ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి
కేయూ క్యాంపస్: ఎన్నికల నిర్వహణ విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి అన్నారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే అంశంపై శుక్రవారం కళాశాలలోని సామాజిక శాస్త్రాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భారతదేశం పెద్ద ప్రజా స్వామిక వ్యవస్థ.. గడిచిన 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో అనేక సంస్కరణలు వచ్చాయి.. ప్రాంతీ య, జాతీయ అనే రెండు విధాలుగా ఎన్నికలు నిర్వహించారు.. నేడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందన్నారు. రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సంజీవ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారమేష్, అధ్యాపకులు కరుణాకర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment