Wives
-
#Shalini Passi లేటెస్ట్ సిరీస్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా సెన్సేషన్ (ఫోటోలు)
-
భార్యలే తాగుడు మాన్పించాలి: చంద్రబాబు
కర్నూలు (సెంట్రల్): నాణ్యమైన మద్యాన్ని మరో పది రోజుల్లో అందుబాటులోకి తెచ్చి రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు భర్తలు మద్యం తాగకుండా భార్యలే చర్యలు తీసుకోవాలని, రూ.100 కోట్లతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్యం షాపుల కేటాయింపులో శెట్టి బలిజలు, ఈడిగ, గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజా వేదికలో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణలు చేశారు. వలంటీర్లు లేకుండానే ఒక్క రోజులోనే నూటికి నూరు శాతం పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వలంటీర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాయలసీమను గీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా తీర్చిదిద్ది 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని, అయితే ఎక్కడ ఇవ్వాలో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో 2,650 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడ దాదాపు రూ.1,200 కోట్ల పెట్టబడులతో 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలు–బళ్లారి రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఉద్యోగులు పనిచేయలేదు... మీరంతా 95 నాటి సీబీఎన్‌ను చూస్తారని, తాను పరుగెత్తుతూ మిమ్మల్ని పరిగెత్తిస్తానని అధికారులనుద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఉన్నతాధికారులు ఏమీ పనిచేయలేదని, వారి పనితీరు తెలుసుకునేందుకు త్వరలో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు రూ.2 లక్షల ఆరోగ్య బీమా పరిధిలోకి వర్తిస్తారని, మిగిలిన వారికిమాత్రమే ఆరోగ్యశ్రీని ప్రస్తుతం ఉన్నట్లు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్‌పై నియమించిన వన్ మ్యాన్ కమిటీ నివేదికను కేంద్రానికి పంపినట్లు చెప్పారు. మదాసి/మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ల జారీ, బోయల సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. పుచ్చకాయల మాడ నుంచి హోసూరు, పత్తికొండ, మద్దికెరకు రోడ్లు వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎంకు మొర పెట్టుకోగా అవి మాత్రం అడగవద్దని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. తన భర్త ఏమీ పని చేయడంలేదని, ఏమైనా పెన్షన్ ఇవ్వాలని ఓ మహిళ కోరగా.. ముందు ఆయనతో పనిచేయించుకోవాలని సీఎం సూచించారు. ముందు రోజు నుంచే ఆంక్షలు సీఎం చంద్రబాబు పర్యటనకు ఒక్క రోజే ముందే పోలీస్ ఆంక్షలు అమలయ్యాయి. సీఎం మధా్నహ్నం గ్రామానికి చేరుకోగా మంగళవారం ఉదయం నుంచే ప్రజలను ఇళ్ల ఉంచి బయటకు రానివ్వలేదు. పొలం పనుల కోసం వెళ్లిన వారిని గ్రామంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆధార్ కార్డు చూపాలంటూ ఇబ్బందులకు గురి చేశారు. -
బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్‌పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అయితే ఇది చూసిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్లో రాసుకొచ్చింది.దేవోలీనా తన ట్విటర్లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' అని చురకలు అంటించింది.'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే.. మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు బిగ్ బాస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.Do you think this is entertainment? This is not entertainment, it's filth. Don't make the mistake of taking this lightly because it's not just a reel, it's real. I mean, I can't even understand how anyone can call this shamelessness entertainment ? I feel disgusted just hearing… https://t.co/BVeVjGrTm2— Devoleena Bhattacharjee (@Devoleena_23) June 22, 2024 -
భర్తలు జైల్లో.. భార్యలు రాజకీయాల్లో..
మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్‌సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..
