Tamil Nadu
-
బెయిల్ కోసం కోర్టులో కస్తూరి పిటిషన్
● నిద్ర లేక జైలులో అవస్థలు సాక్షి, చైన్నె: బెయిల్ కోసం చైన్నె ఎగ్మూర్ కోర్టులో సినీ నటి కస్తూరి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పులల్ జైలులో ఆమె నిద్ర లేక, సరిగ్గా ఆహారం తినక అవస్థలు పడుతున్నట్టు అందులో పేర్కొన్నారు. వివరాలు.. తెలుగు వారిని కించపరిచే విధంగాఅనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని పోలీసులు అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టు ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం పుళల్ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. ఆదివారం జైలుకు వెళ్లే ముందుగా ఆమె జ్యూస్ , శాండ్ విజ్ తీసుకున్నారు. ఇతర మహిళా ఖైదీలతో పాటు ఓ గదిలో ఆమెను ఉంచారు. రాత్రంతా జైలులో ఆమె నిద్ర పోకుండా బాధ పడుతున్నట్టు తెలిసింది. సోమవారం జైలులో ఉదయం , మధ్యాహ్నం పొంగలి, కిచ్చెడి వంటి ఆహారం అందజేసినా ఆమె వాటిని కొంత మాత్రమే తీసుకుని మిగిలినవి తినకుండా పడేసినట్టు వెలుగు చూసింది. సినీ సెలబ్రటీ కావడంతో ఆమెకు ఏ 1 సౌకర్యాలతో గది కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆమె దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మూర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
కిలాంబాక్కం నుంచి పంబకి ప్రత్యేక బస్సులు
తిరువొత్తియూరు: శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం శబరిమల ఎక్స్‌ప్రెస్ బస్సు చైన్నె, తిరుచ్చి, మధురైతో సహా నగరాల నుంచి ప్రారంభించబడింది. అదేవిధంగా అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం మొదట పంౖబ నుంచి కిలాంబాక్కంకు ప్రత్యేక బస్సును విధిగా నడిపారు. ఇక మండల పూజ కోసం శబరిమల అయ్యప్పన్ ఆలయం ఆదివారం తెరిచారు. దీంతో శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం, తమిళనాడులోని ప్రధాన నగరాల నుంచి ప్రభుత్వ త్వరిత రవాణా సంస్థ ప్రతి సంవత్సరం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 16 వరకు భక్తుల కోసం చైన్నె కోయంబేడు, కిలాంబాక్కం, తిరుచ్చి, మదురై, పుదుచ్చేరి, కడలూరు నుంచి పంబ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. -
చోరీ కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్
అన్నానగర్: కొరటూరు ప్రాంతానికి చెందిన పునేష్(22) చైన్నెలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రూ.45,000 విలువైన యాపిల్ వాచ్‌ని శనివారం ఆన్లైన్లో ఆర్డర్ చేసి డెలివరీ చేసేందుకు కరుణాకరన్(36) వచ్చాడు. తర్వాత పునేష్కు ఫోన్ చేసి శ్రీమీరు ఆర్డర్ చేసిన యాపిల్ వాచ్ డెలివరీ చేయడానికి ఎక్కడికి రావాలిశ్రీ అని అడగ్గా.. అన్నానగర్ ఏరియాకు రమ్మని తెలిపాడు. అక్కడికి రాగానే పార్సిల్‌ను విప్పి, చూపించాడు ఆ సమయంలో, కరుణాకరన్ రూ.48 వేలు చెల్లించమని అడిగాడు. జీపే ద్వారా డబ్బులు పంపానని చెప్పి, కరుణాకరన్‌ను అడగడంతో రాలేదన్నారు. అప్పుడు పునేష్ శ్రీఅయితే కాసేపు ఇక్కడే ఉండు, నేను ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుని వస్తాశ్రీ అని చెప్పి కరుణాకరన్‌కు పార్శిల్ ఇచ్చి వెళ్లిన పునేష్ తిరిగి రాలేదు. దీంతో అనుమానం చెందిన అతను ఆ పార్శిల్ చూసి షాక్ అయ్యాడు. దానిలో నకిలీ ఆపిల్ వాచ్ ఉంది. దీంతో బాధతో తిరిగి వెళ్తుండగా బైకుపై నిల్చున్న పునేష్ను గుర్తించాడు. వెంటనే కరుణాకరన్ ఇచ్చిన సమాచారం మేరకు అన్నానగర్ పోలీసులు వచ్చి పునేష్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద విచారణ చేపట్టాడు. యాపిల్ వాచ్ కొనేంత డబ్బు తన దగ్గర లేదని, ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నప్పుడు నకిలీ ఆపిల్ వాచ్ కొన్నట్టు తెలిపారు. డెలివరీ ఉద్యోగి రాగానే పార్సిల్ విప్పి, డూప్లికేట్ పెట్టి అతని దృష్టిని మళ్లించానని పునేష్ తెలిపాడు. ఆ తర్వాత అతడి నుంచి యాపిల్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
నవ భారతాన్ని నిర్మించుకుందాం..!
సాక్షి, చైన్నె: శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ దూసుకెళ్తోందని, 2047 నాటికి నవభారతాన్ని నిర్మించుకుందాం అని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు. చైన్నె మదుర వాయిల్ లోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 33వ స్నాతకోత్సవ వేడుకల సెషన్స్ – 2 వేడుక ఆదివారం జరిగింది. స్థానిక వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ వైద్య కళాశాల వేదికగా యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ ఏసీ షణ్ముగం అధ్యక్షతన ఎంబీబిఎస్, బీడీఎస్, ఎండీఎస్ బీఎస్సీ, ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సులలో యూజీ, పీజీ పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ డిగ్రీ, ర్యాంకులను ప్రదానం చేశారు. వర్సిటీ ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి. గోపాల కృష్ణన్, వీసీ డాక్టర్ ఎస్. గీతా లక్ష్మీ వార్షిక నివేదికను, విద్యార్థుల వివరాలను వేడుకలో వివరించారు. అతిథులను ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఏసీఎస్ అరుణ్‌కుమార్ సత్కరించారు . ఇందులో రిజిస్ట్రార్ డాక్టర్ సీబీ పళనివేలు, సెక్రటరీ ఎ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు.. ఆయా రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ముగ్గురు ప్రముఖులకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్లను కేంద్ర మంత్రి మురుగన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జీఏ శ్రీనివా మూర్తికి అందజేశారు. అలాగే ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్, సినీ దర్శకులు పి. వాసుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ 2047 నాటికి 100వ స్వాత్రంత్య దినోత్సంను భారత్ జరుపుకోనుందన్నారు. ఈ సమయానికి భారత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలవబోతోందని వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం డిజిటల్ యుగంలో దూసుకెళ్తోందన్నారు. స్టార్టప్‌ల విస్తృతం అవుతున్నాయని, నవ భారత నిర్మాణం దిశగా అడుగుల వేగం పెరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనలో విద్యాసంస్థలు సైతం కీలక పాత్రను పోషించాలని సూచించారు. కేంద్ర మంత్రి మురుగన్ వ్యాఖ్య నటుడు అర్జున్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం -
టీఎన్‌సీసీలో గ్రామ కమిటీలు
● 12 వేల గ్రామాలలో ఏర్పాటుకు నిర్ణయం ● రంగంలోకి ఇన్‌చార్జ్‌లు సాక్షి, చైన్నె: పార్టీ బలోపేతం దిశగా రాష్ట్రంలో మళ్లీ గ్రామ కమిటీల ఏర్పాటుకు టీఎన్‌సీసీ నిర్ణయించింది. గ్రామ స్థాయిలో పటిష్ట వంతంగా కేడర్‌ను తీర్చిదిద్దే విధంగా ఈ కమిటీల ఏర్పాటుకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ఆదేశాలు ఇచ్చారు. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్‌లోని గ్రూపులకు కొదవ లేదు. ఆయా గ్రూపులు పదవులను వాటాలు వేసుకుని పంచుకోవడం జరిగేది. ఈ పద్ధతిని మార్చే దిశగా కొత్త అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై వ్యూహాలకు పదును పెట్టారు. గ్రూపులకు అతీతంగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని గుర్తించి జిల్లాల అధ్యక్షులు, ఇతర కమిటీ ఎంపికకు కసరత్తులలో ఉన్నారు. అదే సమయంలో గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా గ్రామ కమిటీల మీద దృష్టి పెట్టారు. గ్రామాలలో గతంలో కాంగ్రెస్‌కు అధిక పట్టు ఉండడం, దీనిని మళ్లీ చేజిక్కించుకునే విధంగా గ్రామ కమిటీల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టారు. ఈ ప్రక్రియకు ఈనెల 5న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ కమిటీలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాలలో ఈ కమిటీలను ఈ డిసెంబరు మూడో వారంలోపు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఈకమిటీల ఎంపిక తదితర ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న అన్ని జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. -
కులమతాలకు అతీతంగా జీవిద్దాం
● రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కొరుక్కుపేట: కులమతాలకు అతీతంగా మనమంతా జీవించాలని రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి పిలుపునిచ్చారు. చైన్నె హిందూ ప్రచారక్ సంఘ్, డీఏవీ కళాశాల –అజ్మిర్, రాజ్ భవన్ తమిళనాడు సంయుక్తంగా కలసి రెండురోజులు పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. రాజ్ భవన్ వేదికగా రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఈ సదస్సును శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా ఒకే కుటుంబం అని వ్యాఖ్యానిస్తూ కులమతాలకు అతీతంగా జీవించాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఎన్. లక్ష్మీ అయ్యర్, డాక్టర్ కేటీ మురుగేశన్, ప్రొఫెసర్ సంజయ్ అరోరా సాఽరథ్యంలో ఈ సదస్సు నిర్వహించగా దాదాపు 200 మంది పాల్గొన్నారు. వేమన, తిరువళ్లూవర్, కబీర్దాస్ గురించి సదస్సులు నిర్వహించిన పలువురు ప్రసంగించారు. ఇందులో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు డాక్టర్ ఏవి శివకుమారి కబీర్దాస్, యోగి వేమన గురించి ప్రసంగించారు. ఆదివారంతో ఈ సదస్సు విజయవంతంగా ముగియగా అందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు. డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి. కల్పనాగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అవయవదానం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని ముల్లిపాల్యంలోని వీరాస్వామి వీధికి చెందిన ఆనందన్ కుమారుడు అవినేష్(30). ఇతను బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. అవనేష్ ఈనెల 14న వానియంబాడికి బైకులో వెళ్లాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని తల్లిదండ్రులు చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అవినేష్కు శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని అవయవాలను దానం చేసేందుకు అత ని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దీంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో అవయవాలను దానంగా అందజేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అవయవాలు దానం చేయడంతో ప్రభుత్వం తరపున సబ్ కలెక్టర్ బాల సుబ్రమణియన్ అవినేష్ మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. చైన్నెకి ఫైనాన్స్ కమిటీ సభ్యులు ● నాలుగు రోజుల పర్యటన సాక్షి,చైన్నె : భారత ఫైనాన్స్ కమిషన్ బృందం ఆదివారం రాత్రి చైన్నెకు చేరుకుంది. నాలుగు రోజుల పాటు తమిళనాడులో ఈ బృందం పర్యటించనుంది. భారత దేశ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని ఈ బృందంలో సభ్యులు అజయ్ నారాయణ్, జార్జ్ మాథ్యు, మనోజ్ పాండ,సౌమ్య తదితరులు ఉన్నారు. చైన్నెకు వచ్చిన ఈ బృందం ఓ హోటల్లో బస చేసింది. సోమవారం తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్థిక మంత్రితో పాటు అధికారులతో ఈ బృందం సమావేశం కానుంది. విల్లుపురంలో క్షేత్రస్థాయి పర్యటన సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ ఈనెల 28,29 తేదీలలో విల్లుపురం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం ఈ సమాచారాన్ని విల్లుపురం డీఎంకే వర్గాలకు లేఖ రూపంలో స్టాలిన్ తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు,ప్రాజెక్టుల సమీక్షతో పాటుగా పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటనలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తదుపరి పర్యటనగా విల్లుపురం జిల్లాలో ఈనెల 28,29 తేదీలలో పర్యటించనున్నారు. సంగీత మాంత్రికుడికి ఎక్స్టీఐసీ అవార్డు ప్రదానం సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఐఐటీ మద్రాసు వర్చువల్ రియాలిటీ సెంటర్ ఎక్స్టీఐసీ అవార్డు – 2024ను ఆదివారం చైన్నెలో ప్రదానం చేశారు. వీఆర్ ఫిల్మ్ లీ మాస్క్ లఘు చిత్రానికి దర్శకత్వం నిర్మాత తదితర బాద్యతలు వహించినందుకు గాను ఈ అవార్డుతో ఐఐటీ మద్రాసు ఏ ఆర్ రెహ్మాన్‌ను సత్కరించింది. భారతదేశంలో అకాడమీ – ఇండస్ట్రీ సపోర్టెడ్ శ్రీఎక్స్టెండెడ్ రియాలిటీ( ఎక్స్ ఆర్) సమ్మిట్‌లో తొలిసారిగా ఈ అవార్డును అందజేశారు. ఓకులస్ వర్సిటీ ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త స్టీవెన్ లావల్లే, ప్రొఫెసర్ అన్నా లావల్లేలు ఏఆర్ రెహ్మాన్‌కు ఈ అవార్డును అందజేశారు. 2022లో రూపుదిద్దుకున్న లీమస్క్ డాక్యుమెంటరీ చిత్రంలో ఏఆర్ రెహ్మాన్ కృషిని ఈసందర్భంగా వివరిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి. కామకోటి, ఐఐటీ మద్రాసు బయో మెడికల్ ఇంజినీరింగ్, అప్లైడ్ మెకానిక్స్ విభాగం ప్రొఫెసర్, ఎక్స్టీఐసీ హెడ్ ఎం. మణివణ్ణన్ తదితరులు పాల్గొన్నారు. లాటరీ కింగ్ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు సాక్షి, చైన్నె: లాటరీ కింగ్ మార్డిన్ను టార్గెట్ చేసి రంగంలోకి దిగిన ఎన్ఫౌర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాల సోదాలు ఆదివారం ముగిశాయి. నాలుగు రోజుల పాటు చైన్నె, కోయంబత్తూరులలో ఈ సోదాలు జరిగాయి. చైన్నెలోని మార్టిన్ అల్లుడు, వీసీకే నేత అదవ అర్జునన్ ఇళ్లు, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. కోయంబత్తూరు తుడియలూరుకు చెందిన లాటరీ వ్యాపారి మార్టిన్‌ను కింగ్ ఆఫ్ లాటరీ అని అందరూ పిలుస్తున్న విషయం తెలిసిందే. సిక్కిం లాటరీ టిక్కెట్ల అమ్మకాల్లో నియమాలను అతిక్రమించి కేరళలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలతో గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తదుపరి ఈడీ రంగంలోకి దిగింది. ఈ నాలుగు రోజుల సోదాలలో సుమారు 10 కోట్ల నగదుతో పాటు కీలక రికార్డులు బయటపడినట్లు సమాచారం. -
టీఎన్‌సీసీలో గ్రామ కమిటీలు
● 12 వేల గ్రామాలలో ఏర్పాటుకు నిర్ణయం ● రంగంలోకి ఇన్‌చార్జ్‌లు సాక్షి, చైన్నె: పార్టీ బలోపేతం దిశగా రాష్ట్రంలో మళ్లీ గ్రామ కమిటీల ఏర్పాటుకు టీఎన్‌సీసీ నిర్ణయించింది. గ్రామ స్థాయిలో పటిష్ట వంతంగా కేడర్‌ను తీర్చిదిద్దే విధంగా ఈ కమిటీల ఏర్పాటుకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ఆదేశాలు ఇచ్చారు. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్‌లోని గ్రూపులకు కొదవ లేదు. ఆయా గ్రూపులు పదవులను వాటాలు వేసుకుని పంచుకోవడం జరిగేది. ఈ పద్ధతిని మార్చే దిశగా కొత్త అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై వ్యూహాలకు పదును పెట్టారు. గ్రూపులకు అతీతంగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని గుర్తించి జిల్లాల అధ్యక్షులు, ఇతర కమిటీ ఎంపికకు కసరత్తులలో ఉన్నారు. అదే సమయంలో గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా గ్రామ కమిటీల మీద దృష్టి పెట్టారు. గ్రామాలలో గతంలో కాంగ్రెస్‌కు అధిక పట్టు ఉండడం, దీనిని మళ్లీ చేజిక్కించుకునే విధంగా గ్రామ కమిటీల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టారు. ఈ ప్రక్రియకు ఈనెల 5న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ కమిటీలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాలలో ఈ కమిటీలను ఈ డిసెంబరు మూడో వారంలోపు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఈకమిటీల ఎంపిక తదితర ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న అన్ని జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. -
బీజేపీలో అన్నాడీఎంకే విలీనం తథ్యం
సాక్షి, చైన్నె: డీఎంకే ఉత్తర చైన్నె నాయకుడు ఆర్డీ శేఖర్ నేతృత్వంలో టోల్గేట్ సమీపంలోని ఓ కల్యాణ వేదికలో పేదల దినోత్సవం పేరిట 48 జంటలకు సామూహిక వివాహ వేడుకను ఆదివారం నిర్వహించారు. కొత్త జంటలకు 66 రకాల వస్తువులతో సారెను అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ వివాహాలు జరిగాయి. నవ జంటలకు తాళిబొట్లను ఉదయనిధి అందజేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సభలో ఉదయనిధి మాట్లాడుతూ, పేదరిక దినోత్సవం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కొత్త జంటలలో అనేక మంది ప్రేమించి వివాహం చేసుకుని ఉన్నట్లు చెప్పారని వ్యాఖ్యలు చేశారు. ఇది స్వీయ మర్యాద వివాహం అని, ఒకర్ని మరొకరు అర్థం చేసుకుని, సర్దుకుని మంచి స్నేహితులుగా, ఉత్తమ జంటలుగా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఇలాంటి వివాహాలు తమిళనాడులో విస్తృతం అయ్యాయని వివరించారు. ఆ దిశగా ద్రావిడ ఇయక్కం ఏర్పాట్లు చేస్తూ, సామూహిక వివాహాల నిర్వహణలో రికార్డుల దిశగా ముందుకెళ్తోందన్నారు. వీలీనం చేసేస్తారేమో? అన్ని పథకాలకు కలైంజ్ఞర్ పేరు పెట్టేస్తున్నట్టుగా తెగ విమర్శలు చేస్తున్నారని, 96 సంవత్సరాల వయస్సు వరకు తమిళ ప్రజల కోసం కరుణానిధి అహర్నిశలు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. ఆయనపేరు పెట్టకుండా కూవత్తూరులో బొద్దింక వలే పాకుతూ వెళ్లిన వారి పేరు పెట్టాలా..? అని ప్రశ్నించారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత పేరు పెట్టినా అంగీకరించని పరిస్థితులలో ప్రస్తుతం పళణి స్వామి ఉన్నారని మండి పడ్డారు. ఇందుకు కారణం ప్రస్తుతం ఆయన మది నిండా మోదీ, అమిత్‌షా మాత్రమే ఉండటమేనని వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల క్రితం బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసిన పళణి స్వామి, ఇప్పుడు కొత్త పలుకు అందుకుని ఉన్నారని విమర్శించారు. సేలంలో ఐటీ దాడి జరగగానే, కూటమి గురించి ఎన్నికల సమయంలో మాట్లాడుకుందామని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి దాడులు మరో రెండు మూడు జరిగితే చాలు తక్షణం బీజేపీలోకి అన్నాడీఎంకేను విలీనం చేసేస్తారని, ఆదిశగానే ఆయన చర్యలు, అన్నాడీఎంకే పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. ఎంపీ ఎన్నికలలో 40కు 40 స్థానాలతో రికార్డును సృష్టించే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేస్తూ, 2026 ఎన్నికలలోప్రజా మద్దతుతో 200 స్థానాలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా శ్రమిద్దామని కేడర్‌కు పిలుపు నిచ్చారు. విస్మయం.. ఈ వివాహ వేడుకలో ఉదయనిధి స్టాలిన్ తన చేతుల మీదుగా తాళి బొట్టు అందజేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఓ వరుడికి అందజేయాలని తాళిబొట్టును అతడి తల్లికి అందజేశారు. అయితే ఆమె హడావుడిలో తన కుమారుడి చేతికి తాళి బొట్టు ఇవ్వకుండా వధువుకు ఆమె కట్టే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న వారందర్నీ విస్మయంలో పడేసింది. తక్షణం ఉదయ నిధి ఆమెను వారిస్తూ వరుడికి అందజేయాలని సూచించడం గమనార్హం. ఈ ఘటన కాసేపు అక్కడున్న వారందర్నీ నవ్వుకునేలా చేసింది. ఈ వేడుకకు మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు తదితరులు హాజరయ్యారు. సంస్కృతి, భాషాభ్యున్నతే లక్ష్యం.. తమిళనాడులో ద్రావిడ ఇయక్కం కొత్త విప్లవం దిశగా ముందుకు వెళ్తోందని, ఇలాంటి సంస్కృతి విస్తృతం కావాలని ఆకాంక్షించారు. అయితే ఆర్యులు, వారి మద్దతుదారులు, బానిసల గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి ఉందని గుర్తు చేస్తూ, ఇలాంటివి చూస్తే కడుపు మంటతో వారిలో కోపం పెరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు తగలాల్సిన వారికి తగులుతాయని పేర్కొన్నారు. వారి కడుపు మంట, కోపం గురించి అవసరం లేదని, తమిళనాడు సంస్కృతి, తమిళ భాషాభ్యున్నతి , పరిరక్షణ లక్ష్యంగా తమిళుల జీవితాలు ఉజ్వలమయం కావడమే కాకుండా ప్రపంచ దేశాలలో వర్థిల్లే విధంగా ద్రావిడ ఇయక్కం సీఎం విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం స్టాలిన్ అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులు చూసిన ప్రజలు ఆయన వెళ్లిన చోటంతా బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. 1.16 కోట్ల మంది మహిళలకు ప్రతినెలా బ్యాంక్ ఖాతాలలో రూ.1000 జమ చేయడం వంటి పథకాలకు ఆకర్షితులైన వాళ్లు సీఎంకు జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూసి ఓర్వ లేక అన్నాడీఎంకే నేత పళణి స్వామిలో కడుపు మంట రెట్టింపు అయి ఉందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఏదో ఒక రకంగా నిందలు వేయడం, బురద చల్లడం లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు పళణి స్వామి ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారంటూ విమర్శలు తమిళ సంప్రదాయల పరిరక్షణే ధ్యేయంగా పాలన 48 జంటలకు వివాహం, సారె సమర్పణ ‘‘వరుసగా ఐటీ, ఈడీ దాడులు జరిగితే చాలు.. బీజేపీలో అన్నాడీఎంకేను వీలినం చేసేస్తారు, ఆ దిశగానే ఆ పార్టీ నేత పళణి స్వామి చర్యలు ఉన్నాయి..’’ అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళ సంస్కృతి, భాషాభ్యున్నతే లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన జరుగుతోందన్నారు. -
నవ భారతాన్ని నిర్మించుకుందాం..!
సాక్షి, చైన్నె: శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ దూసుకెళ్తోందని, 2047 నాటికి నవభారతాన్ని నిర్మించుకుందాం అని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు. చైన్నె మదుర వాయిల్ లోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 33వ స్నాతకోత్సవ వేడుకల సెషన్స్ – 2 వేడుక ఆదివారం జరిగింది. స్థానిక వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ వైద్య కళాశాల వేదికగా యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ ఏసీ షణ్ముగం అధ్యక్షతన ఎంబీబిఎస్, బీడీఎస్, ఎండీఎస్ బీఎస్సీ, ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సులలో యూజీ, పీజీ పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ డిగ్రీ, ర్యాంకులను ప్రదానం చేశారు. వర్సిటీ ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి. గోపాల కృష్ణన్, వీసీ డాక్టర్ ఎస్. గీతా లక్ష్మీ వార్షిక నివేదికను, విద్యార్థుల వివరాలను వేడుకలో వివరించారు. అతిథులను ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఏసీఎస్ అరుణ్‌కుమార్ సత్కరించారు . ఇందులో రిజిస్ట్రార్ డాక్టర్ సీబీ పళనివేలు, సెక్రటరీ ఎ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు.. ఆయా రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ముగ్గురు ప్రముఖులకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్లను కేంద్ర మంత్రి మురుగన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జీఏ శ్రీనివా మూర్తికి అందజేశారు. అలాగే ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్, సినీ దర్శకులు పి. వాసుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ 2047 నాటికి 100వ స్వాత్రంత్య దినోత్సంను భారత్ జరుపుకోనుందన్నారు. ఈ సమయానికి భారత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలవబోతోందని వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం డిజిటల్ యుగంలో దూసుకెళ్తోందన్నారు. స్టార్టప్‌ల విస్తృతం అవుతున్నాయని, నవ భారత నిర్మాణం దిశగా అడుగుల వేగం పెరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనలో విద్యాసంస్థలు సైతం కీలక పాత్రను పోషించాలని సూచించారు. కేంద్ర మంత్రి మురుగన్ వ్యాఖ్య నటుడు అర్జున్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం -
మదురైలో రచ్చ..రచ్చ
● స్థలం స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు ● ఏకమైన గ్రామీణులు ● రంగంలోకి బలగాలు సాక్షి,చైన్నె: మదురై విమానాశ్రయం విస్తరణ పనులు ఆదివారం రచ్చకెక్కాయి. స్థలం స్వాధీనానికి వెళ్లిన అధికారులను గ్రామీణ ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలంతా ఏకమై అధికారులను గ్రామాలలోకి అనుమతించక పోవడంతో బలగాలు రంగంలోకి దిగాయి. వివరాలు.. మదురైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి మలేషియా, సింగపూర్ వంటి దేశాలతో పాటు దేశంలోని పలు నగరాలకు విమాన సేవలు జరుగుతున్నాయి. ఈ విమానాశ్రయం విస్తరణ గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ విమానాశ్రయం రన్‌వేతో పాటు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవల స్థలాన్ని కేటాయించింది. 633 ఎకరాల స్థలంలో విస్తరణ పనులపై దృష్టి పెట్టారు. ఈ స్థలాలను స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. విమానాశ్రయం సమీపంలోని చిన్న ఉడైప్పు, ఆలంకులం, పెరుంగుడి, పరమం పట్టి గ్రామాలలో ఈ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయంలో ఇక్కడి ప్రజలకు మదురై కార్పొరేషన్ పరిధిలోనే గృహాలను నిర్మించి ఇవ్వాలన్న నినాదంతో పాటు నష్ట పరిహారం పెంపు, పంట పొలాలను స్వాధీనం చేసుకోకూడదన్న డిమాండ్‌తో గ్రామాల ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఉద్రిక్తత.. ఆదివారం రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు విజయలక్ష్మి, ప్రభాకరన్, శక్తి వేల్, కార్తికేయన్, సురేష్ తదితర అధికారుల నేతృత్వంలో పదుల సంఖ్యలో పోలీసులు గ్రామాలలోకి వెళ్లారు. ఈ గ్రామాల్లోకి ముందుగా చిన్న ఉడైప్పు గ్రామాన్ని దాటినానంతరం లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రవేశమార్గంలోని చిన్న ఉడైప్పు గ్రామం వద్ద గ్రామీణ ప్రజలు వందలాదిగా ఏకమయ్యారు. అధికారులు స్థల స్వాధీనానికి వెళ్లేందుకు వీలు లేని రీతిలో అడ్డుకున్నారు. ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకుల మీదకు ఎక్కేశారు. గ్రామాల ప్రవేశ మార్గంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు ముందుకు సాగ లేని పరిస్థితి ఏర్పడింది. స్థల స్వాధీనంను అడ్డుకుని తీరుతామని, తమ పంట పొలాల జోలికి రావద్దు అంటూ గ్రామీణ ప్రజలు నినాదిస్తూ కూర్చున్నారు. వీరిని బుజ్జగించేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పకుండా బలగాలను రంగంలోకి దించి మొహరించారు. గ్రామీ ణ ప్రజలతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. -
సూర్య, చంద్రప్రభ వాహనాలపై కై లాస వాసుడు
చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీఅగస్తేశ్వరస్వామి(ముక్కోటి)వారి ఆలయంలో వారం రోజులుగా రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి, స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. తదుపరి మధ్యాహ్నం ఆలయ ఆవరణలో కొలువైన మహాలక్ష్మీ అమ్మవారికి అభిషేక సేవ నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామి, అ మ్మవార్లు చంద్రప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు పూలంగిసేవ.. ఉద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు పూలంగిసేవ నిర్వహించనున్నారు. ఉద యం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు జరుపుతారు. అనంతరం ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు పూలంగిసేవను వేడుకగా నిర్వహించనున్నారు. -
మృతి చెందిన వ్యక్తి పేరుతో పింఛన్
● తల్లీకొడుకులపై పోలీసులకు ఫిర్యాదు అన్నానగర్: మృతి చెందిన ఉపాధ్యాయుడి పేరుతో పింఛను పొందుతున్న భార్య, కొడుకులపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. తిరుచ్చి జిల్లా తురైయూరు సమీపంలోని మరడి గ్రామానికి చెందిన రంగరాజన్ తురైయూర్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఆయనకు శాఖాపరమైన స్థాయి ట్రెజరీ ద్వారా పింఛన్ అందజేసేవారు. ఈ స్థితిలో రంగరాజన్ అనారోగ్యంతో చనిపోయాడు. రంగరాజన్ వారసులు, భార్య జయకోడి, కుమారుడు జయదేవ ఈ విషయాన్ని డిపెండెంట్ ట్రెజరీకి తెలియజేయకుండా దాచిపెట్టారు. అలాగే ట్రెజరీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్ బిల్లు ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో పెన్షనర్లు ప్రాణాలతో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు హాజరు కానివారు గెజిటెడ్ రిజిస్టర్డ్ అధికారి నుంచి పెన్షన్ సర్వైవల్ సర్టిఫికెట్ పొంది డిపెండెన్సీ ఫండ్‌లో సమర్పించడం ఆచారం. దీన్ని అనుసరించి, మరణించిన రంగరాజన్ వారసులు ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో పింఛనుదారులు జారీ చేసిన మనుగడ ధ్రువీకరణ పత్రాలను మోసపూరితంగా అందించారు. రంగరాజన్ పింఛన్ అతని బ్యాంక్ ఖాతాకు కొనసాగించారు. ఇది బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వచ్చింది. జయకోడి, జయదేవ 2015 నవంబర్ నుంచి 2024 మే వరకు వివిధ చెక్కుల ద్వారా రూ.49,69,279 మేరకు ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూకు రంగరాజన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ట్రెజరీ అధికారులు శనివారం రంగరాజన్ నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ తర్వాత 2015లో రంగరాజన్ చనిపోయాడని తెలిసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై తురైయూర్ హెల్ప్ డెస్క్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తురైయూర్ పోలీసులు విచారణ చేపట్టారు. -
వేడుకగా సీటీఏ కార్తీక వనభోజనాలు
● ఆకట్టుకున్న పోటీలు ● విజేతలకు బహుమతి ప్రదానం సాక్షి, చైన్నె: కార్తీక మాసం సందర్భంగా చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. చైన్నె పూందమల్లి సమీపంలోని క్వాలిటీ ఫార్మ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీటీఏ సభ్యులు, ఇతర తెలుగు వారు 340 మంది తరలి వచ్చారు. కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా వివిధరకాల ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీటీఏ అధ్యక్షుడు కె.గోపాలకృష్ణారెడ్డి, కార్యదర్శి సురేష్ గాడిపర్తి, ఉపాధ్యక్షుడు బి.వెంకయ్య నాయుడు, కోశాధికారి కె.నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఎం.రామయ్య, కమిటీ మెంబర్లు శ్రీను బాబు, మధుకర్, రామ్ ప్రసాద్, కొండస్వామి నాయుడు, మాజీ కల్చరల్ సెక్రటరీ శ్రీకాంత్, మాజీ కార్యదర్శి పి.వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు వారందర్నీ ఏకం చేసి ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, వన భోజనాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. తెలుగు వారంతా ఆనందంగా జీవించాలని, అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, తెలుగు వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. -
డెల్టా జిల్లాల్లో వర్షాలు
సాక్షి, చైన్నె: రాష్టంలోని డెల్టా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలుచోట్ల భారీ వర్షం పడింది. కడలూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, పుదుకోట్టై తదితర జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. తిరుకాట్ట పల్లి గ్రామంలో పిడుగు పడడంతో రైతు ఆర్ముగం భార్య భానుమతి(58) మరణించారు. ఇక నీలగిరులలోనూ మోస్తరుగా వర్షం పడుతోంది. కున్నూరు పరిసరాలలో కురిసిన వర్షానికి కొన్ని చోట్ల కొండ, మట్టి చరియలు విరిగి పడడంతో వాహనాల రాక పోకలు ఆటంకం తప్పలేదు. లైంగికదాడికి వృద్ధుడి అరెస్టు సేలం: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా తమ్మంపట్టి పరిధిలోని 5వ వార్డుకు చెందిన ఆరేళ్ల చిన్నారికి అనారోగ్యం ఏర్పడడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్టు తెలిపారు. ఈ విషయం గురించి చిన్నారి వద్ద తల్లిదండ్రులు విచారించగా.. గత 9వ తేది తల్లిదండ్రి ఇద్దరూ పనికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై పొల్జియం కాలనీకి చెందిన శాంతప్పన్(70) పశువుకు పచ్చి గడ్డి కోసుకుని వద్దామని తెలిపి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు ఆత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి శాంతప్పన్ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. శిశువు కిడ్నాప్ కేసులో యువతి అరెస్ట్ అన్నానగర్: తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన హరి. ఇతని భార్య దీప. వీరికి పిల్లలు లేరు. ఈ పరిస్థితిలో దీప గర్భవతిగా ఉన్నట్టు నటించింది. ఇక కన్నగి నగరానికి చెందిన నిశాంతికి పుట్టిన 45 రోజుల మగబిడ్డకు గత 13వ తేదీ ప్రభుత్వ సంక్షేమ సహాయం ఇప్పిస్తానని మోసం చేసి బిడ్డను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కన్నగి నగర్ పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. అప్పుడు కిడ్నాప్‌నకు గురైన బిడ్డను దీప తన భర్త వద్ద తనకు బిడ్డ పుట్టిందని తెలిపి తిరువేర్కాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి భర్తను పిలిపించి, బిడ్డను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న దీప కోసం ఇన్స్పెక్టర్ దయాళ్ నేతృత్వంలోని స్పెషల్ పోలీస్ ఫోర్స్ కూడా వెతికింది. ఇందులో దీప ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పరిశీలించగా కరూర్ సమీపంలోని ఓ గ్రామంలో ఆమె తలదాచుకున్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగి దీపను ఆదివారం అరెస్టు చేశారు. ఆమెను ప్రత్యేక పోలీసులు చైన్నెకి తీసుకొచ్చారు. రైతు సంఘం నాయకుడిపై దాడి తిరుత్తణి: రైతు సంఘాల సమాఖ్య మండల అధ్యక్షుడిగా లింగమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మండల వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ ప్రేమ్ తన సిబ్బందితో డిజిటల్ పంట సర్వే పనులు చేపట్టేందుకు టీసీ కండ్రిగకు చేరుకున్నారు. అక్కడి క్రషర్ ప్లాంట్ సిబ్బంది అధికారులను అడ్డుకుని, నిర్బంధించారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వ్యవసాయ సంఘం నాయకుడు లింగమూర్తిపై క్రషర్ సిబ్బంది దాడి చేశారు. సంఘటనకు సంబంధించి క్రషర్ నిర్వాహకులను అరెస్టు చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు మాట్లాడుతూ.. అధికారులు తమ విధులను చేయనివ్వకుండా అడ్డుకున్న క్రషర్ సిబ్బంది తీరు దారుణమన్నారు. దీన్ని వ్యతిరేకించిన రైతు సంఘం మండల అధ్యక్షుడిపై దాడిని ఖండిస్తున్నట్లు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరా రు. క్రషర్ సిబ్బంది, మేనేజర్‌ను అరెస్టు చే యాలని, రైతులకు, అధికారులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సముద్ర తీరం భద్రతపై అధ్యయనం
● కోస్ట్‌గార్డ్ పాత్రపై స్టాండింగ్ కమిటీ సమీక్ష సాక్షి, చైన్నె: సముద్ర తీర భద్రత పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసింది. కోస్టుగార్డ్ గస్తీ గురించి సమీక్షించింది. చైన్నె పర్యటనకు డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ శనివారం చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. చైర్మన్, ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ తొలుత చైన్నెలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీని సందర్శించింది. ఆదివారం ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సభ్యులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ నేతృత్వంలోని అధికారులతో సమావేశమయ్యారు. తమిళనాడు తీరం, భద్రత, సముద్రంలో గస్తీ వంటి అంశాల గురించి చర్చించారు. కోస్ట్‌గార్డ్ పనితీరు, వ్యూహాత్మక కార్యక్రమాలు, తీర ప్రాంత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధత గురించి సమగ్ర వివరాలను అధ్యయనం చేశారు. భారతదేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి, వివిధ భాగస్వామ్య దేశాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి, సముద్ర భద్రత, భద్రతకు భరోసా విధానాలను మెరుగుపరచడానికి భారత కోస్ట్ గార్డ్ కొనసాగిస్తున్న అంశాలను ఈ సందర్భంగా పరమేష్ వివరించారు. అక్రమంగా చేపల వేట, అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి సముద్ర భద్రత, కోస్టల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడం, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో కోస్టుగార్డు ఫోర్స్ గణనీయమైన పురోగతి గురించి వివరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల సాధించిన విజయాలపై కమిటీ సభ్యులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. -
గల్లంతైన యువకుల కోసం గాలింపు
అన్నానగర్: చైన్నె వెస్ట్ అన్నానగర్‌లోని కంబర్ కాలనీకి చెందిన గిరీష్(20) మొగప్పేర్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన రియాజ్(18) ఓ ప్రైవేట్ క్యాటరింగ్ కంపెనీలో వంట మనిషిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు గిరీష్, రియాజ్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మామల్లపురం వచ్చారు. తర్వాత సముద్రతీర ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న మత్స్యకారుల ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్రంలో అందరూ స్నానాలు చేశారు. ఆ సమయంలో గిరీష్, రియాజ్‌లు పెద్ద అలల్లో చిక్కుకున్నారు. అలలు సముద్రంలోకి ఈడ్చుకెళ్లిపోయాయి. షాక్‌కు గురైన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించారు. గిరీష్, రియాజ్‌లు సముద్రంలో మునిగి స్పృహ కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కోస్ట్‌గార్డు, మత్స్యకారుల సాయంతో బోటు వద్దకు వెళ్లి వెతికినా సముద్రంలో మునిగిపోయిన వారి ఆచూకీ లభించలేదు. ఈ స్థితిలో ఆదివారం ఉదయం 2వ రోజు వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. గిరీష్, రియాజ్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. -
క్లుప్తంగా
కేబుల్ టీవీలో పనిచేసే వ్యక్తి హత్య సేలం: తెన్కాశి సమీపంలోని కుట్రాళంలో ఆదివారం వేకువజామున కేబుల్ టీవీ సిబ్బంది ఒకరిని కత్తులతో నరికి హత్య చేశారు. తెన్కాశి జిల్లా కుట్రాళం కాశిమేజర్పురానికి చెందిన మురుగన్ కుమారుడు పట్టురాజన్ (27) కేబుల్ టీవీ సంస్థలో పని చేస్తున్నాడు. వేకువజామున పోస్టర్లను అతికించే పని కూడా చేస్తున్నాడు. ఈ స్థితిలో ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో పోస్టర్లను అతికిస్తున్నాడు. అక్కడకు ఆటోలో వచ్చిన ఒక ముఠా పట్టురాజన్పై కత్తులతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుట్రాళం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పట్టురాజన్ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తెన్కాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహ వేడుక జరుగుతున్న ఇంటి గోడకు పోస్టర్ అతికించిన సందర్భంగా వచ్చిన గొడవతో హత్యకు గురైనట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆటోలో వచ్చిన హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారు ఢీకొని యువకుడి మృతి ● మరొకరి పరిస్థితి విషమం తిరువళ్లూరు: వ్యక్తిగత పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు పయనమైనవారిని కారు ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పుదుకోట జిల్లా కుగూరు గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు శరత్‌కుమార్(27), వేలూరు జిల్లా పొయ్గై గ్రామానికి చెందిన కుభేరన్ కుమారుడు వెంకటేషన్(42) చైన్నెలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంలో తిరుత్తణికి వెళ్లి, పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు పయనమయ్యారు. పట్టరైపెరంబుదూరు వద్ద వస్తున్న సమయంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెనుక ఉన్న శరత్‌కుమార్, వెంకటేషన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రథమ చికిత్సను తిరువళ్లూరు వైద్యశాలలో అందించారు. మెరుగైన చికిత్స కోసం చైన్నె వైద్యశాలకు తరలించగా అక్కడే మృతి చెందారు. వెంకటేషన్ పరిస్థితి విషమంగా మారింది. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. బైక్ పైనుంచి పడి బ్యాంకు ఉద్యోగిని మృతి సేలం: పశువు అడ్డురావడంతో బైక్‌పై నుంచి పడిన మహిళా ఉద్యోగిని మృతి చెందింది. వీరవనల్లూర్ సమీపంలో పశువు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి కింద పడి భర్తతో వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది. నెల్లై టౌన్ సమీపంలోని పేట్టైపుదుగ్రామానికి చెందిన సంతానం, భార్య నివేద ప్రియదర్శిని (32) దంపతులు. సంతానం ఒక కళాశాలలో అధ్యాపకుడిగా చేస్తుండగా, ప్రియదర్శిని కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఉన్న ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఈ స్థితిలో శనివారం భర్తతో నివేద బైక్‌పై ఉద్యోగానికి బయలుదేరింది. వారు వీరవనల్లూర్ సమీపంలో వస్తుండగా అకస్మాత్తుగా ఒక పశువు వేగంగా రావడంతో బైకు అదుపుతప్పి ప్రియదర్శిని కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికుల సహాయంతో పాలయంకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం నివేద ప్రియదర్శిని మృతి చెందింది. తిరుత్తణిలో భక్తుడి బైక్ చోరీ తిరుత్తణి: తిరుత్తణి కొండపై ఆలయం వద్ద భక్తుడి బైక్ చోరీ అయింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరక్కోణం సమీపంలోని పెరుమూచ్చి గ్రామానికి చెందిన నితీష్(43) ఆదివారం ఉదయం బైకులో తిరుత్తణి ఆలయానికి వచ్చాడు. కొండపై ఆలయం వద్ద బైక్‌ను పార్కింగ్ చేసి, స్వామి దర్శనానికి వెళ్లాడు. గంట తరువాత వచ్చి చూడగా బైక్ లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందాడా. బైకు చోరీపై తిరుత్తణి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విధంగా అగూరు గ్రామానికి చెందిన సుందరం అనే వ్యక్తి రెండు రోజుల కిందట బైకును ఇంటి ముందు నిలిపాడు. ఉదయం లేచి చూడగా ఇంటి ముందు నిలిపిన బైకు చోరీకి గురికావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణిలో బైకుల చోరీకి అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రేమ పేరుతో మోసం అన్నానగర్: చైన్నె తిరువికనగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్ట్రాగాం ద్వారా అంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ వ్యక్తిగతంగా కలిశారు. ఈ క్రమంలో ఆ అబ్బాయి ప్రేమ మాటలు చెప్పి అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఇంతలో తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆపరేషన్ చేయాలని విద్యార్థినితో యువకుడు చెప్పాడు. దీన్ని నమ్మిన విద్యార్థిని 5 తులాల నగలు, రూ.75 వేల వరకు చిన్నచిన్న వస్తువులు ఇచ్చింది. దీంతో ఆ యువకుడు డబ్బుల కోసం ఆమెను వేధించడంతో విద్యార్థిని షాక్‌కు గురై డబ్బులు ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు డబ్బులు ఇవ్వకుంటే ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ప్రేమిస్తున్నట్లు నటించి విద్యార్థిని వద్ద నుంచి నగలు, డబ్బు దోచుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్యారమ్స్‌లో చైన్నె బాలికకు గోల్డ్ మెడల్
సాక్షి, చైన్నె: అమెరికాలో జరిగిన ప్రపంచ క్యారమ్స్ ఛాంపియ్‌షిప్ పోటీలలో చైన్నెకి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె కాశీమా (17) మూడు కేటగిరీలలో బంగారు పతకాలను సాధించారు. అమెరికాలో ఆరవ ప్రపంచ స్థాయి క్యారమ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు తమిళనాడు తరపున కాశీమా, నాగజ్వోతి, మిత్ర, మరియాలు హాజరైయ్యారు. వీరికి తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందజేసింది. ఆదివారం ఫైనల్స్ జరిగింది. ఇందులో కాశీమా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాలలో తన సత్తాను చాటారు. ఈ కేటగిరీలలో విజేతగా నిలిచి బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లు కాశీమాను అభినందిస్తూ ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. కాగా, కాశీమా ఉత్తర చైన్నె పరిధిలోని న్యూ వాషర్‌మెన్‌పేట, చెరియన్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె గా తేలింది. ఈ నెల 21వ తేదిన అమెరికా నుంచి బంగారు పతకాలను చైన్నెకి కాశీమాతో పాటు ఇతర క్రీడాకారులు రానున్నారు. -
హిందూ పీపుల్స్ పార్టీ నిరసన
– అర్జున్ సంపత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కొరుక్కుపేట: కుమారుడి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈశా యోగా కేంద్రానికి మద్దతుగా కోయంబత్తూరులో గత నెల 27న హిందూ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ కుమారుడు ఓంకార్ బాలాజీ పాల్గొని, మాట్లాడారు. తన ప్రసంగంలో నక్కీరన్ గోపాల్‌ను ధూషించినట్లు సమాచారం. ఈ విషయమై కోయంబత్తూరు రేస్‌కోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఓంకార్ బాలాజీపై పోలీసులు కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఓంకార్ బాలాజీ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఓంకార్ బాలాజీని అరెస్ట్ చేయడంపై మధ్యంతర నిషేధం విధించారు. దీంతో ఈ కేసు 13వ తేదీన మరోసారి విచారణకు వచ్చింది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో బాలాజీ అరెస్ట్‌పై ఇప్పటికే విధించిన నిషేధాన్ని పొడిగించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో కోర్టు నుంచి బయటకు వచ్చిన ఓంకార్ బాలాజీని కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన: ఓంకార్ బాలాజీ అరెస్ట్ ఘటనను ఖండిస్తూ ఆదివారం కోయంబత్తూరు రెడ్‌క్రాస్ దగ్గర హిందూ పీపుల్స్ పార్టీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన తెలిపేందుకు వచ్చిన హిందూ పీపుల్స్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. వారిని ప్రైవేట్ హాలులో ఉంచారు. -
ఈరోడ్ మార్కెట్‌కు 35 టన్నుల చేపలు
సేలం: ఈరోడ్ స్టోనీ బ్రిడ్జి చేపల మార్కెట్‌కు తూత్తుకుడి, రామేశ్వరం, కారైకల్, కేరళ తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు 20 టన్నుల చేపలు వస్తుంటాయి. వారాంతాల్లో సాధారణం కంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం తూత్తుకుడి, రామేశ్వరం, నాగపట్నం, కారైకల్, కేరళ తదితర ప్రాంతాల నుండి అనేక రకాల సముద్రపు చేపలను అమ్మకానికి తీసుకువచ్చారు. 35 టన్నుల చేపలు అమ్మకానికి వచ్చాయి. అధికంగా చేపలు రావడంతో గత కంటే చేపల ధరలు పడిపోయాయి. అంటే పెద్ద చేప రూ.50 తగ్గి రూ.100కు చేరింది. చిన్న చేప రూ.25 తగ్గి రూ.50కి చేరింది. వారాంతాల్లో వ్యాపారం ఎప్పుడూ జోరుగా ఉంటుంది. కానీ ఆదివారం వ్యాపారం మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్పస్వామి కోసం చాలా మంది మాలధారణ, ఉపవాస దీక్షలు చేస్తున్నారు. దీంతో మాంసాహారం నుంచి శాఖాహారం వైపు మళ్లారు. ఈ కారణంగా వ్యాపారం మందగించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మాంసం దుకాణాల్లో వ్యాపారం మందకొడిగా సాగింది. మటన్, చికెన్ ధరలు కూడా గత వారం నుంచి గణనీయంగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణుడు
చంద్రగిరి: శ్రీనివాసమంగాపుంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి అనుబంధంగా వెలసిన శ్రీకృష్ణ స్వామివారు, అమ్మవార్లతో కలసి ఆదివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివా రి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వా మి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి సాయంత్రం శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ వళ్లంశెట్టి రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, జమేదారు చిరంజీవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఈకాడు గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు
తిరువళ్లూరు: గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా ఈకాడు గ్రామీణ గ్రంధాలయలో వంద మంది విద్యార్థులు సభ్యత్వం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా గ్రంఽథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భా గంగానే తిరువళ్లూరు జిల్లా ఈకాడు గ్రామంలో గ్రంథాలయ వారోత్సవాలను రీడర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు పుహళేంది అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, కవిత్వం, డ్రాయింగ్, తిరుక్కురల్ ఒప్పించడం తదితర ఐ దు రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సు మారు రెండు వందల మంది పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులను సైతం ప్రదానం చేశారు. కాగా గ్రఽంథాలయంలో వంద మంది విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలకు చెందిన శాంతకుమారి, వరలక్ష్మి, రాజాత్తీ, కవిత, శ్రీదేవి తదితర ఐదుగురు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి తమ పేర్లను కవులుగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, గ్రంధాలయ అధికారి కనిమొళి తదితరులు పాల్గొన్నారు. -
మూడో భాగం అలా కాకూడదు!
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీనికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్ చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఇండియన్ కు సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా ఇండియన్ – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే ఇండియన్ – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇండియన్ – 3 చిత్ర విడుదల సందిగ్ధంలో పడింది. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా ఇండియన్– 2 మాదిరిగా ఇండియన్ – 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇండియన్ – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత ఇండియన్– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. కమలహాసన్, దర్శకుడు శంకర్