Warangal District Latest News
-
కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ దుగ్గొండి: రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకుని తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. సభ్యత్వ నమోదు, బూత్ అధ్యక్షుల నియామకంలో భాగంగా వెంకటాపురంలో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. 21, 22 బూత్‌ల్లో చురుకుగా పనిచేసిన పొగాకు విఘ్నేశ్, పొగాకు దేవేందర్‌కు నియామకపత్రాలు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నేదురు రాజేందర్, గుడిపూడి రాధాకృష్ణ, గడ్డం ఆంజనేయులు, చిలుపూరి రాజు, నూతనకంటి శ్రీనివాస్, రమేశ్, రామ్మోహన్, పొగాకు శ్రీనివాస్, ఏరుకొండ కర్ణాకర్, లింగాచారి, నర్సింగరావు, చిరంజీవి, బూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రవీందర్
వరంగల్: ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సంగెం ఎంపీడీఓ కె.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రాయపర్తి ఎంపీడీఓ జి.కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని ఎంపీడీఓలు పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మర్యాదపూర్వకంగా సీఈఓ రాంరెడ్డిని కలిసి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ నూతి వసుమతి, ఎంపీడీఓలు శ్రీవాణి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2024● బోనం.. కరుణించాలి సీఎం● కాంతిమయం.. ఫాతిమా మందిరం– 8లోuఈ చిత్రంలో గైడ్ టీచర్ జర్పుల రాజునాయక్‌తో పాటు ఉన్న విద్యార్థి జర్పుల చందునాయక్. శాయంపేట మండలం కాట్రపెల్లిలోని సీఎస్ఐ బీజేఎం పాఠశాలకు చెందిన ఇతను జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచాడు. ‘వృత్తం దాని భాగాలు దాని సబ్‌థీమ్ మేథమెటికల్ మోడలింగ్, కాంపిటీషన్ థింకింగ్’ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపియ్యాడు. ఒక ఫ్లైవుడ్ షీట్, రెండు డ్రాయింగ్ షీట్లు కొన్ని ఇనుప మొలలు, కొన్ని హెయిర్ బ్యాండ్లు, గమ్ తదితర వస్తువులతో ఈఎగ్జిబిట్ తయారు చేశారు. వృత్తాకారం అనేది మన నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఎగ్జిబిట్ తెలియజేస్తుంది. విద్యార్థుల్లో ప్లే వే మెథడ్ కూడా ఇందులో భాగమేనని ఇలా బోధన చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందని విద్యార్థి చెబుతున్నాడు. నిట్‌లో పది రోజుల జియాన్ కోర్సు ప్రారంభంకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మేథమెటికల్ ఫౌండేషన్స్ ఫర్ అర్రే సిగ్నల్ ప్రొసెసింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనే అంశంపై నిర్వహిస్తున్న పదిరోజుల జియాన్ కోర్సు శనివారం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కోహెన్ జ్యోతి ప్రజ్వలన చేసి కోర్సును ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో డీడీఎస్ఏహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ సునయన చౌహాన్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఏఏఓ రమేశ్, సీనియర్ ఆడిటర్లు అశోక్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష వాయిదా వేయకపోతే సమ్మెకు వెళ్తాంఎంజీఎం: వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల ఏఎన్ఎంలకు ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ తెలిపారు. 48 గంటల నిరసనలో భాగంగా శనివారం ఎంజీఎం కూడలిలో ఏఎన్ఎంలు మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా యాదానాయక్ మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా పని చేస్తున్న వారికి మళ్లీ రాత పరీక్ష నిర్వహించడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె.సుధాకర్, సుజాత, సరోజ, చంద్రకళ, ప్రభావతి, సాంబలక్ష్మి, మంజుల, పుష్పలత, విజయ పాల్గొన్నారు. ‘ఎల్టా’ పోటీలతో నైపుణ్యాల పెంపువిద్యారణ్యపురి: ఎల్టా ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల్ని పెంపొందించేందుకు తోడ్పడతాయని హనుమకొండ డీఈఓ డి.వాసంతి అన్నారు. ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లిష్ ఒలింపియాడ్, ఎలక్యూషన్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శనివారం డీఈఓ కార్యాలయంలో వాసంతి ఆవిష్కరించారు. జనవరి 3న మండల, 18న జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలు, 31న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ ఒలింపియాడ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జెండర్ అండ్ ఈక్విటీ కో–ఆర్డినేటర్ సునిత, ఎల్టా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.సంపత్, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులది హనుమకొండ జిల్లాలోని ఎల్క తుర్తి మోడల్ స్కూల్. పేర్లు గణేశ్, హరీష్ ‘నీపథంలో గణితం’ ఎగ్జిబిట్‌ను గైడ్‌గా పీజీటీ మ్యాథ్స్ ఉపాధ్యాయురాల అచరిత సహకారంతో రూపొందించారు. (2023–2024)లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శనలో ప్రతిభ చూపి ప్రథమ స్థానం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆగైడ్ టీచర్ అచరిత భీమదేవరపెల్లి మండలం ముల్కనూరు మోడల్ స్కూల్లో (పీజీటీ గణితం) పనిచేస్తున్నారు. ప్రతీ రంగంలో గణితం ఉంటుందని తెలియజేసేందుకు కొన్ని మైక్రో ఎగ్జిబిట్లను రూపొందించారు. వృత్తం, అర్ధ వృత్తాలు ఉపయోగించి పగలు, రాత్రి ఏ నెలలో ఎక్కువగా ఉంటాయో, ఏ నెలలో సమానంగా ఉంటాయో ఈ ఎగ్జిబిట్ ద్వారా తెలియజేసి ప్రశంసలు అందుకున్నారు. ఈఎగ్జిబిట్ 2023లో కేరళలో సదరన్ ఇండియా సైన్స్‌ఫెయిర్ నందు ఐఐటీ ఆస్ట్రో ఫిజిక్స్ స్పెషల్ ప్రైజ్ అందుకుంది. అంతేకాకుండా గణితాన్ని విద్యార్థులు సులభంగా నేర్చుకునేందుకు గణిత ల్యాబ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. 2023లో అచరితకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వచ్చింది. అలాగే గుజరాత్ ఐఐటీ గాంధీనగర్‌లో 2023లో సీసీఎల్ వర్క్‌షాపునకు మాస్టర్ ట్రైనర్‌గా నైపుణ్యం కోసం అచరిత శిక్షణ పొందారు. ఈ చిత్రంలో గైడ్ టీచర్ ఆర్.శంకర్‌తో పాటు ఉన్న విద్యార్థి పేరు కె.రాకేశ్. హనుమకొండ జిల్లా మడికొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో క్లినోమీటర్ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించాడు. క్లినో మీటర్ లంబకోణ త్రిభుజం లోఉన్న ఎత్తు కోణాన్ని లేదా భూమి నుంచి ఉన్న కోణాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం. ఈ ఎగ్జిబిట్, పరికరం, భవనాలు, చెట్లు జెండా స్తంభాలు వంటి వస్తువుల ఎత్తును కొలిచేందుకుగాను ఉపయోగించవచ్చు. ఈ ఎగ్జిబిట్ రూపొందించేందుకు వినియోగించిన వస్తువులు పీవీసీ పైపులు, ఒక ఇంచువి నాలుగు, 30 సెంటిమీటర్ల అట్టముక్క, కోణమానిని 0–90,(ఇరువైపులా) 15 సెంటిమీటర్ల దారం, 30 సెంటీమీటర్ల పీవీసి పైపు ముక్కను దారానికి వేలాడదీసినవి. ఇనుప వాచర్‌ను వినియోగించి ఈ ఎగ్జిబిట్‌ను రూపొందించారు.సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. గణిత దినోత్సవం ఎలా వచ్చిందంటే..రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్‌కు ఎంపికకాళోజీ సెంటర్: రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్టుకు వరంగల్ జిల్లా నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికై నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తెలుగు మీడియంలో రాయపర్తి మండలం కొలనుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎల్.రాంచరణ్, ఖిలావరంగల్ శంభునిపేట జీహెచ్ఎస్ నుంచి ఆఫ్రీన్, గీసుకొండ మండలం వంచనగిరి జెడ్పీహెచ్ఎస్ నుంచి జి.భరత్, ఇంగ్లిష్ మీడియంలో ఖానాపురం సైనిక్ స్కూల్ విద్యార్థి ఎ.రాజ్‌కుమార్, నెక్కొండ మండలం తెలంగాణ గురుకుల పాఠశాల నుంచి ఆర్.హర్షిణి, సీహెచ్.శ్రీజ, వరంగల్ మండలం నరేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల నుంచి పి.విశ్వతేజ, వరంగల్ మట్టెవాడ జీహెచ్ఎస్ నుంచి ఎస్.రష్మిక, సంగెం మండలం మొండ్రాయి జెడ్పీహెచ్ఎస్ నుంచి ఎ.దీపిక ఎంపికై నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్ట్‌కు వీరు హాజరుకానున్నట్లు తెలిపారు. గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహా సముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయ తీరాల్ని చేరవచ్చు. అదే తరహాలో అంకిత భావం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చిన్న వయస్సులోనే చిటికె వేసినంత సులువుగా లెక్కలు చేస్తున్నారు. నేడు (ఆదివారం) రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం. ఈనేపథ్యంలో గణితంలో ప్రతిభ కనబరుస్తున్న ఘనులపై, వారిని తయారు చేస్తున్న ఉపాధ్యాయులపై ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – విద్యారణ్యపురి‘గణిత పాఠ్యాంశాల బోధన లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలో సూత్రాలను నిరూపిస్తూ సమస్యల సాధనను వివరిస్తే విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోగలుగుతారు’ అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితం రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ బండారి రమేష్ అన్నారు. నేడు (ఆదివారం) జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గణితం అంటే విద్యార్థులు భయానికి లోనవుతారు. కానీ భయపడాల్సిన సబ్జెక్టు ఏమీ కాదు. నేను బ్లాక్ బోర్డుపై సూత్రాలు వేసి సమస్యలను సాధించినప్పుడు అతి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అర్థం చేసుకునేవారు. మిగతా వారు అడగలేక విషయాలను దాటవేసేవారు. పరీక్షల్లో తక్కువగా మార్కులు వచ్చేవి. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన చేశా. ఆ.. ఆలోచన ఫలితమే లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో బోధన చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నా. నేను ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో ప్రయోగాత్మకంగా గణితం బోఽధించినప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం గమనించా. పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులతో చేయిస్తూ గణిత సమస్యలను సాధన చేయించాను. ఆ తర్వాత పరీక్షల్లో 80శాతంమంది మంచి మార్కులు సాధించారు. అప్పటినుంచి లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలోనే గణితం బోధిస్తూ వస్తున్నా. చిటూరు, వెంకటాపూర్కలాన్, ప్రస్తుతం వరంగల్ జిల్లా నెక్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. జాతీయస్థాయిలో సైన్స్అండ్ టెక్నాలజీలో విజ్ఞాన ప్రదర్శనలకు విద్యార్థులను ప్రోత్సహించా. దానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలలోని ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఉపయోగించి టెక్నాలజీ ద్వారా గణిత పాఠ్యాంశాలను చెబుతున్నా. ఈ ప్రయోగశాలకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నా. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించి గణిత పాఠ్యాంశాలను బోఽధించడం ద్వారా అమూర్తభావనలను విద్యార్థులు సలభతరంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సెమినార్లో రమేశ్ పేపర్ ప్రజెంటేషన్ జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో శనివారం మేథమెటిక్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో బండారి రమేశ్ గణితం సబ్జెక్టుపై తన పరిశోధన పత్రం సమర్పించారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆయనకు సర్టి ఫికెట్ ప్రదానం చేశారు. రమేశ్‌కు సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిసమగ్రశిక్ష ఉద్యోగులు మినిమమ్ పేస్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా శనివారం పోచమ్మకు బోనమెత్తారు. బాలసముద్రంలోని పోచమ్మగుడిలో బోనాలు సమర్పించారు. సీఎం రేవంత్ కరుణించాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. పీటీఐ రాజు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. – విద్యారణ్యపురి న్యూస్‌రీల్‘లెర్నింగ్ బై డూయింగ్ అనగా గణితంలో సూత్రాలు, కృత్యాలను నిర్వహిస్తూ ప్రయోగాత్మకంగా సూత్రాలను రాబట్టడం. (ఉదాహరణ త్రిభుజ వైశాల్యం = 1/2 x భూమి x ఎత్తు. విద్యార్థి పై సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు 1/2 ఎలా వచ్చింది అని అడిగితే దానిని ప్రయోగాత్మకంగా వివరించి చెప్పడం)’ -
‘హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు’
న్యూశాయంపేట: ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళా అభ్యర్థులు హార్డ్ కాపీలు అందజేయాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం హార్డ్ కాపీలు మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో అందజేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయమై వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు టి.రమేశ్, డి.మురళీధర్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. -
చట్టాలపై అవగాహన లేక నేరాలు
● జడ్జి శాలిని లింగం ● పరకాలలో న్యాయ విజ్ఞాన సదస్సు పరకాల: సమాజంలో జీవించే ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన లేకనే నేరాలు పెరిగిపోతున్నాయని పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు చట్టపరంగా న్యాయం చేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత న్యాయవాదులు, మేధావులపై ఉందన్నారు. పరకాల తాలుకా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఎఫ్‌జే గార్డెన్లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరై సివిల్, క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య, ఏజీపీ లక్కం శంకర్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట సీఐలు క్రాంతికుమార్, ఎకై ్సజ్ సీఐ తాతాజీ, బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్స జనార్దన్, సీనియర్ న్యాయవాదులు మెరుగు శ్రీనివాస్, పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, చంద్రమౌళి, కూకట్ల శ్రీనివాస్, మేకల శ్రావణ్‌కుమార్, గండ్ర నరేశ్‌రెడ్డి, న్యాయవాదులు, ఎంపీడీఓలు, కోర్టు, పరకాల పోలీసు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన దరఖాస్తుకు అవకాశం
పరకాల: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. పరకాల మండలం లక్ష్మీపురంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం ఆయన పరిశీలించి తగు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.నారాయణ, ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ శైలజతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లెక్కలు వస్తే చక్కగా రాణిస్తారు : డీఈఓధర్మసాగర్: లెక్కలు వస్తే జీవితంలో చక్కగా రాణిస్తారని డీఈఓ వాసంతి అన్నారు. ధర్మసాగర్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఎగ్జిబిట్లను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈసందర్భంగా పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం ధర్మప్రకాశ్ గణితానికి ఉన్న ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. గణిత ఉపాధ్యాయురాలు కిరణ్మయి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో గణితానికి ఉన్న ప్రాముఖ్యత, గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. -
పారదర్శకంగా సర్వే చేయాలి : జెడ్పీ సీఈఓ
సంగెం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను పారదర్శకంగా చేయాలని జెడ్పీ సీఈఓ, ఇందిరమ్మ ఇళ్ల జిల్లా నోడల్ అధికారి రాంరెడ్డి అన్నారు. ఆశాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు అని సర్వే చేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏంపీఓ కొమురయ్య, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లాస్థాయి సీఎం కప్ బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. అండర్–23 బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు సరూర్‌నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. నల్లబెల్లం, పటిక పట్టివేతనెక్కొండ: నిషేధిత నల్లబెల్లం, పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. మండల కేంద్రంలో శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తుల వద్ద పెద్ద సంచులు కనిపించాయి. దీంతో పోలీసులు సోదాలు చేసి రూ.1.82 లక్షల విలువైన 10.80 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను, 2 సెల్ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెల్లం, పటికను రవాణా చేస్తున్న మండలంలోని నక్కలగుట్ట తండా జీపీకి చెందిన కొర్ర శ్రీను, కొర్ర మాలు, ఆంగోత్ లాలి, కొర్ర భద్రమ్మపై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐ రాజ్, ఎస్సై భానుప్రకాశ్‌ను సీపీ అభినందించారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దునర్సంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం, సివిల్ సప్లయీస్ గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సూచించారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్లో ఆమె క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్, తహసీల్దార్ విశ్వప్రసాద్, మార్కెట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలి
వరంగల్: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో శనివారం సీఎం కప్ జిల్లాస్థాయి ముగింపు క్రీడా పోటీల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుంచి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయి, 17 నుంచి 21 వరకు జిల్లాస్థాయిల్లో సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 6 వేల మంది క్రీడాకారులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని 31 ఈవెంట్లలో పాల్గొన్నారని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచించారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరోసారి క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. ఖోఖో, కబడ్జీ, వాలీబాల్, ఫుట్‌బాల్, నెట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ తదితర జిల్లాస్థాయి పోటీల విజేతలకు కలెక్టర్, అదనపు కలెక్టర్, అధి కారులు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి, జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కై లాశ్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి ధన్‌రాజ్, అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిలాల్, పలు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముగిసిన సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడలు -
రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్ట్‌కు విద్యార్థుల ఎంపిక
కాళోజీ సెంటర్: రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్టు కు జిల్లా నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికై నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తెలుగు మీడియంలో రాయపర్తి మండలం కొలనుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎల్.రాంచరణ్, ఖిలావరంగల్ శంభునిపేట జీహెచ్ఎస్ నుంచి ఆఫ్రీన్, గీసుకొండ మండలం వంచనగిరి జెడ్పీహెచ్ఎస్ నుంచి జి.భరత్, ఇంగ్లిష్ మీడియంలో ఖానాపురం సైనిక్ స్కూ ల్ విద్యార్థి ఎ.రాజ్‌కుమార్, నెక్కొండ మండలం తెలంగాణ గురుకుల పాఠశాల నుంచి ఆర్.హర్షిణి, సీహెచ్.శ్రీజ, వరంగల్ మండలం నరేంద్రనగర్ ప్ర భుత్వ పాఠశాల నుంచి పి.విశ్వతేజ, వరంగల్ మట్టెవాడ జీహెచ్ఎస్ నుంచి ఎస్.రష్మిక, సంగెం మండలం మొండ్రాయి జెడ్పీహెచ్ఎస్ నుంచి ఎ.దీపిక ఎంపికై నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి గణిత టా లెంట్ టెస్ట్‌కు వీరు హాజరుకానున్నట్లు తెలిపారు. -
‘లెర్నింగ్ బై డూయింగ్’లో బోధన
● గణితం సులువుగా అర్థమవుతుంది.. ● జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ విద్యారణ్యపురి: ‘గణిత పాఠ్యాంశాల బోధన లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలో సూత్రాలను నిరూపిస్తూ సమస్యల సాధనను వివరిస్తే విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోగలుగుతారు’ అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితం రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ బండారి రమేశ్ అన్నారు. నేడు (ఆదివారం) జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గణితం అంటే విద్యార్థులు భయానికి లోనవుతారు. కానీ, భయపడాల్సిన సబ్జెక్టు ఏమీ కాదు. నేను బ్లాక్ బోర్డుపై సూత్రాలు వేసి సమస్యలను సాధించినప్పుడు అతి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అర్థం చేసుకునేవారు. మిగతా వారు అడగలేక విషయాలను దాటవేసేవారు. పరీక్షల్లో తక్కువగా మార్కులు వచ్చేవి. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన చేశా. ఆ.. ఆలోచన ఫలితమే లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో బోధన చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నా. నేను ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో ప్రయోగాత్మకంగా గణితం బోఽధించినప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం గమనించా. పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులతో చేయిస్తూ గణిత సమస్యలను సాధన చేయించాను. ఆ తర్వాత పరీక్షల్లో 80 శాతం మంది మంచి మార్కులు సాధించారు. అప్పటినుంచి లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలోనే గణితం బోధిస్తూ వస్తున్నా. చిటూరు, వెంకటాపూర్కలాన్, ప్రస్తుతం వరంగల్ జిల్లా నెక్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. జాతీయస్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీలో విజ్ఞాన ప్రదర్శనలకు విద్యార్థులను ప్రోత్సహించా. దానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలలోని ఐఎఫ్‌పీ ప్యానల్స్ ఉపయోగించి టెక్నాలజీ ద్వారా గణిత పాఠ్యాంశాలను చెబుతున్నా. ఈ ప్రయోగశాలను 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నా. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించి గణిత పాఠ్యాంశాలను బోఽధించటం ద్వారా అమూర్తభావనలను విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సెమినార్లో రమేశ్ పేపర్ ప్రజెంటేషన్ జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో శనివారం మ్యాథమెటిక్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో బండారి రమేశ్ గణితం సబ్జెక్టుపై తన పరిశోధన పత్రం సమర్పించారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు.‘లెర్నింగ్ బై డూయింగ్ అనగా గణితంలో సూత్రాలు, కృత్యాలను నిర్వహిస్తూ ప్రయోగాత్మకంగా సూత్రాలను రాబట్టడం. (ఉదాహరణ త్రిభుజ వైశాల్యం = 1/2 x భూమి x ఎత్తు. విద్యార్థి పై సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు 1/2 ఎలా వచ్చింది అని అడిగితే దానిని ప్రయోగాత్మకంగా వివరించి చెప్పడం.)’ -
వైభవంగా అయ్యప్ప పంబారట్టు
సంగెం: అయ్యప్పస్వామి శరణుఘోషతో మొండ్రాయి మార్మోగింది. గ్రామంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కమిటీ ఆధ్వర్యంలో కేసముద్రం శ్రీదర్మశాస్తా దేవాలయ ప్రధాన తంత్రి గురుస్వామి విష్ణునారాయణ్ పొట్టి నగర సంకీర్తన, పంబారట్టు కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎల్గూర్‌రంగంపేట చెరువు మత్తడి వద్ద అభిషేకాలు, పంబారట్టు జరిపారు. అనంతరం అయ్యప్ప స్వాములు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్వాములు ఇజ్జగిరి అశోక్, మామిండ్ల రమేశ్, భక్తులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన చేపల వేట
ఖానాపురం: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన పెద్దమ్మగడ్డ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన వల్లెపు సాంబయ్య (58) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. ఆయనకు తరచుగా చేపల వేటకు వెళ్లే అలవాటు ఉంది. ఇంట్లో చేపల వల లేకపోవడంతో చేపల వేటకు వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. శనివారం గ్రామశివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. సాంబయ్య కాళ్లకు చేపల వల చుట్టుకుని ఉంది. అంతేకాకుండా వ్యవసాయ బావి నుంచి మృతి చెందిన మొసలిని సైతం బయటకు తీశారు. ప్రమాదవశాత్తు అదుపుతప్పి బావిలో పడి చేపల వల చుట్టుకుని మృతి చెందాడా లేక మొసలి దాడి చేయడంతో సాంబయ్య మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. బావిలో పడి పెద్దమ్మగడ్డ వాసి మృతి -
ఆరోగ్యపరంగా చాలా నష్టం..
పెళ్లి వయస్సు రాకుండా వివాహం చేయడం వల్ల అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చాలా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక, శారీరక పరిపక్వత లేకపోవడం మూలంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. స్వతహాగా ఎదుర్కోలేక మానసికంగా కుంగిపోతారు. చిన్న వయస్సులో బాలికలకు గర్భ సంచి ఎదగదు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం దాలిస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లలు కూడా బరువు తక్కువగా, తరచూ అనారోగ్యం బారిన పడతారు. తల్లిదండ్రులు ఈ విషయంలో పొరపాటు చేయవద్దు. –డాక్టర్ నరేశ్ కుమార్, రాష్ట్ర వైద్యమండలి సభ్యుడు వివాహ నమోదు తప్పనిసరి చేయాలి.. జనన, మరణ తేదీల నమోదు మాదిరిగానే వధూవరుల వయసు, పాఠశాల, ఆస్పత్రి రికార్డులను పరిశీలించి మేజరైతేనే ముహూర్తం పెట్టేలా బ్రాహ్మణులు చర్యలు తీసుకోవాలి. పెళ్లి నమోదు రికార్డులను సంబంధిత అధికారులకు అప్పగించేలా చూస్తే చాలావరకు బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్రతిఒక్కరూ వీటిని నిరోధించేందుకు కృషి చేయాలి. బాల్యవివాహం జరిపితే రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదంటే రెండూ ఒకేసారి విధించే వీలుంది. –మండల పరశురాం, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ ● -
ఆరో వార్డుకు తాగునీటి సరఫరా
శాయంపేట : మండల కేంద్రంలోని ఆరో వార్డుకు తాగునీటిని సరఫరా చేశారు. ఈ వార్డులో మూడు నెలలుగా తాగునీటి కొరత తలెత్తడంతో మహిళలు గురువా రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళ న చేపట్టారు. ఈనేపథ్యంలో ‘తాగునీటి కోసం మహిళల నిరసన’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు రూ.40వేల విలువైన మోటారు పంపింగ్ సెట్టు కొనుగోలు చేశారు. ఎంపీఓ రంజిత్‌కుమార్, పంచా యతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో పంపు ఆపరేటర్‌తో మోటారు బిగించి తాగునీటిని సరఫరా చేశారు. -
సీఎంపై కేసు నమోదు చేయాలి
హన్మకొండ: ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్రం పరువు తీసిన సీఎం రేవంత్‌రెడ్డిపైనే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకులతో మాట్లాడుతూ.. ఫార్ములా–ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే సీఎం ము ఖం చాటేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కుట్రలకు పాల్పడి అక్ర మ కేసులు పెట్టి అరెస్టులకు పూనుకుందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, పులి రజనీకాంత్, నయీముద్దీన్, జనార్దన్ గౌడ్, ఎల్లావుల లలితాయాదవ్, అశోక్, విక్టర్ బాబు, రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ -
నిట్‌లో క్రిస్మస్ వేడుకలు
కాజీపేట అర్బన్: నిట్ క్యాంపస్‌లో శుక్రవారం నిట్‌మాస్–24 పేరిట క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిట్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ పీఎస్.చానీ పాల్గొని మాట్లాడారు. ఏసు క్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. ఏసు ప్రభు బోధనలు, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ అల్యూమ్ని అఫైర్స్ డీన్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలిహసన్పర్తి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవా లని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. నగరంలోని ఎస్వీఎస్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న ‘టెక్–క్వెస్ట్–24’ వేడుక ల్లో భాగంగా శుక్రవారం విద్యార్థులు ఫొటో ఎగ్జిబిట్స్, పోస్టర్లను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని, వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలని చెప్పారు. ఈ సందర్భంగా నార్కొటిక్ తెలంగాణ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యాన ఎంపవర్డ్ యూత్, డ్రగ్స్, సైబర్ క్రైంపై అవగా హన కల్పించారు. అంతకు ముందు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు, ట్రెయినీ ఐపీఎస్ మన్నాన్ భట్, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్తదితరులు పాల్గొన్నారు. దైవ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హన్మకొండ: ఇష్ట దైవాల దర్శనానికి వెళ్లే భక్తు ల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్న ట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. వరంగల్–2 డిపో ద్వారా భక్తులతో అరుణాచలం వెళ్తున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సును హనుమకొండ బస్ స్టేషన్లో ఆర్ఎం డి.విజయ భాను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. భక్తుల కోరిక మేరకు ప్రత్యేక బస్సులు సమకూరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్ జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీలో మర్యాద దినోత్సవంహన్మకొండ: హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో శుక్రవారం మర్యాద దినోత్సవం నిర్వహించారు. మహిళా ప్రయాణికురాలిని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సన్మానించారు. ఈసందర్భంగా ఆర్ఎం మాట్లాడు తూ.. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉండాలన్నారు. ప్ర యాణికులను సంస్థ గౌరవిస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆపరేషన్ కేశరాజు భానుకిరణ్, వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, వరంగల్–1 డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతోశ్, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్ కోర్సులుగా మార్చేందుకు కృషి : వీసీకేయూ క్యాంపస్: కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని ఎస్ఎఫ్సీ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చేందుకు కృషి చేస్తానని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలను శుక్రవారం సందర్శించిన వీసీ.. తరగతుల గదుల్లోకి వెళ్లి పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బిక్షాలుతో మాట్లాడగా.. కళాశాలకు ఇంకా అధ్యాపకులు అవసరమని, ల్యాబ్ సదుపాయాలతోపాటు మౌలిక వసతులు కల్పించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంత రం కళాశాల ఆవరణలో వీసీ మొక్క నాటారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉన్నారు. అనంతరం ఎస్డీఎల్సీఈని రిజిస్ట్రార్ మల్లారెడ్డితో వీసీ సందర్శించి డైరెక్టర్ రాంచంద్రంతో మాట్లాడారు. -
ఎల్కతుర్తి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024రూ. కోట్లలో2020–21వసూలైనవివరంగల్ అర్బన్: నల్లా, ఆస్తి పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం అలక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటేటా పేరుకుపోతున్న నల్లా, ఆస్తి పన్నుల బకాయిలు పెరిగిపోతున్నప్పటికీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు తమకేమీ పట్టదన్నట్లుగా చూస్తున్నారు. నాలుగేళ్లుగా పాత బకాయిలు (ఎరి యర్స్) కోట్లల్లో పేరుకుపోయాయి. గ్రేటర్ వరంగల్ పాలక వర్గం పెద్దలు, ఉన్నతాధికారులు కూడా ఈ బకాయిలపై నోరుమెదకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు రూ.38 కోట్లు కొన్నేళ్లుగా నల్లా పాత బకాయిలు ఏళ్ల తరబడిగా పేరుకుపోతున్నాయి. మొత్తం రూ.41.55 కోట్లు బకాయిలు ఉండగా.. ఈ ఏడాది రూ.3.54 కోట్లు వసూలు చేశారు. ఇంకా.. రూ.38.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పాత, కొత్త బకాయిలు మొత్తం రానున్న మూడు నెలల్లో రూ. 56.95 కోట్లు రాబట్టాల్సి ఉంది. బాధ్యతారాహిత్యం నగరంలో తాగునీటి సరఫరా బాధ్యత ఇంజినీర్లదే. కొత్త నల్లా కనెక్షన్లు మంజూరు చేసి, కనెక్షన్ ఇస్తారు. అయితే పన్నులు వసూలు చేసే బాధ్యత బల్దియా విభాగానికి ఉందా?. దీంతోనే అసలు సమస్య వస్తోంది. నల్లా నీళ్లు రావడం లేదని ప్రజలు పన్ను కట్టేందుకు ఇష్టపడడం లేదని ఆర్ఐలు చెబుతున్నారు. ఈ కారణంగా ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి ఆస్తి, నీటి పన్నులను కలిపి డిమాండ్ నోటీసు జారీ చేస్తున్నారు. కానీ ఇంటి పన్ను వసూలుపై పెడుతున్న చొరవ నల్లా సొమ్ము వసూలు చేయడంపై పెట్టడం లేదు. ఏఈ, డీఈలు, ఈఈలు, చివరకు ఎస్ఈ స్థాయి అధికారి వరకు బకాయిలపై దృష్టిసారించడం లేదు. న్యూస్రీల్గ్రేటర్లో రూ.56.95 కోట్ల నల్లా బకాయిలు నిద్ర మత్తులో అధికార యంత్రాంగం కేవలం 14.84 శాతం వసూలు నగర ప్రజలకు తాగునీరందించడం బల్దియాకు రోజు రోజుకూ భారమవుతోంది. జనాభా 12 లక్షలకు చేరింది. నల్లా కనెక్షన్ల సంఖ్య 1,77,804 ఉన్నాయి. తాగునీటి సరఫరా కోసం ఏడాదికి రూ. 30 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. డిమాండ్ మాత్రం రూ.25.32 కోట్లు ఉంది. అందులో కేవలం రూ.12 కోట్ల నుంచి 14 కోట్లు దాటడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 9 నెలలు పూర్తి కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు రూ.6.38 కోట్లు మాత్రమే వసూలు చేశారు. -
ఎన్నికల విధానంపై అవగాహన అవసరం
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి కేయూ క్యాంపస్: ఎన్నికల నిర్వహణ విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి అన్నారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే అంశంపై శుక్రవారం కళాశాలలోని సామాజిక శాస్త్రాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భారతదేశం పెద్ద ప్రజా స్వామిక వ్యవస్థ.. గడిచిన 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో అనేక సంస్కరణలు వచ్చాయి.. ప్రాంతీ య, జాతీయ అనే రెండు విధాలుగా ఎన్నికలు నిర్వహించారు.. నేడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందన్నారు. రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సంజీవ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారమేష్, అధ్యాపకులు కరుణాకర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి..
వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. చాలావరకు బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. అధికారులు ఆపిన బాల్యవివాహాల్లో ఎక్కువగా ఈ నంబర్‌కు అందిన ఫిర్యాదుల వల్లే. ఫోన్ చేసిన వారి పేరు, నంబర్ వెల్లడించే అవకాశం లేకపోవడంతో ఎవరైనా నిర్భయంగా సమాచారం అందించవచ్చు. –బి.రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి ● -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిమ్నాస్టిక్ పోటీల్లో బాలబాలికలు నువ్వా నేనా అన్నట్టు ప్రదర్శనలతో పోటీపడ్డారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్ వరంగల్ ఈనెల 5న వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలికకు వరుసకు మేనబావ అయిన 28 ఏళ్ల యువకుడితో వివా హం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగాఽ దికారులు బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు బాల్యవివాహంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వకంగా హామీ తీసుకుని బాలికను అప్పగించారు. నవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధి ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈనెల 14న ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ 16 ఏళ్ల బాలికకు 27 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని 1098 నంబర్‌కు రెండురోజుల ముందే సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు వెళ్లి అమ్మాయి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో బాలికను వారితో పంపించారు. -
వైద్య సేవలు వినియోగించుకోవాలి
ఎంజీఎం/ఎల్కతుర్తి: ప్రభుత్వాస్పత్రుల్లో అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. శుక్రవారం గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రెండుసార్లు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపునకు ఎంపికైందని తెలుసుకుని వైద్యాధికారిని అభినందించారు. అనంతరం ఆస్పత్రిలోని రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీ, వార్డు రూమ్స్, థియేటర్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో హైపర్‌టెన్షన్ 822, డయాబెటిస్ 448, కేన్సర్ ఇద్దరు.. వ్యాధిగ్రస్తులందరికీ ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆయూష్ మెడికల్ ఆఫీసర్ ఈశ్వర్ ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు ఆపిన బాల్య వివాహాల కేసుల వివరాలు
బాల్యం వివాహ బంధంలో బందీ అవుతోంది.. మూడుముళ్లతో ముక్కుపచ్చలారని బాలికల జీవితాన్ని ముడిపెడుతున్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి చట్టాలు ఉన్నా.. అవగాహనా రాహిత్యంతో కొందరు.. ఆర్థిక సమస్యలతో మరికొందరు బాల్య వివాహాలు చేస్తూ వారి బంగారు భవిష్యత్‌ను బుగ్గి చేస్తున్నారు.సాక్షి, వరంగల్ : ఆధునిక సాంకేతికత ఎంతో పెరిగింది. సమాజంలో పెనుమార్పులు వచ్చాయి. అయినా బాల్యవివాహాలు ఆగడం లేదు. ఆడపిల్లలు చదువులో రాణిస్తూ అన్నిరంగాల్లో దూసుకుపోయి సత్తా చాటుతున్నా ఇంకా పలుచోట్ల బలవంతపు వివాహాలు చేస్తూ బలి చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ తరచూ బాల్యవివాహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో 2023 సంవత్సరం 106 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకోగా.. ఈ ఏడాది ఏకంగా 140 వరకు నిరోధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా వెలుగులోకి రానివి అనేకం ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 18 ఏళ్లలోపు బాలికలు 26.8 శాతం మంది, 21 ఏళ్లలోపు బాలురు 20.3 శాతం మంది బాల్యవివాహాల బారిన పడుతున్నట్లు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆ కుటుంబాల్లోనే ఎక్కువ.. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయినప్పుడు బాలికలను భారంగా భావిస్తున్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు వారిని పెళ్లి పీటలెక్కిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అమ్మాయిలు బడికెళ్లి చదువుకుంటుండగానే మధ్యలో ఆపి మెడలో పసుపుతాడు వేసేందుకు పట్టుబడుతున్నారు. తండ్రి చనిపోయాడని, పేదరికం పట్టి పీడిస్తోందని, అందుకే అమ్మాయిల భారం దించేసుకోవాలని బాల్యవివాహాలు చేస్తున్నారు. ఇది నిరక్షరాస్యులైన కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వచ్చిన కేసులను అధికారులు పరిశీలిస్తే తెలుస్తోంది. తమ కులంలో ఆడబిడ్డలకు త్వరగా పెళ్లి చేయడమే సంప్రదాయమని చెబుతూ మైనర్లుగా ఉన్నప్పుడు మనువు కానిచ్చేస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. పెరుగుతున్న బాల్య వివాహాలు 2023లో 106.. ఈ ఏడాది ఏకంగా 140 అధికారులు ఆపినవి ఇవే అయితే.. అనధికారికంగా అనేకం ఉన్నాయి ఏటికేడు పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన తల్లిదండ్రుల్లో మార్పుతోనే అరికట్టే అవకాశం -
ట్రక్షీట్లు లేకుండా ధాన్యం దిగుమతి చేయొద్దు
దుగ్గొండి: ట్రక్షీట్లు లేకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు దిగుమతి చేసుకోవద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. గిర్నిబావిలోని గుణ లోకేశ్వర మిల్లును గురువారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్లలో ధాన్యం ఎందుకు తరలిస్తున్నారు, కాంట్రాక్టర్ లారీలు సమకూర్చడం లేదా అని ప్రశ్నించారు. ఐకేపీ నిర్వాహకులను పిలిపించి అక్కడిక్కడే ట్రక్షీట్లు రాయించారు. అనంతరం మైసంపల్లి, ముద్దునూరు, పోలారం, దుగ్గొండి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆమె వెంట సివిల్ సప్లయీస్ డీఎం సంధ్య, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఆర్ఐ రాంబాబు, మిల్లు యజమాని జంగా రాజిరెడ్డి, ఎంపీఎం రాజ్‌కుమార్, సమాఖ్య అధ్యక్షురాలు లలిత, సీసీలు, నిర్వాహకులు ఉన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలుర గురుకుల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబ ట్టారు. భోజనం ఎలా ఉంది, నూతన మెనూ పాటిస్తున్నారా లేదా అని అడిగారు. వంటలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ విషయంలో తప్పులు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య ఉన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి -
ప్రకృతి సేద్యం లాభదాయకం
● మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య వర్ధన్నపేట: ప్రకృతి సేద్యం లాభదాయకమని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య అన్నారు. మండలంలోని చంద్రుతండాలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహజ ఎరువులతో పంటలను సాగుచేయాలని సూచించారు. ఇందుకు ఆవుమూత్రం, పేడ, పాలు, పెరుగు తదితర వాటిని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా పప్పు దినుసుల పంటల సాగుతో నేలలో సారం పెరుగుతుందని వివరించారు. నేలలో నీటి నిల్వ తత్వాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్ రాజు విత్తన శుద్ధి, పంట వివిధ దశల్లో జీవామృతం, చీడపీడల నివారణకు వేప కషాయం, పొగాకు కషాయం, పచ్చిమిర్చితో తయారు చేసిన మిశ్రమాలను తెగుళ్లు, పురుగుల నివారణకు ఉపయోగించే విధానాన్ని వివరించారు. రైతులు సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తిచేశారు. కార్యక్రమంలో 100 మంది రైతులు పాల్గొన్నారు. -
‘తోడు’ వీడి.. నింగికేగి
సాక్షి, వరంగల్/దుగ్గొండి: సంచార జాతినుంచి యక్షగానంతో సినీ తెరకు పరిచయమైన బలగం మొగిలయ్య ఇక లేరు.. ఆయన తంబూర మూగబోయింది.. కిడ్నీలు ఫెయిలై, గుండె సమస్య రావడం, కంటి చూపు కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలతో మూడేళ్లుగా బాధ పడుతున్న పస్తం మొగిలి అలియాస్ బలగం మొగిలయ్య (67) వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం ఆరోగ్యం విషమించింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు బ్యానర్‌పై దర్శకుడు యెల్డండి వేణు నిర్మించిన బలగం సినిమాలో చివరి ఘట్టంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నిలిచి’ అనే పాట పాడి కోట్లాది మంది ప్రజల హృదయాలకు దగ్గరైన మొగిలయ్య ఓరుగల్లుకే బలగమయ్యారు. పలువురు కళాకారులు, గ్రామస్తులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. దహన సంస్కారాల కోసం ఆర్థిక సాయం.. మొగిలయ్య మృతి వార్త తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.50 వేలు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.50వేలు ఆర్థికసాయం పంపించారు. వారి ప్రతినిధులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, ఎల్కతుర్తి మండల నాయకుడు బొమ్మెనపల్లి అశోక్‌రెడ్డి.. మొగిలయ్య భార్య కొమురమ్మకు అందించారు. మొగిలయ్య మృతదేహాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతి జానపద కళకు తీరని లోటన్నారు. ప్రభుత్వం మొగిలయ్య కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ, నర్సంపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బలగం సినిమా నటుడు రచ్చ రవి, పలువురు కళాకారులు సంతాపం ప్రకటించారు. సాయంత్రం పలువురు కవులు, కళాకారులు పాటలతో మొగిలయ్యకు నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ‘బలగం’ మొగిలయ్య ఇక లేరు తోడుగా మాతో ఉండి పాటతో పేరు ప్రఖ్యాతలు కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం.. దుగ్గొండిలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి పాటలతో నివాళులర్పించిన కళాకారులు ఓరుగల్లుకే పేరు తెచ్చారు.. దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలి(67), కొమురమ్మ దంపతులు బేడ బుడిగ జంగాలు. శార్థకథ కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి పూర్వీకులది కమలాపూర్ మండలం అంబాల కేశవాపురం. మొగిలి తల్లిదండ్రులు పస్తం పెంటయ్య, ముత్తమ్మ ఉపాధి కోసం మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురం గ్రామాల్లో కొన్నాళ్లు ఉండి 30 ఏళ్ల క్రితం దుగ్గొండికి వచ్చి స్థిరపడ్డారు. మొగిలి తన భార్యతో కలిసి గ్రామాల్లో కథలు చెప్పి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణుకు పస్తం మొగిలిని ఒగ్గుకథ కళాకారుడు కాయితి బాలు పరిచయం చేశారు. అలా బలగం సినిమాలో మొగిలయ్యతో పాడించిన ‘తోడుగా మాతో ఉండి... నీడగా మాతో నడిచి’ అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఈ పాటతో మొగిలి, కొమురమ్మ దంపతులకు పేరు ప్రఖ్యాతలు రావడంతోపాటు వరంగల్ జిల్లా పేరు మార్మోగింది. ఇటీవల పొన్నం సత్తయ్య ఫౌండేషన్ అవార్డును మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉనికిచర్లలో ఇంటిస్థలాన్ని కేటాయించారు. పట్టా కాగితాలు అందుకునే తరుణంలోనే మొగిలయ్య కన్నుమూశారు.