ఓ సంగీత కళాకారుడు తన ఐదుగురు భార్యలు ప్రెగ్నెంట్ అంటూ శ్రీమంతానికి ఆహ్వానించాడు. అందరూ రావాంటూ ఒక వ్యక్తి ఐదుగురు భార్యలు నవజాత శిశువులను ఆహ్వానించనున్నాం అంటూ ఇన్విటేషన్లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో న్యూయార్క్ నగరానికి చెందిన జెడ్డీ వీల్ అనే 22 ఏళ్ల సంగీత కళాకారుడు జనవరి 14న క్వీన్స్‌లో తన ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భవతులయ్యారని వారికి శ్రీమంతం నిర్వహిస్తున్నాని పేర్కొన్నాడు. ఆ వేడకకు అందరూ రావాలంటూ తన భార్యలో కూడిన ఫోటోను షేర్చేశాడు. పైగా సోదరీమణుల వేడుక అనే క్యాప్షన్ కూడా ఇచ్చిమరీ పోస్ట్ చేశారు. తాము ఒకరి జీవితాన్ని ఒకరు నాశనం చేసుకోమని ఎంతో కలిసి కట్టుగా ఆనందంగా ఉంటామని పోస్ట్‌లో రాసుకురావడం విశేషం. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. ఇది చాలా ఇబ్బందికరమైన రిలేషన్‌గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Lizzy Ashliegh (@lizzyashmusic) (చదవండి: విలాసవంతమైన భవనం అతని డ్రీమ్..సడెన్ మర్డర్ కేసు..ఎవరూ చంపారన్నది నేటికి మిస్టరీనే!) -
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్‌సమంద్, చిత్తోడ్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ప్రతాప్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
జార్ఖండ్‌లోని రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! -
ఇంటి పనిలో భర్తలు సహకరించడం లేదా? యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం!
లంకంత ఇల్లు. ఇంటికి సరిపోయేంత జనం. బండెడు చాకిరీ నవ్వుతు చేస్తున్నాం. సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాం. మేం ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఇలా ఊపిరి సలపనంత పనితో సతమతమవుతున్నాం. భర్తలు సైతం ఇంటి పని, వంట పని పిల్లలు స్కూల్ బాధ్యతల్ని చూసుకుంటే బాగుంటుంది. కానీ అది కలగానే మిగిలిపోతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ తరుణంలో స్పెయిన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చూపేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంది. ఇంటి పని, వంట పనిలో భర్త సాయం చేస్తున్నారా? లేదా అని పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.ఆ యాప్ ఇంట్లో భార్యలకు భర్తల సహకారం ఎలా ఉందో గుర్తిస్తుంది. జెనీవాలో జరిగిన సమావేశంలో స్పెయిన్ విదేశాంగ కార్యదర్శి నాజీల రోడ్ర్గెజ్ ఉచితంగా ఓ యాప్‌ను ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఇంట్లో బాధ్యతల్ని మోసే మహిళల ‘మానసిక భారాన్ని’ పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు ఇంట్లోని ఇతర కుటుంబసభ్యుల సహకారం అవసరం. తద్వారా ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకునేలా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో భార్య, భర్తల్లో ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు? ఎవరు తక్కువ పనిచేస్తున్నారనే విషయాల్ని మేం లాంచ్ చేసిన యాప్ ఇట్టే కనిపెట్టేస్తుందని అన్నారు. అయితే, ఈ యాప్‌తో ముందుకు వచ్చిన స్పెయిన్ నిర్ణయం పట్ల పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి యాప్స్ వల్ల ఇంటి పని ఎగ్గొట్టే భర్తలు ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. మొత్తానికి ఈ యాప్ ఆలోచన బాగుంది. కానీ ఇంట్లో పనికి సహకరించిన భర్తలపై స్పెయిన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయంపై నాజీల రోడ్ర్గెజ్ స్పష్టత ఇవ్వలేదు. -
సైనికుల భార్యలే అత్యాచారాలు చేయమనడం దారుణం!
లండన్: ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ.. రష్యా సైనిక కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ ఒలెనా ఆక్రోశించారు. సంఘర్షణ సమయంలో జరుతుగున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం లండన్‌లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో ఒలెనా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి రష్యా బలగాలు ఇలా బహిరంగంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. యుద్ధ సమయంలో లైంగిక వేధింపులనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలా మృగంలా పాశవికంగా ప్రవర్తించి తమ గొప్పతనాన్ని చాటుకోవడం అమానుషం అని రష్యా దళాలపై ఒలెనా విరుచుకుపడ్డారు. యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉండదని, ఇదే అదనుగా చేసుకుని మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోవడం అనేది అనైతికం అన్నారు.అంతేగాదు రష్యా బలగాలు దీన్ని ఒక అతిపెద్ద ఆయుధంగా, తమ ఇష్టరాజ్యంగా ఉపయోగిస్తున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా స్పందన రావాలన్నారు. దీన్ని యుద్ధ నేరంగా గుర్తించి, నేరస్తులందర్నీ జవాబుదారీగా చేయడం అత్యంత ముఖ్యం అని ఒలెనా అన్నారు. (చదవండి: యుద్ధ సమయంలో ఆఫ్రికన్ దేశాలకు ఉక్రెయిన్ చేయూత) -
ఆమెకు రూ.10కోట్లు కావాలి అందుకే ఇలా...: కాంగ్రెస్ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్.. భార్య ఫిర్యాదు మేరకు గృహహింస, అత్యాచారం, బెదిరింపులు వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఉమంగ్ భార్య తన ఇంటి సహాయకురాలి భర్త పేరుతో కూడా ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఆయన సహజీవనం చేసిన సోనియా భరద్వాజ్ ఆత్మహత్యలో కూడా ఉమంగ్ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై నౌగోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐతే ఆ ఆరోపణలన్నింటిని ఖండించారు ఉమంగ్. తన భార్య తనను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పారు. తనను మానసికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నవంబర్2న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉమంగ్‌కు గతంలో కొంతమంది భార్యలు ఉన్నారని అన్నారు. ఐతే ఉమంగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తిమంతమైన గిరిజన నాయకుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి జమునాదేవి మేనల్లుడు కూడా. గత కమల్ నాథ్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమంగ్ ప్రస్తుతం గంద్వాని స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (చదవండి: దాహమేసి నీరు తాగిందని.. గోమూత్రంతో వాటర్ ట్యాంక్ శుభ్రం!) -
భార్యలతో కలిసి టీమిండియా ఆటగాళ్ల షికార్లు.. ఫొటోలు వైరల్
-
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. కిడ్నాప్ డ్రామాతో జైలుపాలు
ముంబై: ఇద్దరు భార్యలున్నా తనను పట్టించుకోవట్లేదని సూపర్ ప్లాన్ వేశాడు ఓ భర్త. తాను కన్పించకపోతే వాళ్లే వెతుక్కుంటూ వస్తారని భావించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్‌తో కిడ్నాప్ డ్రామా ఆడాడు. అంతా పథకం ప్రకారమే జరిగినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోయాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్‌లో ఈ ఘటన జరిగింది. వివారాల్లోకి వెళ్తే.. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి పేరు సందీప్ గైక్వాడ్. మొదటి పెళ్లి విషయం దాచి సునీత గైక్వాడ్‌ను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు భార్యలు ఇతడ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. మొదటి భార్య దూరంగా ఉంటోంది. అయితే అక్టోబర్ 14న సునీతతో కలిసి దిలీప్ ఓ రోడ్డుపై స్కూటీని పార్కు చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని కొట్టి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత ఆ ఆటో ఎక్కడుందో ట్రేస్ చేశారు. దిలీప్‌ను, అతనిపాటు ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విచారణలో సునీత తల్లే.. దిలీప్‌ను కిడ్నాప్ చేయమని చెప్పిందని, అతడ్ని తన బిడ్డ నుంచి దూరం చేయాలనే ఇందంతా చేసిందని ముగ్గురూ చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి కచ్చితమైన వివరాలతో మరోసారి విచారించగా అప్పుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. తామంతా స్నేహితులమని, దీలిప్ తన భార్యల సింపతీ కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా! -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట
Brazilian Model Arthur O Urso Wants To Marry Two More: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా ఉంది అతగాడి తీరు. ఒకరికి డబ్బు పిచ్చి ఉంటుంది. మరొకొందరికి సినిమాల పిచ్చి.. ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఇతగాడికి మాత్రం భార్యల పిచ్చి ఉంది. ఒక భార్యతోనే వేగలేకపోతున్నామని గగ్గోలు పెడుతుంటారు ఫ్యామిలీ మ్యాన్లు. ఇతగాడు మాత్రం 'నాకు ఒక్కరు సరిపోరు పది మంది కావాలంటూ' కోరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు అంటే.. బ్రెజిల్‌కు చెందిన యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతోంది. ఎందుకంటే ఆర్థర్ ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా వారి అంగీకారంతోనే. 9 మంది భార్యలతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్థర్. ఆ ఫొటో కాస్తా వైరల్ కావడంతో ఫేమస్ అయ్యాడు మనోడు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఆర్థర్. ఇప్పటివరకు అతడితో అన్యోన్యంగా ఉన్న 9 మంది భార్యల్లో ఒకరు ఆర్థర్‌కు షాక్ ఇచ్చింది. ఆర్థర్ 9 మంది భార్యల్లో ఒకరైన అగాథ.. ఉర్సో నుంచి విడాకులు కోరిందట. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటుందని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేకపోవడంతో విడాకులకు అంగీకరించానని ఉర్సో చెప్పుకొచ్చాడు. 'నేను ఆమెకు మాత్రమే సొంతమట. ఇంకేవరితో నేను ఉండకూడదట. ఇదేమన్నా బాగుందా. మనం పంచుకోవాలి. మేము విడిపోతున్నందుకు బాధగానే ఉంది. కానీ ఆమె చెప్పిన కారణం నాకు షాకింగ్‌గా ఉంది.' అని తెలిపాడు బ్రెజిల్ యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. అంతేకాకుండా తన జీవితంలో 10 మంది భార్యలు ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు ఆర్థర్. అయితే ఇప్పుడే తన భార్య స్థానాన్ని భర్తీ చేయనని.. కానీ త్వరలోనే ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే అతడికి తన ప్రతీ భార్య పట్ల సమానమైన ప్రేమ ఉంటుదన్నాడు. ఈ యంగ్ మోడల్‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇదివరకు ఈ 9 మందితో జరిగిన తన వివాహానికి బ్రెజిల్‌లోని సోవో పావోలో చట్టబద్దత లేదు. ఆ దేశంలో బహుభార్యత్వం చట్ట విరుద్ధం. -
"భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!
Malaysian female minister Said husbands to 'gently' beat 'unruly' wives: అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మాట్లాడేటప్పుడూ కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. ఇక్కడొక మహిళా డిప్యూటీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయంలోకెళ్తే... మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేసియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా క్రమశిక్షణ నిమిత్తం వారిని సున్నితంగా కొట్టాలని కూడా చెప్పారు. అందువల్ల అతను తన భార్య ఎంతగా మారాలనుకుంటున్నాడో ఆమెకు స్పష్టంగా తెలుస్తుందని కూడా మహిళా డిప్యూటీ మంత్రి సిటి జైలా మహ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు మదర్స్ టిప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు కూడా. ‘మొండిగా వ్యవహరిస్తున్న భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అలా కుదరనప్పుడూ సున్నితంగా వారిని కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండండి. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల’ని భర్తలకు మహ్మద్ యూసఫ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!
సాక్షి, తూర్పుగోదావరి : భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది. చింతూరు ఎస్ఐ సురేష్ బాబు కథనం ప్రకారం.. చట్టిలో నివసముంటున్న కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు. ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది. అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ -
స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎస్ కర్ణన్ అరెస్ట్
చెన్నై: సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పాండిచ్చేరి కర్ణన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణన్ మహిళలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు మాజీ జస్టిస్ కర్ణన్ న్యాయవ్యవస్థలోని మహిళా సిబ్బందిపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేయడమే కాక సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేశారు. అంతేకాక కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో కొందరి పేర్లను కూడా వీడియాలో వెల్లడించారు. 2017 లో, కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న కాలంలో, జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణన్ తన జైలు శిక్ష అనుభవించారు. -
ఒక్కడి కోసం భార్యలమంటూ ఐదుగురు వచ్చారు
డెహ్రడూన్: చనిపోయిన ఓ వ్యక్తికి భార్యనంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు ఆస్పత్రికి వచ్చిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హరిద్వార్, రిషికూల్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ ఆదివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి భార్య స్థానికులు సాయంతో సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ.. సదరు లారీ డ్రైవర్ మృతి చెందాడు. అతడు సోమవారం ఉదయం 4 గంటలకు చనిపోయాడు. అతడితో పాటు వచ్చిన మహిళ ముందుగానే భార్యను అని చెప్పుకుంది. ఆ తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మరో నలుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు తాము లారీ డ్రైవర్ భార్యలమంటూ ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాన్ని తమకు అప్పగిస్తే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో గందరగోళం ఏర్పడింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను ఒక్కొక్కరిని పిలిచి విచారించగా వారంతా సదరు లారీ డ్రైవర్‌కు భార్యనని తెలిపారు. దాంతో పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాల్సిందిగా కోరారు. తమ దగ్గర అలాంటివి ఏం లేవన్నారు. అంతేకాక అంత్యక్రియలు నిర్వహించడం కోసం మృత దేహాన్ని తమకు అప్పగించమంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. దాంతో ఈ సారి తల పట్టుకోవడం పోలీసుల వంతయ్యంది. చివరకు ఐదుగుర్ని కలిసి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా పోలీసులు సూచించారు. అందుకు ఆ మహిళలు కూడా అంగీకరించిడంతో.. పోలీసులు లారీ డ్రైవర్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో సమస్య పరిష్కారమయ్యింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
భర్తను ఉరేసి చంపిన ఇద్దరు భార్యలు..
హైదరాబాద్: ఓ వ్యక్తి ఒక్కరిని కాకుండా ఇద్దరి భార్యలను కట్టుకున్నాడు. వారిని ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేసేవాడు. చివరికి అతను ఇద్దరి భార్యల చేతిలో హతమయ్యాడు. నగర శివారులోని జగద్గరిగుట్టలోని అస్బెస్టాస్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. మహేందర్ యాదవ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. కాగా.. తన ఇద్దరు భార్యలు జ్యోతి, పద్మలను మహేందర్ ఇటీవల వేధింపులకు గురిచేసేవాడు. రోజూ కూలి పని చేసి మద్యం సేవించి ఇంటికి వచ్చి మహేందర్ భార్యలను కొట్టేవాడు. శనివారం రాత్రి కూడా కొట్టడంతో అతని బాధ నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక్కటైయ్యారు. ఇద్దరు భార్యలు కలిసి భర్తకు ఎదురు తిరిగి చున్నీని గొంతకు బిగించి హత్య చేశారు. అతడు మృతి చెందలేదన్న అనుమానంతో కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ గోవర్ధన్, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఐదు మంది కొడుకులు ఉన్నారు. -
ఇక్కడ భార్యలతో షాపింగ్ కు భర్తలు ‘క్యూ’..
షాపింగ్ వెళ్దాం అండీ.. అని భార్య అడగగానే ఏ భర్త అయినా ఏదో వంక చెప్పి తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ల షాపింగ్ త్వరగా పూర్తవ్వక భర్త సహనానికే పరీక్షగా నిలుస్తుంది. అయితే ఈ సమస్యను క్యాచ్ చేసుకున్నారు మన పొరుగు దేశం చైనా వాళ్లు. ఏంలేదండి.. భార్యలు మాల్ అంతా తిరుగుతూ షాపింగ్ చేస్తుంటే భర్తలకు టైంపాస్ అయ్యే వినూత్న పథకం వేశారు. బహుళ గాజు గదిలను ఏర్పాటు చేసి అందులో ఒక కంప్యూటర్, కుర్చీ, గేమ్ ప్యాడ్ ను సిద్దం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే గేమింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. అయితే మన దగ్గర గేమింగ్ జోన్లలా కాకుండా ఒక్క గేమింగ్ జోన్ లో 1990 గేమ్ లు ఆడవచ్చంటా.. అయితే ఈ సర్వీస్ ను ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నామని.. భవిష్యత్తులో కొంత చార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నారు ఆ షాపింగ్ మాల్ల పనిచేసే ఉద్యోగులు. ఈ మాల్ కు భార్యలతో షాపింగ్ కు వచ్చిన భర్తలంతా మాల్ ఐడీయా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాంగ్ అనే ఒకాయన అయితే తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంబూరపడ్డాడు. ఇంకో ఆయన ఈ ఆలోచన బాగుంది.. కానీ గేమింగ్ జోన్ లో ఏసీ లేదు.. వెంటిలేషన్ లేదు గాలి రాక ఇబ్బందిపడ్డా అన్నాడు. ఇదంతా ఏ షాపింగ్ మాల్ లో అబ్బా అనుకుంటున్నారా..? అదే చైనా షాంఘై పట్టణంలోని గ్లోబల్ హర్భర్ మాల్ వారు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.. ఈ ప్లాన్ మనదేశం షాపింగ్ మాల్ లో కూడా చేస్తే బాగుండు కదా...! మీరు మీ భార్యలతో షాపింగ్ కు ‘క్యూ’ కడుదురు..! -
వీరి కాలిన గాయాలకు ‘చికిత్స’ లేదా?
చెన్నై: గహ హింసను తట్టుకోలేక క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందామన్న ప్రయత్నంలో కాలిన గాయాలతో జీవితాంతంత బాధపడుతూ బతికే భార్యలెందరో నేటి సమాజంలో! భర్తలే కిరోసిన్ పోసి భార్యను తగులబెట్టబోతే అదష్టవశాత్తు బతికి బట్టకట్టినా రేగిన గాయాలు రేపే బాధలను తట్టుకోలేక తల్లడిల్లే తరుణులెందరో! నైలాన్ చీరకట్టుకొని వంట చేస్తుంటే పొయ్యిలో నుంచి రేగిన నిప్పురవ్వలు లేదా గ్యాస్ స్టవ్ లీకేజీ వల్ల ఎగిసిన మంటలకు ఒళ్లంత కాలిపోతే తనువంతా పుండై బతుకును భారంగా గడిపే ఇల్లాళ్లు ఎందరో! అధికారిక లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70 లక్షల మంది మహిళలు మంటల్లో చిక్కుకుని గాయపడుతున్నారు. వారిలో దాదాపు 1.40 లక్షల మంది మరణిస్తున్నారు. ఏడు లక్షల మంది ఆస్పత్రుల్లో చే రుతున్నారు. ఒక్క చైన్నైలోని కిల్పాక్ వైద్య కళాశాల ఆస్పత్రి ప్రత్యేక విభాగంలో ఏటా మూడు వేల మంది కాలిన గాయాలతో చేరుతున్నారు. ఇలాంటి కేసుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది మహిళలు గహ హింస కారణంగానే మంటల్లో చిక్కుకుంటున్నారు. క్షణికావేశానికిలోనై వారంతట వారు ఆత్మహత్యలకు ప్రయత్నంచడం లేదా భర్త లేదా అత్తింటివారు కిరోసిన్‌పోసి తగులబెట్టడం వల్ల మంటల్లో చిక్కుకుంటున్నారు. కానీ 90 శాతం కేసులు ప్రమాద కేసులుగానే నమోదవుతున్నాయి. అత్తింటివారిపై ఆత్మహత్యలకు ప్రోత్సహించారన్న కేసులు కూడా దాఖలు కావడం లేదు. ఇక గాయపడిన వారి మహిళల జీవితాలు చాలా దుర్భరం. చర్మం కాలిపోవడం వల్ల లోపలి అవయవాలు కూడా కాలిపోతాయి. కొన్ని కమిలిపోతాయి. నరాలు వంకర్లు పోతాయి. కొన్ని బిగుసుకుపోతాయి. ఫలితంగా శరీరంలో కొన్ని అవయవాలు పనిచేస్తాయి. కొన్ని అచేతనం అవుతాయి. మంటల వేడికి వంకర్లు తిరిగిపోయిన కాళ్లు, చేతులు, ముంచేతులు, మొకాళ్లు, మెడలు సరిగ్గా పనిచేయకపోవడమే కాకుండా చికిత్స తీసుకునేంతకాలం, చచ్చిన శవాల్లా మంచాలకు వివిధ భంగిమల్లో కరుచొని ఉండాల్సిన దుర్భర పరిస్థితి కూడా చాలా మందికే దాపురిస్తుంది. ఈ శారీరక నరకయాతనను అనుభవించడమే కాకుండా మానసికంగా అంతులోని ఆందోళనను, వ్యధను భరించాల్సి ఉంటుంది. పుట్టింటివారు, మెట్టింటివారే కాకుండా ఇరుగుపొరుగు వారు తనను ఎలా చూస్తారన్న ఆత్మన్యూన్యతా భావం, సమాజంలో తలెత్తుకొని ఎలా బతకాలి, ఎలా తిరగాలనే వారి ఆవేదన, ఆందోళనలకు అంతుండదు. ఆస్పత్రి నుంచి ఇల్లు చేరిన వారు వల్లకాడు చేరినట్లు, ఇంట్లోకి రానిచ్చేవారు లేక అనాథాశ్రయాల అరుగులు ఎక్కేవారి ఆక్రందనల గురించి ఎక్కువగా చెప్పలేం. ఇలా గహ హింస కారణంగానే ఒళ్లు కాల్చుకుంటున్న తల్లులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నది ఇప్పుడు వారిని వారి గాయాలకన్నా ఎక్కువగా తొలుస్తున్న ప్రశ్న. యాసిడ్ దాడులకు గురై అంగవికలురవుతున్న బాధితులను ‘పర్సనాలిటీ విత్ డిసేబుల్డ్ యాక్ట్’ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. దీనికోసం 1995 నాటి పీడబ్లూడీ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్రం 2016లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం కింద అంగవికలురకు ఎలాంటి సదుపాయాలు వర్తిస్తాయో యాసిడ్ దాడికి గురైన వారికి అలాంటి సదుపాయాలు వర్తిస్తాయి. నిర్భయ చట్టం కింద కూడా యాసిడ్ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. 2013లో క్రిమినల్ లా చట్టంలో తీసుకొచ్చిన సవరణల ప్రకారం 326ఏ, 326బీ సెక్షన్ల కింద యాసిడ్ దాడి కేసులను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తున్నారు. అలాగే ఇప్పుడు మంటల్లో చిక్కుకున్న బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆత్మహత్యలకు కారకులైన వారిపై హత్యాయత్నం కేసులు బనాయించాలని వారు కోరుతున్నారు. అత్తింటి వారి ఒత్తిళ్లకు లొంగి ప్రమాదవశాత్తు చీరంటుకొని గాయపడినట్లు నమోదవుతున్న కేసులను ఎప్పుడైనా తిరగతోడడానికి, బాధితులు ఎప్పుడైనా తమ వాంగ్మూలాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించాలని వారి తరఫున పలు ఎన్జీవో సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
భార్యల పోరు తట్టుకోలేక..
– మనస్తాపంతో భర్త ఆత్మహత్య – సూర్యాపేట మండల పరిధిలో ఘటన సూర్యాపేటరూరల్ ఇద్దరు భార్యల పోరును తట్టుకోలేక ఓ భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం బాలెంల ఆవాసం యర్కలతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యర్కలతండాకు చెందిన భూక్యా లింగయ్య(35) 2003వ సంవత్సరంలో పట్టణ పరిధి బలరాంతండాకు చెందిన మంజులను వివాహం చేసుకున్నాడు. బాబు జన్మించినంత వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం మనస్పర్థలు రావడంతో మంజుల భర్త లింగయ్యతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లింగయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం చివ్వెంల మండలం మున్యానాయక్‌తండాకు చెందిన సునితను రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే లింగయ్య మెుదటి భార్య మంజులకు చెందిన వ్యవసాయభూమి యర్కలతండాలో ఉంది. అప్పుడప్పుడు మంజుల తండాకు వెళ్లిన సమయంలో సునితతో గొడవపడేది. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరికీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. విషయాన్ని సునిత భర్త లింగయ్యతో చెప్పడంతో ఆమెపైనే చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యల పోరుతో మనస్తాపం చెందిన లింగయ్య బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేరసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం గమనించిన కుటుంబసభ్యులు గమనించడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. లింగయ్య తండ్రి పంతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తమ భర్తలతో అక్రమ సంబంధం పెట్టుకుందని..!
మాస్కో: తన భర్తతో మరో మహిళ చనువుగా ఉండటాన్ని ఏ మహిళా సహించలేదు. అది ఇండియాలో అయినా.. రష్యాలో అయినా.. ఎక్కడయినా సరే. తమ భర్తలతో అక్రమ సంబంధం నడుపుతున్న ఓ మహిళపై ఇద్దరు మహిళలు తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఇద్దరు రష్యన్ మహిళలు.. ఆమెను చితకబాదారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. ఇదంతా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. క్రిమియాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. ఆ మహిళను వివస్త్రను చేసి కొట్టుకుంటూ వీధుల్లో తిప్పారు. చిన్న పిల్లలు కూడా ఉన్న ఆ వీధుల్లో మహిళపై పాశవికంగా దాడి చేయటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈ ముద్దు గుమ్మల పేరిట డబ్బు దాచారు
పనామా: పన్నుపోటులేని స్వర్గసీమగా వాసికెక్కిన పనామాలో వందల కోట్ల రూపాయల నల్లడబ్బును దాచుకున్న వివిధ రంగాల ప్రముఖుల గుట్టురట్టవుతున్న విషయం తెలిసిందే. వీరిలో సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతోపాటు దేశాధినేతలు కూడా తమ భార్యల పేరిట నల్లడబ్బును దాచుకున్నారు. కొంత మంది ప్రేయసిల పేరిట కూడా డబ్బుదాచారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలయేవ్ భార్య షాంపేన్ లవింగ్ సోషలైట్ మెహ్రిబాన్ అలియేవ పేరిట, గినియా అధ్యక్షుడు మమాడి టూర్ భార్య లాన్యానా కాంట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ భార్య, ప్రొఫెషనల్ ఐస్ డేన్సర్ తతియాన నావ్కా, ఐస్లాండ్ ప్రధాన మంత్రి సిక్ముందర్ డేవిడ్ భార్య అన్నా సికుర్లాగ్ పేరిట కోట్లాది రూపాయల నల్లడబ్బును దాచారు. భార్య నుంచి విడాకులు పొందే సమయంలో ఈ డబ్బు భార్యకు దక్కకుండా భర్త తన పేరు మీదకు మార్చుకునే వెసలుబాటును కూడా న్యాయ సహాయక సంస్థ మొసాక్ ఫోన్సేకా కల్పిస్తోంది. దీనికి చేయాల్సిందల్లా విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో భర్త చిన్న దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రేయసి పేరు మీదున్న సొమ్మును కూడా బదిలీ చేసుకునే అవకాశం ట్రస్టుల ద్వారా కల్పిస్తుండడంతో ఎక్కువ మంది ప్రముఖులు ప్రేయసిల పేరుతో కూడా నల్ల డబ్బు ఖాతాలను తెరిచారు. -
రోజుకు వందమంది భార్యా బాధితులు!
ఇండియాలో రేప్ కేసులకు ప్రధాన కేంద్రంగా మారిపోయిన ఢిల్లీలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగు చూసింది. మహిళల వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఈ కొత్త లెక్కలు చెప్తున్నాయి. బాధల్లో ఉన్న పురుషుల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 40 ఎన్జీవో సంస్థల ద్వారా సుమారు 37 వేల ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఫిర్యాదుల్లో కొన్ని బోగస్ అయినా... రోజుకు సుమారుగా వంద కాల్స్ వస్తున్నాయని హెల్ప్ లైన్ లెక్కల్లో తేలింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరున ఓ సంస్థ నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో చాలామంది బాధితులు తమకు చట్టబద్ధమైన పరిష్కారాలు దొరకడం లేదని చెప్పడం విశేషం. లైంగిక వేధింపులకు గురైన మగవారికి ఇండియన్ యాంటీ రేప్ చట్టం ఎటువంటి పరిష్కారం సూచించడం లేదని కౌన్సిలర్లు చెప్తున్నారు. రోజుకు దేశవ్యాప్తంగా ఫాల్స్ రేప్, ఫాల్స్ డౌరీ కేసుల్లో తమకు వస్తున్న సుమారు 110 కాల్స్ లో 65 నుంచి 70 శాతం బాధితులు కొత్తవారే అయి ఉంటున్నారని ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ రిత్విక్ బిసారియా చెప్తున్నారు. తమకు వచ్చే డేటాను పరిశీలిస్తే ఎక్కువ శాతం కాల్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్నాయని, వాటిలో 55 నుంచి 60 శాతం హెల్ప్ లైన్ కు వస్తున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచీ వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు వరకట్న వేధింపుల కేసులు ఉంటున్నాయని మరో కౌన్సిలర్ అమిత్ లఖాని అంటున్నారు. అంతేకాక ఎస్.ఐ.ఎఫ్ కు వచ్చే పురుషుల కాల్స్ లో ఎక్కువ శాతం పని ప్రదేశాల్లో లైంగిక దాడులకు సంబంధించినవి కూడా అయి ఉంటున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ''ఒక వ్యక్తి నుంచీ మాకు కాల్ వచ్చింది. అతడి భార్య.. అతడు పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేసి... అతడిపై వేధింపుల కేస్ ఫైల్ చేసినట్లు చెప్పిందట. దాంతో సంస్థవారు అతడ్ని ఎటువంటి వివరాలు అడక్కుండానే రిజైన్ చేయమన్నారు'' అంటూ ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ లఖాని తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదిగా ఉన్న కులదీప్ బొబ్బర్ కూడా... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న భార్యా బాధితుల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సుమారు పది సంవత్సరాలుగా కనీసం నెలకు 50 నుంచి 60 కాల్స్ బాధితులనుంచి వస్తుంటాయని ఆయన చెప్పారు. ''ఇంటినుంచీ గెంటివేయబడ్డ ఓ వ్యక్తి నుంచీ నాకు కాల్ వచ్చింది. ఇంటిని తన పేరున మార్చుకున్న భార్య అతడిని ఇంటినుంచీ గెంటి వేసిందట. కనీసం తన పిల్లలను కూడా చూసేందుకు ఆమె...భర్తను రానివ్వడం లేదట. అంతేకాదు అతడిపై 25 వేధింపుల కేసులు కూడా బుక్ చేసిందట'' అంటూ న్యాయవాది కులదీప్ బొబ్బర్ ఓ బాధితుడి కేసును ఉదహరించారు. ఇటువంటి కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయని.. ఇప్పటికైనా పురుషులపై వేధింపుల విషయంలోనూ కళ్ళు తెరవాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే ఢిల్లీకి చెందిన మరో బాధిత మహిళల హెల్స్ లైన్ కు కూడా భార్యా బాధితులు కొందరు ఫోన్లు చేస్తున్నారని చెప్తోంది. సాధారణంగా అటువంటి కాల్స్ ...ఫాల్స్ డౌరీ కేసులై ఉంటున్నాయని వాటిని మరో హెల్స్ లైన్ కు పంపిస్తున్నామని వారు చెప్తున్నారు. జర్నలిస్ట్, ఫిలిమ్ మేకర్ అయిన దీపికా భరద్వాజ్... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఓ డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారట. ఎటు చూసినా మానవ సంబంధాలు కరువైపోతున్న నేటి తరుణంలో బాధిత మహిళలకు న్యాయంపై ఎన్నో చట్టాలు ఉన్నాయని,... జీవిత భాగస్వాములైన మహిళలు, సహోద్యోగినుల వల్ల వేధింపులకు గురౌతున్న మగవారికి మాత్రం కనీస న్యాయం జరగడం లేదంటున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితులు ఎంతోమంది కాల్స్ చేస్తుంటారని, మహిళలవల్ల వేధింపులకు గురై.. న్యాయం దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నవారి శాతం నానాటికి పెరుగుతోందని ఆమె చెప్తున్నారు. అందుకే బాధిత పురుషులకు హెల్ప్ లైన్లు ఎంతో అవసరమని దీపిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.