Tamil Nadu
-
ఎలక్ట్రిక్ రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
కొరుక్కుపేట: చైన్నె, సబర్బన్ ప్రాంతాలలో రైల్వే ట్రాక్‌లపై నిర్వహణ పనుల కారణంగా ఎలక్ట్రిక్ రైలు సేవలు అకస్మాత్తుగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు.. చైన్నె – తాంబరం మధ్య తాంబరం వర్క్‌షాప్‌లో ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహణా పనులు చేపడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బీచ్ – పల్లావరం మధ్య మాత్రమే ప్రత్యేక రైలును నడిపారు. సాధారణ రైలు సర్వీసు ఆదివారం టైమ్‌టేబుల్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే నడుస్తుందని ప్రకటించారు. దీంతో రైల్వేస్టేషన్‌కు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. నిర్వహణ పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించి, 24 గంటల్లో సరిదిద్దాల్సిన బాధ్యత దక్షిణ రైల్వేపై ఉంది. అయితే దీనిని దక్షిణ రైల్వే పాటించడం లేదు. ఫలితంగా నెలరోజులుగా పగటిపూట రైళ్లను రద్దు చేస్తున్నారు. మెయింటెనెన్స్ పనులు ఎన్ని నెలలు నిర్వహిస్తారో ప్రజలకు తెలియజేయాలని కోరారు. -
కాట్పాడిలో ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కయంజూరు, తారాపడవేడు చెరువుల్లో పడవ సవారీ ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక స్థలంగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 28 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఇప్పటికే పనులు ప్రారంభించి సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారు. త్వరలోనే ఈ రెండు చెరువుల్లోను పడవ సవారీ ఏర్పాటు చేసి పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఇదిలా ఉండగా చెరువుతో పాటు కాలువల్లో కొందరు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఈ ఆక్రమలను తొలగించాలని ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది ఇళ్లను ఖాళీ చేయగా.. మరికొందరు ఇంకా అలేగా ఉన్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పోలీసులు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుస్తుగా వారితో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోలీసుల సాయంతో అధికారులు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఖాశీ చేసిన సుమారు 300 కుటుంబ సభ్యులకు కరిగేరి గ్రామంలో నూతనంగా నిర్మించిన హౌసింగ్ బోర్డులో ఇళ్లను కేటాయించారు. -
కార్మికుల ఆందోళన
తిరువళ్లూరు: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఫర్నిచర్ కంపెనీ కార్మికులను ఆందోళన నిర్వహించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాకలూరు సిప్కాట్లో కేకే బిర్లా పర్నిచర్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 1998వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు. సంబంధిత సంస్థలో 73 మంది పర్మినెంట్ ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పర్నిచర్ విక్రయాలు, వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదన్న నిర్వాహకులు గత మార్చి నుంచి కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇచ్చారు. అనంతరం గత రెండు వారాల క్రితం కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.3.50 లక్షలు చొప్పున సెటిల్మెంట్ మొత్తాన్ని జమచేశారు. అయితే పరిశ్రమ నిర్వాహకులు తీసుకున్న చర్యలను నిరసిస్తూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్మికులను పరిశ్రమ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడాన్ని నిరసించారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కానీ పక్షంలో సెటిల్మెంట్ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని నినాదాలు చేశారు. బిర్లా గ్రూపు నిర్వాహకులు ప్రస్తుతం పర్నిచర్ సంస్థ వున్న ప్రాంతంలోనే వేరే వ్యాపారం చేయాలని నిర్ణయించిందని అయితే సంబంధిత సంస్థలో తమకు ఉపాధి కల్పిండానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారని వాపోయారు. అనంతరం కంపెనీ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కార్మిక సంఘం నేతలు గణపతి, ఏకాంబరంతో పాటు పలువురు పాల్గొన్నారు. -
పథకం ప్రకారం ట్రోల్ చేస్తున్నారు!
తమిళసినిమా: సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నాయకిగా, హిందీ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఇ. జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్లో నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 14న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయితే కంగువ చిత్రం ఎదుర్కొంటున్న వ్యతిరేక విమర్శలపై నటి జ్యోతిక స్పందించారు. ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ ‘‘కంగువ చాలా మంచి చిత్రం. ఈ విషయాన్ని నేను సూర్య భార్యగా కాకుండా సినిమా అభిమానిగా చెబుతున్నాను. ఒక నటుడిగా సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సూర్య తపనను చూసి గర్వపడుతున్నాను. భారతీయ సినిమాలో తప్పులు అన్నవి ఒక భాగం మాత్రమే. మూడు గంటల చిత్రంలో అర్ధగంట మాత్రమే కొరత ఉంది. ఈ చిత్రంలో శబ్ద బీభత్సం ఉందన్నది నేను ఒప్పుకుంటున్నాను. అయితే కంగువ పూర్తిగా మంచి అనుభవాన్ని కలిగించే చిత్రం. మహిళలను కించపరచడం ద్వందర్ధాల సంభాషణలు వంటివి లేకుండా భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ చిత్రానికి తగ్గట్టుగా సద్విమర్శలు అసలు రాలేదు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక విమర్శలు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కంగువలో మంచి యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. చిత్ర రెండవ భాగంలో మహిళల యాక్షన్ సన్నివేశాలు, కంగువాకు చిన్నపిల్లవాడికి మధ్య ప్రేమ, ద్రోహం వంటి మంచి సన్నివేశాలు ఉన్నాయి. చిత్రాన్ని రివ్యూ చేసిన వారు మంచి విషయాలను చెప్పడం మరిచారు. దీన్ని 3 డీ ఫార్మెట్లో రూపొందించిన చిత్ర యూనిట్‌ను అభినందించకపోగా, థియేటర్లో తొలి ప్రదర్శన పూర్తికాకుండానే కంగువ చిత్రానికి అంతగా వ్యతిరేక విమర్శలు రావడం బాధాకరం. కంగువ చిత్ర యూనిట్ గర్వంగా ఉండండి. వ్యతిరేక విమర్శలు చేస్తున్నవారే చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకెల్లడం మినహా మరేమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు. -
మూడో భాగం అలా కాకూడదు!
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీనికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్ చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఇండియన్ కు సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా ఇండియన్ – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే ఇండియన్ – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇండియన్ – 3 చిత్ర విడుదల సందిగ్ధంలో పడింది. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా ఇండియన్– 2 మాదిరిగా ఇండియన్ – 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇండియన్ – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత ఇండియన్– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. కమలహాసన్, దర్శకుడు శంకర్ -
క్లుప్తంగా
గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి తిరువళ్లూరు: ద్విచక్ర వాహనం నుంచి జారి కిందపడ్డ మహిళ చిక్సిత పొందుతూ మృతి చెందారు. వివరాలు.. గుమ్మిడిపూండి తాలుకా ఓబసముద్రం గ్రామానికి చెందిన బాబు భార్య తులసి(35). ఈమే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చిక్సిత తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 12న రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడ మాత్రలు తీసుకుని తిరుగు ప్రయాణమైయ్యారు. గుమ్మిడిపూండి సమీపంలోని తురపళ్లం వద్ద బస్సు కోసం వేచి వున్న సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న జయగణేష్ వద్ద లిప్టు అడిగి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ద్విచక్ర వాహనం సున్నాంబట్టి జంక్షన్ వద్ద వస్తున్న సమయంలో మహిళ జారికిందపడి గాయపడింది. స్టాన్లీ వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందారు. టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొని కారుబోల్తా తిరువళ్లూరు: రాణిపేట జిల్లా షోలింగర్ ప్రాంతానికి చెందిన పార్తీబన్(42) కోళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం కారులో తిరువళ్లూరు జిల్లా ఆవడికి వెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. కారు తన్నీర్‌కుళం వద్ద వస్తున్న సమయంలో అదుపు తప్పి టెలిఫోన్ స్తంభాన్ని, పక్కనే ఉన్న ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడి పార్తీబన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధితుడిని తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించి చిక్సిత అందిస్తున్నారు. సెవ్వాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారంలో తీవ్ర నష్టం ● విషం తాగి మహిళ మృతి తిరువళ్లూరు: వ్యాపారంలో తీవ్ర నష్టం రావడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ గణేశపురం పెరియార్ వీధికి చెందిన తమిళరసన్, జయంతి దంపతులు. వీరు అదే ప్రాంతంలో పాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం జయంతి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎండీఎంకే కార్యాలయం ధ్వంసం ●● నలుగురు అరెస్టు సేలం: కోవై ఆవారంపాలయం పస్ స్టాండ్ సమీపంలో కృష్ణరాయపురం ఉంది. ఇక్కడ ఉన్న ఓ భవనంలో కోవై నగర జిల్లా ఎండీఎంకే 28వ వార్డు కార్యాలయం పని చేస్తోంది. ఆ భవనంలో ముత్తమిళ్ పడిప్పగం పేరిట లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మట్టిగోడలతో నిర్మించిన ఈ భవనాన్ని అదే ప్రాంతానికి చెందిన సుందర్రాజన్ తనకు సొంతమైనదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ స్థితిలో శనివారం కొందరు గుర్తుతెలియని ముఠా ప్రొక్రైన్ ద్వారా ఆ భవనాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో ఉదయం ఎప్పటిలానే కార్యాలయానికి వెళ్లిన ఎండీఎంకే కార్యకర్తలు భవన కూలి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిపై ఆ ప్రాంత ఎండీఎంకే కార్యదర్శి వెల్లంగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుందర్రాజన్, సెంథిల్ కుమార్, గోపాల కృష్ణన్ తదితర నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద విచారణ జరుపుతున్నారు. వైర్లు రాసుకుని మంటలు● కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం అన్నానగర్: చైన్నెలోని గిండీ ఆలందూర్ రోడ్డులో కలైంజ్ఞర్ సంతాన స్పెషల్ హయ్యర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉంది. ఆలందూరు రోడ్డు నుంచి ఆసుపత్రికి వెళ్లే 4 ప్రధాన విద్యుత్ తీగలకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగమంచులా మారింది. పక్కనే ఉన్న జనరేటర్‌కు వెళ్లే కేబుళ్లకు కూడా మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు పైగా వైద్య సేవలు ఆగిపోయాయి. దీంతో అస్పత్రికి ఎవరిని అనుమతించలేదు. దీనిపై సమాచారం అందుకున్న విద్యుత్ బోర్డు ఉద్యోగులు హడావుడి చేశారు. బ్యాక్‌ప్యాక్‌లో ఉంచిన బ్యాటరీలతో రోగులను వెంటనే అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ, ప్రజాపనుల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించి విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పనులను వేగవంతం చేశారు. విద్యుత్తు కనెక్షన్ అందించడంతోపాటు ప్రభావిత ప్రాంతంలో దెబ్బతిన్న కేబుళ్లకు మరమ్మతులు త్వరగా చేపట్టారు. ఈ విషయమై మంత్రులు ఎం.సుబ్రమణియన్, ఎ.వి.వేలు అధికారులతో ఆరా తీశారు. ఆ సమయంలో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
వేడుకగా కాళియమ్మ ఆలయ మహా కుంభాభిషేకం
సేలం: సేలంలోని ఎల్లై కాళియమ్మ ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. సేలం జాన్సన్పేట చిన్న తిరుపతి రోడ్డులో ఎల్లై కాళియమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. అనంతరం కుంభాభిషేక పనులను చేపట్టారు. ఆదివారం ఆలయ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహించారు. గోపుర కళాశాలకు శివాచార్యులు పుణ్య జలాలను పోసి కుంభాభిషేకం చేపట్టారు. అనంతరం ఆ పుణ్య జలాలను భక్తులపై ప్రోక్షించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. -
ఘనంగా సినీ, బుల్లితెర తారల అవార్డుల వేడుక
తమిళసినిమా: అవార్డులు నటినటుల ప్రతిభకు నిదర్శనం. అయితే అదే అవార్డులు వర్ధమాన తారల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇలాంటి భావనతోనే సాంస్కతిక సంస్థలు అయినా మహాఫైన్ ఆర్ట్స్ అధినేత అనురాధ జయరామన్ యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత, కలైమామణి, డా.నైల్లె సుందర్ రాజన్ సంయుక్తంగా చాలాకాలంగా ఈ కళా సేవను చేస్తున్నారు. పలువురు సామాజిక సేవకులను గౌరవిస్తూ ఉత్తమ అవార్డులను ప్రదానం చేస్తున్నారు అదేవిధంగా సినీ బుల్లితెర నటీనటులను ప్రోత్సహించే విధంగా అవార్డులతో సత్కరిస్తున్నారు. ఇందుకు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఎస్.కె కష్ణన్ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అలాంటి అవార్డుల వేడుకను శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఎస్కే కష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై పరువరు సామాజిక సేవకులను ఆయన ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సినీ నటుడు ఆదేశ్ బాల, నటి ఆలియాకు ప్రత్యేక ఉత్తమ నటి అవార్డులను ప్రదానం చేశారు. కాగా కుమారి జీవిత ఉత్తమ నూతన నటి అవార్డును, నటి శ్రీవిద్యకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డును అందించి వారిని అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రీయ రత్నం ఏఎంబీ డాక్టర్ బి.కె. వెంకటేశం తమిళన్ టీవీ రిపోర్టర్ డాక్టర్ ఎన్ఆర్. చంద్రశేఖరన్, కన్జ్యూమర్ విగిలెంట్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ కే యం చంద్రమోహన్, ఆల్బర్ట్ థియేటర్ నిర్వాహకుడు ఎ.మారియప్పన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. పూజా హెగ్డే ఆయన ప్రేమ కథను తెరకెక్కిస్తే ..? తమిళసినిమా: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అది విజయం అయినా పరాజయం అయినా. అలాగే అవకాశాలు రావడం అన్నది కూడా మన చేతుల్లో ఉండదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. నటి పూజాహెగ్డే సినీ జీవితం కూడా ఇలానే సాగుతోంది. గత పుష్కర కాలం క్రితం ముఖమూడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఉత్తరాది భామ ఈమె. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరచడంతో ఈ అమ్మడిని కోలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఇక్కడ మూటా ముల్లు సర్దేసుకున్న పూజాహెగ్డే టాలీవుడ్లో మకాం పెట్టారు. అక్కడ కూడా తొలి దశలో కెరీర్ ఆశాజనకంగా లేకపోయినా, ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో ఈమెకు క్రేజ్ పెరిగింది. కొద్దికాలం టాప్ హీరోయిన్గా రాణించిన పూజాహెగ్డేకు ఆ తర్వాత వచ్చిన వరుస ప్లాప్ లతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు ముఖం చాటేశాయి. అదే సమయంలో బాలీవుడ్, కోలీవుడ్‌లో నటించిన చిత్రాలు కూడా అపజయం పాలయ్యాయి. అలాంటిది బ్యూటీకి ఇప్పుడు మళ్లీ దశ తిరిగింది. తమిళంలో రెండు భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అందులో ఒకటి సూర్యతో జత కట్టే ఆయన 44వ చిత్రం కాగా, మరొకటి విజయ్ సరసన నటించే ఆయన 69వ చిత్రం కావడం విశేషం. కాగా పూజాహెగ్డే సూర్య సరసన నటించిన చిత్రాన్ని పూర్తి చేశారు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇది గ్యాంగ్స్టర్స్ ఇతి వృత్తంతో రూపొందుతున్నట్లు కథా చిత్రం అంటూ ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటికీ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి పూజాహెగ్డే ఓ భేటీలో ఈ చిత్రం గురించి కొత్త అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ లవ్‌స్టోరీ రాస్తే ఎలా ఉంటుందో అలా సూర్య 44 చిత్రం ఉంటుందన్నారు. ఇందులో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఈమె విజయ్‌కు జంటగా ఆయన 69వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి హెచ్ .వినోద్ దర్శకుడు అన్నది తెలిసిందే. -
విద్యా సదస్సు
వీఎస్ఈపీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీతో కలిసి సాంకేతిక అభివృద్ధి, పెరుగుతున్న సామాజిక సంక్లిష్టతలు, వినూత్న పరిష్కారాల గురించి ప్రత్యేక సదస్సు ఆదివారం చైన్నెలో జరిగింది. ఇందులో అకాడమీ, విధాన రూపకల్పన, చట్టపరంగా అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సుకు రెండహార్వర్డ్ కెనడీ స్కూల్ ప్రొఫెసర్ జెఫ్రీ లీబ్ మాన్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఎ ఫ్రాన్సిస్ జూలియన్, కర్నాటక ప్రభుత్వ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి జయరాజ్, మద్రాసు ఐఐటీ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. సురేష్ బాబు, వీఎస్ఈపీ ప్రతినిధులు ప్రొఫెసర్ దేబ్దులాల్ ఠాకూర్, అనంత్ పద్మనాభన్ తదితరులు హాజరయ్యారు. –సాక్షి, చైన్నె ● -
హిజ్రాకు లైంగిక వేధింపులు
● కానిస్టేబుల్ సస్పెన్షన్ సేలం: తంజావూరు జిల్లా తిరువెంగడం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న వినోద్ (32). ఇతడు గతంలో అయ్యంపేట పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన హిజ్రా ఇంటిలోకి చొరబడి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఆ మేరకు తంజావూరు ఎస్పీ ఆశీష్ రావత్ విచారణ చేపట్టారు. అందులో హిజ్రాను పోలీసు వినోద్ లైంగిక వైధింపులకు గురి చేసిన స్పష్టం కావడంతో వినోద్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. చావులోనూ నీకు తోడుగా.. ● భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి సేలం: విరుదునగర్ సమీపంలో భార్య మృతి చెందిందనే ఆవేదనతో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. విరుదునగర్ సమీపంలో కూరైకుండు గ్రామ పంచాయతీ పరిధిలోని మాత్తినాయకన్ పట్టికి చెందిన వృద్ధ దంపతులు నడుమారియప్పన్ (86), జ్ఞానమ్మాల్ (73). ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారంతా వివాహమైన అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా మారియప్పన్ తన భార్యతో కలిసి కాలనీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెకు శనివారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా, ఆ సమయంలో తీవ్ర ఆవేదనతో ఉన్న నడుమారియప్పన్ శనివారం మృతి చెందాడు. దీంతో ఇద్దరి మృతదేహాలకు ఒకే సారి అంత్యక్రియలు నిర్వహించారు. -
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. తెలుగువారు ఎవరు?అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. పోలీసుల గాలింపుకానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.చదవండి: నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్ -
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్‌ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్‌లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్‌తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్‌లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
మేనమామ సారె అదుర్స్
సేలం: తూత్తుకుడి సమీపం శంకరరాజపురం గ్రామానికి చెందిన ఆనంది కుమార్తె సబీష్టా (14)కు పుష్పవతి వేడుకలను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సబీష్టా మేనమామలు భవిత్కుమార్, సూర్య మేళతాళాల హోరు, బాణాసంచాల మోత, వెలుగుల మధ్య 350 పళ్లాలలో బంగారు నగలతోపాటు పూలు. పండ్లు, పలు రకాల స్వీట్లు, దుస్తులు, అలంకరణ సామగ్రి మొదలైనవి సారెగా ఇచ్చేందుకు కంటైనర్ లారీలో తీసుకురావడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. -
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
విద్యుత్ బకాయి రూ.కోటి
సాక్షి, చైన్నె: చైన్నెలోని న్యాయమూర్తుల నివాసాలు, కోర్టులు రూ.కోటి విద్యుత్ బకాయి చెల్లించాల్సి ఉన్నట్టుగా విద్యుత్ బోర్డు నుంచి సమాచారం వెలువడింది. ఇందులో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసానికి రూ.59 వేలు చెల్లించాల్సి ఉండగా, పూందమల్లి, ఎగ్మూర్ కోర్టులకు 2020 నుంచి ఇంత వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపు జరగని కారణంగా ఆ బకాయి రూ.లక్షల్లో ఉన్నట్టు సమాచారంకోర్టులు, న్యాయ వ్యవస్థకు చెందిన క్వార్టర్స్ రూపంలో విద్యుత్ బోర్డుకు రూ.కోటి బకాయి విద్యుత్ బిల్లుల రూపంలో రావాల్సి ఉండడం గమనార్హం. ఐఐటీల మధ్య ఒప్పందాలు సాక్షి, చైన్నె: ఎడ్యుకేషనల్ ఇన్సియేటివ్ నిమిత్తం ఐఐటీ మద్రాసు, ఐఐటీ పాలక్కాడుల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. డేటా సైన్‌న్స్ అప్లికేషన్స్ విద్యార్థులు అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకోవాడానికి, పరస్పరం నైపుణ్యాల అభివృద్ధి, మార్పిడికి ఈ ఒప్పందాలు దోహదకరం కాను న్నాయి. స్థానికంగా శుక్రవారం ఈ ఒప్పందాలు ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి, పాలక్కాడు డైరెక్టర్ శేషాద్రి శేఖర్ల సమక్షంలో జరిగాయి. కామకోటి మాట్లాడుతూ అర్హులైన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ చొరవ లక్ష్యాలను చేరుకోవడంలో చాలా ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ డేటాసైన్స్ ప్రోగ్రామ్‌లోని విద్యార్థులకు ఈ ఒప్పందాలు దోహదకరం అని వివరించారు. వ్యక్తిగతంగా క్రెడిట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లను స్వీకరించడానికి మరింత అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. తమ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ల అభ్యాసం, ఆవిష్కరణలకు బల మైన ప్రాధాన్యతను ఈ ఒప్పందాలు కలిగిస్తాయన్నారు. ఐఐటీ మద్రాస్‌తో సహకారం వలన విద్యార్థులు రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, నెట్‌వర్క్‌లతో బలమైన పునాది నిర్మిస్తామన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీపై ఏసీబీకి ఫిర్యాదు ● ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.400 కోట్ల నష్టంగా ఆరోపణ సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజీపై అన్నాడీఎంకే తరఫున ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే సమాచార విభాగ అదనపు కార్యదర్శి నిర్మల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యా దులో డీఎంకే పాలనలో 2021 ఏడాది నుంచి 2023 వరకు విద్యుత్ బోర్డుకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడంలో రూ.400 కోట్ల నష్టం ఏర్పడినట్టు తెలిపారు. రూ.7లక్షల 87 వేలకు గుజరాత్లో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసిన స్థితిలో, రాష్ట్రంలో రూ.12 లక్షల 97 వేలకు 45 వేల ట్రాన్స్ఫార్మర్లు అధిక ధరకు కొనుగోలు జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడులో అధిక ధరకు కొనుగోలు చేయడం వలన ప్రభుత్వానికి రూ.400 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన డీఎంకే మంత్రి సెంథిల్బాలాజీపై తగిన చర్యలు తీసుకోవా లని కోరారు. ఆలస్యమవుతున్న ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్ సాక్షి, చైన్నె: విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్ పథకం ఇంకా అమలు కాకపోవడంతో చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికుల పాట్లు కొనసాగుతున్నాయి. చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరూ సిటిజన్‌షిప్ తనిఖీ తర్వాత అనుమతిస్తున్నారు. ఇందుకోసం చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడి ఉండాల్సి వస్తోంది. అదే సమయంలో పలుమార్లు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో విమానా ప్రయాణికులు ఎదుర్కొన్న ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్–ట్రస్ట్ ట్రావెల్ ప్రోగ్రాం అనే ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా ప్రయాణికులు అత్యంత సులభంగా, త్వరతిగతిన సిటిజన్‌షిప్ తనిఖీలు పూర్తి చేసుకోవచ్చు. ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇందుకోసం చైన్నె విమానాశ్రయంలో గత ఆగస్టు నెలలో ప్రారంభించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన యంత్రాలను అమర్చడం, సిబ్బందిని ఏర్పాటు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించడం, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేశారు. అయితే ఈ కొత్త పథకం ఇప్పటి వరకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో అమలుకాలేదు. అదే సమయంలో ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో అమలైనట్లు తెలుస్తోంది. అయితే చైన్నె విమానాశ్రయంలో ఆలస్యం అవుతుండడం వలన ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు మాట్లాడుతూ చైన్నె విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని, అయితే ఢిల్లీలోని సెంట్రల్ ఇమ్మిగ్రేషన్ అధికారులను నుంచి అదేశాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే చైన్నెలో అమలు చేస్తామని వివరించారు. -
మాది ప్రజల ప్రభుత్వం
● ప్రజల జీవితాల సుసంపన్నం లక్ష్యం ● సంపన్న తమిళనాడు దిశగా కార్యాచరణ ● అరియలూరు, పెరంబలూరు ప్రగతికి కొత్త ప్రాజెక్టులు ● క్షేత్ర స్థాయి పర్యటనలో సీఎం స్టాలిన్ ● 15 వేల మందికి ఉపాధి కల్పనకు కార్యాచరణ సాక్షి, చైన్నె: ప్రజల జీవితాలను సుసంపన్నం చేయడమే ద్రావిడ మోడల్ పాలన అని, తమది ప్రజల ప్రభుత్వం అంటూ సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. వెనుక బడిన జిల్లాలైన అరియలూరు, పెరంబలూరు ప్రగతికి కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ జిల్లాలో విస్తృతంగా సీఎం పర్యటించారు. సీఎం ఎంకే స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మూడో విడతగా అరియలూరు, పెరంబలూరు జిల్లాలపై దృష్టి పెట్టారు. అరియలూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లో 507 పనులను సీఎం ప్రారంభించారు. 53 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అరియలూరులో 10,141, పెరంబలూరులో 11,721 మంది లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. అరియలూరులో రూ.1000కోట్లతో అతిపెద్ద విదేశీ పాదరక్షల సంస్థ డీన్ షూగ్రూప్ పరిశ్రమ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఇది మన ప్రభుత్వం ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ, కొత్త పనులకు శంకుస్థాపన ముగిసిన అనంతరం సీఎం స్టాలిన్ ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. అరియలూరు, పెరంబలూరు సమగ్ర ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేసినట్టు వివరించారు. ఈ జిల్లాకు చెందిన రవాణాశాఖా మంత్రి శివశంకర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అరియలూరు, పెరంబలూరు జిల్లా విశిష్టతను గుర్తు చేస్తూ, ఇక్కడి గంగై కొండ చోళపురంలో మామన్నన్ రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే మ్యూజియం, జయం కొండంలో పాద రక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశానని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 15 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ప్రకటించారు. జయంకొండం ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కేంద్రం ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నామని, కున్నంలో, బాదలూరులో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు రూ.345 కోట్లను కేటాయించామని వివరించారు. పెరంబలూరులో ఇక్కడి రైతుల ప్రయోజనార్థం ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అద్దె భవనంలో ఉన్న పెరబలూరు ప్రభుత్వ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు రూ.56 కోట్లతో పక్కా భవనం నిర్మించనున్నామని, ఎంపీ తిరుమావళవన్ విజ్ఞప్తి మేరకు అరియలూరులో న్యాయస్థానాలన్నీ ఒకే చోట ఉండేలా కోర్టు కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని, ఇది మన ప్రభుత్వం అని, ద్రావిడ మోడల్ ప్రజా ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేశారు. పళణిలో వణుకు .. ప్రజల కోసం జాగ్రత్తగా కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తూ, వాటి తీరు తెన్నులపై స్వయంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నానని వివరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. నన్ను చూసి ఓర్వ లేక ప్రతి పక్ష నేత పళణిస్వామి వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, అయితే, ఆమె మరణించినానంతరం నాలుగేళ్లు అధికారంలో ఉన్న పళణిస్వామి తమిళనాడు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినట్టుగా అబద్ధపు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వీరి అవినీతి, కమీషన్ , కలెక్షన్ కారణంగా అనేక మంది పెట్టుబడిదారులు, పరిశ్రమల యజమానులు తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయే పరిస్థితి ఉండేదన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం పరిశ్రమలకు పునరుజ్జీవం పోసినట్టు ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును భారతదేశంలోనే ప్రధాన రాష్ట్రంగా మార్చడానికి అహర్నిషలు కృషి చేస్తున్నామన్నారు. మూడేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభం ఎదురైనా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగామని, భవిష్యత్తులో సంపన్న తమిళనాడు లక్ష్యంగా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామన్నారు. మంత్రులు ఏవీ వేలు, కేఎన్ నెహ్రూ, ఎంఆర్కే పన్నీరుసెల్వం, గీతాజీవన్, శివశంకర్, కోవి చెలియన్, సీవీ గణేషన్, టీఆర్బీ రాజా, ఎంపి. తిరుమావళవన్, ఏ.రాజా పాల్గొన్నారు. పోషకాహార లోపం పిల్లల కోసం.. అరియలూరులో వారణాసిలో పోషకాహార లోపంతో జన్మించే పిల్లల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. మదురైలో తొలిసారిగా గతంలో కేంద్రం ఏర్పాటు చేశారు. మలి విడతగా అరియలూరులో ఏర్పాటు చేశారు. పౌష్టికాహారాన్ని పిల్లలకు సీఎం అందజేశారు. పిల్లల తల్లులకు పౌష్టికాహార సంబంధిత వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. -
మళ్లీ వార్తల్లోకి గిండి
సాక్షి, చైన్నె: చైన్నె గిండిలోని కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగడంతో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. గిండి ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందించలేదన్న ఆగ్రహంతో డాక్టర్ బాలాజీపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వైద్యులు సమ్మెబాట సైతం పట్టి, చివరకు ప్రభుత్వ హామీతో విరమించారు. శుక్రవారం నుంచి వైద్యులు విధుల బాట పట్టారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద, జిల్లా కేంద్రాల ఆస్పత్రులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైద్యులకు భద్రతగా తుపాకీ నీడలో సిబ్బందిని రంగంలోకి పోలీసు యంత్రాంగం దింపింది. అలాగే, శుక్రవారం నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగులు, పరామర్శకు వచ్చే వారు అంటూ అందరికి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశారు. ప్రవేశ మార్గాలలో వీరికి నాలుగు రకాల ట్యాగ్‌లతో కూడిన గుర్తింపు కార్డులను చేతికి కడుతున్నారు. అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితులలో కత్తిపోటు వివాదం చోటు చేసుకున్న గిండి ఆస్పత్రి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తీవ్ర ఉత్కంఠను రేపే పరిస్థితులు ఉదయం చోటుచేసుకున్నాయి. వైద్యం అందక మృతి పెరుంబాక్కంకు చెందిన విఘ్నేష్(31) కడుపునొప్పితో బుధవారం కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక ఆస్పత్రిలో చేరాడు. అదేరోజు కత్తిపోటు వివాదం ఘటన చోటుచేసుకోవడంతో వైద్యులు విధులను బహిష్కరించారు. గురువారం కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ చికిత్సకు చేరిన విఘ్నేష్‌కు సరైన వైద్యం అందనట్టు సమాచారం. డిశ్చార్చ్ చేయాలని, తాము మరో ఆస్పత్రి చూసుకుంటామని కుటుంబసభ్యులు విన్నవించుకున్నా, అందుకు స్పందించే వాళ్లు ఆస్పత్రిలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయాన్నే చికిత్స పొందుతూ విఘ్నేష్ మరణించాడు. వైద్యులు ఎవ్వరూ ఆ సమయంలో విధుల్లో లేనట్టు సమాచారం. అత్యవసర చికిత్స విభాగంలో విఘ్నేష్‌ను అడ్మిట్ చేయడం, ఆ తర్వాత అతడికి ఎలాంటి వైద్యం అందించ లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు అందరూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విఘ్నేష్ మరణించినట్టు బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించారు. ఉన్నతాధికారులు సైతం ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అదేసమయంలో గిండి ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనపై ఓ ప్రకటన విడుదల చేసింది. పిత్తాశయంలో రాళ్లు ఉండడంతో విఘ్నేష్‌కు ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చికిత్స అందించారని, చివరి క్షణంలోనే ఇక్కడకు తీసుకొచ్చారని, తాము మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయిందని ఈసందర్భంగా వారు పేర్కొనడం గమనార్హంకాగా, మృతిచెందిన విఘ్నేష్‌కు భార్య, చంటి బిడ్డ ఉన్నారు. చికిత్స అందక యువకుడి మృతి బంధువుల ఆందోళన ఆస్పత్రులలో భద్రత కట్టుదిట్టం రోగులకు నాలుగు రకాల ట్యాగ్‌లకు గుర్తింపు కార్డుల పంపిణీ -
నిబంధనలు సడలించినా ఫలితమేదీ!
● బీజేపీ వర్గాలలో కలవరం ● రంగంలోకి అన్నామలై సాక్షి, చైన్నె: సభ్యత్వ నమోదులో ఉన్న అనేక నిబంధనలను సడలించినా ఫలితం అన్నది లేకపోవడం రాష్ట్ర బీజేపీ వర్గాలను కలవరంలో పడేసింది. ఈనెలాఖరులో లండన్ నుంచి చైన్నెకు వచ్చీ రాగానే, డిసెంబర్ మొదటి వారం నుంచి పార్టీ అధ్యక్షుడు అన్నామలై విస్తృత పర్యటన నిమిత్తం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 11 శాతం మేరకు ఓటు బ్యాంక్ దక్కడంతో రాష్ట్రంలో కోటి మందిని సభ్యులుగా చేర్చడం లక్ష్యంగా బీజేపీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లోని నేతలు తలా కనీసం 200 మందిని, క్రియా శీలక సభ్యులు 50 మందిని సభ్యులు చేర్చడం లక్ష్యంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటింటా బీజేపీ నేతలు పర్యటించి సభ్యుత్వ ప్రక్రియపై దృష్టి పెట్టినా స్పందన అంతంత మాత్రమే. దీంతో రాష్ట్రంలోని ఓక్కో డివిజన్లో సభ్యత్వం వేగవంతం చేయడం కోసం నేతలు రంగంలోకి దిగారు. ఆ మేరకు చైన్నె డివిజన్‌కు హెచ్.రాజా, విల్లుపురం డివిజన్‌కు చక్రవర్తి, మదురై డివిజన్‌కు రామ శ్రీనివాసన్, తిరుచ్చి డివిజన్‌కు కరుప్పు మురుగానందం, కోయంబత్తూరు డివిజన్‌కు ఎస్ఆర్ శేఖర్‌లను నియమించారు. వీరి నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సాగుతున్నా, చేరే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండడం గమ నార్హం. అదే సమయంలో మిస్డ్ కాల్ సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ ప్రక్రియలో ఉన్న అనేక నిబంధనలే ఈ మందకొడికి కారణంగా బీజేపీ అధిష్టానం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. గతంలో ఉన్న 30 లక్షల సభ్యత్వం కూడా రెన్యువల్ కాకపోవడం వంటి పరిణామాలను గుర్తించిన బీజేపీ జాతీయ అధిష్టానం, సభ్యత్వ ప్రక్రియలో ఉన్న నిబంధనలలో కొన్నింటిని సడలించారు. అయినా, సభ్యత్వ నమోదు ముందుకు సాగకపోవడం రాష్ట్ర బీజేపీ నాయకులను కలవరంలో పడేసింది. అధిష్టానం నుంచి తమకు చీవాట్లు తప్పవని, కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తమకు అక్కడి నుంచి తమకు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా దక్కే పరిస్థితులు ఉండడని ఆందోళనలో పడ్డారు. ఈ పరిస్థితులలో లండన్‌కు వెళ్లిన పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఈనెలాఖరులో చైన్నెకు రానున్నారు. ఆయన రాకతో సభ్యత్వ నమోదు ప్రక్రియ మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర పర్యటన చేపట్టేందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రూపకల్పనంలో బీజేపీ కార్యాలయ వర్గాలు ఉండడం గమనార్హం. -
కోటికి చేరువలో సభ్యులు
● విజయ్ శిబిరంలో జోష్ సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగంలో సభ్యుల చేరిక పెరుగుతోంది. కోటికి చేరువలో సంఖ్య ఉండడంతో ఆ పార్టీ వర్గాలలో జోష్ పెరిగినట్లైంది. సినీ నటుడిగా అశేషాభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రకటనతో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలుత సభ్యత్వం మందకొడిగా సాగినా క్రమంగా వేగం పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయ్ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడమే ఇందుకు కారణం. గత నెల పార్టీ ఆవిర్భావ మహానాడును ఎవరూ ఊహించని రీతిలో విజయవంతం చేశారు. పెరియార్, కామరాజర్, అంబేడ్కర్, వేలూ నాచ్చియర్, అంజలై అమ్మాల్ వంటి పంచ మూర్తుల ఆదర్శంగా రాజకీయ పయనాన్ని విస్తృతం చేశారు. మహానాడు వేదికగా విజయ్ చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శించినా, మెజారిటీ శాతం మంది ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీపరంగా కార్యక్రమాలు విస్తృతం అవుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో పార్టీ సభ్యత్వ నమోదు వెబ్సైట్ సాంకేతిక కారణాలతో స్తంభించే పరిస్థితి నెలకొంది. దీనిని సరిచేసి మళ్లీ సభ్యత్వ నమోదు పునరుద్ధరించారు. గత నెలాఖరులో 75 లక్షలుగా ఉన్న సభ్యత్వం, శుక్రవారం నాటికి కోటి చేరువకు చేరింది. మరికొద్ది రోజులో కోటి సభ్యత్వం దాటే అవకాశాలు ఉన్నాయని తమిళగ వెట్రి కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ఈ సభ్యత్వం పెరుగుదల పెద్ద షాక్‌గా మారింది. తమ పార్టీలో సభ్యుల చేరిక పెరుగుతుండడంతో తమిళ వెట్రి కళగం వర్గాలు మంచి జోష్ మీదున్నాయి. -
విస్తరించిన పవనాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఈశాన్య పవనాలు పూర్తిగా విస్తరించినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరింతగా వర్షాలు అనేక జిల్లాల్లో కురవనున్నట్టు వివరించారు. 21 జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్‌లు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల సీజన్ అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పవనాలు వచ్చిరాగానే అనేక జిల్లాల్లో భారీగానే వర్షాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ పవనాలు మ రింత ఆశాజనకంగా మారాయి. గత రెండు,మూడు రోజులుగా అనేక జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. చైన్నె, శివారులోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో అనేక చోట్ల రాత్రుల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు చైన్నెలోని మైలాపూర్, మందవేలి, పట్టినంబాక్కం, కోడంబాక్కం, నుంగంబాక్కం, టి.నగర్, ఎగ్మూర్, వడపళణి, కోడంబాక్కంనుంగంబాక్కం, పురసైవాక్కం పరిసరాలలో వర్షం పడింది. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో అనేక చోట్ల భారీగానే వర్షం కురిసింది. తిరుచెందూరులో భారీ వర్షం పడుతుండడంతో పౌర్ణమి రాత్రి సముద్ర తీరంలో ఎవ్వరూ బస చేయొద్దని ఆలయ పరిసరాల్లోని భక్తులను పోలీసులు పంపిచేస్తున్నారు. వర్షాలు మరింతగా కొనసాగే అవకాశం ఉండడంతో భక్తులను సముద్రం వైపు అనుమతించడం లేదు. ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో మరికొన్ని రోజులపాటు విస్తృతంగా వర్షాలు కొనసాగనున్నాయి. చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుకోట్టై, రామనాథపురం జిల్లాలకు శని, ఆదివారాలలో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రాణిపేట, కల్లకురిచ్చి, శివగంగై, అరియలూరు, తిరుచ్చి, తెన్కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దీంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలాఉండగా, చైన్నెలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని అధికారులు పెట్టారు. చైన్నె మెట్రో వాటర్ బోర్డు పరిశీలన మేరకు చైన్నెలో 10 లక్షల 27 వేల భవనాలు ఉన్నాయి. ఇందులో 6.80 లక్షల భవ నాలలో వర్షపు నీటి సేకరణకు ఏర్పాట్లు, నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 3.50 లక్షల ఇళ్లలోనూ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మరింతగా వానలు 21 జిల్లాలకు అలర్ట్ -
ప్రజలపై చిత్తశుద్ధి లేదా?
● డీఎంకే, అన్నాడీఎంకేలపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, చైన్నె : ప్రజల మీద డీఎంకే, అన్నాడీఎంకేలకు చిత్తశుద్ధి లేనట్టుందని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్మురుగన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉన్నా, నిందలు మాత్రం పోలీసులకేనా అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం అన్నాడీఎంకే కార్యాలయంపై జరిగిన దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గీయులు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వర్గీయుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై పన్నీరుసెల్వంకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సీబీసీఐడీ పరిధిలో ఉంది. ఈ పరిస్థితులలో సీబీసీఐడీ విచారణ ముందుకు సాగడం లేదని, కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం హైకోర్టులో పిటిషన్దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి వేల్మురుగన్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు. సీబీసీఐడీ విచారణ తీరు తెన్నులను వివరించారు. ఈ కేసు విషయంగా 114 ఆధారాలు సేకరించి సైదాపేట కోర్టులో సమర్పించినట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన రికార్డుల నకలు పిటిషనర్లకు అందజేశామన్నారు. ఈ కేసులో 300 మందిని నిందితులుగా పేర్కొన్నట్టు, ఇందులో వందమందికి పైగా ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ధర్మపురిలో బస్సును తగల బెట్టి విద్యార్థినులను గతంలో పొట్టన పెట్టుకున్న వారు జైలు నుంచి బయటకు రాగానే త్యాగులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రెండు పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రజల మీద చిత్తశుద్ధి లేనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే పోలీసులు విధుల్లో ఉంటారని, అయితే, నిందలు మాత్రం పోలీసులపైనే వేస్తుంటారని అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు -
గ్లాడియేటర్‌కు సీక్వెల్!
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాల్లో ప్రేక్షకులు గ్లాడియేటర్ చిత్రాన్ని మరచిపోలేదు. 2000 సంవత్సరంలో తెరపైకి వచ్చిన ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ కథా చిత్రం ఇది. గ్లాడియేటర్ చిత్రం అప్పట్లోనే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, మొత్తంగా కాస్టింగ్ డిజైనర్, ఉత్తమ విజువల్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మొదలగు ఐదు విభాగాలకు 73వ అకాడమీ అవార్డులను గెలుచుకుంది. కాగా 24 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా గ్లాడియేటర్ –2 రూపొందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన రెడ్లీ స్కాట్నే రెండవ భాగానికి దర్శకత్వం వహించారు. రోమన్ రాజ్యంపై దాడి చేసి విధ్వంసానికి కారణమైన వారిపై ఆ వంశ యువరాజు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రాన్ని స్కాట్ ప్రీ ప్రొడక్షన్స్, రెడ్ వాగన్ ఎంటర్టైన్మెంట్, పార్కిస్ మాక్ డోనైడ్ ఇమేజ్ నేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పాల్ వెస్కాల్, పెడ్రో పాస్కల్, జోసఫ్ క్వీన్, ప్రెడ్హ హెచింజర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గ్లాడియేటర్–2 చిత్రంలో వార్ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
ఆ టైంలో చాలా కష్టపడ్డా!
తమిళసినిమా: ప్రముఖ నటుడు కమలహాసన్ వారసురాలు శ్రుతిహాసన్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. అదేవిధంగా కథానాయకిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రుతిహాసన్ కథానాయకిగా లక్ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఆ చిత్రం ఆమె సినీ జీవితానికి ఎలాంటి లక్కూ ఇవ్వలేదు. ఆ తర్వాత తెలుగులో అనగనగా ఒక ధీరుడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం కూడా నిరాశనే కలిగించింది. ఆ తర్వాత మాతృభాష తమిళంలో 7ఆమ్ ఐరివు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత ధనుష్ సరసన 3 చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. అయితే అందులోని వై దిస్ కొలైవెరి డీ అనే పాట మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంతేకాకుండా ధనుష్ శ్రుతిహాసన్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత శ్రుతిహాసన్‌కు అవకాశాలు రాలేదట. దీని గురించి ఆమె ఇటీవల ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ 3 చిత్రం తర్వాత రెండేళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నానని, ఆ సమయంలో చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే అదే చిత్రం 10 తర్వాత రీ రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించిందని, ఆ విజయం ఏదో మొదట్లోనే సాధిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని శ్రుతి వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు తమిళ చిత్రాల్లో నటించడం ఇష్టమన్నారు.. ఇప్పుడు కూడా ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. అయితే శ్రుతిహాసన్ హిందీ, తమిళ భాషలో కంటే తెలుగులోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. -
చైన్నెలో కొత్త వంతెనలు
సాక్షి, చైన్నె: మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని బస్సు రూట్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. అలాగే, కొత్త వంతెనల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. శుక్రవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులతో సమావేశమయ్యారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బస్సు రవాణా, రోడ్లు, మార్గాలలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల మెరుగు పరిచే విధంగా ఈ సమావేశంలో చర్చించారు. కొత్త వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలపై దృష్టి పెట్టే విధంగా అధికారులతో చర్చించి సూచనలు చేశారు. మంత్రులు శేఖర్‌బాబు, చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ, ఎంపీలు దయానిధి మారన్, కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు తాయగం కవి, ఆర్డీ శేఖర్ వేలు, కరుణానిధి, ఎబినేజర్, ప్రభాకర్ రాజా, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. బస్సు మార్గాలలో మెరుగైన సదుపాయాలు అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష -
పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం!
● రాష్ట్ర మంత్రి నాజర్ తిరువళ్లూరు: ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే శ్రేయస్కరమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారాన్ని నిర్ధారించండి పేరుతో కార్యక్రమాన్ని 2022వ సంవత్సరంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులోభాగంగానే ప్రతి ఏడాది నవంబర్ రెండవ వారంలో బాలింతలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ కిట్‌ను అందజేసే కార్యక్రమాలను విసృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లో బాలింతలకు పోషకాహార కిట్‌ను అందజేసే కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై 2,926 మందికి కిట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ జన్మించిన శిశువుకు ఆరునెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని వ్యాఖ్యానించారు. మొదటి దశలో జిల్లాలోని బాలింతలకు 1,743 మందికి, రెండవ దశలో 2,926 మందికి పోషకాహార కిట్లను అందజేసినట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణస్వామి, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు.