Wanaparthy District News
-
నేటి నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
వనపర్తివిద్యావిభాగం: విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో విద్యాశాఖ తరఫున గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనపై బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 350 ప్రదర్శనలు ఉంటాయని.. నిర్వహణ సక్రమంగా, సమన్వయంతో సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ప్రదర్శనలు ఉండాలని.. ఆహారం, ఆరోగ్యం, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సహజ వ్యవసాయం, రవాణా–కమ్యూనికేషన్, వనరుల నిర్వహణ, గణిత నమూనాలు, గణన ఆలోచనలు, విపత్తుల నిర్వహణ అనే ఏడు ఉప అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇచ్చిన అంశాలు కాకుండా గైడ్ ఉపాధ్యాయులు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులతో ప్రదర్శనలు చేయించేందుకు సమాయత్తం కావాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ప్రదర్శనలకు అనువుగా కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని, గైడ్ టీచర్లు ప్రదర్శనలను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ ఫేర్ సమన్వయ కమిటీ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. -
మారనున్న పుర రూపురేఖలు
వనపర్తి పట్టణ వ్యూ వనపర్తిటౌన్: త్వరలోనే వనపర్తి పురపాలిక కొత్త మాస్టర్ ప్లాన్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పుర ఉన్నతాధికారులు చెబుతున్నారు. అమృత్ 2.0లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వారం రోజులుగా పుర పరిధిని సర్వే చేసేందుకు 16 పాయింట్లను గుర్తించడంతో పాటు డ్రోన్ ద్వారా సర్వే ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సిబ్బంది, కావాల్సిన మ్యాపింగ్ వివరాలను పుర సిబ్బంది సర్వే అధికారులకు అందించారు. ఐదేళ్ల కిందటే అప్పటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌కు అధికారికంగా ఆమోదం తెలిపినప్పటికీ విలీన గ్రామాల అంశం తెరపైకి రావడంతో మరుగునపడినట్లయింది. నిబంధనల ప్రకారం 1992లో రూపొందించిన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను 2011లోనే పునరుద్ధరించాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. కొత్త ప్రణాళిక అమలులోకి వస్తే పట్టణ రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు మోక్షం.. పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండటంతో ప్రభుత్వం కొత్త బృహత్ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. 1992లో రూపొందించిన ప్రణాళిక ఆధారంగా రహదారుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ అమలుకు సన్నాహాలు మొదలయ్యాయి. సర్వే పూర్తయిన తర్వాత మాస్టర్ ప్లాన్ అమలులో కీలక ఘట్టమైన వర్క్‌షాప్‌లో పుర అధికారులు బృహత్ ప్రణాళిక లక్ష్యాలను వివరిస్తారు. ఇందులో పాలక సభ్యులు, ప్రజల సూచనలు పరిగణలోకి తీసుకోనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మ్యాప్‌ను తయారు చేయనున్నారు. వనపర్తి మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు అమృత్ 2.0లో భాగంగా డ్రోన్ ద్వారా సర్వే 25 ఏళ్లకు అనుగుణంగా రూపకల్పన విలీన గ్రామాలను కలుపుతూ హద్దుల నిర్ణయానికి ప్రయత్నాలు అభివృద్ధికి దోహదం.. కొత్త మాస్టర్ ప్లాన్ అమలుతో వనపర్తి పుర రూపురేఖలు మారనున్నాయి. జిల్లాకేంద్రం కావడంతో భవిష్యత్‌లో పరిశ్రమలు వస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తిస్తారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి దోహదం చేసేందుకు మాస్టర్ ప్లాన్ ఉపయోగపడనుంది. అమృత్ 2.0లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని మార్పులు, చేర్పులతో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. – పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి -
కేసీఆర్‌తోనే సస్యశ్యామలం
రూ. 4 వేల కోట్ల వ్యయంతో 6.50 లక్షల ఎకరాలకు నీరిచ్చాం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల. ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కృషి చేశారు’ అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం. కల్వకుర్తి, నెట్టెపాండు, బీమా, కోయిల్‌సాగర్ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లందించాం అని తెలిపారు. ఇంకా హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్, టీడీపీలు పాలమూరును వలసల జిల్లాగా మారిస్తే.. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదే.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు కట్టడం వల్ల భూగర్భజలాలు పెరిగి ఈ రోజు వ్యవసాయం పండుగగా మారింది. రైతుల క్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం.. ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడాపూర్తిగా నెరవేర్చలేదు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కురుమూర్తిస్వామికి మొక్కులు.. మార్గమధ్యంలో ధాన్యం కేంద్రాల్లో రైతులతో మాటామంతీ.. కొనుగోళ్ల తీరుపై ఆరా పాలమూరు పేరును చెడగొడుతున్నారు.. రేవంత్‌రెడ్డికి వచ్చేది రెండే. ఒకటి దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం. మరొకటి ప్రతిపక్షాన్ని తిట్టడం. రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అన్ని రకాల పంటలకు బోనస్ అంటూ మోసం చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు అంటూ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయలు. కానీ పాలమూరు పేరును రేవంత్‌రెడ్డి చెడగొడుతున్నారు. రేవంత్ సీఎం అయ్యారంటే కేసీఆర్ భిక్షనే.. రైతులకు రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ తర్వాత రూ.31వేల కోట్లు అని, అనంతరం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చివరకు చేసింది ఎంత అంటే రూ.17 వేల కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. సగం కంటే రుణ మాఫీ కాలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులు కోవడానికి సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ చేయ డంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి రేవంత్ సీఎం అయ్యావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడమే తప్ప ఇల్లు కట్టడం తెలియదు రేవంత్‌రెడ్డికి. ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా.. కురుమూర్తి స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతాం. రేవంత్‌రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకుని క్షమించమని, ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాన్ని పాలించే పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించా. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు.. ఎప్పుడు వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్‌ను గెలిపిస్తారు. -
నాణ్యతగా ఉండదు..
మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వంట ఏజెన్సీని మార్చి నాణ్యమైన భోజనం అందించాలి. – జగదీశ్, 7వ తరగతి వెంటనే స్పందించాం.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి చికిత్స అందేలా చూశాం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం మధ్యాహ్న భోజనమా అనేది ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మురళీధర్‌రెడ్డి, హెచ్ఎం ● -
రైతు సీఎం కేసీఆర్.. బూతుల సీఎం రేవంత్
రేవంత్‌రెడ్డి వరంగల్‌లో సోనియాగాంధీని దేవతన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతావు. మాట తప్పుడే రేవంత్‌రెడ్డి డీఎన్ఏలో ఉంది. ఏ విషయంలో కూడా మాట మీద నిలబడలేదు. ఆరు గ్యారెంటీలు అమలుకాలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, రూ.2500 మహిళలకు ఇస్తానని చెప్పి నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు రాలేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్కిట్, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, బీసీ బంధు, దళిత బంధు, ముదిరాజ్‌లు చేపల పిల్లలను కోల్పోయారు. కరోనా సమయంలో మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు బంద్‌పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. అప్పుడు వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు ? కేసీఆర్ తన హయాంలో రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చారు, వాగులపై చెక్‌డ్యాంలు కట్టారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. రైతు సీఎం కేసీఆర్ అయితే, బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. -
లోతైన అధ్యయనం.. సమగ్ర ప్రణాళిక...
బృహత్ ప్రణాళిక కోసం క్షేత్రస్థాయిలో భవనాలు, మురికివాడలు, గణాంకాలు, తాగునీటి అవసరాలు, సీసీ రోడ్లు, విద్యుత్ అవసరాలు తదితర వివరాలు లోతుగా సేకరించి ఒక తాత్కాలిక చిత్రాన్ని రూపొందిస్తారు. పట్టణ విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు బృహత్ ప్రణాళికలో ఉన్న నివాస సముదాయ ప్రాంతాలు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, గ్రీన్ జోన్ల నిర్ధారణలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు పట్టణంలోని కొత్తకోట రోడ్డు ప్రాంతం ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. కొత్త ప్రణాళిక అమలులోకి వస్తే నివాస ప్రాంతంగా మారనుంది. (బృహత్ ప్రణాళికలో కాకుండా ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్‌గా గత ప్రభుత్వం మార్చింది గమనించగలరు) ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల స్థితిగతుల్లో మార్పు రానుంది. -
కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన
శ్రీరంగాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని.. నిర్ధేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మండలకేంద్రంతో పాటు నాగరాల, చెలిమిళ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాలు, మట్టి లేకుండా ధాన్యం తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, ధాన్యంలో తాలు లేకుండా చేసేందుకు ఫ్యాన్లు, సరిపడా గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత త్వరగా నగదు వారి ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రాల నిర్వాహకులు సన్నరకం ధాన్యాన్ని గుర్తించడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లును సందర్శించి ధాన్యం దింపుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం దింపుకొన్న తర్వాత ట్రక్‌షీట్ పత్రాన్ని పీపీపీకి పంపించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ మురళి, వ్యవసాయ అధికారులు ఉన్నారు. -
నేటి నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
వనపర్తివిద్యావిభాగం: విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో విద్యాశాఖ తరఫున గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనపై బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 350 ప్రదర్శనలు ఉంటాయని.. నిర్వహణ సక్రమంగా, సమన్వయంతో సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ప్రదర్శనలు ఉండాలని.. ఆహారం, ఆరోగ్యం, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సహజ వ్యవసాయం, రవాణా–కమ్యూనికేషన్, వనరుల నిర్వహణ, గణిత నమూనాలు, గణన ఆలోచనలు, విపత్తుల నిర్వహణ అనే ఏడు ఉప అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇచ్చిన అంశాలు కాకుండా గైడ్ ఉపాధ్యాయులు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులతో ప్రదర్శనలు చేయించేందుకు సమాయత్తం కావాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ప్రదర్శనలకు అనువుగా కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని, గైడ్ టీచర్లు ప్రదర్శనలను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ ఫేర్ సమన్వయ కమిటీ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. -
అస్వస్థత.. ఆందోళనకరం
మక్తల్/మాగనూర్: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఫుడ్‌పాయిజన్‌కు గురైన వంద మంది విద్యార్థుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు పెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడారు. అయితే మొదట తేలికగా తీసుకున్న ఉపాధ్యాయులు.. బాధితులు పెరగడంతో ఏఎన్ఎం, ఆశాలను పాఠశాలకు పిలిపించి చికిత్స అందించారు. వారు విద్యార్థుల పరిస్థితిని గమనించి స్థానిక పీహెచ్సీ డాక్టర్‌ను సైతం పాఠశాలకు పిలిపించారు. ఆయన 17 మంది విద్యార్థులకు చికిత్స అందించి.. అందులో 15 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, నందిని, అనిల్, నవ్య, మేఘన, శివ, జగదీశ్, మహేష్, విజయ్, భీమశంకర్, రాకేష్, విజయ్‌కుమార్, మధు, ప్రశాంతి, శివసాయి ఉన్నారు. అపరిశుభ్రంగా వంట గది.. విద్యార్థులకు వంట చేసేందుకు నిర్మించిన వంట గదితో పాటు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్తాచెదారం మొత్తం అక్కడే వేస్తున్న పరిస్థితులు కనిపించాయి. వంట చేసేందుకు వినియోగించిన కూరగాయలు, కారం పొడి తదితర సామగ్రి మొత్తం వంట ఏజెన్సీ వారు ఎప్పటికప్పుడు బయటి నుంచి తీసుకువస్తున్నారని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు వాపోయారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వీరే వంట చేస్తున్నారని, వీరిని మార్చాలని డిమాండ్ చేస్తున్నా.. ఉపాధ్యాయులు మాత్రం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు శుద్ధి నీరు అందించే ఫిల్టర్ వాటర్ మిషన్ సైతం మరమ్మతుకు గురైనా బాగు చేయకపోవడంతో.. నిత్యం మిషన్ భగీరథ నీరు తాగుతున్నారు. భయపెట్టి.. పైపులతో కొట్టి ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కడుపు నొప్పి మొదలైన వెంటనే విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా.. తరగతి గదిలో ఉంచి ప్లాస్టిక్ పైపుతో కొట్టి బెదిరించినట్లు కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే 3 గంటల తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో అప్పుడు వైద్యసిబ్బందికి సమాచారం చేరవేశారని ఆరోపించారు. అయితే పాఠశాలలో మొత్తం 598 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం 426 మంది హాజరయ్యారని హెచ్ఎం మురళీధర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు నీలమ్మ, శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి.. నమూనాలు సేకరించారు. వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 15 మందికి సీరియస్ కడుపు నొప్పితో విలవిలలాడిన విద్యార్థులు విషయం బయటకు రాకుండా ఉపాధ్యాయుల ప్రయత్నం పరిస్థితి విషమించడంతోమహబూబ్నగర్కు తరలింపు నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘటన పాఠశాలలో లోపించిన పారిశుద్ధ్యం -
డీసీఆర్బీ డీఎస్పీగా ఉమామహేశ్వర్
వనపర్తి: వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీగా ఉమామహేశ్వర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ రావుల గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ పెబ్బేరు రూరల్: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డా. అల్లె శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు ఆస్పత్రి నిర్వహణ, సౌకర్యాలు, సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి త్వరలోనే నియామకానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆస్పత్రితో పాటు పరిసరాలు స్వచ్ఛంగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ఆరోగ్య ఉప కేంద్రంలో కొనసాగుతున్న చిన్నారుల వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వా లని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి హరినాథ్‌రెడ్డి, పల్లె దవాఖాన వైద్యుడు డా. చంద్రశేఖర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాలతో జాగ్రత్త కొత్తకోట రూరల్: విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా ఫొటోలను అజాగ్రత్తగా షేర్ చేయడంతో సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తారని మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ భాస్కర్ అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. సెల్ఫోన్లలో వచ్చే గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయొద్దన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు పెళ్లిళ్లు చేస్తే చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని తెలిపారు. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ సుమ టోల్‌ఫ్రీ నెంబర్లు 1098 (బాలల హెల్ప్ లైన్), 1930 (సైబర్ క్రైమ్), 181 (గృహహింస), డయల్ 100 సేవలను వినియోగించుకునే విధానం గురించి వివరించారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
పురం.. ఆర్థిక భారం
వనపర్తి టౌన్: వనపర్తి పురపాలిక కేవలం ఆస్తి పన్ను ఆదాయంపైనే ఆధారపడటంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. సరిగ్గా 14 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. పుర జనరల్ ఫండ్ ఖాతాలో కనీస నిల్వలు లేక ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతోంది. జనరల్ ఫండ్ నిల్వలు తొలి ప్రాధాన్యతగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. ఈ నిధులను గతంలో ఇష్టారీతిన దారి మళ్లించడం, పన్ను వసూళ్లలో వెనుకంజ, ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారించకపోవడంతో ఆర్థిక భారం నెలకొంది. నిబంధనల ప్రకారం జనరల్ ఫండ్ ఖాతాలో రూ.కోటి వరకు నిల్వ ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి ఈ పురపాలికలో ఎనిమిది నెలలుగా కనిపించడం లేదు. పురపాలికలో కార్మికులు మొత్తం 236 మంది ఉన్నారు. వీరందరూ ప్రతి నెల వచ్చే వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికి కలిపి ప్రతి నెల రూ.60 లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 19 వరకు జనరల్ ఫండ్‌లో కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఉన్నాయి. కార్మికుల ఆందోళన.. పదేళ్లుగా కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలిస్తూ వచ్చారు. గత ఆరు నెలలుగా వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛ పురపాలికగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్న తమకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, పిల్లల ఫీజులు, చిన్న చిన్న ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతున్నామని.. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించకపోతే 21వ తేదీ కార్యాలయ దిగ్బంధం చేపట్టేందుకు కార్మిక సంఘం నాయకులు నిర్ణయించారు. కావాల్సిన నిధులు సుమారు రూ. 60 లక్షలు జనరల్ ఫండ్‌లో నిల్వ : రూ. 8 లక్షలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న వనపర్తి పురపాలిక కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి రేపు కార్యాలయ దిగ్బంధానికి కార్మిక సంఘం నిర్ణయం తీరని అన్యాయం.. కార్మికులకు వేతనాల చెల్లింపుపై పుర అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నెలవారి వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కార్మికులకు గత ఆరునెలలుగా సకాలంలో అందడం లేదు. బుధవారం వేతనాలు ఇవ్వకపోతే గురువారం నుంచి కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాం. అధికారులు, ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు తీసుకుంటే కార్మికులకు చెల్లింపుల్లో చెల్లింపుల్లో జాప్యమెందుకు? – పుట్టా ఆంజనేయులు, పుర కార్మిక సంఘం ప్రతినిధి చెల్లింపునకు చర్యలు.. పుర కార్మికులకు వేతనాలు త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపట్టాం. ఈ మేరకు ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాం. గతంలో జనరల్ ఫండ్ నిధులను ఇష్టారీతిగా దారి మళ్లించడంతోనే ఈ దుస్థితి నెలకొంది. కార్మికులకు ప్రథమ ప్రాధాన్యతలో వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా వేతనాలు చెల్లిస్తాం. – పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి -
అటవీ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం
వనపర్తి: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల అనుమతులపై హైదరాబాద్‌లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేకంగా అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమి కేటాయింపులు, అనుమతులపై చర్చించారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డోబ్రియల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వనపర్తి–రాజపేటతండా మార్గం (కొత్తకోట–ఆత్మకూరు రోడ్డుకు అనుసంధానం), వనపర్తి పాలకేంద్రం నుంచి అంజనగిరి వరకు బైపాస్ రోడ్డు (కొల్లాపూర్ రోడ్డుకు అనుసంధానం) ఈ ప్రాజెక్టులకు 17.139 హెక్టార్ల భూమి కేటాయింపు.. స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సర్వేనంబర్ 86లో 12.08 ఎకరాలు, సర్వేనంబర్ 25లో 0.12 ఎకరాల భూమి.. అంజనగిరితండాకు బీటీ రహదారి నిర్మాణానికిగాను సర్వేనంబర్ 6లో 0.69 హెక్టార్ల భూ సేకరణ.. వనపర్తి 8వ వార్డు శ్రీనివాసాపురంలో శ్మశానవాటికకు ఎకరం, హాకీ స్టేడియానికి సర్వేనంబర్ 56లో 5 ఎకరాల కేటాయింపుపై చర్చించారు. జిల్లా అటవీశాఖ అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన రసీదు రెండురోజుల్లో తీసుకోవాలని, ఏదేని కారణంతో ధాన్యాన్ని తిరస్కరిస్తే వెంటనే సంబంధిత ఏఈఓలు వెళ్లి సమస్య పరిష్కరించాలని సూచించారు. ధాన్యం తూర్పారబట్టనికి ప్రతి కేంద్రంలో ఫ్యాన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, మెప్మా, సహకార సంఘాలు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, డీఎస్ఓ విశ్వనాథ్, డీఏఓ గోవింద్‌నాయక్, డీసీఓ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. తాగునీరు, స్వచ్ఛతపై దృష్టి.. జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 365 ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండొద్దని.. పేదలు స్వచ్ఛభారత్ పథకంలో ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకుడు గుంతలు, అన్ని గ్రామాల్లోని మురుగు కాల్వల చివర్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. 50 మైక్రాన్ కంటే తక్కువ నాణ్యతతో ఉన్న ప్లాస్టిక్ సంచులను విక్రయించినా, వినియోగించినా జరిమానాలు విధించాలన్నారు. సేకరించిన తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. నీటి పరీక్షలు నిర్వహిస్తూ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ ఉమాదేవి, మిషన్ భగీరథ డీఈఈ మేఘారెడ్డి, డీఏఓ గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ కళాయాత్ర.. ప్రజాపాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలో మంగళవారం విజయోత్సవ కళాయాత్రను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. జిల్లాలో ఈ యాత్ర డిసెంబర్ 7 వరకు కొనసాగుతుందని.. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తుందని చెప్పారు. డిసెంబర్ 6న రాష్ట్ర సాంస్కృతికశాఖ నుంచి నాగరాజు కళాబృందం జిల్లాలో భారీ కళా ప్రదర్శన నిర్వహించి విజయోత్సవ ర్యాలీని ముగించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ సీతారాం, డీపీఓ సురేశ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విధిగా నిబంధనలు పాటించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
పంట కొయ్యలను తగులబెట్టొద్దు : డీఏఓ
పాన్‌గల్: వానాకాలంలో సాగుచేసిన వరి, పత్తి పంటల కోతల తర్వాత ఉండే కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లో తగులబెట్టొద్దని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంట కొయ్యలు, అవశేషాలను తగులబెట్టడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు పొలంలోని పోషకాలను నష్టపోతామన్నారు. కొయ్యలను నేలలోనే కలియ దున్నడంతో భూసారం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రాజవర్ధన్‌రెడ్డి, ఏఈఓలు అఖిల, శైలజ, వెంకటేశ్, షర్మిలాదేవి, నరేశ్, రైతులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు తరలుతున్న ధాన్యం..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం కన్నా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకే ఎక్కువ ధాన్యం తరలుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యంగా కొనసాగడం, రోజుల తరబడి రైతులు నిరీక్షించలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఇస్తుండగా, సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 అందిస్తోంది. బోనస్ ధరతో కలుపుకుని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,800 రైతులకు అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు నుంచి ధాన్నాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,300 రైతు ఖాతాలో జమ అవుతాయని, మరుసటి రోజున 24 గంటల్లోపు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలాచోట్ల రైతులు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు నిరీక్షించకుండా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధర కన్నా రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, సకాలంలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఊపందుకోని కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ధాన్యం కేంద్రాలు● చాలాచోట్ల తేమశాతం పేరుతో ముందుకు సాగని వైనం ● సింహభాగం ప్రైవేటు వ్యాపారులకే తరలుతున్న సన్నాలు ● ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోల్పోతున్న రైతులు సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు ధాన్యం సేకరణ మొదలుపెట్టలేదు. తేమశాతం పేరుతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబోసేందుకు వీలుకాక తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈసారి సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ధరను ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధరను లబ్ధిపొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8,360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగతా చోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 564 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు సేకరించారు. వనపర్తి జిల్లాలో 3,266 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3,107 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమ శాతం 14 లోపు ఉంటేనే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తేమశాతం ఉన్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించడం లేదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు జిల్లా కొనుగోలు ప్రా. ఇప్పటివరకు కొన్న కేంద్రాలు కొ.కే. ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో) మహబూబ్‌నగర్ 189 189 8,360.60 నాగర్‌కర్నూల్ 252 252 564 వనపర్తి 262 183 3,266 జోగుళాంబ గద్వాల 64 64 750 నారాయణపేట 101 101 3,107ప్రా.కొ.కే.: ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా కొనుగోళ్లు.. ప్రైవేట్‌లోనే అమ్ముకున్న.. నేను ఈసారి ఎకరాన్నరలో సన్నరకం వరిసాగు చేశాను. మా గ్రామంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో 30 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నాను. మా ఊరిలో కేంద్రం ప్రారంభం కాక చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకుంటున్నారు. – బాలయ్య, రైతు, రాయిపాకుల, తెలకపల్లి మండలం తేమశాతం ఉండట్లేదు.. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిర్ణీత తేమశాతం కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ఇందుకు సమయం పడుతోంది. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కేవలం రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజయ్య, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్ -
డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్
వనపర్తిటౌన్: డిసెంబర్ 14న నిర్వహించే మెగా జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకి అనుకూలంగా ఉన్న క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, ఎకై ్సజ్, డ్రంకెన్‌డ్రైవ్, చలానా, చిన్న చిన్న కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు. రాజీతో ఇరువర్గాలకు మేలు చేకూరడమేగాక ప్రశాంతంగా జీవించవచ్చని చెప్పారు. ఈ నెల 23, 30, వచ్చే నెల 7న ముందస్తు లోక్‌అదాలత్‌లు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు రవికుమార్, బి.శ్రీలత, వై.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ విధిగా ధరించాలి : ఎస్పీ వనపర్తి: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ప్రేమ్ టైలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ హాజరై పలువురికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరేందుకు హెల్మెట్ ధరించాలన్నారు. రెండు జతల దుస్తులు కుట్టించుకున్న వారికి ఉచితంగా హెల్మెట్ అందిస్తున్నట్లు నిర్వాహకుడు మన్యం తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణా, ఎస్ఐలు హరిప్రసాద్, జలంధర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏఎస్సై నిరంజన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్, సఖి సెంటర్ కార్యనిర్వాహకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పురాణాల గురించి తెలుసుకోవాలి వనపర్తి టౌన్: భారతీయ సమాజంలో ఇమిడి ఉన్న పురాణాల గురించి విద్యార్థి లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుభాషా సంరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.నారాయణరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కర్ణుడు, ద్రోణుడు, శ్రీరాముడు, ఆంజనేయుడు, అర్జునుడు, అభిమన్యుడు తదితర మహనీయుల వ్యక్తిత్వం తెలిపే సమగ్ర పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. పురాణ పురుషుల గురించి విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకుంటే కార్యసాధన, వ్యక్తిత్వం, సారవంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. మానవ, నైతిక విలువలు అబ్బుతాయని, తద్వారా సమాజం మెరుగుపడుతుందన్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరత్వంగా ఉండేందుకు రామాయణం, భారతం, భాగవతాలు మనిషిని నిలబెడుతాయన్నారు. కార్యక్రమంలో వ్యాఖ్యాత డీవీవీఎస్ నారాయణ, రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ వనపర్తి రూరల్: మతోన్మాద శక్తుల నుంచి తెలంగాణాను కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. శ్రామికుల ఐక్యతను బలోపేతం చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుకుందామన్నారు. వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు 24వ తేదీన జిల్లాకేంద్రంలోని యాదవ భవన్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. మెజార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలపై ధరల భారం, నిరుద్యోగం పెంచుతున్నాయన్నారు. మతోన్మాద రాజకీయాలకు తెలంగాణ గడ్డమీద స్థానం లేదని చాటి చెబుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు మండ్ల రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, సీపీఐ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, రమేశ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణికి ఏడు అర్జీలు
వనపర్తి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఏడు అర్జీలు దాఖలైనట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు ఎస్పీ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఎస్హెచ్ఓలకు సిఫారస్ చేశారు. దాఖలైన అర్జీల్లో పరస్పర గొడవలు, భూతగాదాలకు సంబంధించినవి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కొడంగల్ ఫార్మాసిటీతో సాగునీటి దోపిడీకి కుట్ర వనపర్తి: కొడంగల్ ఫార్మాసిటీతో సాగునీటి దోపిడీకి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి మాట్లాడిన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఫార్మాసిటీతో భీమా నుంచి ఏడు టీఎంసీల నీటిని తరలించాలని చూస్తున్నారన్నారు. ఈ చర్య దేవరకద్ర, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల వద్ద ఫార్మా సిటీ కోసం 14వేల ఎకరాలు సేకరించి, గోదావరి నీళ్లను తరలించాలని ప్రతిపాదించామని.. దాన్ని పక్కన పెట్టి కొడంగల్‌లో రైతులు వద్దన్న చోట ఫార్మా సిటీ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇది అనాలోచిత నిర్ణయమన్నారు. రైతులను భయపెట్టి, బలవంతంగా భూసేకరణ చేయడం సరికాదన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లాకు అదనంగా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయకుండా, రైతాంగానికి ఉపయోగించాల్సిన కృష్ణా జలాలకు గండికొడుతున్నారని విమర్శించారు. ఈ చర్యతో పాలమూరు రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించండి వనపర్తి రూరల్: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఏఓ భానుప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చేది తక్కువ వేతనాలు అని.. పైగా నెలల తరబడి చెల్లించక పోవడంతో కార్మికులు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, నందిమళ్ల రాములు, పుష్ప, శ్రీను, దాసు, రామచంద్రయ్య, గంగ, నరసింహ, భద్రయ్య, జమ్ములు, సుగ్రీవుడు పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే అభివృద్ధి
మేమెంతో.. మాకంత కావాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాజ్యాధికారంతోనే ఏవర్గమైన అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత తరుణంలో రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయని బీసీ, కుల సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే నాయకులు, ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు వినతిపత్రాలను స్వీకరించారు. సంఘాల వారీగా ప్రత్యేకంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజకీయ ప్రాతినిథ్యం లేని కులాలు చాలా ఉన్నాయని, వాటికి కూడా రిజర్వేషన్ల ద్వారా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మొత్తం 65 సంఘాల నాయకులు కమిషన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర పాల్గొన్నారు. కులగణన ఆధారంగా.. రాజకీయ ప్రాధాన్యం లేకుంటే ఏమీ జరగదు బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలి బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు వెల్లువెత్తిన వినతులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ బీసీ రిజర్వేషన్ల గుర్తింపుపై బహిరంగ విచారణ ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.. బీసీ జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో 12,760 గ్రామాలకు గాను 8వేలకుపైగా గ్రామాల్లో ముదిరాజ్‌ల జనాభా అధికంగా ఉంది. వందశాతం ముదిరాజ్‌లు ఉన్న గ్రామాలు వందల్లో ఉన్నా రాజకీయ ప్రాధాన్యత లేదు. స్థానిక సంస్థల్లో ముదిరాజ్‌ల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. – కృష్ణ ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరేమన్నారంటే.. యాదవులకు పొలిటికల్ పవర్ ఉండాలని, అందుకనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని యాదవ సంఘం అధ్యక్షుడు కాశన్న విన్నవించారు. రోస్టర్ పద్ధతిలో ఉన్న రిజర్వేషన్‌ను ఎస్టీ ఎరుకులకు తీసి వేశారని, గ్రామాల వారిగా రోస్టర్ తీసుకోవాలని ఎరుకుల సంఘం బాలయ్య కోరారు. 50 కులాలకు ఇంక రాజకీయ ప్రాధాన్యత రాలేదని సగర సంఘం అధ్యక్షుడు ప్రణీల్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలని విన్నవించారు. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సంఘం నాయకుడు సారంగి వినయ్‌కుమార్ పేర్కొన్నారు. సచార్ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మోసిన్‌ఖాన్ కోరారు.పేదలకు న్యాయం చేయాలి.. 90 శాతం ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు న్యాయం చేయాలి. వారు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు తదితర సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలి. భూమి లేని ప్రజలందరికీ ఎకరం వ్యవసాయ సాగు భూమి, 200 గజాల స్థలంలో 4 గదులతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – విశారదన్ మహారాజ్, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి. జిల్లాలో అత్యధికంగా బీసీలు ఉన్నారని, రేపు కులగణన జరిగిన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. – శ్రీనివాస్‌సాగర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
ఎర్రవల్లి: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీ గార్లపాడులో రూ.25 లక్షల వ్యయంతో ఓ కాంట్రాక్టర్ మైనారిటీ కమ్యూనిటీ భవనం (షాదీఖానా)ను నిర్మించి బిల్లు కోసం ఎంబీ రికార్డుల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావును ఇటీవల సంప్రదించాడు. ఈ క్రమంలో తనకు కాంట్రాక్ట్ బడ్జెట్ ప్రకారం 2 శాతం కమీషన్‌గా రూ.లక్ష ఇస్తేనే ఎంబీలో బిల్లు ఎక్కిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏఈతో చర్చలు జరిపి చివరికి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం సోమవారం ఉదయం బాధితుడు ఎర్రవల్లి కూడలిలోని జమ్జమ్ హోంనీడ్స్ దుకాణంలో ఏఈకి నగదు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ నుంచి వివరాలు సేకరించి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ఏసీబీ దాడుల్లో సీఐలు లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంబీ రికార్డు చేసేందుకు రూ.50 వేలు డిమాండ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
బోనస్‌పై బోగస్ ప్రచారాన్ని నమ్మవద్దు
వీపనగండ్ల/చిన్నంబావి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల, గోపల్‌దిన్నె, చిన్నంబావి మండలంలోని బెక్కెం, అమ్మాయిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తున్నట్లు చెప్పారు. కొందరు రైతులు సన్నరకం ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలా చేస్తే నష్టపోతారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మరాదన్నారు. త్వరలోనే రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి, సీఈఓలు నాగరాజు, భాస్కర్‌రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గంగిరెడ్డి, కుర్మయ్య, సింగయ్యశెట్టి, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి, ఈదన్న, రామస్వామి, కృష్ణ, ప్రభంజన్‌గౌడ్, విష్ణుగౌడ్ పాల్గొన్నారు. వరికొయ్యలను కాల్చొద్దు నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వా యు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. -
రెండు ప్రాణాలు
నిర్లక్ష్యం ఖరీదు.. ‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఖిల్లాఘనపురం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని డీఈఓ గోవిందరాజులు ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం ఖిల్లాఘనపురం బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కాళిదాస్, మునావర్ సుల్తానా, ఉపాధ్యాయులు శ్రీనివాసులు యాదవ్, కృష్ణమోహన్, రామకృష్ణ పాల్గొన్నారు. వివరాలు 8లో u రివర్స్‌లో వస్తూ బైక్‌ను ఢీకొట్టిన లారీ ఇద్దరు యువకుల దుర్మరణం వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో ఘటన – వనపర్తి రూరల్ -
ముస్లింలకు న్యాయం చేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం ఉన్న వెనకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. ముస్లింలలో 50 వెనకబడిన కులాలు ఉండగా.. వీటిలో 30 దాకా సంచార తెగలు ఉన్నాయి. వీరిని ఎస్టీలుగా, మిగిలిన 20 కులాలను బీసీలుగా గుర్తించి వెనకబడిన ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు పెంచాలి. – షేక్ ఫరూక్ హుస్సేన్, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు రజకులకు అన్యాయం రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల జనాభా ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండాపోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, ఇంకా తమను అంటరానివాళ్లుగానే సమాజం చూస్తుంది. తమ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. – పురుషోత్తం, రజక సంఘం అధ్యక్షుడు -
గ్రూప్–3 పరీక్షకు 55 శాతం హాజరు
వనపర్తి: జిల్లాలో రెండవ రోజు సోమవారం నిర్వహించిన గ్రూప్–3 పరీక్ష మూడవ పేపర్‌కు 55 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో 8,312 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 4,565 మంది మాత్రమే పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు చేర్చే వరకు గస్తీ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. -
రిజర్వేషన్ కల్పించాలి..
సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 129కి పైగా బీసీ తరగతులు ఉండగా.. ఇప్పటికీ అత్యధిక శాతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సంచార జాతులు, ఎంబీసీ కులాలలో సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం విపరీతంగా ఉంది. వీరిపై దాడులు, దౌర్జన్యాలు, కులవివక్ష, మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. 11 బీసీ ఎంబీసీ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలి. – మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు