Andhra Pradesh: Impressive Political Banner In Tanuku - Sakshi
Sakshi News home page

అటు పెత్తందార్ల నాయకుడు.. ఇటు పేదల రక్షకుడు!

Published Mon, May 29 2023 4:39 AM | Last Updated on Mon, May 29 2023 5:49 PM

Impressive Political flexi in Tanuku Andhra Pradesh - Sakshi

తణుకు అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా తణు­కు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నా­యి.  పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ­లో ఒకవైపు చంద్రబాబు, లోకేశ్‌ పల్లకీలో కూర్చుని ఉంటే.. ఎల్లో మీడియా యాజమాన్యాలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తదితరులు దానిని మోస్తున్నట్టు ఉంది.


మరికొందరు వారి పక్కనే నిలబడి పేదల పైకి రాళ్లు విసురుతున్నట్టుగా ఉంది. ఇదే పోస్టర్‌లో రెండో వైపు పేదలుంటే.. వారికి అండగా బాహుబలి ఆకారంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. పెత్తందార్లు విసురుతున్న రాళ్లు పేదలకు తగలకుండా జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుగా నిలిచారు. జగన్, పేదలు ఉండే భూమి పచ్చగా ఉండగా.. పెత్తందార్లు ఉండే భూమి మాత్రం బీడువారిపోయి ఉంది. ఈ ఫ్లెక్సీలను ప్రయాణికులు ఆగి మరీ చూసి వెళ్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement