చెన్నూర్‌ నుంచి గెలిస్తే మంత్రి పదవి..! | - | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌ నుంచి గెలిస్తే మంత్రి పదవి..!

Published Wed, Nov 1 2023 2:06 AM | Last Updated on Wed, Nov 1 2023 10:10 AM

- - Sakshi

ఆదిలాబాద్: చెన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా 8 మంది శాసన సభకు ఎన్నికయ్యారు. నాడు రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తింపు ఉండడంతో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కింది. చెన్‌న్రూ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన బోడ జనార్దన్‌, గడ్డం వినోద్‌ కార్మికశాఖ మంత్రులుగా, కోదాటి రాజమల్లు ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. అభివృద్ధిలో తమ మార్క్‌ను సొంతం చేసుకున్నారు.

కోదాటి రాజమల్లు
1962లో చెన్నూర్‌ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. 1962లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదాటి రాజమల్లు విజయం సాధించారు. 1962 నుంచి 1972 వరకు మూడు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన రాజమల్లు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన హయాంలోనే చెన్నూర్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మించారు.

బోడ జనార్దన్‌
బోడ జనార్దన్‌ అటవీశాఖలో పనిచేస్తున్న సమయంలోనే 1985లోనే తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. 1985 నుంచి 1999 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.

గడ్డం వినోద్‌
మాజీ ఎంపీ స్వర్గీయ గడ్డం వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్‌ 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిఽగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి బోడ జనార్దన్‌పై విజయం సాధించారు. తెలుగుదేశం కంచుకోటలో పాగా వేసిన వినోద్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన హయాంలో చెన్నూర్‌ మండలంలోని కిష్టంపేటలో 133 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి కృషి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement