young couple
-
నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..
నాటు కోళ్లు, జాతి (పందెం) కోళ్ల పెంపకం మారుమూల గ్రామాల్లో సైతం రైతుకు ఆధారపడదగినంత స్థాయిలో నిరంతర ఆదాయాన్ని అందిస్తుందని ఓ యువజంట రుజువు చేస్తున్నారు. గత పదేళ్లుగా శ్రద్ధగా ఈ పని చేస్తే ప్రజలకు ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు రైతు దంపతులు ఉపేందర్‌రావు, జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడేనికి చెందిన నిరుద్యోగులైన మూలగుండ్ల ఉపేందర్‌రావు, వజ్జా జ్యోతి పదేళ్ల క్రితం ఇంటి వద్ద ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని నాటు, పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. చుట్టూ కోళ్ల ఎగిరి పోకుండా ఎత్తు జాలీ ఏర్పాటు చేశారు. నీడ కోసం పరిసర ప్రాంతంలో వివిధ రకాల చెట్లను పెంచారు. కోళ్ల మధ్యకు మాములు రాకుండా చూసేందుకు సీమ కోళ్లను, రెండు కుక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం 20 జాతి (పందెం) కోడి పిల్లలను పలు ప్రాంతాల నుంచి సేకరించి పెంచటం మొదలుపెట్టారు. వీటి గుడ్లను సాధారణ కోళ్లకు వేసి పొదిగించి పిల్లలు తీసి సంతతిని పెంచారు. తదనంతరం ఇంక్యుబేటర్‌ను సమకూర్చుకొని పందెం కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లల సైజును బట్టి వివిధ ధరలకు అమ్ముతున్నారు. 8 రకాల జాతి కోళ్లుకోళ్లను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండి అన్ని పనులూ ఉపేందర్‌రావు, జ్యోతి చేసుకుంటారు. వీరి వద్ద మార్కెట్లో మార్కెట్లో గిరాకీ ఉన్న నెమలి, కాక, డేగ, రసంగి, అబ్రాస్, సీత్వాల్, కెక్కర, ఎర్ర కెక్కర వంటి అనేక రకాల జాతి కోళ్లను వీరు పెంచుతున్నారు. రెండు వందల పెట్టలు, పుంజులు ఉన్నాయి. ఇవి దాణా కంటే ఆకుకూరలను ఎక్కువగా తింటున్నాయి. ఇంటి పరిసరాల్లో పలు రకాల ఆకుకూరలను,మునగాను పెంచి వీటికి మేపుతున్నారు. ఫామ్ హౌస్ యజమానులు జాతి కోళ్లను ఆసక్తితో పెంచుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసుకెళుతున్నారు. కిలో బరువు గల జాతి కోడి రూ. 4 నుంచి 5 వేలు పలుకుతోంది. నెలలోపు చిన్న పిల్లలైతే రూ. 300 వరకు పలుకుతోందని ఉపేందర్ రావు తెలిపారు. మునగాకుతో జబ్బులకు చెక్!మొదట్లో కడక్‌నా«ద్ కోళ్ల పెంపకం చేపట్టాం. మారుమూల ప్రాంతం కావటంతో వాటికన్నా జాతి (పందెం) కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం వస్తోంది. జాతి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పోదిగించి పిల్లలను అమ్మటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నాం. రెండు, మూడు సార్లు మందులు వాడితే ఈ కోళ్లకు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా మునగ ఆకు తినిపిస్తే కోళ్లకు జబ్బులు వచ్చే ఛాన్సే లేదని ఉపేందర్‌రావు(95023 48987) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. – ఇల్లెందుల నాగేశ్వరరావు, సాక్షి, ఇల్లెందు (చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
‘మీరెవరండీ బాబూ’.. ఇదెలా ఎలా సాధ్యం?
‘ఎన్ని పాటలు పాడగలరు?’ అని అడిగితే ‘ఎన్నయినా సరే’ అంటారు పాటలను ప్రేమించే గాయకులు. ‘ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని పాడగలరు?’ అని అడిగితే మాత్రం– ‘మీరెవరండీ బాబూ’ అంటారు. అయితే సాత్ కొరియాకు చెందిన ఒక యువ జంట ఇండోనేషియా నుంచి ఇండియా (బాలీవుడ్ సినిమా సుఖూన్లోని దిల్ కో ఖరార్ ఆయా.. పాట) వరకు తొమ్మిది భాషలలో 13 పాటలు పాడారు. ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఇది సరేగానీ.. ఒక్క నిమిషంలో 13 పాటలు ఎలా సాధ్యం?’ అనే సందేహం అందరికీ వస్తుంది. 13 పాటలలోని ఒక్కో చరణాన్ని తీసుకొని ఒకే పాటలా చాలా స్పీడ్‌గా పాడారు. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?
పెదవాల్తేరు (విశాఖ తూర్పు):విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంట కుటుంబాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వాగ్వాదానికి దిగాయి. వీరికి సర్దిచెప్పడానికి పోలీసులు హైరానా పడాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రేసపువానిపాలెం దరి సిద్ధార్థనగర్‌కి చెందిన తాటిపూడి సీతారామ్ కుమారుడు ప్రశాంత్‌కుమార్ ఓ షోరూమ్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను, కైలాసపురానికి చెందిన మౌనిక గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రేమించుకున్నారు. గత నెలలో మౌనిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 14న వీరిద్దరూ కొత్తవలసలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ప్రశాంత్‌కుమార్ ఇంటికి వచ్చారు. వెంటనే అతని తల్లిదండ్రులు వీరిని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు విరమింపజేశారు. ప్రస్తుతం మౌనిక గర్భిణికాగా తాను భర్త వద్దకు వెళ్లేదిలేదంటూ చెప్పడం గమనార్హం. మహిళా చేతన పద్మను అరెస్టు చేయాలి మహిళా చేతన ప్రతినిధి పద్మ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశమని ఆహ్వానం పంపడంతో స్టేషన్‌కి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అక్కడికి చేరుకుని పద్మను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువకుని తండ్రి సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమారుడు, కోడలు చక్కగానే కాపురం చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు తల్లిదండ్రులు ఆమె మనసుని మార్చేశారని ఆరోపించారు. నగరంలో ఎన్నో కాపురాలు కూలిపోవడానికి కారణమైన పద్మ అండ చూసుకుని తన కోడలు కాపురానికి రానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి అయిన తన కోడలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం పద్మ ఆమెని డిశ్చార్జి చేయించి, స్టేషన్‌కి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కాపురం చేసుకుంటున్న తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కారణమవుతున్న పద్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. ప్రశాంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహిళా చేతన పద్మ మాటలు విని తన భార్య మౌనిక కాపురానికి రానంటుందని, పోలీసులు స్పందించి తమ కాపురం నెలబెట్టాలని కోరాడు. -
ఔను.. వారిద్దరు మళ్లీ కలిశారు..
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌తో ఏకమవుతున్నారు... క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు. – బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, మంచిర్యాల -
యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?
మైసూరు (కర్ణాటక): మైసూరులోని సాతగళ్లి లేఔట్లో నివాసం ఉంటున్న సంతోష్(26), భవ్య(22) అనే యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అన్నంలో పురుగుల మందు కలిపి తిన్నట్లు తేలింది. అప్పుల బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) -
'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?'
ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఆ భర్త పూర్తిగా మారి సైకోలా తయారయ్యాడు.ఆ యువకుడు అగ్రకులానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేస్తున్నారని పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నువ్వు అంటరానిదానివని సదరు యువతిని కులం పేరుతో దూషించాడు. తనను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తే అలాంటి మాట అనడంతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన సదరు జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి వయసు 20 ఏళ్లు. యువకుడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. కాగా యువకుడు అగ్ర కులానికి చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ తనను వెక్కిరించడంతో అతడు కూడా సదరు యువతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన వాడే పెళ్లి చేసుకున్నాక అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి అతడు శృంగారం కోసం వస్తే ఆమె నిరాకరించింది. నన్ను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను నీతో శృంగారం చేయనని తెగేసి చెప్పింది. ఇక దాంతో అతడు కోపంతో భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించసాగాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
తాగి కొడుతున్నాడని ఒకరు.. నల్లగా ఉన్నావని మరొకరు
సాక్షి, హైదరాబాద్ : అదనపు కట్నం కోసం ఒకరు.. సరిగా చూడటం లేదని మరొకరు.. సంపాదన లేదని ఇంకొకరు.. తాగి కొడుతున్నాడని, నల్లగా ఉన్నావని మరొకరు.. ఇలా వివిధ కారణాలతో ఘర్షణ పడుతున్నారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన యువ జంటలు చిన్నచిన్న వివాదాలతో ఎడబాటు వరకు వెళ్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో 2,246 ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్ట్, రిమాండ్‌కు తరలించే ముందే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విడిపోదామనుకున్న వారు కౌన్సె లింగ్‌తో మనసు మార్చుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది 1,372 జంటలు ఒక్కటికావడం విశేషం. చిన్న విషయంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ యువజంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై.. చివరికి విడాకుల వరకు వెళ్లింది. ఇద్దరూ సరూర్‌నగర్ మíహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు దంపతులిద్దరినీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటైపోయారు. వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు. పిల్లల పెంపకం విషయంలో గొడవ పడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా విన్పించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య.. భార్యే వేధిస్తోందని భర్త ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఒక్కటయ్యారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1,372 జంటలు ఏకమయ్యాయి. వినకపోతేనే కేసు నమోదు రోజుకు సగటున 40–50 ఫిర్యాదులు వస్తుంటాయి. వచ్చిన వారిలో అంతా యువ దంపతులే. పెళ్లైన రెండు మూడేళ్లకే చిన్నచిన్నవాటికి గొడవపడుతున్నారు. క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు జంటలను కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సెలింగ్‌తో 70 శాతం మంది కలిసిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా వినని వారిని మాత్రమే రిమాండ్‌కు పంపిస్తున్నాం. – జి.మంజుల, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్ -
యువజంట చేసిన పనికి బంధువులంతా షాక్..
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యభర్తలు ఇద్దరు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మయుర్భంజ్లోని ధనసుల్ గ్రామంలో జరిగింది. అయితే, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఇరువురిని చెట్టుపై నుంచి కిందకుదించారు. వారిని, బౌలా సింగ్ (20), సిమా సింగ్(18) లుగా గుర్తించారు. వారి శవాలను ఆటోప్సి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వీరి మరణాలపై స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, ఒక వేళ వీరిని ఎవరైనా హత్యచేసి ఇలా చెట్టుకు వేలాడ దీశారా లేక ఏదైనా ప్రేమ వ్యవహరం కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. యువజంట ఆత్మహత్య చేసుకున్న చెట్టు సమీపంలో హిందూ దేవుళ్ల ఫోటోలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి వీరు ఆత్మహత్యకు పాల్పడే ముందు దేవుడిని ప్రార్థించి ఉంటారని భావిస్తున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు వీరి బంధువులను పిలిపించి విచారించగా ‘ ప్రస్తుతం తాము కూడా షాక్‌లో ఉన్నట్లు తెలిపారు’. వీరు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. అయితే, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. చదవండి: తెలిసిన వారే కదా అని వెళ్తే ఎంత పనిచేశారు.. -
ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట
ఏడేళ్ళ క్రితం ఈ యువ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు. సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు ఇటీవల జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్షా్మరెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్ రెడ్డి బీటెక్ చదివి హైదరాబాద్‌లో స్టాప్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా మూడేళ్ళు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్ జబ్బుపాలైంది. అదేవిధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అదే కాలంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్‌రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు. విద్యార్థినులతో మల్లికార్జునరెడ్డి తినేవన్నీ సేంద్రియంగా పండించుకున్నవే.. మల్లిఖార్జున్ రెడ్డి, సంధ్యారెడ్డి సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు. పొలంలో మల్లికార్జునరెడ్డి, పశువులకు మేత వేస్తూ.. ఎకరంన్నరలో వస పంట సాగు ఎరంన్నరలో వస కొమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నల్ల నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల విభాగంతో (క్వింటా రూ. 9 వేలు) కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు రావచ్చని ఆశిస్తున్నారాయన. పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ–ఢిల్లీ) బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ జాతీయ అవార్డును ఇటీవలఅందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం. – వెల్మ విజేందర్ రెడ్డి, సాక్షి, చొప్పదండి వద్దన్న వారే అభినందిస్తున్నారు ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుండి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. – మావురం సంధ్యారెడ్డి, పెద్దకూర్మపల్లి వరి విస్తీర్ణం తగ్గిస్తా సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం. – మావురం మల్లికార్జునరెడ్డి (97040 90613), ఐఎఆర్ఐ ఉత్తమ ఇన్నోవేటివ్ రైతు అవార్డు గ్రహీత, పెద్దకూర్మపల్లి, చొప్పదండి మం, కరీంనగర్ జిల్లా -
పెళ్లి దండలతోనే మృత్యుఒడిలోకి!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఒకరంటే ఒకరికి ప్రాణం.. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ యువజంట ఆనందం కొద్ది గంటలు కూడా నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో నూతన జంటను కాలం బలి తీసుకుంది. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయం చెబుదామని బయల్దేరారు. వారి ఆశీస్సులు తీసుకునే లోపే ఈ జంట మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్ (24), హైద రాబాద్లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22) గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటు న్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించా లని అనుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమ యంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సతీశ్ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బయ ల్దేరారు. అయితే, సదాశివనగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జాతీయ రహదారి దాటు తుండగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. కాగా, వీరు హైదరాబాద్ నుంచి ఏ వాహనంలో వచ్చారో స్పష్టత లేదు. మోడెగాం గ్రామానికి వెళ్తూ పోలీసుల సాయం కోరేందుకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నవదంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వర్కర్. -
విద్యుత్ షాక్‌తో దంపతుల దుర్మరణం
వర్గల్(గజ్వేల్): వ్యవసాయ బావి వద్ద సంపుహౌజ్‌లో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వెళ్లిన దంపతులు విద్యుత్ షాక్‌కు గురై అందులోనే పడి దుర్మరణం చెందారు. పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో జరిగింది. వ్యవసాయ క్షేత్రం వద్ద బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే..వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు మానుక వెంకటేశ్‌గౌడ్(30), రేణుక(26)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శరత్ (7), తనూష(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి గ్రామానికి పక్కనే వర్గల్ శివారులో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ పనులు చేసేందుకు దంపతులిద్దరూ ఆదివారం ఉదయం 7 గంటలకు మొక్కజొన్న కంకులు తెంపేందుకు వెళ్లారు. పొలానికి వెళ్లేముందు పిల్లలిద్దర్నీ వెంకటేశ్ తల్లికి అప్పగించారు. విక్రయానికి సరిపడా కంకులు కోసి ఆటోలో నింపి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు దంపతులిద్దరూ వారి పొలంలోనే ఉన్న మోటారుపంపు దగ్గరకు వెళ్లారు. అప్పటికే మోటారు పంపు నుంచి వస్తున్న నీళ్లలో విద్యుత్ వస్తుండటంతో ఆవిషయం తెలియని దంపతులిద్దరూ అందులో కాలుపెట్టగానే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నీళ్ల కోసం వచ్చిన సమీప రైతు నీళ్లలో మునిగిపోయి కన్పిస్తున్న దంపతుల మృతదేహాలను చూసి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారి తల్లిదండ్రులు, సోదరుడు, బంధుగణం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. -
ప్రకృతి ఒడిలో రైతే రాజు!
ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుకున్నారు.. ఢిల్లీ, హైదరాబాద్‌లోని పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేశారు. పదేళ్లు గడిచాయి. ఉద్యోగాల్లో హోదా పెరిగేకొద్దీ జీతంతోపాటే వత్తిళ్లు పెరుగుతున్నాయి. శాంతి, సంతోషం సన్నగిల్లిపోతూ ఉంటే.. ప్రకృతికి తిరిగి దగ్గరగా వెళ్లటం ద్వారానే తిరిగి సంతోషాన్ని సంతరించుకోగలమన్న స్పృహ కలిగింది. అంతే.. రెండేళ్ల క్రితం స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పాడి, పంటలతో కూడిన పనుల్లో నిమగ్నమై ప్రకృతితో మమేకమైతేనే రైతు రాజయ్యేదని చాటి చెబుతున్నారు. సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సంతృప్తిగా జీవిస్తున్న యువ రైతు దంపతులను పలుకరిద్దాం పదండి.. ముప్పాళ్ల అశోక్‌రాజు, ఆయన సతీమణి అపర్ణ ఇంజినీరింగ్ చదువుకున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన అశోక్‌ది వైఎస్సార్ కడప జిల్లా రామాపురం మండలం గోపగుడిపల్లె గ్రామ పంచాయతీలోని నాగరాజుపల్లె గ్రామం. చదువు అయ్యాక తొలుత ఢిల్లీలో, తర్వాత హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లు పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేశారు. అపర్ణ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసి హైదరాబాద్‌లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. ఏడాది గడిచే కొద్దీ ఆదాయంతో పాటే వత్తిళ్లు, ఆందోళన పెరుగుతూనే ఉన్నాయి. సంతోషం, సంతృప్తి లోపిస్తూ వచ్చాయి. మదిలో వెలితి అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఆ దశలో ఉద్యోగానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అన్న ఆలోచన అశోక్ మదిలోకి వచ్చినప్పుడు ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించడం ద్వారా మాత్రమే ఈ వెలితిని పోగొట్టుకోగలమని తోచింది. ప్రకృతి వ్యవసాయం చేపట్టడమే ఇందుకు మార్గమని భావించాడు. అశోక్‌రాజు తండ్రి వెంకట్రామరాజు 9 ఎకరాల రైతు. రసాయనిక పురుగుమందులు వాడకుండా ఎన్.పి.ఎం. పద్ధతులను అనుసరించి అనేక ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారాయన. అశోక్ తన మదిలో ఆలోచన చెప్పడంతో భార్య, తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించారు. ఆ విధంగా రెండేళ్ల క్రితం అశోక్‌రాజు, అపర్ణ ఉద్యోగాలకు చెల్లుచీటీ ఇచ్చి నాగరాజుపల్లె వచ్చేశారు. పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. ఆరోగ్యదాయకమైన పంటలు పంటలు పండిస్తూ సంతృప్తిగా జీవిస్తున్నారు. తెలివిగా పంటలు ఎంచుకోవాలి.. చదువుకున్న యువత వ్యవసాయంలోకి అందులోనూ ప్రకృతి వ్యవసాయంలోకి రావాల్సిందేనని అంటున్న అశోక్ సాగు తన రెండేళ్ల అనుభవంలో చాలా నేర్చుకున్నానన్నారు. భార్య, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటంతో వ్యవసాయంలో నిలదొక్కుకున్నానని ఆయన అన్నారు. తమ ప్రాంతానికి, నేలకు, వాతావరణానికి తగిన పంటలను తెలివిగా ఎంచుకొని సాగు చేస్తే వ్యవసాయంలో నష్టం అనేది రాదని అశోక్ చెబుతున్నారు. దేశీ వరి రకాలు తండ్రి రసాయనిక పురుగుమందుల వాడకం మాత్రం మానేస్తే.. అశోక్ రసాయనిక ఎరువులకూ పూర్తిగా స్వస్తి చెప్పారు. తండ్రి ట్రాక్టర్‌తో దుక్కి చేయించేవారు. కొడుకు ఎడ్ల నాగళ్లతోనే దుక్కి చేయిస్తున్నారు. తండ్రి సాధారణ వరి రకాలు పండిస్తే కొడుకు పోషకాల సాంద్రత కలిగిన దేశీ వరి రకాలు నవార, కుళ్లాకర్, కాలాబట్టి సాగు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. 9 ఎకరాల్లో వ్యవసాయం మొత్తాన్నీ అశోక్ సమూలంగా మార్చేసి, పూర్తి స్థాయిలో ప్రకృతి బాటపట్టించారు అశోక్‌రాజు. పాడి.. పంట.. పశువులు లేకుండా వ్యవసాయం సాగదని ఆయన అంటారు. తమకు 20 వరకు నాటు ఆవులు, ఎద్దులు ఉన్నాయి. వాటి పేడ, మూత్రంతో పంటలకు జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటున్నారు. 9 ఎకరాల్లో సగం ఎర్ర నేల, సగం నల్ల నేల. ఎర్ర నేల 4 ఎకరాలకు పైగా ఉంటే.. 2 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మిగతా భూమిలో ఈ ఏడాది వేరుశనగ విత్తారు. ఆరోగ్యదాయకమైన దేశీ వరి రకాలు నవార, కుళ్లాకర్, కాలాబట్టిలను నల్ల నేలలో ఒక్కో ఎకరంలో సాగు చేస్తున్నారు. ఎకరంలో శాశ్వత పందిర్లు వేసి బీర సాగు చేస్తున్నారు. రింగ్ పిట్ మెథడ్‌లో ఒక ఎకరంలో చెరకు, ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే పాలిహౌస్ ఏర్పాటు చేసుకొని జెర్చరా పూలు సాగు చేయాలన్నది అశోక్‌రాజు ఆకాంక్ష. ప్రకృతికి దూరమై కంప్యూటర్లకే పరిమితమైపోయి ఉద్యోగాలలో టెన్షన్లు, అనిశ్చితితో సతమతమయ్యేకన్నా.. వీలైనంత వరకు యువత ప్రకృతి వ్యవసాయంలోకి రావటమే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా చూసినా దీర్ఘకాలంలో మంచిదని అశోక్‌రాజు, అపర్ణ ఇంజినీర్ యువ రైతు దంపతులు ముక్తకంఠంతో చెప్తున్నారు! రింగ్ పిట్ మెథడ్‌లో చెరకు సాగు ఎకరంలో ఆర్నెల్ల క్రితం చెరకు విత్తారు. రింగ్ పిట్ మెథడ్‌లో ఎకరానికి 9 టన్నుల విత్తనం పట్టింది. 2.5 అడుగుల చుట్టుకొలత ఉన్న రింగ్‌లో అడుగు లోతున చెరకు విత్తనాన్ని నాటుతారు. కాబట్టి చెరకు ఎంత ఎదిగినా పడిపోకుండా ఉంటుంది. రింగ్‌లో 50 వరకు వత్తుగా పిలకలు వస్తాయి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 2 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి గాలి, వెలుతురు బాగా తగిలి తోట ఏపుగా పెరుగుతుంది. దిగుబడి ఎకరానికి 80 టన్నులకు తగ్గదని అశోక్‌రాజు ఆశిస్తున్నారు. మరో ఆర్నెల్లకు చెరకు కోతకు వస్తుంది. బెల్లం వండుదామనుకుంటున్నారు. నవతరం రైతులు అశోక్‌రాజు, అపర్ణ ఆనందం.. ఆదాయం కూడా! ప్రకృతికి దూరమైన జీవితంలో ఆత్మసంతృప్తి, సంతోషం ఉండవు. ఎంత పెద్ద చదువు చదివి ఉద్యోగంలో చేరినా.. ఏళ్లు గడిచేకొద్దీ ఆదాయంతోపాటే ఆందోళన, అనిశ్చితి పెరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రకృతిలో మమేకమై జీవించడంలోనే.. అంటే ప్రకృతి వ్యవసాయక జీవనంలోనే ఆనందం ఉంది. ఉద్యోగం వదిలి రావాలని ఉన్నా చాలా మంది ఏదో ఒక కారణంతో వెనకాడుతూ ఉన్నారు. మొదట మానసికంగా కచ్చితమైన నిర్ణయానికి రావాలి. పొలం ఎక్కువ లేదనుకోవద్దు. రెండు, మూడు ఎకరాలున్నా చాలు. భార్య, తల్లిదండ్రుల ప్రోద్బలం తప్పనిసరి. పనుల్లో పూర్తిగా నిమగ్నమవ్వాలి. తెలివిగా చేసుకోవాలి. తొలి దశలో నెమ్మదిగానైనా చేసుకుంటూ వెళ్లాలి. నెలాఖరుకు జీతం రాదు. పైగా పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అయితే, అవగాహన పెంచుకొని చేస్తే.. ప్రకృతి వ్యవసాయంలో నష్టం రాదు. అన్నీ కుదురుకోవడానికి 1–2 ఏళ్లు పోరాటం తప్పదు. సాధారణంగా రైతులు విత్తనం, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకే 50% ఖర్చు పెడుతున్నారు. అవి కొనకుండా మనమే తయారు చేసుకుంటే సగం సమస్యలు తీరుతాయి. చదువుకున్న యువత తెలిసి చేస్తే ప్రకృతి వ్యవసాయంలో నష్టం ప్రసక్తే ఉండదు. నెమ్మదిగానైనా ఉద్యోగానికి మించి ఆదాయం వస్తుంది. రెండేళ్లుగా మేం అందరం చాలా ఆనందంగా ఉన్నాం. – ముప్పాళ్ల అశోక్‌రాజు (95028 26931), రైతుగా మారిన యువ ఇంజినీర్, నాగరాజుపల్లె, రామాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లా డ్రాగన్ ఫ్రూట్‌కు శ్రీకారం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు జిల్లాలో శ్రీకారం చుట్టిన ఘనత అశోక్‌దే. ఉద్యోగం మానెయ్యడానికి ఏడాది ముందే అరకు ప్రాంతంలో స్నేహితుడు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోట చూసి తమ పొలంలో దిగుబడినిస్తుందో లేదో చూద్దామనుకున్నారు. 500 పింక్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కొని తెచ్చి నాటించారు. ఆరు నెల్ల వరకు మొక్కలు పెద్దగా ఎదగలేదు. ఆ మొక్కల నుంచే అంట్లు కట్టి, ఆ మొక్కలను నాటి చూశారు. అవి ఏపుగా పెరుగుతున్నాయి. ఆర్నెల్లకే పూతకు వచ్చాయని అశోక్ తెలిపారు. ఇప్పుడు ఎకరంపైగా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించారు. 300 పోల్స్‌లో 1400 వరకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటారు. తమ ప్రాంతానికి ఈ పంట తగినదేనని నిర్థారించుకున్న తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ఇతర రైతులకూ విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో 49 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతకు సైతం పింక్ డ్రాగన్ రకం తట్టుకున్నదన్నారు. డ్రాగన్ ఫ్రూట్ అధిక పోషక విలువలతో కూడిన పంట కావడంతోపాటు చీడపీడలు లేవు, కూలీల అవసరం తక్కువ, పోషణ కూడా చాలా సులభమని ఆయన తెలిపారు. ఖర్జూరపు పంట పూత మీద ఉండే కాలంలోనే మనకు వర్షాలు పడతాయి కాబట్టి, పూత నిలవదన్నారు. అందుకే ఆ పంట మనకు అనువు కాదని అనుకున్నానని అశోక్‌రాజు అంటున్నారు. – కోడూరు రామమోహనరెడ్డి, సాక్షి, కడప సిటీ -
ప్రేమ పెళ్లి.. విషాదాంతం
రాత్రి ఇద్దరూ వివాహ కార్యక్రమానికి వెళ్లివచ్చారు.. తెల్లారేసరికి విగత జీవులై జంటగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఓ యువజంట విషాదాంతం గాజువాకలో కలకలం రేపింది. గాజువాక హైస్కూల్ రోడ్డులోని పెంటయ్యనగర్‌కు చెందిన నరేంద్రకుమార్, ఢిల్లీశ్వరి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ జనవరిలో ఒక్కటయ్యారు. ప్రేమ పోరాటంలో గెలిచిన ఈ జంట.. జీవిత పోరాటంలో మాత్రం ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందులే వీరిని విధి చేతిలో ఓటమిపాల్జేశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఢిల్లీశ్వరీకి ఇటీవల గర్భస్రావం అయ్యిందని.. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం బాగోటం లేదని.. అదే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చన్న మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రేమను గెలిపించుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి.. దూరప్రాంతానికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఈ రెండు కారణాలతోనే ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నారు. సాక్షి, గాజువాక: పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్న ఓ యువజంట జీవితంలో ఓడిపోయింది. కులాంతర వివాహం చేసుకొని తమ ధైర్యాన్ని చాటిన ఆ దంపతులు జీవించడంలో మాత్రం పిరికితనం ప్రదర్శించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చిన కొద్ది గంటలకే ఆ దంపతుల చావు కబురు తెలియడంతో వారి కుటుంబ సభ్యలు తల్లడిల్లిపోయారు. పోలీసులు, స్థానికు ల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక హైస్కూల్ రోడ్‌లోని పెంటయ్యనగర్‌కు చెందిన సేనాపతి నరేంద్రకుమార్(22), పుట్టేపు ఢిల్లీశ్వరి(19) ప్రేమించుకొని ఈ ఏడాది జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి తొలుత పెద్దలు అంగీకరించకపోవడంతో ఒంగోలుకు పారిపోయి అక్కడ వివాహం చేసుకున్నారు. అక్కడే ఢిల్లీశ్వరికి గర్భస్రావమైందని తెలుసుకున్న పెద్దలు రెండు నెలల క్రితం వారిని ఇక్కడికి తీసుకొచ్చి తమ ఇళ్లకు సమీపంలోనే మరో ఇంట్లో కాపురం పెట్టించారు. నరేంద్రకుమార్ గాజువాక ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారని అందరూ అనుకొంటున్న సమయంలో వారు ఆత్మహత్య చేసుకోవడంతో గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. రోదిస్తున్న మృతుల బంధువులు ఆత్మహత్యపై భిన్న కథనాలు యువ జంట ఆత్మహత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు కొంతమంది.. ఆమెకు అనారోగ్యం కారణంగానే ఇద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు మరికొంతమంది బంధువులు చెబుతున్నారు. ఈ జంటకు చెందిన బంధువులు ఆర్థికంగా అంత పరిపుష్టి కలిగినవారు కాదు. ఢిల్లీశ్వరి తల్లితండ్రులు పండ్ల వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నరేంద్ర కుమార్‌కు తండ్రి లేరు. తల్లి, ఒక సోదరి ఉన్నారు. ఆమె ఇటీవల వార్డు వలంటీర్‌గా ఎంపికైంది. దీంతో పెద్దలు వారిని ఆర్థికంగా ఆదుకొనే పరిస్థితి లేదు. ఆటోనగర్ కంపెనీలో వస్తున్న కొద్దిపాటి జీతం తమ అవసరాలకు సరిపోవడంలేదని, దీంతో భవిష్యత్‌పై బెంగతో ఈ పని చేసి ఉండవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీశ్వరికి గర్భస్రావమైన తరువాత ఆమె ఆరోగ్యం బాగోవడం లేదని అంటున్నారు. ఈ కారణంతో ఇద్దరూ ప్రాణాలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండూ కాకుండా వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. పెద్దల నుంచి ఇబ్బందులేమైనా? ఉన్నాయా? అన్న కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కటవ్వడం కోసం పెద్దలనే ఎదిరించిన ఆ జంటకు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టమేమొచ్చిందంటూ స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అన్యోన్యంగా ఉన్న యువ దంపతులు గురువారం రాత్రి కూడా ఒక స్నేహితుడి వివాహానికి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. వివాహం చూసుకొని రాత్రి తిరిగి వచ్చిన తరువాత తెల్లవారేసరికి ఇంతటి అఘాయిత్యం చేసుకోవడం ఎవరికీ మింగుడుపడటం లేదు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే ఇంటి బయటకు వచ్చి సందడి చేసే ఆ దంపతులు విగతజీవులుగా పడి ఉండడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా వంటి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.ఈ విషయాన్ని గాజువాక సీఐ సూరినాయుడు వద్ద ప్రస్తావించగా, ఇప్పటి వరకు తమకు కూడా ఎటువంటి నిర్ధిష్టమైన సమాచారం లభించలేదన్నారు. ఈ విషయాలపై దర్యాప్తులో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకున్న దంపతులు
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి విహహం చేసుకున్న జంట ఆశలన్నీ కొంత కాలంలోనే ఆవిరైపోయాయి. నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాజువాక పెంటయ్యనగర్‌కు చెందిన నరేంద్రకుమార్, దిల్లేశ్వరి తల్లిదండ్రులకు తెలియకుండా గత జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. ఒంగోలులో వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఆటోనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసే నరేంద్రకుమార్ జీతం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదాలు చేటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన దంపతులు శుక్రవారం ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరిపడా ఆదాయం రావట్లేదని, భవిష్యత్తుపై బెంగతో చనిపోయినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఈ జంట తిరిగి గాజువాకలో నివసిస్తున్నట్లు వారి తల్లిదండ్రులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బంజారాహిల్స్‌లో నవదంపతుల ఆత్మహత్య
-
బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు
కడప అర్బన్ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్ హోం నోడల్ ఆఫీసర్ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు. తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్ లోక్ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. -
మరో విషాదాంతం..
ముంబై: ‘ఏం పెట్టి పోషిస్తావురా?’ అని ప్రశ్నించడానికి అతనేమీ ఆవారా కాదు. బిజినెస్ బాగా నడిచే ఓ గార్మెట్ షాప్ ఓనర్. ఎగువ మధ్యతరగతి కుటుంబం, కారు, మంచి ఇల్లు!! ‘ఏం చూసి ప్రేమించావు?’ అని వెలెత్తిచూపడానికి కూడా అవకాశంలేని వ్యక్తిత్వం ఆమెది. ఉద్యోగం చేస్తూ ఇంటికి ఆసరగా నిలబడింది. స్వతంత్రభావనలు మెండుగా నింపుకొన్న నేటి యువతరానికి ప్రతీకలైన ఈ ఇద్దరూ ‘మతం’ అనే జాఢ్యానికి బలైపోయారు. మతాంతర వివాహం చేసుకుకోవాలనుకున్న ఈ జంట.. ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విషంతాగి ప్రాణాలు విడిచారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలివి.. నాలుగేళ్ల ప్రేమ..: నవీ ముంబైలోని దిఘా ప్రాంతానికి చెందిన మనీషా నారాయణ్ నెగి(21) డిగ్రీ పూర్తిచేసి, ఓ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేసేది. ములుంద్‌లోని ఇస్లామ్‌పూరకు చెందిన సల్మాన్ అఫ్రోజ్ ఖాన్(26) స్థానికంగా ఓ గార్మెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట ఏర్పడిన వీరి పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మతాలు వేరువేరన్న కారణంగా ఇంట్లోవాళ్లు వ్యతిరేకించారు. నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మనీషా-సల్మాన్‌ను ఒక నిర్ణయానికి వచ్చారు. కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి..: ములుంద్‌లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో అనుమానిత కారు గురించి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఇంజిన్ ఆన్‌లోనే ఉన్నా, లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి డోర్ తీశారు. డ్రైవింగ్ సీట్లో సల్మాన్, అతని పక్కనే మనీషా సృహతప్పి పడిఉన్నారు..ఇద్దరి నోటి వెంటా తెల్లటి నేరగ! వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సల్మాన్‌దిగా భావిస్తోన్న నీలిరంగు లాన్సర్ కారు నుంచి ఒక షోడా బాటిల్‌ను, విషం డబ్బాను, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా కారులోనే: మతాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నాలుగు రోజుల కిందట ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ.. తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు చెప్పారు. ఈ నాలుగు రోజులూ మనీషా-సల్మాన్‌లు కారులోనే గడిపినా.. ఉద్యోగాలకు క్రమం తప్పకుండా వెళ్లేవారని, రంజాన్ ఉపవాసాలుంటున్న సల్మాన్ ఇఫ్తార్ కోసం మాత్రమే అరగంట ఇంటికి వెళ్లొచ్చేవాడని పోలీసులు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపామని ములుంద్ స్టేషన్ అధికారులు తెలిపారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సల్మాన్ తండ్రి అంగీకరించగా, మనీషా కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. -
యువజంట ఆత్మహత్య
నల్లగొండ, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ) : అడవిదేవులపల్లి కృష్ణాతీరంలో యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. సోమవారం అటుగా వెళ్తున్న బాటసారులు అస్తిపంజరాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు ఆంధ్రా ప్రాంతంలోని గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన కోరె అప్పారావు (38), గురజాలకు చెందిన మువ్వా కాసులు(35)గా గుర్తించారు. ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన అప్పారావు ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు . రోజు తన స్వగ్రామం నుంచి గురజాలకు రాకపోకలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలో గురజాలకు చెందిన కాసులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా ఏడాదిన్నర కాలంగా ఇరువురి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు వీరిద్దరు గతంలో రెండుమార్లు ఇళ్ల నుంచి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు కేసులు పెట్టి వీరిని వెతికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరో మారు వీరు ఇళ్ల నుంచి పారిపోగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు గురజాల పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జనవరి 1న కేసులు నమోదయ్యాయి. పురుగుల మందుతాగి ఆత్మహత్య అడవిదేవులపల్లి కృష్ణా నదీతీరం సమీపంలోని టెయిల్‌పాండ్ వద్దకు సోమవారం బాటసారులు వెళ్తుండగా దుర్వాసన వస్తుండటంతో దగ్గరకు వెళ్లి చూశారు. రెండు అస్తిపంజరాలు కనిపించాయి. వారు వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్‌టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు డబ్బా, దుస్తులు, దుప్పటి కనిపించాయి, అస్తి పంజరాల వద్ద పడి ఉన్న అప్పారావు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా విచారణ చేయగా వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అప్పారావుకు భార్య, కొడుకు, కూతరు ఉన్నారు. కాసులకు భర్త, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీఆర్ఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అస్తి పంజరాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం
కృష్ణరాజపురం: తాగిన మైకంలో కారు ను నడిపి బైకులను ఢీకొట్టి ఇద్దరు యువకులు గాయాలపాలవడానికి కారణమైన యువకుడిని స్థానికులు చావబాది పో లీసులకు అప్పగించిన ఘటన ఆదివారం వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన యువకుడు తన స్నేహితురాలితో కలసి ఆదివారం పూటుగా మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులోనే మేడహళ్లి–వైట్‌ఫీల్డ్ మార్గంలో కారును వాయువేగంతో నడపాడు. దీంతో కారు అదుపుతప్పి మేడహళ్లి, బెళతూరు ప్రాంతాల్లో బైకులను ఢీకొట్టడంతో బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదేవేగంతో దూసుకెళ్లడంతో కాడుగోడి సమీపంలో మరో బైకును ఢీకొట్టడంతో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక యువకుడు, యువతి మద్యం మత్తులో ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో యువకుడికి దేహశుద్ధి చేయడంతో పాటు కారు అద్దాలను ధ్వంసం చేశారు. -
విమానంలో ఇరాన్ జంట బాహాబాహి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కట్టుకున్న భర్త మరికొందరు మహిళలపై ఆకర్షణ పెంచుకోవడాన్ని ఏదేశానికి చెందిన భార్య అయినా సహించలేదనే సత్యాన్ని చాటే సంఘటన ఖతార్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. భర్త సెల్‌ఫోన్‌లోని అశ్లీల చిత్రాలు, పలువురు మహిళ ఫొటోలను చూసిన భార్యకు ఆగ్రహం కట్టలు తెంచుకోగా ఆకాశంలో ఎగురుతున్న విమానంలోనే పరస్పర దాడులకు దిగారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖతార్ ఎయిర్వేస్ విమానం దోహా నుంచి బయల్దేరి సోమవారం ఉదయం ఇండోనేషియాలోని పాల్దీవులకు వెళుతోంది. ఈ విమానంలో 284 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇరాన్ దేశానికి చెందిన ఓ యువజంట చంటిబిడ్డను వెంటబెట్టుకుని వెళుతోంది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో కాలక్షేపం కోసం భార్య అతని సెల్‌ఫోన్ తీసుకుని ఆమె ఆన్ చేసింది. భర్త వేలిముద్రలే పాస్వర్డ్ కావడంతో అతని వేలిని ఉపయోగించి సెల్‌ఫోన్ ఓపెన్ చేయగలింది. సెల్ఫోన్లో లెక్కలేనన్ని అశ్లీల చిత్రాలు, కొందరు మహిళల ఫొటోలు ఉండడంతో భార్య ఖిన్నురాలైంది. కోపంతో ఊగిపోతూ భర్తను నిద్రలేపి ఏమిటీ ఫొటోలు అంటూ నిలదీసింది. నా అనుమతి లేకుండా సెల్‌ఫోన్ ఎందుకు తీసుకున్నావని కోపగించుకున్న భర్త, భార్యను కొట్టాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన భార్య భర్తపై చేయిచేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ విమానంలో కిందపడి దొర్లాడారు. ఈ ఘర్షణ జరుగుతున్నపుడు విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ఎయిర్‌హోస్టెస్, ప్రయాణికులపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ఘర్షణ ఆపకుంటే విమానం నుంచి మధ్యలోనే దించేయాల్సి వస్తుందని పైలట్ హెచ్చరించినా మానుకోలేదు. ప్రస్తుతం తాము ఎక్కడ ప్రయాణిస్తున్నామని కెప్టెన్ విచారించి సమీపంలో చెన్నై ఎయిర్‌పోర్టు ఉన్నట్లు తెలుసుకున్నారు. కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చి సోమవారం ఉదయం 10.15 గంటలకు చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేశారు. భార్యాభర్తలిద్దరిని బలవంతంగా దించివేసి 282 ప్రయాణికులతో విమానం ఎగిరిపోయింది. భారత్‌తో పర్యటించేందుకు ఆ దంపతులకు అనుమతి లేకపోవడంతో అధికారులను బతిమాలుకుని 11.05 గంటలకు మలేషియాకు వెళ్లి అక్కడి నుంచి మరో విమానంలో పాల్దీవులకు వెళ్లారు. -
తల్లిదండ్రులు చంపేస్తారేమోనన్న భయంతో!
గౌతం, ప్రీతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన ఈ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించి.. పోలీసు స్టేషన్లో ఒక్కటయింది. ఆ సమయంలో గౌతంకు ఇంకా మైనారిటీ తీరలేదు. కులాలు వేరయినా వీరి పెళ్లిని ప్రీతి కుటుంబం చివరికీ సమ్మతించింది. కానీ గౌతం తల్లిదండ్రులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వేరే కులం పిల్లను ఎలా చేసుకుంటావని బెదిరించారు. ప్రీతి నుంచి తనను తండ్రి వేరు చేస్తాడేమోనని గౌతం భయపడ్డాడు. తండ్రిని ఎదిరిస్తే తమ ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన చెందాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ చర్యను వ్యతిరేకించాల్సిందిపోయి ప్రీతి కూడా భర్తతో కలిసి తాను బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించింది. కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ జంట ఈ నెల 12న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం ఈ యువజంట ఐసీయూలో చికిత్స పొందుతోంది. అయితే, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలాచ్చిలో నివాసముంటున్న గౌతం, ప్రీతి అనే నూతన జంట తల్లిదండ్రుల నుంచి పరువుహత్య ముప్పునకు భయపడి.. తామే స్వయంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కోయంబత్తూరులోనే ప్రేమించి పెళ్లిచేసుకున్న శంకర్ అనే యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు పట్టపగలే నరికి చంపిన సంగతి తెలిసిందే. -
200 అడుగుల ఎత్తునుంచి పడినా..
ఆమె పేరు రమీలా శ్రేష్ఠ (17). స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత తన బోయ్ ఫ్రెండు సంజీబ్ (17)ను కలిసింది. ఇద్దరూ కలిసి నేపాల్‌లో చారిత్రాత్మకమైన ధరహరా టవర్ వద్దకు వెళ్లారు. వాళ్ల ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ రోజంతా వాళ్లిద్దరూ కలిసి అక్కడ గడపాలని అనుకున్నారు. ఎనిమిదో అంతస్థులో ఉన్న బాల్కనీ వద్దకు వాళ్లు వెళ్లేసరికి ఆ టవర్ కొద్దిగా ఊగుతున్నట్లు అనిపించింది. కాసేపటికల్లా అక్కడున్నవాళ్లంతా భయంతో కేకలు పెట్టడం మొదలైంది. ప్రేమికులిద్దరూ స్పృహతప్పి 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయారు. రమీలా, సంజీబ్లను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వాళ్ల తలకు, వెన్నెముకకు కూడా దెబ్బలు తగిలాయని, దాంతో వాళ్లు మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు. అయితే.. వాళ్ల ప్రేమ వ్యవహారం మాత్రం ఇద్దరి ఇళ్లలోనూ తెలిసిపోయింది. ఈ విషయాన్ని వాళ్లకు డాక్టర్ సంతోష్ పాండే చెప్పారు. 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయినా కూడా ప్రేమజంట ఇద్దరూ ప్రాణాలు నిలుపుకొన్నారు. తమ ప్రేమను కూడా నిలబెట్టుకున్నారు. -
నవ దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులే కారణం? కుషాయిగూడ: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్పురం గ్రామానికి చెందిన మంత్రి శ్రీనివాస్(25)కు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందికి మౌనిక(19)తో గతేడాది డిసెంబర్ 12న పెళ్లైంది. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన శ్రీనివాస్ క్రేన్ డ్రైవర్‌గా పని చేస్తూ భార్యతో కలిసి సోనియాగాంధీనగర్‌లో ఉంటున్నాడు. కాగా, పక్క ఫోర్షన్‌లోనే ఉంటున్న శ్రీనివాస్ తల్లి, సోదరుడు ఆదివారం బండ్లగూడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్, మౌనిక ఇంటి పై కప్పుకు రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఇంటి నుంచి తిరిగి వచ్చిన తల్లి, సోదరుడు.. ఉరికి వేలాడుతున్న శ్రీనివాస్, మౌనికల మృతదేహాలను చూసి బోరుమన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. శ్రీనివాస్, మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'స్వచ్ఛ నగరం' కోసం హత్యలు
మాస్కో: ప్రపంచంలో వరుస హత్యలకు పాల్పడే ఉన్మాదుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత కారణాల వల్లనే ఉన్మాదులుగా మారుతారు. ఇలాంటి వరుస హత్యలకు పాల్పడ్డ ఓ రష్యా దంపతులు ఎందుకు ఆ హత్యలకు పాల్పడ్డారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కూడు గూడులేక ఫుట్పాతులు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారు, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులను లక్ష్యంగా చేసుకొని వారు హత్యలకు పాల్పడ్డారు. అనాథలు, అభాగ్యులులేని, తాగుబోతులు కనిపించని 'స్వచ్ఛ' మాస్కో నగరాన్ని స్థాపించడమే వారి లక్ష్యమట. గతేడాది జూలై నెల నుంచి ఈ ఫిబ్రవరి నెల వరకు 12 హత్యలు చేసి చివరకు దొరికిపోయారు. 20 ఏళ్ల పాల్ వయితోవ్, 25 ఏళ్ల ఎలేనా లొబచేవ అనే దంపతులు ఈ దారుణాలకు తెగబడ్డారు. హత్యలకు వారు ఎంపిక చేసుకొన్న ఆయుధాలు రకరకాల కత్తులు. రాత్రిపూట జన సంచారం ఎక్కువలేని సమయాల్లో వారు ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ పార్కుల్లో సంచరిస్తూ వారు హత్యలకు పాల్పడ్డారు. సెర్గీ యెవ్శ్చెవ్ అనే బ్యాంకు ఉద్యోగిని 107 సార్లు కత్తులతో కర్కశంగా కసాకసా పొడిచి హత్య చేశారు. దిక్కూ మొక్కులేని దీనుల హత్యలు జరిగినప్పుడు పెద్దగా పట్టించుకోని మాస్కో పోలీసులు బ్యాంకు ఉద్యోగి హత్య సంచలనం సృష్టించడంతో పరుగులుతీసి మరీ హంతక దంపతులను అరెస్టు చేశారు. పాపం బ్యాంకు ఉద్యోగి ఫుట్పాతర్ కాకపోవడమే కాకుండా తాగుబోతు కూడా కాదట. ఓ స్నేహితుడిని కలవడం కోసం పబ్లిక్ పార్కులో నిరీక్షిస్తుండగా హంతక దంపతులు దాడిచేసి దారుణంగా హత్య చేశారు. తాము భావించిన విధంగా మాస్కో నగరాన్ని ప్రక్షాళించాలనే తిక్కాలోచనతో వరుస హత్యలకు పాల్పడిన ఆ రష్యా దంపతులు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. -
కాల్చుకుని చనిపోయిన ప్రేమజంట
వాళ్లిద్దరూ ప్రేమ జంట. కానీ పెద్దలు మాత్రం వాళ్ల సంబంధాన్ని అంగీకరించలేదు. కలిసి జీవించలేకపోయినా.. కలిసి మరణిద్దామనుకున్నారు. అంతే, రాంలీలా సినిమాలో చూపించినట్లుగా రివాల్వర్లు తీసుకుని.. పరస్పరం కాల్చుకుని చనిపోయారు. అచ్చం సినిమాను తలపించే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. అంకుర్ (20), సరేష్టి (19) అనే ఈ ఇద్దరిదీ ఒకే కులం కూడా. వాళ్లిద్దరూ సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. కానీ వాళ్ల సంబంధాన్ని పెద్దలు అంగీకరించలేదు. ఏం చేద్దామా అనుకున్నారు. అమ్మాయి బుధవారం నాడు అబ్బాయి ఇంటికి వెళ్లింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాల్చుకుని చనిపోయారు. వాళ్ల మృతదేహాల వద్ద రెండు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.