కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది
కరీంనగర్: కేసీఆర్‌కు పట్టిన గతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి నియంత పోకడలు మానుకోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకోవద్దన్నారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, నియంత పోకడలకు పోకుండా తక్షణమే వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
Comments
Please login to add a commentAdd a comment