7న దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం
● కొత్తపెంట స్వామీజీ ఆశ్రమంలో భారీగా ఏర్పాట్లు
దేవరాపల్లి : శ్రీ సద్గురు దేవానంద సరస్వతీ స్వామీజీ మహరాజ్ (రుషీకేష్) 25వ ఆరాధన మహోత్సవాలను కొత్తపెంటలోని స్వామీజీ ఆశ్రమంలో ఈ నెల 7న అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు(నీలిమ) తెలిపారు. దేవానంద స్వామీ ఆధ్యాత్మిక జీవన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. స్వామీజీ 25 ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని భారీగా భక్తజనం హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెల 5 నుండి పూజులు, భజన కార్యక్రమాలను ప్రారంభించి ఆఖరి రోజు 7న ముగస్తాయన్నారు. ఈ ఆరాధన మహోత్సవానికి దేశ వ్యాప్తంగా స్వామీజీ భక్తులు, శిష్యులు, సాధు సత్‌పురుష్‌లు అధిక సంఖ్యలో తరలివస్తారన్నారు. ఆరాధన మహోత్సవాలకు పలు ఆశ్రమాల పీఠాధిపతులు హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తారన్నారు. ఆఖరి రోజు 7న స్వామీజికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, భగవద్గీత పారాయణం, మహాత్ముల ప్రవచనాలు, భారీ అన్నసమారాధన ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment