YS Jagan Mohan Reddy
-
అండర్-19 మహిళల జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల అండర్-19 జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా, మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడారు.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
పవన్‌ను ప్రశ్నిస్తున్నా.. కూటమి ఎంపీలకు సిగ్గులేదా?: చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు పవన్‌ను మేము ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలుగు వారి ఆత్మగౌరవం మరో మారు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. 41.5 ఎత్తులో మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది. ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు. పవన్‌ను మేం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?.వైఎస్ జగన్ కేంద్రం ఒత్తిడికి తలొంచి ఉంటే 12,500 కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి. కానీ, పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు. కేంద్రంలో చంద్రబాబు ప్రభావమేమీ లేదు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి. దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి. పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు. అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమరావతికి 15వేల కోట్లు ముష్టివేశారు. ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి అమరావతికి అప్పు తెచ్చారు.ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా?. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చించుకున్నారు. యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవాళ్లు ఆంధ్రా ద్రోహులే. ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తోంది. తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేంద్రం బడ్జెట్‌పై జగన్ మార్క్
-
కేంద్ర బడ్జెట్లో వైఎస్ జగన్ మార్క్?!
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగింది. ఎక్కడా అవినీతి, లంచం ప్రస్తావన లేకుండా.. పారదర్శకమైన వ్యవస్థలతో నేరుగా అర్హులకే మేలు కలిగింది. ఆ టైంలో జగన్ పాలనపై దేశవ్యాప్త చర్చ నడవడగా.. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం.ఈసారి బడ్జెట్లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించుకున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో సీఎంగా జగన్ తన పాలనలో చేసి చూపించారు. 👉వ్యవ‘సాయాని’కే తొలి ప్రాధాన్యమంటూ నిర్మలమ్మ ప్రసంగం పేర్కొంది. ఈక్రమంలో.. ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కింద పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు పలు రకాల సాయాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే క్రమంలో.. గోదాములను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించింది. ఇక.. జగన్ పాలనలో.. రైతు భరోసాతో పంట సాయం అందించడం, ఆర్బీకే సెంటర్లు.. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్ల అందజేత, ఒకవేళ పంట నష్టం జరిగినా సత్వర పరిహారం లాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ తరహా సంక్షేమాన్ని అందించలేకపోవడం గమనార్హం. 👉వైద్య విద్యను విస్తరించే క్రమంలో 10,000 అదనపు సీట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే.. దశాబ్దాల తర్వాత ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యను ప్రొత్సహించారు వైఎస్ జగన్. అలాగే.. ప్రజారోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిధిని విసర్తించడం, ఇంటికే వైద్యంలో భాగంగా విలేజ్.. ఫ్యామిలీ క్లినిక్‌ల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 👉దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కానీ, జగన్ హయాంలో.. నాడు-నేడుతో స్కూళ్లు కళకళలాడాయి. డిజిటల్ క్లాస్ రూంలతో కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారాయన. అలాగే.. ఇంకోవైపు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులను చదువును దూరం కాకుండా చూసుకోగలిగారు. 👉మహిళా సాధికారత కోసం కేంద్రం తరఫున రకరకాల పథకాలను ప్రవేశపెడతామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే పేద వర్గాలకు వైఎస్సార్ చేయూత, ఆసరా, ఇంకా వివిధ పథకాలతో జగన్ ప్రభుత్వం సాయం అందించింది తెలిసిందే. గ్రామ స్వరాజ్యం, ప్రజారోగ్యం, విద్యా రంగం, మహిళా సాధికారికత.. ఇలా దాదాపు కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
బెంగళూరుకు చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్ నుంచి వైఎస్ జగన్ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసానికి వెళ్లారు. విదేశీ పర్యటన ముగించుకుని జగన్ వస్తున్నట్లు తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జగన్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్‌కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్‌ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్‌కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్‌కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్‌కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
వైఎస్ జగన్ పై చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు
-
మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి
-
మోసానికి మారుపేరు చంద్రబాబు: పెద్దిరెడ్డి
సాక్షి,వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్మును ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ అన్నారు...ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అన్నారు. ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లడడం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? వైఎస్ జగన్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులు. ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారు. ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు..? దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారు. కానీ చంద్రబాబు అలా కాదు. సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా.. డబ్బులు లేవని దాట వేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదు. అధికారంలోకి వచ్చారు. ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..?సూపర్ సిక్స్ లేదు. గుండు సున్నా చేశారు. ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆనాడు చంద్రబాబుకి వంత పాడారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. -
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన. గాంధీగారి సిద్ధంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయం. సత్యమేవ జయతే అని సందేశం ఉంచారాయన. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు
-
ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: శ్రీహరికోట నుంచి వందో రాకెట్ ప్రయోగం విజయవంతమైన వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.భారత అంతరిక్ష పరిశోధనలకు ముఖద్వారంగా మారిన శ్రీహరికోట ఏపీలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అత్యున్నతమైందని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగంతో భారతదేశ ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారాయన. భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారాయన. Congratulations to ISRO on its 100th launch from Sriharikota! Wishing continued success in serving the nation and achieving many more such milestones. Kudos to Team ISRO!#100thLaunch— YS Jagan Mohan Reddy (@ysjagan) January 29, 2025శ్రీహరికోట నుంచి ఈ ఉదయం ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివెరిసింది. -
బాబు అబద్ధాల బుద్ధుడు.. లోకేష్ కోసమే సంపద సృష్టి: భూమన
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం. .. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.లోకేష్ కోసమే సంపద సృష్టి:రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?. .. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు. -
వైఎస్ జగన్‌పై కేసుల విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్‌పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్‌పై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
చదువు, వైద్యంపై వైఎస్ జగన్ కృషి గొప్పది: రచయిత హర్ష్ మందర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు ప్రముఖ రచయిత హర్ష్ మందర్. అలాగే, ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి వంటి అంశాలపై వైఎస్ జగన్ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కోసం ప్రముఖ రచయిత హర్ష్ మందర్ సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హర్ష్ మందర్ సాక్షితో మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల విషయంలో సమాజంలోని ప్రతీ వ్యక్తి సానుకూల దృక్పథంతో ఉండాలి. వారి ఉన్నతికి కృషి చేయాలి. ఈ మాట ఆదర్శంగా అనిపించవచ్చు. కార్యాచరణకు చాలా దూరమనీ అనిపించవచ్చు. అలాగని నేను చెప్పడం మానను. చెబుతూ ఉంటేనే ఆలోచన వస్తుంది. అది ఏదో ఒక రోజు కార్యాచరణవైపు నడిపిస్తుంది. ఆ దశకు చేరుకునే వరకు చెబుతూనే ఉంటాను.పాలకులకు కూడా అట్టడుగు వర్గాల వారి పట్ల ఆ సానుకూల దృక్పథం ఉండాలి. దాన్ని సంక్షేమం, అభివృద్ధి రూపంలో చూపించాలి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి లాంటివాటి పట్ల దృష్టి పెట్టాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. వీటి విషయంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన, విజన్ చాలా గొప్పవి. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారు. వాటిని తాను ఎంత వరకు నెరవేర్చగలరో కసరత్తు చేశారు. చదువు, ఆరోగ్యం విషయాల్లో వాటిని అమలు చేశారు. ఆ రంగాల్లో ఆయన చేసిన కృషి అభినందించదగినది. ఈ విషయంలో ఆయన ఇతర రాష్ట్రాలకూ మార్గదర్శకంగా నిలిచారని చెప్పవచ్చు అని ప్రశంసించారు. -
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం... రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
సిబ్బందిని కుదించేశారు..
సాక్షి, అమరావతి: రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారు ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల ఉద్యోగులను మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ⇒ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఐఓటీ తదితర సాంకేతిక విధానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులను ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ పేరుతో ఆయా సచివాలయాల్లో కొనసాగిస్తారు. ⇒ రేషనలైజ్ తర్వాత మిగులు ఉద్యోగులుగా గుర్తించే వారిని ఇతర ప్రభుత్వ శాఖలలో వినియోగించుకోవటంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ⇒ ఏదైనా గ్రామం సంబంధిత సచివాలయానికి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పంచాయతీకి ఇబ్బంది లేకుండా సమీప సచివాలయం పరిధిలో చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి మిగులు ఉద్యోగులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శి, వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు వార్డు అడ్మిన్ సెక్రటరీ హెడ్‌గా కొనసాగుతారు. ⇒ సచివాలయాల పర్యవేక్షణకు కొత్తగా మండల లేదా మున్సిపల్ స్థాయితో పాటు జిల్లా స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగులు సిబ్బందిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ ఆస్పిరేషనల్ ఉద్యోగుల ద్వారా సచివాలయాల స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ అక్షరాస్యత, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించనున్నారు. వీఆర్వో కోసం వెతుక్కోవాల్సిందే..!ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రేషనలైజేషన్ అనంతరం చాలా సచివాలయాల్లో ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే ఉద్యోగులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ప్రస్తుతం సచివాలయాల్లో ప్రజలు వెళ్లగానే వారి నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడే కంప్యూటర్లో అప్లోడ్ చేసి రశీదు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఇకపై చాలా చోట్ల ఉండరు. 2,500 లోపు జనాభా ఉండే సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఆరుకు కుదింపు కారణంగా ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిసెంట్లలో ఎవరో ఒకరు మాత్రమే పని చేస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల సరి్టఫికెట్ల జారీలో కీలకమైన వీఆర్వోలు రేషనలైజేషన్ అనంతరం దాదాపు అన్ని చోట్ల ప్రతి రెండు సచివాలయాల్లో ఒకరు చొప్పున మాత్రమే విధులు నిర్వహించే అవకాశం ఉంది. వ్యవసాయ సహాయకుడు, పశు సంరక్షక సహాయకుడు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లు సైతం రెండు సచివాలయాలకు ఒకరు చొప్పున మాత్రమే పని చేస్తారు. వార్డు సచివాలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉత్పన్నం కానుంది. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(జనవరి26) వైఎస్జగన్ ఎక్స్(ట్విటర్)లో ఒక ట్వీట్ చేశారు.‘విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు నాగేశ్వరరెడ్డి. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స అందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు,చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం’ వైఎస్ జగన్ పేర్కొన్నారు.విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారైన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
పద్మ అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి : పద్మ అవార్డు గ్రహీతలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి.. భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025 పద్మా అవార్డుల ప్రకటన గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.వారిలో ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు లభించాయి. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు