సారా ఊట ధ్వంసం
నగరి మండలం మాంగాడు దళితవాడలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి పెద్దఎత్తున సారా ఊటను ధ్వంసం చేశారు.
పక్క రాష్ట్రాలకు రవాణా..
ప్రతి నెల 1వ తేదీ నుంచి 17 వరకు చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యాన్ని 83 శాతం మంది తీసుకుంటున్నారు. అయితే ఈ బియ్యం పంపిణీలో గోల్‌మాల్ చోటు చేసుకుంటోంది. కొంతమంది డీలర్లు గోనెసంచెలతో సరుకులు తూకం వేస్తూ కార్డుదారులకు కోతలు పెడుతున్నారు. షాపుల్లో టన్నుల సరుకును అక్రమంగా నిల్వ చేసుకుని భారీగా అమ్మకాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కార్డుదారులకు సరుకులు ఇచ్చినట్టే ఇచ్చి షాపు వద్దే కేజీ ధర రూ.8 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది నేరుగా మార్కెట్‌లోకి వెళ్లి కేజీ రూ.12 వరకు అమ్ముకుంటున్నారు. మరికొందరు అక్రమ వ్యాపారులు ఊరూరా తిరిగి రేషన్ బియ్యాన్ని టన్నుల కొద్దీ సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోంది. చిత్తూరు, పలమనేరు, నగరి, జీడీనెల్లూరు, యాదమరి, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, పాలసముద్రం, బంగారుపాళ్యం, పుంగనూరు, చౌడేపల్లి, గుడిపాల వీ.కోట, కుప్పం, శాంతిపురం తదితర మండలాల నుంచి భారీ మొత్తంలో బియ్యం తరలిపోతోంది. అలా వెళ్లిన బియ్యం వారికి లక్షలాది రూపాయలు తెచ్చిపెడుతోందని అక్రమ వ్యాపారులు బహిరంగానే చెబుతున్నారు.
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment