హమారా సౌచాలం–హమారా సమ్మాన్ నినాదంతో జిల్లా అంతటా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. సామూహిక మరుగుదొడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు కృషిచేయాలన్నారు.అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఉమాశంకర్, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 530 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లాలో 530 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు మంజురైనట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వీటిలో 139 పూర్తి కాగా 190 పురోగతిలో ఉన్నాయని, 201 ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పూర్తయిన మరుగుదొడ్లన్నీ వినియోగం లో ఉండేలా చూడాలని ఎస్ఈని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో నీరు, పారిశుద్ధ్య మిషన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సామూహిక మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓకు సూచించారు. జల్‌జీవన్ మిషన్ పనులపై ఆరా తీశారు. తాగునీటి స్వచ్ఛత పరిశీలనకు గజపతినగరంలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటుకు డీఓకు లేఖరాయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకు సూచించారు. భూగర్భ జలాలు 10 అడుగుల్లోనే ఉన్నందున బోర్ వెల్స్ ద్వారా రబీ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావుకు సూచించారు. రైతులకు బోరుబావులు ఎక్కువగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ వెంకటేశ్వరరావు, భూగర్భ జల, డీఆర్డీఏ, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
● వేతన ‘ఆశ’ల పోరాటం
ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం మహాధర్నా చేశారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి ప్రభుత్వ అలసత్వంపై నిరసన తెలిపారు. పనిభారం తగ్గించాలని, వైద్యేతర పనులు చెప్పొద్దని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని ఆశవర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సుధారాణి డిమాండ్ చేశారు. డయేరియా సోకిన వారికి సేవలందిస్తూ అనారోగ్యంపాలై మృతిచెందిన నాగులవలస ఆశవర్కర్ పూర్ణిమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామంటూ నినదించారు. ధర్నాలో సంఘ సభ్యులు కె.వెంకటలక్ష్మి, కె.రాధారాణి, కర్రి రాజేశ్వరి, ఎం.లక్ష్మితో పాటు వందలాది మంది ఆశవర్కర్లు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. అడ్డగోలు నియామకాలు!
‘ బోనంగి, గంట్యాడ, పెంట శ్రీరాంపురం సొసైటీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మంత్రి బంధవు చెప్పిన వారికే కట్టబెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిబ్బందిలో కూడా అనర్హులే అధికమన్నది రైతుల వాదన. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిలో అర్హత, అనుభవం లేని సిబ్బంది నియామకాలు ప్రస్తుతం రైతన్నలను కలవరపెడుతున్నాయి. వాస్తవంగా ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని గుర్తించి గ్రేడ్‌ను నిర్ణయించాలి. ఆ మేరకు రైతన్నకు మద్దతు ధర లభిస్తుంది. వ్యవసాయ విద్యను అభ్యసించనివారు, పంట నాణ్యత తెలియని వారు కొనుగోలు కేంద్రాల సిబ్బందిగా నియామకం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలకు పాతరేసి పచ్చపార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు పోస్టు లు కట్టబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్న వారిని పక్కన పెట్టేయడంపై నిరుద్యోగులతో పాటు రైతు లు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ఎటువంటి అవగాహన లేనివారిని నియమించడంపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● 258 క్లస్టర్లలో 774 మంది నియామకం జిల్లాలో 507 రైతు భరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 258 క్లస్టర్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిలో పనిచేయడానికి ఒక్కో కేంద్రానికి ముగ్గురు చొప్పున 774 మందిని నియమించారు. ఒక్కో కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్, టెక్నికల్ అసిస్టెంట్ నియామకమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులకే పోస్టులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హత, అనుభవం ఉన్న వారికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది నియామకంలో ప్రాధాన్యమిచ్చేవారు. హెల్పర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. వీటిలోఽ వ్యవసాయ విద్యను అభ్యసించేవారికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అర్హత, అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని నియమించారు. దీనివల్ల పార్టీలకు అతీతంగా అర్హులకు పోస్టులు దక్కాయి. రైతులకు మేలు జరిగింది. ఆరుగాలం శ్రమించి రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటే అనుభవం, అర్హత ఉండాలి. వరి సాగుపై అవగాహన కలిగి ఉండాలి. నాణ్యత, తేమ శాతం పక్కాగా గుర్తించగలగాలి. ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో నియామకమైన చాలామంది సిబ్బందికి వరి పంట సాగే తెలియదట. వ్యవసాయ కోర్సులూ చదవలేదు. అధికార పార్టీ నేతల అండదండలే అర్హతగా.. అరకొర చదువులతోనే కొనుగోలు కేంద్రాల్లో పోస్టులు సాధించారు. వీరిని చూసిన రైతులు ధాన్యం విక్రయానికి భయపడుతున్నారు. గ్రేడ్ నిర్ణయంలో తేడా చూపిస్తే మద్దతు ధర కోల్పోతామని ఆందోళన చెందు తున్నారు. రైతు శ్రమ లెక్కింపు ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని తప్పబడుతున్నారు. నియామకాలు పూర్తయ్యాయి.. జిల్లాలో 258 క్లస్టర్ కొనుగోలు కేంద్రాలకు సిబ్బంది నియామకాలు జరిగిపోయాయి. గతేడాది నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి సివిల్ సప్లై ద్వారా పోస్టుల భర్తీ చేపట్టారు. ఈ ఏడాది సిబ్బంది నియామకాలను సొసైటీ అధికారులే చేపట్టారు. – మీనాకుమారి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టిన వైనం పోస్టులన్నీ తెలుగు తమ్ముళ్లకే..! జిల్లాలో 774 మంది నియామకం అర్హులకు పోస్టులు దక్కకపోవడంపై ఆవేదన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తులు స్వీకరించి అర్హత, అనుభం ఉన్నవారికి ప్రాధాన్యం టీడీపీ కూటమి తీరుపై రైతుల అసహనం -
● కళ తప్పిన శిల్పారామం
విద్యలనగరం వైభవాన్ని చాటుతూ.. నగర ప్రజలు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే శిల్పారామం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ఆలనాపాలనా చూసేవారు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. గతంలో అందంగా ముస్తాబై చిన్నారులను ఆకర్షించేది. పెద్దలు సేద తీరేందుకు అనువుగా ఉండేది. సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచేది. నేడు శిల్పారామం గురించి పట్టించుకునేవారు లేక ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారడం చూపరులకు ఆవేదన మిగుల్చుతోంది. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
చెరకు టన్ను రూ.3,151
● మద్దతుధర ప్రకటించిన సంకిలి ఈఐడీ చక్కెర కర్మాగారం ● ఈనెల 20 నుంచి క్రషింగ్ ప్రారంభం రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరకు రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 20 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కర్మాగారం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి టన్ను చెరకకు రూ.3,151లు మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించారు. గత ఏడాది కంటే టన్ను కు రూ.71లు పెంచినట్టు పేర్కొన్నారు. క్రషింగ్ సీజన్ అనంతరం రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో కేన్ డీజీఎం ఆర్.రమేష్ పాల్గొన్నారు. విద్యార్థుల వసతి సమస్యపై సమీక్ష విజయనగరం అర్బన్: జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు వసతుల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ సంక్షేమ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వసతి సమస్యపై మంగళవారం సమీక్షించారు. వసతుల కల్పన కోసం అవసరమైన నిధులకోసం ఆయా ప్రభుత్వ శాఖలకు నివేదించాలన్నారు. జిల్లాలో 51 బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 19 హాస్టళ్లకు భవనాలు నిర్మించాల్సి ఉందని బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీ వివరించారు. 32 బీసీ సంక్షేమ వసతి గృహాల భవనాల మరమ్మత్తుల పనులకు రూ.1.06 కోట్లతో ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందింస్తూ స్థలం అందుబాటులో ఉన్న చోట కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయా లని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 30 హాస్టళ్లలో 7 హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉందని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.రామానందం తెలిపారు. పీఎం అజయ్ పథకం కింద ఒక్కొక్కటి రూ.3 కోట్ల వ్యయంతో 6 హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 23 హాస్టళ్ల మరమ్మతులకు రూ.1.09 కోట్లతో ప్రతిపాదించామని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 3 హాస్టళ్ల మరమ్మతులకు రూ.33 లక్షలతో ప్రతిపాదనలు చేశామని గిరిజన సంక్షేమ అధికారిగా వ్యవహరిస్తున్న బి.రామానందం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం డీఏజేజీయూఏ కింద నగరంలోని మహారాణిపేట పోస్టు మెట్రిక్ బాలికల వసతిగహాన్ని రూ.4 కోట్లతో నిర్మించనున్నట్టు వివరించారు. ఇప్పటికే దీనికి అవసరమైన అనుమతులు వచ్చాయన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, సంక్షేమ ఇంజినీరింగ్ విభాగాల ఇంజినీర్లు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు ●● రామతీర్థం, చింతపల్లి, తాటిపూడిలో పర్యాటక వసతుల కల్పన ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించే అంశంపై జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి పి.బాలాజీ, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, తదితరులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. రామతీర్థంలో వసతుల కల్పన, రామనారాయణం వద్ద ఉన్న కోనేరు అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందిస్తే పర్యటక శాఖ క్యాదర్శికి అందజేస్తానని చెప్పారు. రామతీర్థంలో మ్యూజియం, ప్యూపాయింట్, రోప్‌వే, లైటింగ్, సమీపంలోని బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు, రోడ్డు విస్తరణ వంటి పనులకు ప్రతిపాదనలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రతీర పర్యాటకం అభివృద్ధిలో భాగంగా చింతపల్లి బీచ్ వద్ద ఉన్న ప్రస్తుత కాటేజీల స్థానంలో కొత్తగా పది కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్, చిల్డ్రన్ పార్క్, ల్యాండ్ స్కేప్ వంటి వసతుల కల్పనకు ప్రతిపాదించాలన్నారు. తాటిపూడిలో బోట్లను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కాటీజీల వరకు రోప్ బ్రిడ్జి నిర్మా ణం, అక్కడ ఉన్న పది ఎకరాల స్థలంలో కేఫ్టేరియా, బర్డ్ పార్కు, కన్వెన్షన్ హాల్, ఎంఫీథియేటర్ తదితర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు.