ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్‌మాక్స్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సంయుక్త సంస్థ భారతదేశంలోని ఆరు పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్‌లను అమర్చింది. తాజాగా రెండు కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌లతో 2.07 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
ఇండియాలో యాపిల్ తన కార్పొరేట్ కార్యకలాపాలను పెంపొందించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కలిగిస్తూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని క్లీన్‌మాక్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment